Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

1 hour ago, ravindras said:

gannavaram to velagapudi secretariat suburban(mmts)  rail possible avutundaa?

suburban rail requires less funds roughly 10-20 crore/km which depends on land acquisition cost , metro requires 250 crore/km

 

Gannavaram - VIJ -Krishna Canal Junction railway station daka track undi, Krishna Canal Junction railway station nunchi velagapudi ki new railway track vesthe saripothundi anukunta

Link to comment
Share on other sites

  • Replies 309
  • Created
  • Last Reply
2 hours ago, sonykongara said:

Gannavaram - VIJ -Krishna Canal Junction railway station daka track undi, Krishna Canal Junction railway station nunchi velagapudi ki new railway track vesthe saripothundi anukunta

if railways don't want to bear entire cost , state government can share some part of it . state government already bearing the cost on several railway lines on  50:50 percent basis. in hyderabad mmts state center ratio 2:1 . it will cost less money for state government compare to metro . in hyderabad, mmts train charges are very less compare to metro. mmts fares are affordable which attract people . 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
లైట్‌ మెట్రో ప్రిలిమనరీ డీపీఆర్‌ వచ్చే నెలలోనే..!
11-05-2018 07:11:10
 
636616194698384425.jpg
  • కీలక సర్వేలన్నీ దాదాపు పూర్తి
  • ట్రాఫిక్‌ సర్వేలో లైట్‌ మెట్రోకే ప్రయాణికుల ఓటు
  • టోపోగ్రఫీ, ఎన్విరాన్‌మెంట్‌ సర్వేలు పూర్తి
  • సాయిల్‌ టెస్ట్‌ పూర్తి చేసిన శిస్ర్టా
 
లైట్‌ మెట్రో డీపీఆర్‌ ప్రిలిమినరీ రిపోర్టును వచ్చే నెలలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కు కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ అందజేయనుంది. కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఏఎంఆర్‌సీకి ఈ మేరకు ప్రాథమిక సమాచారం అందింది. ప్రాజెక్టు డీపీఆర్‌ పూర్తి చేయటానికి అవసరమైన ప్రామాణిక సర్వేలన్నింటినీ కన్సల్టెన్సీ సంస్థ దాదాపు పూర్తి చేసింది.
 
 
విజయవాడ: లైట్‌ మెట్రో డీపీఆర్‌ ప్రిలిమినరీ రిపోర్టును వచ్చే నెలలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కు కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ ఇవ్వబోతోంది. ఈ మేరకు కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఏఎంఆర్‌సీకి ప్రాథమిక సమాచారం అందింది.
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ పూర్తి చేయటానికి అవసరమైన ప్రామాణిక సర్వేలన్నింటినీ దాదాపుగా శిస్ర్టా పూర్తి చేసింది. ట్రాఫిక్‌ సర్వే, టోపోగ్రఫీ సర్వే, ఎన్విరాన్‌మెంట్‌ సర్వేలు పూర్తయ్యాయి. ఈ మూడు సర్వేలతో పాటు అతి ముఖ్యమైన సాయిల్‌ టెస్ట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది.
 
   ట్రాఫిక్‌ సర్వేలో భాగంగా ప్రతిపాదిత కారిడార్లలోని ప్రయాణికులు రవాణా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ఎలాంటి రవాణా వ్యవస్థలను కోరుకుంటున్నారు? ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎలాంటి రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి? లైట్‌మెట్రోను ప్రత్యామ్నాయంగా స్వీకరిస్తారా? వంటి అనేక ప్రశ్నలను వేసి వారి నుంచి అభిప్రాయాన్ని తీసుకోవటం జరిగింది. ప్రతిపాదిత అన్ని కారిడార్లలో ఈ సర్వే జరిగింది. నగరవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే ఎంతో సానుకూలంగా వచ్చింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా స్వీకరించటానికి మెజారిటీ ప్రయాణీకులు ఓటు వేశారు.
 
   దీంతో ప్రజలు లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును స్వాగతిస్తున్నారని, సాకారం అయితే ఆదరిస్తారని రూఢీ అవుతోంది. ట్రాఫిక్‌ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత టోపోగ్రఫీ సర్వేను చేపట్టారు. విజయవాడ నగర, అమరావతి రాజధాని భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేశారు. విజయవాడ నగరంలో రోడ్లు ఎలాంటి స్థితిలో ఉన్నాయి? ఎంత వెడల్పులో ఉన్నాయి? క్షేత్ర స్థాయిలో డెవలప్‌మెంట్‌ ఎలా ఉంది? లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్లను సమస్యాత్మకంగా లేకుండా ఎలా ఏర్పాటు చేసుకోవ చ్చు? రాజధాని కోర్‌ ఏరియా స్థితిగతులు ఏమిటి? అక్కడ ప్రస్తుతం ఉన్న రోడ్లు, అభివృద్ధి ప్రణాళికలలో రోడ్ల విస్తరణకు నిర్దేశించిన అంశాలను అధ్యయనం చేశారు. మూడవదిగా ఎన్విరాన్‌మెంటల్‌ సర్వే నిర్వహించారు.
 
   ఈ ఎన్విరాన్‌మెంటల్‌ సర్వేలో భాగంగా వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశారు. విజయవాడ నగరంలో కాలుష్య కారకాలపై అధ్యయనంచేశారు. అలాగా ప్రతిపాదిత కారిడార్లలో ఎన్నిచెట్లు ఉన్నాయో కూడా అధ్యయనం నిర్వహించారు. పర్యావరణ హితకారిగా ఈ ప్రాజెక్టు ఏ విధంగా దోహదపడుతుందో కూడా కన్సల్టెన్సీ సంస్థ నివేదికను సిద్ధం చేసుకుంది. నాల్గవది అతి ముఖ్యమైనది. ప్రతిపాదిత కారిడార్ల వెంబడి మట్టి శాంపిల్స్‌ సేకరించారు. మట్టి శాంపిల్స్‌ కూడా అనుకూలంగా వచ్చాయని చెబుతున్నారు.
 
 
ప్రిలిమనరీ రిపోర్టు దాదాపు సిద్ధం
ముఖ్యమైన సర్వేలన్నీ పూర్తికావటంతో ప్రాథమిక డీపీఆర్‌ దాదాపుగా సిద్ధమైంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి రామవరప్పాడు రింగ్‌ - ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌ మీదుగా కృష్ణాకెనాల్‌ జంక్షన్‌, కంకిపాడు, పెనమలూరు సెంటర్‌, బందరు రోడ్డు మీదుగా , పీఎన్‌బీఎస్‌, పీఎన్‌బీఎస్‌ నుంచి జక్కంపూడికి, శివారు ప్రాంతాల నుంచి కనెక్టివిటీకి సంబంధించి అనేక ప్రతిపాదనలను ప్రాథమిక డీపీఆర్‌లో పొందు పరిచినట్టు తెలుస్తోంది. వచ్చేనెలలో ఈ రిపోర్టును శిస్ర్టా ప్రతినిధులు, ఏఎంఆర్‌సీకి అందచేస్తారు. ఏఎంఆర్‌సీ ఈ రిపోర్టును పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులను సూచిస్తుంది.
Link to comment
Share on other sites

అమరావతి కోర్‌ ఏరియాలో అండర్‌ గ్రౌండ్‌ మెట్రో!
14-05-2018 09:00:18
 
636618852189467176.jpg
  • అండర్‌ గ్రౌండ్‌తో.. అనుసంధానం
  • పీఎన్‌బీఎస్‌, రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టు రాజధానితో అనుసంధానం
  • ప్రిలిమనరీ డీపీఆర్‌లో సూచించిన శిస్ర్టా
  • పీఎన్‌బీఎస్‌ నుంచి కృష్ణా కెనాల్‌ వరకూ మరో వంతెన
  • అక్కడినుంచి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో అండర్‌ గ్రౌండ్‌
విజయవాడ: రాజధాని కోర్‌ ఏరియాలో అండర్‌ గ్రౌండ్‌ విధానంలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉందని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ప్రిలిమనరీ రిపోర్టులో పొందుపరిచినట్టు తెలుస్తోంది! లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ బాధ్యతలను చూస్తున్న శిస్ర్టా సంస్థ ఈ మేరకు సూచించినట్టు సమాచారం. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకూ కృష్ణా నదిపై తొలుత బ్రిడ్జి నిర్మాంచాలి. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ నాలుగైదు కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత క్యాపిటల్‌ సిటీ కోర్‌ ఏరియా వస్తుంది. కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ నుంచి కోర్‌ ఏరియా బయటి వరకు ఎలివేటెట్‌ (పై మార్గంలో) విధానంలో కారిడార్‌ ఉండేలా.. కోర్‌ సిటీలో మాత్రం అండర్‌ గ్రౌండ్‌ విధానంలో ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. కోర్‌ ఏరియాలో దాదాపుగా 15 కిలోమీటర్లకు పైగా విస్తీర్ణ్ణంలో లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు అండర్‌ గ్రౌండ్‌లో ఉండేలా కారిడార్‌ను నిర్దేశించింది.
 
విజయవాడ నగరంలో లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ బాధ్యతలను చూస్తున్న శిస్ర్టా సంస్థ విజయవాడను రాజధాని ప్రాంతంతో అనుసంధానించటానికి వీలుగా డీపీఆర్‌ను రూపొందిస్తోంది. బందరు రోడ్డు కారిడార్‌ పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు అనుసంధానమౌతుంది. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి ఈ కారిడార్‌ను కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ వరకు పొడిగించాలని ముందుగా అనుకున్నారు.
 
కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ వరకు వదిలేస్తే ప్రయోజనం ఏమీ ఉండదని, కోర్‌ ఏరియాకు కూడా కలిపితేనే ఈ ప్రాజెక్టుకు సార్థకత వస్తుందని అధికారులు భావించారు. ఈ లెక్కన చూస్తే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమరావతి కోర్‌ ఏరియాకు లైట్‌ మెట్రో రైల్‌ మార్గం ఏర్పడుతుంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌కు మరో కారిడార్‌ వెళుతుంది. ఈ కారిడార్‌ కూడా కృష్ణాకెనాల్‌ జంక్షన్‌కు అనుసంధానమౌతుంది కాబట్టి నేరుగా రాజధాని నగరానికి చేరుకోవచ్చు. రాజధాని ప్రాంతానికి వివిధ పనులు, వ్యాపారాలు, ఇతర అనేక కార్యకలాపాల కోసం వచ్చే వారంతా ప్రధానంగా బస్సులు, రైళ్ళ మీద చేరుకుంటారు.
 
 
పెద్దవాళ్ళు అయితే విమానాల మీద వస్తారు. ఎలాంటి రవాణా మార్గాల ద్వారా వచ్చినా.. నేరుగా అమరావతి రాజధానికి చేరుకునే అవకాశం ఉంటుంది. శిస్ర్టా రూపొందించిన సరికొత్త ప్రతిపాదనపై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) కూడా సానుకూలంగా ఉంది. ఆసియాలోనే మూడవ అతిపెద్ద పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌), దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్‌గా భాసిల్లుతున్న విజయవాడ రైల్వే స్టేషన్‌, నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని ప్రాంతానికి తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలు మూడు రాజధానికి అనుసంధానమౌతాయి. చెంతనే అమరావతి రాజధాని అవతరించిన తర్వాత.. రాకపోకలు ఎక్కువుగా పెరిగాయి. ప్రస్తుతం రాకపోకలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో ట్రాఫిక్‌ ఎలా ఉంటుంది? వంటివి ఇంతకు ముందు ట్రాఫిక్‌ సర్వేలో అధ్యయనం చేశారు.
 
 
రోడ్డు రవాణా మార్గాల ద్వారా ఎక్కువ రాకపోకలు జరుగుతున్నాయన్నది గుర్తించారు. రాజధాని వచ్చిన తర్వాత వెలగపూడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆర్టీసీ అధికారులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కాకుండా ఇప్పుడే కారిడార్‌ను ప్రతిపాదించటం శ్రేయస్కరమని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) భావించింది. కన్సల్టెన్సీ సంస్థకు ఆ మేరకు సూచన చేసింది. కన్సల్టెన్సీ సంస్థ కూడా దీనికి సంబంధించిన అధ్యయనం చేయటంతో మార్గం సుగమమైంది. వచ్చే నెలలో ప్రిలిమనరీ రిపోర్టును కన్సల్టెన్సీ సంస్థ, ఏఎంఆర్‌సీకి అందిస్తుంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
విజయవాడ లైట్‌ మెట్రోకు.. మేలైన ప్లాన్‌
20-06-2018 09:07:03
 
636650824376264418.jpg
  • రంగంలోకి కేఎఫ్‌డబ్ల్యూ 
  • ఈ నెల 25, 26, 27 తేదీలలో నగర పర్యటన
  • ఏఎంఆర్‌సీ కార్యాలయంలో ‘శిస్ర్టా’ సంస్థతో భేటీ
  • ప్రిలిమినరీ డీపీఆర్‌పై విస్తృత స్థాయి మదింపు
  • క్షేత్రస్థాయిలో రాజధాని, బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌, జక్కంపూడిలో సందర్శన
విజయవాడలో లైట్‌ మెట్రో డీపీఆర్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతలను జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ తన సొంత నిధులతో తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 25ర శిస్ర్టా సంస్థతో కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు భేటీ కానున్నారు. పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
 
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ కీలక దశలో ఉన్న నేపథ్యంలో, జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ రంగంలోకి దిగింది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను సమగ్రంగా పరిశీలించటానికి కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ తన టెక్నికల్‌ టీమ్‌లను విజయవాడ పంపిస్తోంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు విజయవాడ నగరంలో కేఎఫ్‌డబ్ల్యూ టెక్నికల్‌ టీములు పర్యటిస్తాయి. కేఎఫ్‌డబ్ల్యూ టెక్నికల్‌ టీమ్స్‌ వస్తున్న నేపథ్యంలో, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) సన్నాహక ఏర్పాట్లు చేపడుతోంది. నగరానికి లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి డీ పీఆర్‌ తయారు చేసే బాధ్యతలను జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ తన సొంత నిధులతో తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే. డీపీఆర్‌ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలలో కేఎఫ్‌డబ్ల్యూ భాగస్వామిగా ఉంటుంది. ఈ క్రమంలో కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ డీపీఆర్‌ను తయారు చేయించటానికి గ్లోబల్‌ టెండర్లను పిలిచింది. శిస్ర్టా సంస్థను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా శిస్ర్టా సంస్థ నగరంలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన కోసం విస్తృతంగా పనులు చేపడుతోంది.
 
క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్‌ సర్వే నిర్వహించటం దగ్గర నుంచి, కారిడార్‌ రూట్లను గుర్తించటం, వాటిని ఎక్కడి వరకు పొడిగించాలి? వంటి అంశాలపై అధ్యయనం చేసింది. ఆ తర్వాత పాసెంజర్స్‌ సర్వే చేసింది. నగరంలోని బస్టాపుల వారీగా ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకుంది. ఈ క్రమంలో సాయిల్‌ టెస్ట్‌ పనుల దగ్గర నుంచి వాతావరణ సంబంధిత అంశాలతో పాటు కారిడార్‌లో వివిధ శాఖల పరిధిలో తొలగించాల్సిన వాటికి సంబంధించి ఇలా దాదాపుగా డీపీఆర్‌లో పొందు పరచాల్సిన ప్రధానమైన వాటికి సంబంధించిన పనులన్నింటినీ ఓ కొలిక్కి తీసుకువచ్చింది. దాదాపుగా ప్రిలిమినరీ డీపీఆర్‌ను శిస్ర్టా సంస్థ సిద్ధం చేసింది. ఈ క్రమంలో కేఎఫ్‌డబ్ల్యూ రంగ ప్రవేశం చేసింది.
 
 
పర్యటన ఇలా..
రవాణా రంగానికి సంబంధించి నిపుణులు క్రిస్టియన్‌ వట్లర్‌, రాబర్ట్‌లతో పాటు డైరెక్టర్లుగా ఉన్న రూనీ, స్వాతిలు రాబోతున్న టీమ్‌లో ఉంటున్నారు. ఈ టీమ్‌ ముందుగా 24వ తేదీ రాత్రి విజయవాడ వస్తుంది. ఇక్కడే వారికి బస ఏర్పాట్లను ఏఎంఆర్‌సీ చేస్తుంది. మరుసటి రోజు 25వ తేదీన ఏఎంఆర్‌సీ కార్యాలయంలో శిస్ర్టా సంస్థతో కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు భేటీ అవుతారు. ఈ భేటీలో గుర్తించిన కారిడార్లు, ఎంపిక చేసిన ప్రాంతాలు, ట్రాఫిక్‌ సర్వే, ప్యాసింజర్స్‌ సర్వే లతో పాటు ఇతర సర్వేలు ఎలా జరిగాయి? వాటి ఫలితాలు ఏమిటి? వంటి అంశాలను పరిశీలిస్తారు. రోజంతా విస్తృతంగా సమావేశాలు జరుగుతాయి. ఈ నెల 26, 27 తేదీల్లో మాత్రం కేఎఫ్‌డబ్ల్యూ టీమ్‌ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుంది. కారిడార్ల మార్గంలో పరిశీలనలు జరుపుతుంది. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, జక్కంపూడి ఎకనామిక్‌ సిటీ ప్రాంతం, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌, అమరావతి కోర్‌ క్యాపిటల్‌ వంటివి సందర్శించి కారిడార్లను లోతుగా పరిశీలిస్తారు.
Link to comment
Share on other sites

నవ్యాంధ్ర రాజధానిలో మల్టీ.. మెట్రో!
27-06-2018 09:08:07
 
636656872880714058.jpg
  • ఎలివేటెడ్‌, ఎర్త్‌ గ్రేడ్‌ మిక్సింగ్‌ వైపు మొగ్గు
  • హైదరాబాద్‌లో తగ్గిన ప్రయాణికుల దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు
  • కిలోమీటర్‌కు రూ.100 కోట్లు వ్యయం తగ్గుతుందన్న అధికారులు
  • ‘శిస్ర్టా’ మధ్యంతర డీపీఆర్‌పై మెట్రో ఉన్నత స్థాయి సమావేశం
విజయవాడ (ఆంధ్రజ్యోతి): బహుళ ప్రయోజనకారిగా ‘మల్టీ మెట్రో’ రైల్‌ ప్రాజెక్టు విధానాన్ని అనుసరించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. విజయవాడలో ఏర్పాటు చేయబోయే లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును భూమి మీద ట్రాముల మాదిరిగా ఎర్త్‌ గ్రేడ్‌ నిర్మాణం జరపాలని, ఎలివేటెడ్‌ గ్రేడ్‌ విధానంలో ఫ్లై ఓవర్‌ మీద ట్రాక్‌ వేసి ఆకాశ మార్గంలో నడపాలని నిర్ణయించారు. దేశీయంగా మెట్రో రైల్‌ ప్రాజెక్టులు లాభదాయకతగా లేని అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్కువమంది ప్రయాణికులు మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు వీలుగా చేయటానికి అవసరమైన ప్రాంతాల్లో భూమి మీదనే ట్రాక్‌ వేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని ప్రాథమికంగా నిర్ణయించారు. అమరావతి రాజధానికి తొలి దశలోనే లైట్‌ మెట్రో రైల్‌ను పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కరికాల వలవన్‌ అధ్యక్షత న లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ‘శిస్ర్టా’ సంస్థ రూపొందించిన ‘మధ్యంతర డీపీఆర్‌’పై సమీక్షించారు.
 
 
విజయవాడలోని ఏఎం ఆర్‌సీ ప్రధాన కార్యాలయం ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యంతర డీపీఆర్‌పై విస్తృత చర్చ జరిగింది. ఈ సమావేశానికి జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ ‘కేఎఫ్‌డబ్ల్యూ’ టెక్నికల్‌ బృందం కూడా పాలు పంచుకుంది. ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డితో పాటు సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయ క్రిష్ణన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జె నివాస్‌ తదితర ఇతర శాఖల అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న శిస్ర్టా ప్రతి నిధు తమ మధ్యంతర రిపోర్టును సమావేశం ముందుంచారు. ప్రధానంగా మూడు కారిడార్లను ప్రతిపాదించారు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిడమానూరు, ఏలూరు రోడ్డు, రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌, కృష్ణాకెనాల్‌ జంక్షన్‌, రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేరేలా ఒక కారి డార్‌, జక్కంపూడి నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదుగా ఏలూరు రోడ్డు కారిడార్‌కు అను సంధానమయ్యేలా రెండవ కారిడార్‌ను, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి పెన మలూరు సెంటర్‌ వరకు మూడవ కారి డార్‌ను ప్రతిపాదించారు. ఈ కారిడార్లకు సంబంధించి మొదటి దశలో విజయవాడ ఎయిర్‌పోర్టు - పీఎన్‌బీఎస్‌, పీఎన్‌బీఎస్‌ - పెనమలూరు వంటివి ప్రతి పాదించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ జోక్యం చేసుకుని మొదటి దశలోనే అమరావతికి అనుసంధానం చేసేలా డీపీఆర్‌లో పొందుపరచాలని సూచించారు. ఆ తర్వాత ఎలాంటి రవాణా వ్యవస్థ అవసరమన్న దానిపై చర్చకు వచ్చింది.
 
బందరు రోడ్డు విస్తరణ వల్ల సువిశాల రహదారి అందుబాటులోకి రావటం వల్ల ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలో నేలపై ట్రాములు నడిచే విధంగా మెట్రో లైన్‌ వెళ్లటం వల్ల కిలో మీటర్‌కు రూ.100 కోట్లు కలిసి వస్తుందని నిపుణుల కమిటీలో తేలింది. మెట్రో ప్రాజెక్టులు దేశంలో లాభంలో లేకపోవటానికి ముందు అనుకున్నంతగా త ర్వాత ప్రయాణికులు రాకపోవటమేనని గుర్తించారు. హైదరాబాద్‌ మెట్రోకు 7 లక్షల మంది ప్రయాణికులు వస్తారని ఊహిస్తే సగటున 60 వేల మంది కూడా రావటం లేదన్న దానిపై చర్చ నడిచింది. విజయవాడలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పాసెంజర్స్‌, ట్రాఫిక్‌ సర్వేలో వచ్చిన ప్రకారం ప్రయాణికుల అవసరాలే ప్రాతిపదికగా మెట్రో ఉండాలని నిర్ణయించారు. ఈ దిశగా ఎక్కడ ఎలివేటెడ్‌ ఉండాలి? ఎక్కడ భూమిపై ఉండాలి? అన్న అంశాలను పరిశీ లించాలని శిస్ర్టాకు కరికాల వలవన్‌ సూచించారు. జక్కంపూడి కారిడార్‌కు ప్రాథమికంగా కారిడార్‌ అవసరమేనని అభిప్రాయపడినా ఎకనమిక్‌ సిటీ అభివృద్ధి చెందటానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి దానిని రెండవ ఫేజ్‌లో చేర్చాలని నిర్ణయించారు. పీఎన్‌బీఎస్‌ నుంచి పెన మలూరు సెంటర్‌ కారిడార్‌ను కూడా మొదటి ఫేజ్‌లోనే చేపట్టేందుకు ఉన్నతస్థాయి కమిటీల ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.
 
 
బీఆర్‌టీఎస్‌పై సాగిన చర్చ
నాలుగు కిలోమీటర్ల పరిధిలో నగరంలో నిర్మించిన డెడికేడెట్‌ బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ కూడా చర్చకు వచ్చింది. బీఆర్‌టీఎస్‌ను పున రుద్ధరించటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న దానిపై కూడా శిస్ర్టా సంస్థ తగిన సూచనలు చేయాల్సిందిగా సూచిం చినట్టు తెలుస్తోంది. మల్టీ మెట్రోలో భాగంగా బీఆర్‌టీఎస్‌ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతు న్నా.. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వటం లేదు. సమావేశం ముగిసిన తర్వాత ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన శిస్ర్టా బృందం, కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధుల సమావేశం జరిగింది.
 
 
కేఎఫ్‌డబ్ల్యూ టెక్నికల్‌ బృందం మధ్యంతర డీపీఆర్‌ను సూక్ష్మంగా అడిగి తెలుసుకున్నారు. నగరంలో క్షేత్రస్థాయి పర్యటనలో వారు తెలుసుకున్న విషయాలతో పాటు, తమ సందేహాలను కూడా లేవనెత్తారు. డీపీఆర్‌ తయారు చేయటానికి కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ తన సొంత నిధులను ఖర్చు చేస్తోంది. ఆ తర్వాతే ఈ సంస్థ ప్రధాన భాగస్వామిగా ఆర్థిక సహ కారం కూడా అందించనుంది. ఈ క్రమంలో టెక్నికల్‌గా ప్రజలకు అందుబాటులో ఉండే మెట్రో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలన్న దానిపై మరింత లోతుగా డీపీఆర్‌ రూపొందించాలని కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు సూచించినట్టు సమాచారం.భూ సేకరణ, ప్రాజెక్టు కాస్ట్‌పై కూడా శిస్ర్టా సంస్థ నివేదిక ఇవ్వనుంది.
Link to comment
Share on other sites

మెట్రో.. రెండు విధాలు
చర్చిస్తున్న అధికారుల బృందం
మరో మూడు నెలల్లో డీపీఆర్‌ సిద్ధం
ఈనాడు, అమరావతి
kri-top2a.jpg
విజయవాడ నగరం, రాజధాని అమరావతిలను అనుసంధానిస్తూ నిర్మించే మెట్రో ప్రాజెక్టు కొంతభాగం ఆకాశమార్గంలోనూ, కొంతభాగం రహదారి మీద నిర్మాణం చేయాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇప్పటికే మనుగడలో ఉన్న నగరం విజయవాడలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేయాలని, రాజధాని అమరావతి ప్రాంతంలో మెట్రో కారిడార్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సవివర నివేదిక తయారు చేస్తున్న సిస్ట్రా సంస్థ తన ప్రాథమిక మధ్యంతర నివేదికను అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు అందజేసింది. ఈ మధ్యంతర నివేదికపై మెట్రో అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ఈ ప్రాజెక్టుకు రుణం అందిస్తున్న జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు మంగళవారం సమావేశమై సమీక్షించారు. మెట్రో ప్రాజెక్టుపై పూర్తి స్థాయి నివేదిక, ప్రాజెక్టు సవివర నివేదికను (డీపీఆర్‌) త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. సిస్ట్రా-రైట్స్‌ సంస్థల ప్రతినిధులు గత నాలుగు నెలలుగా విజయవాడలో మకాం వేసి తేలికపాటి మెట్రోపై అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ స్వరూపం..! తాజా ప్రతిపాదనలతో మెట్రో స్వరూపం మారిపోయింది. పీఎన్‌బీ బస్టాండు నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు. బందరు రోడ్డులో మార్పు లేదు. మరో కారిడార్‌ జక్కంపూడి వరకు నిర్మాణం చేస్తారు. రాజధాని అమరావతికి వెళ్లే కారిడార్‌ కృష్ణా కాలువ కూడలి వరకు నిర్మాణం చేస్తారు. ఈ నాలుగు కారిడార్‌లు ఎలివేటెడ్‌ తరహాలో ) ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే నగరం విస్తరించడం వల్ల ప్రస్తుతం తేలికపాటి మెట్రో ఏర్పాటు చేసుకున్నా.. భవిష్యత్తులో మెట్రోగా మార్పు చేసే అవకాశం ఉంది. ఇక కేసీ జంక్షన్‌ నుంచి రాజధానికి ఒక కారిడార్‌ నిర్మాణం చేయాలని తాజాగా ప్రతిపాదించారు. ఇక్కడ ఆరు వరసల రహదారి విశాలంగా ఉండటంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ కాకుండా రోడ్డు మీద (ఎట్‌గ్రిడ్‌) మెట్రో  ట్రాక్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.  ప్రస్తుతం రాజధాని రహదారులపై అంతగా ట్రాఫిక్‌ ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనివల్ల ఖర్చు తగ్గుతందని నిపుణులు తమ అభిప్రాయం వెల్లడించారు. మధ్యంతర నివేదికపై పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్‌, ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణా రెడ్డి, కృష్ణా జిల్లా ఇంఛార్జి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, వీఎంసీ కమిషనర్‌ నివాస్‌లు రుణం అందించే కెఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులతోనూ, సిస్ట్రా బృందంతోనూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మధ్యంతర నివేదికపై చర్చించి సాధ్యాసాధ్యాలు పరిశీలించారు. రహదారిపై ట్రాక్‌ నిర్మాణం సీఎం అంగీకరిస్తారో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతస్థాయి బృందం మరో రెండు రోజులు చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే పీపీపీ పద్ధతిలోనే నిర్మాణం చేపట్టనున్నారు.

త్వరలో డీపీఆర్‌..! మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సవివర నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందించనున్నామని ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రస్తుతం సిస్ట్రా సంస్థ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించామని, రాజధాని ప్రాంతంలో ఎట్‌గ్రిడ్‌ తరహాలో నిర్మాణం చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. మరో మూడు నెలల్లో డీపీఆర్‌ అందుతుందని ‘ఈనాడు’ వద్ద ఆశాభావం వ్యక్తం చేశారు.

 
 

 

Link to comment
Share on other sites

  •  
 
 
గన్నవరం-అమరావతి మెట్రో కారిడార్‌
తొలి దశలో ఏర్పాటుకు ప్రతిపాదన
  డీపీఆర్‌ రూపకల్పనలో సిస్ట్రా
27ap-state9a.jpg
ఈనాడు, అమరావతి: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని చేరేందుకు మెట్రో కారిడార్‌ నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మొదటి దశలోనే దీని నిర్మాణం పూర్తి కావాలని పురపాలక మంత్రి పి.నారాయణ అభిప్రాయపడ్డారు. దాదాపు 42 కిలోమీటర్ల దూరం ఉండే ఈ దశలో తేలికపాటి మెట్రో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్‌ కొంత భాగం గాలిలోనూ(ఎలివేటెడ్‌), మరికొంత భూమిమీద నిర్మించే అవకాశాలున్నాయి. విజయవాడ నగరంలో మెట్రో నిర్మాణానికి మరోసారి డీపీఆర్‌ను జర్మనీకి చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థ సంయుక్తంగా తయారుచేస్తున్న విషయం తెలిసిందే. సిస్ట్రా సంస్థ తమ మధ్యంతర నివేదికను అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు అందించింది. దీనిపై సచివాలయంలో బుధవారం మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. మొదటి దశలోనే గన్నవరం నుంచి అమరావతికి కారిడార్‌ నిర్మించాలని అభిప్రాయపడ్డారు. రెండో దశలో మెట్రోను అమరావతికి పొడిగించాలని, గుంటూరుకు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనిపై మంత్రి నారాయణ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కరికాలవలవన్‌, ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి, సిస్ట్రా ప్రతినిధులు, జర్మనీకి చెందిన రుణ సంస్థ కెఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులతో చర్చించారు. ముందుగా ఒక వరుస మెట్రో ట్రాక్‌ను గన్నవరం నుంచి అమరావతికి నిర్మించాలని మంత్రి సూచించారు. జక్కంపూడిలో ఆర్థిక నగరం నిర్మిస్తున్నందున మెట్రోకు ప్రాధాన్యం ఉందని, దీన్ని రెండో దశలో ఏర్పాటుచేయవచ్చని అభిప్రాయపడ్డారు. బందరు కారిడార్‌ కూడా అవసరమైతే నేలమీద ఏర్పాటుచేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.

కేంద్రం నిర్వాకంతో జాప్యం..
కేంద్రం నిర్వాకంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మెట్రోకు డీపీఆర్‌ సమర్పించినా స్పందించకుండా రెండేళ్ల తరువాత కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పడం కేంద్ర అనుచిత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

Link to comment
Share on other sites

నవ్యాంధ్ర రాజధానిలో లైట్ మెట్రో రైలు నిర్మాణంపై సంచలన నిర్ణయం
28-06-2018 08:17:28
 
636657706494558395.jpg
  • 65 కిలోమీటర్ల స్వరూపం
  • పెరిగిన 38 కిలోమీటర్ల నిడివి
  • కారిడార్ల పొడిగింపుతో పెరగనున్న వ్యయం
  • మల్టీ మెట్రో విధానంలో కొంతమేర తగ్గనున్న ఖర్చు
  • రూ.8కోట్లతో డీపీఆర్‌ చేయిస్తున్న కేఎఫ్‌డబ్ల్యూ
  • టీమ్‌కు సత్కారం
ఆంధ్రజ్యోతి, విజయవాడ: విజయవాడ నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు మహా విస్తరణ రూపం దాల్చుతోంది. మధ్యంతర డీపీఆర్‌లో శిస్ర్టా సంస్థ సమర్పించిన కారిడార్ల నిడివి 65 కిలోమీటర్లుగా ఉండబోతోంది. కిందటిసారి మీడియం మెట్రో ప్రాజెక్టులో ప్రతిపాదించిన రెండు కారిడార్ల నిడివి 27 కిలోమీటర్లు. గతంలో ప్రతిపాదించిన కారిడార్ల నిడివికి అదనంగా 38 కిలోమీటర్లు ప్రస్తుతం పెరుగుతోంది. ప్రస్తుత లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదించిన నాలుగు కారిడార్ల నిడివి 65 కిలోమీటర్లుగా ఉంది. కిందటిసారి ప్రతిపాదించిన కారిడార్ల నిడివి కంటే రెట్టింపు కావడం విశేషం! ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సమక్షంలో శిస్ర్టా ప్రతినిధులు బుధవారం ప్రకటించారు.
 
నాలుగు కారిడార్లు
శిస్ర్టా ప్రతిపాదించిన కారిడార్లలో 1).విజయవాడ అంతర్జాతీ య విమానాశ్రయం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ -పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్‌, 2).పీఎన్‌బీఎస్‌-కృష్ణా కెనాల్‌ జంక్షన్‌- అమరావతి, 3). పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి పెనమలూరు సెంటర్‌, 4). జక్కంపూడి-బీఆర్‌టీఎస్‌ రోడ్డు-ఏలూరు రోడ్డు ఉన్నా యి. గతంలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల నిడివి 27 కిలోమీటర్లు ఉంది. ఏలూ రు రోడ్డు కారిడార్‌లో నిడమా నూరు నుంచి గన్నవ రం విమానాశ్రయం వరకు అద నంగా 14 కిలోమీటర్లు, జక్కం పూడి నుంచి మరో 13 కిలోమీ టర్లు, పీఎన్‌బీఎస్‌ నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్‌- అమరావ తికి మరో 11 కిలోమీటర్లు పెరుగుతోంది.
 
శిస్ర్టా ప్రతిపాదించిన కారిడార్ల నిడివి పెరుగుతున్న నే పథ్యంలో, దీనికయ్యే వ్యయం కూ డా అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్య యాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటి కే కొంత భూమిపై కారిడార్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మెట్రో పట్ల ఎక్కువమందిని ఆకర్షితులను చే యటానికి, వ్యయాన్ని తగ్గించుకోవటానికి మల్టీ మెట్రో విధానాన్ని అమలు చేయాలన్న దానిపై మంగళవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. శిస్ర్టా ప్రతిపాదించిన నాలుగు కారిడార్లలో ఎయిర్‌పోర్టు నుంచి బస్‌స్టేషన్‌, బస్‌ స్టేషన్‌ నుంచి అమరావతి వరకు రెండు కారిడార్లతో పాటు పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు స్టేషన్‌ వరకు బందరు రోడ్డు కారిడార్‌ను చేపట్టడానికి దాదాపు నిర్ణయించారు. జక్కంపూడి కారిడార్‌ను సెకండ్‌ ఫేజ్‌ జాబితాలో చేర్చారు. దీంతో లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టులో పనులు మొత్తం 65 కిలోమీటర్ల నిడివిలో 52 కిలోమీటర్ల మేర ప్రారంభించటానికి అవకాశం ఉంటుంది.
 
పెరగనున్న మెట్రో స్టేషన్‌లు
మీడియం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 24 మెట్రోస్టేషన్లను ప్రతిపాదించారు. పీఎన్‌బీఎస్‌లో ప్రధాన స్టేషన్‌ నిర్మించాలని నిర్ణయించారు. తాజాగా లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి కిలోమీటర్‌కు ఒక మెట్రోస్టేషన్‌ నిర్మించాల్సి ఉంటుంది. అంటే 65 కిలోమీటర్లుకు గాను 64 మెట్రోస్టేషన్ల నిర్మాణం చేపట్టాలి. 65వ స్టేషన్‌గా ప్రధాన స్టేషన్‌ ఉంటుంది. లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన స్టేషన్‌ను కూడా పీఎన్‌బీఎస్‌ ఎదుట జాతీయ రహదారిపై నిర్మించాలన్న ఆలోచనలోనే ఉన్నారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు సాగించటానికి వీలుగా గ్రౌండ్‌ఫ్లోర్‌ వదిలేస్తారు. ఎలివేటెడ్‌ విధానంలో ఫ్లై ఓవర్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌కు కనెక్ట్‌ అవుతుంది. మెట్రో రైలు రాగానే ఫస్ట్‌ఫ్లోర్‌లోకి వస్తుంది. సెకండ్‌ ఫ్లోర్‌ను కమర్షియల్‌గా ఉపయోగిస్తారు.
 
మూడు నెలల్లో డీపీఆర్‌ పూర్తి కావాలి: మంత్రి నారాయణ
మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను శిస్ర్టా సంస్థ మూడు నెలల్లో పూర్తిచేయాలని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిస్తున్న కేఎఫ్‌డ బ్ల్యూ టెక్నికల్‌ టీమ్‌, శిస్ర్టా టీమ్‌లు బుధవారం మంత్రిని కలిశారు. మధ్యంతర డీపీఆర్‌ను వారికి వివరించారు. మధ్యంతర డీపీఆర్‌ పట్ల మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. పూర్తి డీపీఆర్‌ను మూడు నెలల్లో పూర్తిచేయాలని సూచించారు. అనంతరం రూ.8కోట్లు వెచ్చించి లైట్‌మెట్రో డీపీఆర్‌కు కృషిచేస్తున్న కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులను ఆయన సన్మానించారు.
 
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారుచేసి కేంద్రానికి సమర్పించినా రెండేళ్ల పాటు కేంద్రప్రభుత్వం తాత్సారం చేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశా రు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన మెట్రో పాలసీ తీసుకువస్తున్నామంటూ రెండేళ్ల తర్వాత కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు ఇది నిదర్శనమన్నారు. మూడునెలల్లో లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ తయారుచేసి కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు 8 కోట్ల సొంతనిధులు వెచ్చిస్తున్న సంస్థలను మంత్రి అభినందించి.. ప్రాజెక్టుబాధ్యతల్లో ఆ సంస్థ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు.
Link to comment
Share on other sites

విజయవాడలో నేలమీదనే లైట్‌ మెట్రో రైల్‌..!
04-07-2018 08:20:59
 
636662892599767224.jpg
  • ఎంజీ రోడ్డుపై .. ఎర్త్‌ గ్రేడ్‌ మెట్రో !
  • మల్టీ మెట్రోపై.. ఫీల్డ్‌ సర్వే
  • ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద నూతన సాంకేతిక విధానం
  • మెట్రో రైలు వచ్చేటప్పుడు..
  • వాహనాలు నిలిచిపోవడానికి సిగ్నల్స్‌ బ్రేక్‌
 
విజయవాడ : నగర అందాలు చెడకుండా, మహాత్మాగాంధీ (ఎంజీ) రోడ్డుపై నేలపై వెళ్లేలా ఎర్త్‌ గ్రేడ్‌ మెట్రో అయితే బాగుంటుందని మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. బందరు రోడ్డుపై ఎలివేటెడ్‌ మెట్రో వల్ల బ్యూటీ దెబ్బతింటుందని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. భూమిపై ఏర్పాటుచేస్తేనే ప్రయాణికులకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మల్టీ మెట్రోపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం షురూ అయింది ! లైట్‌ మెట్రో రైల్‌కు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న శిస్ర్టా బృందంతో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.
 
 
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రజాదరణ పొందేలా చేయడానికి కారిడార్లలో ఎలివేటెడ్‌, ఎర్త్‌ గ్రేడ్‌ విధానాలను పరిశీలించారు. మల్టీ మెట్రో ఫీజుబిలిటీపై నిపుణులతో పర్యవేక్షించారు. బందరురోడ్డుపై నేలమీదనే లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు వెళితే బాగుంటుందని శిస్ర్టా బృందం చెప్పినట్టు సమాచారం. బందరు రోడ్డు 100 అడుగుల నిడివితో ఉంది. విశాలంగా ఉన్న రోడ్డుపై నేల మీద లైట్‌ మెట్రో ఏర్పాటు చేయటానికి ఇబ్బందిలేదని, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
బందరు రోడ్డు సుందరీకరణ చెడకుండా ఉండాలంటే నేలపై ఏర్పాటుచేస్తేనే బాగుంటుందని తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉండటం సత్వర రవాణాకు ప్రతిబంధకంగా ఉండే అవకాశం ఉంటుందన్న అంశాన్ని వీరు గుర్తించారు. వీటికి అనుగుణంగా లైట్‌ మెట్రో నడిపించటానికి వీలయ్యే సాంకేతిక విధానం అమల్లో ఉందని శిస్ర్టా ప్రతినిధులు చెప్పినట్టు తెలుస్తోంది. స్థానిక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను, లైట్‌ మెట్రో సిగ్నల్స్‌ను అనుసంధానించడం ద్వారా లైట్‌ మెట్రోరైలు వచ్చే సమయంలో రూట్‌ క్లియరెన్స్‌ కోసం మిగిలిన వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయేలా ట్రాఫిక్‌ వ్యవస్థను తీసుకు రావచ్చని భావిస్తున్నారు. అంతిమనిర్ణయం ఏమిటన్నది తుది డీపీఆర్‌లో కానీ వెలుగు చూసే అవకాశం లేదు.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

E1tuGIW.jpgv1E2y9B.jpg

విజయవాడలో నేలమీదనే లైట్‌ మెట్రో రైల్‌..!

edi chese badulu metro mani dobbithe pothunndi ga, unna roads ni kuda gabbu cheyytam enduku thuuu.. edi chethe vijayawada roads meda narakam chudli, mana janala ki unna traffic sense ki gabbu lesthundiii !!

Link to comment
Share on other sites

బందరు రోడ్డు మీదనే మెట్రో రైలు..!
రహదారి వెడల్పు ఉండటంతో కొత్తగా తెరమీదకు
మరోసారి మారిన ప్రతిపాదనలు
మూడు నెలల్లో డీపీఆర్‌
ఈనాడు, విజయవాడ
amr-top1a.jpg
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన విజయవాడ మెట్రో ప్రాజెక్టు రోజుకో రూపు సంతరించుకుంటుంది. కేంద్ర సహాయ నిరాకరణ చేసిన తర్వాత మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. భిన్న అధ్యయనాల తర్వాత తేలికపాటి మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీని కోసం తయారవుతున్న సవివర నివేదిక (డీపీఆర్‌) రోజుకో రూపు సంతరించుకుంటుంది. సవివర నివేదిక తయారు చేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ ఇటీవల మధ్యంతర నివేదికను అందించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం వద్ద సమీక్ష జరిగింది. తాజాగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం జర్మనీకి చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థతో కలిసి డీపీఆర్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ప్రతిపాదించిన రెండు కారిడార్లు కాకుండా పరిధిని విస్తృతం చేసింది. నాలుగు కారిడార్లు చేపట్టాల్సి ఉంది. తాజాగా బందరు రోడ్డులోనూ ఎర్త్‌గ్రేడ్‌ (భూమ్మీద ట్రాక్‌) కారిడార్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదించింది.

గతంలో బస్టాండు నుంచి నిడమానూరు, బస్టాండు నుంచి పెనమలూరు వరకు రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని దిల్లీమెట్రోరైలు కార్పొరేషన్‌ ప్రతిపాదించింది. దీని ఎలివేటెడ్‌ సివిల్‌ నిర్మాణాలకు టెండర్లను కూడా పిలిచింది. కొంతకాలం తర్వాత వాటిని రద్దు చేసింది. అయితే ప్రస్తుతం తయారవుతున్న డీపీఆర్‌లో ఏలూరు రోడ్డులో మెట్రో ఎలివేటెడ్‌ కారిడార్‌పై తిరుగుతుంది. కానీ బందరు రోడ్డులో మాత్రం భూమ్మీదనే తిరుగుతుంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కిలోమీటరుకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. భూమ్మీద ఈ ఖర్చు ఉండదు. కేవలం ట్రాక్‌ నిర్మాణం చేస్తారు. ఈ ట్రాక్‌పై సరికొత్త మెట్రో కోచ్‌లు తిరుగుతాయి. స్టేషన్ల ఏర్పాటు అనుకూలంగా ఉంటుంది.
* బందరు రోడ్డులో ప్రస్తుతం పెనమలూరు వరకు కారిడార్‌ ప్రతిపాదించారు. దాదాపు 14 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది.
* బెంజి సర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ వరకు రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో రహదారి వెడల్పు 32 మీటర్లు పైగా ఉందని గుర్తించారు. దీనిపై రోడ్డు మీద మెట్రో కారిడార్‌ నిర్మాణం చేయవచ్చని చెప్పారు.
* మెట్రో కారిడార్‌కు రెండు వరసల ట్రాక్‌ నిర్మాణానికి 6.4 మీటర్ల వెడల్పు సరిపోతుంది. ఒక ట్రాక్‌ కోసం 3.2 మీటర్ల వెడల్పు సరిపోతుంది. అంటే బందరు రహదారి 32 మీటర్ల వెడల్పు ఉన్నందున ఎలివేటెడ్‌ అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. బెంజిసర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ గేట్‌ వరకు మాత్రం ఎలివేటెడ్‌ నిర్మాణం చేయాల్సి ఉంటుందని ఎండీ అభిప్రాయపడుతున్నారు.
* దీని వల్ల కనీసం రూ. వెయ్యి కోట్ల వరకు ఆదా కానుందని అంచనా. దీంతో ఎర్త్‌గ్రేడ్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టనున్నారు.‌
* ఏలూరు రహదారిలో కేవలం 15 మీటర్లు, 20 మీటర్ల వెడల్పుతోనే రహదారి ఉంది. దీంతో ఈప్రాంతంలో ఎర్త్‌గ్రేడ్‌ నిర్మాణం చేయడానికి అవకాశం లేదు. దీంతో తప్పనిసరిగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేయనున్నారు. నిడమానూరు వరకు ఇదే ఉంటుంది. అక్కడి నుంచి గన్నవరం వరకు ఎర్త్‌గ్రేడ్‌ నిర్మాణం చేయాలా లేక ఎలివేటెడ్‌ అనేది నిర్ణయించాల్సి ఉంటుంది.

జక్కంపూడి రెండో దశలోనే..!
జక్కంపూడి కారిడార్‌కు ప్రస్తుతం ట్రాఫిక్‌ సరిపోయే అవకాశం లేదని భావిస్తున్నారు. దీన్ని రెండో దశలో చేపట్టాలని నిర్ణయించినట్లు మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మొదటి దశలో గన్నవరం నుంచి నేరుగా అమరావతికి నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. కేసీ జంక్షన్‌ వరకు నిర్మాణం చేసి అక్కడి నుంచి ఎర్త్‌గ్రేడ్‌ ద్వారా అమరావతికి ట్రాక్‌ నిర్మాణం చేయనున్నారు.

 
 

 

 

 
Link to comment
Share on other sites

విజయవాడ మల్టీ మెట్రో ఇలా ఉండబోతోంది..!
07-07-2018 08:00:47
 
636665472483684671.jpg
  • బందరు రోడ్డులో సెంట్రల్‌ డివైడర్‌ తొలగింపు
  • కంట్రల్‌రూమ్‌ టూ బెంజిసర్కిల్‌.. నేలపైనే మెట్రో
  • ఎయిర్‌పోర్టు వయా ఏలూరు రోడ్డు, బెంజిసర్కిల్‌ టూ సిద్ధార్థ కళాశాల వరకు ఫ్లైఓవర్లపై..
  • నెలాఖరుకు రిపోర్టు ఇవ్వనున్న శిస్ర్టా
  • అనంతరం హైలెవల్‌ కమిటీలో చర్చ
  • సీఎం చంద్రబాబుకు వివరించిన ఏఎంఆర్‌సీ ఎండీ
 
విజయవాడ: మల్టీ మెట్రో విజయవాడలో ఇలా ఉండబోతోంది..! కొద్ది రోజులుగా డీపీఆర్‌ రూపొందిస్తున్న శిస్ర్టా సంస్థతో పాటు ఏఎం ఆర్‌సీ అధికారుల అధ్యయనంలో ప్రాథమి కంగా కారిడార్లు ఎలా ఉండాలన్న దానిపై అంచనాకు వచ్చారు. పోలీసు కంట్రోల్‌రూమ్‌ నుంచి బెంజిసర్కిల్‌ వరకు నేలపైనే మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నా రు. ప్రస్తుతం బందరు రోడ్డులో ఉన్న సెంట్రల్‌ డివైడర్‌ను తొలగించి, డివైడర్‌కు ఇరువైపులా 3.5 మీటర్ల చొప్పున స్థలాన్ని లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్‌కు ఉపయోగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బెంజిసర్కిల్‌ నుంచి పోలీసు కంట్రోల్‌రూమ్‌ వరకు బందరు రోడ్డు వెడల్పు 32 మీటర్లుగా ఉండటంతో సెంట్రల్‌ డివైడర్‌ తొలగించి నేలపైనే ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బందరు రోడ్డు ఇరువైపులా మూడు లేన్లతో ఉండటంతో ఒక్కో లేన్‌ లైట్‌ మెట్రో రైల్‌కు వెళుతుంది.
 
మిగిలిన రెండు లేన్ల మార్గంలో సాధారణ వాహనాలు తేలిగ్గా రాకపోకలు సాగిస్తాయని భావిస్తున్నారు. లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్‌ నేపథ్యంలో బందరు రోడ్డులో ఆటోలను పూర్తిగా నియంత్రించటం, ఆర్టీసీ బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించటం వల్ల మిగిలిన లేన్లపై ట్రాఫిక్‌ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత కార్లను ఉపయోగించే వారి విషయంలో కూడా ఎలాంటి మార్గదర్శకాలు తీసుకురావాలన్న దానిపై కూడా చర్చ సాగుతోంది. ప్రస్తుత ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను, లైట్‌ మెట్రో రైల్‌ సిగ్నల్స్‌తో అనుసంధానం చేసి ఒకే సిగ్నలింగ్‌ విధానం తీసుకురావటం ద్వారా రాకపోకలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. దీంతో పాటు మెట్రోస్టేషన్లను కూడా సెంట్రల్‌ డివైడర్‌ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలన్న భావనలో అధికారులు ఉన్నారు.
 
ఏలూరు రోడ్డులో ఫ్లైఓవర్‌పైనే
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేసరపల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు పూర్తిగా ఎలివేటెడ్‌ విధానంలోనే లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. ఏలూరు రోడ్డు ఎక్కడా కూడా 32 మీటర్ల వెడల్పుతో లేదు. కాబట్టి ఫ్లైఓవర్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు నేషనల్‌ హైవే కావటం, ప్రస్తుతం ఈ రోడ్డును విస్తరించటం సాధ్యం కాదు కాబట్టి ఈ మార్గంలో కూడా ఫ్లైఓవర్‌ విధానంలోనే మెట్రో కారిడార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
బెంజిసర్కిల్‌-సిద్ధార్థ వరకు ఫ్లైఓవరే..
బందరు రోడ్డు కారిడార్‌లో బెంజిసర్కిల్‌ నుంచి పెనమలూరు సెంటర్‌ వరకు ఏర్పాటు చేయాల్సిన కారిడా ర్‌ను కూడా పూర్తిగా ఫ్లైఓవర్‌ విధానంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ రోడ్డుపై నేలపై లైట్‌ మెట్రో కారిడార్‌ వేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉంటుందని అధికా రులు భావిస్తున్నారు. సిద్ధార్థ కళాశాల నుంచి రోడ్డును విస్త రించిన నేపథ్యంలో భవిష్యత్తులో అక్కడి నుంచి నేల మీద లైట్‌మెట్రో అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నారు.
 
సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనల వివరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి, శిస్ర్టా ప్రతినిథులు విజయవాడ లైట్‌ మెట్రో డీపీఆర్‌కు సంబంధించిన ప్రాథమిక వివరాలను వెల్లడించారు. మల్టీ మెట్రో విధానాల గురించి సీఎంకు వివరించారు. విస్తృత అధ్యయనం తర్వాత వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. దీంతో పాటు మరో మూడు నెలల్లో తుది డీపీఆర్‌ సిద్ధమవుతుందని వివరించారు.
 
 
నెలాఖరుకు...రిపోర్టు
ఈ నెలాఖరుకు మల్టీ మెట్రో కారిడార్లకు సంబంధించిన పూర్తి రిపోర్టును శిస్ర్టా సంస్థ అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు ఇవ్వనుంది. ఈ నివేదకను ఏఎంఆర్‌సీ అత్యున్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కమిటీలో మునిసిపల్‌ మంత్రి నారాయణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌, మునిసిపల్‌ కమిషనర్‌, పోలీసు కమిషనర్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు కూడా ఉంటారు. వీరందరూ చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...