Jump to content

Amaravati


Recommended Posts

సీఎం చంద్రబాబును కలిసిన ఇండియన్ బ్యాంక్ ఈడీ
28-08-2018 12:44:39
 
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య మంగళవారం కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఎంవోయు జరిగిన మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు సత్వర చర్యలపై చంద్రబాబుకు భట్టాచార్య హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని భట్టాచార్య కితాబిచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంత బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా... కేరళ వరద బాధితులకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.14,83,336ల చెక్కును సీఎం చంద్రబాబుకు భట్టాచార్య అందజేశారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని ఆయన కోరారు.
Link to comment
Share on other sites

తిరుమల: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి నూతన ఆలయానికి రూ.150 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

Link to comment
Share on other sites

అమరావతికి అతిపెద్ద రైల్వేస్టేషన్‌
30-08-2018 07:18:26
 
636712103075611969.jpg
  • పది లైన్లతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు
  • త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం
  • రాష్ట్రంలో చురుగ్గా అభివృద్ధి పనులు
  • రైల్వే డీఆర్‌ఎం వి.జి. భూమా
 
మంగళగిరి: అమరావతిలో అతిపెద్ద రైల్వేస్టేషన్‌ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు గుంటూరు డివిజనల్‌ రైల్వే మేనేజరు విజి భూమా తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునికీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌లోని పలు కళాత్మక రూపాలను బుధవారం ప్రజలకు అంకితం చేశారు. తొలుత డీఆర్‌ఎం భూమా, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్షు శుక్లా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో కలియతిరిగి సుందరీకరణ దృశ్యాలను పరిశీలించి అచ్చెరువొందారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో డీఆర్‌ఎం భూమా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ ప్రాజెక్టులో పది లైన్లతో కూడిన అతిపెద్ద రైల్వేస్టేషన్‌ ఏర్పాటవుతుందన్నారు. అతి త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఇప్పటివరకు రైల్వేస్టేషన్‌ లేని గుంటూరు, ప్రకాశం, నెల్లూరును కలుపుతూ రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నడికుడి నుంచి శావల్యాపురం వరకు నేరుగా ఏర్పాటు చేస్తున్న రైల్వే మార్గం మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని, గుంటూరు నుంచి హైదరాబాద్‌ వరకు కూడా డబ్లింగ్‌ లైను వేయాలని ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. అలాగే గుంటూరు-హైదరాబాద్‌ ఎలక్ట్రిఫికేషన్‌ లైను వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తవుతుందన్నారు. రైల్వేస్టేషన్ల సుందరీకరణకు సంబంధించి గత ఏడాది నుంచి జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయని, ఈసారి మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పోటీలకు పంపించి మొదటి పది స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, అందుకు ప్రయాణీకులు, ప్రజలు సహకరించాలని కోరారు.
 
హరిత శోభితంగా మంగళగిరి రైల్వేస్టేషన్‌..
అమరావతి రాజధానిలో కీలకంగా ఉన్న మంగళగిరి రైల్వేస్టేషన్‌ను హరిత శోభితంగా తీర్చిదిద్దడంతోపాటు రాబోయే రోజుల్లో అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వీజీ భూమా తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ వెలిసే అవకాశం ఉండడంతో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి స్టేషన్‌ను రెట్టింపు స్థాయిలో విస్తరిస్తామన్నారు. మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ శ్రీకాళహస్తి కళంకారీ ఆకృతులతో ఆధునికీకరించినట్లు చెప్పారు.
 
గుంటూరు జిల్లాకు చెందిన జొన్నలగడ్డ నిరంజన్‌ కుటుంబం శ్రీకాళహస్తిలో స్థిరపడి ఐదు తరాల నుంచి కళంకారీ డిజైన్లను రూపొందిస్తుందని, వారి ద్వారా ఈ ఆకృతులకు జీవం పోయడం అభినందనీయమన్నారు. ఆటోమెటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మెషీన్‌, స్టేషన్‌కు ప్రత్యేక మార్గం, పచ్చదనం, మరో ఫ్లాట్‌ఫారం ఏర్పాటు దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు వంటి సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆర్ట్‌ గ్యాలరీ, కూచిపూడి, కళంకారీ, ఇతర సాంస్కృతిక అంశాలను ప్రోత్సహించే విధంగా స్టేషన్‌ ఆవరణలో ఎగ్జిబిషన్‌ హాలును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని పర్యాటక శాఖ అధికారులను కోరారు.
 
 
 
చేతివృత్తులకు పర్యాటక శాఖ ద్వారా మార్కెటింగ్‌: ఏపీటీడీసీ చైర్మన్‌ జయరామిరెడ్డి
దేశ, విదేశాల్లో విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్న మంగళగిరి చేనేత, కొండపల్లి బొమ్మలు, కళంకారీ డిజైన్ల వంటి చేతివృత్తులకు పర్యాటక శాఖ ద్వారా ప్రచారం కల్పించి మార్కెటింగ్‌ చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఏపీ టూరిజం రిసార్ట్స్‌లో చేతివృత్తులకు సంబంధించిన డిజైన్లు, ఉత్పత్తులను పర్యాటకులకు అందుబాటులో వుంచి, ఎంపిక చేసుకున్న వాటిని మార్కెటింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నాలుగు రైల్వేస్టేషన్లను పైలట్‌ ప్రాజెక్టు కింద ఆధునికీకరించాలని నిర్ణయించి, అమరావతి రాజధానికి అతి చేరువలో వున్న మంగళగిరికి తొలి ప్రాధాన్యత కల్పించినట్టు చెప్పారు.
 
కళంకారీ డిజైన్లకు గుంటూరు జిల్లానే కేంద్రమని, ఇక్కడి నుంచి వలస వెళ్లిన కుటుంబం శ్రీకాళహస్తిలో స్థిరపడి అయిదు తరాలుగా కళంకారీ డిజైన్ల తయారీలో నిమగ్నమైందని, మంగళగిరి రైల్వేస్టేషన్‌ను కళంకారీ డిజైన్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన చేయడం పట్ల సీఈవో హిమాన్షు శుక్లాను అభినందించారు. గుంతకల్లు-గుంటూరు రైల్వేలైను త్వరలో పూర్తికానుందని, భవిష్యత్తులో ప్రయాణీకులు ఎక్కువ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
 
 
ప్రగతి పథంలో పర్యాటక శాఖ: సీఈవో హిమాన్షు శుక్లా
ఏపీ పర్యాటక శాఖ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ఏపీటీడీసీ సీఈవో హిమాన్షు శుక్లా తెలిపారు. గతేడాది 15 శాతం వృద్ధి సాధించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 16 శాతం వృద్ధి సాధించినట్టు చెప్పారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి స్టేషన్‌ మాదిరిగానే తిరుపతి, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ స్టేషన్లను ఈ ఏడాది చివరి నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ఇతర రద్దీ ప్రాంతాలలో నీరు, మరుగుదొడ్లు, సమాచార కేంద్రాలు, క్యాబ్‌ సర్వీసులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
 
రాష్ట్రంలో పది వేల మంది క్యాబ్‌ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, 800 మందికి శిక్షణ పూర్తిచేశామని చెప్పారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో విశాఖ, తిరుపతి, కోయంబత్తూర్‌, చెన్నై, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఓలా, ఊబర్‌ వంటి ప్రైవేటు సంస్థలతో కలిసి పర్యాటకులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్‌ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు, సీనియర్‌ డీఈఎం (కోఆర్డినేషన్‌) జివి ప్రసాదరావు, ఏపీ టూరిజం లండన్‌ ప్రతినిధి జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

సంభ్రమం..శరవేగం
యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న అమరావతిలో భవన నిర్మాణాలు
వేల సంఖ్యలో పనిచేస్తున్న కార్మికులు
వందల్లో ఉపయోగిస్తున్న యంత్రాలు
ఆధునిక పరిజ్ఞానాల విస్తృత వినియోగం
  డిసెంబరుకు కట్టడాలు పూర్తి లక్ష్యం

 

రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఆరు వేల మంది కార్మికులు... నిరంతరం వినిపిస్తున్న రిగ్‌లు, క్రేన్లు, ప్రొక్లెయినర్ల రణగొణ ధ్వనులు... ఒకటా రెండా 90 లక్షల చదరపు అడుగులకుపైగా నిర్మితప్రాంతం కలిగిన భవనాల నిర్మాణం... లక్ష్యం వచ్చే డిసెంబరు..! అందుకే అక్కడ ఎటు చూసినా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది... అక్కడో భారీ నిర్మాణ ప్రపంచం ఆవిష్కృతమవుతోంది... నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాలన్నీ వాడుతున్నారు... షియర్‌వాల్‌ టెక్నాలజీతో...గోడలు, శ్లాబ్‌ సహా ఒక అంతస్తు మొత్తాన్ని ఆరేడు రోజుల్లోనే కట్టేస్తున్నారు... వర్షాల్లోనూ పనులు కొనసాగిస్తున్నారు.


రాజధానిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్‌జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. వీరి కోసం మొత్తం ఐదు చోట్ల... 60 టవర్లలో... 3,867 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ప్రతి టవర్‌ జీ+12 విధానంలో ఉంటుంది. వీటి మొత్తం నిర్మాణ వ్యయం సుమారు రూ.2,800 కోట్లు. వీటిలో పోడియంలతో కలిపి 84,57,078 చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. మంత్రులు, సీనియర్‌ ఐఏస్‌, ఐపీఎస్‌ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు బంగ్లాల నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. వీరికి 186 బంగ్లాలు నిర్మిస్తున్నారు. రాజధానిలో భూమిలేని నిరుపేదల కోసం ఎనిమిది చోట్ల 5,024 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. జీ+3 విధానంలో వీటి నిర్మాణం జరుగుతోంది. ఒక్కో అంతస్తులో 8 ఫ్లాట్లు ఉంటాయి. త్వరలో మరో మూడు వేల ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభించనున్నారు. మరోపక్క సిటీ సివిల్‌ కోర్టు భవన నిర్మాణాన్ని డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ భవన నిర్మాణాల పురోగతి...
 

గెజిటెడ్‌ అధికారుల నివాసాలు
31ap-story1c.jpg
వీరిని టైప్‌-1, టైప్‌-2గా విభజించారు

టైప్‌-1 అధికారులు
* భూ విస్తీర్ణం 6.76 ఎకరాలు
* టవర్లు: 8
* మొత్తం ఫ్లాట్లు: 384
* ఫ్లాట్‌ విస్తీర్ణం: 1800 చ.అడుగులు
ప్రస్తుత పరిస్థితి: కొన్ని టవర్లలో నాలుగైదు అంతస్తుల వరకు నిర్మాణం జరిగింది.

టైప్‌-2 అధికారులు
* 4.38 ఎకరాలు
* టవర్లు: 7
* మొత్తం ఫ్లాట్లు: 336
* ఫ్లాట్‌ విస్తీర్ణం: 1500 చ.అడుగులు

31ap-story1d.jpg
ప్రస్తుత పరిస్థితి: పునాదుల పనులు పూర్తయ్యాయి. కొన్ని టవర్లలో మూడు నాలుగు అంతస్తుల నిర్మాణం జరిగింది.
సిటీ సివిల్‌ కోర్టు(తాత్కాలిక హైకోర్టు)
31ap-story1h.jpg
* లక్ష్యం: శాశ్వత హైకోర్టు నిర్మాణానికి చాలా సమయం పడుతుంది కాబట్టి... ఆలోగా ఒక భవనాన్ని నిర్మించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును దానిలో ఏర్పాటు చేయడం. ఆ తర్వాత ఈ భవనాన్ని సిటీ సివిల్‌ కోర్టుకు వాడుకోవడం.
* ఎక్కడ: అమరావతి పరిపానా నగరంలో... జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో, శాశ్వత హైకోర్టు నిర్మించే ప్రదేశానికి సమీపంలో
* భూ విస్తీర్ణం: 4.02 ఎకరాలు
* ఎత్తు: జీ+2 విధానంలో నిర్మాణం (ఒక్కో అంతస్తు ఎత్తు ఆరు మీటర్లు ఉంటుంది)
* నిర్మితప్రాంతం: 2.50 లక్షలచ.అడుగులు
* వ్యయం: భవన నిర్మానానికి రూ.93 కోట్లు. కోర్టు హాళ్లు, ఇంటీరియర్స్‌ కోసం మరో రూ.60 కోట్లు.
* గడువు: డిసెంబరు 15
31ap-story1i.jpg
ప్రత్యేకతలు
* రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ శాండ్‌స్టోన్‌తో క్లాడింగ్‌ చేస్తారు.
* 23 కోర్టు హాళ్లు ఉంటాయి.
* ప్రధాన న్యాయమూర్తి, జడ్జిలు, న్యాయవాదులు, సాధారణ పౌరులు వెళ్లడానికి వేర్వేరు ప్రవేశ ద్వారాలుంటాయి.

ప్రస్తుత పరిస్థితి
2025% పనులు పూర్తయ్యాయి. ఆరు జోన్లుగా విభజించి, సమాంతరంగా పనులు చేస్తున్నారు.

మంత్రులు, సీనియర్‌ అధికారులు, జడ్జిల నివాసాలు
31ap-story1e.jpg
* మొత్తం బంగ్లాలు: 186
* మంత్రులకు: 35
* న్యాయమూర్తులకు: 36
* ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్య కార్యదర్శు, పోలీసు ఉన్నతాధికారులకు: 115
* ఎన్ని చోట్ల:3
* గడువు: రెండేళ్లు
* భూ విస్తీర్ణం: 60 ఎకరాలు
* బంగ్లా విస్తీర్ణం: 5,500 నుంచి 6,600చ.అడుగుల వరకు
* మొత్తం నిర్మాణ వ్యయం: రూ.466 కోట్లు.
31ap-story1f.jpg
ప్రస్తుత పరిస్థితి:
ఇప్పుడిప్పుడే పైలింగ్‌ పనులు జరుగుతున్నాయి.
నాలుగో తరగతి ఉద్యోగుల నివాసాలు
31ap-story1g.jpg
* భూ విస్తీర్ణం: 11.14 ఎకరాలు
* టవర్లు: 6
* మొత్తం ఫ్లాట్లు: 720
* ఫ్లాట్‌ విస్తీర్ణం: 900 చ.అడుగులు
* గెజిటెడ్‌ అధికారులు, నాలుగోతరగతి ఉద్యోగుల టవర్లకు ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. నిర్మాణ వ్యయం రూ.735 కోట్లు.
* ప్రస్తుత పరిస్థితి: 30%కి పైగా పనులు జరిగాయి. కొన్ని అంతస్తుల నిర్మాణం జరిగింది.
భూమిలేని పేదల నివాసాలు
31ap-story1m.jpg
* రాజధానిలోని 29 గ్రామాల్లోని భూమిలేని నిరుపేదలకు
* తొలి దశలో: 5,024 ఫ్లాట్లు
* ఎన్ని చోట్ల: రాజధానిలో 8 చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
* భూమి విస్తీర్ణం: 44.05 ఎకరాలు
* మొత్తం బ్లాక్‌లు: 157
* జీ+3 విధానంలో నిర్మాణాలు
* 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు

ప్రస్తుత పరిస్థితి: 2 వేల ఫ్లాట్ల పనులు జరుగుతున్నాయి. డిసెంబరుకు పూర్తి చేయడం లక్ష్యం.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు
31ap-story1j.jpg
* భూ విస్తీర్ణం: 10.5 ఎకరాలు
* టవర్లు: 12 ః మొత్తం ఫ్లాట్లు: 288
* ఒక్కో అంతస్తులో ఫ్లాట్లు: 2
* ఫ్లాట్‌ విస్తీర్ణం: 3,500చ.అడుగులు(కార్పెట్‌ ఏరియా)
31ap-story1k.jpg
ప్రస్తుత పరిస్థితి: మూడు టవర్లు...  8, 7, 5 అంతస్తుల వరకు వచ్చాయి. మొత్తం పునాదుల నిర్మాణం పూర్తయింది.
అఖిల భారత సర్వీసుల అధికారుల నివాసాలు
31ap-story1a.jpg
* భూ విస్తీర్ణం: 5.3 ఎకరాలు
* టవర్లు: 6
* ఒక్కో అంతస్తులో ఫ్లాట్లు: 2
* మొత్తం ఫ్లాట్లు: 144
* ఫ్లాట్‌ విస్తీర్ణం: 3,500 చ.అడుగులు
ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారుల టవర్ల పనులు ఒకే ప్యాకేజీలో జరుగుతున్నాయి. వ్యయం రూ.655 కోట్లు.
31ap-story1b.jpg
ప్రస్తుత పరిస్థితి:
మూడు టవర్ల
* 11, 8, 5 అంతస్తుల వరకు వచ్చాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
నాన్‌గెజిటెడ్‌ అధికారుల నివాసాలు
31ap-story1l.jpg
* భూ విస్తీర్ణం: 27.47 ఎకరాలు
* టవర్లు: 21
* మొత్తం ఫ్లాట్లు: 1995
* ఒక్కో అంతస్తులో ఫ్లాట్లు: 8
* ఫ్లాట్‌ విస్తీర్ణం: 1200 చ.అడుగులు
31ap-story1o.jpg
* ప్రస్తుత పరిస్థితి: ఒక టవర్‌ 10 అంతస్తుల వరకు వచ్చింది. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.నిర్మాణ వ్యయం రూ. 866.1 కోట్లు.
సీఆర్‌డీఏ కార్యాలయ భవనం
31ap-story1n.jpg
* లక్ష్యం: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కి రాజధానిలో శాశ్వత కార్యాలయ భవన నిర్మాణం
ఎక్కడ?: ప్రధాన అనుసంధాన రహదారికి పక్కనే
* భూ విస్తీర్ణం: 4.5 ఎకరాలు
* అంతస్తులు: జీ+7
* నిర్మితప్రాంతం: 2,27,000 చ.అడుగులు
* నిర్మాణ వ్యయం: ఏడంతస్తుల భవనానికి, జీ+3 వరకు ఇంటీరియర్స్‌కి కలిపి రూ.89 కోట్లు.
* ప్రత్యేకతలు: ఈ భవనం మొత్తాన్ని ప్రికాస్ట్‌ విధానంలో నిర్మిస్తున్నారు. శ్లాబ్‌లు సహా అన్నీ వేరే చోట తయారు చేసి... సైట్‌లోకి తెచ్చి బిగిస్తారు.

గడువు: డిసెంబరు
* ప్రస్తుత పరిస్థితి: సుమారు 40% పనులు పూర్తయ్యాయి.

ఈనాడు, అమరావతి
Link to comment
Share on other sites

We are excited to host Tie Amaravati angels first Investor connect and charter member social in association with @Pi_DATACENTERS to boost the startup ecosystem in Andhra Pradesh. Join us to network, educate and invest in your startup. @TiEGlobal #funding #startups #andhrapradesh

Dl6x8HoWwAINBp7.jpg
Link to comment
Share on other sites

రాజధాని ప్రాంతానికి రవాణా ప్రణాళికలు
02-09-2018 07:42:22
 
636714709408353138.jpg
  • అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో..
  • 12 పట్టణ స్థానిక సంస్థల్లో ఇబ్బందుల్లేని ప్రయాణానికి కసరత్తు
  • ఉన్నతాధికారులతో ‘జైకా’ నిపుణుల చర్చలు
  • జనసాంద్రత, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రాతిపదిక
  • కృష్ణానదిపై 9 వంతెనలు
 
అమరావతి: అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాం తాలతో కూడిన అమరావతి కోర్‌ రీజియన్‌లో రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా మూడంచెల సమగ్ర రవాణా వ్యూహాన్ని రూపొందించుకోవడం అవసరమని నిపు ణులు అభిప్రాయపడ్డారు. సుమారు 8,603 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న రాజ దాని ప్రాంతంలోని 12 పట్టణ స్థానిక సంస ్థల్లో (యు.ఎల్‌.బి.) ఎటువంటి ఇబ్బందులకూ ఆస్కారమివ్వని దీర్ఘకాలిక, సమగ్ర రవాణా వ్యూహాన్ని సూచించేందుకు జపాన్‌కు చెందిన జైకా (జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ) కసరత్తు చేస్తోంది. రాజధాని ప్రాంతానికి తగి న దీర్ఘకాలిక రవాణా వ్యూహం రూపొం దించేందుకు భారత, జపాన్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన అంగీకారం మేరకు జైకా ఈ కృషిలో నిమగ్నమైంది.
 
ఈ సంస్థ నేతృ త్వంలోని జైకా స్టడీ టీం (జేఎస్‌టీ) గత కొన్ని నెలలుగా ఈ అంశంపై సమగ్ర అధ్య యనాన్ని (కాంప్రెహెన్సివ్‌ ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్టడీ- సీటీటీఎస్‌) జరు పుతోంది. ఇందులో నిమగ్నులైన నిపుణులతో ఏపీసీఆర్డీయే, పలు ప్రభుత్వ శాఖల ఉన్న తాధికారులు విజయవాడలోని ఏపీసీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శనివారం సమా వేశమవగా, తమ అధ్యయనంలో గుర్తించిన అంశాలను నిపుణులు అందులో వివ రించారు. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరు కూరి శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏపీఎస్సార్టీసీ, ఎన్‌.హెచ్‌.ఏ.ఐ., మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌, విజయవాడ, గుంటూరు నగర పాలక సంస్థలు, ట్రాఫిక్‌ పోలీస్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
మౌలిక వసతుల అభివృద్ధి అవశ్యం..
తొలుత జైకాకు చెందిన ట్రాఫిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌ నిపుణులు గతంలో జరిగిన ట్రాఫిక్‌ అధ్యయనాలను కాలానుగుణంగా నవీకరించడంతోపాటు స్వల్ప, మధ్య, దీర్ఘకా లిక వ్యూహాలతో కూడిన సమగ్ర రవాణా విధానాన్ని రూపొందించేందుకు తాము ఇప్పటివరకూ చేసిన కృషిని విశదీకరించారు. రవాణా సజావుగా సాగాలంటే ఒకపక్క స్వల్ప, మధ్యకాలిక వ్యూహాలను అమలు చేస్తూనే మరొకపక్క దీర్ఘకాలిక వ్యూహాలను కూడా రూపొందించుకోవాల్సి ఉంటుందన్నా రు. ఇవన్నీ కేంద్ర పట్టణ రవాణా విధా నాలకు అనుగుణంగా ఉండేలా చూడడం అవశ్యమని పేర్కొన్నారు. జనసాంద్రత, ఉద్యో గ, ఉపాధి అవకాశాలు రాజధాని ప్రాంత రవాణా వ్యూహాన్ని ప్రభావితం చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తాయన్నారు.
 
విజయవాడ, గుంటూరు, అమరావతి కాలక్రమంలో ఒక భారీ మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా అవతరించబోతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతులను పెద్దఎత్తున అభివృద్ధి పరచాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల రవాణా అలవాట్లు, సామా జిక, ఆర్ధికస్థితి గతులతోపాటు రాజధాని ప్రాంతంలో రానున్న వివిధ రహదారుల ప్రాజెక్టులను పరిగ ణనలోకి తీసుకోవాలన్నారు.
 
రాజధాని ప్రాంతంలోని 12 పట్టణ స్థానిక సంస్థల్లో తీవ్రంగా ఉన్న రవాణా వ్యవస్థలను మెరుగు పరచేందుకు రోడ్లు, కూడళ్లు ఇత్యాది మౌలిక వసతులను తక్షణ మే అభివృద్ధి పరచాలని, మోటారు రహిత వాహనాల వినియోగాన్ని పెంచాలని, రహ దారి భద్రతతోపాటు వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. దీనిని స్వల్పకాలిక వ్యూహంగా పేర్కొన్నారు. అనంతర దశలో.. మధ్యకాలిక వ్యూహంలో భాగంగా రాజధాని ప్రాంతం మొత్తంతోపాటు ఒక్కొక్క పట్టణ స్థానిక సంస్థకు సంబంధించి రవాణా వ్యూహాలను రూపొందించాలని, వాటిని ఐదేళ్లలో అమలు పరచాలని సూచిం చారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా పలు ప్రయాణ సాధనాలు ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన, కాలుష్య రహితమైన రవాణా సాధనాలు, ప్రత్యా మ్నాయాలను కనుగొనాలని పేర్కొన్నారు.
 
ఈ సమావేశంలో జైకా బృందం తరపున కోజి యమద, లెన్‌ జాన్‌స్టోన్‌, జాన్‌ స్మిత్‌, నిపుణులు డాక్టర్‌ టి.ఎస్‌.రెడ్డి, డాక్టర్‌ కె.వి.కృష్ణారావు, డాక్టర్‌ సి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, డాక్టర్‌ పి.ఆర్‌.భానుమూర్తి, సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్‌ ఎస్‌.షణ్మోహన్‌, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ వి.వి.ఎల్‌.ఎన్‌.శర్మ తదితరులు పాల్గొన్నారు.
 
 
కృష్ణానదిపై మొత్తం 9 వంతెనలు..
అనంతరం ప్రసంగించిన శ్రీధర్‌ మాట్లాడుతూ అమరావతి కోర్‌ రీజియన్‌లో అత్యుత్తమ అనుసంధానత కోసం అమరావతి, విజయవాడ, గుంటూరులను కలుపుతూ కృష్ణా నదిపై మొత్తం 9 వంతెనల నిర్మాణానికి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ప్రాధాన్యత దృష్ట్యా వీటిల్లో నాలుగింటిని వెంటనే చేపట్టనున్నట్లు చెప్పారు. వీటిల్లో ఒకటైన అమరావతిలోని రాయపూడి- కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంను కలుపుతూ నిర్మించ తలపెట్టిన ఐకానిక్‌ బ్రిడ్జికి టెండర్లు ఖరారు చేశామని, దానిని దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ త్వరలోనే నిర్మాణ పనులను చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రీజియన్‌లోని ట్రాఫిక్‌లో దాదాపు 27 శాతం విజయవాడ నగరం గుండానే వెళ్తుందన్న అంచనాల మేరకు తదనుగుణంగా రవాణా వ్యూహాలను సిద్ధం చేయాలన్నారు. రాజధానిలోని ఎన్‌-9 రహదారి పూర్తయిన తర్వాత అది అమరావతి, గుంటూరు, విజయవాడ రీజియన్లను కలపడంలో కీలకపాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

ఆహ్లాదంగా అమరావతి మెరీనా
02-09-2018 08:02:19
 
636714721383681206.jpg
  • సత్వర అనుమతులపై దృష్టి
  • 60 బోట్‌ పార్కింగ్‌ బెర్త్‌లతో నదీ విహారం
  • సీఆర్డీయే అదనపు కమిషనర్‌ షణ్మోహన్‌
అమరావతి: రాజధాని సందర్శకులకు చక్కటి నదీ విహార అనుభూతి కల్పించేందుకు వెంకటపాలెంలో ఏర్పాటు చేయబోయే అమరావతి మెరీనా స్పీడందుకుంది. దీనికి కావాల్సిన అనుమతులు త్వరగా పొందేందుకు సీఆర్డీయే అధికారులు దృష్టిపెట్టారు. కృష్ణానదీ తీరాన ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టు దేశంలోనే తొలి రివర్‌ మెరీనా అవుతుందని సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విజయవాడలో శనివారం నిర్వహించిన సమావేశంలో పలు విభాగాల అధికారులతో ఆయన చర్చించారు. అమెరికా, ఇంగ్లండ్‌ తదితర దేశాల్లో మెరీనాలు ఎంతో ప్రసిద్ధి చెందాయని.. వాటిని స్ఫూర్తిగా తీసుకొని అమరావతి మెరీనాను ప్రతిపాదించినట్లు షణ్మోహన్‌ చెప్పారు. నదీ విహారానికి వీలుగా 60 బోట్ల పార్కింగ్‌ బెర్త్‌లు, ఇతర పర్యాటక ఆకర్షణలు ఉంటాయని తెలిపారు. అందుకే నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగడానికి అనుమతులు లభించాల్సి ఉందన్నారు. సమావేశంలో సీఆర్డీయే, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కృష్ణాపై 9 వంతెనలతో మార్గం సుగమం
1ap-main6a.jpg
ఈనాడు డిజిటల్‌, విజయవాడ: అమరావతి కోర్‌ రీజియన్‌ (అమరావతి, విజయవాడ, గుంటూరు)కు సంబంధించిన దీర్ఘకాలిక రవాణా వ్యూహం (లాంగ్‌ టర్మ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్ట్రాటజీ)పై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కసరత్తు   చేస్తోంది. అమరావతిలో సమగ్ర రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘జైకా’ బృందంతో శనివారం విజయవాడలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో అమరావతి, విజయవాడ, గుంటూరులను కలిపే విధంగా కృష్ణా నదిపై 9 వంతెనలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే అమరావతిలోని రాయపూడి, ఇబ్రహీంపట్నంల మధ్య నిర్మించే వంతెనలకు టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో ఈ వంతెనల పనులు ప్రారంభం అవుతాయన్నారు. అమరావతికి వచ్చే ట్రాఫిక్‌లో 27 శాతం విజయవాడ మీదగా నడుస్తోందని, దీనికి అనుగుణంగా రాజధాని రవాణా వ్యవస్థకు సరైన ప్రణాళిక రూపొందించేలా వూహ్యాలు సిద్ధం చేయాలని అధ్యయన బృందాన్ని కోరారు. సీఆర్‌డీఏ మేనేజర్‌ (ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌) మనోజ్‌ మాట్లాడుతూ.. ఎన్‌-9 రోడ్డును సకాలంలో పూర్తి చేయడంతో అమరావతి, విజయవాడ, గుంటూరుల మధ్య రవాణా వ్యవస్థను బలోపేతం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జైకా బృందం తరఫున జుంజి షిబాటా, కోజి యమద, వెన్‌ జాన్‌స్టోన్‌, జాన్‌ స్మిత్‌ తదితులు పాల్గొన్నారు.
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...