Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
ఓడరేవు.. ప్రగతికి ఆదరువు
 

నేడు పోర్టు పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
కృష్ణా విశ్వవిద్యాలయ భవనాల ప్రారంభోత్సవం
సర్వం సిద్ధం చేసిన  అధికార యంత్రాంగం
50 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు

kri-top1a_64.jpg

గొడుగుపేట (మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన బందరు పోర్టు పనులు, కృష్ణా విశ్వవిద్యాలయ నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పండగ వాతావరణం నెలకొంది. గురువారం పోర్టు పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు  చేశారు. మేకావానిపాలెంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ ప్రాంతంలో వేదిక వద్ద దాదాపు 50 వేల మంది కూర్చొనేలా కుర్చీలు సిద్ధం చేశారు. వీఐపీలకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నందున వారికోసం జిల్లాలో 600కు పైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రితో పాటు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు వేదికతో పాటు బీచ్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీచ్‌ పనుల ప్రారంభోత్సవ దినం మచిలీపట్నం చరిత్రలో మరచిపోలేని పండగ రోజు అన్నారు. పట్టిసీమను పట్టుదలతో పూర్తిచేసిన ముఖ్యమంత్రి అదే పట్టుదలతో బందరు పోర్టును నిర్మించనున్నారని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌ బూరగడ్డ రమేష్‌నాయుడు, ఏఎంసీ ఛైర్మన్‌ చిలంకుర్తి తాతయ్య, గొర్రెపాటి గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం  పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతే ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మొత్తం రూ.157 కోట్ల అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆరు వేలమంది విద్యార్థులు మూడు రంగుల బెలూన్లతో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారని చెప్పారు. అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.

2,046 మందితో పటిష్ఠ బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు 2,046 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఆయన సూచనలు చేశారు. వీఐపీలు ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మచిలీపట్నం నుంచి సబాస్థలి వద్దకు వెళ్లేవారు మేకావానిపాలెం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో వాహనాలు నిలుపుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు పోతేపల్లి మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. కాకర్లమూడి, పెడన మీదుగా వచ్చే వాహనాలను డాబాల సెంటరు పార్కింగ్‌లో వాహనాలు నిలపాలన్నారు. జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసులను కూడా బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు ఏఎస్సీలు, 17మంది డీఎస్సీలు, 26 మంది సీఐ, ఆర్‌ఐలు, 94 మంది ఎస్సై, ఆర్‌ఎస్సైలు, 232 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 998 మబంది కానిస్టేబుళ్లు, 139 మంది మహిళా కానిస్టేబుళ్లు 139, 387 మంది హోంగార్డులు, 150 మంది మహిళా హోంగార్డులు కలిపి మొత్తం 2,046 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సీఎం పర్యటన ఇలా..
* మధ్నాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరతారు.
* 2.30 గం.కు మంగినపూడి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
* 2.30-2.45 గం.ల మధ్య పోర్టు పనులు  ప్రారంభిస్తారు.
* 2.45 గం.కు మంగినపూడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.55 గం.కు పోతేపల్లి హెలీప్యాడ్‌కు  చేరుకుంటారు
* 3.00 గం.నుంచి 4 గం.మధ్య పైలాన్‌ ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కృష్ణా విశ్వవిద్యాలయ భవనాలు ప్రారంభిస్తారు.
* 4.00 గం.కు పోతేపల్లి హెలీప్యాడ్‌నుంచి బయలుదేరి 4.30 గంటలకు సెక్రటరియేట్‌కు చేరుకుంటారు.

Link to comment
Share on other sites

పోర్టు గ్రామాల రైతులకు సముచిత గౌరవం కల్పిస్తాం
 

kri-gen10a_34.jpgకలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: పోర్టు నిర్మాణం కోసం సహకరించిన పోర్టు ప్రతిపాదిత గ్రామాల రైతులకు సముచిత గౌరవం కల్పిస్తామని ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ అన్నారు. ముడ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణం ద్వారా మచిలీపట్నానికి పూర్వవైభవం వస్తుందన్నారు. మచిలీపట్నం, పరిసరప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ముడను ఏర్పాటు చేసి పోర్టు, అనుబంధ పరిశ్రమలకు అవసరమైన భూములు సమకూర్చుకునే బాధ్యత ముడకు అప్పగించారన్నారు. భూములు ఇచ్చేందుకు సహృదయంతో స్పందించిన రైతులకు అభినందనలు తెలియజేేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలన్న విషయాన్ని ముఖ్యమంత్రికి తెలిపామన్నారు. పోర్టు కోసం ఉద్యమించిన, సహకరించిన అందరి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోర్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం మచిలీపట్నం చరిత్రలో సువర్ణాధ్యాయం కానుందన్నారు.

Link to comment
Share on other sites

Navayuga never missed time lines....18 months is target :pepper:

The best what we are hearing is HITACHI will set up logistics park at Badar port for Agri/Food exports to Japan,Korea 

This is 4th PORT by Chandrababu in Andhra Pradesh after Krishnapatnam,Gangavaram,kakinanda...

Bhavanapadu will be 5th

 

 

 

Link to comment
Share on other sites

2 hours ago, Bollu said:

inka major/minor port lenidi only guntur & vijayanagaram district kena? west godavari ki unda?

guntur prakasam border lo vodarevu(near chirala) ki chance vundhi. 

west godavari lo narsapur lo plan vundhi . it may not be realized as there may not be enough traffic.

Link to comment
Share on other sites

Thus Krishnapatnam Port Company Ltd. (KPCL) was formed by winning the mandate from the Govt. of Andhra Pradesh to develop the existing minor port into modern, deep water & high Productivity port, on BOST (Build–Operate-Share-Transfer) concession basis for 50 years.

Navayuga Engineering Company Limited bagged the project to develop port on Build-Own-Operate-Transfer basis on a 50-year basis.
----

4 years ki okkati permission ichina inka 4 ports kattesevallu easy ga, last 15 years nundi okka port work kooda start ainattu kana ravatam ledu. poni antha cost ante max 5k crores plus avi kooda land acquisition ne. 10 yers back ante 3k crores. govt loan tesukoni katti padesi undalsindi epatiki ports anni.

Link to comment
Share on other sites

సౌభాగ్యానికి వాకిలి

 

ఓడరేవు పూర్తైతే బందరుకు పూర్వవైభవం
రెండేళ్లలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం
తొలిదశలో 40 లక్షల కార్గో సామర్థ్యంతో నిర్మాణం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ఈనాడు - విజయవాడ

7ap-main2a_4.jpg

రాష్ట్ర సౌభాగ్యానికి ముఖద్వారంగా మచిలీపట్నం ఓడరేవు మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓడరేవు పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. మచిలీపట్నం దశ, దిశ తిరగరాసే రోజు ఇదేనని అన్నారు. ఒకప్పుడు అత్యంత సౌభాగ్యంతో వెలుగొందిన ఈ ప్రాంతం తన ప్రాభవాన్ని కోల్పోయిందని, ఈ ప్రాంతవాసులు వలస వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. ఓడరేవు రాకతో మచిలీపట్నానికి పూర్వవైభవం రానుందని అన్నారు. పోర్టు కోసం ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు ఉద్యమించారని, వారి కలను సాకారం చేస్తానని వెల్లడించారు. ఓడరేవు రాకతో రైల్వేలైను, విమానాశ్రయం, పరిశ్రమలు తరలివస్తాయని చంద్రబాబు అన్నారు.   పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారుల చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. నౌకాశ్రయానికి ప్రధాన ప్రతిపక్షం ఎన్నో అడ్డంకులు సృష్టించిందని, న్యాయస్థానానికి వెళ్లి మరీ అడ్డుకున్నదని విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షం మనకు అవసరమా? అని ప్రజలను ప్రశ్నించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దీనికి శంకుస్థాపన చేయగలిగామని, నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నవయుగ సంస్థల అధినేత విశ్వేశ్వరరావు పోర్టు నిర్మాణానికి ముందుకురావడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం పనులకు శంకుస్థాపన చేసిన తానే మళ్లీ వచ్చి ఓడరేవును ప్రారంభిస్తానని చెప్పారు. దీని ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని, పోర్టు అనుబంధంగానూ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల మాదిరి ఓడరేవు కోసం భూములిచ్చినవారు కూడా లబ్ధి పొందుతారని తాను చెప్పగలనన్నారు. వైకాపా నాయకులు మళ్లీ వచ్చి అనేక రకాలుగా మభ్యపెడతారని, ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించేవారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. తొలి విడతలో భాగంగా పోర్టును 40 లక్షల కార్గో సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని, తర్వాత ఏటా లక్షన్నర సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు.

7ap-main2b_1.jpg

దిల్లీ వేదికగా 11న పోరాటం
రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై దిల్లీ వేదికపై ఈనెల 11న తాను పోరాడుతున్నానని, సంఘీభావంగా ప్రతి జిల్లా, మండలకేంద్రాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాలని చంద్రబాబు కోరారు. దిల్లీలో తాను ఒక్కరోజు దీక్ష చేపడతానని, తద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరోసారి అందరికీ తెలియజేస్తామని అన్నారు. ప్రతి వారం న్యాయస్థానానికి వెళ్లి వచ్చే వైకాపా నాయకులు తనను దూషించడం విడ్డూరమని ఎద్దేవాచేశారు. 95 లక్షల డ్వాక్రా కుటుంబాలకు రూ.20వేల చొప్పున, 55 లక్షల మందికి నెలనెలా పింఛన్లను పదిరెట్లు పెంచి ఇస్తుంటే ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని ఆరోపించారు. ఈ కుటుంబాలన్నీ కలిస్తే వచ్చే ఎన్నికల్లో వారికి డిపాజిట్లూ రావని అన్నారు. వీళ్లను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఆకాశం నుంచి ఊడిపడినట్టు మాట్లాడుతున్నారని, ఆయన ఎక్కడినుంచి వచ్చారో అందరికీ తెలుసంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి చూసి ఓటేయాలని, కోడికత్తి నాటకాల మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు.

రాజధానికి విరాళాల వెల్లువ
అమరావతి నిర్మాణానికి పెదపారుపూడికి చెందిన సూర్యదేవర శ్యాంసుందరరావు రూ.1.20 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. దీంతోపాటు తాను జీవితాంతం నెలకు రూ.పదివేల చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లాకు చెందిన హైమావతి రూ.లక్ష విరాళాన్ని ఇవ్వాలని అనుకున్నారు. వారం కిందట చనిపోయిన ఆమె కోరిక తీర్చేందుకు కుమారుడు సుభాష్‌చంద్రబోస్‌, మనవరాలు భారతి రూ.లక్ష చెక్కును చంద్రబాబుకు అందజేశారు. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ రూ.15 లక్షల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌ అనే మరోవ్యక్తి రూ.10 వేలు అందజేశారు. వీరిని ముఖ్యమంత్రి అభినందించారు.

 

 

 

Link to comment
Share on other sites

రూ.110 కోట్లు.. 11 అంతస్తులు

 

నేడు సీఎంచే ఏపీఐఐసీ భవనం ప్రారంభం

7ap-state1a_2.jpg

మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 8వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభిస్తారు. మంగళగిరి ఆటోనగర్‌లో 2.26 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల వ్యయంతో ఏపీఐఐసీ టవర్‌-1 నిర్మాణం పూర్తి చేశారు. 2.96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా దీనిని నిర్మించారు. 11 అంతస్తుల్లో నిర్మించిన భవనంలో రాష్ట్రంలోని పారిశ్రామిక విభాగాలన్నీ ఒకే చోట ఉండేలా ఏ

Link to comment
Share on other sites

పెట్టుబడుల గమ్యం.. మచిలీపట్నం
 

పోర్టు పనుల ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు
మచిలీపట్నం, న్యూస్‌టుడే

amr-top1a_77.jpg

‘శాతవాహనుల కాలం నుంచే వర్తక, వాణిజ్య కేంద్రంగా ఉన్న మచిలీపట్నంకు పూర్వ వైభవం తీసుకువస్తా.. జిల్లా కేంద్రమైనా అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. పోర్టు  ఏర్పాటు ద్వారా పెట్టుబడులకు గమ్యంగా మారనుంది. బందరును అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను..ప్రజలంతా  అండగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బందరు మండల పరిధిలోని మంగినపూడి వద్ద గురువారం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసినసభలో ఆయన మాట్లాడుతూ  ఎక్కడ చూసినా నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ముందుగా నాగరికత సంతరించుకుందని చెప్పారు. మచిలీపట్నానికి ప్రపంచస్థాయిలో ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. పోర్టు కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం తనకు తెలుసన్నారు. పోర్టుతో అనేక పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. ఇలాంటి పురోగతి పనులు జరుగుతునే ఉంటాయని, అందుకే బందరు మళ్లీ మళ్లీ వస్తానన్నారు. బందరుకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. పోర్టు వస్తే పట్నం ఎలా అభివృద్ధి చెందుతుందో తెలియజేసేందుకు  ఏర్పాటు చేసిన వీడియోను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ముడ ఛైర్మన్‌ వేదవ్యాస్‌, నవయుగ సంస్థ ఛైర్మన్‌ విశ్వేశ్వరరావుతో కలిసి వీక్షించారు. మేకావానిపాలెంలో పోర్టు పైలాన్‌ ఆవిష్కరించిన తరువాత బహిరంగసభలో మాట్లాడుతూ  చారిత్రక ప్రాధాన్యత ఉన్న బందరు పోర్టు కోసం ప్రజలు చేసిన పోరాటం, ప్రభుత్వ కృషి ఫలితంగానే జిల్లా ప్రజల చిరకాల వాంఛ సాకారం అవుతోందని చెప్పారు. పోర్టు కోసం ఉద్యమించిన వారికి, సహకరించిన రైతులకు అభినందనలు తెలిపారు. పోర్టుతో పాటు వివిధ పరిశ్రమలకు మచిలీపట్నం వేదిక కానుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు మచిలీపట్నం పోర్టు ఎంతో ఉపయుక్తం కానుందన్నారు. రాజధాని అమరావతితో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై  సంతృప్తితో ఉన్నారా అంటూ సభకు హాజరైన వారిని ప్రశ్నించి వారి చప్పట్ల ద్వారా స్పందన తెలుసుకున్నారు. సంపద సృష్టించడం ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. ప్రజల కోసమే తాను కష్టపడుతున్నానని, అందుకు ప్రతిగా  సంపూర్ణమద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో అవాస్తవ ప్రచారాలతో వచ్చే అభివృద్ధి నిరోధకులకు డిపాజిట్లు లేకుండా చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు స్థానిక శాసనసభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కలగా ఉన్న పోర్టు పనులను ప్రారంభించుకోవడం మచిలీపట్నం చరిత్రలో ఒక శుభదినం అని అన్నారు. పోర్టు కోసం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నామని, చివరకు ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు పనులు ప్రారంభించుకోగలిగామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోర్టును పొరుగు జిల్లాకు తరలించేలా చేసిన ప్రయత్నాన్ని దాదాపు 500 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తిరిగి సాధించుకోగలిగామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ పోర్టు విషయంలో కేవలం ఒక రాయి వేసి ప్రజల ఆశలపై నీళ్లుచల్లారన్నారు. తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పోర్టును కేవలం కాగితాలకే పరిమితం చేశారన్నారు. తెదేపా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని చెప్పారు.  ఇచ్చిన మాట ప్రకారం పోర్టు కలను సాకారం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రగతి అడుగులు పడుతుంటే వైకాపా నాయకులు అడుగడునా అవాంతరాలు కల్పించారంటూ విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లో ఏడాదిన్నర లోపు చంద్రబాబు చేతుల మీదగా పోర్టును ప్రారంభించుకోవడం తథ్యమన్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు ప్రసంగిస్తూ పోర్టు పనుల ప్రారంభోత్సవం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ విషయంలో మాట ఇచ్చిన ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారన్నారు. పనులను నవయుగ సంస్థ దక్కించుకోవడం కూడా శుభపరిణామని తెలిపారు. నవయుగ సంస్థ ఛైర్మన్‌ విశ్వేశ్వరరావు ఈ జిల్లావాసే కావడంతో ఆయన జిల్లా అభివృద్ధిపై మరింత చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ) ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతుల మీదగా పోర్టు పనులు ప్రారంభించుకోవడం ఒక చరిత్ర అన్నారు. పోర్టు నిర్మాణం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ముడను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. భూముల కొనుగోలు నిమిత్తం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూ.200 కోట్లు సర్దుబాటు చేశారన్నారు. కేవలం ఆయన పట్టుదలతో పట్టిసీమ ద్వారా రైతు ప్రయోజనాలను కాపాడారని చెప్పారు. తన మీద నమ్మకంతో ముడ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారన్నారు. పద్దెనిమిది నెలల వ్యవధిలో ఓడ వచ్చేలా బెర్త్‌ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. భావి తరాల భవిష్యత్‌కు భరోసా కల్పించేదుకు నేడు పునాది పడిందని తెలిపారు. భూములు ఇచ్చే విషయంలో సహకరించిన రైతుల ఉదారతను ప్రశంసించారు. డబ్బులు తీసుకోకుండానే భూముల ఇచ్చిన రైతుల పేర్లను ప్రస్తావిస్తూ వారికి అభినందనలు తెలిపారు. పోర్టు నిర్మాణం కోసం ఉద్యమాన్ని తొలుత ప్రారంభించిన నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్‌ (జెండా మాష్టారు)ను ముఖ్యమంత్రి చేతుల మీదగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా నాట్యప్రదర్శన ద్వారా ఆహ్వానం పలికిన చిట్టిపాలెంకు చెందిన విద్యార్థిని చండిక మేఘనశ్రీలక్ష్మిని ముఖ్యమంత్రి అభినందించారు.

ముఖ్యమంత్రికి పలువురి సన్మానం: పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. మంత్రి కొల్లు  గజమాలతో సత్కరించారు. కృష్ణా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య డా.ఉష, ప్రిన్సిపల్‌ సుందరకృష్ణ, పూర్వ రిజిస్ట్రార్‌ సూర్యచంద్రరావు, తదితరులు జ్ఞాపికతో సత్కరించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ బాబాప్రసాద్‌, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. పోలాటితిప్పకు చెందిన మాజీ సర్పంచి మోకా రాజు ఆధ్వర్యాన ముఖ్యమంత్రికి చేపలు బహూకరించారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, పెడన, పామర్రు ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, ఉప్పులేటి కల్పన, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, జడ్పీ అధ్యక్షురాలు గద్దె అనూరాధ, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, జేసీ-2 బాబూరావు, పార్టీ నాయకులు, మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, కాగిత వెంకటేశ్వరరావు, నారాయణప్రసాద్‌, బూరగడ్డ రమేష్‌నాయుడు, కొనకళ్ల జగన్నాథరావు, పరబ్రహ్మం, గోపు సత్యనారాయణ, కాశీవిశ్వనాథం, తాతయ్య, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పోర్టు నిర్మాణంతో.. పునర్వైభవం
08-02-2019 08:32:30
 
636852115509447475.jpg
  • రెండు సంవత్సరాల్లో పనులు పూర్తిచేస్తాం
  • బందరు పోర్టు పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
 
మచిలీపట్నం (ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో మచిలీపట్నం పోర్టు సౌభాగ్యానికి ముఖద్వారంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఒక వెలిగిన ఈ ప్రాంతం పునర్వైభవం సంతరించుకునే సమయం ఆసన్నమైందన్నారు. బందరు ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శ్రీకారం చుట్టారు. తొలుత తపశిపూడిలో పోర్టు పనులకు సంబంధించిన యంత్రాలను ప్రారంభించి, అనంతరం మచిలీపట్నం రూరల్‌ మండలంలోని మేకావారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ రాజధానికి దగ్గరగా ఉన్న ఈ పోర్టు అభివృద్ధికి మారుపేరుగా తయరవుతుందన్నారు. పోర్టు నిర్మాణం వల్ల రాబోయే రోజుల్లో మచిలీపట్నం దశ, దిశ తిరగబోతోందని చెప్పారు. అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ సౌకర్యాలతో మచిలీపట్నం పోర్టును నిర్మిస్తున్నామని చెప్పారు. బందరు పోర్టుకు ఎంతో ఘన చరిత్ర ఉందని, శాతవాహనుల కాలంలో బందరు పోర్టు నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగాయని చెప్పారు. కాలక్రమేణా ఇది ప్రాభవం కోల్పోవడంతో ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలసబాట పట్టారన్నారు. బందరు పోర్టు నిర్మాణం పూర్తయిన తరువాత ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
 
మాట నిలబెట్టుకున్నాం
బందరు పోర్టు కోసం ఎంతో మంది పోరాటలు చేశారన్నారు. వారు ఉద్యమం నిర్వహించినపుడే బందరు పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్నామన్నారు. పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయన్నారు. రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్నాటక, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలు కూడా ఈ పోర్టు నుంచే ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటాయని వెల్లడించారు. పోర్టు వల్ల అందరికీ ఆదాయం వస్తుందని చెప్పారు. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు ఎటువంటి వ్యాపారాలు పెట్టుకోవాలనేది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివిస్తే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
 
రెండేళ్లలో పోర్టును నిర్మిస్తాం
‘రెండు సంవత్సరాల్లో పోర్టును పూర్తి చేస్తాం. పోర్టు ప్రారంభోత్సవానికి కూడా నేనే వస్తాను..’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిష్ఠాత్మకమైన నవయుగ సంస్థ బందరు పోర్టును నిర్మిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒకే రోజు 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటును వేసి గిన్నిస్‌ రికార్డును ఈ సంస్థ సృష్టించిందని చెప్పారు. నవయుగ పోర్టు చైర్మన్‌ విశ్వేశ్వరరావు ఈ జిల్లాలోనే జన్మించారని, జన్మభూమికి ఏధైనా చేయాలనే తలంపుతో బందరు పోర్టును నిర్మించేందుకు ముందుకు వచ్చారన్నారు. నిర్ణీత సమయంలోపే ఈ సంస్థ పోర్టును పూర్తిచేసి, ఓడను బందరు తీసుకొస్తుందన్నారు. కృష్ణపట్నం పోర్టును వీరు 18 నెలల్లోనే నిర్మించారని, అదే తరహాలో బందరు పోర్టును కూడా పూర్తిచేసి, ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి దోహద పడనున్నారని సీఎం పేర్కొన్నారు.
 
ఎన్నో ఇబ్బందులు పడ్డాం
ఇది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాల కలను సీఎం చంద్రబాబు నిజం చేశారు. పోర్టు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇచ్చిన మాటకు కట్టుబడి అవాంతరాలను అధిగమించి పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు అన్ని రకాల అనుమతులను ఇప్పించారు. 24 గంటల్లోనే ముడాకు డబ్బులు అందజేసి, పోర్టు పనులు వేగవంతమయ్యేలా చేశారు. రెండు సంవత్సరాల్లో సీఎం బందరుకు ఓడను తీసుకొచ్చి ప్రారంభిస్తారు.
- కొల్లు రవీంద్ర, మంత్రి
 
చరిత్రను తిరగరాస్తున్నారు
బందరు పోర్టు గురించి చరిత్రలో విన్నాం. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆ చరిత్రను తిరగ రాస్తున్నారు. పట్టుదలతో పోర్టును నిర్మిస్తున్నారు. ముడా చైర్మన్‌గా వచ్చిన తర్వాత రైతులతో మాట్లాడి నాలుగైదు నెలల్లోనే భూమిని సేకరించి, అందజేశాం. 18 నెలల్లో పోర్టు పూర్తి చేసి, నౌకను ఇక్కడకు తీసుకొస్తాం. పోర్టు కోసం రైతులు ఎంతో సహకరించారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
- బూరగడ్డ వేదవ్యాస్‌, ముడా చైర్మన్‌
 
ఆదర్శ పట్టణంగా బందరు
బందరు పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు కృషే కారణం. భూముల కొనుగోలుకు డబ్బులు ఇచ్చారు. పోర్టు పూర్తైతే బందరుకు పూర్వ వైభవం వస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటమే కాకుండా, దేశంలోనే ఆదర్శ నగరంగా బందరు అభివృద్ధి చెందుతుంది. గతంలో పులిగడ్డ- పెనుమూడి వారధిని నిర్మించిన నవయుగ సంస్థే ఇప్పుడు బందరు పోర్టును నిర్మిస్తోంది. సమర్థవంతమైన ఆ సంస్థ అనతి కాలంలోనే బందరుకు ఓడను తీసుకు రాబోతోంది.
- కొనకళ్ల నారాయణ, ఎంపీ
 
 
 
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...