Jump to content

Hero to invest Rs 3000 cr in new Andhra unit


Recommended Posts

హీరో మోటర్స్ పరిశ్రమకు భూమిపూజ చేసిన చంద్రబాబు
23-03-2018 12:51:21
 
636574062806797692.jpg
చిత్తూరు: సత్యవేడు మండలం మాదన్నపాలెంలో హీరో మోటర్స్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. సత్యవేడు మండలం మాదన్నపాలెం గ్రామంలో 600 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సంస్థ రూ.1,600కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. అదనంగా మరో రూ.1,600కోట్లను సంస్థకు అనుబంధ పరికరాల తయారీ యూనిట్లపై పెట్టుబడి పెడుతుంది. దీనిద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు 15,000మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిన కొద్దినెలల్లోనే హీరో సంస్థను రాష్ట్రానికి రప్పించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి హీరో మోటర్స్ చైర్మన్ పవన్ ముంజాల్, మంత్రి అమరనాథ్ రెడ్డి హాజరైనారు.
Link to comment
Share on other sites

  • Replies 72
  • Created
  • Last Reply

Top Posters In This Topic

వేరే రాష్ట్రానికి వెళ్ళిన హీరో హోండా, ఒక్క గంటలో చంద్రబాబు మన రాష్ట్రానికి ఎలా తెచ్చారో, హీరో మోటార్స్ చైర్మన్ చెప్తున్నారు వినండి...

Super User
23 March 2018
Hits: 1
 
hero-23032018-1.jpg
share.png

రాష్ట్ర నాశనం, చంద్రబాబు పతనం చేస్తున్న సన్నాసుల్లారా, ఒక కంపెనీ మన రాష్ట్రానికి రావాలి అంటే ఎంత కష్టపడాలో చూడండి... ఒక పధ్ధతి ప్రకారం చంద్రబాబు ఒక్కోఒక్కటి నిర్మించుకుంటూ వస్తుంటే, మీరు హైదరాబాద్ నుంచి వచ్చి, రాళ్ళు, బురద జల్లి, మా రాష్ట్రాన్ని నాశనం చేసి, మా రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పి వెళ్ళిపొండి... మీరు వేసిన బురద కడుగుతూ మా టైం వేస్ట్ చేస్తుకుంటూ కూర్చుంటాం... కొంచెం అన్నా సిగ్గు తెచ్చుకోండి... అభివృద్ధి అంతా అమరావతిలోనే అని ఏడ్చిన వారికి కూడా, ఈ రోజు హీరో మోటార్స్ శంకుస్థాపన ఒక చెంప పెట్టు... రాయలసీమలో ఈ కంపెనీ వస్తుంది అంటే, అభివృద్ధి అమరావతిలో జరగటం కాదు... కియా, ఐసుజు వచ్చింది కూడా రాయలసీమలోనే...

 

hero 23032018 1

హీరో మోటార్స్ లాంటి ఒక పెద్ద కంపెనీ మన రాష్ట్రంలో రావాలి అంటే, ఎంత కృషి ఉంటుందో తెలుసుకోండి... ఎన్ని రాష్ట్రాలు పోటీ పడతాయో.. గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల పోటీ, వారికి సహకరించే ఢిల్లీ పెద్దలు, వీరందరినీ తట్టుకుని, హీరో మోటార్స్ లాంటి ఒక పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వచ్చింది.. ఇదే విషయం చంద్రబాబు కాదు, హీరో మోటార్స్ చైర్మన్, పవన్ ముంజాల్ చెప్పారు.. ఈ రోజు హీరో మోటార్స్ శంకుస్థాపనకు వచ్చిన ఆయన, చంద్రబాబు వల్ల వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ కు ఎలా వచ్చిందో చెప్పారు...

hero 23032018 1

"ఒక రోజు, చంద్రబాబు మా ఇంటికి డిన్నర్ కు వచ్చారు... అప్పటికే మేము వేరే రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పటానికి నిర్ణయించుకున్నాం...అప్పటికే అన్ని నిర్ణయాలు అయిపోయి... ఒక రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పటానికి కమిట్ అయ్యాం... కాని చంద్రబాబు అన్ని విషయాలు చెప్పారు.. హీరో ప్లాంట్ మా రాష్ట్రంలో పెట్టండి, అంటూ ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు.. అంతే ఒక్క గంటలో, మా నిర్ణయం మార్చుకున్నాం... చంద్రబాబు లీడ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా కొత్త ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం... చంద్రబాబు సహకారం లేనిదే, ఈ రోజు ఈ ప్లాంట్ ఇక్కడ వచ్చేది కాదు" అంటూ హీరో మోటార్స్ చైర్మన్, పవన్ ముంజాల్ చెప్పారు.. ఇప్పటికైనా మీ కుళ్ళు రాజకీయం ఆపి, చంద్రబాబుకి సహకరించండి... రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఆయన చూసుకుంటాడు...

Link to comment
Share on other sites

In Pawan Munjal speech, he said we will make the plant operational from Dec 2019 after giving a pause, the CM might not be happy with our aim, he may want much more early date... :-D 
that's CBN

 

adantha cut chesi video pedithe

Link to comment
Share on other sites

Employment creation lo CBN is a master, no one can beat him.

Ayana politics loki rakunda Entrepreneur  ayunte just imagine where he would have been with his hard work and mindset, we must be thankful for having such leader (edchevallu edustune untaru just ignore them)

Link to comment
Share on other sites

హీరోకు చంద్రబాబు శంకుస్థాపన
రూ.1600 కోట్లతో 600 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు 

mainbreak84a.jpg

సత్యవేడు: ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం సమీపంలో హీరో మోటార్స్ సంస్థకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.1600 కోట్ల పెట్టుబడితో 600 ఎకరాల్లో ఏర్పాటుకాబోయే ఈ పరిశ్రమ ఆసియా ఖండంలోనే అతిపెద్దదని చెబుతున్నారు. ఇక్కడే విద్యుత్‌ వాహనాలు తయారుచేసేందుకు సంస్థ అడుగు వేస్తున్నట్లు సమాచారం. మరో రూ.1600 కోట్లతో సంస్థకు అనుబంధ పరికరాల తయారీ యూనిట్లపై పెట్టుబడి హీరో పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15వేల మందికి ఉపాధి లభించనుంది.

mainbreak84b.jpg

 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ పరిశ్రమను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రారంభిచాలని హీరో సంస్థను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే అశోక్‌ లేలాండ్‌, అపోలో టైర్స్ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. రాష్ట్రంలో అపార వనరులు ఉన్నాయని.. పరిశ్రమలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. హీరో  సంస్థ రూ.1,600కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి కొరత లేదని.. విద్యుత్‌ సరఫరా కోతలు లేవని చంద్రబాబు తెలిపారు.

mainbreak84c.jpg
Link to comment
Share on other sites

శ్రీ’త్తూరు!
భవిష్యత్తులో సిరులు కురిపించే ప్రాంతమిది
ఆటోమొబైల్‌ క్లస్టర్‌గా చేస్తాం- ప్రత్యేకతల సమాహారంగా ‘హీరో’ నిర్మాణం
ఈనాడు, తిరుపతి, సత్యవేడు,
వరదయ్యపాలెం, న్యూస్‌టుడే:
ctr-top2a.jpg

‘‘చిత్తూరు జిల్లా భవిష్యత్తులో సిరులు కురిపిస్తుంది. వినియోగించుకోవాలనే గాని... ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయి. శ్రీసిటీ అద్భుతమైన టౌన్‌షిప్‌. పారిశ్రామిక కారిడార్‌. మెరుగైన సౌకర్యాలు, వసతులే కాదు... చక్కటి మానవ వనరులు ఈ ప్రాంతం సొంతం. రోడ్డు, రైలు, ఆకాశయానం, సముద్రయాన రవాణా సౌకర్యాలు అత్యంత దగ్గర్లో ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో సిరులు కురిపిస్తుంది. దీన్ని ఆటోమొబైల్‌ క్లస్టర్‌గా తయారు చేసి.. ఈ ప్రాంతంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం’’అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యవేడు మండలం శ్రీసిటీ సమీపంలోని మాదనపాళెంలో నిర్మించబోతున్న హీరో మోటోకార్ప్‌ ఉత్పాదన ప్లాంటు మొదటిదశ పనులకు ఆయన శుక్రవారం హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చిత్తూరుకు ఉన్న అవకాశాలను... ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లోనే....

కారిడార్లు.. రవాణా.. నీళ్లు...
త్వరలోనే విశాఖపట్నం నుంచి తడ వరకు ఒక పారిశ్రామిక కారిడార్‌, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ రాబోతోంది. కృష్ణపట్నం పోర్టు ఎంతో కీలకమైంది. చిత్తూరు జిల్లాకు దీనివల్ల అపారమైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడున్న అభివృద్ధి రెండింతలు అవుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే నాయుడుపేట, పూతలపట్టు మార్గాన్ని ఆరులైన్లకు, శ్రీకాళహస్తి-తడ మార్గాన్ని నాలుగులైన్లకు విస్తరిస్తున్నాం. కృష్ణపట్నం నుంచి బెంగళూరుకు వెళ్లే మార్గం జిల్లాలో కలుస్తుంది. దాన్ని కూడా విస్తరిస్తున్నాం. ఇక తెలుగుగంగ నీరు, హంద్రీ-నీవా నీరు జిల్లాకు రాబోతోంది. దీంతోపాటు పెన్నా, గోదావరి నదుల అనుసంధానం ఇక్కడే జరగబోతోంది. దాని ద్వారా నీటి సమస్య ఉండదు. ఇక పరిశ్రమలకు అనువైన భూమి సిద్ధంగా ఉంది. దీంతో చిత్తూరు జిల్లా పెట్టుబడుల స్వర్గధామం కానుంది.

133 పెద్ద పరిశ్రమలు
జిల్లాకు ఇప్పటికే 133 మెగా పరిశ్రమలు వచ్చాయి. రూ.1400 కోట్ల పెట్టుబడి పెట్టారు. గత మూడేళ్లుగా తీసుకుంటే జిల్లాకు రూ.8,750 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2018 పారిశ్రామిక సమ్మిట్‌లో 62 యూనిట్లు ఎంఓయూలు చేసుకున్నాయి. వాటి వల్ల రూ.25వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 70వేల మందికి ఉపాధి లభించనుంది. ఇది చాలా పెద్ద విషయం. ఆటోమొబైల్‌ రంగంలో హీరోతో పాటు ఇసుజి, అపోలో టైర్స్‌, సిరామిక్‌ ఫ్లోరా, కజారియా, సుధాసుయి, ఏషియన్‌ గ్రానైట్స్‌ వస్తే... ఎలక్ట్రికల్‌ రంగంలో రిలయన్స్‌ జియో, కార్బన్‌, సెల్‌కాన్‌, ఫాక్స్‌టైన్‌ తదితర సంస్థలు, వస్త్ర వ్యాపారంలో అరవింద్‌, షాహిద్‌, ఏకేఆర్‌లు, ఆహార సంస్థలుగా పార్లే, కాంటెనెంటల్‌ కాఫీ, పెప్సీ తదితర సంస్థలు రాబోతున్నాయి. వీటన్నింటి వల్ల చిత్తూరు జిల్లా ఒక మెగా పారిశ్రామిక హబ్‌ కాబోతోంది.

ఇది కొత్త హబ్‌ కాబోతోంది
ఇప్పటికే ఈ ప్రాంతంలో పరిశ్రమలతో పాటు వివిధ విద్యాసంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. అభివృద్ధి అయితే ఆటోమేటిక్‌గా ఇతర సంస్థలు వస్తాయి. ఇప్పుడు ఇలా ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో బంగారం కానుంది. శ్రీసిటీ దేశంలోనే అద్భుతమైన పారిశ్రామిక టౌన్‌షిప్‌. దీనికి సమీపంలోనే ఇప్పుడు హీరో మోటోకార్ప్‌ తరఫున మరో మంచి పరిశ్రమ వచ్చింది. ఏ సమస్య వచ్చినా మా జిల్లా ప్రతినిధులు ఉన్నారు. వారితో కాకపోతే నేను సమస్యను పరిష్కరిస్తాను. అభివృద్ధి విషయంలో అర్ధరాత్రి నాకు ఫోన్‌ చేసినా ఫర్వాలేదు. నేను స్పందిస్తాను.

ప్రతి ఒక్కరూ ప్రచారం చేద్దాం
చిత్తూరు జిల్లాలోని అపార అవకాశాలను వినియోగించుకునేందుకు పారిశ్రామికవేత్తలను పిలుద్దాం. ఇక్కడి పరిస్థితిని వారికి వివరించేలా మనమే నోటి ప్రచారం చేద్దాం. ఎక్కడికెళ్లినా... అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు జిల్లా అవకాశాలను వివరిద్దాం. ఇది మనందరి పని. మనం చేయాల్సిన పని. దీన్ని తక్కువగా అనుకోకండి. దేశంలోని బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌గా తయారు చేసేందుకు మన వంతు కర్తవ్యం నిర్వహిద్దాం. స్పెషల్‌ ఎంప్లాయిమెంట్‌ జోన్‌గా గుజరాత్‌ తర్వాత మనమే ముందుండాలి. నీరు, విద్యుత్తు, భూమి, రవాణా మనకున్న అవకాశాలు. వాటిని సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి సాధించాలని అందరికీ చెబుదాం.

ప్రకృతి ‘హీరో’
హీరో మోటోకార్ప్‌ ఉత్పాదన ప్లాంటు మొదటి దశ నిర్మాణం పూర్తిగా ప్రకృతిహితంగా జరగనుంది. దీనికి ఇప్పటికే యాజమాన్యం ప్రణాళిక రచించింది. ఎన్నో ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి.

1. హీరో మోటోకార్ప్‌ ప్లాంటు ద్వారా ఉద్యోగాలు
ప్రత్యక్షంగా : 2,000 మందికి
పరోక్షంగా : 10,000 మందికి

2. ప్లాంటు సామర్థ్యం
1.8 మిలియన్‌ యూనిట్లు (ఏడాదికి)

3. ప్రీ ఇంజినీరింగ్‌ నిర్మాణాలు, అత్యాధునిక 3డి టెక్నాలజీ ఇంటీరియల్‌ లోపల అడుగుపెట్టగానే ఒక కొత్తలోకంలోకి తీసుకెళ్లేలా... నిర్మాణాలు జరుగుతాయి.

4. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు
ప్లాస్టిక్‌ను చిన్నచిన్న ముక్కలుగా తరుగుతూ... దానిపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చక్కటి రోడ్లు వేస్తారు. అవి ఎక్కువరోజులు మన్నుతాయి. రోడ్లుపై పడిన నీరు భూమిలో ఇంకిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

5. సోలర్‌, పవన విద్యుత్తు పార్కులు
ప్లాంటు లోపల విద్యుత్తు కోసం సోలార్‌పార్కులు, పవన విద్యుత్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాంటుకు అవసరం అయ్యే విద్యుత్తును దీని నుంచి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల పర్యవరణహితంగా ప్లాంటును నిర్మిస్తారు.

6. అటవీని తయారు చేస్తారు..
ఇది హీరో మోటాకార్ప్‌ పర్యవరణహిత నిర్మాణంలో ఒక భాగం. ఏకంగా తన ప్లాంటులోనే అడవిని తయారు చేయాలని భావిస్తున్నారు. మియావకి టెక్నిక్‌ ద్వారా కృత్రిమ అడవుల్ని తయారు చేస్తారు. వీటిని అంతే శ్రద్ధగా సంరక్షిస్తారు.

Link to comment
Share on other sites

ఏపీ.. మా హీరో
24-03-2018 02:19:31
 
636574547714617966.jpg
  • బాబు మాటతో నవ్యాంధ్ర బాట!
  • ప్లాంటు వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్నాం
  • మా నిర్ణయాన్ని సీఎం గంటలో మార్చారు
  • ఆయన చొరవ, సహకారంవల్లే ఇది సాధ్యం
  • ఏపీకి రావాలని నా మిత్రులకూ సూచిస్తా
  • ‘హీరో’ సీఎండీ పవన్‌ ముంజాల్‌ ప్రకటన
  • కృష్ణపట్నం-కియ మధ్య ఆటోమొబైల్‌ క్లస్టర్‌
  • హీరో రాకతో ఏపీకి ‘పెట్టుబడుల ప్రాధాన్యం’
  • భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వస్తాయి
  • పెట్టుబడులకు అత్యుత్తమంగా నవ్యాంధ్ర
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
  • హీరో ద్విచక్ర వాహన పరిశ్రమకు భూమిపూజ
  • చిత్తూరు జిల్లాలో 600 ఎకరాల్లో రూ.1,600 కోట్లతో ప్లాంటు ఏర్పాటు
 
నిజానికి ఈ ప్లాంటును దక్షిణాదిలోనే మరో రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే చంద్రబాబు ఆ రోజు మా ఇంటికి వచ్చారు. రాత్రి భోజనం చేస్తూ మాట్లాడుకున్నాం. మా నిర్ణయాన్ని మార్చుకుని, ఏపీకొచ్చేలా గంటలోనే మమ్మల్ని ఒప్పించారు.
- పవన్‌ ముంజల్‌
 
 
తిరుపతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ఇసుజు! శరవేగంగా సిద్ధమవుతున్న కియ! ఇప్పుడు... ‘హీరో’! నవ్యాంధ్ర ఆటోమొబైల్‌ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రతిష్ఠాత్మకమైన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో’ పరిశ్రమ ఏర్పాటు లాంఛనంగా ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం వద్ద 600 ఎకరాల్లో ఏర్పాటు కానున్న హీరో మోటార్స్‌ ద్విచక్ర వాహన పరిశ్రమకు సంస్థ సీఎండీ పవన్‌ ముంజల్‌ సమక్షంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. దక్షిణాదిలోనే మరో రాష్ట్రంలో ప్లాంటును ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని... చంద్రబాబు గంటలోనే మార్చుకునేలా చేశారని పవన్‌ ముంజల్‌ తెలిపారు.
 
‘‘నిజానికి... ఈ ప్లాంటును దక్షిణాదిలోనే మరో రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకు న్నాం. ఆ మేరకు అంతా సిద్ధం చేశాం. అయితే... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు మా నివాసానికి వచ్చారు. రాత్రి భోజనం చేస్తూ మాట్లాడుకున్నాం. మా నిర్ణయాన్ని మార్చుకుని, ఏపీకి వచ్చేలా గంటలోనే మమ్మల్ని ఒప్పించారు’’ అని ముంజల్‌ తెలిపారు. ముఖ్యమంత్రి చొరవ, సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. ‘‘రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉంది. ప్రభుత్వ సహకారం లభిస్తోంది. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిందిగా మా మిత్రులకు కూడా సిఫారసు చేస్తాను’’ అని అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇక్కడ హీరో మోటార్స్‌ యూనిట్‌ పూర్తయితే తమ సంస్థ ఏటా 1.1 కోట్ల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు.
 
తరలి రండి: సీఎం
600 ఎకరాల్లో రూ.1600 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్స్‌ ప్లాంటు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిసారిగా ఏపీలో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. హీరో మోటార్స్‌ కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి. అందుకే సీఎండీని ఒప్పించి పరిశ్రమను చిత్తూరు జిల్లాకు తీసుకురాగలిగాం’’ అని చంద్రబాబు వివరించారు. ఏపీలో ఏర్పాటు కానున్నది హీరో మోటార్స్‌ 8వ యూనిట్‌ అని... ఇక్కడ ఏటా 18 లక్షల వాహనాలు తయారు చేస్తారని తెలిపారు. మొత్తం మూడు దశల్లో రూ.1600 కోట్లు పెట్టుబడి పెడతారని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికే ఉత్పత్తులు ప్రారంభించాలని ‘హీరో’ను కోరారు.
 
రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.18.55 లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని, ఈ పరిశ్రమల ద్వారా 44 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. ‘‘రవాణా, విద్యుత్తు సౌకర్యాలతో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి 24 గంటలూ ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులొచ్చినా ఒక్క ఫోన్‌ కాల్‌తో పరిష్కరిస్తాం’’ అని భరోసా ఇచ్చారు. మంచి నాయకత్వం, శాంతిభద్రతలు, వనరులు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో హీరోలాంటి పరిశ్రమలు అనేకం వస్తాయన్నారు. ‘‘ఇప్పటికే చిత్తూరు జిల్లాలో అపోలో టైర్లు, అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీలకు భూమి పూజ జరిగింది. అనంతపురంలో కియ పరిశ్రమ పనులు వేగంగా సాగుతున్నాయి.
 
చిత్తూరు-అనంతపురం, విశాఖ-చెన్నైలతోపాటు కృష్ణపట్నం ఓడరేవు నుంచి బెంగళూరు-చెన్నై మీదుగా పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటవుతుంది’’ అని చంద్రబాబు వివరించారు. కృష్ణపట్నం నుంచి కియ మోటార్స్‌ వరకు చిత్తూరు మీదుగా నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగున్నరేళ్లుగా పరిశ్రమల ప్రగతి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి, శాఖ కార్యదర్శి సాల్మన్‌ అరోకియా రాజ్‌, సిద్ధార్థ జైన్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...