Jump to content

Amaravati


Recommended Posts

1 hour ago, sonykongara said:
అమరావతిలో భారీ ఇండస్ట్రియల్ పార్క్!
22-09-2018 09:37:41
 
636732058590605043.jpg
  • భారీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు యోచన
  • 1500 ఎకరాల్లో కాలుష్యరహిత పరిశ్రమలు
  • 2038 కల్లా 8 లక్షల ఉద్యోగాలు
  • 1.20 లక్షల కోట్ల ఆదాయమే లక్ష్యం
  • కీలక రంగాల కంపెనీలపై సీఆర్డీయే దృష్టి
  • ఆసక్తి వ్యక్తీకరణ నోటిషికేషన్‌ జారీ
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారీ సమీకృత పారిశ్రామిక వాడ (ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ పార్కు) ఏర్పాటు చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు భవిష్యత్తులో అమరావతిని జాతీయ ఆర్థిక కేంద్రంగా మలచడం ఈ పార్కు ఉద్దేశం. ఇందులో కాలుష్యరహితంగా, పర్యావరణ హితంగా ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం తొమ్మిది ప్రధాన రంగాలను ఎంపిక చేశారు. అమరావతి విశిష్టతలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఈ పార్కు అభివృద్ధికి ఉపకరిస్తాయని సీఆర్డీయే అంచనా వేస్తోంది. ఈ బృహత్తర ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేస్తారు. 2038నాటికి 1500 ఎకరాలకు విస్తరించి.. వచ్చే 25 ఏళ్లలో మొత్తం 7 లక్షల నుంచి 8 లక్షల వరకూ ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, తద్వారా రూ.1.20 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చునని సీఆర్డీయే భావిస్తోంది. అందుకే ప్రపంచస్థాయిలో పేరొందిన నిపుణులను సైతం ఆకర్షించగలిగే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
 
ఇవీ లక్ష్యాలు..!
ఈ పార్కును స్థాపించడంలో తనతో కలిసి పనిచేసే వ్యూహాత్మక భాగస్వామిని ఎంపిక చేసుకొనేందుకు త్వరలో బిడ్లను ఆహ్వానించబోతుంది. అయితే బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ను, అందులో పొందుపరచాల్సిన నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ‘ఆసక్తి వ్యక్తీకరణ’(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌-ఈవోఐ)లను కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో ఇలాంటి భారీ పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణలో అనుభవం, నైపుణ్యమున్న సంస్థల నుంచి ఈవోఐ కోరింది. మార్కెట్‌ పరిస్థితులను ఆకళింపు చేసుకొని, ఆశించిన స్థాయిలో పార్కు ఏర్పాటుకు దోహద పడే సలహాలివ్వడానికి, అభిప్రాయాలు తెలియజేయడానికి వచ్చే నెల 8వ తేదీ వరకూ గడువిచ్చింది.
 
 
వీటికి ప్రాధాన్యం
పర్యావరణానికి హాని చేయని ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌, దుస్తుల తయారీ, పర్యాటకం, ఉన్నత విద్య, హెల్త్‌కేర్‌, హై ఎండ్‌ సర్వీసెస్‌(ఐటీ, ఆర్‌అండ్‌డీ తదితర), హైటెక్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌తోపాటు ప్రభుత్వ వ్యవస్థలు ఇందులో ఏర్పాటవుతాయి. వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణాన్ని కల్పించడం, ఆరోగ్యం-ఆనందాలకు నెలవుగా పార్కును తీర్చిదిద్దితే లక్ష్య సాధన సులువేనని విశ్వసిస్తున్నారు. తొలిదశలో భాగంగా రానున్న మూడేళ్లలో 300-500 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేస్తారు. ఫలితంగా 15వేల నుంచి 20 వేల వరకూ ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇది పూర్తయిన తర్వాత దశలవారీగా 2038కల్లా 1500 ఎకరాల్లో పార్కును విస్తరిస్తారు.

ekkada pooling jarigina lands lo vasthundaa idi

Link to comment
Share on other sites

ప్రజా పెట్టుబడి 
అమరావతి కోసం నవంబరులో సీఆర్‌డీఏ రీటెయిల్‌ బాండ్లు 
  రూ.100 ముఖ విలువతో జారీ 
  రూ.500 కోట్లు సమీకరించడమే లక్ష్యం 
  కాలపరిమితి 3-15 ఏళ్లు! 
  సాధారణ ప్రజలు మదుపు చేసే  అవకాశం 
  సంస్థాగత బాండ్లకంటే ఎక్కువ వడ్డీ? 
ఈనాడు - అమరావతి 
21ap-main1a.jpg

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి రూ.500 కోట్లను రీటెయిల్‌ బాండ్ల ద్వారా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. రీటెయిల్‌ బాండ్ల ద్వారా ఒకే విడతలోగానీ, రెండు మూడు విడతల్లో గానీ రూ.500 కోట్లను సీఆర్‌డీఏ సమీకరించనుంది. ఒక్కో బాండు ముఖ విలువ రూ.100. సాధారణ ప్రజలు దీనిలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశముంటుంది. అమరావతి బాండ్లద్వారా సంస్థాగత మదుపరుల నుంచి ఇప్పటికే సీఆర్‌డీఏ రూ.2 వేల కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారికి సీఆర్‌డీఏ 10.32 శాతం వడ్డీ ఇస్తోంది. రీటెయిల్‌ బాండ్లకు కూడా వడ్డీ రేటు దాదాపు అంతే ఉంటుందని, ఇది పెరిగే అవకాశం కూడా ఉందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.అమరావతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్న ఆకాంక్షతోపాటు, బాండ్లపై వడ్డీ రేటు కూడా ఆకర్షణీయంగా ఉండటంతో సాధారణ ప్రజలు, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు చెందినవారుఈ బాండ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని, నవంబరు నెలాఖరుకి బాండ్లు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

రూ.500 కోట్లే ఎందుకు? 
సంస్థాగత బాండ్లలో కనీస పెట్టుబడిని రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ట్రేడింగ్‌ అయిన గంట వ్యవధిలోనే అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు సమకూరాయి. సంస్థాగత మదుపరుల నుంచి మళ్లీ నిధులు సమీకరించేందుకు అవకాశమున్నా... అమరావతి నిర్మాణంలో ప్రజల్నీ భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంలో భాగంగా రీటెయిల్‌ బాండ్లు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థాగత బాండ్లతో పోలిస్తే రీటెయిల్‌ బాండ్లు నిర్వహించడం చాలా కష్టమైన పని. సెబీ, ఆర్‌బీఐ నిబంధనలూ కఠినతరంగా ఉంటాయి. ముఖ విలువ తక్కువ కాబట్టి వేల సంఖ్యలో మదుపరులు ఉంటారు. అందుకే ప్రస్తుతానికి రూ.500 కోట్లకే పరిమితం కావాలని, ప్రజల నుంచి వచ్చే స్పందనబట్టి మరోసారి పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లడంపై నిర్ణయం తీసుకోవాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. రీటెయిల్‌ బాండ్ల కాల పరిమితి మూడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉండే అవకాశముంది. ఈ బాండ్లకు సంబంధించిన ప్రక్రియను సీఆర్‌డీఏ ఇప్పటికే ప్రారంభించింది. బాండ్ల జారీ ప్రక్రియను నిర్వహించే సంస్థను (లీడ్‌ మేనేజర్‌) ఎంపిక చేయడానికి టెండరు జారీ చేసింది. ఈ నెల 24న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. బాండ్లపై అప్పుడు పూర్తి స్పష్టత వస్తుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

మిగతా పెట్టుబడులకంటే ఎక్కువ లబ్ధి? 
ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపుపై ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి వివిధ చిన్న మొత్తాల పథకాల్లో వడ్డీ రేట్లు కొంచెం పెరగనున్నాయి. మరోపక్క డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా తగ్గింది. ఆ నేపథ్యంలో అమరావతి బాండ్లలో సంస్థాగత మదుపరులకు ఇచ్చిన వడ్డీ కంటే రీటెయిల్‌ ఇన్వెస్టర్లకు ఇచ్చే వడ్డీ రేటు కొంత పెరిగే అవకాశం ఉందని సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. సంస్థాగత బాండ్లను ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేస్తే 10.55 శాతం వరకు వడ్డీ రేటు ఇవ్వాల్సి వచ్చేదని ఆయన పేర్కొన్నారు. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌లు, స్థిరాస్తి, బంగారం వంటి పెట్టుబడి మార్గాలను పక్కన పెడితే... సాధారణ ప్రజలు ఎక్కువగా బ్యాంకుల్లోను, చిన్న మొత్తాల పొదుపు సంస్థల్లోను మదుపు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం, కొన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలోను పెట్టుబడి పెడతారు. వీటితో పోల్చితే సీఆర్‌డీఏ బాండ్లతో వడ్డీ లబ్ధి ఎక్కువగా ఉంటుంది.

21ap-main1b.jpg
Link to comment
Share on other sites

క్రీడా నగరంపై కార్యశాల 
26న దిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహణ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 4 వేల ఎకరాల్లో తలపెట్టిన క్రీడా నగరంపై దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న దిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కార్యశాల నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు సమాచారం. ‘‘ఆంధ్రప్రదేశ్‌: రాబోయే తరం ఛాంపియన్లకు క్రీడా రాజధాని’’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తారు.

క్రీడా నగరం ప్రతిపాదనలివీ.. 
* 3.72 లక్షల మంది నివాసం ఉండేలా 4,419 ఎకరాల్లో క్రీడా నగరం 
* దీని ద్వారా 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం

Link to comment
Share on other sites

అమరావతి శిగలో మరో కలికితురాయి
22-09-2018 17:39:26
 
636732347640328222.jpg
అమరావతి: నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతి దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటోంది. సరికొత్త అవకాశాలకు, ఉపాధి మార్గాలకు బాటలు వేసేలా రాజధానికి పరిశ్రమలు తరలివస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమరావతి శిగలో మరో కలికితురాయి చేరనుంది. రాజధానిలో 100 కోట్ల రూపాయలతో రోబో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జర్మనీ ప్రభుత్వం సహకారంతో రాజధాని అమరావతిలో భారీ రోబో పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మోటివేటర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కె. లక్ష్మీనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీనారాయణతో పాటు వివిధ ఇంజినీరింగ్ కాలేజీల ప్రతినిధులు జర్మనీలో వారం రోజుల పర్యటించారు. ఈ సందర్భంగా యూరోపియన్ సెంటర్ ఫర్ మెక్ ట్రాన్సిక్, ఇండోయూరో సింకరనైజేషన్‌ సంస్థలతో కలిసి పలు యూనివర్సిటీలను, పరిశ్రమలను సందర్శించింది ఈ బృందం. ఆడి కారు తయారీ కేంద్రం, ఈగో ఆటోమేటిక్ మొబిలిటీ - ఎలక్ట్రిక్ కారు తయారీ యూనిట్, ఎండబ్ల్యూ గ్రూపుకు చెందిన మౌలిక సౌకర్యాల ప్రధాన కేంద్రం, ఆటోమెకానికా, ఫ్రాంక్‌ఫర్ట్ 2018 వాణిజ్య ఫెయిర్ మొదలైన వాటి సందర్శనలో తమ బృందం పలు అభివృద్ధి అంశాలను పరిశీలించినట్టు లక్ష్మీనారాయణ తెలిపారు.
 
 
 ఏపీ బృందం పర్యటనలో యూరోపియన్ సెంటర్ ఫర్ మెక్ ట్రాన్సిక్ అధ్యక్షుడు వంగపండు వెంకటనాగరాజు ఎంతగానో సహకరించనట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. భవిష్యత్ అంతా రోబోల తరం కానున్న నేపథ్యంలో అమరావతిలో రోబో పరిశోధనా కేంద్రం ఏర్పాటు కావడం హర్షనీయం అంటున్నారు లక్ష్మీనారాయణ, వెంకటనాగరాజు. ఇదిలా ఉంటే ఇండోయూరో సింకరనైజేషన్‌ భాగస్వామ్యంతో భారత్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలలో నైపుణ్యాభివృద్ధి, జర్మనీ యూనివర్సిటీలలో భారతీయ విద్యార్థులు ఇంటర్నెషిప్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ రూపొందించినట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మెక్ ట్రాన్సిక్, జర్మనీ ప్రభుత్వ ఆర్థిక సహకారాలతో రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కాలేజీలలో రోబో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు.. విద్యార్థుల బదిలీ విధానం, డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీలు పొందేందుకు ఆయా యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటనలో తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతిలో హ్యాపీనెస్ట్‌! 
ప్రజలకు విక్రయించేందుకు 1200 ఫ్లాట్లు 
జీ+19 విధానంలో 12 టవర్ల నిర్మాణం 
చ.అడుగు కనీస ధర రూ.3500 
దసరాకి ప్రాజెక్టు పనులు ప్రారంభం 
ఈనాడు - అమరావతి 
22ap-main6a.jpg
రాజధాని అమరావతిలో ప్రజలకు విక్రయించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) స్వయంగా గృహనిర్మాణ ప్రాజెక్టు చేపడుతోంది. ‘హ్యాపీ నెస్ట్‌’ పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టులో మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మిస్తారు. ఈ టవర్లన్నీ జీ+19 విధానంలో ఉంటాయి. పార్కింగ్‌ మొత్తం సెల్లార్‌లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాలుగైదు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. దసరా నుంచి పనులు ప్రారంభిస్తారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాజధానిలోని పరిపాలన నగరంలో గెజిటెడ్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు సుమారు అర కిలోమీటర్‌ దూరంలో ‘హ్యాపీ నెస్ట్‌’ ప్రాజెక్టుకి స్థలం ఎంపిక చేశారు. ఇది పరిపాలన నగరానికి వెలుపలే ఉంది. ఈ ప్రాజెక్టులో చ.అడుగు కనీస ధర రూ.3,500 వరకు ఉంటుంది. నాణ్యత, సదుపాయాల పరంగా ప్రముఖ ప్రైవేటు సంస్థల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు దీటుగా ఈ ప్రాజెక్టుని చేపడతున్నామని, అదే సమయంలో ప్రైవేటు సంస్థలు ఇస్తున్న ధర కంటే హ్యాపీనెస్ట్‌లో చ.అడుగు సుమారు రూ.1500 తక్కువ ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌  తెలిపారు.
22ap-main6b.jpg

22ap-main6c.jpg

 
 
 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

అమరావతిలో రోబో కేంద్రం
23-09-2018 03:44:16
 
636732710537022367.jpg
  •  జర్మనీ సహకారంతో100 కోట్లతో..
  •  ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రయోగశాలలు
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రోబో టెక్నాలజీని సకాలంలో అందిపుచ్చుకోవాలని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జర్మనీ సహకారంతో రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో రోబో పరిశోధనా కేంద్రం రాబోతుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మోటివేటర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కళాశాలల బృందం వారం రోజులపాటు జర్మనీలో పర్యటించి ఈ దిశగా కృషి చేసింది. మన రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో యూరోపియన్‌ కేంద్రం సారథ్యంలో మెక్‌ట్రానిక్స్‌ రోబోటెక్స్‌ ప్రయోగశాలలకు శ్రీకారం చుట్టబోతున్నారు.
 
యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మెక్‌ట్రానిక్స్‌, ఇండో యూరో సింక్రనైజేషన్‌ భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపడతారు. ఈ దిశగా జర్మనీ యూనివర్సిటీలతో జరిపిన చర్చలు సానుకూలమైనట్లు డాక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ పర్యటనలో ఆడి కారు తయారీ కేంద్రం, ఈగో ఆటోమెటిక్‌ మొబిలిటీ-ఎలక్ట్రిక్‌ కారు తయారీ యూనిట్‌, ఎం ప్లస్‌ డబ్ల్యూ తయారీలో మౌలిక సౌకర్యాల కేంద్రం, ఆటో మెకానిక్‌, 2018 ఫ్రాంక్‌ఫర్డ్‌ వాణిజ్య ఫెయిర్‌ను బృందం పరిశీలించింది. ఇండో యూరో సింక్రనైజేషన్‌-యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మెక్‌ట్రానిక్స్‌ అధ్యక్షులు వంగపండు నాగరాజు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:
అమరావతిలో హ్యాపీనెస్ట్‌! 
ప్రజలకు విక్రయించేందుకు 1200 ఫ్లాట్లు 
జీ+19 విధానంలో 12 టవర్ల నిర్మాణం 
చ.అడుగు కనీస ధర రూ.3500 
దసరాకి ప్రాజెక్టు పనులు ప్రారంభం 
ఈనాడు - అమరావతి 
22ap-main6a.jpg

రాజధాని అమరావతిలో ప్రజలకు విక్రయించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) స్వయంగా గృహనిర్మాణ ప్రాజెక్టు చేపడుతోంది. ‘హ్యాపీ నెస్ట్‌’ పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టులో మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మిస్తారు. ఈ టవర్లన్నీ జీ+19 విధానంలో ఉంటాయి. పార్కింగ్‌ మొత్తం సెల్లార్‌లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాలుగైదు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. దసరా నుంచి పనులు ప్రారంభిస్తారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాజధానిలోని పరిపాలన నగరంలో గెజిటెడ్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు సుమారు అర కిలోమీటర్‌ దూరంలో ‘హ్యాపీ నెస్ట్‌’ ప్రాజెక్టుకి స్థలం ఎంపిక చేశారు. ఇది పరిపాలన నగరానికి వెలుపలే ఉంది. ఈ ప్రాజెక్టులో చ.అడుగు కనీస ధర రూ.3,500 వరకు ఉంటుంది. నాణ్యత, సదుపాయాల పరంగా ప్రముఖ ప్రైవేటు సంస్థల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు దీటుగా ఈ ప్రాజెక్టుని చేపడతున్నామని, అదే సమయంలో ప్రైవేటు సంస్థలు ఇస్తున్న ధర కంటే హ్యాపీనెస్ట్‌లో చ.అడుగు సుమారు రూ.1500 తక్కువ ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌  తెలిపారు.

22ap-main6b.jpg

22ap-main6c.jpg

 
 
 

ముఖ్యాంశాలు

How to book the flat ?

Link to comment
Share on other sites

సీఆర్డీయే సోషల్‌ మీడియా ప్రమోటర్‌గా ‘పిక్సెల్‌ పాట్స్‌’
25-09-2018 07:08:13
 
636734560951207810.jpg
అమరావతి: రాజధాని నిర్మాణ విశేషాల గురించి నెటిజన్లకు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసేందుకుగాను ఏపీసీఆర్డీయే పిక్సెల్‌ పాట్స్‌ అనే సంస్థను నియమించుకుంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రాం ఇత్యాది సామాజిక మాధ్యమాల్లో అమరావతి రూపకల్పనకు సంబంధించిన అంశాలను ఆకర్షణీయంగా, ఏమాత్రం జాప్యం లేకుండా పోస్ట్‌ చేయడం ఈ సంస్థ బాధ్యతలు. కొన్ని నెలలక్రితం వరకూ ఈ బాధ్యతలను నిర్వర్తించిన డెంట్సు అనే సంస్థ కాంట్రాక్ట్‌ కాలపరిమితి ముగియడంతో కొంత కాలంగా సీఆర్డీయే సోషల్‌ మీడియాలో అంత చురుగ్గా లేదు. ఈ నేపథ్యంలో పిక్సెల్‌ పాట్స్‌ను కొద్దిరోజుల క్రితం సీఆర్డీయే తన సోషల్‌ మీడియా ప్రమోటర్‌గా నియమించుకుంది.
 
 
అయితే ఈ సంస్థ నియామకం తాత్కాలిక ప్రాతిపదికనే జరిగిందని, డెంట్సు నిష్క్రమణతో ఖాళీ అయిన సీఆర్డీయే కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ స్థానంలో మరొక సంస్థ నియమి తమయ్యేంతవరకూ మాత్రమే సీఆర్డీయే సోషల్‌ మీడియా అకౌంట్లను పిక్సెల్‌ పాట్స్‌ నిర్వహిస్తుందని తెలిసింది.
 
 
ముంబైకి శ్రీధర్‌..
కాగా.. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మించనున్న శాశ్వత సచివాలయ టవర్లకు సంబంధించిన అంశాలపై నిపుణులతో చర్చించేందుకు సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సోమవారం సాయం త్రం ముంబై బయల్దేరి వెళ్లారు. సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌తోపాటు మరికొందరు ఉన్నతాధికారులతో కలసి ఆయన మంగళవారం అక్కడ జరగనున్న వర్క్‌ షాపులో పాల్గొననున్నారని సమాచారం. అది ముగిసిన అనంతరం శ్రీధర్‌ అట్నుంచటే న్యూఢిల్లీ వెళ్తారని తెలిసింది. రాజధాని నగ రంలోని 9 థీమ్‌ సిటీస్‌ గురించి వివ రించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఢిల్లీలో బుధవారంనాడు జరగనున్న వర్క్‌ షాప్‌నకు ఆయన హాజరవనున్నారు. ఏపీ భవన్‌, సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ అనే స్వచ్ఛందసంస్థ సౌజన్యంతో జరగనున్న ఈ కార్యగోష్టిలో శ్రీధర్‌తోపాటు రాష్ట్రానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రభృతులు, దేశంలోని పలువురు ప్రముఖ ఇన్వెస్టర్లు పాల్గొననున్నారు.
Link to comment
Share on other sites

రోడ్డు బాధితులకు మెరుగైన పరిహారం
26-09-2018 07:28:34
 
636735437154691694.jpg
  • ప్లాట్ల కేటాయింపు.. ఇళ్ల నిర్మాణం
  • ఇప్పటికే ప్రగతి నగర్‌కు రూపు
  • మరికొంత మందికి ఈ నెల 27న ప్లాట్ల కేటాయింపు
తుళ్లూరు: రాజధానిలో రోడ్డు బాధితులకు మెరుగైన పరిహారం ఇవ్వటానికి సీఆర్డీయే చర్యలు తీసుకుంటోంది. దీంతో వైదొలగేందుకు బాధితులు సంతోషంగా ముందుకు వస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారులు ఏర్పాటయ్యే క్రమంలో కొంతమంది ఇళ్లు, స్థలాలు కోల్పోయారు. ఆయా రోడ్డు బాధితులకు మెరుగైన పరిహారం ఇచ్చి, ఇంటి స్థలం ఇచ్చి ఇందులో నిర్మాణం ఉన్న దానికి విలువ కట్టి చెల్లిస్తోంది. ఒక సంవత్సరం అద్దె కూడా సీఆర్డీయే చెల్లిస్తోంది. రాయపూడి సీడ్‌ యాక్సెస్‌ కింద 65 కుటుంబాలు ఇళ్ల స్థలాలు కోల్పోవాల్సి వచ్చింది. వారికి సీడ్‌ రోడ్డు పక్కనే ప్లాట్లు కేటాయించి ఓ సంవత్సరం అద్దె, స్ట్రక్చర్‌ పరిహారం అందజేశారు. కేటాయించిన ప్లాట్లలో ఇప్పటికే చాలామంది ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు. సిమెంటు రోడ్లు విద్యుత్‌, గ్రీనరీని ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించారు. దీనికి ప్రగతి నగర్‌ అని నామకరణం చేశారు. ఈ క్రమంలోనే నిడమర్రుకు చెందిన రోడ్డు బాధిత రైతులు ప్రగతి కాలనీని సోమవారం సందర్శించారు.
 
అబ్బరాజుపాలెం గ్రామంలో పడమర వైపు ఎన్‌-14 రోడ్డు నిర్మాణ జరుగుతోంది. 45 కుటుంబాలకు చెందిన ఇళ్లు స్థలాలు కోల్పోవాల్సి వచ్చింది. వారికి కూడా ప్లాట్లు కేటాయించి అందులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 90 శాతం పనులు పూర్తి చేశారు. వారికి కూడా ఈ నెల 27న లాటరీ తీసి ప్లాట్లు కేటాయించటానికి సీఆర్డీయే సిద్ధమవుతోంది. దీనిపై మంగళవారం అబ్బరాజుపాలెం ల్యాండు పూలింగ్‌ కార్యాలయంలో అవగాహన కల్పించారు. రాజధాని 29 గ్రామాల్లో రోడ్డు కింద ఇలా ఇళ్ల స్థలాలు పోతున్న వారి సంఖ్య 300 నుంచి 400 పైగా ఉంది. రాజధాని 11 ప్రధాన రోడ్లుతో పాటు, ఆర్టీరియర్‌ సబ్‌, ఆర్టీరియర్‌ మొత్తం 32 రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. రోడ్డు వ్యవస్థ అభివృద్ధి చెందితే రాజధాని అమరావతికి ఒక రూపురేఖలు వస్తాయని సీఆర్డీయే అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే మార్చి నాటికి రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్మాణ కంపెనీలు నిర్విరామంగా పనులు చేపట్టాయి.
Link to comment
Share on other sites

అమరావతి బాండ్లపై ప్రీ బిడ్‌ సమావేశం
26-09-2018 07:36:16
 
636735441783497584.jpg
అమరావతి: ప్రజలు కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశాన్నిచ్చేలా త్వరలో జారీ చేయదలచిన అమరావతి బాండ్ల పబ్లిక్‌ ఇస్యూకు లీడ్‌ మేనేజర్‌ నియామకానికి సీఆర్డీయే మంగళవారంనాడు ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించింది. విజయవాడలోని తన ప్రధాన కార్యాలయంలో జరిపిన సదరు భేటీకి హాజరైన కొన్ని సంస్థల ప్రతినిధులకు ఈ బాండ్లకు సంబంధించిన వివరాలను సీఆర్డీయే స్పెషల్‌ కమిషనర్‌ వి.రామ మనోహరరావు, స్ట్రాటజీ విభాగం డైరెక్టర్‌ జేఎస్సార్కే శాస్త్రి తదితర అధికారులు తెలియజేశారు. ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలి చ్చారు. కాగా.. గత నెలలో బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ వేదికగా జారీ చేసిన అమరావతి బాండ్లకు ఘనస్పందన లభించి, ఒకటిన్నర రెట్లు ఓవర్‌ సబ్‌స్రైబ్‌ అవడం తెలిసిందే.
 
అయితే వాటిని సంస్థాగత మదుపుదారులకు మాత్రమే పరిమితం చేయడం, ఒక్కో యూనిట్‌ ధర రూ.10 లక్షలుగా నిర్ణయించడంతో సాధారణ ప్రజలు ఆ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయింది. సీఎం నారా చంద్రబాబునాయుడి ఆదేశానుసారం సీఆర్డీయే ఒక్కొక్కటి రూ.వెయ్యి ఖరీదైన ఈ బాండ్ల ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెలలో ఈ బాండ్ల పబ్లిక్‌ ఇస్యూకు వెళ్లాల నుకుంటున్న ఈ సంస్థ వాటి జారీలో తనకు తోడ్పడే లీడ్‌ మేనేజర్‌ నియామకానికి ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానికి స్పందించిన కొన్ని సంస్థల ప్రతినిధులతో మంగళవారంనాడు సమావేశమైంది. సాధ్యమైనంత త్వరలోనే లీడ్‌ మేనేజర్‌ను ఖరారు చేసి, అమరావతి బాండ్ల పబ్లిక్‌ ఇస్యూకు సంబంధించిన తర్వాతి దశలను చురుగ్గా చేపట్టాలనుకుంటోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...