Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
ముందుంది మంచి కాలం 
పెడన మండలంలో లాజిస్టిక్‌ హబ్‌ 
కాకర్లమూడి  కెంద్రంగా ఏర్పాటుకు నిర్ణయం 
పోర్టు అనుబంధ  పరిశ్రమలతో కొత్తరూపు 
భూములను  పరిశీలిస్తున్న అధికారులు 
పెడన, న్యూస్‌టుడే 
kri-top2a.jpg

పెడనకు మంచికాలం రాబోతోంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా ఎగుమతులు, దిగుమతులకు అనువైన లాజిస్టిక్‌ హబ్‌ను పెడన మండలంలో ఏర్పాటు చేసేందుకు మచిలీపట్నం పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకు దాదాపు వెయ్యి ఎకరాలను రైతులనుంచి తీసుకొనేందుకు గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

బందరు పోర్టు వస్తే సరకుల ఎగుమతులు, దిగుమతులు ప్రధానంగా లాజిస్టిక్‌ హబ్‌ ద్వారా జరుగుతాయి. బందరు మండలం గిలకలదిండిలో పోర్టును నిర్మించటానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న దశలో లాజిస్టిక్‌కు అత్యంత ప్రాధాన్యముంటుంది. ఓడల ద్వారా వచ్చిన సామగ్రిని ముందుగా హబ్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతాయి. పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే సరకును కూడా ముందుగా హబ్‌కు తరలించి, అక్కడి నుంచి లారీల ద్వారా ఓడలకు చేరవేస్తారు. దీంతో లాజిస్టిక్‌ హబ్‌కు రైల్వే కనెక్టివిటీ కూడా తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బందరు మండలానికి సరిహద్దున ఉండే పెడన మండలం కాకర్లమూడి గ్రామాన్ని పోర్టు పరిధిలోకి గతంలోనే తీసుకొచ్చారు. తాజాగా కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ లాజిస్టిక్‌ హబ్‌ నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూములు అవసరం ఉంటుందని సంకేతాలు ఇవ్వడంతో ముడా అధికారులు అన్వేషణ చేపట్టారు. కాకర్లమూడితో పాటు మడక, బల్లిపర్రు బందరు మండలం బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం గ్రామాల్లో భూముల కోసం అన్వేషిస్తున్న ముడా అధికారులు భూములను సమీకరణ, సేకరణ కాకుండా నేరుగా కొనుగోలు చేస్తామని అక్కడి రైతులకు చెబుతున్నారు. ఎకరానికి కనీసంగా రూ.25 లక్షల వరకు చెల్లించేందుకు ముడా సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పైగ్రామాల్లో మాజీ సర్పంచులు గ్రామపెద్దలను కలిసి లాజిస్టిక్‌ హబ్‌గా ఈ ప్రాంతం మారితే యువతకు ఉపాధి పుష్కలంగా ఉంటాయని, ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. దీంతో రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ధర విషయమై అధికారులు, రైతుల మధ్య సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయి. లాజిస్టిక్‌ హబ్‌తో పాటు ఎలక్ట్రానిక్స్‌ అసెంబ్లింగ్‌ పరిశ్రమ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ముడా డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి చెప్పారు. లాజిస్టిక్‌ హబ్‌తో పాటు ఇతర పరిశ్రమల రాకతో ఈ ప్రాంతం పరిశ్రమల నగరాగా మారనుంది. ఈ ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌గా ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం త్వరలో భూములను కొనుగోలుచేసి పెడనను పోర్టుకు అనుసంధానించేందుకు సంసిద్ధమవుతోంది.

పెడన నుంచి రైల్వేట్రాక్‌ 
లాజిస్టిక్‌ హబ్‌కు రైల్వే కనెక్టీవిటీకి గాను విజయవాడ- మచిలీపట్నం సెక్షన్‌లో మచిలీపట్నానికి 8 కి.మీ. ముందు ఉన్న పెడన నుంచి బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెంల మీదుగా కాకర్లమూడికి రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. మచిలీపట్నం నుంచి రైల్వే కనెక్టివిటీ ఇచ్చేందుకు అవకాశాలు లేకపోవటంతో ఆ స్టేషన్‌ను ముందున్న పెడనను ఇందుకోసం ఎంచుకొన్నారు. ఫలితంగా పోర్టుకు సంబంధించి మొత్తం రవాణా కాకర్లమూడి నుంచి పెడన మీదుగా విజయవాడకు తరలనుంది. దీనికి సంబంధించి పెడనలో అదనపు ట్రాక్‌లను నిర్మించేందుకు రైల్వేశాఖ స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో భూసేకరణ చేపట్టింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా ఇప్పటికే విడుదలచేశారు. ఇటీవల విజయవాడ డీఆర్‌ఎం ధనుంజయ మచిలీపట్నం, పెడనలలో పర్యటించి ఇక్కడ భూసేకరణ, ట్రాక్‌ల విస్తరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. 2021 నాటికి విజయవాడ- మచిలీపట్నం సెక్షన్‌లో డబ్లింగ్‌ పనులు పూర్తవుతాయని, ఈ లోపుగా పోర్టు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు రైల్వే సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం మీద మచిలీపట్నం పోర్టుతో పెడనకు కొత్తరూపు రానుంది. వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతంలో  పరిశ్రమలు వెలసి ఉపాధి సమస్య తీరనుంది.

Link to comment
Share on other sites

బందరు పోర్టు భూసేకరణకు కసరత్తు! 
భూమి కొనుగోలుకు నిర్ణయం 
రూ.25 లక్షల చొప్పున పరిహారం 
బ్యాంకు రుణం పొంది కొనుగోలు 
ఈనాడు, విజయవాడ 
gnt-sty3a.jpg

బందరు పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ఒక కొలిక్కి వచ్చింది. బందరు ఓడరేవుకు కావాల్సిన భూమిని రాజధాని తరహాలో సమీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించపోవడంతో సేకరణకు సమయాత్తమైంది. ఇప్పటికే సమీకరణకు అంగీకరించిన రైతులు సైతం తమకు పరిహారం కావాలని కోరుతున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా భూ సమీకరణ కోసం ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో ముడా ఆధ్వర్యంలో భూ సమీకరణకు విధివిధానాలను రూపొందించిన విషయం తెలిసిందే. రాజధాని తరహాలో భూములు ఇచ్చిన రైతులకు నివేశన, వాణిజ్య స్థలాలతో పాటు ప్రతి ఏడాది కౌలు చెల్లించే విధంగా మార్గదర్శకాలను రూపొందించారు. వాటిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కూడా చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్షించారు. ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో రైతులతో సమావేశాలు నిర్వహించారు. కానీ రైతుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. భూసేకరణ జాప్యంపై నిర్మాణ సంస్థ నవయుగ ప్రభుత్వంపై వత్తిడి పెంచింది. ఒకదశలో ప్రాజెక్టు నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగింది. దాంతో భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ యజమానులకు చెల్లించాల్సిన పరిహారం ఎక్కువగా ఉండటంతో నిధుల సమీకరణ సమస్యగా మారింది. బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. ముందుగా రైతులకు కొంత చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి అడ్వాన్సు రూపంలో నిధులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ప్రతిపాదించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారు. ప్రభుత్వం నుంచి ముందస్తు చెల్లింపుల కోసం రూ.250 కోట్లు తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో ఆ నిధులు అందనున్నాయని కలెక్టర్‌ తెలిపారు.

5,300 ఎకరాలు కావాలని... 
బందరు పోర్టుకు మొత్తం 5,300 ఎకరాలు కావాలని ప్రతిపాదించారు. మొత్తం భూమిని ఓడరేవుల అథారిటీకి (డైరెక్టర్‌ ఆఫ్‌ పోర్ట్సు) అప్పగించనున్నారు. ఓడరేవుల సంస్థతో నిర్మాణ సంస్థ నవయుగ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 5300 ఎకరాలకు గాను ప్రభుత్వం ఇప్పటికే 3 వేల ఎకరాలను అప్పగించింది. ఆ భూమిలో పనులు ప్రారంభించాలని అధికారుల సూచన. కానీ నవయుగ సంస్థ ముందుకు రావడం లేదు. మొత్తం భూమి అప్పగించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. పనులు మొదలు పెట్టిన తర్వాత భూ సమీకరణలో సమస్యలు తలెత్తుతాయనేది నిర్మాణ సంస్థ అభిప్రాయంగా ఉంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవును ఇదే సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా భూసేకరణ జరిగిన తర్వాత ఆ సంస్థ కొన్ని సమస్యలను ప్రైవేటుగా పరిష్కారం చేసుకోవాల్సి వచ్చింది. దీనికి రూ.కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మొత్తం భూసేకరణ చేసి అప్పగిస్తేనే పనులు ప్రారంభిస్తామని సంస్థ తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఓడరేవుకు 5,300 ఎకరాలతో పాటు మరో వెయ్యి ఎకరాలు కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు కంటైనర్ల ఏర్పాటుకు కేటాయించాల్సిన అవసరం ఉంది.

కలెక్టర్‌ ఏమన్నారంటే... 
దీనిపై కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంను ‘ఈనాడు’ వివరణ కోరగా.. అడ్వాన్సుగా కొంత నిధులు సమకూర్చాలని తాము ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. బ్యాంకు రుణం మంజూరు అయిన తర్వాత ప్రభుత్వ నిధులు సర్దుబాటు చేస్తామని తెలిపారు. పనులు ప్రారంభించేందుకు అనువుగా భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. 2200 ఎకరాల ప్రైవేటు భూములు కొనుగోలు చేయాలని చెప్పారు. ఎకరాకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు. కంటైనర్‌ కార్పొరేషన్‌కు మరో వెయ్యి ఎకరాలు సేకరించనున్నామని వెల్లడించారు.

రూ. 550 కోట్లు అవసరం 
ఓడరేవుకు సేకరించాల్సిన ప్రైవేటు భూమికి దాదాపు రూ.550 కోట్లు కావాలి. మొత్తం 2200 ఎకరాల వరకు సేకరించాలి. ఎకరాకు దాదాపు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజాపతినిధుల పిలుపు మేరకు ఇప్పటికే 700 ఎకరాల వరకు రైతులు భూసమీకరణ కింద ఇచ్చేందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. భూ సమీకరణ ప్రకారం రైతులకు ఆయా ప్రాంతాల్లోనే స్థలాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం ఆ రైతులు సైతం తమకు పరిహారం కావాలని కోరుతున్నట్లు తెలిసింది. దాంతో కొంత సందిగ్ధత నెలకొంది. భూసేకరణకు ముడా నిధులు సమీకరించాలి. ముడా తమ ఆస్తులను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలనేది ప్రతిపాదన. అందు కోసం బ్యాంకులతో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఈలోగా ప్రభుత్వం అడ్వాన్సుగా నిధులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదించారు. సుమారు రూ.250 కోట్లు అవసరం ఉంది. ముడా రూ.50 కోట్లు వరకు సర్దుబాటు చేయనుంది. కనీసం రూ.200 కోట్లు కావాలని లేఖ రాశారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉంది. మరో నెల రోజుల్లో శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Link to comment
Share on other sites

రాజధానికి ధీటుగా మెగా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం
26-08-2018 07:45:39
 
636708663370068093.jpg
  • రాజధానికి ధీటుగా మచిలీపట్నం(ముడా) ప్లాన్‌
  • కృత్తివెన్ను నుంచి నాగాయలంక వరకు..
  • మొత్తం 1816చ.కి.మీ విస్తీర్ణం
  • ఇండస్ట్రియల్‌ కారిడార్లు-టౌన్‌షిప్‌లు
 
రాజధాని అమరావతికి ధీటుగా మరో అద్భుత నగరం జిల్లాలో రూపొందబోతోంది. శతాబ్ధాల క్రితం ఒక వెలుగు వెలిగిన మచిలీపట్నానికే ఆ అదృష్టం దక్కబోతోంది. ఇప్పటికే బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుటుండగా.. ప్రభుత్వ సూచనలతో మరోవైపు మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది.
 
 
మచిలీపట్నం: రాజధాని తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సకల సౌకర్యాలను ఇక్కడ కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేవిధంగా మచిలీపట్నం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) మెగా మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధపరుస్తోంది. పారిశ్రామిక కారిడార్స్‌, టౌన్‌షిప్స్‌, స్కిల్‌మేనేజ్‌మెంట్‌ సంస్థలు, ఇకో-టూరిజం, తదితర అన్ని అంశాలు ఉండేటట్లు ప్లాన్‌ను తయారుచేస్తోంది. మూడు నియోజకవర్గాలు, తొమ్మిది మండలాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి మెగా సిటీగా అభివృద్ధి పరిచేవిధంగా ప్లాన్‌ను సిద్ధపరిచింది. శతాబ్దాలచరిత్ర కలిగిన బందరు ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ముడా ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 2016వ తేదీన జీవో విడుదల చేసింది. దీని ప్రకారం మచిలీపట్నం మున్సిపాల్టీతోపాటు, బందరు మండలంలోని 26 గ్రామాలు, పెడన మండలంలోని ఒక గ్రామం ఈ మడా పరిధిలోకి వచ్చాయి. దీని పరిధి మొత్తం 426.16చదరపు కిలోమీటర్లు. తదానంతరం మడాను మ చిలీపట్నం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) గా మార్చి 2017లో మారుస్తూ జీవోఎంస్‌నెం. 90, 91లను విడుదల చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలతో ముడా పర్స్‌ఫెక్టివ్‌, జోనల్‌ డవలప్‌మెంట్‌, ఏరియా డవలప్‌మెంట్‌, తదితర ప్లాన్స్‌ను తయారుచేసింది.
 
మరోసారి విస్తరణ
తొలిగా గూడురు, పెడన, గుడ్లవల్లేరు ప్రాంతాలు కవర్‌ అయ్యేవిధంగా అంటే 375.80చ.కి.మీలు ముడా పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు భావించి, సంబంధిత వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే పారిశ్రామీకరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం మళ్లీ మరోసారి ముడా పరిధిని విస్తరించాలని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ముడా పరిధికి వాయువ్యదిశలో ఉన్న పెడన, గుడ్లవల్లేరు, గూడురులతోపాటు కృత్తివెన్ను, బంటుమిల్లి ప్రాంతాలను మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. కోడూరు, అవనిగడ్డ, నాగాయలంకలను కూడా ఈపరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ లో పొందుపరిచారు. నాగాయలంకలో రక్షణశాఖకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టనుండటంతో పోర్టును అనుసంధానిస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావించి, దివిసీమ ప్రాంతాన్ని ముడాలో కలిపారు. ప్రస్తుతం మాస్టర్‌ ప్లాన్‌లో గూడూరు, గుడ్లవల్లేరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక ప్రాంతాలు ఉన్నాయి. వీటితో ముడా విస్తీర్ణం మొత్తం 1816.96 చ.కి.మీలకు చేరుకుంటోంది.
 
5,292ఎకరాల్లో డీప్‌ వాటర్‌ పోర్టు..
బందరు పోర్టును మొత్తం 5292.75 ఎకరాల్లో నిర్మించనుండగా.. ప్రభుత్వ భూమి 2360.52 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 2360.52 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 2278.32 ఎకరాలు పట్టాభూమి. రైతుల నుంచి తీసుకోవల్సిన భూమి ఇది. మంగినపూడిలో 292.05 ఎకరాలు, తవిశపూడిలో 412.95ఎకరాలు, గోపువానిపాలెంలో 712.13ఎకరాలు, కరగ్రహారంలో 738.24, పోతేపల్లిలో 33.18, చిలకలపూడిలో 89.77ఎకరాలు మొత్తం 2278.32 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అలాగే రోడ్లకు సంబంధించి పోతేపల్లిలో 66.54 ఎకరాలు, అరిసేపల్లిలలో 58.08 ఎకరాలు, మాచవరంలో 8.8ఎకరాలు, సుల్తానగరంలో మొత్తం 7.65ఎకరాలు, మొత్తం కలిపి 141.07 ఎకరాలు. కాంకర్‌ ఐఎల్‌ఎంజెడ్‌ (లాజిస్టిక్స్‌ పరిశ్రమకు) కాకర్లమూడిలో 368ఎకరాలు, బుద్దాలపాలెంలో 184ఎకరాలు, బల్లిపర్రులో 180ఎకరాలు, మడకలో 150 ఎకరాలు, బొర్రపోతుపాలెంలో 121ఎకరాలు.. మొత్తం 1003 ఎకరాలు. రైల్‌లైన్‌ కోసం బొర్రపోతుపాలెంలో 15.10ఎకరాలు, పోతేపల్లిలో 86.71ఎకరాలు, పెడనలో 8.02ఎకరాలు, హుస్సేన్‌పాలెంలో 87సెంట్లు.. మొత్తం 110.70 ఎకరాలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించి, ప్లాన్‌లో పొందుపరిచారు.
 
 
27,885 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌
మొత్తం 27885 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధపరుస్తున్నారు. అయితే ఈ పారిశశ్రామిక కారిడార్‌ను దాదాపు ప్రభుత్వ భూమిలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 14,650ఎకరాలను ముడాకు అందించింది. ఇంకా మిగిలిన ప్రభుత్వ భూమి కోసం అధికారులు సర్వే చేపడుతున్నారు. ఇంకా ఏమైనా కావల్సి ఉంటే 25శాతం భూమిని రైతుల నుంచి వారి ఒప్పందం మేరకు తీసుకోనున్నారు. ఫేజ్‌ -1లో 1503ఎకరాలు ఇండస్ట్రీయల్‌ కోసం, 1,000 ఎకరాలు ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌కు, 3,407ఎకరాలు పెద్దతరహా పరిశ్రమలు ఫేజ్‌-2లో 4,974ఎకరాల్లో పరిశ్రమలు, 2,624ఎకరాల్లో పెద్దతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు.
 
 
రూ.6,500 కోట్లతో మౌలిక సదుపాయాలు
ముడా పరిధిలో మొత్తం తొలిదశలో రూ.6500 కోట్లతో మౌలిక సదుపాయాలు చేపట్టనున్నారు. పోర్టు భూసేకరణ, రోడ్డు, రైల్‌, ఇండస్ట్రీయల్‌ కారిడార్స్‌ కోసం రూ.1,835కోట్లను వెచ్చించనున్నారు. అలాగే ల్యాండ్‌ డవలప్‌మెంట్‌కు రూ.3,296కోట్లు, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌కు 9.48కోట్లు, సీవేజ్‌(మురుగు)ప్లాంట్‌కు రూ.7.58కోట్లు, నాలుగులైన్ల రోడ్లకు రూ.680కోట్లు, సాఫ్ట్‌స్కిల్స్‌, ప్రీడవలప్‌మెంట్‌ చార్జీలకు రూ. 590 కోట్లను వెచ్చించేందుకు మాస్టర్‌ ప్లాన్‌లో అంచనాలు వేశారు.
Link to comment
Share on other sites

అదిగో.. నవలోకం!
పెడనలో భారీగా పరిశ్రమలు విస్తరించనున్న రహదారులు
వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌గా రూపాంతరం
పెడన, న్యూస్‌టుడే
kri-top1a.jpg
మచిలీపట్నం ఓడ రేవుకు అనుబంధంగా వస్తున్న పరిశ్రమలకు పెడన ప్రాంతం అనువైనదిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ దిశగా ముందడుగు వేసింది. నెలన్నర క్రితం ముంబయికి చెందిన కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా రూపుదిద్దేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకొంది. ఈ నేపథ్యంలో భూములను సిద్ధం చేసేందుకు మచిలీపట్నం పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) చర్యలను వేగవంతం చేసింది. ఈ జోన్‌  ఏర్పాటుకు కనీసంగా 1007 ఎకరాల భూములు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. కాకర్లమూడితో పాటు పెడన మండలంలోని మడక, బల్లిపర్రు బందరు మండలంలోని బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

భూముల సర్వే  : ఎంవోయూ పూర్తయినప్పటి నుంచి భూముల కోసం రైతులతో సంప్రదింపులు జరుపుతున్న ముడా అధికారులు ఈ ప్రాంతంలో ప్రతి రోజూ పర్యటిస్తున్నారు. రైతుల భూములు ఎంతవరకు అవసరం.. అసైన్‌మెంట్‌ భూములు ఎన్ని ఉన్నాయి.. తదితర వివరాలను సేకరించేందుకు ఎంజాయ్‌మెంట్‌ సర్వేను తాజాగా ప్రారంభించారు. రైతులనుంచి నేరుగా భూములను కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నామని ముడా డిప్యూటీ తహసీల్దార్లు రమాదేవి, సుజాతలు చెప్పారు. భూముల ధరలను త్వరలో ఏర్పాటుకానున్న కమిటీ నిర్ణయిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

కాకర్లమూడిలో లాజిస్టిక్‌ జోన్‌
పెడనకు 7 కి.మీ.ల దూరంలో ఉన్న కాకర్లమూడి కేంద్రంగా ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (ఐఎల్‌ఎంజెడ్‌) ఏర్పాటుకానుంది. ఈ జోన్‌లో కంటైనర్‌ కార్పొరేషన్‌ 69వ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు
లాజిస్టిక్‌ జోన్‌కు అనుబంధంగా పలు పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటుచేస్తారు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు... సామ్‌సంగ్‌, సోని వంటి దిగ్గజ సంస్థలు అసెంబ్లింగ్‌ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించి ముడాకు అప్పగించింది.
రహదారులకు కొత్త రూపు
మంగినపూడి, గోపువానిపాలెం తదితర ప్రాంతాల్లో బందరు ఓడరేవు అయిదు బెడ్లుగా విస్తరించనున్న నేపథ్యంలో అక్కడి నుంచి కాకర్లమూడి, మడక, బల్లిపర్రు గ్రామాలకు 85 మీటర్ల వెడల్పున రహదారిని నిర్మిస్తారు. ఇది మంగినపూడి- కొత్తపూడి రహదారి నుంచి ప్రారంభమై బుద్దాలపాలెం మీదుగా కాకర్లమూడికి చేరుతుంది.
ఏడు లైన్ల రైలుమార్గం
మచిలీపట్నం- విజయవాడ సెక్షన్‌లో పోర్టుకోసం పెడనకు సరిహద్దున ఉండే బొర్రపోతుపాలెం నుంచి కాకర్లమూడి వరకు రైల్వే ట్రాక్‌ను ఏడు లైన్లుగా నిర్మించనున్నారు. లాజిస్టిక్‌ జోన్‌లో సరకు రవాణాకు ఇబ్బంది లేకుండా రైలుమార్గాన్ని విస్తరిస్తారు.
భారీ గోదాముల నిర్మాణం
బుద్దాలపాలెం వద్ద భారీ గోదాములను నిర్మించనున్నారు. పోర్టు నుంచి వచ్చే సామగ్రి, ఎరువులను ఇక్కడ నిల్వచేసి.. రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. దీనికి సంబంధించి రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని  ప్రతిపాదనలతో ముందుకొచ్చింది.
చమురు సంస్థల నిల్వకేంద్రాలు
ప్రభుత్వ రంగంలోని హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ తదితర చమురు సంస్థలు తమ నిల్వ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలు, దేశాలకు ఆయిల్‌ ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి.
ఇంజినీరింగ్‌ పరికరాల తయారీ
బందరు ఓడరేవు అనుబంధ పరిశ్రమల అవసరాలకే కాకుండా ఎగుమతి ప్రధానంగా ఇంజినీరింగ్‌ పరికరాల  తయారీకి పలు సంస్థలు కూడా ఈ జోన్‌లో ఏర్పాటు కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉత్పత్తి కేంద్రంతో గుర్తింపు
కంటైనర్‌ కార్పొరేషన్‌కు ఇప్పటివరకు కోస్తాంధ్రలో కంటైనర్ల మరమ్మతులు మినహా తయారీ కేంద్రాలు లేవు. కాకర్లమూడి యూనిట్‌లో భారీ కంటైనర్లను ఉత్పత్తి చేస్తే విదేశాలకు ఎగుమతి చేయవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. దీంతో పెడనకు దేశవ్యాప్త గుర్తింపు లభిస్తుంది.
పెరగనున్న ఉపాధి అవకాశాలు
పరిశ్రమల ఏర్పాటుతో దాదాపు 50 వేల మందికి స్థానికంగా ఉపాధి లభించే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ ఆధారితమైన పెడన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.

 
 

 

Link to comment
Share on other sites

సెప్టెంబర్‌ 30న మచిలీపట్నం పోర్టు పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. పోర్టు పనులకు ప్రస్తుతం రుణం సాధించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాం. అవి ఒక కొలిక్కి వస్తున్నాయి. మచిలీపట్నం పోర్టు పనులతో పాటు సమాంతరంగా రైల్‌, రోడ్డు నెట్‌వర్క్‌ పనులు జరగనున్నాయి.

Link to comment
Share on other sites

సెప్టెంబరు 30న బందరు ఓడ రేవుకు సీఎం శంకుస్థాపన
జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం
kri-brk1a.jpg

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నంలో ఓడ రేవు నిర్మాణానికి సెప్టెంబరు 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయంలో జిల్లా అధికారులతో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో బందరు ఓడ రేవు పనుల విషయమై ఆయన సమీక్షించారు.

Link to comment
Share on other sites

బ్రాండ్‌ బందర్‌.. పోర్టుతో అభివృద్ధి వైపు
31-08-2018 08:21:55
 
636713005170843994.jpg
  • పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ కల్చర్‌
  • స్థలాల రేట్లూ పైపైకి
  • మారుతున్న జీవన విధానం
  • మరో వాణిజ్య రాజధానే
 
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కొత్తరూపును సంతరించుకుంటోంది. 1880వ దశకంలో దేశంలోనే రెండవ మున్సిపాల్టీగా అవతరించిన మచిలీపట్నం అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోయింది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు ఈ ప్రాంతానికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాకు అమరావతి ఆనుకుని ఉండటం, మరోవైపు పోర్టు పనులు చకచకా జరుగుతుండటంతో బందరు ప్రాంతం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. ఇక్కడకు వలసలు అధికమయ్యాయి. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగింది. పోర్టు నిర్మాణ పనులు పూర్తైతే మరో వాణిజ్య రాజధానిగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 
మచిలీపట్నం: బందరు రూపురేఖలు మారబోతున్నాయి. పోర్టుకు ప్రాధాన్యం.. కోస్టల్‌ కారిడార్‌ ఇలా ఒకదాని వెంట ఒకటి బందరుకు వస్తుండటంతో అభివృద్ధి పరుగులు తీస్తోంది. స్థలాల ధరలు మూడింతలయ్యాయి. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పోర్టు పూర్తయితే ఇది ఒక కాస్మోపాలిటన్‌ సిటీగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
 
 
జిల్లాలో భవిష్యత్‌ అంతా బందరుదే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోర్టుతోపాటు బందరు ప్రాంతం మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఒకటి మచిలీపట్నం నుంచి పుణే వరకు.. మరొకటి ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు. గతంలో ఈ రహదారులు సింగిల్‌ రోడ్డుకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.
 
చురుగ్గా పనులు
మచిలీపట్నం- విజయవాడ రహదారి పనులను దాదాపు రూ.1,134 కోట్లతో చేపడుతున్నారు. మొత్తం 64.61కి.మీ విస్తీర్ణంలో జరుగుతున్న పనులు మరో నాలుగైదు నెలల్లో పూర్తికానున్నాయి. మచిలీపట్నం- విజయవాడకు రవాణా సమయం బాగా తగ్గనుంది. ప్రస్తుతం కార్లు, మోటార్‌ సైకిళ్లపై రెండు గంటల 15 నిముషాలకు చేరుకుంటుండగా.. బస్సులు మూడు గంటలు పడుతోంది. రహదారి పూర్తైతే సమయం గంటకే పరిమితం కానుంది. కోస్తా జాతీయ రహదారుల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
 
పోర్టు పూర్తైతే మంచి కాలం మున్ముందు..
మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే ఈ ప్రాంతం ఎవరికీ అందనంత ఎత్తులో వెళ్లిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదని జనం వ్యాఖ్య. రోడ్డు, రైలు నెట్‌వర్కులు ఉన్నాయి.
 
సాగరమాల ప్రాజెక్టు ఇటువైపుగానే వెళ్తోంది. 64కి.మి. దూరంలోనే వాయుమార్గం(గన్నవరం) ఉంది. పోర్టుతోపాటు దాదాపు రూ.30వేల కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటుకాబోతున్నాయి. ఇన్ని సౌకర్యాలు, మౌలికవసతులు సమకూరతున్న ఈ ప్రాంతం ముంబయి తరహాలో మరో వాణిజ్య రాజధానిగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 
పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ సంస్కృతి
బందరులో ఇటీవలకాలంలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ బాగా పెరిగింది. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, అవనిగడ్డ ప్రాంతాల్లో నివాసముంటున్నవారు బందరుకు వచ్చేస్తున్నారు. పోర్టు నిర్మాణమే దానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు నాలుగైదు అపార్ట్‌మెంట్సే ఉంటే.. నేడు వాటి సంఖ్య పదింతలైంది. అపార్ట్‌మెంట్లను అభిరుచులకు తగ్గట్లు నిర్మించి, సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా బాగా పుంజుకుంది. అన్నీచోట్లా తగ్గుతుంటే.. ఇక్కడ మాత్రం వ్యాపారం బాగా జరుగుతోంది. దీంతో వేలాది పొలాలు వెంచర్లుగా మారిపోతున్నాయి. మచిలీపట్నంలో గతంలో గజం రూ. రెండువేలకే వచ్చేది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రూ. 40వేలన్నా దొరకని పరిస్థితి. ఇంటి అద్దెలు కూడా పెరుగుతున్నాయి.
 
 
వేగంగా రైల్వే డబ్లింగ్‌ పనులు
బందరు నుంచి విజయవాడ రైల్వేలైన్‌ పనుల విస్తరణ కూడా వేగవంతంగా జరుగుతోంది. డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. జిల్లాకే కాక, ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది వ్యాపారవేత్తలు మచిలీపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భారీ పెట్టుబడులపై దృష్టి పెడుతున్నారు. జాతీయ రహదారిపై వంతెన పనులు చకచకా జరుగుతున్నాయి.
 
 
మారుతోంది
ఇక్కడ ప్రజల ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఫాస్ట్‌ఫుడ్స్‌ ఆకర్షితులవుతున్నారు. బిర్యానీ హోటల్స్‌కైతే విపరీతమైన డిమాండ్‌ ఉంది. కర్రీపాయింట్లు ఖాళీ ఉండటం లేదు. ఒకప్పుడు ఇంటి దగ్గర వంట చేసుకునే వారంతా.. ఇప్పుడు హోటళ్ల బాట పడుతున్నారు. టేస్టీ ఐటమ్స్‌ లభ్యమవుతుండటంతో వాటివైపే చూస్తున్నారు. జీవన విధానం, విలాసంలో పెద్దఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రూ. 10పెట్టి కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపని జనం ఇప్పుడు రూ. 200లు పెట్టీ మరీ సినిమా చూస్తున్నారు. థియేటర్లు కూడా ఏసీ, ఫుల్‌ డీటీఎస్‌, ఫోర్‌కే అలా్ట్రహెచ్‌డీ స్ర్కీన్స్‌ కనులవిందు చేస్తున్నాయి. వీకెండ్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. మంగినపూడి బీచ్‌, చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలకు జనం పరుగులు తీస్తున్నారు.
Link to comment
Share on other sites

శరవేగంగా బృహత్తర ప్రణాళిక
50 శాతానికి పైగా పురోగతి
నెలల వ్యవధిలో ‘ముడ’ చేతికి..
కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే
kri-top2a.jpg

బందరుకు పూర్వ వైభవం సాక్షాత్కరింపచేయడంలో కీలక భూమిక పోషించనున్న బృహత్తర ప్రణాళిక శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ప్రణాళిక రూపకల్పన బాధ్యతను దక్కించుకున్న అంతర్జాతీయ సంస్థ కార్యాచరణలో ఇప్పటికే 50 శాతానికిపైగా పురోగతి సాధించింది. పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటే కాకుండా ముడ ప్రాంత 30 సంవత్సరాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేస్తున్న బృహత్తర ప్రణాళికను నిర్ణయించిన సమయం కన్నా ముందే అందిపుచ్చుకొనే దిశగా ముడ తన వంతు ప్రయత్నాల్లో  తలమునకలవుతోంది.

ఓడరేవు కీలకం..
* రాష్ట్ర విభజనానంతరం మచిలీపట్నం పోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు అతి కీలకంగా మారింది. ఎగుమతులు, దిగుమతులు, రవాణా సౌలభ్యం, పోర్టు అనుబంధ పరిశ్రమలతో పాటు పారిశ్రామిక నడవా ఏర్పాటు, తదితర అంశాలకు మచిపలీపట్నం పరంగా విస్తార అవకాశాలున్నాయి.  ‌్ర రాజధాని అమరావతికి  అతి చేరువగా ఉన్న ప్రాంతమే కాకుండా పర్యాటక పరంగా
* కీలక అభివృద్ధి సాధించేందుకు అవసరమైన అన్ని వనరులూ ఉన్నాయి. అవసరం మేరకు ప్రభుత్వ భూములు ఉండటంతో రాజధానికి దీటుగా అభివృద్ధికీ ఆస్కారం ఉంది. మచిలీపట్నం పోర్టు అంశానికే పరిమితం కాకుండా రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై కూడా దృష్టి సారించింది. ఇందుకోసం ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ యాక్ట్‌-2016  ప్రకారం మచిలీపట్నం పట్టణాభివృద్ధిని సంస్థ(ముడ)ను ఏర్పాటు చేసింది.
* పోర్టు, అనుబంధ పరిశ్రమలకు అవసరమైన భూములను సమకూర్చుకోవడంతో పాటు మచిలీపట్నం ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ముడకు అప్పగించింది. ముడకు ఉన్న బాధ్యతల్లో అతికీలకమైనది మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనే. సరైన ప్రణాళిక లేకుండా పోర్టు, పరిశ్రమల ఏర్పాటు సాధ్యపడే అంశం కాదు. పట్టణీకరణ, మౌలికవసతుల కల్పన, తదితర  విషయాల్లో కూడా సమగ్ర ప్రణాళిక ముఖ్యావసరం. మాస్టర్‌ ప్లాన్‌ ప్రాముఖ్యతకు అనుగుణంగా ముడ అంతర్జాతీయ బిడ్‌లను ఆహ్వానించడం, ఆ బాధ్యతను రాయల్‌ హాస్కోనింగ్‌ డీహెచ్‌వీ సంస్థ దక్కించుకోవడం తెలిసిందే.
* భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక
* ముడ, డీహెచ్‌వీ సంస్థల ఒప్పంద ప్రకారం 30 సంవత్సరాల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాస్పెక్టివ్‌, మాస్టర్‌, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికలను రూపొందిచాల్సి ఉంది.
* ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టిన డీహెచ్‌వీ సంస్థ ఏడాది వ్యవధిలో అన్ని ప్రణాళికలు సమర్పించాలి. ఇప్పటికే  ముడ ప్రత్యేక చొరవతో సీబీఆర్‌ఈ సౌత్‌ ఆసియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా అతి కీలకమైన ఇండస్ట్రీ, ఎకానమీ సర్వేను పూర్తి చేశారు.
* పారిశ్రామికంగా, ఇతరత్రా అభివృద్ధి చెందిన ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సాధించిన పురోగతిని బెంచ్‌మార్క్‌గా తీసుకుంటూ మచిలీపట్నం ప్రాంతంలో ఏయే పర్రిమలకు అనకూలం, సహజంగా లభించే వనరులు, పెట్టుబడిదారులకు ఉండే అనుకూలతలు, పారిశ్రామిక వృద్ధికి దోహదపడే అంశాలు, తదితరాలను సమగ్రంగా నివేదికలో పొందుపర్చారు.
* సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌)లో భాగంగా మచిలీపట్నం ప్రాంత గ్రామాల ప్రజలతో సంప్రదింపులు, ముడ నియమిత సలహాదారులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు, తదితరాలను పూర్తి చేశారు.
* ముడ ప్రాంతానికి చెందిన బేస్‌మాప్‌ తయారీలో ఉన్న లోటుపాట్లు సరిచేసుకున్నారు. ఇంతకు పూర్వం ఉన్న పట్టణ ప్రణాళికకు సంబంధించిన మ్యాప్‌కు, శాటిలైట్‌ ద్వారా సేకరించిన సమాచారంలో ఉన్న తేడాలను సరిదిద్దడం పూర్తయ్యింది. *రెవెన్యూ హద్దుల గుర్తింపును తెలియచేసే కొన్ని కీలక ఆనవాళ్లు కనిపించకపోవడంతో సర్వే శాఖ సహాయంతో హద్దులు గుర్తించారు. ‌్ర సముద్రతీరం కావడంతో హైటైడ్‌ లైన్‌, చెరువులు, క్రీక్‌లు, మడ అడవులు, కాలువలు, తదితరాలకు సంబంధించి శాటిలైట్‌, డిజిటలైజ్‌ మ్యాపింగ్‌ సిస్టం ద్వారా కచ్చితత్వంతో కూడిన మ్యాప్‌లను సిద్ధం చేశారు.
* ముడకు కేటాయించిన భూభాగంలో రమారమి 5,000 ఎకరాలను సముద్ర జలాలు కబళించిన అంశం కూడా సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది. బేస్‌మ్యాప్‌ డ్రాఫ్ట్‌ తయారీ పురోగతిలో ఉంది.
* పరిశ్రమల ఏర్పాటు విషయంలో పర్యావరణ పరమైన అభ్యంతరాలు లేకుండా సీఆర్‌జెడ్‌ పరిధిని గుర్తించారు. హౌస్‌హోల్డ్‌ సర్వే, వినియోగానికి ఉపయోగపడే భూముల సర్వే, ట్రాఫిక్‌, రవాణా సర్వే, తదితరాలు పూర్తయ్యాయి.
* వారసత్వ సర్వేలో భాగంగా ప్రాథమికంగా చారిత్రక ప్రాధాన్యత ఉన్న 65 ప్రాథమ్యాలను గుర్తించారు. ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అవసరాలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, సహజవనరుల పరిస్థితి, విపత్తు నిర్వహణ, ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, గృహ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన, తదితర అంశాల పరిశీలన కొనసాగుతోంది. మరో నెల వ్యవధిలో ప్రాస్పెక్టివ్‌ ప్రణాళిక తుది డ్రాప్ట్‌ను అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించేలా డీహెచ్‌వీ సంస్థ చర్యలు తీసుకుంటోంది. వాస్తవంగా సమగ్ర ప్రాజెక్టు నివేదికను  అప్పగించేందుకు మరో ఎనిమిది నెలల సమయం ఉన్నా ఈలోపే సంస్థ పూర్తి నివేదికను అందచేస్తుందన్న ఆశాభావం ముడ అధికారుల్లో వ్యక్తమవుతోంది.

Link to comment
Share on other sites

పోర్టు పనులకు 30న శంకుస్థాపన
05-09-2018 07:24:45
 
636717290846593581.jpg
  • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..
  • రుణాలిచ్చేందుకు ఐదు బ్యాంకులు సిద్ధంప్రతి మండలంలో ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రాలు
  • జనవరిలో ఇంటర్నేషనల్‌ బీచ్‌ కబడ్డీ
  • మచిలీపట్నం ప్రగతికి కృషి చేశాం
  • ఆంధ్రజ్యోతితో మంత్రి కొల్లు రవీంద్ర
 
నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరిగింది. సీఎం అండతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు రూ. 1600 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మచిలీపట్నంలో అమలుపరిచాం. ఇది ఒక రికార్డు. నియోజకవర్గంలో ఇళ్లు కేటాయిస్తున్నాం. పురపాలక సంఘంలో రూ. 192 కోట్లతో 6400 మందికి జీ+3 ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. రూరల్‌లో అర్హులకు ఇళ్లు నిర్మిస్తున్నాం, పింఛన్లు, రేషన్‌కార్డులు అందజేశాం. రూ. 77.50 కోట్లతో భవానీపురం బ్రిడ్జి చేపట్టి, ప్రారంభించాం. రూ. 26 కోట్లతో చిన్నాపురం బ్రిడ్జిని నిర్మిస్తున్నాం, నారాయణ పురం బ్రిడ్జి నిర్మాణం, పోలాటితిప్ప పల్లెతుమ్మలపాలెం వరకు తారు రోడు నిర్మించాం. అమృత్‌ స్కీమ్‌ కింద రూ. 76 కోట్లు, డ్రెయినేజీ నిధులు రూ. 68 కోట్లు, పుష్కర నిధులు రూ. 18 కోట్లు, అర్‌అండ్‌బీ నిధులు రూ. 161 కోట్లు, తదితర నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పిసున్నాం. ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఇతర టీడీపీ నాయకులతో కలిసి సీఎంను కలిసి నిధులు రాబట్టుకుని అభివృద్ధి పనులు చేస్తున్నాం.
 
 
మచిలీపట్నం: జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం పోర్టుకు ఈనెల 30న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని న్యాయ, క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆ రోజే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలియజేశారు. మచిలీపట్నం పోర్టు, ఇతర అంశాలపై మంగళవారం ఆయనతో ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది.. ఆ విశేషాలు తెలుసుకుందాం ..
 
ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు?
పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ముఖ్యమంత్రి నెలాఖరున పోర్టుకు శంకుస్థాపన చేస్తారు. వెంటనే పనులు ప్రారంభిస్తారు. ఆరోజే కృష్ణా వర్సిటీ నూతన భవనాలను ప్రారంభిస్తారు. ఇక్కడే జ్ఞాన భూమిని సీఎం ఆవిష్కరిస్తారు.
 
భూమి సమకూరలేదు కదా? నిర్మాణం సాధ్యమా?
పోర్టు నిర్మాణం జరగాలని కోరుకుంటున్న వారిలో రైతులే ముందు వరుసలో ఉన్నారు. వాస్తవంగా సేకరించాల్సిన భూమి 1200ల ఎకరాల లోపే. భూమి కొనుగోలుకు ఎకరానికి రూ. 25 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతులు అంగీకరించారు. నిధుల కోసం బ్యాంకులను సంప్రదించాం. ఐదు బ్యాంకులు అంగీకరించాయి. భూమి కొనుగోలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాం. అవసరమైతే ముందుగా ప్రభుత్వ భూమిలోనే పనులు మొదలుపెడతాం. పోర్టు నిర్మాణంలో వెనుకాడేది లేదు.
 
Link to comment
Share on other sites

వాస్తవంగా సేకరించాల్సిన భూమి 1200ల ఎకరాల లోపే. భూమి కొనుగోలుకు ఎకరానికి రూ. 25 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతులు అంగీకరించారు. నిధుల కోసం బ్యాంకులను సంప్రదించాం. ఐదు బ్యాంకులు అంగీకరించాయి.:applause:

 

jaffa gaadi mata vini tege daka lagakunda unte bandar dasa tiruguddi....

Link to comment
Share on other sites

ఇది పూర్తయితే ఏపీతో పాటు తెలంగాణకూ ఉపయోగం
06-09-2018 07:41:11
 
636718164707859816.jpg
  • మచిలీపట్నానికి మంచి రోజులు
  • పోర్టు పనులు త్వరలోనే ప్రారంభిస్తాం
  • 2019లో బందరుకు ఓడను తీసుకొస్తాం
  • లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు
  • మంత్రులు చినరాజప్ప, దేవేనేని ఉమా, కొల్లు రవీంద్ర, కొనకళ్ల, బుద్ధ ప్రసాద్‌
  • అట్టహాసంగా ముడా చైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ ప్రమాణ స్వీకారం
 
మచిలీపట్నం: మచిలీపట్నానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని, ఈ ప్రాంతం చెన్నై, విశాఖపట్నాలకు మించి అభివృద్ధి చెందుతుందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఉద్ఘాటించారు. నెలాఖరున మచిలీపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రజల కల కూడా సాకారం కాబోతోందని వారు స్పష్టం చేశారు. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన బూరగడ్డ వేదవ్యాస్‌ బుధవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టరేట్‌లోని ముడా కార్యాలయంలో ఉదయం 10.17 నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్ఛరణాల నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, సభ ప్రారంభానికి ముందు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన సేవలను కొనియాడారు.
 
 
వేదవ్యాస్‌ బాధ్యతల స్వీకరణ
మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ బుధవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లోని ముడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
 
గురుతర బాధ్యతతో పనిచేస్తా
సీఎం చంద్రబాబు ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగించారు. అందరి సహకారంతో విధులను సమర్థంగా నిర్వర్తిస్తా. ఈ పదవి ఒక ముళ్లకిరీటం. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల ఇప్పటి వరకు ముళ్లకిరీటాన్ని మోశారు. వారు నాకు మార్గం సుగమం చేశారు. ఆ కిరీటానికి ఉన్న ముళ్లలో చాలా వరకు పీకేశారు. మిగిలినవి నేను చేయాల్సి ఉంది. పోర్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులకు, వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. రైతుల తర్వాతే ఏధైనా అని చెప్పారు. పోర్టు భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్స్‌ లేవు. రైతులు హాయిగా క్రయవిక్రయాలు చేసుకోవచ్చు.
- వేదవ్యాస్‌, ముడా చైర్మన్‌
 
 
పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి
తెలుగు నాగరికతలో బందరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మద్రాసు కంటే మొదటిగా ఆంగ్లేయులు ఇక్కడకు వచ్చారు. ఇక్కడ నుంచే కార్యకలాపాలు సాగించారు. తర్వాత ఈ ప్రాంతం బాగా వెనుకబడిపోయింది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లటంతో, ఆయన పోర్టు పనులు వెంటనే ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. దివిసీమకు ముఖద్వారంగా ఉన్న బందరు అభివృద్ధి చెందితే మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. వేదవ్యాస్‌ను ఈ పదవి ముళ్ల కిరీటం లాంటిదే. ఆయన సమర్థత, చతురతతో పోర్టు పనులు చక్కపెట్టగలరనే నమ్మకం నాకుంది.
- మండలి బుద్ధప్రసాద్‌, ఉప సభాపతి
 
 
కల నిజం కాబోతోంది
బందరుకు పోర్టు వస్తే మచిలీపట్నంతో పాటు, పెడన, అవనిగడ్డ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయి. యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది. వలసలు తగ్గుతాయి.
- కాగిత వెంకట్రావు, శాసనసభ్యుడు పెడన
 
 
పోర్టు నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు
పోర్టు నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి, సాధించుకున్నారు. ముడాకు ఛైర్మన్‌ నియమించటంతో పూర్తి స్థాయి రూపు రేఖలు ఏర్పడ్డాయి. చెన్నపట్నం, విశాఖ కంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనటంలో సందేహం లేదు. రూ. 50 వేల కోట్లతో ఆయిల్‌ రిఫైనరీ రాబోతోంది. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా లాజిస్టిక్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
- కొనకళ్ల నారాయణ, మచిలీపట్నం ఎంపీ
 
 
రైతులకు నష్టం రాకుండా చూస్తాం
మచిలీపట్నం పోర్టును రాకుండా కుట్రలు చేశారు. ఎంపీ కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమా, ప్రజలు స్థానిక నాయకులు పోర్టు కోసం జరిగే ఉద్యమానికి ఊపిరిపోశారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధికి ముడాను ఏర్పాటు చేశారు. సమర్థుడైన వేదవ్యాస్‌ను నియమించారు. గత ప్రభుత్వ హయాంలో పోర్టుకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. మా ప్రభుత్వం ఇప్పుడు చేసి చూపిస్తోంది.. సీఎంను రూ. 250 కోట్లను అడగాలని నిర్ణయం తీసుకున్నాం. బ్యాంకులు ఇచ్చిన తర్వాత ఆ నగదును మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. ఈ విషయంపై మేమంతా సీఎంను కలిసి నివేదిస్తాం.
- కొల్లు రవీంద్ర, న్యాయ, క్రీడా శాఖ మంత్రి
 
 
ప్రజలు, రైతులు సహకరించాలి
మచిలీపట్నానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. 150 సంవత్సరాల క్రితమే బందరు పురపాలక సంఘంగా అవతరించింది. అయితే అభి వృద్ధి మాత్రం జరగలేదు. బందరులో పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుంది. దీనికి రైతులు, ప్రజలు సహకరించాలి. ఈ ప్రాంత అభివృద్ధికి రైతులు పెద్దమనసుతో ముందుకు రావాలి. మంత్రి కొల్లు రవీంద్ర పట్టణానికి ఒక రూపు తీసుకొచ్చారు. బాగా అభివృద్ధి పరిచారు. ముడా ఛైర్మన్‌గా వేదవ్యాస్‌ బాధ్యతలు స్వీకరించటం ఎంతో అభినందనీయం. వారి సేవలు బందరుపోర్టుకు, మచిలీపట్నం ప్రగతికి ఎంతగానో దోహపడనున్నాయి.
- చినరాజప్ప, హోంమంత్రి
 
 
2019లో బందరుకు ఓడను తీసుకొస్తాం
బందరు పోర్టుతోనే ఇక్కడ పునర్‌వైభవం సాధ్యం. సీఎం చంద్రబాబు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించారు. సెప్టెంబరు నెలాఖరులో సీఎంను ఇక్కడకు తీసుకొస్తాం. పోర్టుకు శంకుస్థాపన చేసి, పోర్టు పనులు ప్రారంభిస్తాం. 2019లో ఓడలు ఇక్కడకు వస్తాయి. మచిలీపట్నం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీకి ఎంతో సమర్థుడైన వేదవ్యాస్‌ ను సీఎం నియమించారు. మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ల, బూరగడ్డ వేదవ్యాస్‌లకు అండగా మేముంటాం. పోర్టుకు కావల్సిన అన్ని సదుపాయాలపై సీఎంతో మాట్లాడి తీసుకొస్తాం.
- దేవినేని ఉమా మహేశ్వరరావు, జలవనరుల శాఖ మంత్రి
 
 
తెలంగాణకూ ఉపయోగం
బందరు పోర్టు నిర్మాణం జరిగితే ఆంధ్రాకే కాదు. తెలంగాణకు కూడా ఉపయోగం. నెల్లూరు, విశాఖ పోర్టుల కంటే బందరు పోర్టే దగ్గరగా ఉంటుంది. పోర్టు నిర్మాణం జరిగితే వలసలు ఆగిపోతాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
- పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఆప్కాబ్‌ చైర్మన్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...