Jump to content

Masood Committee Report on Polavaram


Raaz@NBK

Recommended Posts

  • Replies 74
  • Created
  • Last Reply
Posted
పోలవరం పనులపై మసూద్‌ కమిటీ నివేదిక
23-03-2018 11:52:39
 
636574027591958919.jpg
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఏర్పాటైన మసూద్ కమిటీ నివేదిక పూర్తయింది. పోలవరం పనులు, పునరావాసంపై.. కేంద్ర జలవనరులశాఖ మసూద్‌ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక నవయుగ కంపెనీ లక్ష్యాన్ని చేరుకుంటుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌పై మసూద్‌ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. పైడిపాక గ్రామంలో లబ్ధిదారులతో మసూద్‌ కమిటీ సభ్యులు మాట్లాడారు. కాగా... పునరావాసంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని కమిటీ పేర్కొంది.
Posted
మసూద్‌ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు
23-03-2018 11:57:49
 
636574030957577166.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పోలవరం పనులు, పునరావాసంపై మసూద్‌ కమిటీని కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా... పోలవరంపై మసూద్‌ కమిటీ నివేదికతో పరిహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పటాపంచలయ్యాయి. అలాగే ఇప్పటికైనా పోలవరంపై విమర్శలు మానుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో అసెంబ్లీలో మసూద్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
Posted

Super biggest joker pspk ayyadu niku enduku ra politics if you want to comment make constructive suggestions Nd improvements antey kanie shakshi news paper articles chadive govt ne comment chestey illane vuntundhe 

Posted

పోలవరం పై కేంద్రం వేసిన కమిటీ రిపోర్ట్ చూసి, నిరుత్సాహంలో ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్...

Super User
23 March 2018
Hits: 1
 
polavaram-23032018-1.jpg
share.png

గత కొన్ని రోజులుగా పోలవరం పై, ఒక పధకం ప్రకారం ఎలాంటి కుట్ర పన్నారో చూస్తూనే ఉన్నాం... ఎలా అయినా పోలవరం ఆపాలని, ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్, ఢిల్లీలోనూ, మన రాష్ట్రంలోనూ (హైదరాబాద్ బ్యాచ్ అనుకోండి), ఎలాంటి మాటలు మాట్లాడారో చూసాం..... అయితే, పాపం ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ కి, కేంద్రం వేసిన కమిటీనే దిమ్మ తిరిగే రిపోర్ట్ ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఒక కమిటి నియమించింది.. అదే మసూద్ కమిటీ ... పోలవరం పనులు, పునరావాసం, ఇలా అన్ని విషయాల పై ఈ కమిటీ చూసి రిపోర్ట్ ఇవ్వాలి...

 

polavaram 23032018 1

అయితే ఈ కమిటి ఎదో ఒక రిపోర్ట్ ఇస్తుందని, పోలవరం ఆపేసి, చంద్రబాబు పై సిబిఐ కేసు వేస్తారని హడావిడి చేసారు... అందుకే రెండు రోజుల నుంచి, ఈ ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ అందరూ, దీని చుట్టూతా కామెంట్స్ చేసారు... అయితే, చంద్రబాబు నిజాయితీ, చిత్తసుద్ధి ముందు వీరి నాటకాలు పాటాపంచలు అయ్యాయి... ఈ రోజు, ఈ కమిటి రిపోర్ట్ ఇచ్చింది... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక నవయుగ కంపెనీ లక్ష్యాన్ని చేరుకుంటుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.

polavaram 23032018 1

అలాగే పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌పై మసూద్‌ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. పైడిపాక గ్రామంలో లబ్ధిదారులతో మసూద్‌ కమిటీ సభ్యులు మాట్లాడారు. కాగా... పునరావాసంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని కమిటీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పోలవరంపై మసూద్‌ కమిటీ నివేదికతో పరిహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పటాపంచలయ్యాయి. అలాగే ఇప్పటికైనా పోలవరంపై విమర్శలు మానుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో అసెంబ్లీలో మసూద్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Posted

Modi + Jaitley + Amit shaki ....  gallaki bullet train meeda enquiry and Amit shah koduku compnaies meeda vayyamanandi enquiries

 

 

Cheese satta unnavadini cheyyanivvaru (CBN ki)...

 

Vaariki asaluu cheta kaadu ...(Jagan ,undavalli batch ) ..

Posted
ఏపీ ప్రభుత్వానికి ఊరట
23-03-2018 13:35:42
 
636574089418828936.jpg
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి పోలవరంపై ఊరట లభించింది. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన మసూద్ కమిటీ నివేదక వచ్చింది. ఈ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయన అనుమతితో ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 20 పేజీలో నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా పోలవరం కాంక్రీట్ పనుల్లో నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా నిర్దేశించిన లక్ష్యంలోనే పోలవరం పనులు పూర్తవుతాయని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు కాంక్రీట్ పనుల్లో నాణ్యత ఉందని మసూద్ కమిటీ స్పష్టం చేసింది. పోలవరం పరిహారం, పునరావాసంపై ప్రభుత్వం అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలోనే పోలవరం ముంపుగ్రామమైన మేడిపాక గ్రామంలో కమిటీ సభ్యులు పర్యటించారు. దీంతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా పర్యటించి, నిర్వాసితులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన పునరావాసంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా బాధితుల స్టేట్‌మెంట్లను కూడా కమిటీ రికార్డు చేసింది. ఈ కమిటీలో చీఫ్ ఇంజనీర్లతో పాటు, కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ దాదాపుగా వారం రోజులు పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించింది. పోలవరంపై మసూద్ కమిటీ 20 పేజీల నివేదనను తయారు చేసింది. ఈ నివేదికను మూడు రోజుల క్రితం కమిటీ కేంద్రానికి అందజేసింది. ప్రధాని, కేంద్ర హోం శాఖ, నాబార్డ్, ఏపీ ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్ సూచలనల మేరకు నిర్మిస్తోంది.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...