Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
వచ్చే మూడు నెలల్లో 24 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి: సీఎం
04-07-2017 12:32:33
 
636347683695241360.jpg
విజయవాడ: వచ్చే మూడు నెలల్లో 24 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో మంగళవారం  టీడీపీ రాష్ట్ర పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీఎం చంద్రబాబు, టిడిపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేశామన్నారు. పెన్నా-గోదావరి నదులను అనుసంధానం చేయబోతున్నామని తెలిపారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తంపట్నం పూర్తి చేసి ఏలేరుకు నీరందిస్తామని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా జులైలోనే కృష్ణా డెల్టాకు నీరు అందించామని తెలిపారు. ప్రతిపక్షాలు అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్‌ ఛార్జీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వైసీపీ లాంటి పార్టీలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సదావర్తి భూముల విషయంలో ఎలా రాజకీయం చేశారో చూశామని అన్నారు. కోర్టు తీర్పు మనకు అనుకూలంగానే వచ్చిందని చెప్పారు. రూ.5 కోట్లు ఎక్కువ ఇచ్చి భూములు తీసుకోమని ఎప్పుడోచెప్పామన్నారు. ఒప్పుకోకుండా కోర్టుకెళ్లారని ఇప్పుడేం చేస్తారో చూద్దామని చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ అమలుతో తొలుత కొంత ఇబ్బంది ఉంటుందని, సాగునీటి ప్రాజెక్టులపైనా జీఎస్టీ ప్రభావం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ అందిస్తామన్నారు. ఏపీలో అమలు చేస్తోన్న రుణమాఫీ విధానం దేశానికే ఆదర్శమని యూపీ, తెలంగాణల్లో రూ.లక్ష మాఫీ చేస్తే ఏపీలో రూ.1.50లక్షలు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 11 లక్షల ఇళ్లు కడుతున్నామని సీఎం వెల్లడించారు. నంద్యాలలో 400 ఎకరాల్లో 13 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు.చుక్కల భూముల సమస్యలను పరిష్కరించామని వివరించారు.
Link to comment
Share on other sites

From Eenadu:

ప్రత్యక్షంగా చూస్కో 
ప్రాజెక్టుల పనులు పరిశీలనకు అత్యాధునిక గది 
నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు 
సూర్యారావుపేట (విజయవాడ), న్యూస్‌టుడే 

పోలవరం ప్రాజక్టు పనులు ఎలా చేస్తున్నారు. హంద్రీనీవా పరిస్థితి ఏమిటి? తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎంతవరకు వచ్చింది. జలాశయాల్లో నీటి మట్టాలు ఎంతవరకు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగునీటి పారుదల శాఖ పనులు ఎలా సాగుతున్నాయి... నేరుగా వెళ్లి చూడాలంటే చాలా సమయం పడుతుంది. పాలకులు, అధికారులు ఆయా ప్రాంతాలకు నేరుగా వెళ్లాల్సిన పనిలేకుండా విజయవాడలోనే కూర్చొని అనువణువూ చూసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జల వనరుల ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించి ఒకేసారి ఆదేశాలు ఇవ్వవచ్చు. ఒకేసారి సమీక్ష కూడా నిర్వహించొచ్చు. అవన్నీ ఎలా అంటారా?... విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సిస్కో’ రూం ద్వారా సాధ్యమవుతుంది.

ప్రాధాన్యం ఇదీ 
జలవనరుల శాఖ కార్యాలయంలో అమెరికాకు చెందిన సిస్కో సంస్థ చేత అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలతో ఓ గదిని ఏర్పాటు చేశారు. దీనిలో హై రిజల్యూషన్‌ కెమెరాలు ఉంటాయి. వాటితో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకోవచ్చు. జలవనరుల శాఖ కార్యాలయంలోని సిస్కో గది నుంచి ఎవరితోనైనా, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కేవలం వీడియో కాన్ఫరెన్స్‌లే కాకుండా ప్రాజెక్టుల పనితీరు కూడా పరిశీలించుకోవచ్చు. దీని కోసం జలవనరుల శాఖ వద్ద ఐదు 3జీ కిట్లు ఉన్నాయి. వాటిని నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వద్దకు పంపిస్తారు. ఆయా శాఖల అధికారులు తమ ప్రాంతాల్లో పనుల పనితీరును 3జీ కిట్‌ ద్వారా సిస్కో రూంనకు అనుసంధానం చేస్తారు. అక్కడ పరిస్థితులను రూం నుంచి ప్రత్యక్షంగా చూడవచ్చు.

సర్వం ట్యాబ్‌తోనే 
సిస్కో రూంలో ఆపరేషన్‌ అంతా ట్యాబ్‌తోనే నిర్వహిస్తారు. వీడియో లింకేజీ, ఇతర జిల్లాల అధికారులతో అనుసంధానం, ఇతర పనులు ట్యాబ్‌తోనే చేస్తారు. అధికారులతో మాట్లాడాలంటే మైక్‌ ఆన్‌ చేస్తే చాలు రూంలో ఏ మూలలో కూర్చొని మాట్లాడినా స్పష్టంగా అవతలి వారికి వినిపించే అత్యాధునిక మైక్‌ సిస్టం ఏర్పాటు చేశారు. రూం నుంచి రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లోని సిబ్బందికి శిక్షణా తరగతులు ఏకకాలంలో నిర్వహించే వెసులుబాటు కూడా ఉంది. ఒకప్పుడు ఇతర జిల్లాల నుంచి అధికారులు సమీక్షకు రావాలంటే రెండు రోజుల ముందుగానే బయలుదేరాల్సి వచ్చేది. బోలెడంత సమయం వృథా అయ్యేది. ఇప్పుడు తమ జిల్లా కేంద్రాల నుంచి ఏ అధికారి అయినా క్షణాల్లో వీడియో లింకేజీ ద్వారా మాట్లాడుతున్నారు. పనుల పనితీరును వివరిస్తున్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతోంది.

Link to comment
Share on other sites

ఏడాదిలోగా చారిత్రక ఘట్టం!
 
 
636355981747456957.jpg
  • వంశధార-నాగావళి అనుసంధానం పనులు షురూ
  • టెండర్లు పూర్తి... రూ.70కోట్ల ప్రాజెక్టు వెంకటరమణయ్య కంపెనీకే
  • హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నారాయణపురం వరకు హైలెవెల్‌ కెనాల్‌
  • 650 క్యుసెక్కుల ప్రవాహం తట్టుకునేలా 33కి.మీ మేర నిర్మాణం
  • సీఎం నిరంతర పర్యవేక్షణతో అధికారులు ఉరుకులు పరుగులు
 
 
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించిన ప్రభుత్వం వచ్చే ఏడాదిలోగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార-నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేయడానికి యుద్ధప్రాతిపదికన అడుగులు వేస్తోంది. నిత్యం నీటి ప్రవాహం ఉండే వంశధార నది నీటిని నాగావళికి మళ్లించడం ద్వారా వేలాది ఎకరాల ఆయకట్టు భూములకు నీటి స్థిరీకరణ జరగబోతోంది. ఈరెండు నదులను హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా కలపడానికి డిజైన్లు పూర్తికాగా, తాజాగా టెండర్లప్రక్రియ కూడా ముగిసింది. రూ.70కోట్ల వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట రమణయ్య అండ్‌ కంపెనీ దక్కించుకుంది.
 
రెండే ళ్లనాడే బీజం...
వ్యవసాయానికి ప్రయోజనం చేకూర్చాల్సిన నీరు సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో... 2015 మే 6న ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వంశధార-నాగావళి నదుల అనుసంధానంపై దృష్టిసారించాలని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నాగావళి నదిలో ఏడాది పొడవునా నీటి లభ్యత తక్కువ. దీనికి ఎగువన ఉన్న తోటపల్లి జలాశయంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఖరీఫ్‌ సాగు అవసరాలకు పెద్ద ఎత్తున నీటినిల్వ చేస్తుంటారు. తద్వారా దిగువనున్న వేలాది ఎకరాలకు రబీకీ నీటి లభ్యత ఉండడం లేదు. అటు వంశధార నదిలో నీటి ప్రవాహం అధికం. పైగా ఎగువన ఒడిశాలో ఈ నదిపై ప్రాజెక్టులు కూడా చాలా తక్కువ కావడంతో వేల క్యుసెక్కుల నీరు ఏటా సముద్రంలో కలిసిపోతోంది. ఈనేపథ్యంలో పుష్కల నీటి వనరులున్న వంశధార నీటిని నాగావళికి మళ్ల్లిస్తే వేలాది ఎకరాల ఆయకట్టుకు నీటి స్థిరీకరణ జరుగుతుందని అధికారులు కూడా తేల్చడంతో అనుసంధానం ప్రాజెక్టు పనులు పట్టాలకెక్కించాలని సీఎం అప్పట్లోనే ఆదేశించారు. ఈనేపథ్యంలో గతేడాది పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనుసంధాన ప్రక్రియలో భాగంగా వంశధార నది ఆధారంగా కొత్తగా నిర్మిస్తున్న హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నాగావళిపై ఆధారపడ్డ నారాయణపురం ఆనకట్ట వరకు మధ్యలో 33కిలోమీటర్ల మేర హైలెవెల్‌ కెనాల్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా వంశధారకు నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో ఈ హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా నాగావళికి నీటిని మళ్లించాలనేది ఆలోచన. ప్రతిపాదిత హైలెవెల్‌ కాల్వ స్థానంలో ఇప్పటికే చిన్న కాల్వ ఒకటి ఉంది. ఇదికూడా కొంచెం దూరమే. దీనిద్వారా ప్రస్తుతం 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తున్నారు. అయితే నదుల అనుసంధానంలో భాగంగా ఈ హైలెవెల్‌ కెనాల్‌ను 650 క్యుసెక్కుల నీటి ప్రవాహం సైతం తట్టుకునేలా నిర్మించాలని ఇంజనీర్లు డిజైన్లు రూపొందించరు. ఈ అనుసంధానం వల్ల నారాయణపురంపై ఆధారపడ్డ 37,053ఎకరాల ఆయకట్టుకు ఽస్ధిరీకరణ కల్పిచడంతోపాటు తోటపల్లి ప్రాజెక్టు ఒత్తిడి కూడా తగ్గనుంది.
Link to comment
Share on other sites

ఆయకట్టుకు బై‘నీరు’! 
ఈనాడు, ఏలూరు 

గిరిజన ప్రాంతాల్లో నిత్యం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అయినా పంటల సాగుకు వరుణుడి కరుణ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పోగొండ పేరుతో జలాశయం నిర్మించాలని నిర్ణయించింది. అనుకోవడమే కాదు ఏకంగా మూడున్నర ఏళ్లలో ప్రాజెక్టు నిర్మించి పొలాలకు సాగునీరు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. పొలాలకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలంటే ఉప కాలువలను తవ్వాల్సి ఉండగా.. టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.

జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో ఒకవైపు జల్లేరు, మరో వైపు బైనేరు వాగులు ప్రవహిస్తున్నా పొలాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. దీనిని గుర్తించిన అధికారులు 2007లో బైనేరుపై రూ.26.02 కోట్ల అంచనాలతో జలాశయ నిర్మాణానికి ప్రతిపాదనలను తయారుచేసి అప్పటి ప్రభుత్వానికి సమర్పించారు. పలు ఆకృతులను పరిశీలించాక నిధులు సరిపోవని చెప్పి పెండింగ్‌లో ఉంచారు. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.85.51 కోట్లతో పునఃప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం లభించింది. 2014 జనవరి ఒకటిన ప్రతిపాదనలు అనుమతి పొందగా అప్పటి నుంచి పనులు ప్రారంభించారు. పనులను ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ అనే కంపెనీ దక్కించుకుంది. తర్వాత మరోదఫా రూ.116.69 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. బైనేరు నదిపై అటునుంచి ఇటుగా ఎర్త్‌ బండ్‌ నిర్మిస్తున్నారు. రెండు కిలో మీటర్ల పొడవున, 20 మీటర్ల లోతులో బండ్‌ నిర్మాణం ఉంటుంది. దీనికి కుడి, ఎడమ ప్రాంతాల్లో రెండు నీటి విడుదల ప్రాంతాలను ఏర్పాటు చేసి కుడి, ఎడమ కాలువలను తవ్వి వాటి ద్వారా పొలాలకు నీటిని అందిస్తారు. కుడి కాలువ 5.95 కిలోమీటర్లు కాగా దీనిద్వారా 1750 ఎకరాలకు, ఎడమ కాలువను 2.10 కిలోమీటర్లు మేర తవ్వి 2250 ఎకరాలను సాగునీరు అందిస్తారు. ఈ జలాశయంలో 0.25 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. దీని నీటిమట్టం 57.90 మీటర్లు కాగా.. 50 మీటర్ల నీటిమట్టం దాటితే సాగుకు నీటిని వదులుతారు. అంతకంటే పైకి నీరొస్తే తిరిగి బండ్‌ మీదుగా బైనేరులో కలిసి ముందుకు వెళుతుంది. దీనిద్వారా బుట్టాయ గూడెం మండలంలోని రాచూరు, కుమ్మరి కుంట, లంకపల్లి, లక్షుడుగూడెం, పాలకుంట, రామన్నగూడెం, అచ్చయ్యపాలెం ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందిస్తారు.

అదనపు ఆయకట్టుకు సాగునీరు : పోగొండ రిజర్వాయర్‌ ద్వారా కొయ్యలగూడెం మండలంలోని 3600 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నారు. కొయ్యలగూడెం మండలం పరింపూడి పంచాయతీతో పాటు కన్నాపురం, బిల్లుమిల్లి, సరిపల్లి, డిప్పకాయలపాడు గ్రామాల్లోని సుమారు 8 చెరువుల్లో ఈ రిజర్వాయర్‌ ద్వారా వచ్చేనీటిని నింపి దానిద్వారా ఆయకట్టును స్థిరీకరణ చేయనున్నారు. ఇంత పెద్దఎత్తున సాగునీరు అంటే కొత్తగా నాలుగు వేల ఎకరాలకు, ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మరో 3600 ఎకరాలు మొత్తంగా 7600 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును కేవలం మూడున్నర సంవత్సరాల్లో పూర్తిచేసే దిశకు తీసుకొచ్చారు.

ఉపకాలువలు పూర్తయితే నేరుగా సాగునీరు : కుడి, ఎడమ ప్రధానకాలువలను శరవేగంగా తవ్వి పూర్తిచేసిన అధికారులు ఇప్పుడు పొలాలకు నేరుగా నీరు తీసుకెళ్లే ఉప కాలువలపై దృష్టిపెట్టారు. కుడి, ఎడమ కాలువల పరిధిలో 1.03 లక్షల క్యూబిక్‌మీటర్లు మట్టి పని ఉపకాలువల నిమిత్తం చేయాల్సి ఉండగా దీనికి రూ.95.76 లక్షలు కేటాయించారు. వీటికి కాంక్రీటు పని కింద 4314 క్యూబిక్‌ మీటర్లు పని చేయాల్సి ఉండగా రూ.2.39 కోట్లు కేటాయించారు. మొత్తంగా రూ.3.34 కోట్ల పని చేయాల్సిఉండగా ఈ పనుల ఆమోదానికి ఈఎన్‌సీ వద్దకు దస్త్రం వెళ్లింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఈ పనులకు కూడా టెండర్లు పిలిచి పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తంగా అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా జలవనరుల శాఖ తెలియజేసింది. దీనిపై జల వనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ జిల్లాలో పోగొండ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, ఇప్పటికే నీటిని కూడా నిలుపుదల చేసి పరీక్షిస్తున్నామన్నారు.

Link to comment
Share on other sites

కరకట్టల ఆధునికీకరణకు రూ.1055.60 కోట్లతో అంచనాల సవరణ

ఈనాడు-అమరావతి: వంశధార కుడి గట్టు (ప్యాకేజి 1,2,3,4లు), నాగావళి కుడి గట్టు (ప్యాకేజీలు 1, 2)ల ఆధునికీకరణకు రూ.1055.60 కోట్లతో అంచనాలు సవరిస్తూ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2007లో రూ.310.72 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ఆ తర్వాత వంశధార ఒకటి , రెండు, మూడు ప్యాకేజీల్లో పనులను ప్రభుత్వం ముందస్తుగానే ముగించింది. ఆగిన పనులన్నింటినీ రద్దు చేసింది. 2015-16లో అప్పటి ధరలకు అనుగుణంగా మళ్లీ అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర చీఫ్‌ ఇంజినీర్‌ అంచనాలు సవరించి కొత్తగా మళ్లీ సమర్పించారు. ఈ మేరకు కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.

రూ.125.87 కోట్లతో గోదావరి పశ్చిమ డెల్టా ఆధునికీకరణ

గోదావరి పశ్చిమ డెల్టాలో నిడదవోలు డివిజన్‌లోను, భీమవరం డ్రైనేజి డివిజన్‌ పరిధిలో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రూ.125.873 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 153 పనులు ఈ నిధులతో చేపడుతున్నారు.

పోలవరం పనుల్లో రూ.7.76 కోట్ల అదనపు చెల్లింపులు

పోలవరం కుడి కాలువ నాలుగో ప్యాకేజీలో మట్టి తవ్వకం పనుల్లో గుత్తేదారుకు రూ.7.76 కోట్లు అదనంగా చెల్లించేందుకు అనుమతిస్తూ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 2015లో పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ నీళ్లు ఇచ్చేందుకు నాలుగో ప్యాకేజీలో 77.750 మీటర్ల కాలువ గర్భానికి గాను తొలుత 40 మీటర్ల మాత్రమే తవ్వారు. ఆ మట్టిని ఇరు వైపులా పోశారు. తిరిగి ఆ కాలువను 77.750 మీటర్లకు మళ్లీ పెంచేందుకు పనులు చేపట్టారు. అంతకుముందు తవ్వి పోసిన మట్టిని తొలగించాల్సి వచ్చింది. ఈ పని అంచనాల్లో లేదు. కిలోమీటరు 98.200 నుంచి కిలోమీటరు 105.100 వరకు ఈ పని చేయాల్సి వచ్చింది. ఇందుకు తాజా ధరలతో చెల్లింపులు చేపట్టేందుకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వాల్సి ఉన్నందున ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

Link to comment
Share on other sites

రూ.127 కోట్ల నుంచి రూ.530 కోట్లకు

అంచనాలు పెరగనున్న మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం

భూసేకరణ వ్యయమే రూ.2.36 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెరుగుదల

త్వరలో విడుదలకానున్న జీవో

ఈనాడు-అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరగనుంది. 2007-08లో రూ.127 కోట్ల పాలనామోదం పొందిన ఈ ప్రాజెక్టులో తాజాగా రూ.530 కోట్లుగా అంచనాలు సవరించనున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన కసరత్తు సాగుతోంది. మహేంద్రతనయ ప్రాజెక్టు నుంచి వరద కాలువ నిర్మించి అక్కడి నుంచి నీటిని తీసుకువచ్చి రేగులపాడు, బడగామ మధ్య నిర్మించే జలాశయానికి తరలించి అక్కడి నుంచి 24,600 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇటీవల పలాస సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్‌ శివాజీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేవరకు తన గడ్డం తొలగించబోనని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు జలవనరులశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అదనపు నిధులు అవసరమని తేల్చి ఈ మేరకు తాజా అంచనాలు రూపొందించారు. వీటిని నేరుగా ముఖ్యమంత్రి ఆమోదానికి పంపినట్లు సమాచారం. త్వరలో సవరించిన అంచనాలు ఆమోదం పొంది, జీవో జారీ కానుందని సమాచారం.

* ప్రధానంగా భూసేకరణ వ్యయం బాగా పెరిగినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు తొలి అంచనాల్లో భూసేకరణ, పునరావాసం నిమిత్తం పదేళ్ల కిందట కేవలం రూ.2.36 కోట్లు మాత్రమే ఇందులో కేటాయించారు. వాస్తవ లెక్కలు రూపొందించడం వల్లే వ్యయం రూ.300 కోట్లకు చేరిందని అధికారులు చెబుతున్నారు.

* ఈ ప్రాజెక్టు పనుల్లో మొదట్లో రిజర్వాయర్‌ నిర్మాణం ప్రతిపాదన లేదు. రిజర్వాయర్‌ను చేర్చడంతో అంచనాలు పెరిగియానేది అధికారుల వాదన.

* కట్టడాల సంఖ్య తొలి అంచనాల్లో 17 ఉండగా తాజాగా 27 వరకు పెరిగాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...