Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
కొండను తొలిచి... దారిగా మలిచి!
20-01-2018 01:25:59
 
636520083611133131.jpg
  • వెలిగొండ అడవుల్లో కూ చుక్‌ చుక్‌..
  • 7.5 కి.మీ. పొడవైన సొరంగం
  • దక్షిణ భారతంలోనే అతిపెద్దది..
  • నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు
కొండ కోనల్లో, గుహల్లో రైలు ప్రయాణం మరుపురాని అనుభూతి. ఈ మధ్యే అతిపెద్ద రైల్వే టన్నెల్‌ను కశ్మీర్‌లో ప్రారంభించారు. అలాంటి సాంకేతిక అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లోనూ సాకారం కాబోతుంది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రైలు సొరంగ మార్గం అందుబాటులోకి రానుంది. ఏదో ఒకటో రెండో కిలోమీటర్లు కాదు...! 7.560 కిలోమీటర్ల పొడవు. నెల్లూ రు జిల్లా వెలుగొండలో రెండేళ్లక్రితం మొదలైన పనులు దాదాపుగా కొలిక్కి రావడం సంతోషకరమైన విషయం. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
 
 
ఎందుకీ సొరంగం?
నెల్లూరు జిల్లా వెంకటాచలం-ఓబులవారిపల్లి మధ్య రైలు మార్గం నిర్మించాలని 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గంపై సర్వే నిర్వహించగా వెలుగొండ అడవులు అడ్డంకిగా మారాయి. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణులు వెలుగొండ కొండలను తొలిచి సొరంగ మార్గం నిర్మిస్తే రాకపోకలు సాధ్యమేనని తేల్చారు. ఎప్పుడో బ్రిటీషు పాలకులు నిర్మించిన వెలుగొండ అడవుల ఘాట్‌ రోడ్డులోనే నేటికీ రాపూరు, రాజంపేట మధ్య రాకపోకలు సాగుతున్నాయి. సొరంగ మార్గం నిర్మించడమన్నది పెద్ద సాహసం. అయినప్పటికీ మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సొరంగ మార్గాన్ని నిర్మించాలని రైల్వే శాఖ భావించింది. వెంకటాచలం-ఓబులవారిపల్లి మధ్య 113 కి.మీ. పొడవున రైలు మార్గానికి మొదట్లో రూ.839 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2012 నుంచి ఈ రైలు మార్గం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. భూసేకరణ ఇతరత్రా అడ్డంకుల వల్ల నిర్మాణం కొంత ఆలస్యమైంది. 2015 మే నెలలో వెలుగొండ కొండల్లో సొరంగ మార్గం నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది మేలోగా ఈ పనులు పూర్తి చేయాలని రైల్వే ఇంజనీర్లు గడువు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సొరంగం పనులు చివరి దశకు చేరుకున్నాయి.
 
 
సొరంగం ఎలా ఉంటుంది?
వెంకటాచలం-ఓబులవారిపల్లె మార్గంలో 7.560 కి.మీ. సొరంగం ఉంటుంది. ఇది రెండుగా ఉంటుంది. మొదటిది 6.600 కి.మీ. ఆపై కొంత మైదాన ప్రాంతం వస్తుంది. వెంటనే 0.960 కి.మీ. పొడవున మరో సొరంగం ఉంటుంది. ఎత్తు 8 మీటర్లు, వెడల్పు 7 మీటర్లు చొప్పున ఆధునిక యంత్రాలతో పనులు సాగుతున్నాయి. తొలిచిన వెంటనే సిమెంటు పూత పనులు చేస్తున్నారు. వర్షాకాలంలో రాళ్లు జారిపడకుండా ఇనుప రౌండ్‌ను వేస్తున్నారు. రైల్వే లైను కోసం విద్యుత్‌ స్తంభాలు, ట్రాక్‌, సొరంగ మార్గంలో విద్యుత్‌ బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే ట్రాక్‌ కింద ఇనుప షీట్లు వేస్తూ ఆధునిక యంత్రాలతో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మూడు షిఫ్ట్‌లలో ఈ కొండను తొలిచే పనులు జరుగుతున్నాయి. కొండను తొలిచే యంత్రం సుమారు రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొదట కొండకు రంధ్రాలు చేసి ఆ తరువాత జిలిటిన్‌తో పేల్చుతున్నారు. ఆపై రాళ్లను తొలిగిస్తూ సొరంగం నిర్మిస్తున్నారు. ఇంకా 100 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉంది.
-నెల్లూరు, ఆంధ్రజ్యోతి
 
 
ఎన్నో ఏళ్ల కల!
నెల్లూరు జిల్లా సరిహద్దులో ఉన్న కడప జిల్లాకి రైలు మార్గం లేదు. ఒకవేళ రైల్లోనే ప్రయాణించాలంటే చిత్తూరు జిల్లా రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి కడప జిల్లాలో అడుగు పెట్టాలి. ఇది అదనపు ప్రయాణం కావడంతో దాదాపు వాహనాల ద్వారానే కడప జిల్లాకు రాకపోకలు సాగుతుంటాయి. ఇదే కాకుండా కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు సాగించాలంటే రైలు కనెక్టవిటి ఎంతో అవసరం. అందుకనే ఓబులవారిపల్లె-వెంకటాచలం రైల్వే లైనును తీసుకువచ్చారు. ఇది పూర్తయితే వాణిజ్య పరంగానే కాకుండా ప్రజలు ప్రయాణించేందుకు మార్గం సుగమం అవుతుంది.
Link to comment
Share on other sites

AndhraPradesh Irrigation works completed and to be complete in 4 months

Dt Wise Projects

Srikakulam - Nagavali and Vamsadhara.
Vizianagaram - Thotapalli
Visakhapatnam - Purushothapatnam & Uttarandhra Sujala Sravanth

EG-Purushothapatnam
WG-Pattiseema & Chintalapudi Lift Irrigation.
Krishna-Pattiseema & Chintalapudi Lift Irrigation.
Guntur-Pattiseema
Prakasam-Nil
Nellore-Sangam Barrage
RS-Handri Neeva

Link to comment
Share on other sites

16 minutes ago, ravindras said:

when i see flouride problem in news relating to prakasam, i feel very sad. 

That’s true - not sure why leader is ignoring this area of problem and also - local MLAs seems to be less worried or not at all worried 

Link to comment
Share on other sites

1 hour ago, DVSDev said:

That’s true - not sure why leader is ignoring this area of problem and also - local MLAs seems to be less worried or not at all worried 

It's because of the technical issues with the TBM's. Issues should have sorted out in the beginning itself, not contractors need extra money.

Link to comment
Share on other sites

10 hours ago, ravindras said:

when i see flouride problem in news relating to prakasam, i feel very sad. 

 

10 hours ago, DVSDev said:

That’s true - not sure why leader is ignoring this area of problem and also - local MLAs seems to be less worried or not at all worried 

Ignoring kaadhu.. Prakasam dt ki options very little as of now..

Link to comment
Share on other sites

వెలిగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలి
నేటి నుంచి పాదయాత్ర

ఈనాడు, హైదరాబాద్‌: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల రైతులను ఆదుకోవాలని రైతు   సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 9 వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు సంఘం అధ్యక్షుడు పుచ్చకాయల సుబ్బారావు పేర్కొన్నారు. 24న నెల్లూరు జిల్లా సీతారాంపురం నుంచి తురకపాలెం, నారాయణమ్మపేట, కడప జిల్లాలో టేకూరిపేట, కవలకుంట్ల,   అక్కిలరెడ్డి పాలెం, ప్రకాశం జిల్లాలోని కొమరోలు, నల్లగుంట్ల, రాచర్ల, తురిమెళ్ల, కంభం, తిప్పాయపాలెం, దేవరాజు గట్టు, పెద్దారవీడు, దోర్నాల, కొత్తూరు, వెలిగొండ ప్రాజెక్టు వరకు పాదయాత్ర సాగుతుందని ఆయన పేర్కొన్నారు. నీటి వసతి సక్రమంగా ఉంటే ఈ ప్రాజెక్టు పరిధిలోని భూములు అన్ని పంటలకు అనువైనవని, ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను కష్టాల నుంచి   గట్టెక్కించాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...