Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

ఎట్టకేలకు మచిలీపట్నం పోర్టు పనులు

 

7న ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు

4ap-state3a_2.jpg

ఈనాడు, అమరావతి: అనేక అవరోధాలు అధిగమించి ఎట్టకేలకు ఈనెల 7న మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి. ఎనభై శాతానికిపైగా భూ సేకరణ పూర్తయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ప్రకారం 5,300 ఎకరాలు అవసరం. ప్రతిపాదిత గ్రామాల పరిధిలో 3వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. భూ సమీకరణ పథకం (ఎల్‌పీఎస్‌), భూ కొనుగోలు పథకం (ఎల్‌పీఎస్‌) కింద 1,700 నుంచి 1,800 ఎకరాలను మచిలీపట్నం నగరాభివృద్ధి సంస్థ (ముడా) రైతుల నుంచి సేకరించింది. మిగతా భూమిని కూడా సమీకరిస్తోంది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇప్పటికే రూ.200 కోట్ల ఆర్థిక సాయాన్ని ముడాకు అందించింది. మరో 1,350 కోట్లను ప్రభుత్వ హామీపై ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పోర్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ సిద్ధమైంది. డ్రెడ్జింగ్‌ యంత్రాలు కూడా చేరుకున్నాయి. గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రాజెక్టు: మచిలీపట్నం పోర్టు
విస్తీర్ణం: 5,300 ఎకరాలు
మొదటి విడత అంచనా వ్యయం: రూ.11,924 కోట్లు
బెర్త్‌లు: 15
ట్రాఫిక్‌ అంచనా: ఏటా 16.0 మెట్రిక్‌ టన్నుల నుంచి 260 మెట్రిక్‌ టన్నులు
దిగుమతులు: థర్మల్‌, కుకింగ్‌ కోల్‌, కంటైనర్‌ కార్గో, సాధారణ సరకులు, ఎడిబుల్‌ ఆయిల్‌
ఎగుమతులు: ఐరన్‌ ఓర్‌, థర్మల్‌ కోల్‌, స్టీల్‌, అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వస్తువులు

 

Link to comment
Share on other sites

  • Replies 518
  • Created
  • Last Reply
పోర్టు నిర్మాణంతో మచిలీపట్నానికి కొత్త రూపు 

7న ముఖ్యమంత్రిచే శంకుస్థాపన

amr-brk5a_47.jpg

ఆటోనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: చరిత్రలో నిలిచిపోయేలా పోర్టు నిర్మాణం చేపడతామని, దీంతో మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయని, మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ అన్నారు. ఆటోనగర్‌ వంద అడుగుల రోడ్డులోని ఓ హోటల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మొదట బెర్త్‌ కట్టి ఓడను తీసుకురావడానికి పద్దెనిమిది నెలలు పడుతుందన్నారు. మొదట రెండు బెర్తులను 18 నెలల్లో నిర్మించి.. తరవాత మిగిలిన బెర్తులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత రాజధాని అమరావతికి, తెలంగాణకు కూడా దగ్గరలో ఉన్న మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తే పరిశ్రమలు వస్తాయని భావించి పనులు చేపట్టారన్నారు. చంద్రబాబు ‘ముడా’ ఏర్పాటు చేసి రూ.250 కోట్లు ఇచ్చారని, రూ.1380 కోట్లు బ్యాంకర్ల ద్వారా రుణం తీసుకోవడానికి గ్యారంటీ ఇవ్వడానికి ప్రభుత్వం  ముందుకొచ్చిందని వేదవ్యాస్‌ తెలిపారు. వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి ఏడు వేల ఎకరాలను నోటిఫై చేసి, ముడాకు ఇచ్చారని గుర్తుచేశారు. అంతకుముందు 33వేల ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి తీసుకొందని, తాను ముడా ఛైర్మన్‌ అయిన తరువాత డీ నోటిఫై చేసి, దేనికి ఎంత అవసరమో అంత వరకే తీసుకొని మిగిలింది రైతులు అమ్ముకోచ్చు, కొనుకోవచ్చు అన్నట్లుగా జీఓ సడలింపు చేశామని వెల్లడించారు. రాబోయే రెండు, మూడేళ్లల్లో మచిలీపట్నం కొత్త రూపును సంతరించుకుంటుందని, 45వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. వీరందరికీ నాలుగైదు చోట్ల ముడా తరఫున టౌన్‌షిప్‌లు కూడా నిర్మించనున్నట్లు ముడా ఛైర్మన్‌ తెలిపారు. సాగరమాల కింద రూ.1500 కోట్లు మంజూరు అయ్యాయని, దీని ద్వారా రహదారుల అనుసంధానం పెరుగుతుందని పేర్కొన్నారు.

 

Link to comment
Share on other sites

బందరు పోర్టు నిర్మాణానికి తొలి అడుగు 

 

నేడు పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: ఎంతో కాలంగా ఎదురుచూస్తూ వచ్చిన మచిలీపట్నం(బందరు) ఓడరేవు నిర్మాణానికి తొలి అడుగులు పడుతున్నాయి. బ్రిటీషు కాలంలోనే జలరవాణాలో ప్రపంచస్థాయిలో ప్రత్యేకత చాటుకున్న మచిలీపట్నం పూర్వవైభవం సంతరించుకోనుంది. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసిన ప్రజల ఆకాంక్షను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. మేకావానిపాలెం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు పలు మధ్యభారత రాష్ట్రాలకు సైతం మచిలీపట్నం చేరువ కావడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ పోర్టు నిర్మాణం చేపడుతున్నారు. ఏడాదిన్నరలో రేవులోకి తొలి ఓడ రానున్నట్లు మంత్రి రవీంద్ర ఇప్పటికే ప్రకటించారు. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. రూ.11,924కోట్లు పోర్టుకు వెచ్చించనుండగా తొలిదశలో రూ.6,778కోట్లు ఖర్చుచేస్తారు. రేవుతో పాటు రూ.72కోట్లతో నిర్మించిన కృష్ణా విశ్వవిద్యాలయ భవనాలు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టనున్న రూ.67.23కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

 

Link to comment
Share on other sites

కల ఫలిస్తున్న వేళ
07-02-2019 07:31:34
 
636851214951056516.jpg
  • బందరు పోర్టు పనుల ప్రారంభం నేడు
  • ఫలించిన ఉద్యమాలు
  • మూడు జిల్లాల అభివృద్ధికి ఇదే పునాది
  • పూర్తయితే యువతకు ఉపాధి అవకాశాలు
  • మచిలీపట్నానికి పూర్వ వైభవం
 
జిల్లావాసుల కల ఫలించే సమయం ఆసన్నమయింది. మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే పోర్టు నిర్మాణానికి గురువారం పునాది రాయి పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు పనులను ప్రారంభించనున్నారు. ఈ పనులు పూర్తయితే కృష్ణాతోపాటు పొరుగు జిల్లాలకూ అభివృద్ధి ఫలాలు అందుతాయి. శాతవాహనుల కాలంలో ఓడ రేవుగా.. విదేశీ వాణిజ్య కేంద్రంగా వెలిగిన మచిలీపట్నం మళ్లీ ఆ వైభవాన్ని సొంతం చేసుకుంటుంది.
 
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం: దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న బందరు పోర్టు నిర్మాణానికి గురువారం అంకురార్పణ జరగనుంది. ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు పోర్టు పనులను ప్రారంభించనున్నారు.పోర్టు పనులు పూర్తయితే జిల్లాలోని మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, కైకలూరు
నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
 
చరిత్ర ఎంతో ఘనం
రెండు వేల సంవత్సరాల క్రితమే మచిలీపట్నం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. అప్పట్లో మైసోలియా పట్టణంగా పేరుగాంచిన బందరు నుంచి పర్షియా, మెసపుటోమియా, శ్రీలంకలతోపాటు మధ్య ఆసియా, తూర్పు ఆసియాలకు చెందిన పలు దేశాలకు వర్తక, వాణిజ్యాలు సాగుతుండేవి. శాతవాహనులు, విష్ణుకుండినులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో వాణిజ్యం బాగా జరిగేది. ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనలోకి భారతదేశం వచ్చిన తర్వాత యూరప్‌, ఇతర కామన్‌వెల్త్‌ దేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరుగుతుండేవి. ప్రధానంగా బంగారం, సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుండేవి. పట్టు వస్త్రాల ఎగుమతులకు కూడా మచిలీపట్నమే ప్రధాన కేంద్రంగా ఉండేది.
 
దీంతో ఈ ఓడ రేవు దేశ, విదేశాల నుంచి వచ్చే వ్యాపారస్తులు, ప్రజలు, ప్రయాణికులతో కళకళలాడుతూ ఉండేది. అయితే ఈ తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల బందరు పోర్టు పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఒకప్పడు విజయవాడ కంటే అధిక జనాభా ఉండే ఈ ప్రాంతం, ఉపాధి అవకాశాలు లేక క్రమంగా చిన్నబోయింది. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ వలసలు అలానే కొనసాగుతూ ఉన్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సమకూరతాయి. ఈ ప్రాంతం పూర్వ వైభవం సంతరించుకుంటుందనడంలో సందేహం లేదు.
 
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎంపీ
నాలుగున్నరేళ్ల తర్వాత మచిలీపట్నంలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తుండటంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, ముడా చైౖర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ముందుగా మేకావారిపాలెంలో సీఎం ఆవిష్కరించనున్న పైలాన్‌ నిర్మాణాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం పోర్టు పనులు ప్రారంభించే తపశిపూడిలో డ్రెడ్జింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.
 
నేడు సభ.. భారీగా ఏర్పాట్లు
సీఎం పర్యటన నేపథ్యంలో మచిలీపట్నంలోని మేకావారిపాలెంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సభకు మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రుల నుంచి పెద్దఎత్తున జనం హాజరు కానుండటంతో దానికి తగిన విధంగా ఏర్పాట్లను చేశారు. ఎవరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించారు. ఈ సభకు 50 వేల మంది వస్తున్నట్లు యంత్రాంగం అంచనావేయగా.. దానికి తగ్గ విధంగా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారికోసం 600 ఆర్టీసీ బస్సులను పెడుతున్నారు
Link to comment
Share on other sites

ప్రగతికి చుక్కాని 
 

నేడు బందరు పోర్టు పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం 
50 వేల మంది కూర్చొనేలా ఏర్పాటు 
మచిలీపట్నం, న్యూస్‌టుడే

amr-top1a_76.jpg

జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పండగ వాతావరణం నెలకొంది. గురువారం పోర్టు పనులు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా అని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మేకావానిపాలెంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ ప్రాంతంలో వేదిక వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 50 వేల మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నందున వారికోసం జిల్లాలో 600కు పైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రితోపాటు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ముడ ఛైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు వేదికతో పాటు బీచ్‌వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నం చరిత్రలో మరచిపోలేని పండగ రోజు అని అన్నారు. పట్టిసీమను పట్టుదలతో పూర్తిచేసిన ముఖ్యమంత్రి అదే పట్టుదలతో బందరు పోర్టును నిర్మించనున్నారని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌ బూరగడ్డ రమేష్‌నాయుడు, ఏఎంసీ ఛైర్మన్‌ చిలంకుర్తి తాతయ్య, గొర్రెపాటి గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం  పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతే ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మొత్తం రూ.157 కోట్ల అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆరు వేలమంది విద్యార్థులు మూడు రంగుల బెలూన్లతో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారని చెప్పారు. అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.

2,046 మందితో పటిష్ఠ బందోబస్తు 
ముఖ్యమంత్రి పర్యటనకు 2,046 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఆయన సూచనలు చేశారు. వీఐపీలు ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మచిలీపట్నం నుంచి సబాస్థలి వద్దకు వెళ్లేవారు మేకావానిపాలెం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో వాహనాలు నిలుపుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు పోతేపల్లి మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. కాకర్లమూడి, పెడన మీదుగా వచ్చే వాహనాలను డాబాల సెంటరు పార్కింగ్‌లో వాహనాలు నిలపాలన్నారు. జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసులను కూడా బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు ఏఎస్సీలు, 17మంది డిఎస్సీలు, 26 మంది సీఐ, ఆర్‌ఐలు, 94 మంది ఎస్సై, ఆర్‌ఎస్సైలు, 232 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 998 మబంది కానిస్టేబుళ్లు, 139 మంది మహిళా కానిస్టేబుళ్లు 139, 387 మంది హోంగార్డులు, 150 మంది మహిళా హోంగార్డులు కలిపి మొత్తం 2,046 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

 
 

A historic moment in the history of new state of Andhra Pradesh. The Gateway of Prosperity begins with the laying of Foundation on Feb 7 at Machilipatnam Port by Honorable Chief Minister of Andhra Pradesh Sri N. Chandrababu Naidu is beginning of a New Era.

Dyx6amsUUAA4dBY.jpg
Link to comment
Share on other sites

23 minutes ago, sonykongara said:
 
 

A historic moment in the history of new state of Andhra Pradesh. The Gateway of Prosperity begins with the laying of Foundation on Feb 7 at Machilipatnam Port by Honorable Chief Minister of Andhra Pradesh Sri N. Chandrababu Naidu is beginning of a New Era.

Dyx6amsUUAA4dBY.jpg

:super: navayuga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...