Jump to content

Amaravati


Recommended Posts

సకల హంగులతో స్పోర్ట్స్‌ సిటీ
27-09-2018 07:01:43
 
636736285053891701.jpg
  • అమరావతిలో క్రీడానగరానికి ప్రాధాన్యం
  • దేశ క్రీడారాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • న్యూఢిల్లీలో క్రీడాసంస్థల ప్రతినిధులతో సీఆర్డీయే వర్క్‌షాప్‌
అమరావతి: భవిష్యత్తులో ఒలింపిక్స్‌ వంటి అత్యంత ప్రతిష్టాత్మక క్రీడోత్సవాలను అమరావతిలో నిర్వహించడంతోపాటు దానిని సకల క్రీడలకు కేంద్రంగా మలచాలని సీఆర్డీఏ లక్ష్యాలు. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో బుధవారం పలు క్రీడా సంబంధిత సంస్థల ప్రతినిధులతో వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఇలాంటి వర్క్‌షాపుల నిర్వహణలో పేరొందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ తదితరుల సహాయ సహకారాలతో వర్క్‌షాప్‌ జరిగింది. రాజధానిలోని ప్రతిపాదిత 9 థీమ్‌సిటీల గురించి ఆయా రంగాలకు చెందిన ప్రఖ్యాత సంస్థలకు అవగాహన కలిగించింది. అవి ఆయా నగరాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు వాటిపై సీఆర్డీయే నిర్వహించనున్న వర్క్‌షాపుల పరంపరలో ఇది రెండవది.
 
ఇంతకుముందు మీడియా సిటీపై సంబంధిత ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వర్క్‌షాప్‌ నిర్వహించిన విషయం విదితమే. ‘ఏపీని ప్రత్యేకించి అమరావతిని దేశక్రీడా రాజధానిగా మలచడం, భావితరం క్రీడా దిగ్గజాలను తయారుచేయడం (ఆంధ్రప్రదేశ్‌- ఇండియాస్‌ స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఫర్‌ నెక్ట్స్‌ జెన్‌ ఛాంపియన్స్‌) ఎలాగన్న అంశంపై ప్రధానంగా చర్చించిన ఈ వర్క్‌షాప్‌లో సంబంధిత పలు ఇతర అంశాలపై కూడా నిపుణులు తమ అభిప్రాయాలను వెలువరించారు. అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఫుట్‌బాల్‌ ఫౌండేషన్‌, భైచుంగ్‌ భూటియా ఫుట్‌బాల్‌ స్కూల్స్‌, స్పోర్ట్స్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఇత్యాది క్రీడాసంఘాలతోపాటు జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌, డెకాఽథ్లాన్‌, స్టాగ్‌ స్పోర్ట్స్‌, కేపీఎంజీ, స్టెయిర్స్‌, పవర్‌ స్పోర్ట్జ్‌ టీవీ తదితర పలు క్రీడారంగ సంస్థలు, కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
 
రాష్ట్రం, అమరావతి క్రీడాంగణంలో మెరిసేలా..
ఇందులో తొలుత రాష్ట్ర క్రీడారంగం అభివృద్ధిపై తమ ప్రణాళికలను వివరించడంతోపాటు రాష్ట్రం ప్రధానంగా అమరావతిలో క్రీడారంగంలో భారీ పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తదితరులు వివరించారు. రాష్ట్రంలో క్రీడారంగం దూసుకుపోయేందుకు, స్పోర్ట్స్‌ టూరిజం విలసిల్లేందుకు ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకోబోతుందో పేర్కొన్నారు. ఆ తర్వాత సభికుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
 
మారథాన్‌ ట్రాక్‌, రోలర్‌ స్కేటింగ్‌, పలు క్రీడా అకాడమీలు...
ఈ సందర్భంగా సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ అమరావతి విశేషాలను వివరించడంతోపాటు అందులోని క్రీడానగరం ప్రాధాన్యాన్ని తెలియజేశారు. రాజధానిలో జరుగు తున్న వివిధ నిర్మాణాలు, రహదారుల గురించి, ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన విశ్వవిద్యాలయాలు, సంస్థల గురించి చెప్పారు. అమరావతిలోని ప్రతి టౌన్‌షిప్‌లో ఉద్యానవనాలు, క్రీడాసౌకర్యాలను కల్పిస్తామన్నారు. 21 కిలోమీటర్ల పొడవున నదీతీరాన్ని కలిగిన ఈ నగరంలో జాగింగ్‌ మారథాన్‌ ట్రాక్‌ ఏర్పాటుచేస్తామని, నగరవ్యాప్తంగా డెడికేటెడ్‌ సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, రోలర్‌ స్కేటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
 
నదీతీరాన 12ఎకరాల్లో పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, అమరావతి క్రికెట్‌ స్టేడియం, క్లబ్‌ హౌస్‌, ఇండోర్‌ అకాడమీ, భారత మహిళా క్రికెట్‌ జట్టు ప్రధాన స్థావరం, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, జలక్రీడలు ఇత్యాది క్రీడలకు కేంద్రంగా రాజధాని ఉంటుందని చెప్పారు. ఈ వర్క్‌షాపులో భాగంగా ‘రాష్ట్ర క్రీడారంగంలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ సీఈడీ వికాస్‌ శర్మ, ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌, శ్రీధర్‌ తదితరులు, ‘ఆంధ్రప్రదేశ్‌: ఇండియాస్‌ స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఫర్‌ నెక్ట్స్‌ జెన్‌ ఛాంపియన్స్‌’ అనే అంశంపై అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అదిల్లే జె.సుమరివాలా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) గవర్నింగ్‌ బాడీ మెంబర్‌ సిద్ధార్థ ఉపాధ్యాయ్‌, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ సీఈవో ముస్తఫా గౌస్‌, కేపీఎంజీ అసోసియేట్‌ డైరెక్టర్‌ అపరాజిత త్రిపాఠి, పవర్‌ స్పోర్ట్జ్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ కాంతి డి.సురేష్‌, ఇండియన్‌ ఫుట్‌బాల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ట్రస్టీ కిషోర్‌ టైడ్‌, స్టాగ్‌ స్పోర్ట్స్‌ ఛైర్మన్‌ రాకేష్‌కోహ్లి, ముఖేష్‌కుమార్‌ మీనా తదితరులు ప్రసంగించారు.
 
ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌, రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి సంస్థ ఓఎస్డీ భావన సక్సేనా, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ వర్క్‌ షాప్‌లో వచ్చిన సూచనలన్నింటినీ క్రోడీకరించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవడం ద్వారా అమరావతిలోని ప్రతిపాదిత స్పోర్ట్స్‌ సిటీస్థాపన, రాష్ట్రంలో క్రీడాభ్యున్నతి వడివడిగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చూడ నుంది.
Link to comment
Share on other sites

స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పోలో అమరావతిపై ఆసక్తి
27-09-2018 07:05:28
 
636736287303445735.jpg
అమరావతి: రాజస్థాన్‌లోని జైపూర్‌ వేదికగా ప్రారంభమైన స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పోలో అమరావతి స్టాల్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జైపూర్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ, క్వాంటెలా మీడియా సంస్థల ఆధ్వర్యంలో.. మూడు రోజులపాటు సాగే స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో బుధవారం మొదలైంది. ప్రారంభ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజధానికి సంబంధించిన విశేషాలను పొందుపరిచారు.
 
అమరావతి స్మార్ట్‌ సిటీ నిర్మాణ ప్రణాళిక, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ఐకానిక్‌ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టులతోపాటు సెక్రటేరియట్‌ టవర్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మొదలుకొని నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాల నమూనాలతోపాటు రహదారుల చిత్రాలను ఈ స్టాల్‌లో ఉంచారు. వీటి గురించి సందర్శకులకు (ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌) అధికారులు వివరించారు. ఏఎ్‌సఎ్‌ససీసీఎల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి.భవానీప్రసాద్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్లు జి.ఫణికుమార్‌, ఆర్‌.దివ్యకీర్తి, మేనేజర్‌ కోటేశ్వరరావు, ఆర్కిటెక్ట్‌ కార్తీక్‌, కన్సల్టెంట్‌ మోహిత్‌ తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
Link to comment
Share on other sites

30న ‘సెక్రటేరియట్‌’కు శంకుస్థాపన?
27-09-2018 03:14:59
 
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాజధానికి మకుటాయమానంగా నిలుస్తుందని ఆశిస్తున్న సచివాలయ సముదాయ నిర్మాణంలో ఈనెల 30న మరొక కీలక అడుగు పడనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఐదు ప్రతిష్ఠాత్మక టవర్లకు లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి ఏపీసీఆర్డీయే సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

పెట్టుబడులకు ఆహ్వానం
అమరావతిలో క్రీడానగరం నిర్మాణంపై దిల్లీలో సీఆర్‌డీఏ కార్యశాల
త్వరలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభం: గోపీచంద్‌
26ap-main15a.jpg

ఈనాడు, దిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలోని క్రీడానగరంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఏపీ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌లు ఆహ్వానించారు. బుధవారమిక్కడ సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ‘ఆంధ్రా కా వికాస్‌, దేశ్‌ కా వికాస్‌’ పేరుతో కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి నగర నిర్మాణం, మౌలిక వసతులు గురించి చెరుకూరి శ్రీధర్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రాజెక్టు గాండీవ పేరుతో ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామని, 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ నిర్వహణతోపాటు ఏడు బంగారు పతకాలు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యశాలలో ‘ప్రశ్నలు-సమాధానాలు’ సందర్భంగా పలువురు ఔత్సాహికులు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారని విలువైన సూచనలు చేశారని శ్రీధర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు క్రీడా పాలసీ విధానాలను ఎల్‌వీ సుబ్రహ్మణ్యం వివరించారు. అమరావతితోపాటు విశాఖపట్నం, తిరుపతి పట్టణాలను కూడా క్రీడా హబ్‌లుగా చేస్తామన్నారు. ముఖ్య అతిథి పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని..అలా చేయడం ఎందరికో స్ఫూర్తి ఇస్తుందన్నారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌ పతకం సాధించినప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన సత్కారం ఎంతోమంది ఔత్సాహికులను క్రీడల్లోకి ప్రవేశించేలా చేసిందన్నారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈడీబీ ఓఎస్డీ భావన సక్సేనా, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ చూపిన 25 మందిని సత్కరించారు.

Link to comment
Share on other sites

ఆకర్షణీయంగా రాజధాని రహదారులు
28-09-2018 08:03:53
 
636737186356248119.jpg
అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో దేశంలోనే ప్రప్రథమంగా ఆకర్షణీయమైన రహదారులను నిర్మిస్తున్నామని ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి అన్నారు. రాజధానిలో తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఎన్‌-15, ఎన్‌-17 రహదారులను గురువారం అధికారులతో కలసి పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆమె పిచుకలపాలెం, నెక్కల్లు, అనంతవరంలో జరుగుతున్న ఎన్‌-15, ఎన్‌-17 రహదారులతోపాటు మౌలిక సదుపాయాల కల్పన పనులను పరిశీలించారు. భూగర్భంలో నిర్మిస్తున్న పవర్‌ డక్ట్‌లలో అధికారులు ఒకసారి ట్రయల్‌వాక్‌ జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్‌ విద్యుత్తు దీపస్తంభాలను పరిశీలించి, తగు సూచనలిచ్చారు. ఏడీసీ ఈడీ జి.రత్నకుమార్‌, సీఈ టి.మోజెస్‌కుమార్‌, ఎస్‌.ఇ.లు ఎం.వి.సూర్యనారాయణ, పి.అంకమ్మచౌదరి, ఈఈ బి.నరసింహమూర్తి, పవర్‌ అడ్వైజర్‌ ఎం.వి.వి.రావు తదితరులు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

సెక్రటేరియట్‌ ఫౌండేషన్ పనులకు ముహూర్తం ఖరారు
28-09-2018 07:58:42
 
636737183239437564.jpg
  • 30న సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ ఫౌండేషన్‌ పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం?
  • ఏర్పాట్లు చేస్తున్న సీఆర్డీయే అధికారులు
 
అమరావతి: ఇప్పటికే ప్రభుత్వ గృహ సముదాయాలు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ ఇత్యాది భారీ నిర్మాణాలు సాగుతున్న అమరావతిలో వచ్చే ఆదివారం మరో ప్రతిష్టాత్మక సముదాయానికి చెందిన ప్రధాన ఘట్టం చోటు చేసుకోబోతోందని సమాచారం. 40, 50 అంతస్థుల భవంతులతో అమరావతి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి కానున్న శాశ్వత సచివాలయ సముదాయ ఫౌండేషన్‌ పనులకు ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. మొత్తం ఐదు టవర్లతో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని రెండో టవర్‌కు సంబంధించిన ఫౌండేషన్‌లో తాపీతో సిమెంట్‌ కాంక్రీట్‌ వేయడం ద్వారా ఆయన ఆ రోజున ఆ టవర్లకు లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేయనున్నారని భోగట్టా. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను చేయడంలో గత కొద్ది రోజులుగా సీఆర్డీయే, టవర్ల నిర్మాణ సంస్థలైన ఎల్‌ అండ్‌ టి, షాపూర్జీ పల్లోంజీ, ఎన్‌సీసీలు, కన్సల్టెంట్లు నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది.
 
ఒక్కొక్కటి 40 అంతస్థులతో 4 టవర్లు, 50 అంతస్థులతో మరో టవర్‌ (ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి ఇందులో కొలువు దీరుతారు)తో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ను అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా సీఆర్డీయే నిర్మింపజేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం సుమారు 70 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయం (విస్తీర్ణం 6 లక్షల చ.అ. మాత్రమే)తో పోల్చితే దాదాపు 12 రెట్ల పెద్దదిగా శాశ్వత సెక్రటేరియట్‌ టవర్లు రూపుదిద్దుకోబోతున్నాయి. ప్రపంచంలోని అత్యాధునిక బహుళ అంతస్థుల భవంతులకు దీటుగా, సకల వసతులతో నిర్మితం కానున్న ఈ సముదాయంలో మొత్తం 4,000 కార్లను నిలుపుకునే వీలుంటుంది. ఈ టవర్లన్నీ భూఉపరితలంతోపాటు స్కై వేల ద్వారానూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి.
 
త్వరలో ‘ఫౌండేషన్‌- సాయిల్‌ ఇంటరాక్షన్‌ రిపోర్ట్‌’
ఇప్పటికే ఈ టవర్లకు సంబంధించిన మట్టి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ టవర్ల నిర్మాణ కాంట్రాక్టులను పొందిన 3 ప్రసిద్ధ కంపెనీలు తమ ఫౌండేషన్‌ కన్సల్టెంట్‌గా నియమించుకున్న జియోకాన్‌ కన్సల్టెంట్‌ సంస్థకు చెందిన నిపుణులు సచివాలయ నిర్మాణ ప్రదేశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వారు ఆయా టవర్లకు సంబంధించిన ఫౌండేషన్‌ను ఎక్కడ, ఏ విధంగా వేయాలి తదితర అంశాలన్నింటినీ సూచిస్తూ ‘ఫౌండేషన్‌- సాయిల్‌ ఇంటరాక్షన్‌ రిపోర్ట్‌’ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీనికి మరి కొద్ది రోజులు పట్టనుందని సమాచారం. దాని ఆధారంగా నిర్మాణ సంస్థలు టవర్ల ఫౌండేషన్‌కు సంబంధించిన కాంక్రీట్‌ బెడ్ల పనులను చేపడతాయి.
 
5 టవర్లలో 2వ దానికి సంబంధించి జరిపిన పరీక్షల్లో ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు అనుకూలమైన గట్టి రాయి తగలడంతోపాటు వెంటనే కాంక్రీట్‌ బెడ్‌ వేసేందుకు ఇది మరింత అనువుగా ఉండడంతో తొలుత ఈ టవర్‌కు చెందిన కాంక్రీట్‌ బెడ్‌ను వేయాలని నిర్ణయించారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి అవసరమైన కాంక్రీట్‌ను తాపీతో వేయడం ద్వారా సెక్రటేరియట్‌ టవర్ల ఫౌండేషన్‌ పనులను లాంఛనప్రాయంగా ప్రారం భించనున్నారు. ఆ తర్వాత మిగిలిన టవర్ల ఫౌండేషన్‌ పనులు కూడా క్రమేపీ మొదలవుతాయి.
 
అన్ని టవర్ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, ఆ వెంటనే ఫ్లోర్ల పనులను చేపట్టడం ద్వారా ముఖ్యమంత్రి నిర్దేశించిన విధంగా వచ్చే ఏడాది మే నాటికి అన్నింట్లోనూ 20 అంతస్థుల చొప్పున పూర్తి చేయాలని కాంట్రాక్ట్‌ కంపెనీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్థులను కూడా నిర్మించి, సకల హంగులతో సచివాలయ శాశ్వత సముదాయాన్ని 2020, ఆగస్టుకల్లా (పనులు అప్పగించిన 24 నెలల్లోగా) పూర్తిస్థాయిలో అవి సిద్ధం చేసేలా సీఆర్డీయే అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు.
 
 
ముమ్మరంగా నీటి ఊట తొలగింపు ప్రక్రియ
కాగా.. సచివాలయ టవర్ల ఫౌండేషన్‌ పనుల్లో భాగంగా తీసిన గోతుల్లో కొన్నింట్లో పెద్దఎత్తున నీటి ఊట ఊరుతుండడం పనులకు కొంత అంతరాయంగా ఉన్నట్లు తెలిసింది. 1, 2, 5 టవర్లకు ఈ సమస్య అంతగా లేనప్పటికీ 3, 4 టవర్లకు మాత్రం కొంత అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కృష్ణానది, వివిధ వాగులకు చేరువలో ఉన్న నిర్మాణ ప్రదేశంలో ఈ సమస్య రావడం సహజమే. దీనిని ముందుగానే ఊహించిన సీఆర్డీయే , కాంట్రాక్ట్‌ సంస్థలు ‘డీవాటరింగ్‌(నీటి ఊట తొలగింపు)’ లో నైపుణ్యం, అనుభవమున్న సంస్థ ద్వారా కొన్ని రోజులుగా ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసా గిస్తున్నాయి. వర్షాల కారణంగా నీటిఊట పెరుగు తున్న ప్పటికీ దానిని భారీ యంత్ర పరికరాల ద్వారా ఎప్ప టికప్పుడు తొలగించే కృషి జోరుగా సాగుతుంది. త్వర లోనే ఈ సమస్యను అధిగమించగలుగుతామన్న ఆశాభావాన్ని అధికారులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

 
రాజధానిలోని ప్రాజెక్టుల పరిశీలన
29-09-2018 09:09:39
 
636738089816588779.jpg
అమరావతి: రాజధానిలో నిర్మాణంలో ఉన్న సీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయానికి సంబంధించిన శ్లాబ్‌లను నెలలోగా పూర్తిచేయాలని కమిషనర్‌ శ్రీధర్‌ కాంట్రాక్ట్‌ సంస్థ ప్రికా ప్రతినిధులను ఆదేశించారు. అమ రావతిలోని వివిధ ప్రాజెక్టులను శుక్రవారం పరిశీలించారు. అఖిల భారత సర్వీస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌ మెంట్ల పనులు జరుగుతున్న తీరును చూశారు. అక్కడ నిర్మించనున్న క్లబ్‌ హౌస్‌ కోసం స్థల పరిశీలన జరిపారు. శాశ్వత సచివాలయ టవర్ల పునాదుల కోసం జరుగుతున్న మట్టి పనులను పరిశీలించారు. ఆ తర్వాత హ్యాపీ నెస్ట్‌ పేరిట నిర్మించదలచిన టవర్లకు అనువైన స్థలాలను గుర్తించేందుకు నేలపాడు, ఐనవోలు సమీపంలోని స్థలాలను చూశారు. కార్యక్రమంలో సీఈలు ఎం.వి.రావు, ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రాజధాని నగరంలో పర్యావరణహిత రవాణా
29-09-2018 07:55:41
 
636738045434775344.jpg
అమరావతి: రాజధాని నగరంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థ రూపకల్పన- వ్యూహంపై ఫిక్కీ గ్లోబల్‌ సస్టెయిన బుల్‌ ఎనర్జీ ఇన్నొవేషన్‌ ఫోరం ప్రతినిధులతో సీఆర్డీయే ఉన్నతాధికారులు చర్చించారు. విజయవా డలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వర్క్‌ షాపులో సమర్ధ రవాణా వ్యవస్థ (సస్టెయినబుల్‌ మొబిలిటీ), స్మార్ట్‌ గ్రిడ్‌, సాంప్రదా యేతర ఇంధన ఉత్పాదకత (రెన్యువబుల్‌ ఎనర్జీ జనరేషన్‌)పై చర్చలు జరిగాయి. సస్టెయినబుల్‌ మొబిలిటీలో భాగంగా విద్యుత్తు ఆధారిత బస్సులు, కార్లు, బైక్‌లు, సైకిళ్ల తదితర వాహనాలకు అవసరమైన ఛార్జింగ్‌ వసతుల కల్పన ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.
 
ఇంధన పునరుత్పాదకత, సౌర, పవన విద్యుదుత్పత్తి, స్మార్ట్‌ గ్రిడ్‌కు అనుసంధానతతో వాటిల్లే ప్రయోజనాలు, సోలార్‌ రూఫ్‌టాప్‌ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత, భవిష్యత్తులో రానున్న సాంకేతిక మార్పులు- అధ్యయనం ఆవశ్యకతపై నిపుణులు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా రాజధానిలో పర్యావరణహిత రవాణా వ్యవస్థ ప్రణాళిక, అందులో భాగంగా ప్రయోగాత్మకంగా ఈ-బస్సులను నడిపేందుకు తీసుకుంటున్న చర్యలను సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. అమరావతిలో 70 నుంచి 80 శాతం వరకు ప్రజా రవాణా వ్యవస్థ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు విద్యుత్తు, బ్యాటరీ ఆధారిత రవాణా వ్యవస్థలకు ప్రాధాన్యమివ్వాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విజన్‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు.
 
ఇందులో భాగంగా రాజధాని నగరంలో 3,200 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక సైకిల్‌ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతికి 3,500 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుందని అంచనా వేశామని, అందులో 30 శాతాన్ని సాంప్రదాయేతర వనరుల ద్వారా సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం ఆరుబయలు ప్రదేశాలు, భవంతుల పైభాగాలు, రహదారుల వెంట ఖాళీ స్థలాలు తదితర 5 వేల ఎకరాల్లో సౌరవిద్యుత్తు ఫలకాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, ‘ఫిక్కి’ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ రీటారాయ్‌ చౌధురి, ‘ఫిక్కి’ గ్లోబల్‌ సస్టెయినబుల్‌ ఎనర్జీ ఇన్నొవేషన్‌ ఫోరం ఛైర్‌పర్సన్‌ అర్దేశిర్‌ కాంట్రాక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతిలో నిర్మాణ నగరం
30-09-2018 07:11:17
 
636738882761571427.jpg
  • తాపీ నుంచి పొక్లెయిన్‌, సిమెంట్‌ నుంచి విదేశీ ఫిట్టింగ్స్‌ వరకూ
  • అన్నీ ఒకేచోట లభ్యం
  • తొలిదశలో 150 ఎకరాల్లో ఏర్పాటు
  • దశలవారీగా 500 ఎకరాలకు విస్తరణ
  • మార్చి నాటికి సిటీ రూపురేఖలపై స్పష్టత
  • ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌
 
అమరావతి: ప్రపంచంలోనే తొట్టతొలి ‘నిర్మాణ నగరం’(కనస్ట్రక్షన్‌ సిటీ) నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు దగ్గర నుంచి రహదారులు, భారీ జలాశయాల నిర్మాణాలకు సంబంధించిన సమస్త పరికరాలు, యంత్రాలు, ముడిసరుకులు, నిర్మాణ సామగ్రి, ఫిట్టింగ్స్‌ తదితర వస్తువులన్నీ ఒకేచోట లభ్యమయ్యే నగరమే ‘కనస్ట్రక్షన్‌ సిటీ’!. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం లేనివిధంగా ఈ నిర్మాణ నగరాన్ని రూపొందించాలని ఏపీసీఆర్డీయే లక్ష్యంగా పెట్టుకుంది.
 
నిర్మాణ రంగంలో ఉన్న సుప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఇందులోకి రప్పించేందుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో 150 ఎకరాల్లో నెలకొల్పే ఈ సిటీని 500 ఎకరాలకు విస్తరించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్‌- ఈవోఐ) ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈవోఐలు సమర్పించేందుకు అక్టోబరు 29 వరకూ గడువు ఇచ్చింది. అయితే 12వ తేదీనే ప్రీ-ఈవోఐ సమావేశం నిర్వహించనున్నట్లు సీఆర్డీయే వెల్లడించింది. ఈవోఐలు సమర్పించే సంస్థలు.. ‘ఎలాంటి యూనిట్లు నెలకొల్పాలని భావిస్తున్నాయి?
 
ఎంత భూమిని ఏ ప్రాతిపదికన కోరుతున్నాయి? ఆశిస్తున్న ప్రోత్సాహకాలు?’ తదితర అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. వీటి ఆధారంగా మలిదశలైన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ), టెండర్ల జారీ, వాటి ఖరారుపై సీఆర్డీయే దృష్టి పెట్టనుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగైదు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి కనస్ట్రక్షన్‌ సిటీ రూపురేఖలపై స్పష్టత వస్తుందని అంచనా.
 
అన్నీ ఇక్కడే
ప్రస్తుతం నిర్మాణదారులు తమకు అవసరమైన బిల్డింగ్‌ మెటీరియల్‌, పరికరాలు కావాలంటే ఒక్కోచోటికి వెళ్లాల్సి వస్తోంది. ఇటుకలు, సిమెంట్‌, ఇనుము, కలప, విద్యుత్‌, ప్లంబింగ్‌, ఫ్లోరింగ్‌, అంతర్గత ఫిట్టింగ్స్‌, అద్దాలు, రంగులు, ఎలివేషన్‌, అలంకరణ సామగ్రి వంటి వాటికోసం పలు ప్రదేశాలకు తిరగాల్సి వస్తోంది. స్థానికంగా దొరికే వాటితో పోల్చితే తక్కువ ధరకు లభిస్తాయని, ఎక్కువ వెరైటీలు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లడం పరిపాటైంది. టైల్స్‌, శానిటరీ సామగ్రి కోసం గుజరాత్‌కు, మార్బుల్‌ కోసం రాజస్థాన్‌, ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్స్‌ కోసం న్యూఢిల్లీకి, పెద్దస్థాయి బిల్డర్లయితే షాండ్లేయర్లు వంటి వాటి కోసం చైనా వెళ్లడమూ తెలిసిందే. ఇటీవల కాలంలో ఇటాలియన్‌ మార్బుల్‌ తదితర విదేశీ వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటివి కావాల్సినవారు ఇకపై నిర్మాణ రంగానికి సంబంధించి తమకు ఏం కావాల్సి వచ్చినా మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా అవన్నీ అమరావతిలోనే లభించేలా కనస్ట్రక్షన్‌ సిటీని తీర్చిదిద్దాలని సీఆర్డీయే అనుకుంటోంది.
 
బహుళ ప్రయోజనకారి
ఈ నిర్మాణ నగరం ద్వారా సీఆర్డీయే పలు ప్రయోజనాలు ఆశిస్తోంది. వేలకోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుతం రాజధాని అమరావతిలో పెద్దఎత్తున జరుగుతున్న వివిధ నిర్మాణాలకు అవసరమైనవన్నీ ఒకేచోట కొనుగోలుకు లేదా అద్దె ప్రాతిపదికన లభించేలా చూడటం ద్వారా గృహ నిర్మాణదారులు, డెవలపర్ల సమయం, ధనాన్ని ఆదా చేయడం అందులో ప్రధానమైనది. పైగా అన్నిస్థాయిల్లోని వారికి అనువైన సంస్థలు వస్తాయి.
 
ఈ సంస్థల లావాదేవీల రూపంలో రాజధానికి భారీ ఆదాయం సమకూరడంతోపాటు వాటిల్లో వేల మందికి ఉపాధి లభిస్తుంది. కొనుగోళ్ల కోసం వివిధ ప్రాంతాల నుంచి నిర్మాణ నగరానికి వచ్చే వారితో రాజధాని సందర్శకుల సంఖ్య పెరిగి ఆతిథ్య, రవాణా తదితర రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం పూర్తయ్యేలోగా ఈ నగరాన్ని మరింత విస్తృతపరిచి దేశానికే నిర్మాణరంగ కూడలిగా దీనిని నిలపాలని సీఆర్డీయే భావిస్తోంది.
 
 
కాలుష్యరహితం!
కనస్ట్రక్షన్‌ సిటీలో ఏమాత్రం కాలుష్యానికి ఆస్కారం లేకుండా చూడాలన్నది సీఆర్డీయే లక్ష్యం. ఇందుకోసం ఈ నగరంలో కేవలం కాలుష్యరహిత పరిశ్రమలను మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. పూర్తిగా పర్యావరణహితంగా ఉండేలా చూడనుంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...