Saichandra Posted July 21, 2018 Posted July 21, 2018 2 minutes ago, sonykongara said: Nice almost ayipovachindi
sonykongara Posted August 17, 2018 Author Posted August 17, 2018 రాజధానికి రక్షణ దుర్గం కొండవీటి ఎత్తిపోతల17-08-2018 08:10:33 మలిదశకు చేరుకున్న కొండవీటి ఎత్తిపోతల పనులు నెలాఖరులో ట్రయల్‌రన్‌కు సన్నాహాలు సంపు మినహా అన్నీ పూర్తి మొత్తం 27వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి కొండవీటి వాగు ఎత్తిపోతల పనులు మలిదశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరుకు ట్రైల్ రన్ నిర్లహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎత్తిపోతల ద్వారా ఐదు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి, మరో ఐదువేల క్యూసెక్కులను కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి, మిగిలిన ఆరువేలకు పైగా క్యూసెక్కుల వరదనీటిని రాజధాని నీటి అవసరాలకు వినియోగించుకునే విధంగా పథకాన్ని రూపొందించారు. ఎత్తిపోతల దాదాపు పూర్తికావడంతో అమరావతి సురక్షితమైన జోన్‌లోకి వచ్చినట్టయింది. భవిష్యత్తులో రోజుల తరబడి భారీవర్షాలు కురిసినా నగరానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. వరద నీటిని రిజర్వాయర్‌లకు మళ్లిస్తూ అక్కడ ఎక్కువైన నీటిని మాత్రమే ఎత్తిపోతలతో నదిలోకి, బకింగ్‌హామ్‌కాలువలోకి మళ్లిస్తారు. మంగళగిరి: సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపు వద్ద చేపట్టిన కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనులు మలిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం చివరి దశ పనులను జరుపుకుంటున్న ఈ ఎత్తిపోతలకు ఈ నెలాఖరులో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజధాని అమరావతి నగరానికి వాగు వరద నుంచి పొంచివున్న ముప్పును శాశ్వత ప్రాతిపదికన తప్పించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. రూ. 237 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది మార్చి 30వ తేదీన శంకుస్థాపన చేయగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పనులను చేపట్టింది. మొత్తం 27వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేశారు. పథకంలో భాగంగా కొండవీటివాగు వరద నీటి కలెక్షన్ పాయింట్ కాబోతున్న సంపు నిర్మాణ పనులు మాత్రమే మిగిలివున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పొక్లెయినర్లతో మట్టి తవ్వకం పనులు ఆరంభమయ్యాయి. అడుగు భాగంతో పాటు చుట్టూ రివిట్‌మెంట్ పనులను వచ్చేనెల మొదటి పక్షంలో పూర్తిచేసి పథకాన్ని ప్రభుత్వానికి అప్పగించనున్నారు. పదివేల క్యూసెక్కుల వరదనీటి మళ్లింపు కొండవీటివాగు సామర్ధ్యం ఆరువేల క్యూసెక్కులు. భారీ వర్షాల నేపధ్యంలో ఉపవాగుల నుంచి వచ్చే వరదనీరు సుమారు పదివేల క్యూసెక్కులు వుంటుంది. అంటే కొండవీటివాగులో 16వేల క్యూసెక్కులకు పైగా గరిష్ట ప్రవాహం వుంటుంది. ఇదే సందర్భంలో కృష్ణానదిలో కూడ వరదనీరు చేరడంతో నదినీటి మట్టం కొండవీటివాగు మట్టం కన్నా ఎక్కువస్థాయిలో వుంటుంది. దీంతో ఎక్కడికక్కడ పొంగిపొర్లుతోంది. దీనిని ముందస్తుగా గుర్తించిన ప్రభుత్వం ఆ ముప్పును తప్పించేందుకు వాగు వరద నీటిని నదిలోకి ఎత్తిపోసే విధంగా డిజైన్ చేసింది. ఈ డిజైన్‌లో భాగంగా ఐదు వేల క్యూసెక్కులను ప్రకాశం రిజర్వాయరులోకి, మరో ఐదువేల క్యూసెక్కులను కృష్ణా పశ్చిమ ప్రధానకాలువలోకి, మిగిలిన ఆరువేలకు పైగా క్యూసెక్కుల వరదనీటిని రాజధాని నీటి అవసరాలకు వినియోగించుకునేలా పథకాన్ని రూపొందించారు. డెలివరీ సిస్టమ్ కరకట్ల ఆవలివైపు, నదీముఖం వెంబడి రూ.21 కోట్ల వ్యయంతో 1.20 ఎకరాల విస్తీర్ణంలో డెలివరీ సిస్టమ్ నిర్మించారు. దీనికి సంబంధించిన ఆరువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులను పూర్తిచేశారు. పంప్‌హౌస్ నుంచి కరకట్టకు నాలుగుమీటర్ల దిగువ నుంచి ఏర్పాటుచేసిన 16 పైపుల ద్వారా అనుసంధానం చేశారు. సంపు నుంచి పంపుహౌస్ ద్వారా 5,297 క్యూసెక్కుల నీటిని తీసుకుని సిస్టమ్ సాయంతో నదిలోకి ఎత్తిపోస్తారు. ఎస్కేప్ రెగ్యులేటర్ ఎస్కేప్ రెగ్యులేటర్‌ను రూ.11 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ కొత్త హెడ్ రెగ్యులేటర్ నుంచి దక్షిణంగా రెండొందల మీటర్ల దూరంలో కాలువకు పశ్చిమంగా పీడబ్ల్యూడీ వర్కుషాపు రోడ్డుమీద 12 మీటర్ల లోతులో దీనిని నిర్మించారు. మొత్తం ఐదు గేట్లు ఏడువేల క్యూబిక్ మీటర్లతో కూడిన కాంక్రీట్ నిర్మాణమిది. వరదనీటి కలెక్షన్ పాయింట్‌గా వుండే సంపుకు తూర్పువైపు ఏర్పాటుచేశారు. 160 కోట్లతో పంపుహౌస్ వరదనీటి కలెక్షన్ పాయింట్‌గా వుండే సంపునకు కరకట్టకు మధ్య ఎకరం విస్తీర్ణంలో పంపుహౌస్‌ను నిర్మించారు. దీనిని రూ.34 కోట్ల వ్యయంతో చేపట్టి సుమారు రూ.90 కోట్ల వ్యయంకాగల మెషినరీని ఇందులో ఏర్పాటు చేశారు. ఈ పంపుహౌస్ కోసం మొత్తం 14 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను గావించారు. తొలి రెండుబేస్‌లలో ఆరేసి పంపులను, మూడవ బేస్‌లో నాలుగేసి పంపులను ఏర్పాటు చేశారు. అంటే.. పంప్‌హౌస్‌లో ఒక్కోటి 1,600 కిలోవాట్‌ల సామర్ధ్యం కల 16 పంపులను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి స్టాండ్‌బైగా వుంటుంది. 15 పంపుల సాయంతో 5,297 క్యూసెక్కుల నీటిని సంపు నుంచి తీసుకుని కరకట్ట ఆవలవున్న కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. ఈ పంప్‌హౌస్‌లోనే ప్రెజర్ మెయిన్స్ పేరిట మరో రూ.36.5 కోట్ల వ్యయం కాగల మెషినరీని అమర్చారు. సిద్ధమైన విద్యుత్ సబ్‌స్టేషన్ మొత్తంగా ఈ పథకానికి కావల్సిన విద్యుత్‌ను అందించే నిమిత్తం సంపునకు దక్షిణంగా 73 సెంట్ల విస్తీర్ణంలో రూ. 14 కోట్లను వెచ్చించి 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. దీనిని తాడేపల్లి సబ్‌స్టేషన్‌తో అనుసంధానించేందుకు మరో రూ.14 కోట్లతో ట్రాన్స్‌మిషన్ లైనును కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ లైను రెండు చోట్ల రైల్వే ట్రాక్‌ను దాటాల్సి వుంది. రైల్వేశాఖ నుంచి సంబంధిత అనుమతులు మంజూరైన వెంటనే తాడేపల్లి సబ్‌స్టేషన్ నుంచి ఈ కొత్త సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ మరో పది రోజుల్లో పూర్తికాగలదని అంటున్నారు. సబ్‌స్టేషన్ ఆవరణలోనే పధకం నిర్వహణకు సంబంధించిన కార్యాలయ భవనాన్ని నిర్మించారు.
sonykongara Posted August 17, 2018 Author Posted August 17, 2018 (edited) Edited August 17, 2018 by sonykongara
sonykongara Posted August 23, 2018 Author Posted August 23, 2018 రాజధానికి ఢోకా లేదు23-08-2018 03:43:56 ముంపు తప్పిన అమరావతి 237 కోట్లతో సిద్ధమైన కొండవీటివాగు ఎత్తిపోతల నెలాఖరులో ట్రయల్‌రన్... వచ్చేనెలలో ప్రారంభం రాజధాని అమరావతిని సురక్షితమైన అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం శాస్త్రీయమైన విధానాలతో ముందడుగులు వేస్తోంది. పర్యావరణానికి పట్టుకొమ్మలా నిలిపేందుకు బ్లూగ్రీన్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలను దశలవారీగా అమలు చేస్తున్న ప్రభుత్వం...అదో వరద ముంపు ప్రాంతమన్న మచ్చను తుడిచేసేందుకు అత్యావశ్యకంగా వరద ముంపు నివారణ పఽథకాన్ని శాశ్వత ప్రాతిపదికన పూర్తిచేసింది. దీంతో నవ్యాంధ్ర రాజధానికి భవిష్యత్తులో ముంపు సమస్యే లేకుండా చేసింది. ఇంకోవైపు మూడు టీఎంసీల సామర్ధ్యంగల ప్రకాశం బ్యారేజికి అప్పుడప్పుడొచ్చే వరదల నుంచి రక్షణ చేకూరేవిధంగా ఎగువ,దిగువ ప్రాంతాల్లో రెండు ఆనకట్టల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ చర్యలతో రాజధానికి ముంపు సమస్యే లేకుండా చేయడంతో పాటు పెరుగనున్న జనాభా అవసరాలకు సరిపడా నీటి వనరులను కూడా అందుబాటులో ఉండేలా పక్కా వ్యూహాన్ని అమలుచేస్తోంది! మంగళగిరి, ఆగస్టు 22: రాజధాని ప్రాంతం అమరావతి అనాదిగా వరద ముంపు ప్రాంతమే! ఇక్కడి కృష్ణానది దక్షిణ పరీవాహక ప్రాంతంలో అనేక వాగులు పారుతూ భారీ వర్షాలప్పుడు పరిసర పైర్లను ముంచెత్తేవి. వీటిలో కొండవీటివాగు ప్రధానమైంది. కొట్టేళ్లవాగు, పాలవాగు వంటి మరికొన్ని పిల్లవాగులూ ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఈ వాగులు పొంగి సుమారు 16వేల ఎకరాలు ముంపునకు గురయ్యేవి. ఇప్పుడా భూములన్నీ రాజధాని నిర్మాణంలో భాగమయ్యాయి. రాజధాని ప్రాంత ఎంపిక సందర్భంలోనే ఈ సవాళ్లను గుర్తించిన ప్రభుత్వం, అందుకు తగిన నివారణోపాయాలను రచించుకుని రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా రూ 237 కోట్ల వ్యయంతో కొండవీటివాగు ఎత్తిపోతలను చేపట్టి ఏడాదిన్నరలో పూర్తిచేసింది. అవసరాలకు 6000 క్యూసెక్కులు భారీ వర్షాల నేపథ్యంలో ఉపవాగుల నుంచి వచ్చే వరదనీరు సుమారు పదివేల క్యూసెక్కులు ఉంటుంది. అంటే కొండవీటివాగులో 16వేల క్యూసెక్కులకు పైగా గరిష్ఠ ప్రవాహం ఉంటుంది. ఇదే సందర్భంలో కృష్ణానదిలో కూడా వరదనీరు చేరడంతో నది నీటిమట్టం కొండవీటివాగు మట్టంకన్నా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దీంతో వాగులోని వరదనీరు ముందుకు పారలేక ఎక్కడికక్కడ పొంగిపొర్లుతుంది. దీని వలన రాజధాని నగరం కొండవీటివాగు వరద ముంపు నకు గురయ్యే ప్రమాదముంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం వాగు వరద నీటిని నదిలోకి ఎత్తిపోసే విధంగా పఽథకానికి రూపొందించింది. ఇందులో భాగంగా ఐదు వేల క్యూసెక్కులను ప్రకాశంబ్యారేజిలోకి, మరో ఐదువేల క్యూసెక్కులను కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి, మిగిలిన ఆరువేలకు పైగా క్యూసెక్కుల వరదనీటిని రాజధాని నీటి అవసరాలకు వినియోగించుకునేవిధంగా పథకరచన చేశారు. ఈ పథకంలో ప్రధానంగా ఐదు నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి సంపు, రెండోది పంపుహౌస్, మూడోది డెలివరీ సిస్టమ్, నాలుగోది ఎస్కేప్ రెగ్యులేటర్, ఐదవది 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్. ఇందులో.. కొండవీటివాగు కృష్ణానదిలో కలిసేచోట కరకట్ట నుంచి 250 మీటర్ల దూరంలో 110/ 110 మీటర్ల విస్తీర్ణంలో సంపు నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం దీని పనులే మిగిలివున్నాయి. ఇక.. రూ. 160 కోట్ల వ్యయంతో పంపుహౌస్ నిర్మించారు. మొత్తం పథకంలో ఇదే అత్యంత ప్రధానమైంది. ఇక నదీముఖం వైపు డెలివరీ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రూ.21 కోట్ల వ్యయంతో 1.20 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. పశ్చిమ ప్రధాన కాలువవైపు ఎస్కేప్ రెగ్యులేటర్‌ను రూ.11 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక 132కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఇప్పటికే సిద్ధమయింది. పక్షం రోజుల్లో కొండవీటివాగు ఎత్తిపోతల ట్రయల్ రన్ చేపడతామని అధికార వర్గాలు తెలిపాయి. Advertisement
Nfan from 1982 Posted August 27, 2018 Posted August 27, 2018 47 minutes ago, sonykongara said: Malli emayyindhi
sonykongara Posted September 8, 2018 Author Posted September 8, 2018 కొండవీటి వాగు ఎత్తిపోతలకు ట్రయల్‌రన్08-09-2018 07:23:37 తాడేపల్లి: కొండవీటివాగు ఎత్తిపోతల పథకానికి శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు డ్రై ట్రయల్‌రన్‌ను నిర్వహించారు. మొత్తం 16 మోటార్లు ఏర్పాటు చేయగా ఆరు మోటార్లను నడిపి పనితీరును పరిశీలించారు. ఈ నెల 10న ఈ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్ర బాబు చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కార్య క్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సతీష్, ఎస్‌ఈలు చౌదరి, బాబూరావు, ఈఈ రమేష్‌బాబు, మెగా ప్రతినిధి రంగరాజన్, ప్రాజెక్ట్ మేనేజర్ అంబకుమార్, అధికారులు పాల్గొన్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now