Jump to content

polavaram


Recommended Posts

రుణవరం
 
  • పోలవరానికి 1981 కోట్ల నాబార్డు రుణం 
  • నేడు ఢిల్లీలో బాబు సమక్షంలో పీపీఏకు ఇవ్వనున్న ఉమాభారతి 
  • 30న జరిగే కాంక్రీట్‌ పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్న సీఎం 
  • తొలి వారంలో వస్తానంటే పనుల తేదీ మార్చే అవకాశం 
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుంచి రుణంగా అందిన తొలివిడత నిధులు రూ.1981.54 కోట్లను కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అందజేయనున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగే కార్యక్రమంలో పోలవరంతో పాటు పలు రాష్ట్రాల్లో కేంద్ర సహకారంతో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వనున్నారు. సాగునీటి పథకాలకు పెద్దఎత్తున నిధులు అందజేస్తున్న నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనికి హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉమాభారతి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు బయల్దేరతారు. కార్యక్రమం అనంతరం సాయంత్రానికి తిరుపతి చేరుకుంటారు. మరోవైపు నాబార్డు రుణ వితరణను సమన్వయం చేసేందుకు రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్రం నాబార్డు నుంచి తీసుకునే రుణంలో తొలి విడత నిధులు అందజేస్తున్నదుకు ఉమాభారతికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదే సమయంలో 2016 అంచనాల మేరకు ప్రాజెక్టు అంచనావ్యయం రూ.40,450 కోట్లకు పెరిగిందని, ఇప్పటికే ఈ అంశం పీపీఏ పరిశీలనలో ఉన్నందున.. త్వరితగతిన అంచనాలు ఖరారు చేయాల్సిందిగా పీపీఏను ఆదేశించాలని కోరతారు. ఈ నెల 30న పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను ప్రారంభిస్తున్నామని, దీనికి హాజరు కావాలని ఉమాభారతిని బాబు ఆహ్వానించనున్నారు. ఆ రోజు ఆమెకు ఇతర కార్యక్రమాలు లేకపోతే వస్తారని, లేదంటే జనవరి మొదటివారంలో వస్తానని ఆమె చెబితే మాత్రం.. కాంక్రీట్‌ పనుల ప్రారంభ తేదీని మార్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముంది.
Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply

for approving/clearing procedures rather than letting them pile up on her desk or asking for more information like all other central funded projects

Instead of releasing funds upfront (That's the norm for any national project), she delayed payments for 2 years despite submitting bills and making repeated appeals for the timely release. She failed in fulfilling her responsibilities as a Minister and we honour her for that at the cost of delaying project?
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


Instead of releasing funds upfront (That's the norm for any national project), she delayed payments for 2 years despite submitting bills and making repeated appeals for the timely release. She failed in fulfilling her responsibilities as a Minister
Link to comment
Share on other sites

Instead of releasing funds upfront (That's the norm for any national project), she delayed payments for 2 years despite submitting bills and making repeated appeals for the timely release. She failed in fulfilling her responsibilities as a Minister and we honour her for that at the cost of delaying project?

 

 

Still manaku vere option ledhu.

Link to comment
Share on other sites

Instead of releasing funds upfront (That's the norm for any national project), she delayed payments for 2 years despite submitting bills and making repeated appeals for the timely release. She failed in fulfilling her responsibilities as a Minister and we honour her for that at the cost of delaying project?

 

true. I am comparing this with the progress (non-progress) on AIIMS and denotification of forest land in the same period. Let's not even go to center funding the budgest deficit of 2014-2015 issue. She is defnitely not as fast as we want (or morally she should). But I think she would have done a better job if not for the two gujju politicians pinning her wings.

Link to comment
Share on other sites

పోలవరానికి నాబార్డు తొలిదశ రుణం

26brk105b.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు తొలి దశ రుణాన్ని అందజేసింది. దిల్లీలోని ఇండియా హాబిటేట్‌ సెంటర్‌లో జరిగిన నాబార్డు సమావేశంలో ఈ నిధులకు సంబంధించిన రూ.1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఏపీ సీఎం చంద్రబాబు అందుకున్నారు. నాబార్డు, నీటిపారుదల మంత్రిత్వశాఖల సంయుక్త సమావేశం సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భరిస్తామని ప్రకటించిన మొత్తంలో నాబార్డు తొలి దశకింద రూ.1981 కోట్ల మొత్తం చెక్కును చంద్రబాబుకు సోమవారం అందజేశారు.

రికార్డు సమయంలో పూర్తిచేస్తాం: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు దేశంలో పెద్ద ప్రాజెక్టుగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2018 నాటికి మేజర్‌ డ్యాం పూర్తిచేయనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 11సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించాననీ, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షిస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నిధులుఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. నదుల అనుసంధానం కోసం వాజ్‌పేయీ హయాంలో టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటుచేశారన్నారు. అయితే దాన్ని యూపీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వచ్చిందన్నారు. వ్యవసాయరంగంలో బీమాపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారన్నారు. 2018 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి ప్రపంచంలోనే అతిత్వరగా పెద్దప్రాజెక్టు పూర్తిచేసిన రికార్డును సొంతం చేసుకుంటామన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవును అధిగమించొచ్చని చెప్పారు.

ఈ సమావేశంలో తొలుత నాబార్డు ఛైర్మన్‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నాబార్డు ద్వారా తొలిదశ కింద నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తొలి దశ కింద రూ.1981 కోట్లు చెక్కును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నిధుల విడుదలతో పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తవుతాయని చెప్పారు.

పోలవరంపై ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం..:జైట్లీ

ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికావాలంటే నిధులు అవసరమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తిచేసేందుకు నాబార్డు ద్వారా నిధులు ఇచ్చినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందన్నారు. ఏపీ అభివృద్ధికి అన్నిరకాలా సాయం అందిస్తున్నామన్నారు.

పోలవరంపై ప్రత్యేక దృష్టి: ఉమాభారతి

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి అన్నారు. సీఎం ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన బృందంతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. పోలవరం నిధుల సాధన విషయంలో సుజనా చౌదరి ఎంతో చొరవ చూపారన్నారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా 80లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా ఉందన్నారు.

పోలవరంపై ఎప్పట్నుంచో కలగంటున్నాం: వెంకయ్య

గతంలో యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా మర్చిపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుఅన్నారు. కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశంలో నల్లధనం, పోలవరంపై చర్చించామన్నారు. ఆర్డినెన్స్‌ ద్వారా తెలంగాణలో 7 మండలాలను ఏపీలో విలీనం చేశామన్నారు. ఈ ప్రాజెక్టుగురించి ఎప్పటినుంచో కలగంటున్నామన్నారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, దీన్ని 1982లో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని వెంకయ్య గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

రూ.1981 కోట్ల చెక్కును బాబుకు అందజేసిన ఉమాభారతి
 
636183616281872830.jpg
న్యూడిల్లీ : పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో ముందడుగు పడింది. నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసింది. మొదటి విడతగా నాబార్డు రుణం విడుదల చేసింది. రూ.1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఇదో మైలు రాయి. ఈ నెల 30 నుంచి పోలవరం కాంక్రీట్ పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అత్యంత ప్రధానమైన స్పిల్ వే, డయా ఫ్రం వాల్ నిర్మాణం డిజైన్లకు కేంద్ర జలసంఘం అనుమతులు లభించాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య, సుజనాచౌదరి, ఏపీ మంత్రి దేవినేని ఉమ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజనలో భాగమైన దీర్ఘకాలిక నీటిపారుదల నిధి (ఎల్‌టీఐఎఫ్‌)కి కేంద్రం రూ.1981.54 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి, రూ.463 కోట్లు గుజరాత్‌కు, రూ.830 కోట్లు మహారాష్ట్రలోని నీటిపారుదల ప్రాజెక్టులకు మొత్తం రూ.3274.54 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.2480.91 కోట్ల చెక్కును అందజేశారు.

Link to comment
Share on other sites

ప్రపంచ రికార్డు వేగంతో నిర్మిస్తాం
 
636183972934281045.jpg
  • జనం కల నిజం చేస్తాం
  • నాబార్డు ఇంత భారీగా నిధులివ్వడం ఎన్నడూ లేదు
  • చిన్న ప్రాజెక్టులకే ఇచ్చేది.. పోలవరం పూర్తైతే కరువుండదు
  • సీమకు సమృద్ధిగా నీరు.. దేశంలో ఇలాంటి పథకం మళ్లీ రాదు
  • 2018కల్లా కాల్వలకు నీరు.. 2019నాటికి ప్రాజెక్టు పూర్తి
  • వెంకయ్య మా బృందంలో భాగం.. ఆయన చొరవ అమోఘం
  • మోదీ, జైట్లీ, ఉమకు కృతజ్ఞతలు: చంద్రబాబు
  • మళ్లీ ఇంతటి భారీ ప్రాజెక్టు రాదు : సీఎం
న్యూఢిల్లీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ రికార్డుగా పరిగణించేంత వేగంతో పోలవరాన్ని నిర్మించి.. ప్రజల కల నిజం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి చేతుల మీదుగా పోలవరానికి నాబార్డు తొలివిడత రుణం రూ.1981 కోట్ల చెక్కును సోమవారం ఆయన ఢిల్లీలో అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జైట్లీ, ఉమచ వెంకయ్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనేదే ఉండదని, రాయలసీమకు కూడా సమృద్ధిగా నీళ్లు లభిస్తాయన్నారు. ‘ఆంధ్రప్రదేశ ప్రజల ఆకాంక్ష. స్వాతంత్ర్యానికి పూర్వం 1940ల్లోనే ఈ ప్రాజెక్టు గురించి చర్చించుకునేవారు. విభజన చట్టంలోనే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గత ప్రభుత్వం పేర్కొంది.మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రకు బదిలీ చేస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే భరోసా ప్రజలకు కలిగింది. ఇప్పుడు నాబార్డు ద్వారా నిధుల విడుదల జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. గతంలో తొమ్మిదేళ్లపాటు సీఎంగా పనిచేశాను. నాబార్డు నుంచి ఇంత మొత్తంలో నిధులు ఎన్నడూ విడుదల కాలేదు. చిన్న చిన్న పనులకు మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులివ్వడం సంతోషదాయకం. సాగునీటి సదుపాయాలు, కరువు నివారణకు మోదీ చర్యలు తీసుకుంటున్నారు’ అని ప్రశంసించారు. పోలవరంతో 15.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, మరో 24 లక్షల ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, 540 గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందుతాయని, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని, మత్స్య రంగానికి, పర్యాటకాభివృద్ధికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు.
ఆ రాష్ట్రాలను సంతృప్తిపరుస్తాం. ఛత్తీస్ గఢ్, ఒడిసా అభ్యంతరాలను కూడా సామరస్యంగా పరిష్కరిస్తామని, ఆ రాషా్ట్రలనూ సంతృప్తిపరుస్తామని చంద్రబాబు చెప్పారు. వాటికి అన్యాయం చేయబోమని కేంద్రం కూడా తెలిపిందన్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆయా రాషా్ట్రలు కూడా సహకరించాలన్నారు. పోలవరం ఎత్తును పెంచలేదని, పాత ప్రతిపాదనల ప్రకారమే యథాతథంగా నిర్మిస్తున్నామన్నారు. జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ) అనుమతులు పోలవరానికి అవసరం లేదని, అయితే రాషా్ట్రనికి చెందిన కొందరు పెద్దమనుషులే దీన్ని అడ్డుకునేందుకు చాలా పనులు చేస్తున్నారని విమర్శించారు.

వృథా నీటిని దక్షిణాది రాష్ట్రాలు వాడుకోవాలి..

ఏటా 3 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతోందని, దీనిని మొత్తం వాడుకుంటే దక్షిణ భారతంసస్యశ్యామలమవుతుందని సీఎం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని, ఆంధ్రప్రదేశతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కూడా ఎంతగానో లబ్ధి పొందుతాయని తెలిపారు. ఆయా రాషా్ట్రల్లో ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. తెలంగాణ, ఇతర రాషా్ట్రలతో గొడవలు ఉన్నప్పటికీ కలసి పనిచేస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇలాగే పనిచేస్తామని చెప్పారు.
వెంకయ్య మా బృందంలో భాగం
వెంకయ్యనాయుడు తమ బృందంలో భాగమని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆయన బాధ్యత తీసుకుంటున్నారని, ఆయా సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు.
ఈ జట్టును మార్చొద్దు!
ప్రస్తుతం కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ, నాబార్డు తదితర సంస్థలన్నీ సహకరిస్తుండడంతో పోలవరం పనులు శర వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఆయా శాఖలు, సంస్థల్లో ఉన్న అధికారులందరికీ పోలవరం నిర్మాణ ఆవశ్యకత, ప్రాధాన్యం తెలిశాయని, అందుకే వారు వేగంగా పనులు జరిగేలా చూస్తున్నారని, ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకూ వీరిని మార్చవద్దని కోరారు. అధికారుల సహకారం, కేంద్రంలోని వివిధ శాఖల సహకారం, కొన్ని స్వతంత్ర సంస్థల సహకారం చాలా బాగుందని చెప్పారు. ఆయా అధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అందరికీ కేక్‌ తినిపించిన బాబు..
పోలవరానికి భారీగా నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ఉమాభారతి, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, రాష్ట్ర జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులకు కేక్‌ తినిపించారు.

  • నిధులు నిరాటంకంగా ఇవ్వాలి 
‘2018 డిసెంబరు నాటికి ప్రాజెక్టులో నీరు నిలిపి, గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాల్వలకు మళ్లించాలని, 2019 వర్షాకాలం నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించాం. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. అత్యంత వేగంగా పనులు చేస్తున్నాం. ఈనెల 30వ తేదీన కాంక్రీటు పనులు ప్రారంభం అవుతాయి. జనవరి మొదటి వారంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు, సంక్రాంతి నాటికి గేట్ల నిర్మాణ పనులు మొదలవుతాయి. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య, ఉమాభారతి, సహాయ మంత్రుల్ని కూడా ఆహ్వానించాం. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును ముగించేందుకు అన్ని సంస్థలనూ సన్నద్ధం చేశాం. అందుచేత ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కూడా నిరాటంకంగా ఇవ్వాలి’ అని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా నిర్మాణం జరుగుతోందని, ఇదే వేగంతో ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే రికార్డు అవుతుందన్నారు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును ఇంత తక్కువ సమయంలో ఎవరూ నిర్మించలేరని చెప్పారు. అందుకే నాబార్డు రుణాన్ని అందుకున్న ఈ రోజు తన జీవితంలోనే అత్యంత ఆనందదాయకమైన రోజన్నారు. తాను జీవితంలో ఎన్నో విజయాలు సాధించానని, అయితే పోలవరం కల నిజమైనప్పుడు వచ్చే ఆనందం ముందు అవేమీ సరిపోవని చెప్పారు. ఇలాంటి భారీ ప్రాజెక్టు ఇకముందు మన దేశంలో నిర్మాణం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీని నిర్మాణాన్ని చూసి తరించాలని ఢిల్లీలోని విలేకరులు, అధికారులను ఆహ్వానించారు.
Link to comment
Share on other sites

పోలవరానికి నిధుల వరద
 
636183971713248641.jpg
  • నాబార్డు నుంచి రూ.1981.54 కోట్లు
  • బాబు చేతికి చెక్కు ఇచ్చిన జైట్లీ, ఉమ
  • మార్చి ఆఖరుకు మరో వెయ్యి కోట్లు
  • వెంకయ్య సమక్షంలో ఢిల్లీ సాయం
  • పోలవరం నిధులకు ఢోకా ఉండదు
  • నవ్యాంధ్రులకు ఆందోళన అక్కర్లేదు
  • చట్టంలో ఉన్నవీ, లేనివీ ఇస్తున్నాం: జైట్లీ
  • సీఎం చంద్రబాబు నాకు మార్గదర్శి
  • ఈ ప్రాజెక్టు దేశానికే గర్వకారణం
  • 2018కి పూర్తి చేస్తాం: ఉమాభారతి
  • బాబుపై కేంద్ర మంత్రుల ప్రశంసలు

గలగలా గోదారి పోలవరం వడ్డాణం సింగారించుకోనుంది. నేల తల్లిని తడిపేందుకు నీటి సిరులు హోరెత్తనున్నాయి. పైరు పచ్చలు తొడిగి చేలు కళకళలాడనునన్నాయి. నవ్యాంధ్రకు జీవనాడి, దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇది మరో మైలురాయి! ప్రాజెక్టు పనులను పరుగులు తీయించే ఇం‘ధన’ ప్రవాహం మొదలైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ, ప్యాకేజీలో భాగమైన ఒక భరోసా వాస్తవ రూపం దాల్చింది. పోలవరం నిర్మాణ వ్యయం మాదే అని ప్రకటించిన కేంద్రం... తొలి విడతగా రూ.1981.54 కోట్ల చెక్కును రాష్ట్రానికి అందించింది.
 
న్యూఢిల్లీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు జీవనాడి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు నిధుల వరద మొదలైంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఇచ్చిన మాట ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయంలో తొలివిడతగా రూ.1981.54 కోట్ల నాబార్డు చెక్కును కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుల సమక్షంలో... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ చెక్కు అందజేశారు. విభజన హామీల్లో భాగంగా పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం మొత్తం తామే భరిస్తామని నవ్యాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీలో కేంద్రం తెలిపింది. ఖర్చును జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ద్వారా ఇస్తామని కూడా భరోసా ఇచ్చింది. ఇప్పుడు... కేంద్రం నుంచి నిధుల ప్రవాహం మొదలైంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత 3133.75కోట్లు ఖర్చు చేయగా... ఇందులో కేంద్రం ఇప్పటికే రూ.935కోట్లను తిరిగి చెల్లించింది. నాబార్డు ద్వారా ప్రస్తుతం రూ.1981.54 కోట్లను చెల్లించగా... మరో రూ.1000కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2017మార్చి 31లోపు) అందజేయనున్నారు.
 
నిధులకు ఢోకా లేదు: జైట్లీ
పోలవరం నిధులకు ఎలాంటి ఢోకా ఉండదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఇక నవ్యాంధ్రులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. చట్టంలో ఉన్నవే కాకుండా లేనివీ చేస్తున్నామని జైట్లీ పేర్కొన్నారు.
 
దేశానికే గర్వకారణం: ఉమా భారతి
పోలవరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ‘‘పోలవరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాం. 2018 నాటికే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని... పోలవరం ప్రాజెక్టు ద్వారా తమ కల మరింత త్వరితగతిన సాకారం కాబోతుందని అన్నారు. ‘‘నేను మధ్యప్రదేశ్‌ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు, మోదీలే మార్గదర్శకులు. అనుకున్నది సాధించేదాకా చంద్రబాబు నిద్రపోరు. అభివృద్ధి కోసమే జన్మించారా అన్నట్లుగా కష్టపడతారు’’ అని ప్రశంసించారు. చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో నదుల అనుసంధానంచేపట్టారని... అది అందరికీ ఆదర్శనీయమని అన్నారు.
 
1concrete.jpg
Link to comment
Share on other sites


  • కేంద్ర మంత్రుల అభినందన
  • ప్రత్యేకంగా కొనియాడిన చంద్రబాబు
న్యూఢిల్లీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలవరానికి నాబార్డు రుణాన్ని రాష్ట్రప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిని కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు, ఉమాభారతి అభినందించారు. సుజనా కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడారు. ఆంధ్రప్రదేశ తరపున కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖలు, ఇతర విభాగాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారని ప్రశంసించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ.. సుజనా తనను వదిలిపెట్టలేదని, నిధులు ఇవ్వాలని పదేపదే కలసి చర్చించేవారని చెప్పారు.

 

తాను ఎప్పుడు ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్తున్నానో తెలుసుకుని.. సరిగ్గా ఆ సమయానికల్లా జైట్లీ వద్ద సుజనా చౌదరి ప్రత్యక్షమయ్యేవారు’ అని ఉమాభారతి నవ్వుతూ వ్యాఖ్యానించారు. సుజనాను, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమను వెంకయ్య అభినందించారు. చిన్నవాడైనా ఉమ పోలవరంపై ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, తన సీఎం లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. కేంద్రంలో ఒక ఉమా, రాష్ట్రంలో మరో ఉమా ఉన్నారని చమత్కరించారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

plssss ans this...ipoudu anduke thread lo ki vacha... Ycp batch appude pic kuda chesaru...

 

ah MF ki inko pani em vundhi ...

its clearly said by central ah amount ento ani ...check ki public ga chupinchi nokesthara ...nijam mana daridram ah kula picha mandha mana state lo vundatam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...