Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో శ్రీవారి ఆలయం 
కృష్ణా తీరాన 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 
చోళ, పల్లవ, చాళుక్య నిర్మాణ రీతుల  మేళవింపు 
రూ.140 కోట్ల వ్యయం.. రెండేళ్లలో పూర్తి 
తితిదే రూపొందించిన ఆకృతులకు 
ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయ ఆమోదం 
23ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతి రూపాన్ని రాజధాని అమరావతిలోనూ సృష్టించబోతున్నారు. తిరుమల తరహాలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భారతీయ శిల్పకళకు అద్దం పట్టేలా అద్భుత రాతి కట్టడంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. కృష్ణా నది తీరాన 25 ఎకరాల విస్తీర్ణంలో వచ్చే రెండేళ్లలో ఈ ఆధ్యాత్మిక ధామం వెల్లివిరియనుంది. పల్లవులు, చోళులు, చాళుక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ వైభవం నేపథ్యంగా రూపొందించిన ఆకృతులను తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేసింది. వాటిని పరిశీలించిన సీఎం.. నిర్మాణ శైలికి, ఆలయ నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ నెల 29న జరిగే సమావేశంలో తితిదే పాలకమండలి కూడా ఆమోదించనుంది. రూ.140 కోట్ల వ్యయంతో, పూర్తి రాతి కట్టడంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

23ap-main3b.jpg

కాశ్యప శిల్పశాస్త్రం, మానసరము స్ఫూర్తిగా 
మన దేశ సంస్కృతిలో ఆలయం ఒక భాగం. గర్భాలయాన్ని దైవానికి ప్రతిరూపంగా కొలుస్తాం. ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం ఆలయంలోని వివిధ నిర్మాణాలను.. దైవం కూర్చుని ఉన్న లేక నిలుచున్న రూపానికి ప్రతిరూపంగానే భావిస్తారు. అమరావతిలో నిర్మించే వెంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను కాశ్యప శిల్పశాస్త్రం, మానసరము వంటి వాటి నుంచి స్ఫూర్తిగా తీసుకుని మలిచారు. దైవం పడుకుని ఉన్న రూపంలో పరిశీలిస్తే గర్భాలయం.. శిరస్సుగా, అంతరాలయం.. మెడగా, మహామండపం.. భుజాలు, ఆ దిగువ భాగంగా; దైవం కాళ్లు ఉండే ప్రాంతం.. నంది, ధ్వజస్తంభం, బలిపీఠం ఉండే ప్రాకారంగా; దైవం పాదాలు.. ఆలయ గోపురంగాను భావిస్తూ నిర్మాణశైలి ఉంటుంది. మనిషి దేహంలో ఉండే ఆజ్ఞ, సహస్ర, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధీస్థాన, మూలాధార.. చక్రాల ఆధారంగా ఆలయ నిర్మాణంలోనూ ఆయా ప్రాధాన్య కట్టడాలు ఉంటాయి. అమరావతి తిరుమలేశుడి ఆలయంలో వీటి మేళవింపు ఉంటుంది.

23ap-main3c.jpg

విశిష్ఠ శైలితో..

మిళనాడు కాంచీపురంలోని కైలాసనాథ శివాలయం, వైకుంఠ పెరుమాళ్‌ విష్ణాలయాలు అందమైన కట్టడాలకు ప్రతిరూపాలు. తంజావూరులో ద్రవిడ తరహా నిర్మాణ శైలిలో ఒక పరిపూర్ణత తీసుకువస్తూ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. చోళుల కాలంలో ఇదే అతి విశాలమైన, ఎత్తయిన ఆలయం. 216 అడుగుల ఎత్తుతో గ్రానైట్‌తో దీన్ని నిర్మించారు. చాళుక్యుల కాలంలో రాతి కట్టడానికి, ఇటుక కట్టడానికి ప్రతిరూపంగా నిలిచిన కర్ణాటక బాదామిలోని విష్ణు ఆలయం, పట్టడకాల్‌లో నిర్మించిన విరూపాక్ష దేవాలయం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపిలో నిర్మించిన విఠలాలయం, ఇతర ఆలయాలు హిందూ ఆలయ నిర్మాణ శైలికి ప్రతీకగా నిలిచాయి. అమరావతిలో నిర్మించే తితిదే ఆలయ నిర్మాణంలో వీటన్నింటిలోని విశిష్ట శైలిని మేళవించనున్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో శ్రీవారి కోవెల
24-08-2018 02:45:41
 
636706755443848097.jpg
  • అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణం
  • 25ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఆలయం
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల పుణ్యక్షేత్రం సాక్షాత్తూ అమరావతికి తరలొచ్చిందా అనిపించే రీతిలో రాజధానిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మితం కానుంది. 25ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, కృష్ణా తీరానికి చేరువలో రూపుదిద్దుకోనున్న ఈ కోవెల స్వరూపంతో పాటు అందులోని విగ్రహాలను కాశ్యప శిల్పశాస్త్రం, మయమాతము, మానసరములను అనుసరించి తీర్చిదిద్దనున్నారు. ఆధ్యాత్మికత, పవిత్రత ఉట్టిపడుతూ, భక్తులకు అవసరమైన సకల సదుపాయాలకు నెలవుగా ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ ప్రతిపాదించింది. ఉండవల్లిలోని ప్రజా వేదికలో గురువారం సీఆర్డీయేపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష లో టీటీడీ జేఈవో పి.భాస్కర్‌ ఆలయ విశిష్టతలు, ప్రత్యేకతలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆలయ ప్రాశస్త్యం, పవిత్రతలను పరిరక్షిస్తూనే, దాని వెలుపల భక్తులకు అవసరమైన అధునాతన వసతులను కల్పించేందుకు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు సూచించారు.
 
పలు శిల్పరీతుల సమాహారంగా...
దక్షిణ భారతదేశంలో విరాజిల్లిన వివిధ ప్రఖ్యాత శిల్పరీతుల ఆధారంగా ఈ ఆలయ నమూనాలను టీటీడీ రూపొందించింది. పూర్తిగా రాతితో, పురాతన ఆలయాలను తలపించేలా ఉండటం దీని విశిష్టత. పల్లవ శిల్ప శైలికి అద్దం పట్టే కాంచీపురంలోని క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన కైలాసనాథ ఆలయం, వైకుంఠ పెరుమాళ్‌ గుడి, చోళుల శిల్పకళా చాతుర్యానికి దర్పణంలా నిలిచే తంజావూరు, తిరుచిరాపల్లి జిల్లాలోని గంగైకొండ చోళపురంలోని 11వ శతాబ్దానికి చెందిన ఆలయాలతో పాటు చాళుక్య శిల్ప శైలి ఉట్టిపడే కర్ణాటక రాష్ట్రం బాదామి, హోయసలలోని వైష్ణవాలయాలు, బీజాపూర్‌ జిల్లా పట్టడకలోని విరూపాక్షాలయం, 1509-1550మధ్య శ్రీకృష్ణదేవరాయల హయాంలో నిర్మితమై విజయనగర శిల్పకళకు అద్భుత చిరునామాగా పేరొందిన హంపిలోని హజరారమ, విఠలేశ్వరస్వామి కోవెల తదితర ఆలయాలను నిశితంగా పరిశీలించి, అమరావతిలో నిర్మించబోయే ఆలయ నమూనాను సిద్ధం చేశారు. ఆలయ రాజగోపురం సమున్నతంగా, ప్రాచీన శిల్పకళారీతులకు అద్దం పట్టేలా రూపొందనుంది. విశాలమైన ప్రాకారం, ఆగమోక్తమమైన గర్భాలయం, సువిశాలమైన మాడవీధులు, ఆకట్టుకునే దేవతామూర్తుల విగ్రహాలతో గుడి ప్రాంగణం సర్వాంగ సుందరంగా ఉండనుంది.
Link to comment
Share on other sites

విశాఖ మెట్రోపై కొరియా కంపెనీల ఆసక్తి 
రూ.8వేల కోట్లతో ప్రాజెక్టు 
కొండపల్లిలో 890 ఎకరాల్లో జూ 
విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి  నేరుగా దుర్గగుడికి రహదారి 
సీఆర్‌డీఏ సమావేశం

ఈనాడు, అమరావతి: విశాఖ మెట్రో ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు పలు దక్షిణ కొరియా సంస్థలు ముందుకొచ్చాయి. రైలు బోగీలు, సిగ్నలింగ్‌, ట్రాక్‌ల తయారీ, ప్రాజెక్టు నిర్వహణ... ఇలా మెట్రోకు సంబంధించి వివిధ రంగాల్లో పేరెన్నికగన్న ఆ సంస్థలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని వ్యక్తపరిచాయి. ఆయా సంస్థల ప్రతినిధులు గురువారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగిన సందర్భంలో వారితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకూల స్థావరంగా మార్చుకోవాలని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దక్షిణ కొరియా ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. 
* విశాఖ మెట్రో ప్రాజెక్టుకు రూ.8వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు టాటా, షాపూర్జీ పల్లోంజీ, అదానీ, ఎస్సెల్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రైల్‌ సంస్థలు ఆసక్తి చూపాయి. త్వరలో టెండర్లు పిలిచి వాటిలో ఒక సంస్థను ఎంపిక చేస్తారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి వివిధ పరికరాల తయారీ, పరిజ్ఞానం అందజేసే దేశ, విదేశీ సంస్థలతో ఆ సంస్థ ఎస్పీవీ ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగుతుంది. విశాఖ మెట్రో ప్రాజెక్టుల్లో సివిల్‌ పనులకయ్యే రూ.4వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్మాణ సంస్థలు కోరుతున్నాయి. విశాఖలోని ప్రభుత్వభూముల్ని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. 
* విజయవాడలోని 3 కాలువలతో పాటు, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నదీ తీర ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ సమావేశంలో ఆదేశించారు. విజయవాడలో 37 కి.మీ. పొడవున ఉన్న బందరు, ఏలూరు, రైవస్‌ కాలువల సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, 4.8 కి.మీ.ల సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. 
* ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లోని కొండను, ఘాట్‌లను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, కాలువల చుట్టూ ఉన్న ముళ్లకంపలు, వ్యర్థాలను తొలగించి హరితహారాలు అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. 
* బ్యారేజీవద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసి, ఆ సమీపంలో ఎత్తైన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
* ప్రకాశం బ్యారేజీ సమీపంలో, దుర్గ గుడి దిగువున ఉన్న 24.5 ఎకరాల్లో చేపట్టనున్న ఫ్లైవోవర్‌ను ఐకానిక్‌గా తీర్చిదిద్దాలని, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, సర్వీసు అపార్ట్‌మెంట్లు ఏర్పాటుచేయాలని సీఎం సూచించారు. 
* రైల్వే స్టేషన్‌ నుంచి దుర్గగుడికి నేరుగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. 
* రాజధాని పరిధిలోని తాడేపల్లిలో 160 ఎకరాల అటవీ భూములే అందుబాటులో ఉన్నాయని, అక్కడ జూ, సఫారీ ఏర్పాటు అనుకూలం కాదని, కొండపల్లిలోని 890 ఎకరాలు అనుకూలంగా ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపి త్వరగా అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 
* ఈ నెల 27న బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో (బీఎస్‌ఈ) అమరావతి బాండ్ల లిస్టింగ్‌ కార్యక్రమానికి రావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సీఆర్‌డీఏ అధికారులు ఆహ్వానించారు.

పనులు ప్రారంభించని సంస్థలతో వచ్చేవారం సీఎం భేటీ 
రాజధానిలో భూములు తీసుకుని నిర్మాణాలు మొదలు పెట్టని సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేవారం ప్రత్యేకంగా సమావేశమవుతారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో కొండవీటి వాగు, పాల వాగు విస్తరణ, అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, ఆ పనులు పూర్తయితే రాజధానికి ఎప్పటికీ వరద ముప్పు ఉండదని, అమరావతి అత్యంత సురక్షిత నగరమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ఏపీ హైకోర్టు
24-08-2018 02:01:33
 
636706728962990580.jpg
  • సంక్రాంతి తర్వాత ఇక్కడే కేసుల విచారణ
  • రేపో మాపో రాష్ట్రపతి నోటిఫికేషన్‌!
  • అమరావతిలో సిద్ధమవుతున్న భవనం
  • అక్కడ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆమోదం
  • అక్టోబరు నాటికి నిర్మాణం పూర్తి
  • ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌పై సీజేకు సీఎం లేఖ
  • డిసెంబరు ఆఖరుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధం
న్యూఢిల్లీ/హైదరాబాద్‌/గుంటూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ‘ఉమ్మడి హైకోర్టు’ విభజనకు రంగం సిద్ధమైంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే... జనవరి ఒకటి నుంచే రెండు రాష్ట్రాల హైకోర్టులు వేరు అవుతాయి. సంక్రాంతి సెలవుల తర్వాత నవ్యాంధ్ర హైకోర్టు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభిస్తుంది. ఒకటి రెండు రోజుల్లోనే హైకోర్టు విభజనపై రాష్ట్రపతి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా... హైకోర్టు మాత్రం ఉమ్మడిగానే ఉంది. హైకోర్టు విభజన కోసం మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, నవ్యాంధ్రలో పూర్తి సదుపాయాలుంటే తప్ప హైకోర్టును విభజించలేమని ఉమ్మడి హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు విజయవాడలో రెండు మూడు ప్రాంగణాలను పరిశీలనలోకి తీసుకున్నా అవేవీ ఖరారు కాలేదు. మరోవైపు... అమరావతిలో హైకోర్టును ప్రతిష్ఠాత్మకంగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన డిజైన్లు కూడా పూర్తయ్యాయి. అయితే... ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన హైకోర్టు భవనాన్ని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
 
నేలపాడు, తుళ్లూరు గ్రామాల పరిధిలో ‘జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌’ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణ పనులను గత శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కైత్‌, జస్టిస్‌ సీతారామమూర్తి పరిశీలించారు. సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు పనుల పురోగతిని జడ్జిలకు వివరించారు. అలాగే... అమరావతిలో నిర్మిస్తున్న జడ్జిల బంగళాలు, ఐఏఎస్‌ అధికారుల నివాసాలను కూడా న్యాయమూర్తులు పరిశీలించారు. జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు ఈ భవన సముదాయం సరిపోతుందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులన్నీ అక్టోబరు నాటికి పూర్తవుతాయని... ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌ ఏర్పాటుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌ సహా మొత్తం పనులు డిసెంబరు ఆఖరునాటికి పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైకోర్టు విభజనపై రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి రెండు రాష్ర్టాలకు వేరు వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేస్తూ ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారని తెలుస్తోంది. జనవరి 1నాటికి భవనం సిద్ధమైనప్పటికీ సంక్రాంతి తర్వాతే ఏపీ హైకోర్టులో కేసుల విచారణ మొదలయ్యే అవకాశముంది.
 
ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కారు... అంతకంటే ముందే హైకోర్టు విభజన, జోనల్‌ వ్యవస్థలకు ఆమోదం పొందాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో... తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గురువారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. అనేక అంశాలపై కేంద్ర పెద్దలు, అధికారులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన గురించి ప్రస్తావించారు.
Link to comment
Share on other sites

TTD to build Tirumala temple replica in Amaravati

THE HANS INDIA |   Aug 24,2018 , 02:47 AM IST
   

TTD to build Tirumala temple replica in Amaravati
TTD to build Tirumala temple replica in Amaravati
 
 
Amaravati: Tirumala-Tirupati Devasthanams (TTD) is planning to construct a temple for Sri Venkateswara Swamy on a 25-acre land in the capital city. A team of TTD officials led by joint executive officer P Bhaskar presented their plans and designs of the temple, which will be on the lines of Tirumala temple, to Chief Minister N Chandrababu Naidu at his residence in Undavalli on Thursday.
 
 
 
 
 
The officers said that the designs for new temple have been made as per Agama and Vastu sastras. Naidu suggested that the sanctity of temple be protected and modern facilities be provided outside the temple with separate funds.
 
The temple consisting of Garbhalayam with Vimana or Sikhara, named as ‘Prasada’ by Agamas and Vastu sastras is worshipped as a symbolic form of God. According to Agamas and Vastu sastras, various parts of the temple are considered as symbolic representation of limbs of the God either with standing or seated postures.
 
The architecture and sculptures of the proposed temple plans have been prepared in accordance with the Kasyapa Silpasastram, Mayamathamu and Maanasaramu, according to TTD officials.
 
They said that the temple was designed with a mix of Pallava, Chola, Chalukya and Vijayanagara architectures. It may be noted here that the most beautiful example of Pallava architecture is Kailasanatha temple dedicated to Lord Shiva and the Vaikunta Perumal temple of Lord Vishnu of 7th century located at Kanchipuram.
 
The Chola architecture includes Tanjore and Gangaikonda Cholapuram in Tiruchurappalli district in Tamil Nadu built in 11th century AD. The Chalukya architecture rock temple include Lord Vishnu temple in Badami, Aihole and Virupaksha temple of Lord Shiva at Pattadakal in Bijapur district of Karnataka. The Vijayanagara architecture includes the splendid temples of Hazararama and Vittala at Hampi built in Krishnadevaraya reign of 1509-50 AD.
 
 

Link to comment
Share on other sites

సచివాలయ టెండర్లకు ఆమోదం
25-08-2018 02:26:40
 
636707608030452408.jpg
  • 3 సంస్థలకు సీఆర్డీయే అథారిటీ గ్రీన్‌సిగ్నల్‌
  • 5 టవర్ల అంచనా వ్యయం 2170 కోట్లు
  • 4.6 శాతం అధికంగా కోట్‌
  • ఎన్‌సీసీ, ఎస్‌పీసీఎల్‌, ఎల్‌అండ్‌టీలకు అవకాశం
  • 5లోగా ఫౌండేషన్‌ డిజైన్లు రాక
అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న శాశ్వత సచివాలయ సముదాయంలోని 5 టవర్లకు సంబంధించిన టెండర్లను ఏపీసీఆర్డీయే అథారిటీ ఆమోదించింది. 3 ప్యాకేజీలుగా చేపట్టే టవర్ల నిర్మాణాలకు రూ.2170.70 కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే సగటున 4.6ు అధికంగా(రూ.2271 కోట్లు) కోట్‌ చేసిన ఎల్‌-1 కాంట్రాక్ట్‌ సంస్థలు ఎన్‌సీసీ, ఎస్‌పీసీఎల్‌, ఎల్‌అండ్‌టీలకు టెండర్లు ఖరారు చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటికి ఆమోదముద్ర పడింది. సీఎంతోపాటు, సీఎస్‌, ప్రభుత్వ పరిపాలనా అధికారులు ఉండే 50 అంతస్తుల జీఏడీ టవర్‌కు రూ.554.06 కోట్లు అవుతుందని సీఆర్డీయే అంచనా వేయగా.. 4.69ు (రూ.529.25కోట్లు) ఎక్కువ కోట్‌ చేసిన ఎన్‌సీసీ టెండర్‌ దక్కించుకొంది. మంత్రులు, హెచ్‌వోడీలు, అధికారులు, ఉద్యోగులు ఉండే 1,2 టవర్లకు రూ.891.46 కోట్లు అవుతాయని భావించగా.. 4.6ు(రూ.932.47 కోట్లు) ఎక్కువ కోట్‌ చేసిన ఎన్‌పీసీఎల్‌ టెండర్‌ పొందింది. ఇక, 3,4 టవర్ల నిర్మాణానికి రూ.749.9 కోట్లు అవుతాయని అంచనా వేయగా.. 4.63ు (రూ.784.62కోట్లు) ఎక్కువ కోట్‌ చేసిన ఎల్‌అండ్‌టీ టెండర్‌ దక్కించుకొంది. కాగా, టవర్ల ఫౌండేషన్‌ డిజైన్లు వచ్చే నెల 5వ తేదీలోగా సీఆర్డీయేకు అందుతాయని సమాచారం.
 
టెండర్లు పొందిన మూడు కాంట్రాక్ట్‌ సంస్థలూ తమ స్ట్రక్చరల్‌ కన్సెల్టెంట్‌గా నియమించుకొన్న బ్యూరో హెపార్ట్‌ సంస్థ.. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ అయిన నార్మన్‌ ఫోస్టర్‌, సీఆర్డీయే అధికారులు, ఇంజనీర్లతో కొన్ని వారాలుగా దీనిపై విస్తృతంగా చర్చిస్తోంది. కాగా, శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో దృఢమైన షీట్‌ రాక్‌ తగలడంతో.. పైల్స్‌ పునాది కాకుండా.. ఆధునాతనమైన ర్యాఫ్ట్‌ పునాది వైపు మొగ్గు చూపుతున్నారు. పునాది గట్టిగా ఉండాలంటే ఒక్కో టవర్‌కు సుమారు 2వేల టన్నుల ఇనుము, 10వేల టన్నుల సిమెంట్‌ కాంకీట్ర్‌ అవసరం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని టవర్ల డిజైన్లకు అనుకూలమైన పునాది డ్రాయింగ్‌లు సెప్టెంబరు 5వ తేదీలోగా బ్యూరో హెపార్ట్‌ అందజేస్తుందని సమాచారం.
 
అడ్వాన్సులు 10 శాతమే: నారాయణ
అమరావతిలో కాంట్రాక్ట్‌ సంస్థలకు 15 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి నారాయణ విమర్శించారు. వాటికి 10శాతమే చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రజలపై భారం వేయకుండా... రాజధాని కోసం చేస్తున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమైన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాకే అమరావతి బాండ్లు జారీ చేశామన్నారు.
 
 
స్థానిక సంస్థలకు ‘ఎలక్ర్టిక్‌’ ప్రోత్సాహకాలు
స్థానిక సంస్థల్లో వాడే ఎలక్ట్రిక్‌ వాహనాలకూ ప్రోత్సాహకాలు ఇస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియారాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024లోగా రాష్ట్రానికి 10వేల ఎలక్ట్రికల్‌ వాహనాలను సరఫరా చేస్తామంటూ పునరుత్పాదక ఇంధన సంస్థతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు వర్తించే రాయితీలు కల్పిస్తారు. తాజా ఉత్తర్వులతో స్థానికసంస్థల్లో వాడే ఎలక్ర్టిక్‌ వాహనాలకు రోడ్డుపన్ను, జీఎస్టీ, విద్యుత్తు చార్జీలలో రాయితీలు ఇస్తారు.
Link to comment
Share on other sites

‘అమరావతి కేపిటల్‌ బాండ్లను సోమవారం బీఎస్‌ఈలో లిస్టింగ్‌ చేస్తాం’
26-08-2018 18:29:21
 
636709049590337228.jpg
అమరావతి: అమరావతి కేపిటల్‌ బాండ్లను సోమవారం బీఎస్‌ఈలో లిస్టింగ్‌ చేస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. సీఎం చంద్రబాబు సెరిమోనియల్‌ భెల్‌ మోగించిన వెంటనే బాండ్లు ట్రేడింగ్‌కు వెళతాయని, రేపు ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలను ఆయన కలుస్తారని తెలిపారు. కేపిటల్‌ బాండ్లకు వచ్చిన ఆదరణతో రిటైల్‌బాండ్లు, మసాలా బాండ్ల విడుదలకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని శ్రీధర్‌ పేర్కొన్నారు. త్వరలో ఈ బాండ్ల విడుదలకు సంబంధించి సెబీకి దరఖాస్తు చేస్తామని, అనుమతి వచ్చిన వెంటనే రూ. 1000 ముఖ విలువ కలిగిన రిటైల్‌ బాండ్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
 
 
‘‘రాజధాని నిర్మాణం, మౌలికసదుపాయాల కల్పన కోసం నిధులను వినియోగిస్తాం. ఎన్ని కోట్లకు బాండ్లు విడుదల చేసేది త్వరలో నిర్ణయిస్తాం. కేపిటల్‌ బాండ్లకు ఇంత ఆదరణ దక్కడం దేశంలోనే తొలిసారి. రెండు, మూడు నెలల్లో ఈ బాండ్లను సింగపూర్‌, లండన్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌లలో కూడా లిస్టింగ్‌ చేస్తాం. దీనికోసం సింగపూర్‌లో కొన్ని సంస్థలు కసరత్తు చేస్తున్నాయి’’ అని శ్రీధర్ తెలిపారు.
Link to comment
Share on other sites

రేపు బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌

08151026BRK126BSE.JPG

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నిధుల కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన వచ్చింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్‌డీఏ బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లోని ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫాంపై ఈనెల 14న ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు బిడ్డింగ్‌ నిర్వహించారు. గంట వ్యవధిలోనే సంస్థాగత మదుపరుల నుంచి రెండు వేల కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. మొదట బిడ్డింగ్‌కు ఉంచిన రూ.1300 కోట్ల బాండ్ల కొనుగోలుకే 1.53 రెట్లు స్పందన వచ్చింది. దాంతో సీఆర్‌డీఏ మరో రూ.700 కోట్లను కూడా బిడ్డింగ్‌కు ఉంచింది. ఎలాంటి తనఖాలు లేకుండానే, కేవలం రాజధాని ప్రాజెక్టుపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో సంస్థాగత మదుపరులు రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం వల్ల దేశ, విదేశాల్లో అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుందన్నది అధికారుల భావన. సోమవారం ఈ బాండ్లను బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లో లిస్టింగ్‌ చేయబోతున్నారు.

ఉదయం 9 గంటల ఐదు నిమిషాలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా లిస్టింగ్‌కు హాజరుకావాలని నిర్ణయించారు. అమరావతి బాండ్ల పట్ల మదుపరుల నమ్మకం చూరగొనడానికి సీఆర్‌డీఏ అధికారులు విస్తృత ప్రచారం చేశారు. ముంబయిలో సమావేశాలు నిర్వహించారు. మదుపరులు పెట్టే అసలుకి, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 10.32 శాతం వడ్డీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరుల్ని ఈ బాండ్లు బాగా ఆకర్షించాయి. ముంబయి నుంచి కొందరు మదుపరులు వచ్చి రాజధానిలో జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లారు. ఆ తర్వాతే బాండ్లలో మదుపు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గడచిన 30-40 ఏళ్లలో దేశంలోని వివిధ మున్సిపాలిటీలు బాండ్లు విడుదల చేసి సమీకరించిన మొత్తం రూ.1800 కోట్లయితే, అమరావతి బాండ్ల ద్వారా ఒక్క రోజే రూ.2 వేల కోట్లు సమీకరించారు. రాజధాని నగర నిర్మాణం కోసం ఇలా నిధులు సమీకరించడం దేశంలో ఇదే మొదటిసారి.

08152926BRK126BSE1.JPG

పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్న సీఎం

ముంబయి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం అనంతరం... రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ లతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు కీలక వ్యాపారవేత్తలను కలుసుకోనున్నారు. రిలయన్స్ ఇండస్డ్రీస్ అధినే ముఖేష్ అంబానీ, రిలయన్స్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్ లతో భేటీ కానున్నారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఎండీ నడియార్ గోద్రేజ్ తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మహేంద్ర వరల్డ్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ సీవోవో సంజయ్ శ్రీవాత్సవతో సీఎం భేటీ కానున్నారు. స్క్వేర్ గ్రూప్ ఛైర్మన్ బాలన్‌, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళం, వెల్సపన్ గ్రూప్ ఛైర్మన్ బీకే గోయింకా, పిరామిల్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. లోథా గ్రూప్ ఛైర్మన్ మంగళ ప్రభాత్ లోధాతోపాటు ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తో కూడా సీఎం సమావేశవుతారు. ఈ పర్యటనలో భాగంగా గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్, సెయింట్ గోబెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రహేజా గ్రూప్, టాటా ఇంటర్నేషనల్, హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ అవుతారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...