Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

  • Replies 309
  • Created
  • Last Reply

కొత్త మెట్రో విధానం అమలు కష్టం

ప్రైవేటు భాగస్వాములు ముందుకురారు

విజయవాడలో లైట్‌మెట్రోకి వెళ్లడం అవివేకం

విశాఖ మెట్రో మరింత ఆలస్యమయ్యే అవకాశం

హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే

‘ఈనాడు’తో మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌

ఈనాడు - దిల్లీ

17ap-main10a.jpg

విజయవాడకు మెట్రో స్థానంలో లైట్‌రైల్‌ టెక్నాలజీ విధానాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. లైట్‌రైల్‌ విధానం అంటే ట్రామ్‌ వే లాగా ఉంటుంది., అటువైపు మళ్లడం అవివేకమే. ఇప్పటికే ఆమోదం పొందిన మెట్రోరైల్‌ ప్రాజెక్టుకే ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. విజయవాడ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో ఉండటం, చంద్రబాబుకున్న రాజకీయ పలుకుబడి దృష్ట్యా సాధారణ మెట్రో ప్రాజెక్టు అక్కడ చేపట్టడానికి అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త మెట్రో విధానం కింద కొత్తగా ప్రాజెక్టులు ఆమోదం పొందడం చాలా కష్టమని మెట్రోమాన్‌ ఇ.శ్రీధరన్‌ పేర్కొన్నారు. ఆచరణలో దీన్ని అమలు చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. మెట్రో రవాణా లాభాలతో కూడుకున్న వ్యాపారం కాదు కాబట్టి ప్రైవేటు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావన్నారు. కొత్త మెట్రోరైల్‌ విధానం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుల భవిష్యత్తుపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ప్రస్తుతం కొత్త విధానం వచ్చినా విజయవాడ మెట్రోప్రాజెక్టును మాత్రం పాత విధానం ప్రకారమే కొనసాగించడానికి అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

* విశాఖపట్నం మెట్రోపై మాత్రం మళ్లీ కొత్తగా అధ్యయనం చేసి, డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేయాల్సి వస్తుంది.. అందుకు కనీసం ఆరేడు నెలల సమయం పడుతుంది.

* కొత్త మెట్రో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో విజయవాడ మెట్రోకూ ప్రైవేటు భాగస్వామిని గుర్తించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది.. ఈ విధానంలో సామాజిక ప్రభావ మధింపు తప్పనిసరి చేసినందున ప్రాజెక్టులు మంజూరు చేయకుండా తప్పించుకోవడానికి ఆ నిబంధన వీలు కల్పిస్తుంది.

* లైట్‌ రైల్‌ టెక్నాలజీకి మళ్లితే మాత్రం అందుకు చాలా సమయం పడుతుంది.. వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలాంటి నగరాలకు ఈ విధానం సరిపోదు. లైట్‌ రైల్‌ టెక్నాలజీ సామర్థ్యం సాధారణ మెట్రో కంటే 50% తక్కువ ఉంటుంది. పైగా మెట్రోతో పోల్చుకుంటే దాని నిర్మాణానికయ్యే ఖర్చులో తేడా పెద్దగా ఉండదు. ప్రయాణికుల రవాణా సామర్థ్యంలోనూ దాదాపు 50% తేడా ఉంటుంది. మెట్రో ప్రాజెక్టులను వందేళ్లను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తుంటారు. వచ్చే వందేళ్లలో విజయవాడ చాలా పెద్దనగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున సాధారణ మెట్రో‌్ర పాజెక్టు నిర్మాణం చేపట్టడమే ఉత్తమం. ఈ విషయంలో దిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి.

* కొత్త మెట్రో విధానంలో మెట్రోలైన్‌కు అటూ, ఇటూ 5 కి.మీ. దూరం నుంచి అనుసంధాన రవాణా ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా లాభదాయకం కాదు. అందుకు ఏర్పాటుచేసే ఫీడర్‌ బస్సుల కోసం ఎవరు పెట్టుబడి పెట్టాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆ భారాన్ని భరించాల్సి ఉంటుంది. కొత్త విధానంలో చెప్పిన అంశాలు కాగితాలపై బాగా అనిపించినా వాస్తవంగా అమలు సాధ్యం కాదు. మెట్రో లాభదాయక వ్యాపారం కాదు కాబట్టి వీటిని చేపట్టడానికి ప్రైవేటు పార్టీలెవ్వరూ ముందుకురారు. పెట్టుబడిపై కనీసం 12-15% లాభం ఉంటేనే ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తారు. కానీ మెట్రోలో లాభం గరిష్ఠంగా 1.5నుంచి 2శాతం వరకు మాత్రమే ఉంటుంది. కొత్త విధానంలో ఎకనమిక్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 14% ఉండాలన్న నిబంధనను చేరుకోవడం పెద్దకష్టమేమీ కాదు. ఇదివరకు పెట్టిన పెట్టుబడిపై 8% లాభం ఉండాలన్న నిబంధన ఉండేదని, ఇప్పుడు చెప్పిన ఎనమిక్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌ ప్రకారం మొత్తం సమాజానికి చేకూరే ప్రయోజనాన్ని రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ కింద పరిగణిస్తారు. మెట్రోప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత తగ్గే కాలుష్యం, రోడ్డు ప్రమాదాలన్నింటినీ లెక్కించి విలువ కడతారు.

వ్యక్తిగత కారణాలవల్లే రాజీనామా..

ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ సలహాదారు పదవికి నెలక్రితమే తాను రాజీనామా చేశా. వయోభారం కారణంగా దూరప్రాంతాలకు తరచూ ప్రయాణం చేయలేకపోతున్నందునే రాజీనామా సమర్పించా. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఈ రాజీనామా చేశా. ఇతరత్రా కారణాలేమీ లేవు.

హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏమాత్రం లాభదాయకం కాబోదు.. దాని ఆపరేషన్‌ మొదలుపెట్టిన నాటి నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో బ్యాంకులకు రుణాల చెల్లింపు మొదలుపెట్టాల్సి ఉంటుంది. అందుకే అది ఆపరేషన్స్‌ ప్రారంభించడానికి జంకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు పలుసార్లు అడ్డంకులు కల్పించిందని అందుకు తగిన నష్టాన్ని చెల్లించాలని ఎల్‌అండ్‌టీ డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. పీపీపీ మోడల్‌ విజయవంతం కాదనడానికి హైదరాబాద్‌ మెట్రో ఒక ఉదాహరణ. అక్కడ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కోసం 300 ఎకరాల భూమి ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆస్తుల విలువలు తగ్గడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ ద్వారా లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే ప్రాజెక్టు ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత కూడా ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోలో కనీసం ఒక సెక్షన్‌ను కూడా ప్రారంభించడానికి సాహసం చేయడంలేదు. భవిష్యత్తులో అది ఆపరేషన్స్‌ మొదలుపెట్టే పరిస్థితి లేకపోతే ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది.

Link to comment
Share on other sites

ఇన్నోవేటివ్‌ పీపీపీ దిశగా ‘లైట్‌రైల్‌’!
 
 
636386416608042057.jpg
  • నూతన మెట్రోపాలసీ నేపథ్యంలో.. సరికొత్త ఆలోచన
  • సివిల్‌ నిర్మాణాల బాధ్యత ప్రభుత్వానిది
  • ఆపరేషన్స్‌.. ప్రైవేటుకు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ నగరంలో లైట్‌ రైల్‌ ప్రాజెక్టును ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు తీసుకు వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన మెట్రో పాలసీ విధానంలో ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానాన్ని తప్పనిసరి చేయటంతో.. దీనిపై మదింపు చేసిన అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) విజయవాడ ‘లైట్‌రైల్‌’ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళటానికి మధ్యే మార్గంగా ‘ఇన్నోవేటివ్‌ పీపీపీ’ విధానాన్ని ప్రతిపాదించింది. సివిల్‌ నిర్మాణాలను ప్రభుత్వం సొంతఖర్చుతో చేపట్టి.. లైట్‌ రైల్‌ ఆపరేషన్స్‌ను ప్రైవేటు సంస్థ ద్వారా చేపట్టేలా చర్యలు తీసుకోవటమే ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానం. నూతన మెట్రో పాలసీ పేరుతో కేంద్రం ఇచ్చిన షాక్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారం పడుతోంది. ముందుగా అనుకున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టు విషయానికే వస్తే.. తక్షణం లాభదాయకత ప్రాజెక్టు కాదు. దీనికి సంబంధించిన డీపీఆర్‌లోనే ఈ విషయాన్ని నిర్దేశించటం జరిగింది. కనీసం 15 నుంచి 20 ఏళ్ళపాటు నిర్వహించిన తర్వాతే లాభాలకు అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే లైట్‌ రైల్‌ ప్రాజెక్టు సాకారం కూడా కష్టమే. కేంద్ర ప్రభుత్వ మెట్రో పాలసీని మదింపు చేసిన ఏఎంఆర్‌సీ.. ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. దీనివల్ల సివిల్‌ నిర్మాణాల పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది. అప్పుడు ప్రైవేటు సంస్థల మీద పెద్దగా భారం పడదు. కేవలం రైళ్ళ ఆపరేషన్‌ మాత్రమే సంస్థలు చేపట్టే అవకాశం ఉంటుంది. సివిల్‌ నిర్మాణాలతో కలిపి నిర్వహణ చేపట్టడం అంటే ఎంతో సాహసంతో కూడుకున్న చర్యే! హైదరాబాద్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. సివిల్‌ నిర్మాణ దశలోనే కాంట్రాక్టు సంస్థ, ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. కొద్దిరోజులు ప్రాజెక్టు పనులు నిలిచినా తర్వాత ప్రభుత్వ జోక్యంతో ముందుకు నడుస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థలు పనుల కోసం కాంట్రాక్టులను దక్కించుకుని ఆ తర్వాత ఆపరేషన్స్‌ విషయానికి వచ్చేసరికి వెనక్కుపోతే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఇన్నోవేటివ్‌ విధానంలో ముందుకు వెళ్ళకపోతే లైట్‌రైల్‌ను ముందుకు తీసుకు వెళ్ళలేమన్న భావనలో ఏఎంఆర్‌సీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కూడా ఇదే విధంగా వున్నట్టు తెలుస్తోంది.
 
 
రాష్ట్ర ప్రభుత్వంపై భారం
నూతన మెట్రో పాలసీ వల్ల విజయవాడలో లైట్‌రైల్‌ ప్రాజెక్టును చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 20శాతం గ్రాంటులో 10శాతం కోత పడటంతో పాటు, ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో వెళ్ళటం వల్ల సివిల్‌ నిర్మాణాల ఖర్చు, భూ సేకరణ వ్యయం అన్నీ తడిసిమోపెడు అవుతుంది. మెట్రోప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వంపై భూసేకరణకు రూ.1000కోట్లు వ్యయం పడుతోంది. లైట్‌రైల్‌ ప్రాజెక్టుకు కనీసం రూ.750 కోట్లు అయినా అవుతుంది. సివిల్‌ నిర్మాణాలకు మెట్రో ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లతో టెండర్లు పిలిచారు. కనీసం లైట్‌రైల్‌ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు అయినా అవుతుంది. ఈ లెక్కన రూ.2,500 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే అవకాశాలు ఉన్నాయి. మెట్రో ప్రాజెక్టుకు నిధులను సర్దుబాటు చేయటానికే అనేక ఇబ్బందులను ప్రభుత్వం ఎదుర్కొంది. అయితే అప్పట్లో ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కూడా రుణం తీసుకునే వెసులుబాటు ఉన్నా.. భవిష్యత్తులో అది గుదిబండగా మారే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

కొత్త మెట్రో పాలసీతో నష్టమే

రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు

సాయం తగ్గించేందుకే కేంద్రం ఈ విధానం తెచ్చింది

జాప్యం చేస్తుండటం వల్లే డీఎంఆర్‌సీని తప్పించాం

ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి

20ap-main14a.jpg

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ నూతన మెట్రో విధానంతో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏం లేకపోగా.. నష్టమే ఎక్కువ ఉందని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఎండీ ఎన్‌.రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ నూతన పాలసీ ప్రైవేటు రంగానికి అనుకూలంగా ఉందన్నారు. కొత్త మెట్రో ప్రాజెక్టులు రావాల్సి ఉన్న నగరాలకు ఇక కేంద్రం నుంచి నిధులు, ఆర్థిక సాయం వచ్చే అవకాశం లేదని తేలిపోయిందన్నారు. మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చే బడ్జెట్‌ను తగ్గించుకునేందుకే కేంద్రం కొత్తపాలసీని తీసుకొచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇది నూతన మెట్రో ప్రాజెక్టులకే హానికరంగా ఉందంటూ రామకృష్ణారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. విజయవాడలోని తన కార్యాలయంలో ‘ఈనాడు-ఈటీవీ’తో ఆదివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

* నూతన మెట్రో పాలసీలో మనకు ఏమైనా ప్రయోజనాలు ఉంటాయేమోనని ప్రతి అక్షరం చదవగా షాక్‌కు గురైనంత పనైంది. ఈ నూతన విధానం వల్ల భవిష్యత్తులో మిగిలిన ఏ నగరానికీ మెట్రో ప్రాజెక్టులు వస్తాయనే నమ్మకం నాకైతే లేదు.

* రాష్ట్ర విభజన చట్టంలోనే విజయవాడ, విశాఖ రెండు మెట్రో ప్రాజెక్టులు పెట్టారు. కానీ వీటిని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. విజయవాడ మెట్రోకు రూ.6 వేల కోట్లు, విశాఖ మెట్రోకు రూ.13 వేల కోట్లు కలిపి మొత్తం రూ.19 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. నూతన పాలసీ విధానం చూస్తే ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. పైపెచ్చు నిర్వహణ (ఓ అండ్‌ ఎం) విషయంలో ఫలానా విధంగా చేయాలంటూ కొన్ని మార్గదర్శకాలను పొందుపరచడం ప్రైవేటుకు అనుకూలంగా ఉంది.

* పాలసీలో చివరన విజయవాడ, విశాఖతో పాటూ దేశవ్యాప్తంగా మిగిలిపోయిన మెట్రో ప్రాజెక్టుల గురించి రాశారు. కేంద్రాన్ని నమ్ముకుంటే ఇవేవీ పూర్తికావు. అందుకే మెట్రో పితామహుడు శ్రీధరన్‌ సైతం ఇదే విషయం చెప్పారు. మన పద్ధతుల్లో మనం వెళ్తే తప్ప మెట్రో ప్రాజెక్టులను చేయలేం. అందుకే మన పద్ధతుల్లో వెళ్లి విశాఖను తొలుత పూర్తిచేస్తాం. తర్వాత అదే పద్ధతిని విజయవాడలో అమలు చేస్తాం.

* నూతన పాలసీలో ఒకే ఒక్క అంశం రాష్ట్రానికి అనుకూలంగా ఉంది. ఛార్జీలు ఎంత పెట్టాలనేది నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రైవేటు గుత్తేదారు సంస్థతో కూర్చుని మాట్లాడి మెట్రో టిక్కెట్‌ ధరలను మనమే నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఈ ఒక్కటే నాకు నూతన పాలసీలో కనిపించిన సానుకూల అంశం.

* విజయవాడ నగరానికి అనుకూలంగా ఉంటుందనే లైట్‌ మెట్రోపై కసరత్తు చేస్తున్నాం. మీడియం మెట్రో కంటే లైట్‌ మెట్రో వల్ల 20-25శాతం ఖర్చు తగ్గుతుందని శ్రీధరన్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

* డీఎంఆర్‌సీతో విజయవాడ మెట్రోకు ఒప్పందం చేసుకున్న తర్వాత తీవ్ర జాప్యం జరిగింది. పది నెలలు వృథా అయ్యాయి. ప్రాజెక్టు రాలేదు, పనులు ప్రారంభం కాలేదు. అలాంటప్పుడు నెలకు రూ.6 కోట్లను వాళ్లకు చెల్లించడం భారం. ఇక్కడున్న డీఎంఆర్‌సీ సిబ్బంది బాగా సహకరిస్తున్నా, దిల్లీ నుంచి సహకారం అందడం లేదు. అందువల్లే వారితో తప్పుకోవాల్సి వచ్చింది.

* విజయవాడ మెట్రోను నిడమానూరు వరకూ తొలుత అనుకున్నాం. దానిని గన్నవరం విమానాశ్రయం వరకూ పొడిగించమని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు పీఎన్‌బీఎస్‌ బస్టాండ్‌ నుంచి జక్కంపూడి వరకూ మరో కారిడార్‌ను సైతం ఏర్పాటు చేయమని సూచించారు. దీంతో రెండు కారిడార్లు అదనంగా కలవడం వల్ల మళ్లీ నూతన డీపీఆర్‌ అవసరం. కొత్త డీపీఆర్‌కు జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ సహకారం అందిస్తోంది.

Link to comment
Share on other sites

డీఎంఆర్‌సీతో తెగతెంపులు..నూతన సంస్థ కోసం టెండర్లు
 
 
636391599537011295.jpg
  • డీపీఆర్‌ రూపకల్పనకు నూతన సంస్థ కోసం టెండర్లు
  • నాలుగు నెలలే గడువు
  • ప్రస్తుత కారిడార్లతోపాటు పొడిగింపునకు నిర్దేశం
  • ఎయిర్‌ పోర్టు, జక్కంపూడి, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు..
  • ఇండియా, జర్మనీలలో పేపర్‌ నోటిఫికేషన్‌
  • జర్మనీ ఆర్థిక సంస్థ సహకారంతో ముందుకు
విజయవాడ: నగరంలో మీడియం మెట్రో ప్రాజెక్టు స్థానంలో లైట్‌ మెట్రో రైల్‌ప్రాజెక్టు వైపు ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుండటంతో ఇప్పటివరకు మెట్రో ప్రాజెక్టుకు సలహాదారుగా ఉన్న డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)తో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) తెగతెంపులు చేసుకుంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఇతర కన్సల్‌టెంట్‌ను నియమించుకోవటానికి బుధవారం టెండర్లను పిలిచింది. లైట్‌ రైల్‌ ప్రాజెక్టును చేపట్టడానికి తక్షణం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు రూపకల్పన చేయాల్సి ఉండటంతో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ ) రంగంలోకి దిగింది. లైట్‌రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపకల్పన చేయటానికి కన్సల్టెన్సీ సంస్థను ఎంపికచేసేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. టెండర్‌ నోటిఫికేషన్‌ను ఏఎంఆర్‌సీ వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచారు. నాలుగురోజుల్లో అధికారికంగా పేపర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. విజయవాడ నగరానికి లైట్‌ రైల్‌ ప్రాజెక్టును ఎంపిక చేయటంతో మీడియం మెట్రో బాధ్యతల నుంచి వైదొలగటం జరిగింది. మీడియం మెట్రోకు డీపీఆర్‌ను డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ)రూపొందించింది. లైట్‌ రైల్‌కు డీపీఆర్‌ను డీఎంఆర్‌సీ కాకుండా మరో సంస్థతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించటంతోనే మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాల్సి వచ్చింది.
 
         లైట్‌ రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కన్సల్‌టెంట్లతో పాటు జర్మనీ దేశంలో కూడా పేపర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. లైట్‌ రైల్‌ ప్రాజెక్టును జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ సహకారంతో చేపడుతున్న నేపథ్యంలో, ఆ సంస్థ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల ప్రక్రియను రూపొందించింది. ఒకరకంగా ఏఎంఆర్‌సీ గ్లోబల్‌ టెండర్లను పిలిచింది. ఇంతకుముందు మీడియం మెట్రో ప్రాజెక్టు బందరు, ఏలూరు రోడ్లలో 27 కిలోమీటర్ల పరిధిలో పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు సెంటర్‌ , రైల్వే స్టేషన్‌ నుంచి నిడమానూరు సెంటర్‌ వరకు నిర్దేశించిన సంగతి తెలిసిందే. తాజాగా లైట్‌ రైల్‌ కారిడార్‌లో ఈ కారిడార్‌ నిడివి మరింత పెరగబోతోంది. ప్రస్తుత కారిడార్లతోపాటు అంతర్గతంగా ఫీజుబిలిటీ ఉన్న రూట్లకు సంబంధించి కూడా ఏఎంఆర్‌సీ నివేదిక కోరింది. లైట్‌ రైల్‌ ప్రాజెక్టును విజయవాడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, అలాగే జక్కంపూడి, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు లైట్‌ రైల్‌ కారిడార్లకు అవకాశం ఉన్న మార్గాలను అధ్యయనంచేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. మీడియం మెట్రో ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా చేపడుతున్న లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత 27 కిలోమీటర్లే కాకుండా వీటికి క్రాస్‌ అయ్యేలా కూడా ఫీజిబిలిటీ ఉంటే తగిన ప్రతిపాదనలను అందించాల్సిందిగా సూచించింది. ఎయిర్‌పోర్టు వరకు పొడిగిస్తూ డీపీఆర్‌ కోరటంతో నిడమానూరు రైతులకు పెద్ద ఊరట లభించినట్టు అవుతుంది. నగర వాయువ్య దిశన ఉన్న జక్కంపూడికి కూడా లైట్‌రైల్‌ ప్రాజెక్టు కారిడార్‌ను ప్రతిపాదించటం తో ర్యాపిడ్‌ గ్రోత్‌ ప్రాంతానికి కనెక్టివిటీ ఇస్తున్నట్టుగా భావించాల్సివ స్తోంది. జక్కంపూడిని ఆర్థిక నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాంతానికి మార్గం కల్పించటం విశేషం! తాడేపల్లి సమీపంలోని కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు కారిడార్‌ను పొడిగిస్తూ నివేదిక కోరటం వెనుక చూస్తే.. రానున్న రోజుల్లో అమరావతి రాజధానికి కూడా అనుసంధానం చేసేలా ముందుగానే డీపీఆర్‌ కోరటం జరిగింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో భాగంగా ఫీజుబిలిటీ ఉన్న రోడ్లు, రూట్‌ అలైన్‌మెంట్స్‌ , భూ ప్రతిపాదనలు, లైట్‌ రైల్‌ స్టేషన్స్‌, ఎలక్ర్టిక్‌ సబ్‌ స్టేషన్స్‌, మెయింట్‌నెన్స్‌ డిపోలు, ప్రభుత్వం ద్వారా సేకరించాల్సిన భూములు, రోలింగ్‌ స్టాక్‌కు అంచనాలు రూపొందించడం, పర్యావరణ అనుమతులు, సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ ఎకనమిక్‌ వయబిలిటీ (ఎఫ్‌ఐఆర్‌ఆర్‌, ఈఐఆర్‌ఆర్‌) వంటివన్నీ కన్సల్‌టెంట్‌ సంస్థ రూపొందించి అందచేయాల్సి ఉంటుంది.
 
నాలుగు నెలలే గడువు
డీ పీఆర్‌ రూపకల్పనకు కన్సల్‌టెంట్‌ సంస్థకు నాలుగు నెలల స్వల్ప గడువును మాత్రమే ఏఎంఆర్‌సీ నిర్దేశించింది. ఇంకా ఎక్కువ కాలం నిర్దేశిస్తే కాలహరణం జరుగుతుందన్న ఉద్దేశంతో డీ పీఆర్‌కు తక్కువ సమయాన్ని నిర్దేశించింది. డీపీఆర్‌ చేతికి అందగానే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి .. దానికి ఆమోదముద్ర వే సి వెంటనే ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో టెండర్లను పిలవనుంది.
 
ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ప్రాజెక్టు నిర్వహణ
ఇటీవల కేంద్రప్రభుత్వం నూతన మెట్రోపాలసీని రూపొందించింది. ఈ పాలసీలో భాగంగా విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టును కచ్చితంగా పీపీపీ విధానంలో చేపట్టాల్సివుంటుంది. మెట్రో స్థానంలో లైట్‌రైల్‌ ప్రాజెక్టు వైపు ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో, ఇది కూడా తక్షణం లాభదాయకత ప్రాజెక్టు కాదు కాబట్టి పీపీపీ విధానంలో ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇన్నోవేటివ్‌ పీపీపీకి పచ్చజెండా ఊపింది. ఈ విధానంలో సివిల్‌ నిర్మాణాలను రాష్ట్రప్రభుత్వం చేపట్టి... ఆపరేషన్స్‌ నిర్వహణను మాత్రం ప్రైవేటు సంస్థలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
Link to comment
Share on other sites

లైట్‌మెట్రోరైల్‌పై ఏపీ సర్కార్ దృష్టి

636391785019100500.jpg


విజయవాడ: విజయవాడలో లైట్‌ మెట్రో ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అయితే ఇప్పటికే మీడియం మెట్రో ప్రాజెక్టు సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, అమరావతి మెట్రోరైలు కార్పొరేషన్‌తో తెగదెంపులు చేసుకుంది. తాజా ప్రాజెక్టుకు ఇతర కన్సల్టెంట్‌ను నియమించుకునేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది.

 

విజయవాడలో మెట్రోరైలు నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. లైట్ ‌మెట్రోరైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్‌ రూపకల్పన కోసం అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపకల్పన చేయడానికి కన్సల్టెంట్ సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. టెండర్ల నోటిఫికేషన్, ఏఎంఆర్సీ వెబ్ పోర్టల్‌లో పొందుపర్చారు. నాలుగు రోజుల్లో అధికారికంగా పేపర్ నోటిఫికేషన్ రానుంది.

 

విజయవాడ నగరానికి లైట్‌మెట్రోరైలు ప్రాజెక్టు ఎంపిక చేయడంతో మీడియం మెట్రో బాధ్యతల నుంచి ఏఎంఆర్సీ వైదొలిగింది. మీడియం మెట్రోకు డీపీఆర్‌ను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ రూపొందించింది. లైట్‌మెట్రోరైలుకు డీపీఆర్‌ను ఏఎంఆర్సీ‌తో కాకుండా మరో సంస్థతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతోనే మళ్లీ కొత్తగా టెండర్లను పిలవాల్సి వచ్చింది. లైట్‌మెట్రోరైలు ప్రాజెక్టు డీపీఆర్‌ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న కన్సల్టెంట్లతో పాటు జర్మనీ దేశంలోనూ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

 

లైట్ మెట్రోరైలు ప్రాజెక్టు జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ సహకారంతో చేపడుతున్నందున ఆ సంస్థ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల ప్రక్రియ రూపొందించడం జరిగింది. ఒక రకంగా ఏఎంఆర్సీ గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఇంతకుముందు మీడియం మెట్రో ప్రాజెక్టు బందరు-ఏలూరు రోడ్లలో 27 కి.మీ పరిధి నిర్దేశించింది. తాజా ప్రాజెక్టుతో మెట్రో రైలు కారిడార్ మరింత పెరగబోతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన మెట్రో పాలసీని రూపొందించింది.

 

ఈ పాలసీలో భాగంగా విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టును ఖచ్చితంగా పీపీపీ విధానంలో చేపట్టాల్సి ఉంటుంది. ఈ విధానంలో సివిల్ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్స్ నిర్వాహణ మాత్రం ప్రైవేటు సంస్థలు చేపట్టే అవకాశం ఉంటుంది. దీంతో ప్రైవేటు సంస్థలు చేపట్టే అవకాశం ఉంటుంది. దీంతో ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Link to comment
Share on other sites

లైట్‌ మెట్రో డీపీఆర్‌ కోసం ఆసక్తి వ్యక్తీకరణ నోటీసు

దరఖాస్తుకు నెల గడువు

నాలుగు నెలల్లో డీపీఆర్‌

ఈనాడు, అమరావతి: విజయవాడ నగరానికి తేలికపాటి మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు (ఈఓఐ) ఆహ్వానించింది. విజయవాడ ఎంఆర్‌టీఎస్‌ (మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌)కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఇతర సాంకేతిక సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని నోటీసు జారీ చేస్తూ ఏఎంఆర్‌సీ సోమవారం అధికారిక వెబ్‌సైట్‌లో నోటీసును పెట్టింది. నెల రోజులు గడువు ఇచ్చింది. సెప్టెంబరు 28 ఆఖరి తేదీగా పేర్కొంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పలు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. మొదట నిర్మాణం చేయతలపెట్టిన మీడియం మెట్రో ప్రాజెక్టు సాధ్యం కాదని తేల్చి తేలికపాటి మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. దీనిపై జర్మనీ దేశానికి చెందిన నిపుణులు డాట్సన్‌ 15రోజుల పాటు అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీంతో లైట్‌మెట్రోపై డీపీఆర్‌ తయారు చేయించాలని సీఎం ఆదేశించారు. లైట్‌మెట్రోకు జర్మనీ దేశానికి చెందిన ఆర్థిక సంస్థ కెఎఫ్‌డబ్ల్యూ (జర్మన్‌ డెవలప్‌మెంట్‌బ్యాంకు) ఆర్థిక సాయం చేసేందుకుముందుకు వచ్చింది. ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ కూడా తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. ఇండో-జర్మనీ దేశాల ఆర్థిక సహకార కార్యక్రమం కింద పర్యావరణహిత మెట్రో ప్రాజెక్టు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రెండు కారిడార్లు 26 కిలోమీటర్లతో పాటు మరో అయిదు కిలోమీటర్లు పొడిగించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని వివరించారు. అందులో భాగంగానే మరో కారిడార్‌ జక్కంపూడి ఆర్థిక నగరం వరకు, మరో కారిడార్‌ కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ వరకు పొడించే ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. తేలిక పాటి మెట్రో రైలుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలు, ప్రస్తుతం రూపొందించిన ముందస్తు ఫీజిబిలిటీ నివేదికకు ప్రత్యామ్నాయ మార్గాలు, రూట్‌ ఎలైన్‌మెంట్‌, స్టేషన్‌లు, ఎలక్ట్రిక్‌ సబ్‌స్టేషన్‌లు సిగ్నల్‌ వ్యవస్థ, ఇతర సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన భూసేకరణ, వ్యయం అంచనా, పర్యావరణ, సామాజిక ప్రభావం, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, రెవెన్యూ అంచనా తదితర అన్ని అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదికను నాలుగు నెలల్లో పూర్తి చేసి అందించాలని షరతు విధించింది. వచ్చే నెల 28లోగా దరఖాస్తు చేయాలని, వాటిలో అర్హతలు ఉన్న సంస్థలకు అప్పగిస్తామని మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...