Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

  • Replies 309
  • Created
  • Last Reply
లైట్‌ మెట్రో డీపీఆర్‌కు.. తుది రూపు!
04-03-2019 08:14:40
 
636872840810983168.jpg
  •  ఏఎంఆర్‌సీకి డ్రాఫ్ట్‌ అందజేత
  •  నేడు ఏఎంఆర్‌సీ, కేఎ్‌ఫడబ్ల్యూల డ్రాప్ట్‌ డీపీఆర్‌ పరిశీలన
  •  80 కి.మీ, మూడు కారిడార్లకు ప్రతిపాదనలు ఫ వ్యయ ప్రతిపాదనలతో నివేదిక
రాజధానినికి అత్యంత ప్రతిష్టాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫైనల్‌ డీపీఆర్‌ను అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కు కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ డ్రాఫ్ట్‌ రూపంలో అందజేసింది. ఈ డ్రాఫ్ట్‌ రిపోర్టును సోమవారం ఏఎంఆర్‌సీ, కేఎ్‌ఫడబ్ల్యూ సంస్థలు పరిశీలిస్తాయి. గతంలో ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్టు పరిశీలించిన హైలెవల్‌ స్టీరింగ్‌ కమిటీ పలు మార్పులు, సూచనలను చేసింది. ఆ మేరకు ఫైనల్‌ డీపీఆర్‌ సిద్ధమైంది.
 
విజయవాడ, మార్చి3 (ఆంధ్రజ్యోతి): లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫైనల్‌ డీపీఆర్‌ను అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌కు ‘శిస్ర్టా’ డ్రాఫ్ట్‌ రూపంలో అందజేసింది. దీనిని సోమవారం ఏఎంఆర్‌సీ, కేఎ్‌ఫడబ్ల్యూ సంస్థలు పరిశీలిస్తాయి. ప్రిలిమినరీ రిపోర్టు పరిశీలించిన హైలెవల్‌ స్టీరింగ్‌ కమిటీ పలు మార్పులు, సూచనలను చేసింది. ఆ మేరకు ఫైనల్‌ డీపీఆర్‌ సిద్ధమైంది. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు.. ఫైనల్‌ డీ పీఆర్‌లో ప్రధానంగా విజయవాడతో పాటు చెంతనే ఉన్న అమరావతి రాజధాని నగరాన్ని అనుసంధానించేలా దాదాపుగా 80 కిలోమీటర్ల నిడివితో కూడిన ప్లాన్స్‌ను అందించిన ట్టు తెలుస్తోంది. విజయవాడ పోర్షన్‌లో సింహభాగం లైట్‌ మెట్రోరైల్‌ కారిడార్‌ నిడివి ఉంది. మొత్తంగా మూడు కారిడార్లను శిస్ర్టా ప్రతిపాదించింది. వీటిలో ప్రధానంగా ఏలూరు రోడ్డు (కారిడార్‌-1), బందరు రోడ్డు (కారిడార్‌-2), జక్కంపూడి (కారిడార్‌-3)లు ఉంటాయి. కారిడార్‌-1 నిడివి చాలా పెద్దగా ఉంటుంది. ఏలూరు రోడ్డు మీదుగా వెళ్ళే ఈ కారిడార్‌-1 నిడివి 53.5 కిలోమీటర్లు! మొదట్లో ఈ కారిడార్‌ను గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అనుకున్నారు. ఎయిర్‌పోర్టు కంటే ముందు నుంచే లైన్‌ తీసుకు వస్తే బాగుంటుందన్న ఆలోచనను ఏఎంఆర్‌సీ అధికారులు చేశారు. గన్నవరం ఆర్టీసీ బస్‌స్టేషన్‌నుంచి 16వ నెంబర్‌ జాతీయ రహదారి మీదుగా ఈ కారిడార్‌ ప్రారంభమౌతుంది. ఎయిర్‌పోర్టుకు భూగర్భమార్గంలో ఈ కారిడార్‌ వెళుతుంది. తిరిగి ఎయిర్‌పోర్టు నుంచి భూగర్భ మార్గంలోనే బయటకు వస్తుంది. ఇక్కడ ఇంటర్‌ సెప్టెర్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విమానాశ్రయంలోకి వెళ్ళిన రైలు అదే ట్రాక్‌పై వెనక్కు రావటం కష్టం కాబట్టి.. ఈ ట్రాక్‌కు అనుసంధానంగా ఇంటర్‌సెప్టెర్‌ ట్రాక్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
అమరావతిలోకి ఇలా..
కేసరపల్లి మీదుగా నిడమానూరు, రామవరప్పాడురింగ్‌ చేరుకుని అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌కు అక్కడి నుంచి బస్‌స్టేషన్‌కు చేరుకుంటుంది. బస్‌స్టేషన్‌ నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ మీదుగా అమరావతిలోకి ప్రవేశిస్తుంది. రాజధానిలో లింగాయపాలెం వరకు ఈ కారిడార్‌ వస్తుంది. ఈ కారిడార్‌లో ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌ గ్రౌండ్‌ వస్తుంది. మిగిలిన చోట ఎలివేటెడ్‌ విధానంలో అంటే ఫ్లై ఓవర్‌పై ట్రాక్‌ వస్తుంది. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌నుంచి రాజధానిలోకి దాదాపుగా 24 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలోనే లైట్‌ మెట్రో ఉంటుంది. రెండవది పెనమలూరు కారిడార్‌ నిడివి మొత్తం 12 కిలోమీటర్లు. ఇది బందరు రోడ్డు మీదుగా పెనమలూరు సెంటర్‌ నుంచి బస్‌స్టేషన్‌ వరకు చేరుకుంటుంది. మూడవది జక్కంపూడి కారిడార్‌! జక్కంపూడికి రెండు ట్రాక్‌లు సమాంతరంగా వేయటానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. ఒకమార్గం 6.3 కిలోమీటర్లు, మరో మార్గం 8.2 కిలోమీటర్లుగా ఉన్నట్టు సమాచారం. ఈ కారిడార్‌లకు సంబంధించి దాదాపుగా 80 వరకు మెట్రోస్టేషన్లను ప్రతిపాదించినట్టు సమాచారం. రెండుచోట్ల ప్రధాన మెట్రో స్టేషన్లు వస్తాయి. విజయవాడలో పీఎన్‌బీఎ్‌స వద్ద ఒకటి, అమరావతిలోని లింగాయపాలెం దగ్గర మరొకటి చొప్పున ప్రధాన స్టేషన్లను నిర్మిస్తారు.
 
 
Link to comment
Share on other sites

విజయవాడ మెట్రో డీపీఆర్‌ ముసాయిదా సిద్ధం

 

మొత్తం 85 కి.మీ. తేలికపాటి మెట్రో
అంచనా వ్యయం రూ.17,500 కోట్లు
రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కేఎఫ్‌డబ్ల్యూ, ఐఎఫ్‌డీ సంస్థలు

ఈనాడు అమరావతి: పలు మలుపులు తిరిగిన విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఎట్టకేలకు సవివర నివేదిక (డీపీఆర్‌) ముసాయిదా సిద్ధమైంది. విజయవాడ నగరంలో రెండు దశల్లో తేలికపాటి మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థ డీపీఆర్‌ను తయారు చేశాయి. దీనిపై అభ్యంతరాలను, సూచనలను అమరావతి మెట్రోరైలు సంస్థ(ఏఎంఆర్‌సీ) తెలియజేయాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి లైట్‌ మెట్రో డీపీఆర్‌ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. విజయవాడ, అమరావతిలో కలిపి మొత్తం 85 కిలోమీటర్ల దూరం లైట్‌మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికిగాను సుమారు రూ.17,500 కోట్లు పైగా ఖర్చు కానుంది. తొలిదశలో విజయవాడ నగరంలో 38.5 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. విజయవాడ నగరంలో మెట్రో వ్యవస్థపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి తేలికపాటి మెట్రోకు సిఫార్సు చేసింది. దీనికి రుణాన్ని అందించేందుకు ఫ్రాన్స్‌, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, ఐఎఫ్‌డీ ముందుకొచ్చాయి. జర్మనీకి చెందిన మెట్రో నిపుణులతో కూడిన డాట్సన్‌ బృందం ప్రాథమిక నివేదిక అందించి తేలికపాటి మెట్రో అనువైందని తేల్చింది. దాదాపు ఏడాది తర్వాత ముసాయిదా నివేదిక సిద్ధమైంది. విజయవాడ, అమరావతి తేలికపాటి మెట్రోకు కిలోమీటరు వ్యయం రూ.200కోట్లుగా పేర్కొన్నారు. భూగర్భంలో కిలోమీటరు వ్యయం రూ.400 కోట్లుగా ఉంటుంది. లైట్‌మెట్రో ఆకాశంలో, నేలమీద, భూగర్భంలో ఉంటుంది. తొలిదశలో విజయవాడ నగరంలో రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. రెండో దశలో అమరావతి కారిడార్‌ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. జక్కంపూడి కారిడార్‌ నిర్మాణాన్ని ప్రభుత్వ నిర్ణయానికి వదిలేశారు. ప్రస్తుతం సిస్ట్రా అందించిన ముసాయిదాకు ఏఎంఆర్‌సీ మార్పులు, చేర్పులు తెలియజేయనుంది. అనంతరం దానిని స్టీరింగ్‌ కమిటీ ముందు ఉంచుతారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదానికి వెళుతుంది. మరో నెల రోజుల్లో విజయవాడ మెట్రో డీపీఆర్‌ ఆమోదం పొంది టెండర్లను పిలవనున్నట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు.

 

Link to comment
Share on other sites

రెండు దశల్లో.. లైట్‌.. రైట్‌
06-03-2019 08:53:53
 
636874592321434964.jpg
  • డీపీఆర్‌.. రూ.22,500 కోట్లు
  • మొదటి ఫేజ్‌లో విజయవాడ కారిడార్‌
  • రెండో ఫేజ్‌లో అమరావతి..
  • మదింపు ప్రారంభించిన ఏఎంఆర్‌సీ
విజయవాడ నగరాన్ని అమరావతి రాజధానితో అనుసంధానం చేసేలా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులు మంగళవారం మదింపు ప్రారంభించారు. మొదటి దశలో విజయవాడ పార్ట్‌, రెండవ దశలో అమరావతి పార్ట్‌ పనులను చేపట్టేందుకు వీలుగా ప్రణాళికలను అందజేసింది. డీపీఆర్‌కు సంబంధించి డ్రాఫ్టు రిపోర్టును పరిశీలిస్తున్నామని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ, అమరావతిలను 82.5 కిలోమీటర్ల మేర లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుతో అనుసంధానించేందుకు రూ.22,500 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్‌ను రూపొందించింది. విజయవాడ, అమరావతిలు కలిపి మొత్తం 52.5 కిలోమీటర్ల దూరం మేర ఎలివేటెడ్‌ మార్గం (రోడ్డుపై ఫ్లై ఓవర్‌ ట్రాక్‌)లోనూ, 30 కిలోమీటర్ల మేర పూర్తిగా అండర్‌ గ్రౌండ్‌ విధానంలోనూ లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ను అందజేసింది. ఎలివేటెడ్‌ విధానంలో నిర్మించే కారిడార్లకు సంబంధించి కిలోమీటర్‌కు రూ.200 కోట్లు, భూగర్భ మార్గంలో నిర్మించే కారిడార్‌కు కిలోమీటర్‌కు రూ.400 కోట్లు వ్యయం అవుతుందని నిర్ణయించింది. ఎలివేటెడ్‌ పోర్షన్‌లో రూ.10,500 కోట్ల వ్యయం, అండర్‌ గ్రౌండ్‌ పోర్షన్‌లో రూ.12 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.
 
ఫేజుల వారీగా పనులు
డీపీఆర్‌ ప్రకారం లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులను దశల వారీగా చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో విజయవాడ పార్ట్‌, రెండవ దశలో అమరావతి పార్ట్‌ పనులను చేపట్టేందుకు వీలుగా ప్రణాళికలను అందజేసింది. మొదటిదశలో విజయవాడ పార్ట్‌లో 38.5 కిలోమీటర్ల మేర రెండవదశలో 45.5 కిలోమీటర్ల మేర అమరావతిలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులు చేపట్టేలా నివేదికను అందజేసింది. దీని ప్రకారం మొదటి దశలో విజయవాడ పార్ట్‌లో చేపట్టబోయే లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులకు రూ. 8300 కోట్ల వ్యయం అవుతోంది. ఫేజ్‌- 2 లో చేపట్టబోయే అమరావతి పోర్షన్‌, విజయవాడలోని జక్కంపూడి పోర్షన్‌కు సంబంధించి రూ.14,200 కోట్ల వ్యయం అవుతుంది.
 
రెండే ప్రధాన కారిడార్లు
విజయవాడ, అమరావతిలను అనుసంధానం చేసేలా రెండు కారిడార్‌లకు మాత్రమే శిస్ర్టా సంస్థ నివేదిక అందించింది. కారిడార్‌ - 1ను విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి రామవరప్పాడు రింగ్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, రైల్వేస్టేషన్‌, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌, కృష్ణాకెనాల్‌ జంక్షన్‌, అమరావతికి 55.5 కిలోమీటర్ల మేర ప్రతిపాదించింది. కారిడార్‌ - 2 ను పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు 12.5 కిలోమీటర్ల ప్రతిపాదించింది. కారిడార్‌ - 3గా జక్కంపూడికి రెండు మార్గాలతో ఒకటి 6.3 కిలోమీటర్లు, రెండవది 8.2 కిలోమీటర్లతో ప్రతిపాదించింది.
 
జక్కంపూడికి అనుమానమే..
మూడవ కారిడార్‌లో సూచించిన విధంగా.. జక్కంపూడికి లైట్‌ మెట్రోరైల్‌ కారిడార్‌ అనుమానాస్పదంగానే ఉంది. జక్కంపూడి భవిష్యత్తులో ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో, ఈ ప్రాంతానికి కూడా లైట్‌ మెట్రో రైలును తీసుకు వెళ్లాలని ఏఎంఆర్‌సీ భావించింది. ఇంతవరకు బాగానే ఉన్నా శిస్ర్టా మాత్రం ప్రత్యామ్నాయ విధానాలను సూచించింది. మోనోరైల్‌, ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్‌ వంటి ఆప్షన్లను కూడా సూచించింది. ఈ నేపథ్యంలో జక్కంపూడికి లైట్‌ మెట్రో కారిడార్‌ వెళ్లేది అనుమానంగానే ఉంది.
 
ఫస్ట్‌ఫేజ్‌ పనులు ఇలా..
మొదటిదశ పనులు విజయవాడ పోర్షన్‌నే జరుగుతాయి. విజయవాడ పోర్షన్‌లో రెండు కారిడార్ల పనులు జరుగుతాయి. మొదటి కారిడార్‌ నిడివి 55.5 కిలోమీటర్ల పరిధిలో విజయవాడ పోర్షన్‌లోని మెగాసిటీ పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న గన్నవరం నుంచి నిడమానూరు మీదుగా రామవరప్పాడు రింగ్‌ వరకు అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్‌ వరకు, రైల్వేస్టేషన్‌ నుంచి బస్‌స్టేషన్‌ వరకు 26 కిలోమీటర్ల మేర మాత్రమే ముందుగా పనులు జరుగుతాయి. రెండవ కారిడార్‌ పనులు సమాంతరంగా బందరు రోడ్డు మీదుగా పెనమలూరు సెంటర్‌ నుంచి, పీఎన్‌బీఎస్‌ వరకు 12 కిలోమీటర్ల మేర జరుగుతాయి.
 
ఫేజ్‌ - 2 పనులు ..
రెండవ దశ పనులు సింహభాగం అమరావతిలో జరుగుతాయి. మొదటి కారిడార్‌లో పీఎన్‌బీఎస్‌ నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు నాలుగు కిలోమీటర్లు, అక్కడినుంచి లింగాయపాలెం వరకు 27 కలిపి మొత్తం 31 కిలోమీటర్ల మేర అమరావతి పరిధిలో ఫేజ్‌ - 2 పనులు జరుగుతాయి.
 
 
ఈ నెలాఖరులో సమీక్ష
ఈ నెలాఖరు నాటికి లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి స్టీరింగ్‌ కమిటీతో డీపీఆర్‌పై చర్చించే అవకాశం ఉంది. స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర పురపాలక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీఎంఆర్‌సీ ఎండీలతో పాటు కలెక్టర్‌, కమిషనర్‌, పోలీసు కమిషనర్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ తదితర ఇతర శాఖల అధికారులు కూడా ఉన్నారు. లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్‌కు సంబంధించి ఉచితంగా డీపీఆర్‌ రూపకల్పన చేయటానికి సహకరించిన జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిథుల సమక్షంలో కూడా దీనిపై చర్చించే అవకాశం ఉంది. కేఎఫ్‌డబ్ల్యూ నుంచి ఏమైనా సూచనలు వస్తే వాటిని కూడా ఏఎంఆర్‌సీ పరిగణనలోకి తీసుకుంటుంది.
 
 
ఎలివేటెడ్‌ విధానం ఎక్కడెక్కడ ?
ఫ్లై ఓవర్‌ మార్గంలో ట్రాక్‌ను ఏర్పాటు చేయటానికి ఎలివేటెడ్‌ విధానంలో సూచించిన మార్గాలను పరి శీలిస్తే.. కారిడార్‌ - 1లో గన్నవరం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 1.50 కిలోమీటర్‌, తిరిగి ఎయిర్‌పోర్టు బయట నుంచి నిడమానూరు, రామవరప్పాడు రింగ్‌, ఏలూరు రోడ్డు, రైల్వేస్టేషన్‌నుంచి బస్‌స్టేషన్‌ వరకు 21.50 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుంది. కారిడార్‌ - 2 లో పెనమలూరు సెంటర్‌ నుంచి బందరురోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌ వరకు 12.50 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ విధానంలో మార్గాన్ని అభివృద్ధి చేస్తారు.
 
 
భూగర్భ మార్గం
విజయవాడ పోర్షన్‌లో ఎయిర్‌పోర్టు లోపలి నుంచి బయటకు 3 కిలోమీటర్ల మేర వస్తుంది. తిరిగి ఫేజ్‌ - 2లో చేపట్టే అమరావతి పోర్షన్‌లో కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ నుంచి లింగాయపాలెం వరకు 27 కిమీ మేర వస్తుంది.
 
 
విద్యుత్‌ సరఫరా ఇలా..
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు విద్యుత్‌ సప్లై అందిం చటానికి వీలుగా 33కేవీ సబ్‌స్టేషన్లకు ప్రతి పాదించటం జరిగింది. గతంలో మీడియం మెట్రోకు సూచించిన గుణ దల, రాజీవ్‌గాంధీ సబ్‌స్టేషన్లనుంచి పవర్‌ తీసు కోవటంతోపాటు గన్నవరం సబ్‌స్టేషన్‌, అమరావతి సబ్‌ స్టేషన్ల నుంచి పవర్‌ తీసుకోవటానికి ప్రతిపాదించింది.
 
 
130 కోచ్‌ల ప్రతిపాదన
లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్లలో తిరుగాడటానికి వీలుగా మొత్తం 130 కోచ్‌లను కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టా ప్రతి పాదించింది. ఒక్కో ట్రైన్‌ రెండు కోచ్‌లను అమర్చేలా సూ చించింది. కోచ్‌కు 400మంది తేలిగ్గా ప్రయాణిం చగలరని సూచించింది. డిమాండ్‌ ఉంటే అదనపు కోచ్‌ లు ఏర్పాటు చేసుకోవచ్చు.
 
 
ప్రభుత్వం నిర్ణయిస్తుంది..
దీనిపై ఇంకా స్టీరింగ్‌ కమిటీలో చర్చించాలి. కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధు లతో కూడా చర్చిం చాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసు కువెళతాం. లైట్‌మెట్రో రైల్‌ను ఏవిధంగా ముం దుకు తీసుకువెళ్లాల న్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్రం 22శాతం వాటా ఇవ్వాల్సి ఉంది. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎక్స టర్నల్లీ ఎయిడెడ్‌ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉం టుంది కాబట్టి.. కేంద్రానికి కూడా పంపించటానికి అవకాశాలు ఉన్నాయి. లేదంటే విశాఖ తరహాలో ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు తీసుకు వెళ్లటానికి కూడా అవకాశం ఉంటుంది.
- ఎన్‌వీ రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ
Link to comment
Share on other sites

  • 1 month later...
లైట్‌ మెట్రో.. సెట్‌!
17-04-2019 07:58:28
 
636910847179950564.jpg
  • 29న శిస్ర్టా బృందం రాక !
  • ఏఎంఆర్‌సీతో సమావేశం.. ఫైనల్‌ డీపీఆర్‌ సమర్పణ
  • స్టీరింగ్‌ కమిటీతో సమావేశం
విజయవాడను అమరావతితో అనుసంధానించే లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును సెట్‌ చేసేందుకు ముహూర్తం త్వరలో ఖరారు కానుంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టా అత్యున్నత బృందం ఈ నెల 29న నగరానికి రానుంది. ఈ సంస్థ ఆ రోజున ఫైనల్‌ డీపీఆర్‌ను ఏఎంఆర్‌సీకి సమర్పించనుంది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో విజయవాడను అమరావతితో అనుసంధానించే లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును సెట్‌ చేసేందుకు మహూర్తం ఖరారు కాబోతోంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టా అత్యున్నత బృందం ఈ నెల 29న విజయవాడ నగరానికి రాబోతోంది. ప్రిలిమినరీ డీపీఆర్‌ను అందించిన శిస్ర్టా సంస్థ ఆ రోజున ఫైనల్‌ డీపీఆర్‌ను అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కీ సమర్పించబోతోంది. వారం రోజుల పాటు శిస్ర్టా బృందం విజయవాడలోనే ఉంటుంది. తుది డీపీఆర్‌ పై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేయనుంది. ఇప్పటికే ప్రిలిమనరీ నివేదికలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు స్వరూపం గురించి సోదాహరణంగా నివేదికను పొందుపరిచింది. మొత్తంగా 80 కిలోమీటర్ల నిడివితో మూడు ప్రత్యేక కారిడార్లను సూచించింది. జక్కంపూడి కారిడార్‌కు సంబంధించి మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించింది. ఈ ప్రాజెక్టును మొత్తం 20 వేల కోట్ల వ్యయ ప్రతిపాదనలను రూపొందించింది.
 
 
సాంకేతికంగా కూడా సమగ్ర రిపోర్టును అందచేసింది. ప్రీ ప్రిలిమినరీ రిపోర్టులో ఎలాంటి మార్పులకు అవకాశం లేకపోవటంతో తుది డీపీఆర్‌పై నిర్ణయం తీసుకోవటమే మిగిలి ఉంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శిస్ర్టా బృందం ముందుగా ఏఎంఆర్‌సీ అధికారులతో చర్చించిన మీదట అత్యున్నత స్టీరింగ్‌ కమిటీతో కూడా తర్వాత సమావేశమౌతారు. స్టీరింగ్‌ కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులంతా సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో లైట్‌ మెట్రోను స్వయంగా చేపట్టాలా? ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో చేపట్టాలా? కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టడానికి మళ్ళీ కేంద్రానికి నివేదించాలా? అన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్‌ అవుతుంది.
Link to comment
Share on other sites

లైట్‌ మెట్రో...పట్టాలెక్కేనా..! 
 

ఈనెల 29న డీపీఆర్‌ అందించనున్న సిస్ట్రా 
దూరం 85 కిలోమీటర్లు.. వ్యయం రూ.25వేల కోట్లు 
తొలి దశలోనే విజయవాడ నగరంలో రెండు కారిడార్లు

amr-gen1a_148.jpg

నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో మెట్రో రైలును పట్టాలెక్కించటానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) పట్టు విడవకుండా కసరత్తు చేస్తోంది. ప్రధాన సలహాదారు దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ పక్కకు తప్పుకున్నా ప్రాజెక్టు నివేదికలను తయారు చేయించడంలో ఏఎంఆర్‌సీ ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టుపై సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఈనెల 29న కన్సెల్టెన్సీ అందించనుంది. దీన్ని ప్రభుత్వానికి సమర్పించనున్నారు. దీని కోసం దాదాపు ఏడాది నుంచి కన్సెల్టెన్సీ సంస్థ సర్వేలు చేసింది.

ఈనాడు అమరావతి

డీపీఆర్‌ కోసం ఫ్రాన్సు దేశానికి చెందిన సిస్ట్రా సంస్థ భారత్‌కు చెందిన రైట్‌ సంస్థ భాగస్వామ్యంతో సవివర నివేదిక అందించేందుకు కాంట్రాక్టు పొందిన విషయం తెలిసిందే. ఈ సంస్థలు ఇటీవల మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ముసాయిదాను ఏఎంఆర్‌సీకి అందించింది. దీనిపై ప్రభుత్వం చర్చించి పలు సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, విజయవాడ నగరంలో జనాభా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రాజెక్టుకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ మరోవైపు మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సవివర నివేదికలు తయారు చేస్తున్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులు సైతం విజయవాడ మెట్రోపై అంతగా ఆసక్తి లేదని చెబుతున్నారు. ఈ కారణంతోనే భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. డీఎంఆర్‌సీ వెళ్లిన తర్వాత మెట్రో ప్రాజెక్టు వ్యవహారం పలు మలుపులు తీసుకుంది. రకరకాల ప్రయోగాలు తెరమీదకు వచ్చాయి. ప్రతిపాదనలు చేశారు. విస్తరణ ప్రణాళికలు రూపొందించారు. జర్మనీ, మలేషియా, చైనా దేశాలు పర్యటించారు. ఎట్టకేలకు తేలికపాటి మెట్రో నిర్మాణం చేయాలని, భవిష్యత్తులో మెట్రో ప్రాజెక్టుగా రూపాంతరం చేసుకోవచ్చని ప్రతిపాదించారు. నిపుణుల కమిటీ అధ్యయనం, పరిశీలన తర్వాత విజయవాడ నగరంలో రెండు దశల్లో తేలికపాటి మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి ఫ్రాన్సుకు చెందిన సిస్ట్రా భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థతో కలిసి సవివర నివేదికను తయారు చేసే బాధ్యత అప్పగించారు. వాస్తవానికి మూడు నెలల్లో ఇవ్వాల్సిన నివేదిక దాదాపు ఏడాది పైగా కాలం పట్టింది. మధ్యలోనే పలు ప్రతిపాదనలు వెలుగు చూశాయి. డీపీఆర్‌ పై అభ్యంతరాలను, సూచనలను ఏఎంఆర్‌సీ తెలియజేయాల్సి ఉంది. గత నెలలో డీపీఆర్‌ ముసాయిదాను ఏఎంఆర్‌సీకి అప్పగించగా కొన్ని సూచనలు చేసింది. ఈనెల 29న పూర్తి నివేదిక డీపీఆర్‌ను సిస్ట్రా సంస్థ అందించనున్నట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. ఈ డీపీఆర్‌ ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. మొత్తం విజయవాడ, అమరావతిలో కలిపి 85 కిలోమీటర్ల దూరం లైట్‌మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయంచారు. దీనికిగాను సుమారు రూ.17,500 కోట్ల నుంచి 25వేల కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా. తొలి దశలో విజయవాడ నగరంలో 38.5 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు.

తొలి దశలో  ఇలా..! 
విజయవాడ నగరంలో మెట్రో వ్యవస్థపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి విదేశాల్లో పర్యటించిన తేలికపాటి మెట్రోకు సిఫార్సు చేసింది. దీనికి రుణాన్ని అందించేందుకు ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, ఐఎఫ్‌డీ ముందుకొచ్చాయి. జర్మనీ దేశానికి చెందిన మెట్రో నిపుణులు డాట్సన్‌ బృందం పర్యటించి ప్రాథమిక నివేదిక అందించి తేలికపాటి మెట్రో అనువైందని తేల్చారు. దీనికి డీపీఆర్‌ కోసం రుణ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ రూ.10 కోట్లు అందిస్తోంది. దీనికికి గాను సిస్ట్రా సంస్థను ఎంపిక చేశారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ దాదాపు ఏడాది తర్వాత డీపీఆర్‌ అందిస్తోంది. దీనికి మార్పులు చేర్పులు ఉండవచ్చు.

విజయవాడ, అమరావతిలో మొత్తం 85 కిలోమీటర్ల దూరం మెట్రోకు ప్రతిపాదనలు అందించింది. కిలోమీటరు వ్యయం రూ.200కోట్లుగా పేర్కోంది. భూగర్భంలో కిలోమీటరు వ్యయం రూ.400 కోట్లుగా ఉంటుంది. లైట్‌మెట్రో ఆకాశంలో, నేలమీద, భూగర్భంలో ఉంటుంది. 
తొలిదశలో విజయవాడ నగరంలో రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. రెండో దశలో అమరావతి కారిడార్‌ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. జక్కంపూడి కారిడార్‌ నిర్మాణం ప్రభుత్వ నిర్ణయానికి వదిలివేశారు. 
గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు కారిడార్‌ 26 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో గన్నవరం విమానాశ్రయం సమీపంలో భూగర్భంలో నిర్మాణం చేస్తారు. 3 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. దీనిలో ఒక స్టేషన్‌ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విమానాశ్రయం వద్ద వాహనాల రద్దీ, జాతీయ రహదారి ఉండటం వల్ల భూగర్భంలో నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. * మరో కారిడార్‌ పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు బందరు రహదారిపై ఉంటుంది. ఇది ఎలివేటెడ్‌ కారిడార్‌గా ఉంటుంది. దీని దూరం 12.5 కిలోమీటర్లు ఉంటుంది. 
ఈ రెండు కారిడార్లలో మొత్తం 21 స్టేషన్లు ఒక భూగర్భ స్టేషన్‌ ఉంటుంది. ఒక్క స్టేషన్‌ నిర్మాణానికి సుమారు రూ.25 కోట్లు అవుతుందని అంచనా వేశారు. భూగర్భ స్టేషన్‌ నిర్మాణం రూ.30కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 
రెండో దశలో పీఎన్‌బీఎస్‌ నుంచి అమరావతికి 27.5 కిలోమీటర్ల దూరం కారిడార్‌ ఉంటుంది. కృష్ణా కాలువ జంక్షన్‌ మీదుగానే వెళ్తుంది. అమారవతి పరిధిలో దాదాపు 5 కి.మీ ఆకాశంలో, 15 కి.మీ వరకు భూగర్భంలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. మిగిలిన కారిడార్‌ ఎలివేటెడ్‌గానే ఉంటుంది. 
అమరావతి కారిడార్‌లో 32 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఒకటి భూగర్భంలో ఉంటుంది. మొత్తం అన్ని స్టేషన్లు కలిపి 60 వరకు ఉంటాయని ఎండీ రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. వీటిలో కొన్ని మార్పులు ఉండవచ్చని అంటున్నారు. 
ఈ ట్రాక్‌పై 2కార్‌ కోచ్‌లు నడుపుతారు. గన్నవరం వద్ద కోచ్‌డిపో ఏర్పాటు చేస్తారు. దాదాపు 400 నుంచి 450 మంది ప్రయాణం చేసే సామర్థ్యం ఈ కార్లకు ఉంటుంది. 
జక్కంపూడి వరకు ఉన్న కారిడార్‌ వలయ రూపంలో నిర్మాణం చేస్తారు. అక్కడ ఆర్థిక నగరం ఏర్పాటు అవుతున్నందున దాదాపు 16 కిలోమీటర్ల మేరకు ఈ వలయ కారిడార్‌ ఉంటుంది. అయితే ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్‌ ప్రతిపాదన చేశారు. లేదా ఎర్త్‌గ్రేడ్‌ కారిడార్‌ మరో ప్రతిపాదన చేశారు. 
ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పీపీపీ పద్ధతిలో చేపట్టాలా.. లేక కేంద్రం నుంచి 20శాతం నిధుల కోసం మరోసారి దరఖాస్తు చేయాలా అనేది నిర్ణయించాల్సి ఉంది.  * సిస్ట్రా అందించిన ముసాయిదాకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌, ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ రిమార్కులు తెలియచేసిన తర్వాత స్టీరింగ్‌ కమిటీ ముందు ఉంచారు. తర్వాత ప్రభుత్వానికి పంపారు. మొత్తం డీపీఆర్‌ అందించాలని ప్రభుత్వం సూచింది. ఈలోగా  ఎన్నికలు వచ్చాయి.

ప్రాధమ్యాలు ఏమిటో..? 
ప్రస్తుతం ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్టీరింగ్‌ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. ప్రస్తుతం విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య ఉంది. మెట్రో ఆవశ్యకతకు ఇంకా సమయం ఉందనే అభిప్రాయం ఉంది. విశాఖ మెట్రో నిర్మాణం ముందడుగు వేసింది. ఏఎంఆర్‌సీ ఆధ్వర్యంలోనే పర్యవేక్షిస్తున్నారు. దీంతో విజయవాడ మెట్రోపై ఎలాంటి నిర్ణయం ఉంటుందనే ఆసక్తి నెలకొంది. మెట్రో డీపీఆర్‌పై ఎండీ రామకృష్ణారెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా ఈనెల 29న సిస్ట్రా సంస్థ డీపీఆర్‌ అందించే అంశం వాస్తవమేనన్నారు. తాను 29వ తేదీ తర్వాతే ఏదైనా మాట్లాడగలనని ఇంకా తనకు వివరాలు తెలియవని చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...