Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

  • Replies 309
  • Created
  • Last Reply

మెట్రో స్వరూపం మార్పు!

కొత్తగా జక్కంపూడి, కేసీ జంక్షన్‌కు కారిడార్లు

గన్నవరం వరకు పొడిగింపు

amr-gen1a.jpg

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయవాడ నగర మెట్రో ప్రాజెక్టు స్వరూపం మారిపోతోంది. తొలి దశలోనే నాలుగు కారిడార్లు నిర్మాణం చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ తన ఆర్‌ఎఫ్‌పీ (రిక్వస్టు ఫర్‌ ప్రపోజల్‌)లో కోరింది. విజయవాడ నగరాన్ని మొత్తం విస్తరించేలా మెట్రో ప్రాజెక్టు తొలి దశలోనే ఏర్పాటు కానుంది. దీనికి కేంద్రం నుంచి నిధులు మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తోంది. నవ్యాంధ్ర రాజధాని నగరంగా గుర్తింపు పొందిన విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా వూపింది. అయితే ప్రధాన కన్సల్టెన్సీగా ఉన్న దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ చేతులు ఎత్తేయడంతో మళ్లీ మెట్రో కథ మొదటికి వచ్చింది.

 అమరావతి: తాజాగా విజయవాడ నగరానికి తేలికపాటి మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తేలికపాటి మెట్రో ప్రాజెక్టు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి కన్సల్టెన్సీని నియమించేందుకు సోమవారం నోటీసు జారీ చేసింది. అయితే గతంలో ఉన్న మెట్రో స్వరూపం ప్రస్తుతం మారిపోయింది. ప్రాథమికంగా 26 కిలోమీటర్ల మెట్రో కోసం డీపీఆర్‌కు నోటీసు జారీ చేసినా.. ఆర్‌ఎఫ్‌పీలో మాత్రం మొత్తం నాలుగు కారిడార్లకు జారీ చేసింది. దీనికి ప్రతిపాదనలు అందించాలని ఏఎంఆర్‌సీ కోరినట్లు తెలిసింది. తొలి దశలోనే వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మొదట మెట్రో ప్రాజెక్టుకు కేవలం రెండు కారిడార్లు మాత్రమే ప్రతిపాదించి డీఎంఆర్‌సీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించిన విషయం తెలిసిందే. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్లను పీఎన్‌బీ నుంచి నిడమానూరు వరకు, మరొకటి పెనమలూరు వరకు నిర్మాణం చేయాలని తలపెట్టారు. దానికే టెండర్లను పిలిచారు. మొత్తం 26 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ప్రస్తుతం అదనంగా మరో 17 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

ఇవీ ప్రతిపాదనలు

గతంలో డీఎంఆర్‌సీ రూపొందించిన డీపీఆర్‌ ప్రకారం ఏలూరు కారిడార్‌ నిడమానూరు వరకు వెళుతుంది. దాదాపు 13 కి.మీ. పొడవున నిర్మించి 11 స్టేషన్లను ఏర్పాటు చేశారు. బందరు కారిడార్‌ మరో 13 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలోనూ 11 స్టేషన్లను ఏర్పాటు చేశారు. నిడమానూరు వద్ద కోచ్‌ డిపో ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. దానికి దాదాపు 50 ఎకరాల ప్రైవేటు పట్టా భూములు అవసరం ఉందని గుర్తించారు. అదే పెద్ద వివాదమైంది. నాడు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.7,200 కోట్లుగా నిర్ణయించారు. దీనిలో భూసేకరణ పరిహారం అన్నీ కలిపారు. డీఎంఆర్‌సీ ప్రతిపాదనల ప్రకారం కిలోమీటరు మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.246 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం హెవీ, మీడియం మెట్రో ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం వైదొలిగింది. లైట్‌ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేసి భవిష్యత్తులో విస్తరించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాని డీపీఆర్‌ తయారీకి ఆదేశాలు జారీ చేసింది.

భూమి మీద కూడా..

* తాజా లైట్‌మెట్రోలో తొలిదశలోనే నాలుగు కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీఎన్‌బీ కేంద్రంగా ఇవి సాగుతాయి. నాలుగు కారిడార్ల పొడవు మొత్తం 43 కి.మీ. లైట్‌ మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం జర్మనీ నిపుణులు డాట్సన్‌ ప్రతిపాదన ప్రకారం కిలోమీటరుకు రూ.160 కోట్లు. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు రూ.6,880 కోట్లు వ్యయం అవుతుంది. అంటే మీడియం మెట్రోలో 26 కిలోమీటర్లకు అయ్యే వ్యయంతో 43 కిలోమీటర్ల దూరం చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

* బందరు కారిడార్‌లో మార్పులు చేయడం లేదు. పీఎన్‌బీ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది. దీనిలో కొంత భూమిమీద నడిచే విధంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. 6.81 కి.మీ. భూమ్మీద (ఎట్‌గ్రేడ్‌) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల బందరు రోడ్డు విస్తరణ కోసం నిర్మాణాలను తొలగించడంతో అది పెద్ద సమస్య కాబోదని అంటున్నారు. భూమ్మీద మెట్రో నిర్మాణానికి కిలోమీటరుకు రూ.82.31 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది.

* ఏలూరు కారిడార్‌లో మార్పులు చేశారు. నిడమానూరు నుంచి గన్నవరం వరకు పొడిగించాలని నిర్ణయించారు. అంటే అదనంగా మరో 7 కి.మీ. పెరగనుంది. నిడమానూరులో కోచ్‌డిపో ఆవశ్యకత ఉండదు. గన్నవరంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. డిపో ఏర్పాటుకు 30 ఎకరాలు సరిపోతుందని అంచనా వేశారు.

* ఏలూరు రోడ్డులో బీఆర్‌టీఎస్‌ రోడ్డును వినియోగించుకొని దాదాపు 8.18 కి.మీ. ఎట్‌గ్రేడ్‌గా భూమ్మీద ట్రాక్‌ ఏర్పాటు చేయవచ్చు. దీంతో అంచనా వ్యయం భారీగా కలిసివస్తుంది. కేవలం 26 కిలోమీటర్ల పాక్షిక ఎలివేటెడ్‌ మెట్రోకు రూ.2,142 కోట్ల వ్యయం అవుతుందని డాట్సన్‌ నివేదించారు. ఒకవేళ ఇదే అమలు చేస్తే ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

* కొత్తగా జక్కంపూడికి మెట్రో కారిడార్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. జక్కంపూడిలో ప్రభుత్వం ఆర్థిక నగరాన్ని నిర్మాణం చేస్తోంది. ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అక్కడికి మెట్రో ఆవశ్యకత ఉంది. పీఎన్‌బీ నుంచి గాంధీ పార్కు మీదుగా చిట్టినగర్‌ నుంచి జక్కంపూడికి నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. దీనికి ఆర్‌ఎఫ్‌పీ అందించింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. దీనికి అంచనా వ్యయం దాదాపు రూ.1340కోట్లు అవుతుంది.

* మరో కారిడార్‌ను కృష్ణా కాలువ జంక్షన్‌ వరకు నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. దాదాపు 3 కి.మీ. ఉండే అవకాశం ఉంది. కృష్ణా కాలువ వరకు నిర్మాణం చేస్తే భవిష్యత్తులో అమరావతి రాజధాని నగరానికి అనుసంధానం సులభంగా ఉంటుందని అంచనా. తొలి దశలో ఈ నాలుగు కారిడార్లకు డీపీఆర్‌ సిద్ధం కానుందని తెలిసింది. భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం, కొండపల్లి వరకు పొడిగించాలనేది ప్రతిపాదన.

నిధుల మాటేమిటి?

విజయవాడ లైట్‌ మెట్రోకు నిధుల సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, ప్రాన్సు సంస్థ ఏఎఫ్‌డబ్ల్యూ సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు అందుతాయా లేదా అనేది ఇప్పుడు సమస్యగా మారింది. పాత పద్ధతిలో కేంద్రం 20 శాతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రం 20శాతం అందించనుంది. ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టులు నూతన విధానంలోనే అనుమతులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాల్సిందే. విజయవాడ మెట్రోను సగం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం చేసి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారు. అంటే ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాలు ఇతర పనులకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. లేదా రుణ సంస్థలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇతర నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ప్రతిపాదిస్తున్నాం

కొత్తగా తయారు చేయనున్న డీపీఆర్‌లో గన్నవరం వరకు ప్రతిపాదనలు అడుగుతున్నాం. మరో కారిడార్‌ జక్కంపూడికి విస్తరించనున్నాం. కృష్ణా నది దాటించాలనే సంకల్పంతో ఉన్నాం. అందుకే మూడో కారిడార్‌ కేసీ జంక్షన్‌ వరకు ప్రతిపాదించాం. దీనికి డీపీఆర్‌ తయారు చేయాలని ఆర్‌ఎఫ్‌పీలో కోరాం. అవన్నీ అంతర్గతంగా ఉంటాయి. కేంద్రం నుంచి నిధులు అందితే ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన అవుతుంది. డీఎంఆర్‌సీ టెండర్లను ఖరారు చేసి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యేవి. ప్రస్తుతం నాలుగు నెలల్లో డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత సీఎం ఆమోదించాల్సి ఉంటుంది.

రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో

Link to comment
Share on other sites

  • 3 weeks later...
లైట్‌ రైల్‌ చాలు
16-09-2017 02:43:47
 
636411266436159191.jpg
  • బెజవాడకు మెట్రో అక్కర్లేదు.. జనాభా 14 లక్షలే కదా!
  • ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.. కేంద్ర మంత్రి పురి సూచన
  • జైట్లీ దృష్టికీ తీసుకెళ్తామని మంత్రి నారాయణకు హామీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జనాభా ప్రాతిపదికన విజయవాడలో హెవీ మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతించలేమని కేంద్రం స్పష్టం చేసింది. లైట్‌ మెట్రోకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే బావుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి హరదీ్‌పసింగ్‌ పురి సూచించారు. శుక్రవారమిక్కడ ఆయనతో, కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గాశంకర్‌తో ఆంధ్రప్రదేశ్‌ పురపాలక మంత్రి పి.నారాయణ భేటీ అయ్యారు. విజయవాడలో మెట్రో అంశాన్ని రాష్ట్ర విభజన చట్టంలో కూడా పేర్కొన్నారని, 2015లోనే మెట్రో కోసం దరఖాస్తు చేసుకున్నందున హెవీ మెట్రో నిర్మాణానికే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
 
అయితే 20 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో మాత్రమే హెవీ మెట్రోకు అనుమతి ఇస్తున్నామని, విజయవాడలో 14 లక్షల మంది జనాభానే ఉన్నందున రాబోయే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకున్నా లైట్‌ రైల్‌ మెట్రోనే సముచితంగా ఉంటుందని పురి సలహా ఇచ్చారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నారాయణ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మెట్రో మ్యాన్‌ శ్రీధర్‌ సూచించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ప్రకారం.. విజయవాడ నడిబొడ్డులోనే రూ.800కోట్ల విలువైన భూమిని సేకరించాల్సి ఉంటుందని, లైట్‌ మెట్రో రైల్‌ను కేవలం రూ.400 కోట్లకే విమానాశ్రయం వరకూ పొడిగించవచ్చని, అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...

తేలికపాటి మెట్రోకు మార్గం సుగమం

డీపీఆర్‌ తయారీకి ముందుకొచ్చిన 8 అంతర్జాతీయ సంస్థలు

ఈనాడు డిజిటల్‌-విజయవాడ: విజయవాడలో తేలికపాటి మెట్రో ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఆధ్వర్యంలో తేలిక పాటి మెట్రోకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించారు. తేలికపాటి మెట్రోకు ఆర్థిక సహకారం అందిస్తున్న కె.ఎఫ్‌.డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో జర్మనీలో ఈ బిడ్లను తాజాగా తెరిచారు. ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు, వాటి అనుబంధ భాగస్వామ్య సంస్థలతో కలసి బిడ్లను దాఖలు చేశాయి. వీటిలో బాలాజీ రైల్‌రోడ్‌ సిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఇండియా), మోడల్‌ ట్రాన్‌సిస్ట్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌(ఇండియా), ఈజీఐఎస్‌ రైల్‌ ఎస్‌.ఏ(ఫ్రాన్స్‌), జీఆర్‌ఈ గాఫ్‌ రైల్వే ఇంజినీరింగ్‌(జర్మనీ), ర్యాంబోల్‌ ట్రాన్స్‌పోర్టు ఐఎంఎస్‌(జర్మనీ), రీనా కన్సల్టింగ్‌(ఇటలీ), ఎస్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌.పి.ఏ(ఇటలీ), సైస్ట్రా(ఫ్రాన్స్‌) ఉన్నాయి. లైట్‌ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ తయారీకి ఆగస్టు 28న ఏఎంఆర్‌సీ బిడ్లను పిలిచింది. శుక్రవారం నాటికి 8 ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు బిడ్లు వేయగా.. వాటిలో తక్కువ బిడ్లు దాఖలు చేసిన వాటిని ఈనెల 15వ తేదీలోపు ఎంపిక చేస్తారు. ఎంపికైన సంస్థలు 45 రోజుల్లో విజయవాడలో లైట్‌ మెట్రో విధివిధానాలపై అధ్యయనం చేసి ఫైనాన్షియల్‌ బిడ్లను తయారు చేస్తాయి. అనంతరం దానిపై విజయవాడ మెట్రోకు సంబంధించి తుది ప్రణాళికలతో డీపీఆర్‌ను తయారు చేయనున్నట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి శనివారం వెల్లడించారు. నూతన డీపీఆర్‌ కొత్త మెట్రో విధానానికి అనుగుణంగా తయారు చేయనున్నట్లు తెలిపారు. నూతన డీపీఆర్‌లో గన్నవరం, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌, జక్కంపూడి ప్రాంతాల విస్తరణకు సంబంధించిన వివరాలు ఉంటాయని వివరించారు.

Link to comment
Share on other sites

లైట్..రైట్

636430479540333891.jpg



  • విజయవాడ లైట్‌ మెట్రో డీపీఆర్‌ తయారీకి ఎనిమిది టెండర్లు
  • జర్మనీలో టెండర్లు తెరిచిన కేఎఫ్‌డబ్లూ
  • ఇండియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ దేశాల సంస్థల ఆసక్తి
  • మొత్తం 8 అంతర్జాతీయ సంస్థలు బిడ్ల సమర్పణ

ఆంధ్రజ్యోతి, విజయవాడ: విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పనకు ఏఎంఆర్‌సీ నేతృత్వంలో జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ పిలిచిన గ్లోబల్‌ టెండర్లకు అంతర్జాతీయ సంస్థల నుంచి స్పందన వచ్చింది. జర్మనీలో శుక్రవారం ఈ బిడ్లను తెరిచారు. శనివారం విజయవాడలోని ఏఎంఆర్‌సీ కార్యాలయానికి కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు ఈ మేరకు సమాచారాన్ని అందించారు. భారతదేశంతో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ దేశాలకు చెందిన మొత్తం ఎనిమిది సంస్థలు తమ ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) తెలుపుతూ బిడ్లను సమర్పించాయి. భారతదేశం నుంచి బాలాజీ రైల్‌ రోడ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఢిల్లీ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ (డీఐఎంటీఎస్‌) సంస్థలు బిడ్లను వేశాయి. ఫ్రాన్స్‌ దేశం నుంచి ఈజీఐఎస్‌ రైల్‌ ఎస్‌ఏ, సిస్ర్టా సంస్థలు బిడ్లను వేశాయి. జర్మనీ నుంచి జీఆర్‌ఈ గాఫ్‌ రైల్వే ఇంజనీరింగ్‌, రాంబాల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఐఎంఎస్‌, ఇటలీ దేశం నుంచి ఎస్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ ఎస్‌పీఏ, రినా కన్సల్టింగ్‌ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయి. వారం, పది రోజుల్లో అర్హత కలిగిన కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయనున్నట్టు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతికి తెలిపారు. దేశంలో 15 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో మీడియం మెట్రో, లైట్‌ మెట్రో వంటి మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం లేదని, రెండేళ్ళ కిందట విజయవాడకు డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) మీడియం మెట్రోకు డీపీఆర్‌ తయారు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం లేదన్నారు.

 

మంత్రి నారాయణ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌లతో కలిసి తాను ఢిల్లీ వెళ్ళినపుడు మీడియం మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వమని కోరామని, కేంద్రం మాత్రం లైట్‌ మెట్రో దిశగా అడుగులు వేయాల్సిందిగా సూచన చేసిందని తెలిపారు. ఏఎంఆర్‌సీ జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ సహకారంతో లైట్‌మెట్రో రైల్‌ డీపీఆర్‌ తయారీకి అంతర్జాతీయ కన్సల్‌టెంట్‌ సేవలను తీసుకోవాలని భావించినట్టు తెలిపారు. ఆగస్టు 28న ఏంఎఆర్‌సీ లైట్‌ మెట్రో రైల్‌ డీపీఆర్‌ తయారీకి ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. ఈ నెల 6న జర్మనీలోని కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ మొత్తం 8 జాయింట్‌ వెంచర్‌ అంతర్జాతీయ సంస్థలను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ఆగస్టు 15 లోపు అర్హత కలిగిన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నారు. గతంలో మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు బందరు, ఏలూరు రోడ్లలో 26 కిమీ. నిడివిన డీపీఆర్‌ను తయారు చేసింది. తాజాగా ఈ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును మాత్రం విజయవాడ నుంచి ఎయిర్‌పోర్టు, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌, జక్కంపూడిల వరకు పొడిగించటానికి వీలుగా డీపీఆర్‌ను రూపకల్పన చేయాల్సి ఉంది.

Link to comment
Share on other sites

Vijayawada Metro take up cheyyaru, Vizag lo eppudo start avvalsina Metro project inka start cheyyaru. Same happenning regarding capital permanent buildings.

Vizag lo eppudo start avvalsina Metro project inka start cheyyaru. vizag metro kiinka central govt amodham ivvala, vizag,vijaywada metro vishyam lo state tappu ledu.capital permanent buildings, vishyam lo late jarigindi anna mata vasthvam

Link to comment
Share on other sites

Vizag lo eppudo start avvalsina Metro project inka start cheyyaru. vizag metro kiinka central govt amodham ivvala, vizag,vijaywada metro vishyam lo state tappu ledu.capital permanent buildings, vishyam lo late jarigindi anna mata vasthvam

 

Vizag lo kontha mandi Metro Vijayawada etthuku poyaru andhuke Vizag metro aagipoyindi ani visha pracharam chesthunnaru.

 

State should be clear will do or not, if any hurdles why it is stopped ani clear ga cheppali if reason is center. 

 

Vizag lo Corporation elections pettukuni Railway Zone, Metro, NAD flyover laanti key issues solve cheyyakapothe elaga?

Link to comment
Share on other sites

Vizag lo kontha mandi Metro Vijayawada etthuku poyaru andhuke Vizag metro aagipoyindi ani visha pracharam chesthunnaru.

 

State should be clear will do or not, if any hurdles why it is stopped ani clear ga cheppali if reason is center. 

 

Vizag lo Corporation elections pettukuni Railway Zone, Metro, NAD flyover laanti key issues solve cheyyakapothe elaga?

valla bonda vizag metro purthiga PPP mode llo cheyymantundi central govt, ethuku povatam emiti jaffa la vedva edupu tapa

Link to comment
Share on other sites

metro2.jpg

eenadu o emadya vedava cover drives vesthunadu , valu metro ki anumathulu kavalani ivvatam ledu ane,vere vati gurichi alchona chesindi, mi vata dabbu ivvalani state  enni sarlu letters rasindi central govt ki ni paper lone rasavu malli state meda nindalu veyytam enduku thu,,,

Link to comment
Share on other sites

నిలిచేదెవరో..?
 
 
636437377200793041.jpg
  •  లైట్‌ మెట్రో రైల్‌ డీపీఆర్‌కు అంతర్జాతీయ సంస్థల మధ్య పోటీ! 
  •  నేడు జర్మనీలో టెండర్ల స్ర్కూటినీ
  •  ఎవాల్యుయేషన్‌ అవగానే.. ఆర్‌ఎఫ్‌పీ విడుదల 
  • 45 రోజుల్లో తుది అనుమతులు
లైట్‌ మెట్రో రైల్‌ డీపీఆర్‌ ప్రాజెక్టు దక్కించుకునేందుకు అంతర్జాతీయ సంస్థల మధ్య పోటీ నెలకొంది! సోమవారం జర్మనీలో అర్హతల ప్రాతిపదికన ఎలిమినేషన్‌ ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు, దేశీయ సంస్థలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇంతకు ముందు మీడియం మెట్రో ప్రాజెక్టుకు దేశీయ కన్సల్టెన్సీ సంస్థ డీఎంఆర్‌సీ డీపీఆర్‌ ఇవ్వగా.. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు మాత్రం అంత ర్జాతీయ సంస్థలకు దేశీయ సంస్థలు ఎంత వరకు పోటీ ఇస్తాయో చూడాల్సిందే!
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన కోసం ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలతో పాటు దేశీయ సంస్థలు కూడా బరిలో నిలిచాయి. మొత్తం ఎనిమిది సంస్థలు బిడ్లను సమర్పించాయి. వీటిలో ఫ్రాన్స్‌ నుంచి ఈజీఐఎస్‌ రైల్‌ ఎస్‌ఏ, సిస్ర్టా సంస్థలు బిడ్లను వేశాయి. జర్మనీ నుంచి జీఆర్‌ఈ గాఫ్‌ రైల్వే ఇంజనీరింగ్‌, రాంబాల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఐఎంఎస్‌, ఇటలీ దేశం నుంచి ఎస్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ ఎస్‌పీఏ, రినా కన్సల్టింగ్‌ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయి. భారత్‌ నుంచి బాలాజీ రైల్‌ రోడ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఢిల్లీ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ (డీఐఎంటీఎస్‌) సంస్థలు బిడ్లను వేశాయి. సోమవారం ఈ సంస్థలన్నింటి అర్హతలను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నిర్ణయిస్తుంది. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఒక రుణ సంస్థ. ఇది మీడియం మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చిన సంస్థ. అంతకు ముందు విపరీతమైన ఆంక్షల నేపథ్యంలో, జపాన్‌ ఆర్థిక సంస్థ ‘జైకా’కు ఏఎంఆర్‌సీ ఉద్వాసన పలికింది. ఆ తర్వాత కేఎఫ్‌డబ్ల్యూ, ఏఎఫ్‌డీ సంస్థలు ముందుకు వచ్చాయి.
 
మీడియం మెట్రోకు ప్రత్యామ్నాయంగా లైట్‌ రైల్‌ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఈ రుణ సంస్థలు కూడా ఇదే ప్రాజెక్టుపై ఆసక్తితో ఉన్నాయి. డీపీఆర్‌ తయారీకి సంబంధించి కూడా దాదాపుగా ఉచిత సేవలనే ఈ సంస్థలు అందిస్తున్నాయి. కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ వీటి నిర్వహణ చూస్తోంది. అందుకే గ్లోబల్‌ టెండర్లను పిలవటం జరిగింది. గ్లోబల్‌ టెండర్లు పిలవటం వల్ల అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావటం సాధ్యపడింది. దేశంలో మెట్రోకు సంబంధించి గ్లోబల్‌ టెండర్లు పిలవటం, అంతర్జాతీయ సంస్థలు పాలు పంచుకోవటం ఇదే ప్రథమం. సోమవారం నిర్వహించే అర్హతల పరిశీలనలో తొలగించబడే సంస్థలు ఏమిటో? బరిలో ఉండే సంస్థలు ఏమిటో తెలుస్తుంది. బరిలో ఉన్న సంస్థలకు వెంటనే డీపీఆర్‌ రూపకల్పనకు సంబంధించి ఏమేమి చేయాలో నిర్దేశించి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) ను విడుదల చేస్తారు. ఇంతకు ముందు మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు బందరు, ఏలూరు రోడ్లలో 27 కిలోమీటర్ల కారిడార్‌ను నిర్ణయించారు. ఈ సారి మాత్రం దీనికంటే పొడిగించటం జరిగింది. గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు, ఎకనమిక్‌ సిటీ జక్కంపూడి వరకు, రాజధాని ప్రాంతం కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు పొడిగించటం జరిగింది. నిడివి పెరిగింది కాబట్టి .. సమగ్ర రిపోర్టు తయారు చేయటానికి నాలుగు నెలల సమయాన్ని ఏఎంఆర్‌సీ నిర్దేశించింది. ఆర్‌ఎఫ్‌పీ విడుదల చేసిన తర్వాత 45 రోజుల్లో .. ఆయా సంస్థల నివేదికలను తీసుకుంటాయి. ఆ తర్వాత తుది సంస్థను ఎంపిక చేయటం జరుగుతుంది.
 
ఏఎంఆర్‌సీకి తగ్గిన భారం
మెట్రో ప్రాజెక్టుల విధానానికి సంబంధించి చూస్తే మీడియం మెట్రో, లైట్‌ మెట్రో ఇలా గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నగరానికి సుస్ఫష్టమైన ప్రకటన చేయటంతో ఏఎంఆర్‌సీలో ఇప్పటి వరకు ఉన్న అనిశ్చితి కూడా వీడింది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్న ఏఎంఆర్‌సీకి తలభారాన్ని తగ్గించినట్టు అయింది. లైట్‌ మెట్రో రైల్‌ వైపుగానే వెళుతున్నామని, భవిష్యత్తులో అవసరమైతే మీడియం మెట్రోను ఇంటిగ్రేట్‌ చేసుకుంటామని చెప్పటంతో ఒక గందరగోళానికి ముగింపు పలికినట్టు అయింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...