Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి
 
విజయవాడ: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉ. 3.30 నుంచి 6 గంటల వరకు విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సీఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం 4గం. 1నికి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తున్న నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. ఈ గదుల్లోనే సీఎం చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.
Link to comment
Share on other sites

ఏపీ కొత్త సచివాలయానికి నామకరణం చేసిన చంద్రబాబు
 
635971798573796790.jpg
వెలగపూడి: ఏపీ నూతన సచివాలయం సోమవారం తెల్లవారు జామున ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 4.01 లకు తాత్కాలిక సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం తదితర కార్యక్రమాలను చంద్రబాబు నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. ఈ సచివాలయానికి ఏపీ గవర్నమెంట్‌ ట్రాన్సిషనల్‌ హెడ్‌క్వార్టర్స్‌గా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. సీఎం ఆఫీసు కోసం నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, సీఆర్‌డీఎ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రాష్ట్రాభివృద్ధే నా ధ్యేయం: చంద్రబాబు

25brk34a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రారంభించారు. నాలుగో బ్లాక్‌లోని రెండు గదులను ప్రారంభించి విశ్వక్సేన పూజ, వాస్తు పూజ, గణపతి హోమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూన్‌లో మంచి రోజులు లేనందున ఈరోజే సచివాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. జూన్‌ 15 నాటికి సచివాలయ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కార్యాలయం లేకపోతే బస్సులోనే ఉండి పనిచేశానన్నారు. డబ్బులు లేకపోయినా... రైతుల జీవితాల్లో వెలుగులు చూడాలని రూ.24వేల కోట్లతో రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సీఎం అయిన వెంటనే సింగపూర్‌కు వెళ్లి... రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ఇవ్వాలని కోరానన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి సింగపూర్‌ ఆరు నెలల్లోనే మాస్టర్‌ప్లాన్‌ తయారుచేసి ఇచ్చిందన్నారు.

విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. విభజించే ముందు కనీసం మనల్ని పిలిచి మాట్లాడకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

దేశంలో నదుల అనుసంధానం కలను ఆంధ్రప్రదేశ్‌ సాకారం చేసిందని... పట్టిసీమ ఎత్తిపోతలను కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించినట్లు చంద్రబాబు తెలిపారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రం 10 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. సమర్థ, నీతివంతమైన పాలనకు ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 పనిదినాలుగా నిర్ణయించినట్లు చెప్పారు. దీంతోపాటు 30శాతం అదనంగా హెచ్‌ఆర్‌ఏ కూడా ఇస్తామన్నారు.

రాజధానిలో ఉండే రైతులకు 50 స్క్వేర్‌ యార్డ్స్‌ భూమి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ చిన్న అసమ్మతి వచ్చినా నష్టపోయేది రైతులేనని తెలిపారు. రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, సీబీఐ విచారణ కొనసాగించాలని కొందరు అంటున్నారని... సీబీఐ విచారణకు పోతే 20 ఏళ్లయినా తేలదని... దీంతో రైతులు ఇబ్బందుల్లో పడతారన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుపడాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

ప్రపంచంలోని 10 ఉత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా నగరాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ విలువైన ప్రాంతంగా మారబోతోందన్నారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 2020 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా నిలవాలని... 2029 నాటికి అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

Amaravati-not-the-Capital-on-papers-1.jpIt is more than an year we have the announcement of Amaravati being the next capital of Andhra Pradesh. But the government is yet to issue any GO or Gazette notification till date. The state government even named the Interim Secretariat at Velagapudi as ‘AP Government’s transitional headquarters’. The reason for this is the technical issues. According to Andhra Pradesh Reorganization Act, Hyderabad will also be the capital of AP until ten years after the state division. And according to the constitution, no state can have two capitals. So Amaravati is only the new capital under construction. The government will issue Gazette notification only after it will have to wind up its administration from Hyderabad and move to Amaravati. Once the AP government issues GO declaring Amaravati as the state’s capital, then Hyderabad will cease to be the capital of AP. So the GO is kept on hold to avoid technical and legal problems.

 

Link to comment
Share on other sites

Amaravati-not-the-Capital-on-papers-1.jpIt is more than an year we have the announcement of Amaravati being the next capital of Andhra Pradesh. But the government is yet to issue any GO or Gazette notification till date. The state government even named the Interim Secretariat at Velagapudi as ‘AP Government’s transitional headquarters’. The reason for this is the technical issues. According to Andhra Pradesh Reorganization Act, Hyderabad will also be the capital of AP until ten years after the state division. And according to the constitution, no state can have two capitals. So Amaravati is only the new capital under construction. The government will issue Gazette notification only after it will have to wind up its administration from Hyderabad and move to Amaravati. Once the AP government issues GO declaring Amaravati as the state’s capital, then Hyderabad will cease to be the capital of AP. So the GO is kept on hold to avoid technical and legal problems.

 

 

 

June tharuvatha istharu emo.. eee Gazette notification ?? or 2019 tharuvathe istharo ?

Link to comment
Share on other sites

Guest Urban Legend

June tharuvatha istharu emo.. eee Gazette notification ?? or 2019 tharuvathe istharo ?

 

employees and administration antha move ayye varaku ivvaru anukunta

Link to comment
Share on other sites

తాత్కాలిక సచివాలయంలో రూ.530 కోట్ల పనులకు సర్కార్ ఆమోదం
 
విజయవాడ: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో రూ.530 కోట్ల పనులకు ఏపీ ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపింది. సచివాలయంలో 2, 3 ఫ్లోర్ల నిర్మాణానికి గానూ రూ.68.34 కోట్లు, అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.355.74 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.105.92 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది
Link to comment
Share on other sites

జూన్‌ 27లోపు ఉద్యోగులను తరలిస్తాం
ఏపీ మంత్రి నారాయణ
5brk_73a.jpgగుంటూరు: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను జూన్‌ 27లోపు ఏపీ రాజధాని అమరావతికి తరలిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో చర్చించారు.

సకాలంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అందిస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రి నారాయణకు హామీ ఇచ్చారు. సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగుతాయన్నారు. ఉద్యోగుల విధులకు ఆటంకం లేకుండా నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్లు అందిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే నేలపాడుకు ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...