Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

On the birth anniverarsay of KL Rao CBN felicitated Irrigation Team. It was good recognition for many that worked hard.

 

Irrigation dept was proud feel for many sharing their stories of what they achieved even after retirement....Farmers-officers bonding is memorable for many in that department...

 

irrigation antene dorikindi teeneyatam anedi common perception after Jalayagnam start...a stage nunchi koncham a job ki proud feeling vastundi slow ga malli...kani konni daridrapu gabbilalu veladutunai a Jalayagnam fake approvals kakkurti ki alavatu padi maratla.....

 

DEyCrBPVYAAPmap.jpg

 

 

DEyCrBMUwAAtoAd.jpg

 

DEyCq3iUQAA1B8N.jpg

Link to comment
Share on other sites

  • Replies 921
  • Created
  • Last Reply

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు

కేంద్రానికి, కృష్ణా బోర్డుకు లేఖలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మళ్లీ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి చర్చించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి.. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. జలవనరుల మంత్రిత్వ శాఖ కూడా ఈ లేఖను బోర్డుకు పంపింది. ‘గతేడాది కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల గురించి వివరంగా చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మళ్లీ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకొంటామని చెప్పినా ఇప్పటివరకు జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై ఉన్న పాలేరు రిజర్వాయర్‌ నుంచి 5.5 టీఎంసీల నీటిని మళ్లించేలా భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. దీనిపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. తుంగభద్ర నదిపైన సుంకేశుల నుంచి 5.44 టీఎంసీల నీటిని మళ్లించి 55,600 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది’ అని కేంద్రానికి తాజాగా రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ ఈ ప్రాజెక్టులను చేపట్టకుండా చూడాలని కోరింది.

నేడు గోదావరి బోర్డు సమావేశం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. సుమారు 15 అంశాలను అజెండాలో చేర్చారు. అయితే బోర్డు నిర్వహణకు సంబంధించిన మాన్యువల్‌, భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేపట్టి బోర్డు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లపై చర్చ.. ప్రధాన అంశాలని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు

తెలంగాణ నీటిపారుదల శాఖ స్పష్టీకరణ

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

21ap-main15a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరిపై కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, నిర్మాణంలో ఉన్నవి మాత్రమేనని తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేపట్టిన ప్రాజెక్టుల గురించి శుక్రవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. గోదావరిలో ఉన్న 954 టీఎంసీల వాటా నీటిని వాడుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టులను చేపట్టామని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల గురించి బోర్డు అధికారులు ప్రశ్నించగా, ఇది పాత ప్రాజెక్టేనని ఆ రాష్ట్రాధికారులు పేర్కొన్నారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జోషి వారితో ఏకీభవించినట్లు తెలిసింది. బోర్డు నిర్వహణ, సిబ్బంది, నిధులు, వర్కింగు మాన్యువల్‌, గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులు అంశాలపై బోర్డు చర్చించింది. కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, సీతారామ, తుపాకులగూడెం, మిషన్‌ భగీరథ తదితర ప్రాజెక్టులను తెలంగాణ కొత్తగా చేపట్టిందని ఆంధ్రప్రదేశ్‌.. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఏపీ చేపట్టిందని తెలంగాణ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు ఇవ్వాలన్న అంశాన్ని బోర్డు అధికారులు అజెండాలో పెట్టారు.

విభేదించిన ఆంధ్రప్రదేశ్‌ అధికారులు

తమకున్న వాటా పరిధిలో నీటిని వినియోగించుకొనేందుకే గోదావరిపై ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ అధికారులు చెప్పడాన్ని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు విబేధించారు. వినియోగంలో, నిర్మాణంలో, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల గురించి బోర్డు లేఖ రాస్తే తమ అభిప్రాయం చెప్తామని, ఒక్కటి కూడా కొత్తది లేదని జోషి స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పట్టిసీమ, పురుషోత్తపట్నం కొత్తవని తెలంగాణ పేర్కొనగా, పోలవరంలో భాగంగా చేపట్టినవని ఏపీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారా అని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అడగ్గా, తాము వెళ్లలేదని, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని తెలంగాణ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులు వేసి ఉండొచ్చు తప్ప ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వర్కింగు మాన్యువల్‌పై పది రోజుల్లో రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పేలా సమావేశంలో నిర్ణయం జరిగింది.

ప్రాజెక్టుల వివరాలు వెబ్‌సైట్‌లో

పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. గోదావరి నదీ యాజమాన్యబోర్డుకు 25 పోస్టులను బోర్డు మంజూరు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకొంది. సుమారు 55 మంది అవసరమవుతారని బోర్డు అధికారులు ప్రతిపాదించగా రెండు రాష్ట్రాల అధికారులు అందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇప్పటివరకు కృష్ణాబోర్డుకు ఆంధ్రప్రదేశ్‌, గోదావరి బోర్డుకు తెలంగాణ బడ్జెట్‌ ఇస్తున్నాయి. ఇకమీదట గోదావరి బోర్డుకు ప్రతి ఏడాది ఆరంభంలోనే రెండు రాష్ట్రాలు చెరిసగం ఇచ్చేలా బోర్డు నిర్ణయం తీసుకొంది. బోర్డు ఛైర్మన్‌ సాహు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌లు మురళీధర్‌, వెంకటేశ్వరరావు, బోర్డు సభ్యకార్యదర్శి సమీర్‌చటర్జీ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

చిన్నవాటితో పెద్ద మేలు
31-07-2017 02:24:24
 
636370646627208582.jpg

 

  • శరవేగంగా సిద్ధమవుతున్న 28 ప్రాజెక్టులు
  • అక్టోబరులోపు పనుల పూర్తే సర్కారు లక్ష్యం
  • ప్రతి ప్రాజెక్టుకూ నిర్దిష్ట గడువు విధింపు
  • వీటిలో 13 రాయలసీమకు చెందినవే
  • కోస్తా, ఉత్తరాంధ్రల్లో మిగతా ప్రాజెక్టులు
  • ఏళ్ల తరబడి సాగని పనులకు ఇప్పుడు పరుగు
  • నిరంతరం సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు
 
(అమరావతి-ఆంధ్రజ్యోతి) :అవన్నీ చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులే! కానీ... ఆయా ప్రాంతాలకు చేసే మేలు ఎంతో! వాటిని మొదలుపెట్టి ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. రకరకాల కారణాల వల్ల పనులు చతికిలపడ్డాయి. ఇప్పుడు... ఇన్నాళ్లకు వాటికి మోక్షం లభిస్తోంది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు రాష్ట్రంలోని అన్ని నదీ పరివాహక ప్రాంతాలకు నీరందించే బృహత్‌ లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు! మరోవైపు... ఎక్కడికక్కడ ఎత్తిపోతలు, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు! వీటన్నింటితో రాష్ట్రంలో సాగునీటి కష్టమన్నది తలెత్తకుండా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అక్టోబరులోపు రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 13 ప్రాజెక్టులు కరువుసీమ అయిన రాయలసీమ జిల్లాల్లోవి కావడం విశేషం. వీటన్నింటికీ పోలవరంతో సమానంగా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాజెక్టులను ప్రారంభించి నీటిని నిల్వ చేయగలిగితే... వచ్చే ఖరీఫ్‌ నుంచి సాగు సంక్షోభం అన్నదే ఉండదని వ్యవసాయ, జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబరులోపు ప్రభుత్వం పూర్తిచేయనున్న ఆ 28 ప్రాధాన్య ప్రాజెక్టులు, వాటివల్ల జరిగే లబ్ధి...
 
రాయలసీమ ప్రాజెక్టులు...
1. సిద్ధాపురం ఎత్తిపోతలు:
వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నుంచి 2 టీఎంసీల వినియోగించుకుంటారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో 21,300 ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టును ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలి.
2. అడవిపల్లి రిజర్వాయరు (హంద్రీ నీవా రెండో దశ):
ఈ ప్రాజెక్టుతో చిత్తూరు జిల్లాలోని 80 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. వాయల్పాడు, పీలేరు, పుంగనూరు నియోజవర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఆగస్టు మొదటివారంలోనే దీనిని పూర్తి చేయనున్నారు.
3. మారాల రిజర్వాయరు: 
0.464 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మిస్తారు. హంద్రీ నీవా కాలువద్వారా నీటిని అందిస్తారు. తాగునీటి సరఫరాతో పాటు .. 18,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీన్ని ఆగస్టు రెండోవారంలో పూర్తి చేస్తారు.
4. చెర్లోపల్లి రిజర్వాయరు:
చెర్లోపల్లి వద్ద హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువద్వారా 1.608 టీఎంసీల నీరు అందించేలా జలాశయాన్ని నిర్మిస్తున్నారు. తాగునీటితో సహా.. 5500 ఎకరాలకు సాగునీరందిస్తారు. ఈ పథకాన్ని ఆగస్టు రెండోవారంలో పూర్తి చేయనున్నారు.
5. మడకశిర బ్రాంచి కెనాల్‌: 
అనంతపురం జిల్లాలో 264 చెరువులు నింపి, వాటి ద్వారా సాగునీరందించే ఈ ప్రాజెక్టు ఆగస్టు చివరి వారంలో పూర్తవుతుంది.
6. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం:
శ్రీశైలం రిజర్వాయరు నుంచి నీటిని ఎత్తిపోసి, కేసీ కెనాల్‌, హంద్రీనీవా పథకానికి నీటినందించడం దీని లక్ష్యం. ఆగస్టు చివరివారంనాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
7.  గోరుకల్లు రిజర్వాయరు: 
9 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు.. గాలేరు నగరి, ఎస్‌ఆర్‌బీసీకి నీటిని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఆగస్టు చివరివారానికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
8. అవుకు టన్నెల్‌: 
5వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అవుకు బైపాస్‌ టన్నెల్‌ ద్వారా గండికోట రిజర్వాయరును నింపే ఈ పథకం ఆగస్టు చివరికి పూర్తి చేస్తారు.
9. పులికనుమ-పులికుర్తి ఎత్తిపోతలు (గురురాఘవేంద్ర ప్రాజెక్టు):
కర్నూలు జిల్లాలో పులికనుమ కింద 26,400 ఎకరాలకు, పులికుర్తి ద్వారా 9800 ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ పథకం ఆగస్టు నెలాఖరుకు పూర్తవుతుందని జల వనరుల శాఖ చెబుతోంది.
10. కుప్పం బ్రాంచి కెనాల్‌: 
చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో 4 లక్షల మందికి తాగునీరు ఇవ్వొచ్చు. అలాగే, 110 చెరువులు నింపి 6300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తారు. దీన్ని సెప్టెంబరు చివరి వారానికి పూర్తి చేస్తారు. గండికోట సీబీఆర్‌ లిఫ్ట్‌లు: గండికోట రిజర్వాయరు నుంచి చిత్రావతి రిజర్వాయరుకు 8.3 టీఎంసీలు ఎత్తిపోస్తారు. సెప్టెంబరు చివరికి పూర్తి చేయడం లక్ష్యం.
11. రాష్ట్ర రహదారి నెం.1: 
గండికోట రిజర్వాయరులో ముంపునకు గురైన కడప, తాడిపత్రి రహదారి ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు, చిత్రావతి నదిపై హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణం! దీనివల్ల గండికోట రిజర్వాయరులో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఈ పథకం సెప్టెంబరు చివరికల్లా పూర్తికావాలని లక్ష్యం.
12. గండికోట రిజర్వాయరు: 
26.08 టీఎంసీల నీటిని నిల్వ చేసే ఈ రిజర్వాయరు పనులను సెప్టెంబరు చివరికల్లా పూర్తి చేస్తారు.
13. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్:
జీడీపల్లి రిసర్వాయర్ నుండి భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ కి 3.6 TMC జలాల ని తీసుకొనివేల్లేల 2 దశల లో ప్రాజెక్ట్ ని చేపడతున్నారు. 8 lifts ని ఇందులో కడుతున్నారు. 114 చెరువువు లు కూడా నిండెల నిర్మాణములు కాలువలు చేపడుతున్నారు ఈ 2 దశల లో. ఇందులో 1.4 TMC జలాల ని చెరువు లు నింపడానికి వాడుతారు.
 
 కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు..
14. శారదా నదిపై ఆనకట్ట:
విశాఖ జిల్లా నర్సాపురం మండలం కశింకోట గ్రామం వద్ద శారదా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీనివల్ల 3,480 ఎకరాలకు నీరందుతుంది. ఆగస్టు మొదటివారంలోనే దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
15. కండలేరు ఎత్తిపోతలు:
నెల్లూరు జిల్లాలో 20,700 ఎకరాలకు సాగునీరందుతుంది. పొదలకూరు, చేజెర్ల, వెంకటాచలం మండలాల రైతులకు ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. దీన్ని ఆగస్టు మొదటివారంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
16. పురుషోత్తపట్నం ఎత్తిపోతలు: 
పురుషోత్తపట్నం ద్వారా రెండు దశల్లో 40 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోస్తారు. ఏలేరు రిజర్వాయరు పిఠాపురం బ్రాంచి కెనాల్‌ కింద 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. విశాఖకు తాగునీరుతోపాటు ఉక్కుపరిశ్రమకు కూడా నీరందుతుంది. దీనిని ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్దేశించుకున్నారు.
17. పెద్దపాలెం ఎత్తిపోతల పథకం:
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో నిర్మించే ఈ ప్రాజెక్టుతో 1830 ఎకరాలకు సాగునీరందుతుంది. చిగురుపాలెం, చామర్రు, పెదపాలెం గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది. ఆగస్టు రెండోవారంలో దీన్ని ప్రారంభించనున్నారు.
18. పులిచింతల ప్రాజెక్టు: 
40.77 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. దీన్ని ఆగస్టు చివరిలో పూర్తి చేస్తారు.
19. కొండవీటి వాగు పంపింగ్‌ సిస్టమ్‌:
ప్రకాశం బ్యారేజీకి 5వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ రాజధాని నగరం అమరావతికి వరద ముప్పు లేకుండా చేయడమే దీని ఉద్దేశం. దీని ద్వారా కృష్ణాడెల్టాకు నీటి అందిస్తారు. దీన్ని ఆగస్టు చివరివారంలో పూర్తి చేస్తారు.
20. చినసాన ఎత్తిపోతల పథకం: 
2200 ఎకరాలకు సాగునీరును అందించే ఈ పథకం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాలకు లబ్ధి చేకూరుతుంది. దీన్ని సెప్టెంబరు రెండోవారం నాటికి పూర్తి చేస్తారు.
21. గుండ్లకమ్మ రిజర్వాయరు: 
ప్రకాశం జిల్లాలో 80,060 ఎకరాలకు సాగు, తాగునీరందుతుంది. ఈ పథకాన్ని సెప్టెంబరు నెలలో పూర్తి చేయాలి.
22. కొరిశపాడు ఎత్తిపోతల పథకం:
సూక్ష్మ సేద్య పద్ధతుల్లో కొరిశపాడు ద్వారా 20వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. ప్రకాశం జిల్లాలో కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం సెప్టెంబరులో పూర్తవుతుంది.
23. పోగొండ రిజర్వాయరు:
పాపికొండల మధ్య నున్న బైనేనుపై ఏర్పాటు చేసిన బండకట్టు ఆనకట్టుకు ఎగువన పోగొండు రిజర్వాయరును నిర్మిస్తున్నారు. దీని ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని 3652 ఎకరాలకు నీరందిస్తారు. సెప్టెంబరు నెలాఖరుకు పూర్తికానున్నది.
24. ఎర్ర కాలువ ఆధునీకరణ: 
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాలువ పథకాన్ని ఆధునీకరించి 34,364 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో చేపట్టారు. దీని ద్వారా 6 మండలాల్లోని 30గ్రామాలకు లబ్ధి కలుగుతుంది. ఇది అక్టోబరు మూడోవారం నాటికి పూర్తవుతుంది.
25. నెల్లూరు బ్యారేజీ: 
నెల్లూరు జిల్లాలో లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే ఈ పథకాన్ని అక్టోబరులో పూర్తి చేయనున్నారు.
26. సంగం బ్యారేజీ: 
నెల్లూరు జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2,59,387 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే ఈ పథకాన్ని అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయడం లక్ష్యం.
27. వంశధార ప్రాజెక్టు - హిరమండలం రిజర్వాయరు: 
19.05 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. దీని ద్వారా 45వేల ఎకరాల కొత్త ఆయకట్టు పెరుగుతుంది.
28. వంశధార- నాగావళి అనుసంధానం : 
హిరమండలం రిజర్వాయరు నుంచి హైలెవల్‌ కెనాల్‌ ద్వారా వంశధార - నాగావళి అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల 5 వేల ఎకరాలకు నీరు అందుతుంది. 37 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం 2018 మార్చి నాటికి పూర్తి అవుతుంది.

 

List of Irrigation Projects constructed by sri chandrababu naidu during 2014 June to till now.

Link to comment
Share on other sites

said there were 22 check dams across the 36-km-long Palar river in Andhra Pradesh. “For the last two to three months, the government had taken up works to raise the height of the 22nd dam that is located close to the AP-Tamil Nadu border

 

:terrific:

 

22nd check dam overflowing from yesterday anta 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...