Jump to content

Amaravati


Recommended Posts

ఎల్పీఎస్‌ 4వ జోన్‌ అభివృద్ధికి మరోసారి టెండర్లు
16-09-2018 07:57:21
 
636726814375449753.jpg
  • ప్రస్తుత అంచనా వ్యయం రూ.775 కోట్లు
  • గతంలో రద్దయిన టెండర్లతో పోల్చితే రూ.179.80 కోట్లు అధికం!
అమరావతి: రాజధానిలోని మరొక ఎల్పీఎస్‌ జోన్‌ అభివృద్ధి కోసం సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. హ్యాం(హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌), ఈపీసీ విధానాల్లో గతంలో పిలిచిన టెండర్లకు ఆశించిన స్పందన రాని దృష్ట్యా 4వ జోన్‌కు తాజాగా మరోసారి బిడ్లను పిలిచింది. తద్వారా కొద్దిరోజుల క్రితమే ముచ్చటగా మూడవసారి టెండర్లను పిలిచిన 9, 9 ఏ, 12, 12ఏ ఎల్పీఎస్‌ జోన్ల సరసన దానిని నిలిపింది. అయితే ఆ 4 జోన్లన్నంటి తాజా అంచనా మొత్తం గతంలో రద్దయిన వాటి టెండర్ల అంచనాలతో పోల్చితే రూ.300.12 కోట్లు కాగా, జోన్‌-4 ఒక్కదాని తాజా అంచనా వ్యయం అంతకుముందటితో పోల్చితే ఏకంగా రూ.179.80 కోట్ల మేర పెరగడం గమనార్హం! అమరావతి నిర్మాణానికి భూసమీకరణ విధానంలో తమ భూములనిచ్చిన వారికి బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్ల అభివృద్ధికి వాటిని మొత్తం ఎల్పీఎస్‌ జోన్లుగా చేసిన సంగతి విదితమే. ఇప్పటికే వీటిల్లో కొన్నింటి టెండర్లు ఖరారై, పనులు జరుగుతుండగా, గత కొన్ని రోజులుగా మిగిలిన వాటికీ దశలవారీగా సీఆర్డీయే టెండర్లను పిలుస్తోంది.
 
తాజాగా టెండర్లు పిలిచిన 4వ నెంబర్‌ ఎల్పీఎస్‌ జోన్‌లో పిచ్చుకలపాలెంకు చెందిన ప్లాట్లు కొంతమేర ఉండగా, తుళ్లూరు, అనంతవరానికి పూర్తిగా చేరి ఉన్నాయి. ఈ జోన్‌లో నిర్దేశించిన ప్రమాణాలమేరకు రహదారులు, కల్వర్టులు, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లతో పాటు భూగర్భంలో విద్యుత్త్తు, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూ నికేషన్‌ టెక్నాలజీ, నీరు, గ్యాస్‌ తదితరాల కోసం ఏర్పాటు చేసే డక్ట్‌లు, అవెన్యూ ప్లాంటేషన్‌ ఇత్యాది వాటికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన, అభివృద్ధికి మొత్తం రూ.775 కోట్ల వ్యయం కాగలదని సీఆర్డీయే అంచనా వేసింది. ఎంపికైన సంస్థ పైన పేర్కొన్న వాటన్నింటినీ రాజధాని ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుగుణంగా ఏర్పాటు చేయడమే కాకుండా 7 సంవత్సరాలపాటు నిర్వహణ కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న సంస్థలు ఈ నెల 22వ తేదీ నుంచి బిడ్లను ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ నుంచి పొందవచ్చు. వాటి సమర్పణకు వచ్చే నెల 10 వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకూ సీఆర్డీయే గడువునిచ్చింది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు టెక్నికల్‌ బిడ్లను తెరుస్తారు.
Link to comment
Share on other sites

ఎత్తిపోతల పథకం ద్వారా సమస్యకు పరిష్కారం లభించింది: చంద్రబాబు
16-09-2018 13:50:39
 
636727026362633552.jpg
 
గుంటూరు జిల్లా: ఉండవల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. లిఫ్ట్ స్కీమ్ దగ్గర పైలాన్‌ను ఆవిష్కరించారు. ఎత్తిపోతల పథకంతో రాజధాని ప్రాంతంలో ముంపు సమస్య తొలగిపోతుందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. మూడు రోజులుగా జలసిరికి హారతి కార్యక్రమం కొనసాగుతోందని, రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్దేందుకు జలదీక్ష చేపట్టామని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీరు ఉందని, రాజధాని పరిధిలో చాలా ప్రాంతాలు వరదల కారణంగా మునిగిపోతున్నాయని అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా సమస్యకు పరిష్కారం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
 
రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు త్యాగం చేస్తే.. ప్రతిపక్ష నేతలు మాత్రం రాజధాని మునుగుతుందని ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిలో పనులు జరక్కుండానే.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. రోజుకు ఒక టీఎంసీ వరద నీరు వచ్చినా సమస్య లేదన్నారు. 7 వేల క్యూసెక్కుల నీరు ఎత్తిపోసేలా రెండో దశలో ఎత్తిపోతల పథకం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. తన జీవితంలో ఎప్పుడు పెట్టని శ్రద్ధ జలవనరులశాఖపై పెట్టానని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు పనులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు పనులు ఇంత వేగంగా జరగట్లేదన్నారు. 2019 మే కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నిరిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

ఎవర్‌‘గ్రీన్‌’ అమరావతి!
17-09-2018 03:12:49
 
  •  రాజధానిలో పచ్చదనానికి ప్రణాళికలు
  •  23 రోడ్లకు 133 కి.మీ మేర గ్రీన్‌బఫర్‌
  •  పర్యావరణ సమతుల్యతే లక్ష్యం
  •  ఆరు నెలల్లో కీలక దశకు చేరాలి: సీఎం
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఆరు నెలల్లో పచ్చదనం పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో హరిత నెట్‌వర్క్‌, ఇతర ప్రాజెక్టులపై ఏడీసీఎల్‌, ఏపీసీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా అమరావతిలో నిర్మాణ పనులకు ఒక రూపు రావాలని నిర్దేశించిన నేపథ్యంలో జనవరి నెలాఖరుకల్లా అమరావతి హరిత అభివృద్ధి ప్రాజెక్టు కీలక దశకు చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానిలో రోడ్లు, భవనాల నిర్మాణాలతో పాటు హరిత ప్రాజెక్టులపైనా అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏడీసీఎల్‌) ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ మేరకు రాబోయే ఆరు నెలలకు ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. అమరావతిలో పర్యావరణ సమతుల్యత సాధించడమే లక్ష్యంగా హరిత ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.
 
అమరావతిని ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మొత్తం రాజధాని విస్తీర్ణంలో 30 శాతం భూభాగంలో హరిత ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. అమరావతిని ప్రముఖ పర్యాటక ప్రదేశంగానూ మార్చాలన్నారు. ఏజీడీపీ పురోగతిపై ఏడీసీఎల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలో రోడ్ల పక్కన 15 మీటర్ల మేర గ్రీన్‌ బఫర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో 321.7 కిలోమీటర్ల మేర మొత్తం 34 రోడ్లు నిర్మించాలని ప్రణాళిక ఉంది. ఇందులో 133.3 కిలోమీటర్ల మేర ఉండే 23 రోడ్లకు గ్రీన్‌ బఫర్‌ ఉంటుంది. 17 రోడ్లకు 74.45 కిలోమీటర్ల మేర ఇరువైపులా మొక్కలు నాటాలని నిర్ణయించగా, 55 కిలోమీటర్ల మేర పూర్తయింది. రోడ్డు, భవనాల నిర్మాణం పూర్తవగానే మిగిలిన ప్రాంతంలోనూ ఏడీసీఎల్‌ మొక్కలు నాటడాన్ని పూర్తి చేస్తుందని లక్ష్మీ పార్థసారథి వివరించారు. 300 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శాఖమూరు పార్కు, ప్లవర్‌ గార్డెన్‌, వైల్డర్‌నెస్‌ పార్క్‌, గులాబీలతో కూడిన శిలాపార్కు తదితర ఉద్యానవనాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతవరంలో 35 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన రీజినల్‌ పార్కు, మల్కాపురంలో 21 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన రీజినల్‌ పార్కులపైనా ఏడీసీఎల్‌ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. హరిత ప్రాజెక్టుకు రూ.1484 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు సూత్రపాయంగా అంగీకరించిందని లక్ష్మీపార్థసారధి తెలిపారు. హరిత ప్రాజెక్టులు అమరావతిలో పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతిని నందనవనంలా మార్చితే ఎకో టూరిజం డెవల్‌పమెంట్‌కు అధిక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Link to comment
Share on other sites

Amaravati-6-line-roads.jpg

CHECK OUT REAL PICTURES OF THE GRAPHICS CITY AMARAVATI.

JITENDRA 17/09/2018
 
313SHARES
 
 

Amaravati, is being called as graphics city by a group of people as it has been the design phase for couple of years and now has entered the implementation phase.

Lets go out to the roads to see what the reality looks like in the graphic city Amaravati.

SRM UNIVERSITY IS READY AND HAS STARTED OPERATIONS TWO YEARS AGO.

srm university in amaravathi

source: Picxy.com

VIT UNIVERSITY IS READY AND HAS BEEN OPERATING FROM THE LAST TWO YEARS.  THREE BLOCKS ARE READY AND ANOTHER 10 BLOCKS UNDER CONSTRUCTION.

VIT University in AP Capital Amaravathi

source: Picxy.com

TEMPORARY SECRETARIAT IS READY AND IS OPERATIONAL FOR MORE THAN 2 YEARS NOW.

AP Secretariat is operational in amaravathi

source: Picxy.com

amaravati-secretariat.jpg

source: Picxy.com

AMARAVATI TRUNK ROADS ( 6 LINES AND WITH A PROVISION FOR 2 MORE LANES). ALSO HAS A CYCLING TRACK AND WALKING PATH IS 80% READY.

Amaravathi truck road

source: Picxy.com

HOUSING FOR NGOS AND MLAS, MPS IS GETTING READY AT A FAST PACE. ALL BEING BUILT BY PRESTIGIOUS SHAPOORJI PALLANJI AND L&T.

NGO and MLA Housing Amaravathi

source: TDP

PLOT HAVE BEEN ALLOCATED TO THE FARMERS AND WILL BE HANDED OVER TO THEM FOR CONSTRUCTION AS SOON AS THE BASIC INFRA IS READY.

Farmer plots in Amaravathi

source: Picxy.com

CANALS ARE BEING BUILT FOR WATERWAYS. YOU COULD TAKE A WATER TAXI TO MOST PLACES OF THE CITY. KONDAVEEDU LIFT IRRIGATION PROJECT IS ALSO BUILT AND INAUGURATED WHICH MAKES AMARAVATI FLOOD FREE.

Canals in Amaravathi available for water taxi

source: GoAP

AMRITA UNIVERSITY STARTED ITS CONSTRUCTIONS.

Amrita University

source: Picxy.com

 

APNRT’S NRT ICON TOWER STARTED TO BUILT ON THE RIVER FRONT OF AMARAVATI.

APNRT's NRT Icon Tower

source: Picxy.com

 

Many more developments have started and taking shape.

Go around Amaravati and check out all the developments for yourself before calling it a graphic city.

Lets support New Cities for a better tomorrow

Link to comment
Share on other sites

7 minutes ago, ramntr said:

Roads Chusthante doubt వచ్చింది, అటు ఇటు roads వేసి madya lo చాలా స్థలం around 3 లైన్ వదిలేశారు ఎందుకు.. 

madyalo 3 lanes kaadu 4 lanes. purpose is for metro or reserved for future heavy traffic control. smart planning. 

Link to comment
Share on other sites

మార్చి నాటికి గవర్నమెంట్‌ హౌసింగ్‌ సిద్ధం
18-09-2018 10:05:15
 
636728619118119778.jpg
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా మంత్రులు, శాసన సభ్యులు, ఏఐఎస్‌, గెజిటెడ్‌, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు వచ్చే ఏడాది మార్చికల్లా సిద్ధమవుతాయని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ తెలిపారు. ఈ గృహ సముదాయాలు జరుగుతున్న తీరును ఎమ్మెల్సీలకు ప్రత్యక్షంగా చూపేందుకు సోమవారం వారితో కలసి ఆయన అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే టవర్‌ పురోగతి గురించి సీఆర్డీయే ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు జక్రయ్య, ధనుంజయ వారికి వివరించారు. అనంతరం నారాయణ విలేకరులతో మాట్లాడుతూ రాజధానిలో ప్రస్తుతం రూ.28,000 కోట్ల విలువైన వివిధ నిర్మా ణాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. నిర్దేశిత గడువైన 2019, మార్చినాటికి అమ రావతిలోని హౌసింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనుల్లో భాగంగా రాకపోకలు సాగిస్తున్న భారీ వాహనాలతోపాటు ఇటీవలి వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలోని రహదారులు దెబ్బ తిన్నాయని, వర్షాకాలం తర్వాత నిర్మాణ పనులు మరింత వేగంగా సాగుతాయని పేర్కొన్నారు.
 
అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను ప్రారంభించిన నాటినుంచి రెండేళ్లలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఎక్కడో ఉండి మాట్లాడడం కాకుండా, స్వయంగా అమరా వతిలో జరుగుతున్న పనులను చూసి, అప్పుడు విమర్శించాలని ప్రతిపక్ష నేత జగన్‌కు హితవు పలికారు. అనంతరం ఎమ్మె ల్సీలు టీడీ జనార్దన్‌, మంతెన సత్యనారాయణలు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం వేగంగా సాగుతోందని చెప్పారు. షియర్‌వాల్‌ టెక్నాలజీని ఉపయోగించి అమరావతిలో వారానికోశ్లాబ్‌ వేస్తున్నారన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణ పనులు చకచకా సాగుతుండడం హర్షణీయమన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి నిర్మాణమని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

రూ.234 కోట్లతో.. ఓపెన్‌ మాల్‌
18-09-2018 10:16:33
 
636728625901315883.jpg
  • రాజధానిలో స్థాపనకు ప్రతిపాదనలను ఆహ్వానించిన సీఆర్డీయే
  • 7 ఎకరాల్లో, 5 విభాగాలుగా ఏర్పాటుకు ప్రణాళిక
  • సగం స్థలంలోనే నిర్మాణాలు
  • మిగిలినదంతా పచ్చదనం, వినోద వసతులకే..
రాజధానిలో వాణిజ్య, పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం మరో నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఏడెకరాల్లో ఓపెన్‌ కాన్సెప్ట్‌ మాల్‌ను నిర్మించాలని తలపెట్టింది. ఇందుకోసం రూ.234 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ఆసక్తి కల సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ‘బ్లూ- గ్రీన్‌ కాన్సెప్ట్‌’ను ఈ ఓపెన్‌ మాల్‌లోనూ తూచా తప్పకుండా అమలు పరచాలని భావిస్తోంది.
 
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మరో వినూత్న వాణిజ్య, పర్యాటక ప్రదేశానికి సీఆర్డీయే సంకల్పించింది. రూ.234 కోట్ల భారీ అంచనా వ్యయంతో, ఏడెకరాల్లో ఓపెన్‌ కాన్సెప్ట్‌ మాల్‌ను పలు ఆకర్షణలతో నిర్మింపజేయాలని నిర్ణయించింది. అందుకు ఆసక్తి కలిగిన ప్రముఖ సంస్థల నుంచి ప్రతిపాదనలను (ఆర్‌.ఎఫ్‌.పి.- రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌) కోరుతూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. పలు నగరాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న మాల్స్‌ మాదిరిగా అమరావతిలో రూపుదిద్దుకోబోయే మాల్‌ బహుళ అంతస్థులతో ఉండదు! సాధ్యమైనంత తక్కువ విస్తీర్ణంలో మాత్రమే అదీ జి ప్లస్‌ 2 అంతస్థులతో మాత్రమే ఇందులోని కట్టడాలు ఉంటాయి! ఎక్కువలో ఎక్కువ 50 శాతం భూభాగంలోనే నిర్మాణాలను అనుమతించి, మిగిలిన మొత్తం భూమిని పచ్చదనానికి, సందర్శకులకు ఉల్లాసాన్నిచ్చే వివిధ రిక్రియేషన్‌ వసతుల కల్పనకు కేటాయించడం ఈ ఓపెన్‌ కాన్సెప్ట్‌ మాల్‌ విశిష్టతల్లో ప్రధానమైనది! పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కొన్నేళ్లుగా ఈ తరహా మాల్స్‌ స్థాపన పెద్దఎత్తున జరుగుతుండడం, వాటికి ప్రజల ఆదరణ బాగా లభిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకుని సీఆర్డీయే దీని ఏర్పాటుకు మొగ్గు చూపింది. తద్వారా ప్రపంచస్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చెందబోతున్న అమరావతిలో ఆ ప్రమాణాలతో సరితూగే మరొక వినూత్న నిర్మాణాన్ని అందించినట్లవుతుందని విశ్వసిస్తోంది.
 
 
5 విభాగాలుగా ఓపెన్‌ మాల్‌..
ఈ మాల్‌లో రిటైల్‌ స్పేస్‌, మల్టీప్లెక్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పేస్‌, ఓపెన్‌ స్పేసెస్‌, ఫుడ్‌ కోర్టు అనే ఐదు విభాగాలు ఉండాలని సీఆర్డీయే నిర్దేశించింది. వీటిని బట్టి ఈ మాల్‌లో సాధారణ మాల్‌ల మాదిరిగా వ్యాపార సంస్థలు, దుకాణాలు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు, వినోదకేంద్రాలు, ఆహార్డశాలలు ఉంటాయి. అయితే అదనంగా కనువిందు చేసే ఆరుబయలు ప్రదేశాలు (ఓపెన్‌ స్పేసెస్‌) ఉంటాయి. వీటిల్లో పచ్చదనంతోపాటు ఫౌంటెన్లు, చిన్న చిన్న కొలనులు ఇత్యాది పలు ఆకర్షణలు కొలువు దీరతాయి. తద్వారా అమరావతిలో పెద్దపీట వేస్తున్న ‘బ్లూ- గ్రీన్‌ కాన్సెప్ట్‌’ను ఈ ఓపెన్‌ మాల్‌లోనూ తూచా తప్పకుండా అమలు పరచినట్లవుతుంది. తొలుత సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొన్న వాటికి అదనంగా ఆ తర్వాతి కాలంలో డెవలపర్లు ఇందులో ఎటువంటి అదనపు నిర్మాణాలు లేదా కార్యకలాపాలను చేపట్టడానికి అనుమతించేది లేదని సీఆర్డీయే ఆర్‌.ఎఫ్‌.పి. నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. తన నుంచి ముందుగా అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది.
 
 
ఈ మాల్‌కు ఉద్దేశించిన స్థలంలో అంతర్గత రహదారులు, పార్కింగ్‌ ప్రదేశాలు, భద్రత, ఎయిర్‌ కండిషనింగ్‌, నీటి సరఫరా, వాననీటి సంరక్షణ, విద్యుత్తు, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌, ఘనవ్యర్థాల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్‌ తదితర అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత డెవలపర్‌గా ఎంపికైన సంస్థదే. అమరావతి జోనింగ్‌ ప్లాన్‌ మరియు నిబంధనలను అనుసరించి కార్‌ పార్కింగ్‌ వసతిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
 
 
రెండేళ్లలో తొలి దశ.. ఐదేళ్లలో తుది దశ..
సీఆర్డీయే లీజు విధానంలో కేటాయించే ఏడెకరాల కాలవ్యవధి 30 సంవత్సరాలు. ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన పక్షంలో ఈ లీజు కాలపరిమితిని మరొక 30 సంవత్సరాలపాటు పొడిగించే వీలుంటుంది. ఇతర సంస్థలతో పోల్చితే మెరుగైన ఆర్‌.ఎఫ్‌.పి.లను సమర్పించి, డెవలపర్‌గా ఎంపికైన సంస్థ అందులో పేర్కొన్న బిల్టప్‌ ఏరియాలో మూడింట ఒక వంతును తాను ఎంపికైనప్పటినుంచి రెండు సంవత్సరాల్లోగా, మిగిలిన రెండొంతులను ఐదేళ్లల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
 
ఆసక్తి ఉన్న సంస్థలు తమ ఆర్‌.ఎఫ్‌.పి.లను సమర్పించేందుకు వచ్చే నెల 12వ తేదీ వరకు గడువునిచ్చిన సీఆర్డీయే వాటికి వచ్చే అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 26న విజయవాడలోని తన ప్రధాన కార్యాలయంలో ప్రి బిడ్‌ సమావేశాన్ని నిర్వహిస్తుంది. అక్టోబర్‌ 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు టెక్నికల్‌ బిడ్లను తెరచి, వాటిల్లో అర్హత పొందిన సంస్థలేమిటన్నది గుర్తిస్తారు. ఆ సంస్థలు సమర్పించిన ఫైనాన్షియల్‌ బిడ్లను తదుపరి ప్రకటించబోయే తేదీన తెరుస్తారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...