Jump to content

Recommended Posts

Posted

What is HcL?

Hindustan Computers Limited ( Private Company, Founded by Shiv Nadar)

 

What does HcL produce?

IT services, IT Consulting, Computer Hardware

  • Replies 73
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted

 

Thammai...kusalama.....eeda Trump flight ekkinchetattunte nuvvu India llo nannu train kindha thoselaaga unnavga...MS1.gif

 

HCL racisam badithudini annai.... :dream:

Posted
ఈ ఉగాదికి నవ్యాంధ్రలో రెండు భారీ కంపెనీలకు శంకుస్థాపనలు...

 

 
hcl-hero-companies-13032017.jpg
share.png

నవ్యాంధ్రకు కీలకమైన భారీ కంపెనీలు రానున్నాయి. ఈ ఉగాదికి ఈ రెండు కంపెనీలు శంకుస్థాపన చేయ్యనున్నాయి. ఇప్పటికే చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దులోని శ్రీ సిటీ సెజ్‌కు సమీపంలో హీరో మోటార్‌ కార్ప్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూమిని కేటాయించింది. తనకు కేటాయించిన భూమిని గురువారం రిజిస్ర్టేషన్‌ చేసుకుంది. ఎన్నో అడ్డంకులను దాటుకుని, హీరో కంపెనీ ఉగాదికి శంకుస్థాపనకు సిద్ధం అయ్యింది. ఇక్కడ ప్రొడక్షన్ మొదలైతే, రాష్ట్రంలోనే హీరో ద్విచక్ర వాహనాలు తయారవుతాయి.

Advertisements

అలాగే, సాఫ్ట్-వేర్ దిగ్గజం, HCL అమరావతిలో తన కార్యకలాపాలను చేపట్టేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. గన్నవరం సమీపంలో డెవల్‌పసెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. దానికోసం ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం సమీపంలో 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని హెచ్‌సీఎల్‌ అధినేత నాడర్‌ కూడా పరిశీలించారు. ఈ సంస్థ కూడా, ఉగాది నాటికి శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉంది.

ఈ రెండు కంపెనీల రాకతో, అటు ఆటోమొబైల్ రంగం, ఇటు సాఫ్ట్-వేర్ రంగాలకు రాష్ట్రంలో మంచి రోజులు రానున్నాయి. ఈ పెద్ద కంపెనీల రాకతో, మరిన్ని దిగ్గజ కంపెనీలు రాష్ట్రం వైపు చూడనున్నాయి. ఇప్పటికే, హ్యుండాయ్‌ కార్ల తయారీలో ప్రముఖ స్థానం పొందిన కొరియాకు చెందిన ‘కియ’కంపెనీ కూడా రాష్ట్రంలో ప్లాంట్ పెట్టటానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

  • 2 months later...
Posted
జూన్‌ 2న ‘హీరో’ శంకుస్థాపన
 
  • అడ్డంకులు దాటుకుని భూ స్వాధీనం పూర్తి
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): బాలారిష్టాలన్నింటినీ దాటుకుని హీరో మోటో కార్ప్‌ రాష్ట్రంలో తన ప్లాంటు ఏర్పాటుకు సిద్ధమైంది. వచ్చే నెల 2న శంకుస్థాపన చేయబోతోంది. శ్రీసిటీకి సమీపంలో ఈ కంపెనీకి ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ భూమి వివాదాల్లో ఉండడంతో పరిశ్రమల శాఖ సాయ పడింది.
Posted

First Major Industry to AP on Bifurcation Day June 2nd is the appointed day of which Andhra Pradesh and Telangana came into existence. On June 2nd this year, we are arriving at three years of the State Division. Call it a coincidence, the first major industry to AP after the bifurcation will have its foundation that day. Hero Motocorp will be laying the foundation stone for its new plant near Sri City on that day. The Plant construction is delayed till now as the land allotted to the plant got entangled in legal hurdles until now and finally they are cleared. The plant coming up will have an annual capacity of 1.8-2 million units and the company is planning to invest 1600 Crore for the plant. This legal tangle delayed the construction by about a year. Hero Motocorp plans to complete the first phase by 2018 and it will create employment for 6500 people with 1600 Crore investment.

 

  • 1 month later...
Posted

జులైలో అడుగు పెట్టనున్న ‘హీరో’!

భూమార్పిడి పనులు పూర్తి

మాదన్నపాలెం వద్ద 600 ఎకరాల్లో ఏర్పాటు

రూ.3200 కోట్ల పెట్టుబడి

15వేల మందికి ఉద్యోగావకాశాలు

ఈనాడు - అమరావతి

చిత్తూరు జిల్లాలో వచ్చే నెల ‘హీరో’ మోటార్స్‌ కాలు మోపనుంది. సత్యవేడు మండలం శ్రీసిటీకి సమీపంలోని మాదన్నపాలెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్‌ తదితర కార్యక్రమాలు ముగించుకున్న ఆ సంస్థ జులైలో ఈ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే శంకుస్థాపనకు సంబంధించి ఒక తేదీని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కియా లాంటి భారీ ఆటోమొబైల్‌ పరిశ్రమ అడుగు పెట్టడం, ఇప్పుడు హీరో సంస్థ కూడా శంకుస్థాపనకు సిద్ధం కావడంతో రాష్ట్ర ఆటోమొబైల్‌ రంగానికి ఇదో మంచి పరిణామంగా పరిశ్రమలశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రత్యేకతలు..

* హీరో మోటార్స్‌ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతుంది.

* 2018నాటికి సంవత్సరానికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం గల ప్లాంటును నిర్మిస్తారు.

* 2020నాటికి రెండో ప్లాంటును నిర్మిస్తారు. రెండు దశల్లో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడి పెడతారు.

* రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారవుతాయి.

* 2025కల్లా ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అభివృద్ధి చేస్తారు.

* విడిభాగాల తయారీ యూనిట్‌ రూ.1600 కోట్లతో ఏర్పాటు.

* మొత్తంగా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

* ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ఆ సంస్థకు ఎనిమిదోది కానుంది.

  • 1 month later...
Posted
కాగా, హీరోమోటార్‌ కార్ప్‌కు అనుబంధ సంస్థ అయిన రాక్‌మెన్‌ ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలో రూ.540 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంని కలిశారు. ఈ గ్రూప్‌ చిత్తూరు జిల్లాలో తన ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

 

హీరో మోటర్‌ కార్ప్‌, ఫోర్డ్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ అవసరాలను తమ సంస్థ తీరుస్తోందని, ఏపీలో ఏర్పాటు చేసే ప్లాంటు ద్వారా 4000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏపీలో తమ ఉత్యాదక యూనిట్‌ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు కావాల్సిన అల్యూమినియం డైకాస్ట్‌ భాగాలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. తమ ప్రాజెక్టును మూడు దశల్లో నెలకొల్పుతామని అన్నారు. మొదటిదశలో 2019 నాటికి రూ.300 కోట్ల పెట్టుబడులతో 600 నుంచి 700 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భూ కేటాయింపులు జరిగిన నెలరోజుల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాను భారతదేశానికే లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.

Posted
Rockman Industries to set up Rs 540 cr plant in Andhra

IANS  |  Amaravati  August 11, 2017 Last Updated at 18:56 IST

  •  

 

Rockman Industries Ltd, an auto components manufacturer, will up an aluminium die-casting plant in Chittoor district of Andhra Pradesh with an investment of Rs 540 crore.

Chief Minister N. Chandrababu Naidu on Thursday accepted their proposal. The proposed investment will be made over six years, generating 1,600 direct jobs.

 

V. Veerappan, Director of Rockman Industries, met Naidu in the presence of Andhra Pradesh Economic Development Board (APEDB) CEO Jaasthi Krishna Kishore and discussed the proposal for the production of die-cast parts along with other components for the two and four-wheeler market.

The expected turnover from the facility would be around Rs 600 crore per year, said a statement from the Chief Minister's Office.

A part of Hero Group, Rockman manufactures motorcycle parts and four wheeler alloys at their plants in Ludhiana, Bawal and Chennai. It has a turnover of Rs 2,105 crore and employs over 4,000 people throughout India.

  • 3 months later...
Posted
హీరో పనులు షురూ
26-11-2017 02:02:18
 
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘హీరో’ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో 600 ఎకరాలను ‘హీరో మోటార్‌ కార్ప్‌’కు ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంస్థ ప్లాంటు ఏర్పాటును వాయిదా వేస్తూ వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదంటూ పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి, శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్‌ ఎప్పటికప్పుడు హీరో ప్రతినిధులతో చర్చిస్తూనే ఉన్నారు. శుక్రవారం మరో దఫా సంప్రదింపులు జరిపిన మంత్రి... మున్ముందు మంచి రోజులు లేనందున తక్షణమే భూమిపూజ చేయాలని సూచించారు. ఈ సూచన మేరకు హీరో సంస్థ శనివారం భూమి పూజ చేసింది.
Posted
1 hour ago, sonykongara said:
హీరో పనులు షురూ
26-11-2017 02:02:18
 
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘హీరో’ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో 600 ఎకరాలను ‘హీరో మోటార్‌ కార్ప్‌’కు ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంస్థ ప్లాంటు ఏర్పాటును వాయిదా వేస్తూ వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదంటూ పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి, శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్‌ ఎప్పటికప్పుడు హీరో ప్రతినిధులతో చర్చిస్తూనే ఉన్నారు. శుక్రవారం మరో దఫా సంప్రదింపులు జరిపిన మంత్రి... మున్ముందు మంచి రోజులు లేనందున తక్షణమే భూమిపూజ చేయాలని సూచించారు. ఈ సూచన మేరకు హీరో సంస్థ శనివారం భూమి పూజ చేసింది.

:super:

Guest Urban Legend
Posted

finally

nd asusual news channels silent abt ap development news

Posted
6 minutes ago, Urban Legend said:

finally

nd asusual news channels silent abt ap development news

Alla bratuke antaga lite teesukovatame

Posted

మొదలైన హీరో ప్లాంట్ నిర్మాణ పనులు... 2019 నాటికి హీరో బైక్...మేడ్ ఇన్ ఆంధ్రా...

   
hero-2612017-1.jpg
share.png

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో, ‘హీరో’ మోటార్స్‌ తన ప్లాంట్ పెడుతున్న సంగతి తెలిసిందే... అయితే, చాలా కారణాల వలన, ప్లాంట్ భూమి పూజు కూడా ఇప్పటివరకు చేసుకోలేదు... దీంతో ఈ ప్లాంట్ మన దగ్గర మొదలవుతుందా లేదా అన్న అనుమనాలు వచ్చాయి... ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించటంతో, ‘హీరో మోటార్‌ కార్ప్‌’ రంగలోకి దిగింది... పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి, శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్‌ ఎప్పటికప్పుడు హీరో ప్రతినిధులతో చర్చిస్తూనే ఉన్నారు. శుక్రవారం మరో దఫా సంప్రదింపులు జరిపిన మంత్రి... మున్ముందు మంచి రోజులు లేనందున తక్షణమే భూమిపూజ చేయాలని సూచించారు. ఈ సూచన మేరకు హీరో సంస్థ శనివారం భూమి పూజ చేసింది....

 

hero 2612017 2

సత్యవేడు మండలం శ్రీసిటీకి సమీపంలోని మాదన్నపాలెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్‌ తదితర కార్యక్రమాలు ముగించుకున్న ఆ సంస్థ జులైలో ఈ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేసుకున్నా, వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు కుదరలేదు. ఇప్పటికే రాష్ట్రంలో కియా లాంటి భారీ ఆటోమొబైల్‌ పరిశ్రమ అడుగు పెట్టడం, ఇప్పుడు హీరో సంస్థ కూడా శంకుస్థాపనకు చేసుకోవటంతో రాష్ట్ర ఆటోమొబైల్‌ రంగానికి ఇదో మంచి పరిణామంగా పరిశ్రమలశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

hero 2612017 3

హీరో మోటార్స్‌ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2018 చివర నాటికి సంవత్సరానికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం గల ప్లాంటును నిర్మిస్తారు. 2020నాటికి రెండో ప్లాంటును నిర్మిస్తారు. రెండు దశల్లో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడి పెడతారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారవుతాయి. 2025కల్లా ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అభివృద్ధి చేస్తారు. విడిభాగాల తయారీ యూనిట్‌ రూ.1600 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ఆ సంస్థకు ఎనిమిదోది కానుంది.

  • 3 months later...
Posted

E plant lo Electric vehicles produce cheddam ani plan change chesaru ani chadiva valla documents lo..

If so major win compared to what we initially signed for...

 

:super:

Posted

రాష్ట్రంలో ఉన్న నిజమైన హీరోని చూసి, హీరో వచ్చేస్తుంది... 23నే ముహూర్తం...

   
hero-20032018-1.jpg
share.png

ఇది మూడు గంటల సినిమా కాదు... ఇలా ఒక పాటలో, జీరో నుంచి, హీరో అయ్యి, నాలుగు పంచ్ డైలాగ్ లు చెప్పి, జేజేలు కొట్టించుకోటానికి... ఇది వాస్తవం... దగా పడ్డ ఆంధ్రుడిని ముందుండి, తన కష్టంతో, తన తెలివితేటలతో, మన రాష్ట్రానికి జరుగుతున్న పునర్నిర్మాణం... 67 ఏళ్ళ వయసులో, తన కుటుంబాన్ని వదిలి, 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం, ఢిల్లీ చేస్తున్న కుట్రలు, మన రాష్ట్రంలోని తోడేళ్ళను తట్టుకుని, నిలబడి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు గారి సత్తా... అందుకే ఆయన్ను రీల్ హీరో కాదు, నిజమైన హీరో అంటుంది... ఈ నిజమైన హీరోని చూసి, ఆటోమొబైల్ దిగ్గజం హీరో కంపెనీ మన రాష్ట్రానికి వస్తుంది...

 

hero 20032018 2

ఎన్నో అడ్డంకులు దాటుకుని, మార్చి 23న ప్లాంట్ కు శంకుస్థాపన చెయ్యనున్నారు... హీరో కంపెనీ తమ ప్లాంటును దక్షిణభారతదేశంలో పెట్టడానికి సిద్ధమవగానే ఆంధ్రాతోపాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచాయి. ఈ ప్రాజెక్టును పట్టుబట్టి సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చారు. సత్యవేడు మండలం శ్రీసిటీకి సమీపంలోని మాదన్నపాలెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

hero 20032018 3

హీరో మోటార్స్‌ దశలవారీగా రూ.3200 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2019 చివర నాటికి సంవత్సరానికి 5 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం గల ప్లాంటును నిర్మిస్తారు. 2020నాటికి రెండో ప్లాంటును నిర్మిస్తారు. రెండు దశల్లో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడి పెడతారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల వాహనాలు తయారవుతాయి. 2025కల్లా ఏటా 18లక్షల మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసే దిశగా అభివృద్ధి చేస్తారు. విడిభాగాల తయారీ యూనిట్‌ రూ.1600 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ఆ సంస్థకు ఎనిమిదోది కానుంది

Posted
4 minutes ago, RKumar said:

Chittoor & Nellore lo maximum industries vasthunnayi don't know if these districts people support TDP.

edi naku ardham kavatala, ATP ki  oka kia tone chala marpu vacchidi

Posted
11 minutes ago, sonykongara said:

edi naku ardham kavatala, ATP ki  oka kia tone chala marpu vacchidi

Ave avtayi brother nothing to worry, people will realize once ground work has started

Avvakapothe janala karma manaki chetanayyindi manam chesukuntu velladame, hard work always pays off

Posted
40 minutes ago, BalayyaTarak said:

Ave avtayi brother nothing to worry, people will realize once ground work has started

Avvakapothe janala karma manaki chetanayyindi manam chesukuntu velladame, hard work always pays off

Yeah. Cellphone plants mostly jobs are giving to local people Nd ladies more so effect will be their whoever benefited from those projects 

Posted
ఏపీలో ‘హీరో’.. రేపు భూమిపూజ
22-03-2018 03:24:21
 
  • 3200కోట్ల పెట్టుబడి... 15వేల మందికి ఉపాధి
 
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రారంభం కానుంది. దేశంలోనే ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న అతిపెద్ద సంస్థ హీరో మోటోకార్ప్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంసీఎల్‌)కు శుక్రవారం చిత్తూరు జిల్లాలో భూమిపూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. సత్యవేడు మండలం మాదన్నపాలెం గ్రామంలో 600 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సంస్థ రూ.1,600కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. అదనంగా మరో రూ.1,600కోట్లను సంస్థకు అనుబంధ పరికరాల తయారీ యూనిట్లపై పెట్టుబడి పెడుతుంది. దీనిద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు 15,000మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిన కొద్దినెలల్లోనే హీరో సంస్థను రాష్ట్రానికి రప్పించడంలో ప్రభుత్వం విజయం సాధించింది.
 
దీన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేసినా అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జేఎ్‌సవీ ప్రసాద్‌ ఈ సంస్థతో జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. 2014 సెప్టెంబరు 16న హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ‘హీరో’కూ రాష్ట్ర పరిశ్రమల శాఖకూ మధ్య సీఎం సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది. అయితే ఈ సంస్థకు అప్పగించిన భూమి వివాదాల్లో ఉండటంతో న్యాయస్థానం సమ్మతి మేరకు పూర్తిస్థాయిలో భూమిని ఇచ్చారు. ఈలోపు ఈ సంస్థతో ఇతర రాష్ట్రాలూ సంప్రదింపులు నెరుపుతూ వచ్చాయి. అయితే.. రాష్ట్రం నుంచి హీరో సంస్థ బయటకు వెళ్లకుండా పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌ నిరంతరం సంప్రదింపులు జరిపారు. కాగా, శుక్రవారం నిర్వహించే భూమిపూజకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌. అమర్నాథరెడ్డి, ఉన ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...