Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply
వేగంగా పోర్టుకు భూముల కొనుగోళ్లు
02-12-2018 09:25:49
 
636793395467446621.jpg
  • రైతుల్లో చైతన్యం
  • మంచి ధర రావడంతో భూములిచ్చేందుకు సంసిద్ధత
  • మరో రూ.200 కోట్ల కోసం ముడా చైర్మన్‌ వేట
  • త్వరలో సీఎంను కలిసే యోచనలో బూరగడ్డ వేదవ్యాస్‌
(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం) పోర్టుకు అవసరమైన భూముల కొనుగోలు ప్రక్రియ వడివడిగా జరుగుతోంది. రైతులకు భారీ మొత్తంలో ప్రయోజనం చేకూరుతుండటంతో భూములు ఇచ్చేందుకు ముం దుకు వస్తున్నారు. రూరల్‌ మండలంలో ఉన్న భూములకూ ఎకరానికి ప్రభుత్వం రూ. 25లక్షల చొప్పున ఇస్తుండటంతో ఇటువంటి అవకాశం మళ్లీ..మళ్లీ రాదనుకుంటూ భూములను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
 
భూములిచ్చేందుకు సంసిద్ధత
ఎకరానికి రూ. 25లక్షలను అందిస్తుండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు భారీగా ముందుకు వస్తున్నారు. భూమి రిజిస్ట్రేషన్స్‌కు ఎటువంటి పన్నులు, ఫీజులు లేకపోవటంతో భూములను ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పోర్టు నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం వారిలో కలగటంతో స్వచ్ఛందంగానే భూములను ఇచ్చేం దుకు అంగీకరిస్తున్నారు. వారంతా ముడా చైర్మన్‌ వేదవ్యాస్‌ని కలిసి, సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ప్రధానంగా గోపువానిపాలెంలో భూయజమానులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న భూములు వచ్చేస్తే.. దాదాపు 50 శాతం భూమి కొనుగోలు ప్రక్రియ పూర్తైనట్లే. అందుకే ముడా యంత్రాంగం దీనిపై దృష్టిసారించింది. పోర్టు నిర్మాణం వల్ల భవిష్యత్‌ తరాలకు కలిగే ప్రయోజనాలను నిశితంగా వివరించటంతో భూములు ఇచ్చేం దుకు అంగీకరించారు. కరగ్రహారం క్యాంప్‌బెల్‌పేటలకు చెందిన రైతులు శనివారం భూ ములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వాలిశెట్టి వెంకటేశ్వరరావు, తోట భాస్కరరావు, కరగ్రహారం మాజీ సర్పంచ్‌ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు అయోధ్యరామయ్య తదితరులు ముడా ఛైర్మన్‌ వేదవ్యాస్‌ను కలిసి తమ భూములు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు ముడా వీసీ విల్సన్‌ బాబు ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్లు, తహసీ ల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పెద్దఎత్తున గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు భూమి కొనుగోలు పథకం గురించి వివరిస్తూ, చైతన్య పరుస్తున్నారు.
 
911.58 ఎకరాల సేకరణ
మచిలీపట్నం పోర్టుకు ఇప్పటి వరకు మొత్తం 911.58 ఎకరాలను ముడా సేకరించింది. వీటిలో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా 746.36 ఎకరాలు సేకరించగా, భూమి కొనుగోలు పథకం కింద 165.205 ఎకరాలను సమకూర్చుకోగలిగింది. వాస్తవంగా బందరు పోర్టుకు సంబంధించి మొత్తం 2278.320 ఎకరాల పట్టాభూమిని సేకరించాల్సి ఉంది. వీటిలో మంగినపూడి, తవిశపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, చిలకలపూడి గ్రామాల నుం చి ఈ భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగినపూడి నుంచి 148ఎకరాలు, తవిశపూడి నుంచి 145ఎకరాలు, గోపువానిపాలెం నుంచి 94 ఎకరాలు, కరగ్రహారం నుంచి 333 ఎకరాలు, పోతేపల్లి నుంచి 8.51 ఎకరాలు, చిలకలపూడి నుంచి 16.03ఎకరాలు ల్యాండ్‌పూలింగ్‌లో సమకూరింది.
 
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భూమి కొనుగోలు పథకం ద్వారా ఇప్పటి వరకు మంగినపూడి నుంచి 47 ఎకరాలు, తవిశపూడి నుంచి 48 ఎకరాలు, గోపువానిపాలెం నుంచి 48 ఎకరాలు, కరగ్రహారం నుంచి 24 ఎకరాలను కోనుగోలు చేశారు. ఇంకా 1366 ఎకరాల పట్టా భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. మంగినపూడి నుంచి 96 ఎకరాలు, తవిశపూడి నుంచి 222 ఎకరాలు, గోపువానిపాలెం నుంచి 569 ఎకరాలు, కరగ్రహారం నుంచి 380 ఎకరా లు, పోతేపల్లి నుంచి 24 ఎకరాలు, చిలకలపూడి నుంచి 73 ఎకరాలను రైతుల నుంచి కోనుగోలు చేయాల్సి ఉంది.
 
మరో రూ. 200 కోట్లు ..
ప్రస్తుతం భూమి కొనుగోలు పథకం వేగవంతం జరుగుతున్న క్రమంలో ముడాకు నిధుల సంకటం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోర్టు పనులు వేగవంతం చేసే నిమిత్తం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ. 200 కోట్ల నిధులను విడుదల చేయించారు. దీంతో భూముల కొనుగోలు జరుగుతోంది. అయితే ఈ నిధులు పూర్తి స్థాయిలో భూముల కొనుగోలుకు సరిపోవు. ఈ నిధులు 800 ఎకరాలు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయి. మిగిలిన 600 ఎకరాలకు, ఇతర మౌలికసదుపాయాల కల్పనకు, బ్యాంక్‌ రుణాలకు మార్జిన్‌ మనీ కింద ఉంచు కోవటానికి భారీగానే నిధులు కావాల్సి ఉంది.
 
కనీసం మరో రూ. 200 కోట్ల నిధుల అవసరముంటుంది. దీంతో ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లెందుకు ముడా చైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ యోచన చేస్తున్నారు. బ్యాంక్‌ల నుంచి ముడాకు రుణ మంజూరుకు సంబంధించిన అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంగళవారం లేదా బుధవారం సీఎం తో చర్చిస్తామని వేదవ్యాస్‌ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 7వేల ఎకరాల భూమిని బ్యాంకర్లకు చూపి రుణ మంజూరును వేగవంతం చేస్తామని చెప్పారు. పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో ముడా పరిధిని 1794 చ.కి.మీ మేర విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
ఎకరం రూ.40 లక్షలు

 

ఈనాడు-అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం మేకవానిపాలెం పరిధిలోని చిలకలపూడి, పోతేపల్లి గ్రామాల్లో 122.95 ఎకరాలను.. ఎకరా రూ.40 లక్షల చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వులిచ్చారు.

Link to comment
Share on other sites

పోర్టు పనులు 31న ప్రారంభం

స్పష్టం చేసిన ‘ముడ’ ఛైర్మన్‌ వేదవ్యాస్‌

amr-brk3a_39.jpgకలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: మచిలీపట్నం, పరిసర ప్రాంత పరిపూర్ణ అభివృద్ధి దిశగా తొలి అడుగుకు రంగం సిద్ధమైంది. జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న బందరు పోర్టు పనుల ప్రారంభానికి సన్నాహాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చేతుల మీదగా ఈనెల 31వ తేదీన పోర్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ) ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ముడ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 31న పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. కేవలం ముఖ్యమంత్రి చొరవ వల్లే అపరిష్కృతంగా ఉన్న పోర్టు సాకారం అవుతోందన్నారు. భూముల సమకూర్చుకొనే విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంబన సైతం ఆయన చొరవ వల్లే సానుకూలమైందన్నారు. భూముల కొనుగోలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం బ్యాంకుల నుంచి రూ.1,350 కోట్లు రుణం పొందేందుకు ప్రభుత్వం ష్యూరిటీగా ఉందని చెప్పారు. ముడ పరంగా ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా వివిధ జీవోలు మంజూరు అయ్యాయని, ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే సాధ్యపడ్డాయన్నారు. రెండు రోజుల క్రితం పోర్టు గుత్తేదారు సంస్థ ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా  పనులు ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపారన్నారు. అందుకు అనుగుణంగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన యంత్రసామగ్రి, డ్రెడ్జింగ్‌ పరికరాలు, తదితరాలు తరలి వస్తున్నాయన్నారు. పనులు ప్రారంభించేందుకు అవసరమైన 250 అడుగుల రహదారి కోసం అవసరమైన 122 ఎకరాల భూములను గుర్తించామని తెలిపారు. మార్కెట్‌ ధరలను బట్టి రహదారికి అవసరమయ్యే భూములు ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో కూడా జారీ చేసిందన్నారు. రెండు మూడు రోజుల వ్యవధిలో భూముల మీద దృష్టి పెడతామన్నారు. పోర్టు పనులు ప్రారంభించే నాటికి బ్యాంకుల నుంచి రుణం తొలివిడతగా రూ.700 కోట్లు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు.  మచిలీపట్నంలో కొనసాగుతున్న పోర్టు కార్యాలయం ఎక్కడి తరలిపోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోర్టుకు శంకుస్థాపన చేసి గాలికొదిలేసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి మాదిరిగా ఉత్సవాల వంటి హంగామాలు లేకుండా పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అనూహ్య అభివృద్ధికి తొలి అడుగుకానున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేదవ్యాస్‌ కోరారు.

 

Link to comment
Share on other sites

రాష్ట్రానికే తలమానికం బందరుపోర్టు 
 

మంత్రి రవీంద్ర

kri-gen3a_26.jpg

గొడుగుపేట,న్యూస్‌టుడే: బందరు పోర్టు నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలబోతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం పోర్టు పనుల ప్రారంభంలో భాగంగా పైలాన్‌ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరు లేదంటే వచ్చేనెల 7న పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పోర్టుతో బందరుతోపాటు జిల్లా రూపు రేఖలు మారిపోతాయన్నారు. మేకావానిపాలెం రెండెకరాల్లో అద్భుతమైన పైలాన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడివరకు ముఖ్యమంత్రి రావడానికి రోడ్డు మార్గం, హెలీప్యాడ్‌ల ఏర్పాటు తదితరాలకు స్థల పరిశీలన చేశారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు పనులతోపాటు సమాంతరంగా పరిశ్రమల ఏర్పాటు పనులు కూడా జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. ముడ వైస్‌ఛైర్మన్‌ విల్సన్‌బాబు, నవయుగ సంస్థ జీఎం సుబ్బారావు, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణప్రసాదు, జడ్పీటీసీ మాజీ సభ్యులు బూరగడ్డ శ్రీకుమార్‌, నారగాని ఆంజనేయప్రసాదు, బోలెం హరిబాబు, కుంచే దుర్గాప్రసాదు, అల్లాడ శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పోర్టుకు ముహూర్తం ఖరారు
26-01-2019 07:36:41
 
636840850023245869.jpg
  • వచ్చే నెల ఏడో తేదీన ...
  • పైలాన్‌ ఆవిష్కరించనున్న సీఎం చంద్ర బాబు
  • ప్రజల ఆకాంక్ష నెరవేరింది :మంత్రి కొల్లు రవీంద్ర
  • త్వరలోనే బందరుకు ఓడ: కొనకళ్ల
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం: బందరు పోర్టు పనుల ప్రారంభానికి ముహూర్తం కుదిరిందని, వచ్చే నెల ఏడో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నంలోని మేకవానిపాలెంలో భారీ ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారని క్రీడా, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ముడా ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం వెల్లడించారు. మేకవానిపాలెంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మచిలీపట్నం వాసులు ఎన్నో ఏళ్లుగా పోర్టు కోసం ఎదురు చూస్తున్నారని, దానికి చక్కని ఫలితం దక్కబోతోందన్నారు. పోర్టు కోసం 500 రోజులపాటు ఉద్యమం కొనసాగిందని వారు గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసినా అడుగు ముందుకు పడలేదన్నారు. అడ్డంకులన్నింటినీ సీఎం చంద్రబాబు తొలగించి, పోర్టు పనులను ప్రారంభిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. టూరిజం అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ సంస్థలు ముందుకు వస్తున్నాయని రూ. 150 కోట్లతో పనులు చేపట్టబోతున్నారని తెలియజేశారు. బందరు పోర్టుతో పాటు కృష్ణా విశ్వవిద్యాలయ నూతన భవనాలను కూడా సీఎం చంద్రబాబు అదే రోజు ప్రారంభిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
 
కొద్దికాలంలోనే బందరుకు షిప్‌
కొద్దికాలంలోనే బందరుకు షిప్‌ వస్తుందని ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. చెన్నై - విశాఖపట్నం పోర్టులకు దీటుగా ఈపోర్టు ఉంటుందని ఎంపీ కొనకళ్ల ఆశాభావం వ్యక్తం చేశారు. ముడా చైౖర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ మాట్లాడుతూ నేరుగానే పోర్టు పనులను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఊహించని అభివృద్ధి జరుగుతుందన్నారు. పోర్టు కోసం రైతులు భూములు ఇవ్వటం ఎంతో సంతోషకరమని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం మాట్లాడుతూ, బందరు పోర్టు ఎంతో పురాతనమైనదని, దీనిని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారన్నారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని, పోర్టు నిర్మాణంతో జిల్లా ఆదాయం మరింత పెరుగుతుందని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల బుల్లయ్య, ముడా వీసీ విల్సన్‌బాబు, మున్సిపల్‌ ఛైర్మన్‌ బాబా ప్రసాద్‌, గొర్రెపాటి గోపీచంద్‌, ఆర్డీవో ఉదయ్‌భాస్కర్‌ ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

7న పోర్టు పనుల ప్రారంభం
 

అదేరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా కేఆర్‌యూ భవనాల ప్రారంభోత్సవం
స్పష్టం చేసిన మంత్రి, కలెక్టర్‌, ముడ ఛైర్మన్‌

kri-gen2a_48.jpg

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లా ప్రజల చిరకాలవాంఛ బందరు పోర్టు నిర్మాణ పనులు ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. పలు దఫాలుగా నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా  ప్రారంభించేందుకు షెడ్యూల్‌ ఖరారైనట్టు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ముడ ఛైర్మన్‌ వేదవ్యాస్‌, ఎంపీ కొనకళ్ల నారాయణరావు  స్పష్టం చేశారు. బందరు మండలం మేకావానిపాలెం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పోర్టు పనులు ప్రారంభించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. మంత్రి కొల్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలం సాకారం కానుండటంపై  హర్షం వ్యక్తం చేశారు. పోర్టు కోసం 500 రోజులకు పైగా ఉద్యమం కొనసాగించిన అందరికీ శుభాభినందనలు తెలిపారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, టౌన్‌షిప్‌ నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతాయన్నారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.1,000 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఆర్‌ఐ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఇతర పరిశ్రమల ఏర్పాటు విషయంలో కూడా వివిధ సంస్థలు సంప్రదింపులు నిర్వహిస్తున్నాయన్నారు. పోర్టు నిర్మాణంతో బందరు బంగారు భవిష్యత్తుకు పునాది పడనుందన్నారు. ఏడో తేదీన ఉదయం రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన కృష్ణా విశ్వవిద్యాలయ నూతన భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పోర్టు ప్రాంతంలో పనులు ప్రారంభించి, మేకావానిపాలెం గ్రామంలోని రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే పైలాన్‌ను ఆవిష్కరిస్తారన్నారు. తదుపరి బహిరంగ సభ ఉంటుందన్నారు. పోర్టు కోసం భూములిచ్చిన  రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగానే బందరు పోర్టును కూడా ప్రారంభిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర ఉన్న బందరు పోర్టు అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి స్థిర సంకల్పం ఫిబ్రవరి ఏడో తేదీన ఈడేరనుందన్నారు. పోర్టు నిర్మాణం ద్వారా జిల్లాలో అనూహ్య అభివృద్ధి సాధిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుత జీడీపీ రూ. లక్ష కోట్లు, రూ. 90వేల కోట్ల జీవీఏ, రూ.1.90 లక్షల తలసరి ఆదాయంతో ఎంతో ముందున్నామని చెప్పారు. పోర్టు వస్తే జీడీపీ రూ. 1.50 లక్షల కోట్లకు పైబడి చేరుకొనే అవకాశం ఉందన్నారు. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, తదితర అభివృద్ధి కార్యాక్రమాల ద్వారా  ప్రజల సంతృప్తి స్థాయి కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ మాట్లాడుతూ  పోర్టు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో సాధ్యపడుతోందన్నారు. పోర్టు నిర్మాణంతో మచిలీపట్నం, పరిసర ప్రాంతాలు అనూహ్య అభివృద్ధి సాధించనున్నాయన్నారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల మాట్లాడుతూ దాదాపు 16 సంవత్సరాల పోరాట ఫలితం ముఖ్యమంత్రి చొరవతో సాధ్యకానుందన్నారు. దేశంలో బందరు పోర్టు ఒకటో స్థానంలో నిలుస్తుందన్నారు.

శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో ఊహించని అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బందరు ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు,  పురపాలక సంఘ అధ్యక్షుడు మోటమర్రి బాబాప్రసాద్‌, ఉపాధ్యక్షుడు కాశీవిశ్వనాథం, పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, గొర్రెపాటి గోపిచంద్‌, గోపు సత్యనారాయణ, కుంచె నాని, తదితరులతో పాటు ముడ వీసీ విల్సన్‌బాబు, పలువురు అధికారులు  పాల్గొన్నారు. పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ విషయంలో కలెక్టర్‌ తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ మంత్రి, ఎంపీ, తదితరులు ఆయన్ని సత్కరించారు.

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి
పోర్టు పనుల ప్రారంభోత్సవం, కృష్ణా విశ్వవిద్యాలయ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఫిబ్రవరి ఏడో తేదీన రానున్న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించే క్రమంలో పోర్టు పనుల ప్రారంభోత్సవ పైలాన్‌ ఆవిష్కరించే మేకావానిపాలెం ప్రాంతాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పోర్టుకు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.  ముడ వీసీ విల్సన్‌బాబు, కార్యదర్శి సమజ, బందరు ఆర్డీవో జెఉదయభాస్కర్‌, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

Link to comment
Share on other sites

7న బందరు పోర్టుకు శంకుస్థాపన
02-02-2019 07:31:55
 
మచిలీపట్నం: ప్రజలంతా పోర్టువారోత్సవాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. స్ధానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోర్టు పనులు ప్రారంభించేం దుకు సీఎం చంద్రబాబు ఏడో తేదీన వస్తున్నారన్నారు. పోర్టు ప్రాధాన్యత కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నేటి నుంచి అన్ని గ్రామాల్లో, పట్టణంలోని అన్ని వార్డుల్లో చైతన్య బస్సుయాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి పోర్టు ఆహ్వాన పత్రాలు పంచుతామన్నారు. లక్ష మందితో సీఎం బహిరంగసభకు సిద్ధం చేస్తున్నామ న్నారు. సీఎం ముందుగా కృష్ణా యూనివర్శిటీ ప్రారంభిస్తారని, అక్కడ నుంచి హెలీ కాప్టర్‌లో పోర్టు శిలాఫలకం ప్రాంతానికి చేరుకుని సర్వమత ప్రార్ధనలు చేసి పోర్టు పైలాన్‌ను ప్రారంభిస్తారన్నారు. అనంతరం భారీ బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తార న్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ బందరు ప్రజల చిరకాల వాంఛ బందరుపోర్టు మరికొద్ది రోజుల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషదాయకమన్నారు.
Link to comment
Share on other sites

రూ.12వేల కోట్లతో బందరు పోర్టు నిర్మాణం
03-02-2019 07:58:26
 
636847775046111490.jpg
  • తొలి దశలో రూ.ఆరు వేల కోట్ల వ్యయం
  • డయాఫ్రమ్‌ వాల్‌తో నిర్మాణం ప్రారంభం
  • సముద్రంలో 20కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్‌
ఆంధ్రజ్యోతి మచిలీపట్నం: బందరు పోర్టు కల త్వరలోనే సాకారం కానుంది. అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మచిలీపట్నం పోర్టు రూపుదిద్దుకోనుంది. చెన్నై- విశాఖ పట్నం పోర్టులను మించేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ పోర్టుల నిర్మాణ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా బ్రేక్‌వాటర్‌ విధానంలో ఈ పోర్టును నిర్మించనున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పలు మధ్య భారత రాష్ట్రాలకు కూడా అతి దగ్గరి ఓడరేవు కావటంతో ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో ఈ పోర్టు నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారు. రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో కాకుండానే రూ.11,924కోట్లను ఈ బందరు పోర్టు కోసం ఖర్చుచేయనుండగా.. తొలి దశలో రూ. 6,778 కోట్లను వెచ్చించనున్నారు. నిర్మాణ రంగంలో అందెవేసిన చేయిగా ఉన్న నవయుగ సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సూచనల మేరకు బందరు పోర్టును నిర్మించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతోంది.
 
బ్రేక్‌వాటర్‌ టెక్నాలజీతో..
మచిలీపట్నంలో నిర్మించేది డీప్‌ వాటర్‌ పోర్టు కావటంతో ఇక్కడ బ్రేక్‌వాటర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, ఆ అలలు తీసుకొచ్చే మట్టి, ఇసుకను అడ్డుకుని, తీరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు వీలుగా డయాఫ్రంవాల్‌ను నిర్మించనున్నారు. పోర్టు నిర్మించే ప్రాంతం ప్రకృతి విపత్తుల బారిన పడకుండా పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించనున్నారు. సముద్రం లోపల, తీరం వెంబడి 18 నుంచి 20మీటర్ల లోతులో ఫైల్స్‌ నిర్మించనున్నారు. ముందుగా సముద్రతీరానికి దక్షిణంవైపున రాళ్లు, మట్టితో కూడిన కట్టడాన్ని నిర్మించి, అది పూర్తైన వెంటనే స్ట్రక్ఛరల్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ముందుగా వర్టికల్‌ ఫైల్స్‌ నిర్మించి, దాంతోపాటు రేకర్‌ ఫైల్స్‌ను కట్టనున్నారు. వీటన్నింటికీ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేసి, పటిష్ఠ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ఈ బ్రేక్‌ వాటర్‌ (అడ్డుకట్ట) నిర్మాణానికి దాదాపు 136 వారాలు పట్టే అవకాశం ఉంది.
 
సముద్రంలో
20 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్‌
పోర్టు నిర్మాణం కోసం డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంది. దీంతో మొదటి దశలో సముద్ర తీరం, సుముద్రం లోపల కలిపి మొత్తం 68 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లను డ్రెడ్జింగ్‌ ద్వారా తొలగించాల్సి ఉంటుందనేది ఒక అంచనా. సముద్ర తీరం నుంచి భూమి వైపునకు మొత్తం 27 మిలియన్ల క్యూబిక్‌ మీటర్లను, తీరం నుంచి సముద్రం లోపలకు 41 మిలియన్ల క్యూబిక్‌ మీటర్లను డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుంది. సముద్రం లోపలకు దాదాపు 20 కిలోమీటర్ల మేర ఈ డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుంది. సముద్ర తీరం నుంచి భూమివైపుగా డ్రెడ్జింగ్‌ చేయాల్సిన దానిలో దాదాపు తొమ్మిది మిలియన్ల క్యూబిక్‌ మీటర్లను ఎక్స్‌కవేటర్స్‌తో తీయనున్నారు. సముద్ర తీరం నుంచి లోపల వైపు ట్రైలర్‌ సక్షన్‌ హూపర్‌ డ్రెడ్జర్స్‌ (టీఎస్‌హెచ్‌డీ)తో తవ్వనున్నారు. నైరుతి రుతుపవనాలు, వాటి ప్రభావంవల్ల వర్షాలు వచ్చే మూడు నాలుగు నెలలు మినహా, మిగిలిన తొమ్మిది నెలలపాటు డ్రెడ్జింగ్‌ను చేపట్టనున్నారు. మొత్తం నాలుగు టీఎస్‌హెచ్‌డీలతో మెరైన్‌ డ్రెడ్జింగ్‌ చేపడతారు. నెలకు 25 రోజులపాటు నిరాటంకంగా ఈ పనులను నిర్వహిస్తారు.
 
రూ. 11,924 కోట్లతో నిర్మాణం
మచిలీపట్నం పోర్టును రెండు దశల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ రెండు ఫేజ్‌లకు కలిపి మొత్తం రూ.11,924 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. మొదటి దశలో రూ.6,778 కోట్లు కాగా, రెండవ దశలో రూ.5146 కోట్లను వెచ్చించనున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు ప్రిలిమ్‌నరీస్‌ అండ్‌ సైట్‌కు రూ.57 కోట్లు, డ్రెడ్జింగ్‌కు రూ. 1564కోట్లు, బ్రేక్‌వాటర్‌కు రూ.817 కోట్లు, బెర్తులకు రూ.1674 కోట్లు, స్టాక్‌యార్డ్‌ అభివృద్ధికి రూ.275 కోట్లు, యంత్ర పరికరాలకు రూ.151 కోట్లు, విద్యుదీకరణకు, పరికరాలకు రూ.87 కోట్లు, అంతర్గత రహదారులు, రైల్వే లైన్లకు రూ.172 కోట్లు, బాహ్య రైల్వే లైన్‌కు రూ.30 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.237కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ (5.60శాతం)కు రూ.354 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
 
7న పనులు ప్రారంభం
ప్రతిష్ఠాత్మక బందరు పోర్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల ఏడవ తేదీన ప్రారంభించనున్నారు. కృష్ణపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న నవయుగ సంస్థే ఈ బందరు పోర్టునూ నిర్మిస్తోంది. ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చొరవతో నవయుగ సంస్థ పనులకు ఉపక్రమిస్తోంది. సీఎం ఏడవ తేదీన బందరు వచ్చి మిషనరీతో పనులు ప్రారంభించి, మేకావారిపాలెం వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
 
రెండు దశల్లో అయ్యే ఖర్చు
ప్రాజెక్టు ప్రిలిమినరీ అండ్‌ సైట్‌  రూ.91కోట్లు
డ్రెడ్జింగ్‌  రూ.2297కోట్లు
బ్రేక్‌వాటర్‌  రూ.817కోట్లు
బెర్త్స్‌  రూ.2662కోట్లు
స్థల అభివృద్ధి, స్టాక్‌యార్డ్‌  రూ.532కోట్లు
విద్యుత్‌, పరికరాలు  రూ.213కోట్లు
యంత్ర పరికరాలు   రూ.3772కోట్లు
అంతర్గత రోడ్లు, రైలుమార్గం  రూ.317కోట్లు
బాహ్య రైల్వే మార్గం  రూ.30కోట్లు
ఇతర ఖర్చులు  రూ.567కోట్లు
సర్వీస్‌ ట్యాక్స్‌  రూ.626కోట్లు
మొత్తం రూ.11,924కోట్లు
Link to comment
Share on other sites

మచిలీపట్నం పోర్ట్ పనుల శంకుస్థాపన కు రంగం సిద్ధమైంది. మైక్రో కాస్మిక్ డిజైన్ తో ఆంధ్రప్రదేశ్ విజన్ తెలియజేసేలా ముడా వారు 'గేట్ వే ఆఫ్ ప్రాస్పరిటీ' పేరుతో పోర్ట్ పైలాన్ ను డిజైన్ చేశారు. దీనిని 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.

Dyd44unV4AIdfY-.jpg
Dyd46NQVYAEK6Ko.jpg
Dyd478sV4AIe-VL.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...