Jump to content

Srisailam Project

Recommended Posts

  • Replies 249
  • Created
  • Last Reply
3 minutes ago, RamaSiddhu J said:

Pattiseema undiga?!

Kinda vundevallaki nellu ravataniki time paduthundi - on and offf vasthunnayi

on top of it - too much heat. 90+ 

Motors and engines are running continuously 

Link to comment
Share on other sites

శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రారంభమైన వరదనీరు
09-08-2018 09:23:12
 
636694033916709961.jpg
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు మరోసారి ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 42,874, ఔట్‌‌ఫ్లో 29,208 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 870.10 అడుగులుగా ఉంది. అలాగే నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 142 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
Link to comment
Share on other sites

రీశైలానికి నీటిప్రవాహం
10-08-2018 02:53:49
 
636694664291254203.jpg
  •  870 అడుగులకు నీటి మట్టం
శ్రీశైలం ప్రాజెక్టు, ఆగస్టు 9: కృష్ణానది ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి మళ్లీ వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం 6గంటల సమయానికి నీటిమట్టం 869.90 అడుగులుగా, జలాశయ నీటినిల్వ 141.3 టీఎంసీలుగా నమోదయ్యాయి. తుంగభద్ర నుంచి 17,784 క్యూసెక్కులు, జూరాల జలాశయం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 16,000 క్యూసెక్కులు మొత్తం 33,784 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది.
 
కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయంనుంచి 27,243 క్యూసెక్కులనీటిని వినియోగించుని అనంతరం దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయ బ్యాక్‌వాటర్‌ నుంచి హంద్రీనీవాకి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 2,500 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు... మొత్తం జలాశయం నుంచి 34,168 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గడిచిన 24గంటల వ్యవధిలో కుడి, ఎడమగట్టు భూగర్బ జల విద్యుత్‌ కేంద్రాల్లో 16.228 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేసి గ్రిడ్‌కు అందించారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
11-08-2018 08:38:14
 
636695734940057051.jpg
కర్నూలు: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 20వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 30,237 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 869.30 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 138 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు సుంకేసు డ్యాంకు భారీగా వరద నీరు వచ్చిచేరడంతో అధికారులు డ్యాం మూడు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్‌ఫ్లో 12 వేలు, ఔట్‌ ఫ్లో 13 వేల క్యూసెక్కులుగా ఉంది. కేసీ కాలువకు 1000 క్యూసెక్కుల నీటి అధికారులు విడుదల చేశారు.
Link to comment
Share on other sites

శ్రీశైలానికి వరద తాకిడి 
శ్రీశైలానికి వరదనీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం ఆరింటికి 1,07,126 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 869.20 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 138.9520 టీఎంసీలుగా నమోదైంది. హంద్రీనీవాకు 2025 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2400, పోతిరెడ్డిపాడుకు 3750 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 11.94 మి.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 24,025 క్యూసెక్కులు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 0.96 మి.యూ.ఉత్పత్తి, 1,512 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగô్కు విడుదలవుతోంది.

Link to comment
Share on other sites

 ఇక ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. మున్నేరు నుంచి 20,000క్యూసెక్కులు, మధిర నుంచి 4వేలు, పాలేరు నుంచి 5వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజీ గరిష్ఠ నీటిమట్టం 12అడుగులు కాగా 30గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తున్నారు. కాలువల ద్వారా సాగునీటి అవసరాల కోసం 11,500క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. ప్రధాన రిజర్వాయర్లలోకి నీటి రాకతో ఖరీఫ్‌ ఆశలు చిగురిస్తున్నాయి.

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,00,626 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ ఫ్లో 30,716 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 870.3 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 143 టీఎంసీలుగా ఉంది.

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
16-08-2018 07:59:40
 
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి అధికంగా ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 2,35,592 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7,538 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుత నీటిమట్టం 873.5 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 156.75 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. నాగార్జునసాగర్‌కు 69,913 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు, హంద్రినీవా ప్రాజెక్ట్‌కు 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 4వేల క్యూసెక్కుల నీటి అధికారులు విడుదల చేశారు. మరోవైపు జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. ఇన్‌ఫ్లో 1,10,000 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 1,07,000 క్యూసెక్కులుగా ఉంది.

11 minutes ago, swarnandhra said:

inthaki pulichintala full storage ki land acquisition and repair issues anni sort out ayyaya? 

Last year ee 30+ TMC store chesaru nearly 40 TMCs. This year if water comes they will store same capacity.

TG side vaallaki money pay chesi natlu vunnaru 1 year back.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...