Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

పోర్టుకు శంకుస్థాపన విజయ దశమికేనా?
12-09-2018 08:12:39
 
636723367601289625.jpg
  • 30న జరగాల్సిన పోర్టు శంకుస్థాపన వాయిదా?
  • సీఎం విదేశీ పర్యటన, శూన్యమాసం కారణం
  • భూమి కొనుగోలుకు పీఐబీ నుంచిరూ. 200 కోట్లు
  • మరో వారంలో రానున్న నిధులు
 
జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మచిలీపట్నం పోర్టు పనులను విజయదశమి పర్వదినాన ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన, శూన్యమాసం కావటంతో ఈ నెల 30న జరగాల్సిన పోర్టు శంకుస్థాపన పనులను వాయిదా వేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా పోర్టు భూముల కొనుగోలు కోసం ముడాకు రూ. 200 కోట్లు నిధులు ఇవ్వాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్టుకు సీఎం ఎటాచ్‌ చేశారు. మరో వారంలో ఆ నిధులు ముడాకు రానున్నాయి. వీటితో పాటు ముడా వద్ద ఉన్న రూ.50కోట్లను కలిపి మొత్తం రూ. 250 కోట్లతో భూమి కొనుగోలు చేయనున్నారు.
 
 
మచిలీపట్నం: బందరుపోర్టు పనులను ఈ నెల 30వ తేదీన సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభింపచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం భావించారు. ఇదే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, పోర్టు పనులకు అవసరమైన భూమి కొనుగోలు కోసం భారీ మొత్తం మార్జిన్‌ మనీని కూడా తీసుకురాగలిగారు. వివిధ కారణాలతో ఈ పోర్టు శంకుస్థాపన కార్యక్రమం మరో వారం పదిరోజులు వాయిదా పడే సూచనలున్నా శుభముహూర్తాన మాత్రం పనులు ప్రారంభమవబోతున్నాయి.
 
విజయ దశమికే..
వాస్తవంగా ఈ నెల 30న సీఎం చంద్రబాబు పోర్టు పనులను ప్రారంభిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా యంత్రాంగం తెలిపింది. అంతేకాక ముడా ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారంలోనూ పాల్గొన్న మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, మండలి బుద్ధ ప్రసాద్‌, కాగిత వెంకట్రావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు కూడా ఈ నెలాఖరున సీఎంచే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే సీఎం ఈ నెల 24వ తేదీన అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 28వ తేదీ తిరిగి రాబోతున్నారు. దీంతో ఈ నెల 30వ తేదీ ఆయన మచిలీపట్నం రావటం కొంచెం కష్టమైన పనే.
 
అప్పటికే ఆయనకు బిజీ షెడ్యూల్‌ ఉండనుండటంతో 30వ తేదీ వస్తారా? అనేది సంశయంగా మారింది. ఇదే సందర్భంలో ప్రస్తుతం శూన్యమాసంలో ఎటువంటి శంకుస్థాపనలు, ప్రవేశాలు చేయరని పండితులు తెలుపుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే దసరా సందర్భంలోనే సీఎం బందరు పోర్టు శంకుస్థాపన చేసే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నా యి. ఇప్పటికే పోర్టు నిర్మాణానికి పూనుకున్న సీఎం ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా పోర్టుకు మాత్రం కచ్చితంగా శంకుస్థాపన చేస్తారని యంత్రాంగం స్పష్టం చేస్తోంది.
 
వేగంగా గ్రౌండ్‌ వర్క్‌
పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోంది. మొత్తం 5292.75 ఎకరాల్లో బందరు పోర్టును నిర్మించాలని నిర్ణయించారు. దీనిలో ప్రభుత్వభూమి (అసైన్డ్‌తో కలిపి) మొత్తం 2984.43 ఎకరాలభూమి ఉంది. ఇంకా 2278.32 ఎకరాల పట్టా భూమిని తీసుకోవల్సి ఉంది. రైతులు ల్యాండ్‌ఫూలింగ్‌లో ఇప్పటికే 700 ఎకరాల భూమి ఇచ్చేశారు. మిగిలిన 1,578 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికోసం ఒక్కో ఎకరానికి ప్రభుత్వం రూ.25 లక్షలను ఇచ్చేందుకు అంగీకరించగా.. రైతులు కూడా ఈ నగదును తీసుకునేందుకు ఒప్పుకొన్నా రు.ఈక్రమంలో ముడా అధికారులు బ్యాం కుల నుంచి రుణం తీసుకునేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించగా.. అయిదు బ్యాంకు లు నిధులు ఇచ్చేందుకు అంగీకరించారు. రైతుల నుంచి అంగీకారపత్రాలు తీసుకుంటున్నారు. ఆపని కూడా దాదాపు పూర్తైంది.
 
 
అక్టోబర్‌ నెలలో అవ్వొచ్చు..
ఈ నెలాఖరునే సీఎం చంద్రబాబు డేట్స్‌ అడుగుతాం. ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన విషయం ఆయన దృష్టికి తీసుకెళతాం. వీలుంటే ఈ నెల 30నే శంకుస్థాపన చేయిస్తాం. లేనిపక్షంలో అక్టోబర్‌ నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తాం. పోర్టు కోసం సీఎం చంద్రబాబు రూ.200 కోట్ల నిధులను కూడా సమకూర్చుతున్నారు.
- బి.లక్ష్మీకాంతం, జిల్లా కలెక్టర్‌
Link to comment
Share on other sites

  • Replies 518
  • Created
  • Last Reply
ముడకు మరో  200 కోట్లు
కాలుష్య నియంత్రణ మండలి నుంచి పొందేలా ఆదేశాలు
పోర్టు రెవెన్యూ నుంచి వాటా వచ్చేలా జీవో
మంత్రి, ఎంపీ చొరవతో భూముల కొనుగోలుకు మార్గం సుగమం
కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే
kri-top2a.jpg

జిల్లా ప్రజల సుదీర్ఘ స్వప్నంగా ఉన్న మచిలీపట్నం పోర్టును సాకారం చేసే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గడచిన కొన్ని వారాలుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరుల ప్రత్యేక చొరవతో మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ)కు ఆర్థిక పరిపుష్ఠి చేకూరడంతో పాటు బందరు ఓడరేవుకు అవసరమైన భూములు తక్షణం సమకూర్చుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. భూముల కొనుగోలు నిమిత్తం ముడకు కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు) నుంచి రూ. 200 కోట్లు సర్దుబాటు చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పోర్టు గుత్తేదారు సంస్థ నుంచి ప్రభుత్వానికి సమకూరే ఆదాయం నుంచి కూడా ముడకు వాటా లభించేలా జీవో విడుదలయ్యింది.
చిక్కుముడి వీడిపోతూ..  : * పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములకు సంబంధించి ఇంకా దాదాపు 1,500 ఎకరాలు సమకూర్చుకునే విషయంలో చోటుచేసుకున్న స్తబ్దత కారణంగా  నిర్మాణ పనుల పురోగతికి నోచుకోకపోవడం తెలిసిందే.
* ఇప్పటికే పోర్టు శాఖకు అప్పగించిన 3,000 పైచిలుకు ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో పనులు ప్రారంభించేందుకు గుత్తేదారు సంస్థ సంసిద్ధత చూపలేదు.
* ఒప్పందం ప్రకారం మిగిలిన పట్టా భూములను అప్పగించిన మరుక్షణం పనులు ప్రారంభిస్తామని సంస్థ స్పష్టం చేసినా గడచిన ఏడాదిన్నర కాలంగా ఆశించిన కదలిక కనిపించలేదు. ముడ పరంగా భూముల కొనుగోలు చేయాలనే నిశ్చయానికి రావడం, అందుకు అవసరమైన మొత్తాన్ని బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి రుణంగా పొందే బాధ్యతను ప్రభుత్వం ముడకు అప్పగించింది.
* రుణం పొందే ప్రక్రియలో ఉండే జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ల, ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ ప్రత్యామ్నాయ అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. పోర్టు అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి అందుకు సానుకూలంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ముడకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.

నిధులిలా.. : పోర్టుకు అవసరమైన పట్టా భూములను తీసుకునేందుకు గతంలో భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రెండు దఫాలుగా పొడింగించడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ల్యాండ్‌ పూలింగ్‌ విధానం కూడా అమలు చేసిన ప్రభుత్వం, కొందరు రైతుల అభిప్రాయాల మేరకు ముడ ద్వారా భూములు కొనుగోలు చేయాలని నిశ్చయించింది.
* భూముల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం దాదాపు రూ.1,400 కోట్ల మొత్తాన్ని ముడ బ్యాంకుల నుంచి రుణంగా పొందే ప్రయత్నంలో ఉంది. ఇందుకు అవసరమైన మార్జిన్‌మనీ నిమిత్తం ఇటీవలే ముడకు * 139 కోట్లు ఇచ్చేందుకు మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది.
* రుణ ప్రక్రియలో ఉండే ఆలస్యం కారణంగా భూముల కొనుగోలు విషయంలో ఎటువంటి జాప్యం ఉండకూదన్న నిర్ణయంతో రూ. 200 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి  నుంచి ముడకు సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మొత్తాన్ని ముడ రుణం పొందిన వెంటనే వడ్డీ లేకుండా కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టేలా ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

ముడకు ఆదాయం సమకూరేలా జీవో
మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ (ముడ) ఏర్పాటు చేసిన నాటి నుంచి పరిపాలనా పరంగా అనేక బాధ్యతలున్నా స్వీయ ఆదాయ వనరులు నామమాత్రంగానే ఉన్నాయి. ఆర్థిక పరమైన అవసరాల కోసం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి. పోర్టు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన, టౌన్‌షిప్‌ ఏర్పాటు తదితర అవసరాల కోసం ముడ బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే వారికి అందుకు తగ్గ ఆదాయ వనరులు చూపించాల్సి ఉంటుంది. పోర్టుకు సంబంధించి ప్రభుత్వం, నిర్మాణ సంస్థ మధ్య 2010 జాన్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం భూముల లీజు, కన్‌సెషన్‌ ఫీజులు, తదితరాలను సంస్థ ప్రభుత్వానికి చెల్లిచాల్సి ఉంది. ప్రస్తుతం ముడ దాదాపు రూ.1,385 కోట్లు బ్యాంకుల నుంచి రుణం పొందుతున్న దృష్ట్యా తిరిగి చెల్లింపులకు వీలుగా పోర్టు పరంగా వచ్చే ఆదాయంలో ముడకు కూడా భాగస్వామ్యం కల్పించాలంటూ వీసీ విల్సన్‌బాబు ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో పోర్టు పరంగా వచ్చే ఆదాయంలో ముడకు కూడా భాగస్వామ్యం కల్పించేలా మంగళవారం జీవో ఎంఎస్‌ నెం.29 ద్వారా ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ఫలించిన మంత్రి, ఎంపీ చొరవ
ముడకు ఆర్థిక పరిపుష్ఠి కల్పించే విషయంలో మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ల చొరవ ఫలించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, బ్యాంకు రుణంలో ఉండే జాప్యం తదితరాలను ముఖ్యమంత్రికి వివరించారు. వారి కృషి ఫలితంగా ఇప్పటికే మార్జిన్‌మనీ అవసరాల కోసం రూ.139 కోట్లు సమకూరగా, తాజాగా మరో రూ.200 కోట్లు ముడకు సర్దుబాటు అయ్యాయి. ప్రస్తుతం విడులవుతున్న నిధులతో పాటు గతంలో ఉన్న నిధులతో కలిపి ముడ ఖాతాలో రూ.400 కోట్లు సమకూరుతున్నాయి. ఆర్థిక పరిపుష్ఠి లభించడంతో భూముల కొనుగోలు  వేగవంతం చేసే దిశగా యంత్రాగం నిమగ్నమవుతోంది..

Link to comment
Share on other sites

లక్ష్యం పూర్తికాకుంటే భూసేకరణే..?
తాజా నోటిఫికేషన్‌కు అవకాశం
రైతుల ముందు మూడు అవకాశాలు
న్యాయపరమైన సలహా మేరకు చర్యలు చేపట్టనున్న ‘ముడ’
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే
kri-top1a.jpg
బందరు పోర్టు విషయంలో నెలకొన్న క్రీనీడలు తొలగించే విధంగా మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ) చర్యలు వేగవంతం చేసింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన పట్టా భూములు సమకూర్చుకునే విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యం పనుల పురోగతికి అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. భూముల నిమిత్తం గతంలో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ విషయంలో కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, మరోపక్క నోటిఫికేషన్‌ గడువు ముగిసిన నేపథ్యంలో ముడ అధికారులు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోన్యాయపరమైన అభిప్రాయాలను తీసుకున్న ముడ అవసరాన్ని బట్టి తాజాగా భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.


బందరు పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా భూములను సమకూర్చుకోవడం తలనొప్పి వ్యవహారంగా మారింది. తొలుత పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం 2015 ఆగస్టులో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ విషయంపై స్థానికంగా వ్యతిరేకతతో పాటు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తకావడంతో రాజధాని తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ల్యాండ్‌ పూలింగ్‌ పట్ల గ్రామాల్లో ముడ అధికారులు విస్తృత ప్రచారం చేపట్టినా స్పందన నామమాత్రమే అయ్యింది. మొత్తం 2,300 ఎకరాల వరకూ పట్టా భూములు కావాల్సిఉండగా 700 ఎకరాలకు సంబంధించిన రైతులు మాత్రమే ల్యాండ్‌పూలింగ్‌కు అంగీకారం తెలిపారు. మిగిలిన భూ సేకరణ విషయంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో రైతుల భేటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు తమ భూముల్లో కొంత భాగాన్ని సేకరణ ద్వారా మిగిలినది పూలింగ్‌ ద్వారా తీసుకోవాలని సూచించడంతో ముఖ్యమంత్రి అందుకు అంగీకారం తెలిపారు. అయినా ఆ పద్ధతి కార్యాచరణకు నోచుకోలేదు. భూ సేకరణ నోటిఫికేషన్‌ గడువు ఏడాది కాలమే కావడంతో ఇప్పటి రెండుసార్లు నోటిఫికేషన్‌ గడువును పొడిగిస్తూ కలెక్టర్‌ ఆదేశాజాలు జారీ చేశారు. నోటిఫికేషన్‌ గడువు పొడిగింపు చట్టసమ్మతం కాదంటూ కొందరు రైతులు న్యాయస్థానం నుంచి ఇంటిరీయం ఆర్డర్‌ పొందారు. మరోపక్క పొడిగించిన నోటిఫికేషన్‌ గడువు కూడా గత నెల 29తో ముగిసింది. మరోసారి నోటిఫికేషన్‌ పొడిగించవచ్చా లేదా అన్న విషయంలో ముడ అధికారులు హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది నుంచి న్యాయపరమైన సలహా కోరారు. పోర్టు భూముల కోసం ప్రభుత్వం తాజాగా భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని, రైతులు వేసిన రిట్‌ పిటిషన్‌పై ఇంటీరియం ఆర్డర్‌ ఉన్నా అభ్యంతరం కాదని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది ముడ అధికారులకు సమాధానమిచ్చారు. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.

రైతుల ముందు మూడు ప్రతిపాదనలు
పోర్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మిగిలిన భూములను సమకూర్చునేందుకు ముడ ద్వారా భూమి కొనుగోలు పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల మంత్రి రవీంద్ర, కలెక్టర్‌ లక్ష్మీకాంతం సమక్షంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో గరిష్ఠంగా ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం తీసుకున్నారు. భూముల కొనుగోలు నిమిత్తం ముడకు రూ.200 కోట్లు కేటాయిస్తూ మంగళవారం ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం రైతులు ల్యాండ్‌పూలింగ్‌, భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు ఇవ్వవచ్చు. ఈ రెండు పద్ధతులను ఎవరైనా అంగీకరించకపోతే పోర్టు పనులకు అవరోధం కాకూదన్న లక్ష్యంతో ప్రభుత్వం మరోసారి భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. పోర్టు పనులను తక్షణం ప్రారంభింÅచే విషయంలో గడచిన కొన్ని వారాలుగా అన్ని రకాల కసరత్తులను ముమ్మరం చేసిన ముడ యంత్రాంగం భూసేకరణకు సంబంధించిన తాజా నోటిఫికేషన్‌ విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. గతంలో పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికి సంబంధిత 21 గ్రామాల పరిధిలో నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. అనుబంధ పరిశ్రమలకు నిర్దేశించిన గ్రామాల్లో క్రయవిక్రయాలు సాఫీగా జరిగేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా రోజుల వ్యవధిలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో మాత్రం అవసరమైన మిగులు భూములను సమకూర్చుకునేందుకు సేకరణ, పూలింగ్‌, కొనుగోలు అవకాశాలను రైతుల ముందుంచి వారాల వ్యవధిలోనే నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలనే దిశగా ముడ చర్యలు చేపడుతోంది.

Link to comment
Share on other sites

పోర్టు భూములకు తొలగిన అడ్డంకులు
15-09-2018 07:49:55
 
636725945970242751.jpg
  • క్రయ, విక్రయాలకు మార్గం సుగుమం
  • భూముల రిజిస్ట్రేషన్లు జరపాలంటూ ఆదేశం
మచిలీపట్నం: హమ్మయ్య.. పోర్టు భూముల గ్రహణం వీడింది. మచిలీపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ సమసిసోయింది. ఇకపై ఇక్కడి రైతులు వారి భూములను అమ్ముకోవచ్చు, కొనవచ్చు. క్రయవిక్రయాలకు సంబంధించిన రాతపూర్వక లేఖను అడ్వకేట్‌ జనరల్‌ సూచనలతో ప్రభుత్వ ప్లీడర్‌ (జీపీ ఫర్‌ ల్యాండ్‌ ఎక్విజేషన్‌-జీపీఎల్‌ఏ).. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి పంపించారు. ఈ లేఖను శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ముడా అధికారులు అందజేశారు.
 
21వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌
బందరుపోర్టుతో పాటు పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం కావాల్సిన భూములను సేకరించేందుకు 2015, ఆగస్టు 29న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటికి సంబంధించి మొత్తం 33వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ను ఇచ్చింది. ఈ 33వేల ఎకరాల్లో 12వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండటంతో, మిగిలిన 21వేల ఎకరాలను భూసేకరణ కింద సేకరించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం 12 నెలల కాలానికి మొదట్లో నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ, తర్వాత రెండుసార్లు పెంచారు. 2017, ఆగస్టు 29 వరకు ఒకసారి పెంచగా, తర్వాత మరో సంవత్సరం.. అంటే 2018, 29 ఆగస్టు వరకు నోటిఫికేషన్‌ గడువు పెంచారు. ఇదే క్రమంలో చాలామంది రైతులు ఈ గడుపు పెంచకూడదంటూ హైకోర్టును ఆశ్రయించటంతో, కోర్టు కూడా రైతులవైపే మొగ్గు చూపింది. అయితే, ఈ సంవత్సరం ఆగస్టు 30తో భూసేకరణ గడుపు ముగుస్తుందని, మళ్లీ పెంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ రైతులకు క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండాపోయింది.
 
పూర్తిగా తొలగిన అడ్డంకులు
సమస్యలను ముడా అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక నోటిమాటతో కాకుండా రాతపూర్వకంగా ఇస్తే బాగుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జీపీఎల్‌ఏ, అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించి ఆయన సూచనలతో కూడిన ఆదేశాలను రాతపూర్వకంగా అందించారు. ముడా అధికారులు కూడా వారితో చర్చలు జరిపి, సాంకేతిక సమస్యలు అధిగమించే విధంగా లిఖితపూర్వక ఆదేశాలను తీసుకురావటంలో సఫలీకృతమయ్యారు. ఆ ఆదేశాల లేఖను శుక్రవారం సాయంత్రం ముడా వీసీ విల్సన్‌బాబు మచిలీపట్నం రిజిస్ట్రేషన్‌ కార్యాలయ అధికారులకు అందించారు. ఆగస్టు 30నే నోటిఫికేషన్‌ రద్దయినా, ఇప్పటివరకు టెక్నికల్‌ మస్య వల్ల రిజిస్ట్రేషన్లు చేయలేదని చెప్పిన అధికారులకు.. ఈ ఆదేశాలు మార్గదర్శకంగా నిలవనున్నాయి. దీంతో క్రయ, విక్రయాలకు పూర్తిగా అవకాశం లభించినట్టయింది.
 
రియల్‌ ఎస్టేట్‌కు ఊతం
మచిలీపట్నం దినదినాభివృద్ధి చెందుతోంది. పరిధి కూడా విస్తరిస్తోంది. పోర్టు నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కానుండటంతో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకుంటోంది. అయితే, ఇక్కడ భూ సేకరణ నోటిఫికేషన్‌కు ముందే పలు సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేశారు. ఇప్పుడు వారికి ఊరట లభించబోతోంది. భూసేకరణ నోటిఫికేషన్‌ వల్ల నాలుగేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొ న్నవారు ప్రస్తుతం క్రయ, విక్రయాలకు ఉన్న సాంకేతిక సమస్యలు కూడా తొలగిపోతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న మచిలీపట్నం ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ మరింత ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
 
ఎన్నో ఇబ్బందుల అనంతరం
భూములను భూసేకరణ చట్టం పరిధిలోకి తీసుకురావటంతో 21 గ్రామాల రైతులు నానా అవస్థలు పడ్డారు. అంతేకాక ఖాళీ స్థలాలు, ఇళ్లకు కూడా ఈ నోటిఫికేషన్‌ వర్తించటంతో అక్కడి ప్రజలు, రైతులు పడిన కష్టాలు వర్ణనాతీతం. పొలాలు ఉన్నా, అవసరాలకు అమ్ముకునే అవకాశం లేకుండాపోయింది. స్థలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్లు కాలేదు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు నిరాకరించాయి. రైతులకు అప్పు పుట్టలేదు. ఈ అంశంపై ఇక్కడి ప్రజలు ప్రభుత్వానికి వారి కష్టాలను విన్నవించుకోవటంతో అన్నీ పరిశీలించి, భూ సేకరణ నోటిఫికేషన్‌ను ఎత్తివేసినట్లు ప్రకటించింది. అయినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ భూముల క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలు క్రయ, విక్రయాలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, రైతులు, ప్రజలు అధైర్య పడొద్దని పలుమార్లు చెప్పారు. అయితే, సాంకేతిక సమస్యలతో ఆ ఇబ్బందులు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సమస్యలన్నింటి నుంచి మోక్షం లభించింది.
Link to comment
Share on other sites

17 minutes ago, RKumar said:

Port start avvakapothe Machilipatnam, Pedana MLA & MP seats meeda impact vuntundi. Need to close issues quickly & start work. At least start port in available land.

motham boomi appagisthae tappa navayuga panulu modalettanandhi ani paina esaduga...

2018 lo bhooosekarana poorthi chesi sankusthaapana chesthara?

Link to comment
Share on other sites

కరాకు రూ.25లక్షలు
పూలింగ్‌ రైతులకు వార్షిక కౌలు పంపిణీ
ముడకు సమకూరిన 7 వేల ఎకరాలు
టౌన్‌షిప్‌ ఏర్పాటు దిశగా కార్యాచరణ
కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే
kri-top1a.jpg

మచిలీపట్నం పోర్టుకు అవసరమైన పట్టా భూములను సమకూర్చుకొనే క్రమంలో ప్రభుత్వం ఎకరాకు రూ. 25 లక్షలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. భూముల కొనుగోలు పథకం ద్వారా  తీసుకునేందుకు ప్రభుత్వం నిశ్చయించిన నేపథ్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన ధర నిర్ణయక కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయపు ప్రతిపాదనలకు రెవెన్యూ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రోజుల వ్యవధిలో వెలువడనున్నాయి. మరో పక్క మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ)కు దాదాపు 7,000 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూములను బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వేగవంతం
* పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను సమకూర్చుకొనే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 3,000 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను ఓడరేవుల శాఖకు అప్పగించింది. మిగిలిన పట్టా భూముల విషయంలో కదలిక లేకపోవడంతో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోని విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ గడువు ఇటీవలే ముగిసింది.
* ల్యాండ్‌ పూలింగ్‌ విధానం అమల్లో ఉన్నా, రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముడ ద్వారా భూములను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ధరను నిర్ణయించేందుకు కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ రైతుల అభిప్రాయాలను, మార్కెట్‌ ధరలను పరిగణనలోకి తీసుకొని ఎకరాకు రూ.25 లక్షలుగా నిర్ధరించారు.
* ఈ ధరను ప్రభుత్వానికి నివేదించగా రెవెన్యూ ఉన్నతాధికారుల ఆమోదం లభించింది. పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, భూముల కొనుగోలుకు ముడ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలుగా పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం ప్రతిపాదించిన గ్రామాల్లో 14,000 ఎకరాల ప్రభుత్వ భూములను ముడకు బదలాయించాలన్న ప్రతిపాదనను ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో బందరు మండల పరిధిలోని వివిధ గ్రామాలో ఉన్న 7,072 ఎకరాలు ప్రభుత్వ భూములను ముడ అప్పగిస్తూ రెవెన్యూ శాఖ జీవో విడుదల చేసింది.

ఫలిస్తున్న చొరవ.. పోర్టు పనుల విషయంలో ఆలస్యం ముఖ్యమంత్రి అసహనంతో ఉండటంతో ముడ ఛైర్మన్‌ వేదవ్యాస్‌, మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణరావు, తదితరులు సమాలోచనలు చేసి ప్రక్రియను వేగవతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ముడకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి రూ.200 కోట్లు సర్దుబాటు అయ్యాయి. తొలుత ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని నిర్ణయించారు. పూలింగ్‌ ద్వారా భూములిచ్చిన వారికి కేటాయించాల్సిన స్థలాల కోసం కరగ్రహారం, మంగినపూడి, కాకర్లమూడి ప్రాంతాల్లో 700 ఎకరాలు గుర్తించి అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కౌలు చెల్లింపు, టౌన్‌షిప్‌ కోసం భూముల ప్రతిపాదన వంటి చర్యలు పోర్టు కార్యాచరణ విషయంలో స్థానికంగా విశ్వాసాన్ని కలుగచేస్తున్నాయి.

నేరుగా రైతు ఖాతాలకే సొమ్ము
- విల్సన్‌బాబు, ముడ వీసీ
పూలింగ్‌ ద్వారా భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు నేరుగా వారి ఖాతాలకే జమ చేస్తున్నాం. ప్రస్తుతం అమల్లో ఉన్న సీఎఫ్‌ఎంఎస్‌ విధానం ద్వారా భూములిచ్చిన రైతులకు బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం నుంచి నేరుగా వారి ఖాతాలకే కౌలు జమ పడుతోంది. జమ పడిన సమాచారం వారి చరవాణీలకు  అందుతుంది. వరుసగా పదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లిస్తారు. ఇప్పటికే మొదటి సంవత్సరం కౌలు తీసుకున్న వారి ఖాతాలకు రెండో ఏట కౌలు జమ చేస్తున్నాం. మంగినపూడి గ్రామంలో 30 ఎకరాలకు సంబంధించి 21 మంది రైతులకు, తపసిపూడిలో 86 ఎకరాలకు నిమిత్తం 21, గోపువానిపాలెంలో 26 ఎకరాలకు 11, కరగ్రహారంలో 56 ఎకరాలకు 30 మందికి రెండో సంవత్సరపు కౌలు చెల్లిస్తున్నాం. తాజాగా నాలుగు గ్రామాల పరిధిలో మొత్తం 184 ఎకరాలకు 88 మంది రైతులకు మొదటి సంవత్సర కౌలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీరికి మరో తొమ్మిది సంవత్సరాల పాటు కౌలు చెల్లిస్తారు.

Link to comment
Share on other sites

భూమి కొనుగోలుకు రంగం సిద్ధం
వారం వ్యవధిలో సమకూరనున్న రూ. 200 కోట్లు
నెలాఖరులోపు రూ. 1,400 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకుల సంసిద్ధత
కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే
kri-top2a.jpg

బందరు ఓడరేవుకు అవసరమైన పట్టా భూములను సమకూర్చుకునేందుకు మచిలీపట్నం పట్టణాభివృద్ది సంస్థ (ముడ)  రంగం సిద్ధం చేసింది. అమరావతిలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముడకు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసిన క్రమంలో  భూముల కొనుగోలు అంశంపై దృష్టి సారించింది. భూముల కొనుగోలు నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి  నుంచి ముడకు సర్దుబాటు ఇచ్చేందుకు అంగీకరించిన రూ. 200 కోట్లు వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క రూ. 1,400 కోట్లకు సంబంధించి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సంసిద్ధం కావడంతో ఆ మొత్తం కూడా నెలాఖరులోపు సమకూరే అవకాశం ఉంది. భూమి కొనుగోలు ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఇప్పటికే ముడ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను సమకూర్చుకొనే ప్రక్రియలో ప్రభుత్వ పరంగా దక్కిన సానుకూలతలు ఆచరణలోకి రానున్నాయి. రైతుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని పట్టా భూములను తీసుకునేందుకు ప్రభుత్వం ముడ ద్వారా భూముల కొనుగోలు పథకానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఎకరాకు రూ.25 లక్షల ధర నిర్ణయించగా అందుకు మంత్రివర్గం ఆమోదం కూడా లభించింది. భూముల కొనుగోలుకు అవసరమైన మొత్తంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి రుణంగా పొందేందుకు ముడ చేపట్టిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. బ్యాంకుల నుంచి రుణం అందే లోపు భూముల కొనుగోలు ప్రారంభించాలన్న లక్ష్యంతో ముడ ఛైర్మన్‌ వేదవ్యాస్‌, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు రూ.200 కోట్లు సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కోరారు. ఆయన సూచన మేరకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) నుంచి రూ.200 కోట్లు సర్దుబాటు చేయాల్సిందిగా జీవో కూడా జారీ అయ్యింది. ఈ విషయంలో కొంత స్పష్టత లేకపోవడంతో  పీసీబీ ఇంకా నిధులు విడుదల చేయలేదు. అమరావతిలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రభుత్వ కార్యదర్శి సతీష్‌చంద్ర, మంత్రి రవీంద్ర, ఛైర్మన్‌ వేదవ్యాస్‌, సంబంధిత అధికారులు సమావేశమై చర్చించారు. అనంతరం   జరిగిన సమావేశంలో కూడా రూ.200 కోట్లు విడుదల చేయాలని సూచించడంతో పాటు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లింపులకు సంబంధించిన జీవో విడుదల చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు భూముల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపునకు జీవో కూడా విడుదల చేయాలని సూచించారు. ఫలితంగా పీసీబీ నుంచి రావాల్సిన నిధులు వారం వ్యవధిలో ముడకు అందనున్నాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఇండియన్‌ బ్యాంకులకూ ముడకు రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆ మొత్తం కూడా ఈ నెలాఖరులో సమకూరనుంది.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ముడ
భూముల కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శంగా నిర్వహించేందుకు ముడ ప్రతేకంగా ముడ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను రూపొందించింది. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు చేసే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. భూముల స్వభావం, సబ్‌ డివిజన్ల వారీ పరిస్థితి, అనుభవదారులు, భూములకు సంబంధించిన ధ్రువపత్రాలను ఎటువంటి ఆలస్యం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సరిచూసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన నగదు విషయంలో కూడా ఎటువంటి అలక్ష్యాలకు తావులేకుండా నేరుగా వారి ఖాతాలకే జమపడే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నిర్వహణకు అవసరమైన సంబంధిత శాఖల అనుమతులు కూడా పొందారు. రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా చేయాలన్న లక్ష్యంతో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ముడ కోసం గదిని ఏర్పాటు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవసరమైన కంప్యూటర్‌లు, స్కానర్‌లు, తదితరాలను ముడ పరంగా సమకూర్చారు. ఈనెలలో భూముల కొనుగోలులో పురోగతి సాధించాలన్న లక్ష్యంతో యంత్రాంగం కార్యచరణ చేపడుతోంది.

Link to comment
Share on other sites

ధర ఖరారు
పోర్టు  ప్రతిపాదిత భూములకు వర్తింపు
జీవో నెం.143 ద్వారా ఆదేశాలు జారీ
kri-top2a.jpg

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: పోర్టు ప్రతిపాదిత భూములను కొనుగోలు చేసేందుకు ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎకరాకు రూ.25 లక్షలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టు, ఇతర మౌలిక వసతులకు అవసరమైన నాలుగు గ్రామాల పరిధిలోని రమారమి 2 వేల ఎకరాలకు  ఈ ధర వర్తించనుంది. భూమి కొనుగోలు పథకం ద్వారా పట్టా భూములకు చెల్లించే ధర విషయంలో ఎటువంటి ఊహాగానాలకు తావు లేకుండా జీవో నెం.143ను ప్రభుత్వం విడుదల చేసింది. పోర్టుకు అవసరమైన భూములు సమకూర్చుకొనే విషయంలో నెలకొన్న జాప్యానికి తెరపడే అవకాశం ఏర్పడింది.

కీలక నిర్ణయాలు
* రాష్ట్రానికి కీలకం కానున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల సమకూర్చుకునేందుకు ప్రభుత్వం 2015 ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రైతుల్లో సానుకూలత కనిపించకపోవడంతో రాజధాని తరహాలో భూ సమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌)కు అవకాశం కల్పించింది. భూసేకరణ నోటిఫికేషన్‌ గడువు రెండు విడతలు పొడిగించినా పోర్టుకు అవసరమైన భూములు సమకూరలేదు. తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్‌ గడువు కూడా ముగిసింది.‌్ర ల్యాండ్‌పూలింగ్‌ పట్ల ఆదరణ తక్కువగా ఉండటం, భూములు సమకూర్చుకోవడంలో మితిమీరిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ) ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారా 2,159.25 ఎకరాల పట్టా భూముల కొనుగోలు అవకాశాన్ని పరిశీలించడంతో పాటు ధర నిర్ధరక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.
భూమి కొనుగోలు పథకం పట్ల ముఖ్యమంత్రి కూడా చొరవ చూపడంతో ధరను నిర్ధరించేందుకు ప్రభుత్వం జేసీ ఛైర్మన్‌గా, ముడ వీసీ కన్వీనర్‌గా, పోర్టు డైరెక్టర్‌, బందరు ఆర్డీవో సభ్యులుగా సంప్రదింపుల కమిటీని నియమిస్తూ గడచిన మేలో ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ (పోర్ట్స్‌) శాఖ ఆదేశాలు జారీ చేసింది.
భూమి యజమానులు, అనుభవదారులతో సంప్రదింపులు నిర్వహించిన కమిటీ ఎకరాకు రూ.25 లక్షల ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి నివేదించింది. ముఖ్యమంత్రి కూడా సమ్మతించడంతో ఈ ధర చెల్లించేందుకు  గడచిన కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది.
కేబినెట్‌ నిర్ణయానంతరం ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎకరాకు రూ.25 లక్షల ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి  అజయ్‌జైన్‌  జీవో ఆర్టీ నెం.143ను సోమవారం విడుదల చేశారు.
పోర్టు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదించిన మచిలీపట్నం మండలానికి చెందిన మంగినపూడి, కరగ్రహారం, గోపువానిపాలెం, తవిశిపూడి గ్రామాల పరిధిలోని 2,159 ఎకరాల 25 సెంట్ల భూమికి ఈ ధర వర్తించనుంది.

సిద్ధం కానున్న నిధులు
భూమి కొనుగోలు పథకం కింద భూములు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను ముడ బ్యాంకుల నుంచి రుణంగా పొందాల్సి ఉంది. బ్యాంకు రుణం పొందేలోపు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రూ. 200 కోట్లను ముడకు సర్దుబాటు చేయాల్సిందిగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ఆదేశించారు. సర్దుబాటు విషయంలో ఉన్న కొన్ని అస్పష్టతలు ఇటీవల నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో తొలగిపోయాయి. దసరా సెలవుల అనంతరం నిధులు ముడకు సర్దుబాటు కానున్నాయి. ముడకు రమారమి రూ.1,400 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌బ్యాంకు, విజయా బ్యాంకులు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకులు చొరవ చూపాయి. ఆంధ్రాబ్యాంకు ఈడీ, ఎండీ ఈనెల 22న ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి పొందారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం రుణ విషయం కూడా సానుకూలం కానుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...