Jump to content

Amaravati


Recommended Posts

సంతోష నెలవులు... రాజధాని గ్రామాలు
10-09-2018 08:20:56
 
636721644567605582.jpg
  • హ్యాపీ సిటీస్‌ స్ఫూర్తితో వీటినీ తీర్చిదిద్దేందుకు సీఆర్డీయే ప్రణాళికలు
  • సంతోషానికి సోపానాలుగా అభివర్ణించే 6 అంశాల ప్రాతిపదికగా రూపకల్పన
  • వసతులు, ఉపాధి అవకాశాల మెరుగుదల ద్వారా గ్రామాల సర్వతోముఖాభివృద్ధి
  • తొలుత ఉద్దండరాయునిపాలెంలో.. మలిదశల్లో మిగిలిన గ్రామాల్లోనూ అమలు
 
అమరావతి: ప్రజారాజధానిగా, సంతోషానికి అసలైన చిరునామాగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న సీఆర్డీయే ఇప్పుడు అదేబాటలో రాజధానిలోని 29గ్రామాలను కూడా హ్యాపీ విలేజ్‌లుగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అమరావతి నిర్మాణానికి భూములివ్వాలని తాను పిలుపునిచ్చిన వెంటనే ముందెన్నడూ కనీవినీ ఎరుగనంతగా 33,000 ఎకరాలకు పైగా పూలింగ్‌ ప్రాతిపదికన ఇచ్చిన ఈ గ్రామాలనూ సంతోషకర ఆవాసాలుగా అభివృ ద్ధి పరచాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలకు కార్యరూపం ఇచ్చేందుకు కృషిచేస్తోంది. ప్రజ ల్లో సంతృప్తకర స్థాయిలను కొలిచేందుకు కొలమానాలుగా నిర్ణయించుకున్న అంశాల ఆధారంగా వీటిని రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలను దశలవారీగా అమలు పరచడం ద్వారా రాజధాని గ్రామాలను ఒక్కటొక్కటిగా సంతోషంతో కళకళలాడే నివాసప్రాంతాలుగా చేయబోతోంది.
 
ఆ ఆరు అంశాల ఆధారంగా..
ఎన్ని కార్యక్రమాలు అమలు పరచినప్పటికీ, మరెన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటన్నింటి అంతిమ లక్ష్యం అన్ని వర్గాల ప్రజల్లో సంతృప్తస్థాయిలను పెంచడమే కావాలని ముఖ్యమంత్రి తరచుగా చెబుతుండడం తెలిసిందే. ఇదే లక్ష్యంతో ఇప్పటికే పలు చర్యలను తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని పట్ట ణ ప్రాంతాలన్నింటినీ హ్యాపీ సిటీస్‌గా మా ర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో పెద్దఎత్తున హ్యా పీ సిటీస్‌ సమిట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. సంతోషస్థాయిల్లో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉన్న ఫిన్లాండ్‌తో సహా ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే భూటాన్‌, ప్రత్యేకంగా మంత్రిత్వశాఖనే కలిగిన అబుదబి దేశాలతోపాటు ఎన్నెన్నో దేశాలకు చెందిన నిపుణులు, అనుభవజ్ఞులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల్లో సంతోషస్థాయిలను పెంచేందుకు ఏం చేయాలన్న దానిపై వారందరూ విస్తృతంగా చర్చించి, కొన్ని అంశాలను గుర్తించారు. వాటిల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఆరు అంశాలను ‘సంతోషానికి అవసరమైన ఆరు మూలస్తంభాలు (6 పిల్లర్స్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌)’గా అభివర్ణించారు.
 
ఆర్థికాభ్యున్నతి- ఉపాధి అవకాశాలు, సంస్కృతి, భౌతిక- మానసిక ఆరోగ్యం, సహజ ప్రకృతి, మానవ నిర్మిత వాతావరణం, పరిపాలనా వ్యవస్థ అనే ఈ ఆరు అంశాలపై తగినంత దృష్టిని కేంద్రీకరిస్తే రాష్ట్ర ప్రజల్లో సంతృప్తకరస్థాయిలను పెంచగలమని పైన పేర్కొన్న సదస్సులో గుర్తించారు. ఇప్పుడీ అంశాలపైనే ఆధారపడి, సీఆర్డీయే అమరావతి పరిధిలోని 29 గ్రామాలను సంతోషానికి నెలవుగా మార్చేందుకు నిర్ణయించింది. ఇందుకు అనుగుణమైన ప్రణాళికలను రూపొందించింది.
 
ప్లానింగ్‌ టీం ఆధ్వర్యంలో...
ఇందులో భాగంగా సీఆర్డీయే ప్లానింగ్‌ టీం ఈ ప్రణాళికను తొలుత సీడ్‌ క్యాపిటల్‌ ఏరి యాలోని ఉద్దండరాయునిపాలేన్ని ఎంపిక చే సింది. సింగపూర్‌ కన్సార్షియం ఆధ్వర్యంలో ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందనున్న సీడ్‌ క్యా పిటల్‌ ఏరియాలో ఉన్నందున ఈ గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా అభివృద్ధి పరచనున్నారు. ఇప్పటికే సదరు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు, గ్రామ కమిటీలను సమావేశపరచి, ఆ గ్రామాన్ని ఏవిధంగా అభివృద్ధి పరచబోతున్నదీ, అందుకు వారు ఏ విధంగా తోడ్పాటునందించాల్సి ఉన్నదీ తెలియజెప్పారు. సమీకృత అభివృద్ధి ప్రణాళిక ద్వారా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దబోతున్నదీ వివరించారు. ఇప్పటికే ఉద్దండరాయునిపాలెంలో ఉన్న భౌతిక వసతుల మెరుగుదల, సామాజిక వనరులు, వసతుల అభివృద్ధి, గ్రామ యువతకు మేలైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వా రికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు ఇత్యాది అంశా ల గురించి చర్చించారు.
 
ఈ సందర్భంగా గ్రామస్థుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని, తమ ప్రణాళికల్లో వాటికీ స్థానం కల్పించారు. రానున్న రోజుల్లో ఇటువంటి ఇంకొ న్ని సమావేశాలు నిర్వహించి, వాటి ఆధారంగా గ్రామ సమగ్రాభివృద్ధి తద్వారా గ్రామస్థుల్లో సంతోషస్థాయిలను పెంచేందుకు తగు చర్యలను చేపట్టి, సంతోషానికి నెలవుగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇదే క్రమంలో రాజధానిలోని మిగిలిన గ్రామాలను కూడా హ్యా పీవిలేజ్‌లుగా రూపొందించేందుకు సీఆర్డీయే చర్యలు తీసుకోనుంది.
Link to comment
Share on other sites

అమరావతికి అందమైన జలవనరుగా కొండవీటివాగు
10-09-2018 08:17:31
 
636721642516973625.jpg
  • నాడు దుఃఖదాయిని...నేడు వరప్రదాయిని
  • రూ. 237 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల రెడీ
  • 14న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం?
 
రాజధాని అమరావతికి పొంచివున్న ముప్పును....సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాజధానికే వరప్రదాయినిగా తీర్చిదిద్దే ప్రణాళిక అమల్లోకి వచ్చేసింది. రాజధాని అమరావతిలో సుమారు పదివేల ఎకరాలను ముంపునకు గురిచేసే కొండవీటివాగు వరద సమస్యకు ఇక చెక్‌ పడింది. అమరావతికి వరద ముంపు నుంచి శాశ్వత ప్రాతిపదికన రక్షణ కల్పిస్తూ కొండవీటివాగు ఎత్తిపోతల పథకం సిద్ధమైంది. గత రెండు రోజులుగా జలవనరులశాఖ అధికారులు పథకానికి సంబంధించిన అన్నీ విభాగాలకు ట్రయల్‌ రన్‌ వేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకపోవడంతో పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ను ఇచ్చారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఎత్తిపోతలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టారు.
 
 
మంగళగిరి: సింగపూర్‌లో ఓ నది నుంచి తరచూ వస్తున్న వరద కట్టడికి అక్కడి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అధ్యయనం చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాను మేరకు కొండవీటివాగు వరద కట్టడి ప్రాజెక్టును చేపట్టారు. రాజధాని ప్రాంతంలోని వాగుల నుంచి వచ్చే వరదనీటిని కృష్ణానదిలోకి తరలించడంతోపాటు ఆ వాగులను రాజధానికి కళాత్మకమైన సౌందర్యవాహినులుగా తీర్చిదిద్దడమనే రెండు ప్రణాళికలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో తొలిదశ కింద కొండవీటివాగు అంత్యభాగమైన ఉండవల్లి కృష్ణాతీరం వద్ద రూ.237 కోట్ల వ్యయంతో వాగు వరద నీటిని కృష్ణానదిలో ఎత్తిపోసేవిధంగా 16 మోటార్లతో భారీ ఎత్తిపోతల పనులను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతోపాటు రెండోదశ కింద కొండవీటివాగు విస్తరణ, వరద నీటిని నిల్వచేసే మూడు భారీ రిజర్వాయర్లను నిర్మించేందుకుగాను అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంస్థ సిద్ధమైంది.
 
అసలు సమస్య ఇదీ!
కొండవీటి కొండల నుంచి పుట్టిన జల ప్రవాహం లాం నుంచి వాగు రూపాన్ని సంతరించుకుని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల మధ్యగా 28.5 కి.మీ. ప్రయాణించి ప్రకాశం బ్యారేజి వద్ద ఎగువ కృష్ణలో కలుస్తుంది. ఈ వాగు కేవలం 25 మీటర్ల వెడల్పుతో వుండి అధిక వర్షాల నేపథ్యంలో ఎనిమిదివేల క్యూసెక్కుల సా మర్ధ్యంతో ప్రవహిస్తుంది. తక్కువ వెడల్పులో ఎక్కువ సామర్ధ్యంతో కూడిన ప్రవాహం రావడంతో బలహీనంగా వున్నచోట కట్టలు తెగి సమీప భూములను ముంచెత్తుతుంది. పైగా...భారీవర్షాల నేపథ్యంలో కృష్ణానదిలో నీటిమట్టం పెరగడంతో కొండవీటివాగు వరదనీరు నదిలోకి పారలేక ఒత్తిడి వల్ల ఎక్కడికక్కడ పొంగి పొర్లుతుంది. ఇదీ కొండవీటి వాగు ముంపు సమస్య!
 
రాజధాని రాకతో సమస్యపై దృష్టి
ఇపుడు పొలాల బదులు రాజధాని నగరం ఆవిర్భవిస్తుండడంతో నగరానికి ఈ ముంపునుంచి శాశ్వత ప్రాతిపదికన రక్షణ కల్పించాల్సివచ్చింది. అందుకే ప్రభుత్వం ఈ ముంపు సమస్యను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముంపునకు ముక్కుతాడేస్తూ... దానినో అందమైన జలవనరుగా మార్చేస్త్తోంది. అంతేనా! వరద నీటిని నిల్వచేసి నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించేవిధంగా వ్యూహాన్ని రూపొందించింది. దీంతోపాటు వాగును పర్యాటక కోణంలో సుందరీకరిస్తూ ఆహ్లాదకరంగా వుండే జలమార్గంగా అభివృద్ధి చేయనుంది.
 
ఎత్తిపోతల పథకమిలా...
కొండవీటివాగు నుంచి వచ్చే వరదనీటిని 110/110 మీటర్ల విస్తీర్ణంలో వుండే ఫోర్‌బే (సంపు వంటి నిర్మాణం)లోకి తరలిస్తారు. ఈ ఫోర్‌బే గరిష్ట ఎత్తు 17.4మీటర్లు. ఇది ఇంచుమించు కొండవీటివాగు గరిష్ట లెవల్‌కు సమానం. ఈ ఫోర్‌బేకు ఉత్తరంగా మోటారు-పంపుహౌస్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో 16పంపులు, 16మోటార్లు వున్నాయి. ఈ పంపుహౌస్‌ నుంచి 16 పైపులను నదివైపు ఏర్పాటుచేసిన డెలివరీ సిస్టమ్‌కు అనుసంధానం చేశారు. ఫోర్‌బేలోకి వచ్చిన వరదనీటిని మోటారు పంపులతో డెలివరీ సిస్టమ్‌ సాయంతో నదిలోకి ఎత్తిపోస్తారు. కృష్ణానది గరిష్టనీటిమట్టం 18.4 అడుగులు కావడంతో నదికి వచ్చే వరదలను కూడా దృష్టిలో వుంచుకుని డెలివరీ సిస్టమ్‌ను 22మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేశారు. అంటే కొండవీటివాగు వరద నీరు 22మీటర్ల ఎత్తునుంచి నదిలోకి ఎత్తిపోయడమవుతుంది. ఈ రీతిగా అయిదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి తరలించబడుతోంది. దీనికితోడు ఫోర్‌బేకు తూర్పువైపు అయిదు లాకులతో కూడిన ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను నిర్మించారు. కొండవీటివాగు వరద తీవ్రత ఎక్కువైతే ఈ లాకులను ఎత్తివేసి సహజప్రవాహంతో వరదనీటిని బకింగ్‌హామ్‌ కాలువలోకి మళ్లిస్తారు. ప్రస్తుతానికి పథకం సిద్ధమైనప్పటికీ... ఫోర్‌బే రివిట్‌మెంట్‌, పరిసరాల సుందరీకరణ వంటి కొద్దిపాటి పనులు మిగిలివున్నాయి.
 
విజయవంతంగా ట్రయల్‌రన్‌
పథకం పూర్తయిన దరిమిలా రెండు రోజులుగా ట్రయల్‌రన్‌ వేస్తున్నారు. ఆదివారానికి సుమారు ఎనిమిది పంపులను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఉండవల్లి రెగ్యులేటర్‌ నుంచి కృష్ణానది బ్యాక్‌ వాటర్‌ను ఫోర్‌బేలోకి 13 మీటర్ల ఎత్తువరకు తీసుకుని మోటార్లను ఆడించారు. ఒకదాని తరువాత ఒకటిగా ఆదివారం సాయంత్రానికి ఎనిమిది మోటార్లను ఆడించి ఫోర్‌బేలోని నీటిని నదిలోకి తోడిపోశారు. మిగతా పంపుల పనితీరును కూడా రెండు రోజుల్లోగా పరిశీలిస్తారు. ఆదివారం వరకు జరిగిన ట్రయల్‌రన్‌లో మోటార్లన్నీ విజయవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. ఎత్తిపోతలనే ఈ తొలిదశ పనులు అనుకున్న విధంగా విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రెండోదశ కింద వాగు విస్తరణ పనులను మొదలెట్టనున్నారు.
 
రెండోదశలో వాగుల విస్తరణ...సుందరీకరణ
రాజధాని అమరావతిని బ్లూగ్రీన్‌ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ప్రపంచబ్యాంకు రూ.400 కోట్ల మేర రుణాన్ని మంజూరు చేసింది. ఈ నిధులతోనే కొండవీటివాగు విస్తరణ, సుందరీకరణ పనులను చేపడుతున్నారు. త్వరలో వైకుంఠపురం వద్ద కృష్ణానదిలో నిర్మించనున్న ఆనకట్ట రూపేణా 10 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడినుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర కొత్తగా కాలువను నిర్మించి నేలపాడు-నీరుకొండ మధ్య ఏర్పాటుచేయనున్న జలాశయానికి కలుపుతారు. లాం... ఆపైనుంచి వచ్చే కొండవీటి వాగు వరద నీటితో కూడా ఈ జలాశయాన్ని నింపుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడి నుంచి ఉండవల్లి కృష్ణాతీరం వరకు 11కిలోమీటర్ల పొడవున కొండవీటివాగును భారీగా విస్తరించనున్నారు. ప్రస్తుతం 25మీటర్ల వెడల్పువున్న వాగు బెడ్‌లెవల్‌ను 75మీటర్లు, పై ఎత్తులో వంద నుంచి 115మీటర్ల వరకు విస్తరిస్తారు. దీనివల్ల వాగులో 22వేలకు పైగా క్యూసెక్కులు ప్రవహించే వీలవుతుంది. నీరుకొండ నుంచి కృష్ణానది వరకు సాగే వాగు ప్రవాహం మధ్య కృష్ణాయపాలెం వద్ద మరో రిజర్వాయరును నిర్మిస్తారు. కొండవీటివాగుతో పాటు దానిలో కలిసే ఉపవాగులైన పాలవాగు, కొట్టేళ్లవాగు, అయ్యన్నవాగులను సైతం ఇదే తరహాలో విస్తరిస్తారు. వైకుంఠపురం రిజర్వాయరు నుంచి కొత్తగా నిర్మించబోయే కాలువను నీరుకొండ జలాశయానికి కలపడం వల్ల వైకుంఠపురం రిజర్వాయర్‌ నీటిని పరిమితమైన రీతిలో ప్రకాశం బ్యారేజికి తరలించే వెసులుబాటు కలుగనుంది.
 
వాగులు...జలాశయాల తాలూకు ప్లాన్‌ ఇదీ
కొండవీటివాగు విస్తరణ కోసం సుమారు 885 ఎకరా లు, పాలవాగు ఇతర పిల్లవాగుల విస్తరణ నిమిత్తం 433 ఎకరాలు, వైకుంఠపురం నుంచి కొత్తగా నిర్మించను న్న కాలువ కోసం 217 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనావేశారు. నీరుకొండ-నేలపాడు మధ్య నిర్మించనున్న జలాశయం కోసం 450 ఎకరాలు, కృష్ణాయపాలెం వద్ద నిర్మించనున్న మరో జలాశయం కోసం 190 ఎకరాలు కేటాయించాలని అంచనా వేశారు. వీటితోపాటు శాఖమూరు వద్ద కూడా 50 ఎకరాల విస్తీర్ణంలో మరో జలాశయాన్ని ఏర్పాటుచేసేవిధంగా మాస్టర్‌ప్లాన్‌ లో ప్రతిపాదించారు. ప్రస్తుతానికి కొండవీటివాగు విస్తరణ, అభివృద్ధి పూర్తిగా రాజధాని పరిధిలో మాత్రమే అం టే నీరుకొండ నుంచి ఉండవల్లి తీరం వరకు మాత్రమే జరగనుంది. తరువాతి దశలో నీరుకొండ నుంచి లాం వ రకు వాగు విస్తరణ పనులు చేపడతారు. ప్రభుత్వం చే పడుతున్న ఈ చర్యల వల్ల కొండవీటివాగుకు ఏస్థాయి లో వరదలు వచ్చినా రాజధాని ప్రాంతంలో ఒక్క సెంటుభూమి కూడ ముంపునకు గురయ్యే అవకాశం వుండదు.
Link to comment
Share on other sites

అమరావతి బాండ్లపై శాసనసభలో చర్చ
01284110BRK86A.JPG

అమరావతి: రాష్ట్రప్రభుత్వానికి ఉన్న బ్రాండ్‌తోనే అమరావతి బాండ్లు గంట వ్యవధిలో రూ.2వేల కోట్లు ఆర్జించాయని పురపాలక, సీఆర్డీఏ శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఎలక్ర్టానిక్‌ బిడ్డింగ్‌ వ్యవస్థ ద్వారా చేపట్టిన ఈ బాండ్ల జారీలో సంస్థాగత మదుపర్ల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన వెల్లడించారు. బాండ్లకు 10.32శాతం వడ్డీ చెల్లింపు వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని... అయితే క్రిసిల్‌ రేటింగ్‌ ప్రకారం ఏప్లస్‌ మాత్రమే రాజధాని ప్రాంతానికి ఉందని అందుకే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మంత్రి సమాధానమిచ్చారు.

శాసనసభలో స్వల్ప వ్యవధి నోటీస్‌ కింద వచ్చిన అమరావతి బాండ్ల ప్రశ్నపై మంత్రి సమాధానమిచ్చారు. బాండ్ల ద్వారా వచ్చిన నిధులను మౌళిక సదుపాయాలు, పాలనా నగర నిర్మాణం, ఇతర ప్రాజెక్టులు చేపట్టేందుకు వినియోగిస్తామన్నారు. అమరావతికి తిరిగి చెల్లించే ఆదాయ వనరులు లేనందున క్రిసిల్‌ రేటింగ్‌ తక్కువగా ఉందని... అందువల్లే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌ ద్వారా బాండ్ల జారీని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందని మంత్రి స్పష్టంచేశారు.

మరోవైపు నీతిఆయోగ్‌ రూ.662కోట్ల రూపాయల మేర అదనపు నిధులను రాజధాని నిర్మాణం కోసం జారీ చేయాలని సిఫార్సు చేసినా ఇంతవరకూ కేంద్రం మంజూరు చేయలేదని మంత్రి తెలిపారు. ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో రాజధాని నిర్మాణ పనులు ఆగబోవని అన్నారు. బ్యాంకు రుణాల కోసం రాష్ట్ర వాటా 20శాతం ఉంచాల్సి వస్తుందని.. ఆ నిధులు లేకే తాము బహిరంగ మార్కెట్‌కు నిధుల కోసం వెళ్లినట్లు మంత్రి సభకు వివరించారు. అంతకుముందు ఈ అంశంపై సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భాజపా శాసన సభాపక్షనేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం జారీచేసిన బాండ్లకు అధిక వడ్డీ చెల్లిస్తున్నారనే భావన ప్రజల్లో ఉందని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. 12శాతం వడ్డీ ఇస్తే ఏ బాండ్లైనా 10రెట్లు ఓవర్‌ సబ్‌స్కైబ్‌ అవుతాయని.. బాండ్ల జారీ కోసం 16కోట్ల కమీషన్‌ ఎవరికి చెల్లించాలో తెలియజేయాలంటూ విష్ణకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

TDP 24x7 Retweeted
 

Government City Court – Judiciary Complex Monthly Update on Construction. September 10th 2018. https://bit.ly/2QmRsmn  #Amaravati #development #Andhrapradesh #capital #ManaAmaravati #ILoveAmaravati #APCRDA #prajarajadhani Instagram : http://www.instagram.com/prajarajadhani 

Dm0AtwPU8AA7AV0.jpg
Dm0AtQ_UUAInezS.jpg
Dm0AtMtU4AApfhm.jpg
Dm0AtQ9U4AEsJl8.jpg
0 replies 22 retweets 60 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

అమరావతిలో స్టార్‌ ఆతిథ్యం
13-09-2018 07:37:21
 
636724210419303989.jpg
  • రాజధానిలో ఎనిమిది స్టార్‌ హోటల్స్‌
  • దేశీయంగా ప్రముఖ సంస్థలకు ఆహ్వానం
  • ఈ నెల 28 వరకు సీఆర్డీఏ బిడ్‌ల స్వీకరణ
గుంటూరు: అమరావతి రాజధాని నగరంలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి దేశ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు సీఆర్‌డీఏ ఆహ్వానం పలికింది. ఫైవ్‌, ఫోర్‌, త్రీ స్టార్‌ హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకు బిడ్‌లు స్వీకరించి ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తోన్నది. ‘దేశంలోనే ప్రప్రథమంగా నిర్మాణం జరుగుతోన్న అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలో భాగాస్వామ్యం కావాలని... అందులో మీ ఐకానిక్‌ హోటల్‌ ఉండేలా చూసుకోండి...’ అన్న ఆకర్షణీయమైన నినాదంతో ఆహ్వానిస్తోన్నది. టాటా, ఒబెరాయ్‌ వంటి సంస్థలు తమ ప్రతి పాదనలతో ముందుకొస్తాయని అధికారవర్గాలు ఆశిస్తున్నాయి. రాజధాని నగరానికి 2025 సంవత్సరం నాటికి 10 వేల మంది కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా వేస్తోన్నారు. అలానే పర్యాటకం థీమ్‌ ఎకనామిక్‌ జోన్‌ కలిగిన నగరంగా అమరావతి ఉండబోతున్నది. 2050 నాటికి సిటీ జీడీపీ 3.5 బిలియన్‌ యూఎస్‌ డాలర్లని అధిగమిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ హోటళ్లకు అధిక డిమాండ్‌ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగా రాజధానిలో రెండు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, ఒక ఫోర్‌ స్టార్‌ హోటల్‌, ఐదు త్రీస్టార్‌ హోటళ్లకు డిమాండ్‌ ఉంటుందని అంచనాకొచ్చారు. ఆయా హోటళ్లు ఏర్పాటు చేయడం వలన వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యక్ష, పరోక్షంగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వ పరంగా కల్పించే అవకాశం లేకపోలేదు.
 
ఎకరం రూ.1.50 కోట్లకే
సీఆర్‌డీఏ వద్ద విలువైన భూమి అందుబాటులో ఉన్నది. ఎకరం రూ. 1.50 కోట్లకే ఇస్తామని చెబుతోన్నది. ప్రధానంగా రివర్‌ఫ్రంట్‌ హోటళ్లు నిర్మించుకొనే వెసులుబాటు రాజధానిలో ఉన్నది. నగరమంతటా గ్రీన్‌, బ్లూ నెట్‌వర్కు ఉంటుంది. పచ్చదనం, కాలువలు నిర్మిస్తారు. దీని వల్ల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. సహజంగా విదేశాల నుంచి వచ్చే వారే కాకుండా చాలామంది ప్రముఖులు స్టార్‌ హోటళ్లలోనే బస చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో కచ్ఛితంగా డిమాండ్‌ ఉంటుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Link to comment
Share on other sites

రాజధానిలోని 4 ఎల్పీఎస్‌ జోన్లకు టెండర్ల్లు
13-09-2018 07:31:43
 
636724207044816671.jpg
  • మొత్తం పనుల విలువ రూ.5,758.49 కోట్లు
  • గత టెండర్లతో పోల్చితే రూ.300.12 కోట్ల మేర పెరిగిన అంచనా
 
రాజధానికి భూములిచ్చిన వారికి కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన నాలుగు ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పరిచేందుకు ఏపీసీఆర్డీయే మూడోసారి టెండర్లను పిలిచింది. తొలుత ‘హ్యాం (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌)’, ఆ తర్వాత ఈపీసీ విధానంలో వీటికి టెండర్లు ఆహ్వానించగా స్పందన శూన్యమైనందున తాజాగా మరోసారి ఈపీసీ పద్ధతిలోనే అంచనా వ్యయాలను పెంచి, టెండర్లు కోరింది. అంచనాలను పెంచినందున కనీసం ఇప్పుడైనా ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చి, ఈ 4 ఎల్పీఎస్‌ జోన్లకు టెండర్లు వేస్తాయని సీఆర్డీయే ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు.
 
 
అమరావతి: ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పరిచేందుకు ఏపీసీఆర్డీయే సుమారు 3 నెలల క్రితం టెండర్లు పిలిచింది. అయితే వాటికి స్పందన లేకపోవడంతో రద్దు పరిచింది. ఈ క్రమంలో మూడోసారి ముచ్చటగా పిలిచిన టెండర్లతో పోల్చితే 5.50 శాతం ఎక్కువకు (రూ.300.12 కోట్లమేర) అంచనాలను సవరించి, తాజా బిడ్లను సీఆర్డీయే పిలిచింది. ఏటా ఆగస్టులో వివిధ ప్రభుత్వ శాఖల్లో పరిపాటిగా జరిగే టెండర్ల అంచనాల సవరణ ప్రక్రియ వరకూ ఆగి, వాటి ప్రకారం సీఆర్డీయే టెండర్లు పిలిస్తే అప్పుడు పాల్గొనవచ్చునన్న ఉద్దేశ్యంతోనే వివిధ కంపెనీలు గతంలో బిడ్లను దాఖలు చేయలేదని అప్పట్లో వినవచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఆశించిన విధంగానే సీఆర్డీయే తాజాగా టెండర్లు పిలిచిన 9, 9 ఏ, 12, 12 ఏ జోన్ల అంచనాలను గణనీయంగా పెంచింది.
 
గత టెండర్లలో ఈ 4 జోన్ల అంచనా వ్యయం కలిపి మొత్తం రూ.5,458.37 కోట్లుకాగా ఇప్పుడది రూ.5,758.49 కోట్లకు చేరింది. అంటే సుమారు 5.50 శాతం పెరిగిందన్న మాట. అప్పట్లో 9వ జోన్‌ అంచనా వ్యయం రూ.1558.33 కోట్లు కాగా నేడది రూ.1629.92 కోట్లకు, 9 ఏకు సంబంధించి రూ.1059.25 కోట్ల నుంచి రూ.1106.09 కోట్లకు, 12వ జోన్‌కు రూ.1644.56 కోట్ల నుంచి రూ.1746.66 కోట్లకు, 12 ఏకు సంబంధించి రూ.1196.23 కోట్ల నుంచి రూ.1275.82 కోట్లకు చేరింది. ఆసక్తి ఉన్న సంస్థలు తమ బిడ్లను సమర్పించేందుకు సీఆర్డీయే వేర్వేరు గడువులను నిర్ణయించింది. 9, 9 ఏలకు చెందిన బిడ్ల స్వీకరణకు అక్టోబరు 8, 12, 12 ఏలకు అక్టోబరు 9 వరకూ గడువునిచ్చింది.
 
‘హ్యాం’, ఈపీసీ.. పేరేదైనా ఫలితమొక్కటే..
పూలింగ్‌ సమయంలో రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను అనుసరించి, రిటర్నబుల్‌ ప్లాట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరచేందుకు వాటిని 14 ఎల్పీఎస్‌ జోన్లుగా సీఆర్డీయే విభజించింది. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం నిబంధనల ప్రకారం ఈ జోన్లను మూడేళ్లలో అత్యుత్తమ, ప్రపంచస్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి పరచాల్సి ఉంది. భూగర్భ యుటిలిటీ లైన్లు, రహదారులు, డ్రెయిన్లు, పైపులైన్లు, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, అవెన్యూ ప్లాంటేషన్‌ ఇత్యాది సదుపాయాలను కల్పించాల్సి ఉన్నందున ఈ జోన్ల డెవల్‌పమెంట్‌కు ఒక్కొక్క దానికి వందల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. నిధుల కొరత నివారణతోపాటు పనులు వేగంగా జరిగేలా చూడాలనే ఉద్దేశ్యంతో సీఆర్డీయే ఈ జోన్ల అభివృద్ధిని వివిధ పద్ధతుల్లో చేయాలని నిర్ణయించింది. 8, 11 జోన్లలో భూసేకరణ ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రానందున వాటిని మాత్రం పక్కన పెట్టింది. మిగిలిన జోన్లలో కొన్ని నెలల క్రితం 1, 2, 3, 6, 7, 10 జోన్ల టెండర్లను ఈపీసీ విధానంలో ఖరారు చేశారు. అవి పోను 4, 5, 9, 9 ఏ, 12, 12 ఏ జోన్లకు ఖరారు చేయాల్సి ఉంది. వీటిల్లో 4, 5, 9, 12, 12 ఏలను ‘హ్యాం’ విధానంలో అభివృద్ధి పరచాలని సీఆర్డీయే భావించింది.
 
ఈపీసీ విధానంలో ప్రాజెక్ట్‌ మొత్తం అంచనా వ్యయాన్ని సీఆర్డీయేనే భరించాల్సి ఉండగా, టెండర్ల ప్రక్రియలో విలక్షణమైనదిగా పేర్కొంటున్న ‘హ్యాం’లో మాత్రం 40 శాతాన్ని సీఆర్డీయే భరిస్తే, మిగిలిన 60 శాతాన్ని కాంట్రాక్ట్‌ సంస్థే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవి పెట్టిన పెట్టుబడిని 15 సంవత్సరాల్లో బ్యాంకు వడ్డీ కంటే 3 శాతం ఎక్కువతో కలిపి, సీఆర్డీయే తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానాన్ని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌.హెచ్‌.ఎ.ఐ.) ఇప్పటికే అమలు పరుస్తూ సత్ఫలితాలను సాధిస్తుండడాన్ని ఈ సందర్భంగా సీఆర్డీయే పరిగణనలోకి తీసుకుంది. అందులో భాగంగా ఈ జోన్లకు గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి మధ్య ‘హ్యాం’ విధానంలో బిడ్లను ఆహ్వానించగా, 5 జోన్లకు కలిపి ఒక్కటంటే ఒక్క బిడ్‌ మాత్రమే (జోన్‌ 4కు) దాఖలైంది. ఇలా లాభం లేదనుకుని.. వాటితోపాటు 9 ఏ జోన్‌ను కూడా కలిపి మొత్తం 6 ఎల్పీఎస్‌ జోన్లకు మొదట్లో మాదిరిగా ఈపీసీ విధానంలోనే కొద్ది నెలల క్రితం టెండర్లు పిలిచింది. దీనికైనా ఆశించిన స్పందన లభించగలదని ఆ సంస్థ భావించగా, తద్భిన్నంగా జరిగింది! దీంతో వీటి అంచనాలను సవరించి, సీఆర్డీయే తాజా టెండర్లను ఆహ్వానించింది.
Link to comment
Share on other sites

అమరావతిలో భారీ మసీదు
13-09-2018 03:11:23
 
636724050841447510.jpg
  • మక్కా మసీదును తలపించేలా
  • పది ఎకరాల స్థలంలో నిర్మాణం
  • భిన్నమతాల వేదికగా రాజధాని
  • అటు తిరుమల కోవెల.. ఇటు
  • మసీదు నిర్మాణంతో ఆ సందేశం
  • వక్ఫ్‌బోర్డుతో చర్చించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయండి:సీఎం
(ఆంధ్రజ్యోతి - అమరావతి)
రాజధానిలో భారీ మసీదు నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వక్ఫ్‌ బోర్డుతో సంప్రదించి, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని సీఆర్డీయే అధికారులను ఆయన ఆదేశించారు. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటపాలెం వద్ద 25 ఎకరాల్లో తిరుమల ఆలయాన్ని తలపించే శ్రీవారి కోవెల నమూనాకు ఇటీవలే ఆమోదముద్ర వేసిన ఆయన, ఇప్పుడు అదే తరహాలోనే ముస్లిం సోదరుల కోసం పది ఎకరాల్లో పెద్ద మసీదును ఏర్పాటు చేసేందుకు సమ్మతించారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఏపీ సీఆర్డీయే సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకొన్నారు. ‘‘ప్రజా రాజధాని అమరావతిని అన్ని మతాలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా మార్చాలన్నది నా సంకల్పం. నూతన రాజధానిలో ఒకవైపు శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని, మరోవైపు మసీదును నిర్మించడం ద్వారా ఆ సందేశాన్ని అందించనున్నాం. మక్కా మసీదును తలపించేలా, అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ మసీదును తీర్చిదిద్దుతాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.
 
కాగా, ఈ సమావేశంలో తొలుత సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి వరుసగా రాజధానిలో జరుగుతున్న హౌసింగ్‌ కాంప్లెక్స్‌లు, రహదారులు- ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని తెలిపే ప్రజెంటేషన్లను ఇచ్చారు. అనంతరం సీఎం ప్రసంగించారు. ‘‘అమరావతి నిర్మాణం దేశీయ సంస్థలకు దక్కిన అపూర్వ అవకాశం. అత్యుత్తమ నాణ్యత కలిగిన కట్టడాలను ఆ సంస్థలు నిర్మించాలి. అలాగని నిర్మాణాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జాప్యం కుదరదు. నిర్ణీత గడువులోపే పనులు పూర్తి చేయాలి’ అని సీఎం ఆదేశించారు. బుధవారం ఆయన ఏపీసీఆర్డీయే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాజధానిలో జరుగుతున్న హౌసింగ్‌ కాంప్లెక్స్‌లు, రహదారులు- ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని తెలిపే ప్రజెంటేషన్లను సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డీ లక్ష్మీ పార్థసారథి ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి స్పందించారు. ‘‘అమరావతిలో చేపట్టే ప్రతి నిర్మాణం, ఆ నగరపు అందాన్ని ద్విగుణీకృతం చేయాలి. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ఈ విషయంలో రాజీ పడరాదు’’ అని స్పష్టం చేశారు..
 
ఆ మూడు ప్రాజెక్టులకు ఓకే
రాజధానిలో పర్యాటకులను ఆకట్టుకునే మూడు ప్రాజెక్టులపై ముందడుగు పడింది. జలక్రీడా ఆకర్షణలతో అమరావతి మెరీనా, నదీ అభిముఖంగా నిర్మించనున్న అమరావతి రిసార్ట్‌, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆతిఽథ్యాన్నిచ్చే అమరావతి కన్వెన్షన్‌ సెంటర్‌లకు సంబంధించి ఆయా నిర్మాణసంస్థల ప్రతినిధులు సీఆర్డీయే సమావేశం వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఎల్‌వోఏ (లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌) అందుకున్నారు. అమరావతి మెరీనాను కోస్తా మెరైన్‌ సంస్థ నెలకొల్పుతోంది.
Link to comment
Share on other sites

34 minutes ago, sonykongara said:
అమరావతిలో స్టార్‌ ఆతిథ్యం
13-09-2018 07:37:21
 
636724210419303989.jpg
  • రాజధానిలో ఎనిమిది స్టార్‌ హోటల్స్‌
  • దేశీయంగా ప్రముఖ సంస్థలకు ఆహ్వానం
  • ఈ నెల 28 వరకు సీఆర్డీఏ బిడ్‌ల స్వీకరణ
గుంటూరు: అమరావతి రాజధాని నగరంలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి దేశ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు సీఆర్‌డీఏ ఆహ్వానం పలికింది. ఫైవ్‌, ఫోర్‌, త్రీ స్టార్‌ హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకు బిడ్‌లు స్వీకరించి ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తోన్నది. ‘దేశంలోనే ప్రప్రథమంగా నిర్మాణం జరుగుతోన్న అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలో భాగాస్వామ్యం కావాలని... అందులో మీ ఐకానిక్‌ హోటల్‌ ఉండేలా చూసుకోండి...’ అన్న ఆకర్షణీయమైన నినాదంతో ఆహ్వానిస్తోన్నది. టాటా, ఒబెరాయ్‌ వంటి సంస్థలు తమ ప్రతి పాదనలతో ముందుకొస్తాయని అధికారవర్గాలు ఆశిస్తున్నాయి. రాజధాని నగరానికి 2025 సంవత్సరం నాటికి 10 వేల మంది కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా వేస్తోన్నారు. అలానే పర్యాటకం థీమ్‌ ఎకనామిక్‌ జోన్‌ కలిగిన నగరంగా అమరావతి ఉండబోతున్నది. 2050 నాటికి సిటీ జీడీపీ 3.5 బిలియన్‌ యూఎస్‌ డాలర్లని అధిగమిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ హోటళ్లకు అధిక డిమాండ్‌ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగా రాజధానిలో రెండు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, ఒక ఫోర్‌ స్టార్‌ హోటల్‌, ఐదు త్రీస్టార్‌ హోటళ్లకు డిమాండ్‌ ఉంటుందని అంచనాకొచ్చారు. ఆయా హోటళ్లు ఏర్పాటు చేయడం వలన వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యక్ష, పరోక్షంగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వ పరంగా కల్పించే అవకాశం లేకపోలేదు.
 
ఎకరం రూ.1.50 కోట్లకే
సీఆర్‌డీఏ వద్ద విలువైన భూమి అందుబాటులో ఉన్నది. ఎకరం రూ. 1.50 కోట్లకే ఇస్తామని చెబుతోన్నది. ప్రధానంగా రివర్‌ఫ్రంట్‌ హోటళ్లు నిర్మించుకొనే వెసులుబాటు రాజధానిలో ఉన్నది. నగరమంతటా గ్రీన్‌, బ్లూ నెట్‌వర్కు ఉంటుంది. పచ్చదనం, కాలువలు నిర్మిస్తారు. దీని వల్ల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. సహజంగా విదేశాల నుంచి వచ్చే వారే కాకుండా చాలామంది ప్రముఖులు స్టార్‌ హోటళ్లలోనే బస చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో కచ్ఛితంగా డిమాండ్‌ ఉంటుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Mana vallu land allocate chesthu pothunnaru okkadu kuda construction start cheyyadam ledu BR shetty,indouk villu emaipoyaroo telidu,NRT building status telidu,singapore consortium vadu emaipoyadoo teliyadu

Link to comment
Share on other sites

అమరావతిలో అద్భుత మసీదు!
ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం
12ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో 10 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మసీదు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఉండవల్లిలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మక్కా మసీదు నిర్మాణ రీతులకు దీటుగా, ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా మసీదు నిర్మాణం ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో మసీదు నిర్మాణం చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో వివిధ రాజధాని పనులపై చర్చించి, కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు చేశారు.

* రాజధానిలో వెంటపాలెం గ్రామానికి సమీపంలో మురళీ ఫార్చ్యూన్‌ గ్రూపు 100 గదులతో నిర్మించనున్న హెల్త్‌ అండ్‌ రిక్రియేషన్‌ రిసార్ట్‌కు సీఆర్‌డీఏ మూడున్నర ఎకరాలు కేటాయించింది. భూమి కేటాయింపునకు సంబంధించిన పత్రాలను మురళీ ఫార్చ్యూన్‌ సంస్థ అధినేత ముత్తవరపు మురళీకృష్ణకు ముఖ్యమంత్రి అందజేశారు. ఫార్చ్యూన్‌ మురళీపార్కు రిసార్ట్‌ పేరుతో నిర్మించే హెల్త్‌ రిసార్ట్‌ పనుల్ని దసరాకి ప్రారంభించి, తొమ్మిది నెలల్లోపే పూర్తి చేస్తామని మురళీకృష్ణ తెలిపారు. సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ రిసార్టులో హెల్త్‌ బేలు, రిక్రియేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సదుపాయాలు, సమావేశ మందిరాలు, ఈత కొలను వంటి వసతులన్నీ ఉంటాయని, రాజధానిలో నిర్మించే మొదటి హోటల్‌ ఇదే అవుతుందని ఆయన తెలిపారు.
* రాజధానిలో మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమానికి సమీపంలోని కృష్ణా తీరంలో మెరీనా నిర్మాణానికి... కోస్తా మెరీనా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సీఆర్‌డీఏ ఎనిమిది ఎకరాలు కేటాయించింది. అక్కడ 60 బోట్లు నిలిపి ఉంచడానికి వీలుగా జెట్టీలు నిర్మిస్తారు. బోట్‌ క్లబ్‌, శిక్షణ కేంద్రం, ఫుడ్‌కోర్టు, రిక్రియేషన్‌ సెంటర్‌ వంటివి వస్తాయి. రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్నది ప్రతిపాదన.
* రాజధానిలో అమరావతి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి వరుణ్‌ హాస్పిటాలిటీ సంస్థకు సీఆర్‌డీఏ ఐదు ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టుని పీపీపీ విధానంలో చేపడతారు. దీనిలో రెండు వేల మంది కూర్చునేందుకు వీలుగా మల్టీపర్పస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, బాంక్వెట్‌ హాల్‌ వంటివి నిర్మిస్తారు. 12 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తారు.

2021 జనవరికి సచివాలయం.. పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం 2021 జనవరి 15 నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించినట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. వీటికి సంబంధించి 20 అంతస్తుల వరకు కోర్‌వాల్‌ నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31కి పూర్తవుతుందన్నారు. వీటిలో... 1, 2 టవర్లను జీ+40 అంతస్తులుగా రూ.932.46 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. వీటి నిర్మిత ప్రాంతం 28.41 లక్షల చ.అడుగులుగా పేర్కొన్నారు. 3, 4 టవర్లను జీ+40 అంతస్తులుగా రూ.784.62 కోట్ల (23.42 లక్షల చ.అడుగులు) వ్యయంతో నిర్మిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే జీఏడీ టవర్‌ని 49 అంతస్తులతో (17.03 లక్షల చ.అడుగులు) రూ.554.06 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని వివరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు...
* విజయవాడ, గుంటూరు నగరాల్లో సైకిల్‌ ట్రాక్‌ల ఏర్పాటులో వేగం పెంచాలి.
* అమరావతిలో ప్రతి నిర్మాణాన్ని జియోట్యాగింగ్‌ చేసి వర్చువల్‌ విధానంలో ఎక్కడి నుంచైనా సమీక్షించే చర్యలు చేపట్టాలి.
* రాజధానిలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ నిర్ణీత వ్యవధిలో పూర్తవాల్సిందే. జాప్యాన్ని సహించేది లేదు.
* నాణ్యతలో రాజీ వద్దు. తుదిరూపు ఆకట్టుకునేలా లేకపోతే నిర్మాణ సంస్థలపై చర్యలు తప్పవు.
* రాజధాని నిర్మాణాల్లో వినియోగిస్తున్న ఆధునిక విధానాలు యంత్ర సామగ్రి వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. ఐఐటీ, ఇంజినీరింగ్‌ కళాళాలల విద్యార్థులకు అవి మార్గదర్శకంగా ఉంటాయి.

Link to comment
Share on other sites

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఏజీ
15-09-2018 08:27:49
 
అమరావతి: రాజధానిలోని నేలపాడు వద్ద నిర్మాణంలో ఉన్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ శుక్రవారంనాడు పరిశీలించారు. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ కాంప్లెక్స్‌ వివరాలను, పనుల ప్రణాళికను ఆయనకు వివరించారు. ఇందులోని 6 భాగాలకుగాను ఒక భాగానికి సంబంధించిన మొదటి శ్లాబ్‌ పూర్తయిందని, మరో భాగపు శ్లాబ్‌ పనులకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మిగిలిన 4 భాగాలకు సంబంధించిన కాలమ్స్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్‌ 15వ తేదీకల్లా అన్ని పనులు పూర్తి చేసి, హైకోర్టు నిర్వహణకు వీలుగా ఈ కాంప్లెక్స్‌ను సిద్ధం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాస్‌ రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న ఏఐఎస్‌ అధికారుల నివాసాలను కూడా చూశారు. అక్కడి నమూనా ఫ్లాట్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో సీఆర్డీయే సీఈ ఎం.జక్రయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...