Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
Guest Urban Legend

nenu ninna  ne chusa naku ardham kala brother kochem clear ga cheppandi bro.

check lo 2500 ani vundhi cbn 1981 antunnadu migilanavi nokkesaru ani photos create chesi spread chesaru

matter enti antey adhi 3 states ki kalipi 2500 manaki 1981 something in it

Link to comment
Share on other sites

పోలవరం మీద ఏడుపు ఆపండి మేధావులు...

polavaram-27122016-3.jpg

పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎట్టకేలకు 1981.54 కోట్లు సాధించింది ఆంధ్రప్రదేశ్. మొదటి విడతగా నాబార్డు రుణం విడుదల చేసింది. విభజన చట్టంలోని అంశం సాధించటానికి కూడా చాలా సమయం పట్టింది. 1981.54 కోట్లు చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇదే ఉత్సాహంతో, ఈ నెల 30 నుంచి పోలవరం కాంక్రీట్ పనులకు సిద్ధం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం కల సాకారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రజలు అందరూ అనుకుంటున్న వేళ, కొంత మంది అపర మేధావులు, కోడిగుడ్డు మీద ఈకలు పీకటానికి రెడీ అయ్యారు... ఎందుకంటే, ఈ అపర మేధావులకి రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆక్రోశం... ముఖ్యమంత్రి పడుతున్న కష్టానికి రిజల్ట్ వస్తుంది అనే బాధ...

ముఖ్యమంత్రి ఫోటో చెక్ మీద 2480.91 కోట్లు ఉంది, ముఖ్యమంత్రి 1981.54 కోట్లు అని చెప్తున్నారు, మిగతావాటిని నోక్కేసారు అనే విష ప్రచారం మొదలుపెట్టారు... కనీసం ఇంగితం కూడా లేకుండా, ప్రకటన ఏంటో చూడకుండా, విషం చిమ్మటమే, ఈ అపర మేధావుల పని.

నిన్న కేంద్రం చేసిన ప్రకటన చలా స్పష్టంగా ఉంది.... అధికారిక ప్రెస్ రిలీజ్ కూడా ఇదే చెప్పింది... కాని, వీరికి కావాల్సింది, రాష్ట్రం మీద విషం చిమ్మటం, రాష్ట్రానికి జీవనాడి అయిన, పోలవరం ప్రాజెక్ట్ మీద, వీళ్ళ పిచ్చి రాతలతో విషం చిమ్మటం...

అసలు విషయం ఇది, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు, మహరాష్ట్ర, గుజరాత్‌లకు నాబార్డు రుణాలు అందజేసింది. ప్రధాన మంత్రి కృషి సింఛాయి యోజనలో భాగమైన దీర్ఘకాలిక నీటిపారుదల నిధి (ఎల్‌టీఐఎఫ్‌)కి కేంద్రం రూ.1981.54 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి, రూ.463 కోట్లు గుజరాత్‌కు, రూ.830 కోట్లు మహారాష్ట్రలోని నీటిపారుదల ప్రాజెక్టులకు మొత్తం రూ.3274.54 కోట్లు కేటాయించింది. ఇందుకుగాను రూ. 2480.91 కోట్ల చెక్కును ఇచ్చారు. ఈ 2480.91 కోట్ల చెక్ లో, మన పోలవరం వాటా రూ.1981.54 కోట్లు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ చెక్కును ఉమాభారతి, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నాబార్డు ఛైర్మన్‌ హర్షకుమార్‌ భన్వాలాలు సంయుక్తంగా అందజేశారు.

ఇదే మాట, కేంద్ర మంత్రి వెంకయ్య కూడా చెప్పారు..

polavaram-27122016-1.jpg

Link to comment
Share on other sites

నీళ్లిచ్చి తీరతా! 
28-12-2016 02:55:47
636184905478470529.jpg
  • పోలవరం.. పూర్వజన్మ సుకృతం
  • 2018కల్లా తొలి దశ కింద నీళ్లు
  • ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం
  • ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘట్టం
  • 30 నుంచి కాంక్రీట్‌ పనులకు శ్రీకారం
  • 7న డయాఫ్రం వాల్‌ నిర్మాణం ప్రారంభం
  • 17 నుంచి స్పిల్‌వే గేట్ల పనులు మొదలు
  • ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి
  • ప్రజలంతా ప్రాజెక్టును సందర్శించాలి: సీఎం
తిరుపతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘ప్రతి మనిషికీ ఒక లక్ష్యం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నా లక్ష్యం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం లభించడం నా పూర్వజన్మ సుకృతం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను 
కొట్టిపారేశారు. పోలవరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం నిర్మాణాన్ని ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టంగా సీఎం అభివర్ణించారు. ‘పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడి. దీనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడం నా ధ్యేయం’ అని ఉద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడో స్వాతంత్య్రం రాకముందు 1941లో బీజం పడిందని, రామపాద ప్రాజెక్టుగా నామకరణం కూడా చేశారని సీఎం తెలిపారు. మాజీ సీఎం అంజయ్య హయాంలో పునాది రాయి వేశారని, ఆ తర్వాత ప్రాజెక్టును గాలికి వదిలేశారన్నారు. ‘ఇప్పుడు పోలవరం నిర్మాణానికి నాబార్డు కింద రుణం మంజూరు చేశారు. సోమవారం తొలివిడతగా రూ.1981 కోట్లు ఇచ్చారు. ఈ రుణంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. దానిని కేంద్రమే చెల్లిస్తుంది’ అని సీఎం వివరించారు. ‘పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల జీవనాడి. దేశంలోని అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. కృష్ణా, గోదావరి డెల్టాల స్థిరీకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖకు 24 టీఎంసీల నీళ్లు ఇవ్వొచ్చు. దీంతో 29 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. ఒడిసా, చత్తీ్‌సగఢ్‌కు లిఫ్ట్‌ పద్ధతిలో నీరు ఇవ్వవచ్చు’ అని సీఎం తెలిపారు. .
 
రెండేళ్లలో తొలి దశ పూర్తి 
పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2018కి పూర్తి చేసి గ్రావెటి ద్వారా పంట పొలాలకు నీరందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ‘ప్రాజెక్టు సామర్థ్యం 50 లక్షల క్యూసెక్కులు. డిశ్ఛార్జి 48 లక్షల క్యూసెక్కులు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 1056 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ చేయాలి. ఇప్పటికి 512 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయ్యింది. మిగిలిన 544 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తవుతోంది. దీని కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన భారీ యంత్రాలను వినియోగిస్తున్నాం. బైరాగ్‌ డర్బైన మిషనతో ఒకేసారి 240 టన్నుల మట్టిని తీయవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా మిషన్లు పనిచేస్తున్నాయి. 1120 లక్షల మీటర్ల కాంక్రీట్‌ వేయాల్సి ఉంది. ఇప్పటికి 30 లక్షల మీటర్ల కాంక్రీట్‌ వేయడం పూర్తయింది. 16మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో 48 గేట్లు అమర్చుతున్నాం. ప్రపంచంలోనే ఇంత పెద్ద గేట్లు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టుకూ లేవు. ఈ ప్రాజెక్టు సురక్షితంగా ఉండాలంటే లోపల పునాది చాలా పటిష్ఠంగా ఉండాలి. దీనినే డయాఫ్రం వాల్‌ అంటారు. దీన్ని 40 నుంచి 100 మీటర్ల లోతున నిర్మిస్తారు. మొదట ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వేసి ఆ తర్వాత మామూలు కాంక్రీట్‌ వేస్తారు. ఈ పనులన్నీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలకు అప్పగించాం. జర్మనీకి చెందిన బావర్‌, ఎల్‌అండ్‌టి, త్రివేణి తదితర సంస్థలకు పనులు అప్పగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం’ అని సీఎం వివరించారు. పోలవరం నిర్మాణంలో భాగంగా డిసెంబరు 30న కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. జనవరి 7 నుంచి డయాఫ్రం వాల్‌ నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. జనవరి 17న స్పిల్‌వే గేట్ల ఏర్పాటు పనులు మొదలవుతాయన్నారు. ‘2010-11 అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు. ఇప్పటికి రూ.8,683 కోట్లు ఖర్చు చేశాం. కేంద్ర ప్రభుత్వం రూ.3,134 కోట్లు ఇవ్వాలి. ఇప్పటికి రూ.930 కోట్లు ఇచ్చింది. సోమవారం రూ.1981.54 కోట్లు ఇచ్చింది. ఇంకా రూ.1007 కోట్లు ఇవ్వాల్సి ఉంది’ అని సీఎం చెప్పారు. కాగా, పోలవరం ప్రాజెక్టును రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చూసి తీరాలని సీఎం చంద్రబాబు అన్నారు. మాటలతో చెబితే పోలవరం తీరు అర్ధం కాదని చెప్పారు. 

హోదాపై నోరు పారేసుకొంటే ఏమయ్యేది? 
‘ప్రత్యేక హోదా విషయంలో కొంతమంది నన్ను తప్పుబట్టారు. అందరిలా నేను ఆ రోజు నోరు పారేసుకొని ఉంటే ఈ రోజు ఏమయ్యేది. ఇంత భారీ ప్రాజెక్టుకు నిధులొచ్చేవా?’ అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో తాను ఎప్పుడూ ముందుంటానని, అందుకే హోదా విషయంలో తొందరపడలేదన్నారు. ‘నాకు అభివృద్ధి ముఖ్యం. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. నా కాలంలో ప్రాజెక్టు పూర్తయ్యిందనే మంచి పేరు వస్తుంది. ఆ చిన్న స్వార్థం తప్ప మరేం లేదు’ అని వివరించారు.

మరో ముందడుగు!
 
636185715651909798.jpg
  • పోలవరం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులకు రేపే శ్రీకారం
  • 2018కి స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం
  • స్పిల్‌వేతో నీటి విడుదలకు మార్గం సుగమం
  • 1128 మీటర్ల పొడవునా నిర్మాణం
  • 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగం
  • కాంక్రీట్‌ పనుల్లో 22 వేల టన్నుల ఐరన్‌
  • 48 గేట్లకు మరో 35 వేల టన్నుల ఇనుము
ఏలూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక దశకు శ్రీకారం జరగనుంది. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్‌ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీటిని.. లక్షలాది మందికి తాగునీటిని అందించే బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. 2018కి తొలి దశను పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా అన్ని అవరోధాలను అధిగమించి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులను ప్రారంభిస్తున్నారు.
 
1128 మీటర్ల పొడవైన స్పిల్‌వే
ఏ సాగునీటి ప్రాజెక్టులోనైనా స్పిల్‌వే కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 50 లక్షల క్యూసెక్కుల డిశ్ఛార్జి సామర్థ్యమున్న పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులో స్పిల్‌వే మరింత ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని నిర్దేశించడంలోను.. కాల్వలకు నీరు పారించడంలోను స్పిల్‌వేదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రాధాన్యమున్న స్పిల్‌వేను అత్యంత పటిష్ఠంగా నిర్మించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. స్పిల్‌వే నిర్మాణంలో.. 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించనున్నారు. దీనికిగాను 55 వేల క్యూబిక్‌ మీటర్ల సిమెంటు, 16 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, ఎనిమిది లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఉపయోగిస్తారు. ప్రధాన ప్రాజెక్టు పరిధిలో 1128.4 మీటర్ల పొడవున స్పిల్‌వేను నిర్మిస్తారు. దీనికి సంబంధించిన కాంక్రీట్‌ పనులను 30న(శుక్రవారం) సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. రాజధాని అమరావతి తరహాలోనే గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం కాంక్రీట్‌ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్పిల్‌వే నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అనుమతులను కేంద్ర జల వనరుల శాఖ ఇప్పటికే మంజూరు చేసింది.
 
32 మీటర్ల వెడల్పుతో స్పిల్‌వే పునాది
స్పిల్‌వే నిర్మాణంలో తొలి 10 మీటర్లలో స్టెయిర్‌ కేస్ (మెట్లు), లిఫ్టును ఏర్పాటు చేస్తారు. 10 మీటర్ల వద్ద నుంచి చివరి వరకు 32 మీటర్ల వెడల్పుతో స్పిల్‌వే పునాదిని నిర్మించనున్నారు. దీన్ని 53 బ్లాక్‌లుగా విభజించి పనులు చేస్తారు. స్పిల్‌వేకు 16 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో 48 గేట్లు అమర్చుతున్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద గేట్లు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టుకూ లేవు. ఈ గేట్ల ద్వారానే 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు పూర్తయిన తర్వాత అత్యంత పటిష్ఠంగా గేట్ల నిర్మాణం చేపడుతారు. ఒక్కో గేటుకు 450 టన్నుల ఐరన్‌ వాడనున్నారు. మొత్తం 48 గేట్లకు 22 వేల టన్నుల ఐరన్‌ వాడుతారు. ఇది కాకుండా కాంక్రీట్‌లో మరో 35 వేల టన్నుల ఐరన్‌ను వినియోగిస్తారు. స్పిల్‌వే నిర్మాణానికి అవసరమైన సిమెంటును ముందస్తుగా అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే పలు సిమెంటు కంపెనీలతో ప్రభుత్వం చర్చించింది. కాంక్రీట్‌ పనులకు అవసరమయ్యే ఐరన్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి తెప్పిస్తున్నారు. కాంక్రీట్‌ పనులు పూర్తి నాణ్యతతో జరిగేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అరడజను మందికిపైగా నిపుణులైన ఇంజనీర్లను ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొత్తం ప్రాజెక్టులో గరిష్ఠ నీటి నిల్వ సామర్ధ్యం 194.4 టీఎంసీలుగా ఉంటుంది. పూర్తిస్థాయి జలాశయ నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 150 అడుగులుగా ఉంటుంది. మినిమం డ్రా డౌన్‌ లెవల్‌ 135 అడుగులుగా నిర్దశించారు. 2018కి స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేసి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Link to comment
Share on other sites

can some one post today's article on ploavaram from eenadu west godavari district editon...good one..and it gives a clear picture what actrually government is trying to do and its trying to achieve the goals by dividing into chunks..

is this ?

లక్ష్యసాధనకో స్ఫూర్తి 

పోలరవం ఈనాడు, ఏలూరు 

weg-top2a.jpg

పోలవరం ప్రాజెక్టు పనిలో స్పిల్‌వే, ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్‌ డ్యాం, విద్యుత్తు ఉపకేంద్రం... ఈ మూడు కీలకమైన నిర్మాణాలు. వీటిలో తొలిదశలో స్పిల్‌వే, ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్‌ డ్యాంల నిర్మాణం వేగంగా జరగాలి. క్షేత్రస్థాయిలో 2014కు ముందు పనులు, ఆ తరువాత పనుల్లో స్పష్టత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతోనే తొలి నుంచీ ముందుకు వెళ్లింది.

కుడి కాలువ పూర్తి... పట్టిసీమ ద్వారా నీరు 

వాస్తవానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాకు నీటి మళ్లింపు వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. సుమారు 174 కిలోమీటర్ల మేర కుడికాలువ నిర్మాణం జరగడం దాదాపు అసాధ్యమనే భావన అందరిలో నెలకొంది. అధిక శాతం భూమి కోర్టు వివాదాల్లో నలుగుతుండటమే దీనికి ప్రధాన కారణం. దీనిని ముఖ్యమంత్రి పట్టిసీమ అనే ఆయుధంతో సరిచేసుకుంటూ వెళ్లారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా కృష్ణానదికి నీటిని అనుసంధానం చేయాలనేది భావన. నీరు అనుసంధానం కావాలంటే కుడికాలువ తవ్వాలి. తవ్వాలంటే రైతులను కోర్టు వ్యాజ్యాల నుంచి తప్పించాలి. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు శక్తియుక్తులను ప్రదర్శించి రైతులను ఒప్పించి భూసేకరణ పూర్తి చేశారు. దీంతో ఆగమేఘాల మీద పనులు సాగాయి. కాలువ మార్గంలో మూడు ప్రాంతాల్లో ప్రధానమైన అక్విడెక్టులను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం 80 టీఎంసీల నీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అగ్రభాగం పూర్తి చేశారు. నిర్మాణ లోపాలను కూడా సరిదిద్దుకోవడానికి ఈ ఎత్తిపోతల కారణమైంది.

ఎడమ కాలువ పనులకు పురుషోత్తపట్నం 

ఎడమ కాలువను 150 కిలోమీటర్లు మేర తవ్వాలి. దీనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి పురోషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల నిర్మాణం జరుపుతున్నారు. ఇక్కడ రైతుల కోర్టు వ్యాజ్యాల కంటే రోడ్డుమార్గాల్లో అనుసంధాన వంతెనల నిర్మాణం ప్రధాన అవరోధం. వీటిని కూడా పరిష్కరించి పనులు పూర్తి చేసే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇలా కుడి ఎడమ కాలువలను 2018 నాటికి నీరు పారే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేస్తున్నారు.

ప్రాజెక్టు పనుల్లోనూ అదే ఒరవడి 

పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో వారి యంత్రసామగ్రి ఇతరాలను పరిశీలించినప్పుడు వీరికి ఇతర సంస్థల సేవలు తోడైతేనే పనులు సాగడానికి అవకాశం ఉంటుందని గ్రహించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అంతర్జాతీయ స్థాయిలో ఏయే పనులు ఎవరెవరు చేయగలరని అధ్యయనం చేయించారు. దీనిలో భాగంగానే త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ కంపెనీకి పనులు కట్టబెట్టారు. రాయి, మట్టి తవ్వకం పనుల్లో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ పనులు దక్కించుకోవడంతోపాటు అదే ఒరవడిలో రాయి తవ్వకం పనులు చేసింది. స్పిల్‌వే నిర్మాణంలో అతిపెద్ద కొండను నిర్మాణ పనులకు అనుకూలంగా ధ్వంసం చేసి తీర్చిదిద్దారు. గతంలో వారానికి 10 వేల క్యూబిక్‌మీటర్లు తవ్వడమే గొప్పయితే... ఇప్పుడు వారానికి 2.50 లక్షల క్యూబిక్‌మీటర్లుకు వెళ్లింది. స్పిల్‌వే 1.62 కోట్ల క్యూబిక్‌మీటర్లు తవ్వకం చేపట్టాల్సి ఉంటే ప్రస్తుతం మొత్తం 10 లక్షల లోపు పనిమాత్రమే చేపట్టాల్సి ఉంది. రాయి నాణ్యతను పరిశీలించి శంకుస్థాపన స్థాయికి కేవలం సంవత్సర కాలంలో తీసుకురాగలిగారు. దీనికోసం అత్యంత భారీ యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనులు ప్రారంభించి నిరంతరం జరుపుకోవడానికి ఏ విధమైన ఆటంకాలు లేవు. స్పిల్‌వే కాంక్రీటు పనులు సెప్టెంబరు 2017 నాటికి పూర్తిచేయాలనేది లక్ష్యంకాగా ఇది పూర్తికావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండోది ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్‌ డ్యాం పనులను ఎల్‌అండ్‌టీ, బావర్‌ నిర్మిస్తున్నాయి. వీరు ఈ పనుల్లో అగ్రగాములుగా ఉన్నారు కాబట్టి అవి అనుకున్నట్లు 2017 జూన్‌ నాటికి ఒకభాగం పూర్తిచేయాలనేది లక్ష్యంకాగా దీనిని పూర్తిచేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిల్‌వే గేట్లను కూడా ఇక్కడే తయారు చేయనున్నారు. దీనికి విశాఖ ఉక్కును వాడనుండగా దీనికోసం ఒప్పందం దిశగా కదులుతున్నారు. ఇక ప్రధానమైన ఇసుక, కంకరలను స్వయంగా ఇక్కడే సమకూర్చుకుంటారు. సిమెంటు కూడా మార్కెట్‌ ధర కంటే తక్కువకే ఇవ్వడానికి ఒప్పందం కుదర్చుకున్నారు. కీలకమైన విద్యుత్తు కేంద్రాన్ని జెన్‌కో నిర్మించనుంది. ఇలా అన్ని పనులను విడదీసి చేపట్టడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కాంక్రీటు పనులను కేంద్రమంత్రులు ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్నారు. ప్రస్తుతం రూ. 1981 కోట్లు నిధులు సమకూరిన దృష్ట్యా తర్వాత దశల్లో రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి కేంద్ర మంత్రుల సహకారం తప్పనిసరి. దీంతో వారూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి తాము అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి రేపు జరగబోయే కార్యక్రమం ఒక ముందడుగు కానుంది.

ప్రత్యేక కథనాలు

ఓ చరిత్ర.. ఒక అధ్యాయం 

పాలుపంచుకుందాం రండి! 

పోలవరం, న్యూస్‌టుడే 

weg-sty4a.jpg

ఒక చరిత్ర.. ఓ అధ్యాయం.నవ్యాంధ్ర జీవనాడి పోలవరం కీలక ఘట్టానికి పునాది పడబోతుంది.ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 1.49గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులను ప్రారంభిస్తున్నారు. అనంతరం 50 వేల మందితో బహిరంగ సభ నిర్వహించడానికి స్పిల్‌వేను ఆనుకుని ఉన్న 78 ఎకరాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ప్రతి జిల్లా నుంచి 100 బస్సులకు తక్కువ కాకుండా ప్రజలను పోలవరం తీసుకురానున్నారు.

ముహూర్తం 1.49 గంటలు 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం హిల్‌వ్యూ కొండపై హెలీకాఫ్టర్‌లో దిగుతారు. అక్కడ నుంచి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగంలో పాల్గొంటారు. దానికి సమీపంలోనే ఉన్న పైలాన్‌ ఆవిష్కరిస్తారు. తిరిగి బయల్దేరి మార్గం మధ్యలో ఉన్న కాంక్రీట్‌ తయారు చేసే బ్లాచింగ్‌ ప్లాంట్‌కు పూజలు చేస్తారు. ఆతర్వాత నేరుగా స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకుని పూజ కార్యక్రమాలు చేసి సరిగ్గా 1.49 గంటలకు కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం ముగించుకుని నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు.

3 వేల మంది పోలీసులు 

కాంక్రీట్‌ పనులు, ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లను ఇద్దరు ఎస్పీలు, ఏడుగురు అదనపు ఎస్పీల పర్యవేక్షణలో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పోలవరం డీఎస్పీ ఏటీవీరవికుమార్‌ తెలిపారు. వీరు కాక ప్రత్యేక పోలీసులతో పాటు బాంబు, డాగ్‌స్క్వాడ్‌లు, గ్రేహౌండ్స్‌ పార్టీలు పనిచేస్తాయి.

50 వేల మందికి భోజనాలు 

13 జిల్లాల నుంచి వచ్చే 50 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్‌.లవన్న చెప్పారు. బహిరంగ వేదిక సభ ప్రాంగణం బయట బస్సుల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. బస్సులు దిగిన వెంటనే ప్రజలకు భోజనాలు పెడతారు. ఇందుకు 70 కౌంటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మెనూ శాకాహార పలావు, పెరుగన్నం, బంగాళదుంప కుర్మా. మంచినీటి పాకెట్లు ఇస్తారు. 2 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 20 వేల తాగునీటి సీసాలు సిద్ధం చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలు 

ఉదయం 11 గంటల నుంచి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 5 వేల మంది సిబ్బందికి, 300 వాహనాలకు పాస్‌లు అందజేస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి వాహనాలను ఉంచేందుకు పార్కింగ్‌ సిద్ధం చేశారు. అమరావతి నుంచి మంత్రులు ప్రత్యేక ఏసీ బస్సుల్లో వస్తున్నట్లు ఇప్పటికే ఆ జిల్లా ఆధికారులు తెలిపారు.

ఇక్కడ కాస్త జాగ్రత్త 

కొవ్వూరు నుంచి పోలవరం వచ్చే మార్గంలో కొన్నిచోట్ల రెండు బస్సులు ఎదురెదురుగా వస్తే తప్పుకోలేని పరిస్థితి. ముఖ్యంగా గూటాల వడ్డిగూడెం వద్ద నుంచి కొత్తపట్టిసీమ వరకు, పట్టిసీమ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద రోడ్డు బాగా కోతకు గురైంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చే వీఐపీలకు ప్రధాన మార్గం ఇదే. రద్దీ పెరిగితే ఈ మార్గం ఎంత వరకు ప్రయాణానికి శ్రేయస్కరం అనే విషయాన్ని అధికారులు గుర్తించాలి. తక్షణం కోతకు గురైన చోట వెంటనే మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

ప్రత్యేక కథనాలు

పోలవరం.. ఇక మరపురాని ఘట్టం 

మంత్రి దేవినేని 

weg-sty3a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచిపోతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కాంక్రీట్‌ పనుల కోసం చేపట్టిన ఏర్పాట్లను బుధవారం ఆయన జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్‌, ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డు నుంచి రూ.1981 కోట్లు విడుదల చేసిన ప్రధానిమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 30న స్పిల్‌వే కాంక్రీట్‌ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని కోరారు. కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తరలివస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంక్రాంతికి డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ట్రాన్స్‌స్ట్రాయ్‌ ఉపాధ్యక్షుడు కె.తిరుమలేశ్వరావు, ఈఈ కుమార్‌, ఆర్డీవో ఎస్‌.లవన్న, పోలవరం డీఎస్పీ ఏటీవీ.రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

అందరూ రావాలి 

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అధికారంలోకి రాగానే కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, ఖమ్మం జిల్లాలోని ఏడు గ్రామాలను విలీనం చేయడం శుభపరిణామం. తాజాగా నాబార్డు నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం అధికారులను సమన్వయం చేస్తూ కష్టపడి పని చేస్తున్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలన్నదే లక్ష్యంగా ఆయన కృషి చేస్తున్నారు. దీనికి అందరం ఆయనకు సహకరించాలి. పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల కార్యక్రమానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు దీనికి హాజరవుతారు. - తోట సీతారామలక్ష్మి, జిల్లా తెదేపా అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ

1160 బస్సులు 

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పోలవరం స్పిల్‌వే పనుల శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాలోని ఒక్కో మండలం నుంచి రెండు వేల మందిని తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రైవేట్‌విద్యాసంస్థలకు చెందిన 930 బస్సులు, ఆర్టీసీ 230 బస్సులను కేటాయించినట్లు జిల్లా రవాణాధికారి ఎస్‌ఎస్‌ మూర్తి తెలిపారు. ఇవి కాకుండా జిల్లా నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గాల వారీగా సుమారు 2 వేలకు పైగా వాహనాలు అదనంగా ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు స్థానిక నాయకత్వానికే బాధ్యతలు అప్పగించారు.

ఉచిత భోజన, రవాణా సౌకర్యాలు 

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేయనుండటంతో వారి కోసం ఉచిత భోజన, రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కాంక్రీటు పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు విచ్చేస్తున్నట్లు చెప్పారు.

30న ప్రైవేటు పాఠశాలలకు సెలవు 

జిల్లాలో అన్ని ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 30న సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 30న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును విద్యార్థులు సందర్శించేందుకు ప్రైవేటు పాఠశాలలకు ఆరోజుసెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో చెప్పారు. ఈ సెలవునకు బదులుగా జనవరి నెల రెండో శనివారం రోజున ప్రైవేటు పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

post-47683-0-80917500-1482994669_thumb.jpeg

post-47683-0-45755300-1482994773_thumb.jpeg

yes...Very good analysis..

Link to comment
Share on other sites

Polavaram Festival Tomorrow! 

1 lakh farmers from across the State will celebrate the beginning of Spillway Concrete Works

The long cherished dream of millions of farmers will begin taking concrete shape from tomorrow. Polavaram project will shape the future of Andhra Pradesh into a bright one. Concrete work on Spillway will begin tomorrow in the presence of 1 lakh farmers who will reach the dam site and witness history being made. CBN will lay the first concrete and launch the works. New Year, New Beginnings indeed! 

పోలవరం...ఆంధ్రుల దశాబ్దాల కల. రైతుల చిరకాల వాంఛ. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చి వేసే ప్రాజెక్టు ఇది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఈ ప్రాజెక్టు ప్రభావం ఏదో రూపంలో ఉంటుంది. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టులో కీలకమైన కాంక్రీటు పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.59 నిముషాలకు ముహూర్తం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్పిల్ వే కాంక్రీటు పనులు ప్రారంభిస్తారు. కాంక్రీటు చేపట్టేందుకు అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. అన్ని విభాగాలకు చెందిన 2500 మంది ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. 

సభ కోసం స్పిల్వే నిర్మాణ ప్రాంతం పక్కనే సుమారు 72 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 50 నుంచి 60 మంది ఐఏఎస్ అధికారులకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా బస్సును వేశారు. తూర్పు, పశ్చిమగోదావరి ఎస్పీలతోపాటు ఏడుగురు ఏఎస్పీలు, 24 మంది డీఎస్పీలు, వంద మంది సీఐలు, 160 మంది ఎస్సైలు, 220 మంది ఏఎస్సైలు, 540 మంది పోలీస్కానిస్టేబుళ్లు, 65 మంది మహిళా కానిస్టేబుళ్లు, 491 మంది హోంగార్డులు, 65 మంది మహిళా హోంగార్డులు భద్రతా నిర్వహణ కార్యక్రమాల్లో ఉన్నారు. సుమారు వెయ్యి బస్సుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రానున్నారు. 

రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రైతులను, పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వస్తున్నారు. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించబడుతుంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కేంద్రమంత్రులు సైతం పాల్గొంటున్నారు.

Link to comment
Share on other sites

Many people including our friends in DB were scolding Sujana. But, when u read Uma Bharathi's words 2 days back ...then u will understand the kind of important role he is playing in Delhi for AP. Appreciate his contributions.

kontha mandi ki adi cempa chellu manipinchi untadi...anduke okkalu kooda kanipeeyadam ledu

Link to comment
Share on other sites

Source: AndhraJyothy:
please read the last two paragraphs.  
CBN  :adore:
 
నవ శకం! 
31-12-2016 01:42:19
636187453395725482.jpg
  • పోలవరం కాంక్రీట్‌ పనులకు శ్రీకారం
  • ఇదే నవ్యాంధ్రకు నిజమైన పండుగ: చంద్రబాబు
  • చరిత్ర తిరగరాస్తున్నాం.. ప్రాజెక్టు పూర్తికి సర్వమత ప్రార్థనలు చేయాలి
  • ఇది నా ఒక్కడి వల్లే రాలేదు.. ప్రధాని మోదీ అన్ని విధాలా సహకరించారు
  • కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య, ఉమాభారతి, అశోక్‌, సుజనా కృషి భేష్‌
  • గోదావరి రైతులకూ పాదాభివందనం.. 7 నుంచి డయాఫ్రమ్‌వాల్‌
  • 5న పురుషోత్తపట్నంకు శ్రీకారం.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా
  • అమరావతికి వచ్చాక దశ మారింది.. అన్ని పనులూ సునాయాసం: సీఎం
  • బహిరంగ సభలో మంత్రులు, ఇంజనీర్లు, అధికారులకు ప్రశంసలు
  • పోలవరం చూడకుండానే పోతాననుకున్నా.. అశోక్‌ గజపతి ఉద్వేగం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ‘బలమైన’ అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ దృఢమైన సంకల్పాన్ని చిహ్నంగా ‘కాంక్రీట్‌’ శకం మొదలైంది. 70ఏళ్ల కిందటి ప్రతిపాదనకు ఇప్పుడు నిర్దిష్టమైన రూపం వస్తోంది. నవ్యాంధ్రకు జల-జీవ నాడి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్‌వే కాంక్రీట్‌ పని సంప్రదాయబద్ధంగా మొదలైంది. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, రైతులు, ప్రజల సాక్షిగా సీఎం చంద్రబాబు ఈ పనులు ప్రారంభించారు.
 
‘చాలా పండుగలను చూశాం. కానీ నిజమైన పండుగ అంటే ఇదే. స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల ప్రారంభం పండుగలా జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రను తిరగరాస్తాం’ -ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏలూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులను శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టగా తదుపరి గంటలోనే కాంక్రీట్‌ స్పిల్‌వేలోకి చేరింది. దీంతో చంద్రబాబు, కేంద్ర రాష్ట్రమంత్రులు, అధికారులు, ఇంజనీర్లు అందరూ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘అమరావతికి వచ్చాం.. దశ మారింది. ఏ పని ప్రారంభించినా సునాయాసంగా పూర్తవుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు రాష్ట్రంలోని ఐదు కోట్ల మందీ సర్వమత ప్రార్థనలు నిర్వహించాలి’ అని పిలుపిచ్చారు. జీవితంలో అందరూ ఆనందంగా ఉండేలా ఈ పనులు పూర్తి కావాలన్నారు. ప్రధాని మోదీపై పలు సార్లు ప్రశంసలు కురిపించారు. ‘ప్రాజెక్టు నా ఒక్కడి వల్ల వచ్చింది కాదు. ప్రధాని అన్నివిధాలా సహకరించారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి, అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి వంటి వారంతా నిరంతరం పనిచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాస్త గట్టిగానే కష్టపడ్డారు. తెలుగువారి కల ఫలించేలా చేశారు’ అని ఆయన వ్యాఖ్యానించినప్పుడు సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ప్రాజెక్టు పూర్తికావడానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు, అనేకమంది ఐఏఎ్‌సలతో పాటు కాంట్రాక్టు సంస్థలూ నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉభయగోదావరి జిల్లాల రైతులు ఎంతో సహకరిస్తున్నారని, వీరందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని ప్రకటించారు. పోలవరం ఒక వరమన్నారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన మిగతా వారందరికీ పాదాభివందనాలని తెలిపారు. ‘కాటన్‌ దొర ఎక్కడో పుట్టారు. ఇక్కడి ప్రజల బాధచూసి ఆ రోజే పోలవరం కట్టాలనుకున్నారు. కానీ డబ్బులు లేకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ కట్టారు. ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారు. కాటన్‌ మానవ రూపంలో వచ్చిన దేవుడు’ అని శ్లాఘించారు.
 
అప్పుడు ఢిల్లీ వెళ్లా.. 
కాంగ్రెస్‌ రూపొందించిన విభజన చట్టంలో పోలవరం పూర్తి చేయాలని పేర్కొంది గానీ.. అమలు దిశగా చిత్తశుద్ధి కనబరచలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏపీలో ప్రాజెక్టు కడుతుంటే మునిగిపోయే ఏడు మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ‘నేను 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే ఢిల్లీ వెళ్లాను. పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలంటే తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో విలీనం చేయాల్సిందేనని పట్టుపట్టాను. ఈ విషయాన్ని వెంకయ్యనాయుడికీ చెప్పాను. దీంతో ప్రధాని మోదీ నాయకత్వాన జరిగిన తొలి కేబినెట్‌ భేటీలోనే ఏడు మండలాల విలీనాన్ని ఆమోదించారు. ఆ తరువాత ఆర్డినెన్స్‌ జారీచేశారు.. వెనువెంటనే పార్లమెంటుకు తెచ్చారు’ అని తెలియజేశారు. ఆ మండలాలు విలీనం కాకపోతే ప్రాజెక్టు నిర్మాణానికి అనేక సమస్యలు వచ్చి ఉండేవని చెప్పారు. ‘నాది ఒక సంకల్పం. నా కోసమో, నా కుటుంబం కోసమో, నా ఆరోగ్యం కోసమో ఇది చేయలేదు. ప్రజల కోసమే చేశాను. గోదావరి తల్లి కనికరించింది. ఆ తల్లికి నిలువెత్తు పాదాభివందనం..’ అని సీఎం అన్నప్పుడు సభికులంతా లేచి హర్షధ్వానాలు చేశారు. ‘పైసా తీసుకోకుండా రాజధాని అమరావతికి 30 వేల ఎకరాలిచ్చిన రైతులకు అభినందనలు. ఇప్పుడు పోలవరం వంతు వచ్చింది. లక్షా 80 వేల మంది నిర్వాసితులు ఉన్నారు. 202 గ్రాములు ముంపుకు గురవుతున్నాయి. వీరెవరికీ అన్యాయం జరగదు. మనిషి రూపంలో వచ్చిన దేవుళ్లు గిరిజనులు’ అని వ్యాఖ్యానించారు.
 
పట్టిసీమతో కృష్ణా డెల్టాలో సిరులు 
‘కృష్ణా డెల్టాలో గత ఏడాది కొద్దిగానే పంట వచ్చింది. ఈసారి 55 టీఎంసీల నీరు ఇచ్చాం. బ్రహ్మాండమైన పంట పండింది. గోదావరి తల్లి ప్రభావం ఇది. అందరూ కలిసి సృష్టించిన అద్భుతం ఇది.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాకు కూడా నీళ్ళు అందుతాయి. అక్కడివాళ్ళు దీనిని గ్రహించాలి’ అని చంద్రబాబు అన్నారు. పోలవరం స్పిల్‌వేకు కాంక్రీట్‌ పనుల ప్రారంభం విజయమని, పోలవరం ఎడమ కాలువపై పురుషోత్తపట్నం వద్ద వచ్చేనెల 5న లిఫ్ట్‌ పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. రెండు రోజుల వ్యవధిలోనే 7వ తేదీన ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. అలాగే రేడియల్‌ గేట్ల తయారీని వీలైతే సంక్రాంతి పండుగ రోజు ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. ‘రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం ఇది మా సంకల్పం’ అని స్పష్టం చేశారు. గాలేరు-నగరి ద్వారా చిత్తూరు వరకు, వెలిగోడు పూర్తి చేయడం ద్వారా ప్రకాశం జిల్లాకు త్వరలోనే పూర్తిగా నీరు అందిస్తామని, సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. వంశధార ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.400 కోట్లు ఇచ్చామన్నారు. 

గంటన్నరకు పైగా నిలువుకాళ్ల మీదే.. 
పోలవరం బహిరంగ సభలో చంద్రబాబు గంటన్నరకు పైగా నిలువుకాళ్లపైనే నిలబడ్డారు. సాధారణంగా సభల్లో ఆయన 45 నిమిషాలకు తగ్గకుండా ప్రసంగిస్తారు. కానీ స్పిల్‌వే కాంక్రీట్‌ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సభలో అరగంట మాత్రమే మాట్లాడారు. అనంతరం ప్రాజెక్టు పనులకు సహకరించిన ఇంజనీర్లను, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను సభకు పరిచయం చేశారు. సభకు హాజరైన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుతోసహా మంత్రులు, ఎమ్మెల్యేలను పేరుపేరునా వేదికపైకి పిలిచి సభకు పరిచయం చేశారు. 

నిమిత్తమాత్రుడిని... 

‘పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి ఎందరో కృషి దాగి ఉంది. నేనొక టీమ్‌ లీడర్‌ని అంతే. నిమిత్తుమాత్రుడిని కూడా. కేవలం నాయకత్వం వహించాను. స్ట్రాటజీ (వ్యూహం) ఇంజనీర్లకు ఇచ్చాను. వారంతా ఉమ్మడిగా పనులను కాంక్రీట్‌ స్థాయికి చేర్చారు. వీరందరి శ్రమను ఈ శుభవేళ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ తలచుకోవాలి’ అని ఆకాంక్షించారు. బహిరంగ సభా స్థలిలోనూ ఇంజనీర్లందరినీ పేరుపేరున పిలిచి ప్రజలకు పరిచయం చేశారు. వీరిని గుర్తుపెట్టుకోండి, విజయానికి ప్రధాన భాగస్వాములు వీరే అంటూ సభికుల చేత చప్పట్లు కొట్టించారు.
 
9varam1.jpg 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...