Jump to content

Amaravati


Recommended Posts

విశ్వక్రీడా నగరి
అమరావతిలో అంతర్జాతీయ  వసతులు, అకాడెమీలతో  స్పోర్ట్స్‌ సిటీ
క్రీడా సంబంధిత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం
  తొలిదశలో బహుళ ప్రయోజనకర స్టేడియం
  ‘వ్యూహ పత్రం’ రూపొందించిన మెకన్సే
ఈనాడు - అమరావతి
30ap-main1a.jpg

అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు, అకాడెమీలు, క్రీడా వసతులతో అమరావతిని ప్రపంచంలో అగ్రగామి క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రణాళిక రూపొందించింది. దీనికి అనుగుణంగా అమరావతిలో ప్రత్యేకంగా క్రీడా నగర (స్పోర్ట్స్‌ సిటీ) అభివృద్ధికి మెకన్సే సంస్థ ఒక వ్యూహ పత్రం సిద్ధం చేసింది. స్పోర్ట్స్‌ సిటీలో రెండు దశల్లో క్రీడా వసతులను అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన. తొలి దశ ప్రణాళికలో భాగంగా రూ.242 కోట్ల అంచనావ్యయంతో బహుళ ప్రయోజనకర స్పోర్ట్స్‌ స్టేడియంని నిర్మిస్తారు. రాజధానిలో పరిపాలన నగరానికి సమీపంలో 20 ఎకరాలు దీని కేటాయించారు. క్రీడానగరిలో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1400 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. క్రీడా రంగంపై ఆధారపడిన వివిధ వ్యాపారాలకు అమరావతిని కేంద్ర బిందువుగా కూడా తీర్చిదిద్దనున్నారు.

27 టౌన్‌షిప్‌లలో వసతులు...
క్రీడా వసతుల అభివృద్ధికి సంబంధించి సీఆర్‌డీఏ రెండంచెల వ్యూహాన్ని అమలు చేయనుంది. రాజధానిలోని 27 టౌన్‌షిప్‌లలో ప్రతిచోటా 5-10 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటవుతాయి. ఇవన్నీ రాజధాని నగరంలో నివసించే ప్రజల కోసం. వాటన్నిటిలో వివిధ రకాల క్రీడలకు సంబంధించి వసతులు, వాలీబాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ వంటి కోర్టులు, జిమ్‌ సదుపాయాలు కల్పిస్తారు. ఫుట్‌బాల్‌, హాకీ, క్రికెట్‌ వంటి క్రీడలకు సంబంధించి... రాజధానిలో రెండేసి చొప్పున మైదానాలు ఏర్పాటు చేస్తారు. క్రీడానగర అభివృద్ధిలో భాగంగా మల్టీపర్పస్‌ స్టేడియం, రెండు మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ అకాడెమీలు, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ వంటి క్రీడలలో శిక్షణకు ప్రత్యేక అకాడెమీలు వంటివి ఏర్పాటవుతాయి. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, క్రీడా సంబంధిత వ్యాపారాలు, క్రీడా సామగ్రి తయారీ కేంద్రాలు వంటివి ఇక్కడ వస్తాయి.

30ap-main1b.jpg

ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యం
2037 నాటికి ఒలింపిక్స్‌ నిర్వహణకు భారతదేశం సిద్ధమైతే... ఆ మెగా ఈవెంట్‌కి అమరావతి కేంద్రస్థానంగా నిలిచేలా క్రీడా సదుపాయల్నీ కల్పించడమే తమ లక్ష్యమని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. 2037 నాటికి ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు 7-8 బంగారు పతకాలు సాధించేలా చేయడం తమ లక్ష్యమన్నారు. ‘‘ప్రపంచంలో క్రీడలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ విలువ 100 బిలియన్‌ డాలర్లు. దానిలో ఐపీఎల్‌ వంటి క్రీడాంశాల వల్ల భారత్‌ వాట్‌ 5-6 శాతం ఉంది. భారత్‌లో క్రీడా సంబంధిత ఆర్థిక వ్యవస్థకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దడం మా అభిమతం. దానికి అనుగుణంగానే వ్యూహ పత్రాన్ని రూపొందించాం. రాజధానిలో స్పోర్ట్స్‌ సిటీ అన్నది ఒక థీమ్‌ మాత్రమే. అంటే అక్కడ కేవలం క్రీడా సదుపాయాలు మాత్రమే వస్తాయని కాదు. క్రీడా సదుపాయాలు ప్రధానంగా ఉంటూ... నివాస, వాణిజ్య సదుపాయాలు, ఇతర వసతులన్నీ అక్కడ వస్తాయి’’ అని కమిషనర్‌ వివరించారు.

30ap-main1c.jpg

 

Link to comment
Share on other sites

ప్రగతి బాటలో రాజధాని గ్రామాలు
01-10-2018 08:08:51
 
636739781301975016.jpg
రాజధాని గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. మండలంలోని 18 రాజధాని గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రాజధానికి మొట్టమొదటిగా భూములిచ్చిన గ్రామంగా నేలపాడు రికార్డుల్లోకి ఎక్కింది. ఈ గ్రామానికి ఇప్పుడు మహర్దశ పట్టింది. విశాలమైన రోడ్లు, తాగునీటి సరఫరా, నూతన కాలనీలతో ప్రగతి బాటలో పయనిస్తోంది.
 
 
తుళ్ళూరు: రాజధానిలో మొదటిగా నేలపాడుకు చెందిన కొమ్మినేని ఆదిలక్ష్మి తనకున్న 3.50 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద అందజేశారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా తొలుతగా నేలపాడు నుంచే ప్రారంభిస్తోంది. నేలపాడు సెంటిమెంట్‌గా కలసి వచ్చిందని.. ఆ తర్వాత 33 వేల ఎకరాలను రాజధానికి రైతులు భూములను త్యాగం చేశారని అందరూ చెప్పుకొంటున్నారు. ఒక్క నేలపాడుకు చెందిన 1,400 ఎకరాలను రాజధాని నిర్మాణ నిమిత్తం త్యాగం చేశారు. ఈ నాలుగేళ్లలో నేలపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రూ.15 లక్షలతో పంచాయతీ కార్యాలయాన్ని, ఎన్‌ఆర్‌జీఈఎస్‌ నిధులు రూ.కోటీ 30 లక్షలతో, 140 మీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం, రూ.50 లక్షలతో వాటర్‌ ట్యాంకు ఫిల్టర్‌ బెడ్లు నిర్మించారు. ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా మినరల్‌ వాటర్‌ను అందిస్తున్నారు. సామాజిక పింఛన్లు గతంలో 80 ఉంటే మరో 80 మంది లబ్ధిదారులను ఎంపికచేసి ప్రభుత్వం అందజేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రం కోసం నూతన భవనాన్ని రూ.10 లక్షలతో నిర్మించారు. శ్మశాన వాటికల చుట్టూ రూ.10 లక్షలతో ప్రహరీని నిర్మించారు.
 
నేలపాడు గ్రామానికి ఆనుకొని తూర్పు వైపున ఎన్జీవో కాలనీ ఏర్పాటు అవుతోంది. ఆ పనులను ఎల్‌అండ్‌టీ షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు శరవేగంగా జరుపుతున్నాయి. దీంతో ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు లేని నేలపాడు గ్రామం ఒక సిటీగా మారబోతుంది. రాజధానిలో నిర్మితమవుతున్న ప్రధాన రోడ్లలో రెండురోడ్లు నేలపాడు తూర్పు, పడమర భాగంలో ఏర్పాటు అవుతున్నాయి. విశాలమైన రోడ్లు నిర్మాణం జరుగుతుండటంతో ఇక నుంచి భారీ వాహనాలు వచ్చినా ఇబ్బంది లేదని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పంచాయతీ రాజ్‌ నిధులు, ఎన్‌ఆర్‌ఈఎస్‌ నిధులు, ఇటు సీర్డీయే నిధులతో నేలపాడు గ్రామం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోంది.
 
రాజధానిలో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే అమరావతి జీవన భృతి ఫింఛనును నెల, నెలా రూ.2,500ను గ్రామంలో 200 కుటుంబాలు అందుకుంటున్నాయి. రేషన్‌ కార్డులు గతంలో 200 ఉంటే అర్హత కలిగిన వారిని గుర్తించి ఇప్పుడు 385 కార్డులకు రేషన్‌ను అందిస్తున్నారు. 300 ఇళ్లు ఉన్న నేలపాడు గ్రామం దినదినాభివృద్ధి చెందుతోందని, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ కృషితో ఈ అభివృద్ధి పనులు జరిగాయని తాజా మాజీ సర్పంచ్‌ మండల టీడీపీ అధ్యక్షుడు ధనేకుల సుబ్బారావు పేర్కొన్నారు.
 
కొన్ని సమస్యలు..
అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. చెరువును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. హరిశ్చంద్రాపురం పైలెట్‌ ప్రాజెక్టు నుంచి తాగు నీటి సరఫరా జరగాల్సి ఉందని సుబ్బారావు పేర్కొన్నారు. రైతుల లేఅవుట్‌లో వీధి పోట్లు ఉన్నాయని వాటిని సరిచేయాలని సూచించారు. గ్రామంలో వాగు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మిగిలి ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించామని త్వరలో వాటి పరిష్కారం కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
 
 
సీఎంపై నమ్మకం ఉంది..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయనపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది. గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు సీఆర్డీయే చొరవ చూపింది. రైతుల ప్లాట్లకు విలువ పెరిగే విధంగా అధికారులు అభివృద్ధి చేయాలి. రాజధానికి ఐదు ఎకరాలు సంతోషంగానే ఇచ్చాను.
- కనతరపు సాంబశివరావు, నేలపాడు రైతు
 
 
వేగంగా అభివృద్ధి ..
మా కళ్ల ముందే అభివృద్ధి జరుతుంది. నేలపాడుకు ఆనుకొని ఎన్జీవో ఇళ్లనిర్మాణాలు వేగంగా జరుతున్నాయి. నేలపాడు ప్లాట్లకు డిమాండు పెరిగింది. గ్రామాలను అభివృద్ధి చేసి చూపెడతామని సీఆర్డీయే గ్రామ సభల్లో పేర్కొంది. అందుకు తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. ఏడు ఎకరాల భూమిని చంద్రబాబు మీద నమ్మకంతో ఇచ్చాను. కచ్చితంగా చంద్రబాబుతోనే అభివృద్ధి జరుగుతుంది.
- నన్నపనేని శేఖర్‌, నేలపాడు రైతు
Link to comment
Share on other sites

డిసెంబరుకల్లా పూర్తి చేస్తాం
హైకోర్టు భవన నిర్మాణంపై సుప్రీంకు రాష్ట్రం వివరణ
మూడేళ్లుగా చెబుతున్నారన్న కేంద్రం, తెలంగాణ
1ap-main10a.jpg
ఈనాడు, దిల్లీ: రాజధాని అమరావతిలో డిసెంబరుకల్లా హైకోర్టు భవనం పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలుచేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ వాదనలు ప్రారంభిస్తూ... రాష్ట్రంలో హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారని, డిసెంబరుకల్లా పూర్తవుతుందని ధర్మాసనానికి తెలిపారు. ‘అలాంటప్పుడు విచారణకు ఇంకేం మిగిలింది? డిసెంబరుకల్లా పూర్తి చేస్తామని ఏపీ అఫిడవిట్‌ ఇస్తే కేసు ముగించొచ్చుగా..’ అని జస్టిస్‌ ఏకే సిక్రీ పేర్కొన్నారు. తమ అఫిడవిట్‌ సిద్ధంగానే ఉందని నారీమన్‌ తెలిపారు. దీనికి కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు అభ్యంతరం తెలిపారు. మూడేళ్లుగా ఇదే మాటను ఏపీ ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. అవునా? కారణాలేంటి? ఏమైనా మార్పులున్నాయా? అని జస్టిస్‌ ఏకే సిక్రీ ప్రశ్నించగా.. వేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని నారీమన్‌ వివరించారు. తాజాగా మార్పు ఏంటంటే.. ఇటీవల ఎన్డీయే నుంచి తెదేపా తప్పుకోవడమేనని అనడంతో న్యాయస్థానంలో నవ్వులు పూశాయి. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందని, హైకోర్టు నిర్మాణానికి కూడా కేటాయిస్తోందని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ తెలిపారు. ఏపీ హైకోర్టుకు వెళ్లడానికి కొందరు న్యాయమూర్తులు కూడా ఆసక్తి చూపడం లేదని, మౌలిక వసతుల కల్పన కూడా ఆలస్యమవుతోందని వేణుగోపాల్‌, తెలంగాణ తరఫున మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని తెలపగా.. అక్కడి విషయం ఎందుకు? మేం విచారిస్తామని చెప్పాం కదా అని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని, అందులో న్యాయమూర్తుల నియామకం, మౌలిక వసతుల కల్పన వివరాలనూ పొందుపర్చాలని స్పష్టం చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఏపీకి రూ.వేయి జరిమానా: కృష్ణా ట్రైబ్యునల్‌లో నీటి పంపకాలు నాలుగు రాష్ట్రాల మధ్య జరగాలని, తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకూడదని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ ఎన్వీ రమణ తన ఛాంబర్‌లో విచారించారు. అనంతరం ఇచ్చిన ఆదేశాల్లో.. స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ను తిరిగి దాఖలు చేయడానికి(ఎస్సెల్పీ రీఫైల్‌) అనుమతించాం. కానీ 340 రోజులు తీసుకున్నందున రెండు వారాల్లో అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ సంక్షేమ ట్రస్టుకు రూ.వేయి జరిమానా కట్టాలి’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
 
 

 

 
Link to comment
Share on other sites

3 నెలల్లో హైకోర్టు సిద్ధం
02-10-2018 02:09:12
 
636740429509188495.jpg
  • కోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణ పనులు.. సుప్రీంకు ఏపీ నివేదన
  • మూడేళ్లుగా అదే చెబుతున్నారన్న కేంద్రం, తెలంగాణ
  • 2 వారాల్లో అఫిడవిట్‌ దాఖలుకు ధర్మాసనం ఆదేశం
  • బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నందుకే ఎస్‌ఎల్‌పీ: నారీమన్‌
 
 
 
న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర హైకోర్టు మూడు నెలల్లో అమరావతిలో సిద్ధమవుతుందని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయడం చట్టసమ్మతం కాదని హైకోర్టు ధర్మాసనం 2015 మే 1న ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎ్‌సఎల్‌పీ)పై జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఎప్పటిలోగా హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని ప్రశ్నించగా.. నిర్మాణ పనులు జరుగుతున్నాయని, డిసెంబరుకల్లా పూర్తవుతుందని ఆంధ్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రస్తుత హైకోర్టును ఆంధ్రకు వదిలేసి తమ హైకోర్టును వేరే చోట ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమేనని తెలంగాణ ప్రతిపాదించిందని..అయితే ఆంధ్ర హైకోర్టు మరో మూడు నెలల్లో పూర్తి అవుతున్నప్పుడు ఇక ఈ ప్రతిపాదన అవసరం లేదని జస్టిస్‌ ఏకే సిక్రీ వ్యాఖ్యానించారు. కాగా.. ప్రస్తుత హైకోర్టులోని ఆంధ్ర న్యాయవాదులు.. నవ్యాంధ్రకు వెళ్లేందుకు సుముఖంగా లేరని, అక్కడ వసతులు కూడా లేవని కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు.
 
 
ఏపీ ప్రభుత్వం మూడేళ్లుగా ఇదే చెబుతోందని, కానీ నిర్మాణం పూర్తిచేయలేదని, ఇది చాలా సున్నితమైన సమస్యగా వేణుగోపాల్‌ పేర్కొన్నారు. రెండు వారాల్లో ఈ అంశాలు పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించింది. తెలంగాణ తరఫు న్యాయవాదులు విభజన అంశాలపై మాట్లాడుతుండగా.. నారీమన్‌ కల్పించుకున్నారు. ‘లోక్‌సభలో బీజేపీకి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతోనే అసలు మార్పులు వచ్చాయి. అయినా మూడేళ్ల తరువాత ఎస్‌ఎల్‌పీ ఏమిటి’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దానికి న్యాయమూర్తులు కూడా నవ్వారు. కాగా, సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించామని ఆంధ్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతికి జేవియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌
ప్రఖ్యాత విద్యాసంస్థకు  ఈ నెలలోనే శంకుస్థాపన
2ap-state9a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ వస్తోంది. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) సంస్థ అమరావతిలోని ఐనవోలు సమీపంలో క్యాంపస్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఎకరం రూ.10 లక్షల చొప్పున 50 ఎకరాలు కేటాయించింది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 1949లో జంషెడ్‌పూర్‌లో ప్రారంభమైన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థ.. భువనేశ్వర్‌లో రెండో క్యాంపస్‌ ఏర్పాటు చేసింది. మూడో ప్రాంగణాన్ని ఇప్పుడు అమరావతిలో ప్రారంభిస్తోంది.

5 వేల మందికి బోధన
మొత్తం విద్యార్థులు: 5 వేలు
కోర్సులు: మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు
అకడమిక్‌ బ్లాక్‌: 17 ఎకరాల్లో జీ+5 విధానంలో నిర్మిస్తారు. 84 తరగతి గదులు, 7 లెక్చర్‌ హాళ్లు, 500 ఫ్యాకల్టీ కార్యాలయాలు, 40 కాన్ఫరెన్స్‌ రూంలు, మినీ ఆడిటోరియం, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటివి ఉంటాయి. ఇవికాకుండా పరిపాలన విభాగం, గ్రంథాలయం, ఆరోగ్య కేంద్రం, ఇంటర్నేషనల్‌ సెంటర్‌, వినోద, క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
* డిగ్రీ, పీజీ విద్యార్థులకు జీ+15 అంతస్తుల్లో వేర్వేరుగా హాస్టల్‌ భవనాలు; బోధన, బోధనేతర సిబ్బందికి జీ+17 విధానంలో నివాస భవనాలు నిర్మిస్తారు.

Link to comment
Share on other sites

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తుళ్లూరు
03-10-2018 08:16:56
 
636741514155653284.jpg
  • 20 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు
  • గ్రామానికి నాలుగు వైపులా ప్రధాన రహదారులు
  • ఆహ్లాదం గొలిపే వాకింగ్‌ ట్రాక్‌లు
రాజధాని అనగానే ముందుకుగా గుర్తుకు వచ్చే తుళ్లూరు. రాజధానిలో 18 గ్రామాలు తుళ్లూరు మండలం లోనివే..! ఒకప్పుడు పల్లెటూరిగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు సిమెంటు రోడ్లు, వాకింగ్‌ ట్రాక్‌లు, పార్కులతో ఆహ్లాదం గొలుపుతోంది. దాదాపు పది వేల జనాభా కలిగిన ఈ గ్రామం నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
 
 
తుళ్లూరు: రాజధాని నిర్మాణంతో తుళ్లూరు దశ తిరిగింది. రాజధానిలోని 18 గ్రామాలు తుళ్లూరు మండల కేంద్రంలోనివే. పదివేల జనాభా కలిగిన ఈ గ్రామంలో రాజధాని ప్రకటన తర్వాత దాదాపు రూ. 15 కోట్లతో 20 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు ఏర్పడ్డాయి. ఆహ్లాదం గొలిపే వాకింగ్‌ ట్రాక్‌లు ముచ్చటగొలుపుతున్నాయి. ల్యాండు పూలింగ్‌కు భూమిని ఇవ్వటానికి ముందుకొచ్చిన గ్రామాల్లో తుళ్లూరు కూడా ఒకటి. అందుకే ఆ గ్రామంలో మౌలిక వసతుల కల్ప కోసం సీఆర్డీయే ప్రత్యే దృష్టి సారించింది. రోడ్లు పనులు ఇప్పటికే 70 శాతం దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. అదే విధంగా జిల్లా పరిషత్‌ పాఠశాల అభివద్ధికి రూ.23 లక్షలు కేటాయించి అదనపు గదులు, మరమ్మతులు పూర్తి చేశారు. గ్రామంలో రూ.8 లక్షలతో అంగన్‌వాడీ భవనంనిర్మించారు. గ్రామంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు సబ్సిడీపై రుణాలు అందజేసి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిచ్చింది.
 
రేషన్‌ కార్డులూ అదనమే..
తుళ్లూరులో గతంలో కంటే 600 పై చిలుకు రేషన్‌ కార్డులు నూతనంగా అర్హులైన వారికి అందజేశారు. మొత్తం 3,020 మందికి రేషన్‌ అందుతోంది. ఇంకా 170 కార్డుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వారికి కూడా రేషన్‌కార్డులు అందజేయటానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఎస్సీ, ముస్లిం శ్మశాన వాటికలకు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. ఒక్కో దానికి రూ.పది లక్షల చొప్పున నిధులు కేటాయించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా తుళ్లూరు గ్రామంలో 448 మరుగుదొడ్లను నిర్మించారు.
 
ఉచిత వైద్యం..
రాజధాని ప్రకటించి భూ సమీకరణ చేపట్టిన తరువాత ఇక్కడి వారికి ఉచిత వైద్యం అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో గ్రామానికి 3,384 హెల్త్‌ కార్డులను ఉచిత వైద్యం కోసం ప్రభుత్వం అందజేసింది. మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఆరోగ్య సేవలను అందిస్తోంది. అన్న క్యాంటీన్‌ను ఏర్పాటుచేసి ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తుంది. భూమిలేని నిరుపేదలకు రాజధాని అమరావతిలో జీవన భృతి ఫింఛన్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. సామాజిక ఫింఛన్లతో పాటు అమరావతి జీవనభృతి ఫింఛన్లను 1,892 కుటుంబాలకు ఫింఛన్‌ నెల,నెలా రూ.2500 అందజేస్తోంది.
 
కొన్ని సమస్యలూ ఉన్నాయి..
అభివృద్ధితోపాటు సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ గ్రామంలో రెండు అంగన్‌వా డీ కేంద్రాలు ఏ ర్పాటు చేయాల్సి ఉంది. డంపింగ్‌ యార్డు లేక పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. 108 వాహనం తుళ్ళూరుకు ప్రస్తుతం అత్యవసరం. రైతుల ప్లాట్లలో అభివృద్ధి వేగవంతం చేయాల్సిఉంది.
 
 
ఆసుపత్రి..
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తుళ్లూరులో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అన్ని హంగులతో ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
 
 
పేదలకు గృహాలు..
రాజధానిలో ఇళ్లు, నివాస స్థలం రెండూ లేని నిరుపేదలకు ఇంటి కల సాకారం చేయటానికి ప్రభుత్వం అర్బన్‌ హౌసింగ్‌ స్కీంను ప్రవేశపెట్టి ఐదొందల గృహాలను నిర్మిస్తోంది. వాటి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో వాటిని లబ్ధిదారులకు అందజేస్తారు.
 
 
వాకింగ్‌ ట్రాక్‌లు
తుళ్లూరులో యర్రమాసు వారి చెరువు, గంటలమ్మ చెరువులపై వాకింగ్‌ ట్రాక్‌లను సీఆర్డీయే ఏర్పాటు చేసింది. ఇప్పకే యర్రమాసువారి చెరువు మీద 80 లక్షలతో వాకింగ్‌ ట్రాక్‌, చిల్డ్రన్‌ పార్క్‌లను అభివృద్ధి చేశారు. గంటలమ్మ చెరువుపై వాకింగ్‌ట్రాక్‌ పనులు రూ.70 లక్షలతో జరుగుతున్నాయి.
 
 
ఫింఛన్లు..
గతంలో కంటే అదనంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి సామాజిక ఫింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. గతంలో 600 ఉంటే ఇప్పుడు 1,026 ఫింఛన్లను అందిస్తోంది. ఇంకా కొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. త్వరలో అవి కూడా మంజూరు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
 
టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి..
అప్పుడైనా ఇప్పుడైనా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే తుళ్లూరు గ్రామంలో అభివృద్ధి జరిగింది. జనాభా పెరిగిన మీదట మరో వాటర్‌ ట్యాంకు అవసరమని అధికారులకు చెప్పాం. ప్రధాన రహదారి, బస్టాండు బజారు అభివృద్ధికి సీఆర్డీయే రూ.9 కోట్లు కేటాయించింది. సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో తుళ్లూరు గ్రామం అభివృద్ధిలో ముందుంది.
- దామినేని శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు
 
 
స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం...
అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అసత్య ప్రచారాల కారణంగా కొన్ని అవాంతరాలు కలిగాయి. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. సీఎం చంద్రబాబు మీద నమ్మకంతో ఉన్నాం. అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా చూసి మాట్లాడాలి. అసత్య ప్రచారలు చేసేవారు మా వెంట వస్తే రాజధానిలో అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తాం.-
- ఉప్పలపాటి సాంబశివరావు, తుళ్లూరు రైతు
Link to comment
Share on other sites

శంకుస్థాపన స్థలికి నూతన హంగులు
04-10-2018 07:32:38
 
636742351581832272.jpg
  • మరింత ఆకర్షణీయంగా అమరావతి మాస్టర్‌ ప్లాన్‌
  • సందర్శకుల సౌకర్యార్ధం అల్పాహారశాల, మరుగుదొడ్లు
  • ‘అమరావతి యాత్ర’లకల్లా పనులన్నీ పూర్తి
 
అమరావతి: కొద్ది వారాల్లో ప్రారంభమవుతాయని భావిస్తున్న ‘అమరావతి యాత్ర’లకల్లా రాజధానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సీఆర్డీయే చర్యలు తీసుకుంటోంది. 2015 అక్టోబర్‌ 22న, విజయదశమి పర్వదినాన మోదీ లక్షలాది మంది ప్రజలు, ఎందరెందరో మహామహుల సమక్షంలో అమరావతికి ఉద్ధండరాయునిపాలెం వద్ద శంకుస్థాపన జరిపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని సందర్శించేందుకు రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు ఆసక్తిచూపుతున్న దృష్ట్యా సీఆర్డీయే దానిని ఆకర్షణీయంగా మలిచింది. పీఎం ఆవిష్కరించిన శంకుస్థాపన ఫలకాన్ని, ఆ సందర్భంగా అక్కడ నిర్వహించిన యాగశాల, శంకుస్థాపనకు ముందు రాష్ట్రంలోని పలు పుణ్యనదులు, పంచాయతీలు, పట్టణాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి సేకరించిన నీరు, మట్టిని ఉంచిన ప్రదేశాలకు పైకప్పును ఏర్పాటు చేసింది.
 
అంతేకాకుండా అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను కళ్లకు కట్టేలా ఒక భారీ నమూనాను తయారు చేయుంచి, దానిని ప్రజలు స్పష్టంగా చూడగలిగేలా మరొక షెడ్డును నిర్మించింది. క్రమక్రమంగా సందర్శకుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అక్కడ ఒక పోలీస్‌ అవుట్‌ పోస్టును సైతం ఏర్పాటు చేసి, నిరంతరం కొందరు రక్షకభటులు అక్కడ ఉండేలా చూసింది. ఇవన్నీ రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని చూసేందుకు వచ్చేవారి ఆదరణ చూరగొంటు న్నప్పటికీ మరికొన్ని వసతులుసైతం ఇక్కడ ఉంటే ఇంకా బాగుంటుం దన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేయడం పరిపాటైంది.
 
‘అమరావతి యాత్ర’లతో అభివృద్ధిపై దృష్టి..
ఈ నేపథ్యంలో కొన్ని నెలలక్రితం ప్రారంభమై ప్రజాదరణ చూరగొం టున్న ‘పోలవరం యాత్రల’ తరహాలో త్వరలో‘అమరావతి యాత్రల’కు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టనుండడాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని మరింత అభివృద్ధి పరచాలని సీఆర్డీయే నిర్ణ యించింది. విజయవాడలో మొదలై రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను చూపుతూ సాగనున్న ఈ యాత్రలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రదేశానికి ఉన్న విశిష్టత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
 
ప్రస్తుత నమూనా స్థానంలో ఇంకా ఆకర్షణీయం, అత్యాధునికమైన దానిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న దానితో పోల్చితే మరింత ప్రస్ఫుటంగానూ, ఈ మూడేళ్లలో రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు, రహదారులు, ఇత్యాదివన్నీ చూడగానే అర్థమయ్యేలా కొత్త మోడల్‌ రూపుదిద్దుకోనుంది. దీనిని ఏకకాలంలో పలువురు సౌకర్యవంతంగా తిలకించేలా చుట్టూ గ్యాలరీని నిర్మించనున్నారు. ఫ్లోరింగ్‌, లైటింగ్‌ తదితర వసతులను కూడా మెరుగుపరచనున్నారు. ఇదే సమయంలో సందర్శకుల సౌకర్యార్ధం క్యాంటీన్‌, మరుగుదొడ్లను ఏర్పాటు చేయను న్నారు. ఉద్దండరాయుని పాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించేవారికి మధురాను భూతులను కలిగించనున్నారు.
Link to comment
Share on other sites

రాజధానికి 6,000 కోట్ల రుణానికి బ్యాంకులు సిద్ధం
సీఎంకు వివరించిన అధికారులు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు రుణం తీసుకోవాలని భావించగా...రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి వివిధ బ్యాంకులు అంగీకరించాయని సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. మరో రూ.4 వేల కోట్ల రుణాలకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధానిలో నెలకొల్పనున్న ఎన్టీఆర్‌ విగ్రహం నమూనాను అధికారులు సీఎం ఎదుట ప్రదర్శించగా..ఆయన కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. సమావేశంలో మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ఏడీసీ ఎండీ లక్ష్మీపార్థసారథి పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతికి రూ.6వేల కోట్ల రుణాలు
04-10-2018 07:29:35
 
636742349750592785.jpg
  • ఇచ్చేందుకు బ్యాంకులు ఆమోదం
  • మరో రూ.4 వేల కోట్ల సత్వర సమీకరణకూ ప్రయత్నాలు
  • సీఎంకు వివరించిన అధికారులు
 
అమరావతికి నిధులిచ్చేందుకు కేంద్రం చేతులెత్తేసింది. రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించాలన్న ప్రభుత్వ ఆలోచన సత్ఫలితాలనిస్తోంది. రాజధాని నిర్మాణానికి రూ.6,000 కోట్ల మేర రుణాలిచ్చేందుకు పలు జాతీయ బ్యాంకులు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. సచివాలయంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ, ఏపీసీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. బ్యాంకుల నుంచి మొత్తం రూ.10,000 కోట్లను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు కార్యరూపం దాల్చిందని సీఎం ప్రశ్నించినప్పుడు అధికారులు ఈ మేరకు వెల్లడించారు. అయితే మొత్తాన్నీ ఒకేసారి తీసుకుంటే వడ్డీ భారం పెరిగే అవకాశమున్నందున అవసరమున్నప్పుడు అవసరమైనంత తీసుకోదలచినట్లు తెలిపారు.
 
 
అమరావతి: రాజధాని నిర్మాణానికి రూ.6,000 కోట్ల మేర రుణాలిచ్చేందుకు వివిధ జాతీయ బ్యాంకులు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయని అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలిపారు. అమరావతికి అవసరమైన నిధులను మంజూరు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న్పటికీ రాజధాని నిర్మాణం నిరాటంకంగా కొనసాగేందుకు బ్యాంకుల నుంచి రూ.10,000 కోట్లను తీసుకోవాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ఎంతమేర కార్యరూపం దాల్చిందని సీఎం ప్రశ్నించినప్పుడు వారీ విషయాన్ని పేర్కొన్నారు.
 
వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ, ఏపీ సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తాము జరుపుతున్న యత్నాలన్నీ ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయన్న అధికారులు అందులోభాగంగా రూ.6,000కోట్లను అప్పుగా సమకూర్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని చెప్పారు. ఈ రుణాల అందజేతకు ఆయా బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయని, అయితే ఆ మొత్తాలను ఇప్పటికిప్పుడే డ్రాచేస్తే వడ్డీ భారం పెరిగే అవకాశం ఉన్నందున అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అదీ కావాల్సినంత మేరకే ఆ నిధులను తీసుకోదలచినట్లు తెలిపారు. దానికి సమ్మతించిన ముఖ్యమంత్రి మిగిలిన రూ.4,000 కోట్ల రుణాల మంజూరు ప్రక్రియను కూడా ఇదేవిధంగా వడివడిగా సాగించి, బ్యాంకులు వాటిని సైతం ఇచ్చేలా కృషి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
 
ఎన్టీఆర్‌ స్మారక డిజైన్ల పరిశీలన, మార్పుచేర్పులకు సూచనలు..
కాగా.. రాజధానిలోని నీరుకొండ వద్ద ఉన్న కొండపై ఎన్టీఆర్‌ స్మారకార్ధం భారీఎత్తున ఏర్పాటు చేయదలచిన మెమోరియల్‌ డిజైన్లను ముఖ్యమంత్రి ఈ భేటీలో మరొకసారి పరిశీలించారు. కొన్ని నెలల క్రితమే జెనెసిస్‌ అనే సంస్థ ఈ స్మారక స్థలి కోసం 4 ఆకృతులను సిద్ధంచేయగా చంద్రబాబు చూశారు. స్వాతిముత్యం, స్వాతిముత్యం (పెర్ల్‌), పరిక్రమ, కమలం అనే పేర్లతో రూపొందించిన ఆ డిజైన్లలో ఆప్పట్లో ఆయన కొన్ని మార్పుచేర్పులు సూచించగా, జెనెసిస్‌ చేసి బుధవారం నాటి సమావేశంలో ప్రదర్శించింది. వీటిల్లోనూ ఇంకొన్ని మార్పుచేర్పులను సూచించిన చంద్రబాబు ఆ మేరకు సవరించిన డిజైన్లను వచ్చే వారం జరిగే సీఆర్డీయే సమీక్షా సమావేశంలో చూపించాలని ఆదేశించినట్లు భోగట్టా. సమావేశంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి ప్రభృతులు పాల్గొన్నారు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...