Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

  • Replies 309
  • Created
  • Last Reply

లైట్‌’ మెట్రో!
 

 
636359656601228448.jpg
  • సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
  • ఎలివేటెడ్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌ ప్రతిపాదన
  • దాదాపు విరమణ ?!
  • భవిష్యత్తు అవసరాలను తీర్చలేదన్న అభిప్రాయం
  • లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు వైపు ఆసక్తి
  • అధ్యయనం కోసం జర్మనీ కన్సల్‌టెంట్‌ నియామకం
  •  రేపు నగరానికి జర్మనీ కన్సల్‌టెంట్‌ రాక..
 
 విజయవాడ: మెట్రోకు ప్రత్యామ్నాయంగా తెరమీదకు వచ్చిన ప్రత్యామ్నాయాలలో ది బెస్ట్‌ ఏమిటన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపుగా స్పష్టత నిచ్చారు. నగరానికి ‘లైట్‌ మెట్రో రైల్‌’ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. జర ్మనీ దేశానికి చెందిన లైట్‌ మెట్రో రైల్‌ నిపుణుడిని ప్రభుత్వం కన్సల్‌టెంట్‌గా నియమించింది. కన్సల్‌టెంట్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది.
 
విదేశీ అధ్యయనం తర్వాత సోమవారం అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) నేతృత్వంలో మంత్రి నారాయణ, ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులు ప్రత్యామ్నాయాలపై నివేదికను ముఖ్యమంత్రికి అందచేయటం జరిగింది. ప్రత్యామ్నాయాలలో ‘ఎలివేటెడ్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌’ ప్రాజెక్టును మెట్రోకు ప్రత్యామ్నాయంగా అధికారులు ముందుకు తీసుకు వచ్చారు. ‘ఎలివేటెడ్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌’ సాధ్యాసాధ్యాలపై సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. ‘ఏది మోదం శీర్షికన’ ఎలివేటెడ్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌’ పై అలుముకున్న సందేహాలపై ఆంధ్రజ్యోతి ప్రతే ్యక కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కొన్ని అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చిన ఏఎఫ్‌డీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వారు కూడా ‘ఎలివేటెడ్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌’ పట్ల అంత సానుకూలత ప్రదర్శించలేదని సమాచారం. మెట్రో ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం అమలు చేయటం కష్టసాధ్యమైన వ్యవహారమని చెప్పినట్టు సమాచారం.
 
దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ప్రస్తుత అవసరాలకనుగుణంగా ‘ఎలివేటెడ్‌ ఎలిక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌’ తీర్చగలిగినా భవిష్యత్తు అవసరాలను తీర్చే సామర్ధ్యం లేదన్న ఉద్దేశ్యంతో ఈ ప్రతిపాదన నుంచి వైదొలగటం జరిగింది. ప్రత్యామ్నాయంగా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపించింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసేందుకు వీలుగా జర్మనీ కన్సల్‌టెంట్‌ను నియమించటం జరిగింది.
 
జర్మనీ కన్సల్‌టెంట్‌ బుధవారం నగరానికి వచ్చిన తర్వాత ప్రతిపాదిత కారిడార్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను అధ్యయనంచేసి లైట్‌ రైల్‌ ప్రాజెక్టు సాధ్యమా కాదా? అన్నది నిర్ణయించనున్నారు. మెట్రోకు ప్రత్యామ్నాయంగా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్ళే విషయమై 20 రోజుల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని మంత్రి నారాయణ ప్రకటించారు.
 
విజయవాడకు బుధవారం వచ్చే జర్మనీ కన్సల్‌టెంట్‌ పక్షం రోజుల్లో లైట్‌ మెట్రో రైల్‌ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వనున్నారు. మెట్రో రైల్‌ ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడుకున్నది కావటంతో .. ప్రత్యామ్నాయంగా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కొంత వ్యయాన్ని తగ్గించగలదని సమావేశంలో భావించినట్టు
సమాచారం.
 
నగరంలోనే ఏఎఫ్‌డీ, కేఎఫ్‌డబ్ల్యూ బృందాలు 
ఒక పక్క మెట్రోకు ప్రత్యామ్నాయంపై కీలక సమావేశం జరగగా.. మరోవైపు మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తున్న జర్మనీ, ఫ్రాన్స్‌ ఆర్థిక సంస్థలు ఏఎఫ్‌డీ, కేఎఫ్‌డబ్ల్యూలు నగరానికి వచ్చాయి. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఎఫ్‌డీ బృందాలు కూడా పాల్గొన్నాయి. ఎలివేటెడ్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌ ప్రతిపాదను దాదాపుగా తోసిపుచ్చాయి. రాత్రికి కేఎఫ్‌డబ్ల్యూ బృందం నగరానికి చేరుకుంది. మంగళవారం ఎలాంటి చర్చలు జరగనున్నాయన్నది ఆసక్తిని రేపుతోంది.
 
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు స్వరూపం..
మెట్రో రైల్‌ ప్రాజెక్టుతో పోల్చుకుంటే ... లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుత మెట్రో రైల్‌ ప్రాజెక్టు వ్యయం రూ.7000 కోట్లు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.4500 - రూ.5,000 కోట్లు లోపు వ్యయం అవుతుంది. ప్రస్తుత మెట్రో ట్రైన్‌కు కనిష్టంగా మూడు బోగీలు మినిమంగా ఉండాలి. అవసరాన్ని బట్టి అదనపు బోగీలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అదే లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు అయితే కనిష్టంగా రెండు బోగీల ఏర్పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి బోగీలను అనుసంధానం చేసుకోవచ్చు. రెండు బోగీలలో 400 నుంచి 450 మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉంటుంది. మెట్రో రైళ్ల కంటే పొడవు, వెడల్పు తక్కువుగా ఉంటాయి. ట్రాక్‌ నిడివి కూడా తక్కువుగా ఉంటుంది. పిల్లర్ల నిర్మాణం మొదలుకొని వయాడక్ట్‌ వరకు పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు గణనీయంగా భూ సేకరణ వ్యయం కూడా తగ్గుతుంది. నిడమానూరులో మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు 60 ఎకరాలు అవసరం కాగా లైట్‌ మెట్రో రైల్‌కు కేవలం 35 ఎకరాలు సరిపోతుందని అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

లైట్‌ రైల్‌ నిర్ణయం వెనుక.. శ్రీధరన్‌ !!

636360505766252700.jpg


  • సరైన ప్రత్యామ్నాయం లైట్‌ రైల్‌ మాత్రమేనని సూచన
  • ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు
  • విజయవాడతో శ్రీధరన్‌కు ఎనలేని అనుబంధం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): తమదనుకున్నది పోయినా ఫర్వాలేదు.. కానీ, అవతలి వాళ్లకు మంచి సలహానే ఇవ్వటమన్నది ఎంత మంది చేస్తారు?! ఓ పక్క దేశంలోనే సత్వర రవాణా వ్యవస్థకు అధిపతిగా... మరో పక్క మెట్రోరైల్‌ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) వైస్‌ చైౖర్మన్‌ శ్రీధరన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచన చేసి ఆదర్శనీయంగా నిలిచారు. మెట్రో రైల్‌ ప్రాజెక్టును కాదని, ప్రత్యామ్నాయం వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో డీఎంఆర్‌సీ సంస్థ అధిపతిగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా లైట్‌ రైల్‌ ప్రాజెక్టుకు సూచన చేయటం విశేషం. విదేశీ అధ్యయనం తర్వాత అనేక ప్రతిపాదనలు తెరమీదకు వచ్చిన తరుణంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో శ్రీధరన్‌ ఇచ్చిన సలహా ఎంతగానో ఉపయోగపడింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీధరన్‌ సూచించిన లైట్‌ రైల్‌ ప్రాజెక్టు వైపే ఆసక్తి చూపించటం గమనార్హం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జర్మనీ కన్సల్‌టెంట్‌ డాట్సన్‌కు అధ్యయన బాధ్యతలు అప్పగించారు. విజయవాడలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు శ్రీధరన్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు .

 

 

దేశవ్యాప్తంగా ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు అనేక రాష్ర్టాలలో డజనుకు పైగా మెట్రో ప్రాజెక్టులు చేస్తున్న డీఎంఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీధరన్‌ విజయవాడ ప్రాజెక్టును ఎంతో ప్రత్యేకంగా తీసుకున్నారు. దేశంలోని ఏ ప్రాజెక్టును కూడా తన డ్రీమ్‌ ప్రాజెక్టుగా తీసుకోని శ్రీధరన్‌ విజయవాడ విషయంలోనే ప్రత్యేకంగా తీసుకున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. విజయవాడలో మెట్రో ప్రాజెక్టును తన డ్రీమ్‌ ప్రాజెక్టుగా భావించిన శ్రీధరన్‌ అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయ చూపుతో.. దాదాపుగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం ఒక సంస్థ అధిపతిగా శ్రీధరన్‌ ఇబ్బంది పెట్టినా.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాత్రం ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఎలక్ర్టికల్‌ బస్‌, తదితర ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు తెరమీదకు వస్తున్న తరుణంలో .. ఏఎంఆర్‌ఎసీ ఎండీ రామకృష్ణారెడ్డి, ప్రభుత్వానికి తెలియచేయమని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీకి శ్రీధరన్‌ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో అనేక అంశాలు ఉన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ ఆలోచనలకు సంబంధించి ఏవీ నగర పరిస్థితులకు సరిపోవని చెప్పారు. మెట్రో కాకుంటే.. లైట్‌ రైల్‌ ప్రాజెక్టు విజయవాడ నగరానికి సరిపోతుందని ఆయన సూచించారు. ఈ లేఖ విషయాన్ని ఇటు ఏఎంఆర్‌సీ కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రహస్యంగా ఇన్నాళ్లూ ఉంచింది. విదేశీ అధ్యయనంలో అనేక రవాణా వ్యవస్థల మీద అధ్యయనం చేసిన నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరికి శ్రీధరన్‌ సూచించిన లైట్‌ రైల్‌ ప్రాజెక్టును పరిశీలించటానికి అధ్యయనం చేయమని సూచించారు.

 


విజయవాడతో ఎనలేని అనుబంధం

విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టును తన డ్రీమ్‌ ప్రాజెక్టుగా శ్రీధరన్‌ పేర్కొనటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అర దశాబ్దం కాలం పైగా ఆయన విజయవాడలో పనిచేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌లో శ్రీధరన్‌ డివిజనల్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొంత కాలంగా సౌత్‌ అంటే గూడూరు - విజయవాడకు, మరికొంతకాలం నార్త్‌కు అంటే విజయవాడ-విశాఖపట్నంనకు డివిజనల్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆరు సంవత్సాల కాలం శ్రీధరన్‌ ఇక్కడ పనిచేశారు. విజయవాడలోనే ఆలిండియా రేడియో స్టేషన్‌ వెనుక ఉన్న రైల్వే క్వార్టర్స్‌లో శ్రీధరన్‌ నివసించేవారు. అర దశాబ్దకాలం పైగా విజయవాడలో పనిచేసిన నాటి అనుబంధంతో విజయవాడలో తలపెట్టే మెట్రో రైల్‌ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆయన తీసుకున్నారు.

 


 

యునెస్కో అరుదైన గౌరవం

మెట్రోమ్యాన్‌గా పేరొందిన శ్రీధరన్‌ జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తి. శ్రీధరన్‌ నైపుణ్యం, సలహాలను యునెస్కో ఇటీవల గుర్తించి అత్యున్నతమైన బాధ్యతలను అప్పగించింది. శాంతి - సామరస్యాలతో పాటు అనేక రంగాలలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేసే యునెస్కో తన అనుబంధంగా పనిచేసే ‘వరల్డ్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌’ విభాగానికి హెలెవల్‌ కమిటీ అడ్వైజర్‌గా నియమించటం విశేషం. ప్రపంచ దేశాలకు అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగంలో శ్రీధరన్‌ ఇచ్చే సలహాలు అనేక దేశాలు, రాష్ర్టాలు, నగరాలు పాటించనున్నాయి.


Link to comment
Share on other sites

ప్రత్యామ్నాయానికి ఓకే!
 
 
636360509575863761.jpg
  • మెట్రో రుణ సంస్థల సానుకూలత
  • ఆస్ర్టేలియా కన్సల్టెంట్‌ డాట్సన్‌కు బాధ్యతలు
  • నేడు.. కన్సల్‌టెంట్‌ డాట్సన్‌ నగరానికి రాక
  • పక్షం రోజుల పాటు అధ్యయనం
ఆంధ్రజ్యోతి, విజయవాడ: హమ్మయ్య.. అతి పెద్ద గండం గడిచింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టుకే రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చిన ఆర్థిక సంస్థలు.. ప్రత్యామ్నాయ ప్రాజెక్టులకు రుణం ఇవ్వటానికి ఆమోదిస్తాయా? అన్న అనుమానాలు తొలగిపోయాయి. మెట్రోకు ప్రత్యామ్నాయంగా ఇతర రవాణా పద్ధతులను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లైట్‌ రైల్‌ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, మంగళవారం విజయవాడలోని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) కార్యాలయంలో జరిగిన మెట్రో రుణ సంస్థల కీలక సమావేశం సానుకూలంగా మారటంతో ఏఎంఆర్‌సీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.4200 కోట్ల రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చిన జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలు ఏఎఫ్‌డీ, కేఎప్‌డబ్ల్యూ సంస్థలు కిందటిసారి సమావేశమైనపుడు ఎంవోయూ ఎలా ఉండాలన్న దానిపై నిర్ణయం చేసుకున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఒప్పందం చేసుకుందామని నిర్ణయించాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా మెట్రోకు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసింది. ఎలివేటెట్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌, మోనో రైల్‌, లైట్‌ రైల్‌, మాగ్నటిక్‌ రైల్‌ వంటి అనేక వాటిని అధ్యయనం కూడా చేయించింది. ఈ క్రమంలో ఎలివేటెట్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌ తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు వయబిలిటీ కాదని తేలటంతో లైట్‌ రైల్‌ ప్రాజెక్టు వైపు అడుగులు వేసింది. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వటానికి కన్సల్టెన్సీని నియమించాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలోనే రుణ సంస్థలు మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రుణం ఇవ్వటం కోసం అగ్రిమెంట్‌ చేసుకోవటానికి విజయవాడ వచ్చాయి.
 
 
ఈ పరిస్థితి ఒక రకంగా ఏఎంఆర్‌సీకి ఇబ్బందికరంగా మారింది. కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఒక రోజు ముందుగానే నగరానికి వచ్చింది. ఏఎంఆర్‌సీ వ్యూహాత్మకంగా సీఎంతో జరిగిన సమావేశంలో ఆ సంస్థ ఎలివేటెట్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌ను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ఒకవేళ ఖర్చు అనుకుంటే లైట్‌ రైల్‌ వంటివి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయని సూచించింది. సీఎం సమావేశం ముగిసిన తర్వాత సోమవారం రాత్రి ఏఎఫ్‌డీ బృందం కూడా విజయవాడ వచ్చింది. మంగళవారం ఉదయం రెండు సంస్థలకు చెందిన బృందాలతో ఏఎంఆర్‌సీ ఎండీ సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనికి రెండు సంస్థలు కూడా తమ సమ్మతిని తెలియచేయటంతో రామకృష్ణారెడ్డి చిద్విలాసం చిందించారు. ఏ ప్రాజెక్టుకైనా తాము రుణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను వినిపించటంతో ఏఎంఆర్‌సీ సంతృప్తి చెందింది. ప్రభుత్వం లైట్‌ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనం చేయాలని నిర్ణయించిన విషయాన్ని తెలుసుకున్న ఆర్థిక సంస్థలు.. అధ్యయనం చేయటాన్ని ఏ మాత్రం తప్పు పట్టలేదని తెలిసింది. ఒక ఆర్థిక సంస్థ గతంలోనే తాము మెట్రో కంటే లైట్‌ రైల్‌నే సూచించామని చెప్పగా.. మరో ఆర్థిక సంస్థ లైట్‌ రైల్‌ అని కాకుండా ఏది బెటరో సలహా ఇవ్వటానికి కన్సల్‌టెంట్‌ను ఇస్తామని ముందుకు వచ్చాయి.
 
ప్రభుత్వం కన్సల్‌టెంట్‌ను నియమించమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, కేఎఫ్‌డబ్ల్యూ ఇచ్చిన ప్రతిపాదనను ఏఎంఆర్‌సీ స్వీకరించింది. ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్‌డబ్ల్యూ అనేక ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చే విషయంలో ఆస్ర్టేలియా కన్సల్‌టెంట్‌ డాట్సన్‌చేత పరిశీలింప చేస్తుంది. డాట్సన్‌ అన్ని రకాల అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ పట్ల అవగాహన కలిగిన నిపుణుడు. అనేక ప్రాజెక్టులకు అధ్యయనం చేశారు.నగరాలను అధ్యయనం చేసి ఏది సరిపోతుందో తేల్చి చెబుతారు. హుటాహుటిన డాట్సన్‌ను విజయవాడకు ఈ సంస్థ రప్పిస్తోంది. బుధవారం ఉదయం డాట్సన్‌ విజయవాడకు వస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పక్షం రోజుల వరకు ఇక్కడే ఉండి అధ్యయనం చేస్తారు. సమావేశంలో కేఎప్‌డబ్ల్యూ బృందం తరపున రాబర్ట్‌, ఉషారావు, పాస్కల్‌లు, ఏఎఫ్‌డీ తరపున రజ్నీష్‌, ఆహుజాలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి మెట్రోపై డాట్సన్‌ సమీక్ష

19brk81a.jpg

అమరావతి: విజయవాడ నగరానికి ఎలాంటి రవాణా వ్యవస్థ అనువైనదో తేల్చే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఆందుకోసం జర్మనీకి చెందిన రవాణా రంగ నిపుణుడు డాట్సన్‌ను విజయవాడకు ఆహ్వానించింది. ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈరోజు విజయవాడ వచ్చిన డాట్సన్‌ ముందుగా మెట్రో ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. మెట్రో ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించారు. రెండు వారాల పాటు డాట్సన్‌ విజయవాడలోనే ఉండి వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజలతోనూ భేటీ అవుతారు. అలాగే మెట్రో కోసం ఉద్దేశించిన మార్గాల్ని పరిశీలిస్తారు. ఇక్కడి జనాభా, ప్రజల అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్లుగా మెరుగైన రవాణా విధానంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. డాట్సన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగానే విజయవాడలో లైట్‌ మెట్రో లేదా ఎలక్ట్రిక్‌ బస్‌, ఎలివేటెడ్‌ బస్‌ కారిడార్‌ వంటి రవాణా వ్యవస్థలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Link to comment
Share on other sites

ఎటు నుంచి ఎటైనా.. అర్ధ గంటే ప్రయాణం
 
 
636361362767146705.jpg
  • లైట్‌రైల్‌ స్టడీకి ముందు
  • సీఎంను కలిసిన డాట్సన్‌
  • ఫసైకిల్‌, ఆటోవాలాలకూ
  • అందుబాటులో ఉండాలి
  • 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి
  •  డాట్సన్‌కు సూచించిన చంద్రబాబు
 
 విజయవాడ: ‘ఎటు నుంచి ఎటైనా అర్ధగంటే ప్రయాణం ఉండాలి. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండాలి. ఆర్థికంగా భారం కాకూడదు. కాలుష్య రహితంగా ఉండాలి. ఆ దిశగా అధ్యయనం చేసి వాస్తవ ప్రాతిపదికన ఏది బెస్టో నివేదిక ఇవ్వండి’ అని మెట్రోకు ప్రత్యామ్నాయంగా లైట్‌ మెట్రో రైల్‌ ఇతర రవాణా విధానాలపై అధ్యయనం చేయటానికి వచ్చిన దిగ్గజ ఆస్ర్టేలియన్‌ కన్సల్టెంట్‌ డాట్సన్‌కు ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు సూచించారు.
 
విజయవాడను ఆమూలాగ్రం అధ్యయనం చేసి అత్యుత్తమ రవాణా వ్యవస్థకు సంబంధించి అధ్యయనంచేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వటానికి బుధవారం అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు సంబంధించి ఆస్ర్టేలియన్‌ కన్సల్టెంట్‌ డాట్సన్‌ విజయవాడ వచ్చారు. డాట్సన్‌కు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) సాదర స్వాగతం పలికింది. విజయవాడలో మెట్రోరైల్‌ ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడుకున్నది కావటం.. పలు ఇబ్బందులు కూడా ఉండటం... కేంద్రం నుంచి తుది అనుమతులు రాకపోవటం, నూతన మెట్రోపాలసీని తీసుకువస్తున్న క్రమంలో అది ఎప్పుడు వస్తుందో తెలియక పోవటం.. వంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మెట్రో కంటే ప్రత్యామ్నాయ ఆలోచనలపైనా దృష్టిసారించింది. అలాగని మెట్రో రైల్‌ ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం పక్కన పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాకు సంబంధించి బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకునేందుకు ఏఎంఆర్‌సీకి అనుమతిస్తూ క్యాబినెట్‌లో ఆమోదించటం కూడా జరిగింది.
 
ఆర్థికంగా భారం కాకుండా మెట్రో తరహాలో సేవలు అందించగలిగే ఇతర రవాణా వ్యవస్థలపైనా అధ్యయనం చేయాలనుకున్న ప్రభుత్వం ఆ దిశగా ఇటీవలే విదేశాల్లో అమలవుతున్న వేగవంతమైన రవాణా విధానాలను అధ్యయనం చేయించింది. ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన ఎలివేటెడ్‌ ఎలక్ర్టికల్‌ బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొనటంతో సరైన ప్రత్యామ్నాయాన్ని సూచించేందుకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ.. ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారన్న ఉద్దేశంతో కన్సల్టెంట్‌ సేవలను అందించటానికి ముందుకు వచ్చింది.
 
దీంతో అర్బన్‌ ట్రాన్స్‌పోర్టులో నిపుణులైన డాట్సన్‌ విజయవాడకు వచ్చారు. ఆయన్ను ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి వెంటపెట్టుకుని సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు సంబంధించి డాట్సన్‌, చంద్రబాబు మధ్య సోదాహరణంగా చర్చ జరిగినట్లు తెలిసింది. విజయవాడతోపాటు నూతన అమరావతి రాజధానిలో అధునాతన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పినట్టు సమాచారం. విజయవాడకు సంబంధించి ప్రధానంగా ఏ రవాణా ప్రాజెక్టు అయినా ప్రజల అవసరాలను తీర్చగలిగేదిగా, ఆదరించగలిగేదిగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అన్ని వర్గాలను నూతన రవాణా వ్యవస్థను ఆదరించగలగాలని, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండగలగాలని చెప్పారు. సైకిల్‌ మీద వెళ్లేవారు, ఆటోల్లో వెళ్లే వారు కూడా నూతన రవాణా వ్యవస్థను ఆదరించగలిగే విధంగా ఉండాలని చెప్పారు.
 
విజయవాడలో ఉన్న రెండు కారిడార్లలో ఎటు నుంచి ఎటు వెళ్లినా మొత్తం అర్ధ గంట సమయం మించకుండా ఉండే విధంగా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. కారిడార్ల నిడివి పూర్తిగా అర్ధ గంటలో చేరుకునే పరిస్థితి ఉంటే ప్రజలు ఎక్కువగా ఆదరించటానికి అవకాశం ఉంటుందని చెప్పినట్టు సమాచారం. దీంతోపాటు నూతన రవాణా వ్యవస్థ ఆర్థిక వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలిగే విధంగా ఉండాలని, అన్నివర్గాలను మెప్పించేదిగా ఉండాలని సూచించారు. నగరానికి కాలుష్యరహిత రవాణా వ్యవస్థ ఉండాలన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
లైట్ మెట్రో రైలు ప్రతిపాదిస్తూ సీఎంకు నివేదిక
 
 
విజయవాడ: విజయవాడ నగరానికి లైట్ మెట్రో రైలు ప్రతిపాదిస్తూ సీఎం చంద్రబాబుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పర్ట్ ఎడ్వర్ట్ డాట్సన్ కంపెనీ నివేదిక ఇచ్చింది.
 
విజయవాడలోని మూడు మార్గాలను అనుసంధానం చేసేలా లైట్ మెట్రో రైలు నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. అధికారులకు సీఎం సూచించారు.
Link to comment
Share on other sites

విజయవాడలో లైట్‌ మెట్రో

మెట్రోతో పోలిస్తే నిర్మాణ వ్యయం 25శాతం తక్కువ

సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశం

2ap-main16a.jpg

ఈనాడు, అమరావతి: విజయవాడ, రాజధాని ప్రాంతంలో లైట్‌ మెట్రో ప్రజా రవాణా వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మెట్రో రైలు కంటే లైట్‌ మెట్రో తరహా ప్రజా రవాణా వ్యవస్తే విజయవాడ నగరానికి సరిపోతుందని జర్మనీ నిపుణులు స్పష్టం చేశారు. ఇది నిర్మాణపరంగా, నిర్వహణ పరంగా వ్యయం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వానికి నివేదించారు. నగరంలో మెట్రో రైలు వ్యవస్థ నిర్మాణానికి కి.మీ.కి రూ.250 కోట్లు వ్యయం కానుండగా.. లైట్‌ మెట్రోకు రూ.170 కోట్లు నుంచి రూ.180 కోట్లు అవుతుందని అంచనా వేశారు. విజయవాడకు అనుకూలమయ్యే ప్రజా రవాణా వ్యవస్థపై జర్మనీకి చెందిన నిపుణుడు ఎడ్వర్డ్‌ డాట్సన్‌ బృందం రెండు వారాలపాటు అధ్యయనం చేసింది. బుధవారం ముఖ్యమంత్రి నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశంలో ఎడ్వర్డ్‌ తన నివేదికను సమర్పించారు. మెట్రోతో పోల్చి చూపిస్తూ 26.03 కి.మీ. దూరానికి రూ.4272.97 కోట్లతో లైట్‌ మెట్రోను నిర్మించవచ్చన్నారు. 26 కి.మీ.కు సంవత్సరానికి నిర్వహణ వ్యయం రూ.106 కోట్లు అవుతుందని చెబుతూ మెట్రోకయితే ఆ ఖర్చు రూ.160 కోట్లుగా ఉంటుందన్నారు. ఈ తరహా రవాణా వ్యవస్థ మన దేశంలో గుడ్‌గావ్‌లో ఉందనీ, అక్కడి ప్రతినిధులతోనూ చర్చించి వివరాలు తీసుకొన్నట్లు అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. పురపాలకశాఖ మంత్రి నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే 50సంవత్సరాల జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. విమానాశ్రయం, జక్కంపూడి కాలనీలను అనుసంధానించేలా మార్గంలో మార్పులు ప్రతిపాదించామన్నారు. మూడు మార్గాల్లో 40కి.మీ.మేర నిర్మించాల్సి ఉంటుందన్నారు.

ఎడ్వర్డ్‌ నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలివీ... * ప్రధాన మార్గం-1.. నిడమానూరు నుంచి బస్‌స్టేషన్‌ వరకూ 13.27 కి.మీ., ప్రధానమార్గం-2: పెనమలూరు నుంచి బస్‌స్టేషన్‌ వరకూ 12.76 కి.మీ. ఉంటుంది. ప్రధానమార్గం-1కి రూ.2143.93 కోట్లు, 2కి రూ.2094.68కోట్లు ఖర్చవుతుంది. ఏలూరు, బందరు రోడ్డు కారిడార్లను ఇందుకు అనువుగా మలచుకోవాలి. మెట్రో రైల్‌డిపో కోసం 60 ఎకరాలు అవసరమని ప్రతిపాదిస్తే లైట్‌ మెట్రోకి 35 ఎకరాలు సరిపోతుంది.

* మూడు దశల్లో ప్రజారవాణాను లైట్‌మెట్రోకి అనుసంధానిస్తారు. ఈ రైల్‌ స్టేషన్లను ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా... ప్రజా రవాణా ఆగే ప్రాంతానికి 500మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాలి. రాజధాని అమరావతి ప్రాంతానికీ, విమానాశ్రయం మీదుగా గన్నవరం వరకూ పొడిగించవచ్చు.

* లైట్‌మెట్రో మూలంగా భూసేకరణపరంగా ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. నిడమానూరు ప్రాంతంలో రూ.600 కోట్లతో 60 ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని మెట్రో ప్రణాళికలో పేర్కొనగా.. లైట్‌మెట్రోతో ఆ సమస్య ఉండదు.

Link to comment
Share on other sites

‘లైట్‌ మెట్రో’కు డీపీఆర్‌ !
 
 
636374310482302415.jpg
  • ఇంటర్నేషనల్‌ కంపెనీకి అప్పగించాలని నిర్ణయం
  • వారంలో టెండర్లు పిలిచే అవకాశం
  • కేఎఫ్‌డబ్ల్యూ సంస్థతో సంప్రదింపులు
  • లైట్‌ మెట్రోకు రుణ కీలక సంస్థగా.. కేఎఫ్‌డబ్ల్యూ
  • పీపీపీ విధానంలో లైట్‌ మెట్రో
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు దిశగా ముందుకెళ్లటానికి అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) రంగం సిద్ధం చేస్తోంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును ప్రస్తుత మెట్రో కారిడార్‌లో సాకారం చేయటానికి ముందుగా డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)కు రూపకల్పన చేయాల్సి ఉంది. డీపీఆర్‌ రూపకల్పన జరిగిన తర్వాతే ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలో, వ్యయంపై పూర్తి స్పష్టత వ స్తుంది. సత్వరం డీపీఆర్‌ ప్రక్రియకు వెళ్లాలన్న ఆలోచనలో ఏఎం ఆర్‌సీ ఉంది. త్వరగా ప్రాజెక్టును సాకారం చేయాలంటే డీపీఆర్‌ను కూడా అంతే త్వరగా పూర్తి చేయించాల్సి ఉందన్న విషయాన్ని ఏఎంఆర్‌సీ గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. అంతర్జా తీయంగా కన్సల్టెన్సీ ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవనుంది. సమగ్ర ప్రాజె క్టు నివేదిక (డీపీఆర్‌)ను నెల రోజుల్లోనే రూపకల్పన చేసి అప్పగించేందుకు వీలుగా మార్గదర్శనం చేయనున్నట్టు తెలు స్తోంది. టెండర్లు పిలిచే ముందు జర్మనీ దేశానికి చెందిన రుణసంస్థ ‘కేఎఫ్‌డబ్ల్యూ’ సంస్థతో సంప్రదింపులు చేయాలని ఏఎంఆర్‌సీ భావిస్తోంది. సరైన ప్రత్యామ్నాయం అధ్యయనం చేయించటం లోనూ, లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫీజుబిలిటీపై అధ్యయనానికి అంతర్జాతీయ నిపుణుడైన డాట్సన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. డాట్సన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ‘కేఎఫ్‌డబ్ల్యూ’ సూచనల మేరకు ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్న ఏఎంఆర్‌సీ డీపీ ఆర్‌ రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం టెండర్లు పిలిచే ముందు ఆ సంస్థ ఉన్నతాధికారులతో భేటీ కావాలని నిర్ణయించటం విశేషం.
 
పీపీపీ విధానంలోనే లైట్‌ మెట్రో
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును పీపీపీ విధానంలో టెండర్లు పిల వాలన్న ఆలోచనలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎం ఆర్‌సీ) ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎంత వర కు ఆమోదిస్తుందన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మెట్రో ప్రా జెక్టును లైట్‌ మెట్రో రైల్‌గా మార్చుకున్న దాఖలాలు అయితే దేశ వ్యాప్తంగా ఒకటి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీకి కూడా ఇవ్వవచ్చేమోనన్న ఆశ ఉంది. విభజన నేపథ్యంలో రాష్ర్టానికి మెట్రో రైల్‌ ప్రాజెక్టును కేంద్రం కేటాయించడంతో దీనికి కేంద్రం ఆమోదముద్ర వేస్తుందా? అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.
Link to comment
Share on other sites

Light metro is coming to Vijayawada

CBN’s Government has approved the plan to replace the heavy metro with light metro also known as Light Rail Technology (LRT), or Light Rapid Transit. Vijayawada metro rail will now have three corridors of total 40kms after adding one more corridor from Pandit Nehru Bus Station (PNBS) to Jakkampudi colony and extending one of the corridors till Gannavaram airport.

Public transport expert, Edward Datson from Kreditanstalt fur Wiederaufbau (KfW), a German financial institution, submitted a report to CBN on the feasibility of light metro for Vijayawada city. What’s more, KfW has come forward to fund Vijayawada metro.

Moving forward:

• Amaravati Metro Rail Corporation (AMRC) will prepare new DPRs and later call tenders
• Through the light metro the state government can save at least 25% on capital costs and 20% on annual maintenance costs against the heavy metro.
• 50% less land has to be acquired for the light metro

విజయవాడకు అనుకూలమయ్యే ప్రజా రవాణా వ్యవస్థపై జర్మనీకి చెందిన నిపుణుడు ఎడ్వర్డ్‌ డాట్సన్‌ బృందం రెండు వారాలపాటు అధ్యయనం చేసింది. బుధవారం ముఖ్యమంత్రి నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశంలో ఎడ్వర్డ్‌ తన నివేదికను సమర్పించారు.
మెట్రో రైలు కంటే లైట్‌ మెట్రో తరహా ప్రజా రవాణా వ్యవస్తే విజయవాడ నగరానికి సరిపోతుందని జర్మనీ నిపుణులు స్పష్టం చేశారు. ఇది నిర్మాణపరంగా, నిర్వహణ పరంగా వ్యయం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వానికి నివేదించారు. నగరంలో మెట్రో రైలు వ్యవస్థ నిర్మాణానికి కి.మీ.కి రూ.250 కోట్లు వ్యయం కానుండగా.. లైట్‌ మెట్రోకు రూ.170 కోట్లు నుంచి రూ.180 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మెట్రోతో పోల్చి చూపిస్తూ 26.03 కి.మీ. దూరానికి రూ.4272.97 కోట్లతో లైట్‌ మెట్రోను నిర్మించవచ్చన్నారు. 26 కి.మీ.కు సంవత్సరానికి నిర్వహణ వ్యయం రూ.106 కోట్లు అవుతుందని చెబుతూ మెట్రోకయితే ఆ ఖర్చు రూ.160 కోట్లుగా ఉంటుందన్నారు.
విజయవాడ, రాజధాని ప్రాంతంలో లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాబోయే 50సంవత్సరాల జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విమానాశ్రయం, జక్కంపూడి కాలనీలను అనుసంధానించేలా మార్గంలో మార్పులు ప్రతిపాదించారు. మూడు మార్గాల్లో 40కి.మీ.మేర నిర్మించాల్సి ఉంటుంది.

ఎడ్వర్డ్‌ నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలివీ...
ప్రధాన మార్గం-1.. నిడమానూరు నుంచి బస్‌స్టేషన్‌ వరకూ 13.27 కి.మీ., ప్రధానమార్గం-2: పెనమలూరు నుంచి బస్‌స్టేషన్‌ వరకూ 12.76 కి.మీ. ఉంటుంది. ప్రధానమార్గం-1కి రూ.2143.93 కోట్లు, 2కి రూ.2094.68కోట్లు ఖర్చవుతుంది. ఏలూరు, బందరు రోడ్డు కారిడార్లను ఇందుకు అనువుగా మలచుకోవాలి. మెట్రో రైల్‌డిపో కోసం 60 ఎకరాలు అవసరమని ప్రతిపాదిస్తే లైట్‌ మెట్రోకి 35 ఎకరాలు సరిపోతుంది.
మూడు దశల్లో ప్రజారవాణాను లైట్‌మెట్రోకి అనుసంధానిస్తారు. ఈ రైల్‌ స్టేషన్లను ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా... ప్రజా రవాణా ఆగే ప్రాంతానికి 500మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాలి. రాజధాని అమరావతి ప్రాంతానికీ, విమానాశ్రయం మీదుగా గన్నవరం వరకూ పొడిగించవచ్చు.
లైట్‌మెట్రో మూలంగా భూసేకరణపరంగా ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. నిడమానూరు ప్రాంతంలో రూ.600 కోట్లతో 60 ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని మెట్రో ప్రణాళికలో పేర్కొనగా.. లైట్‌మెట్రోతో ఆ సమస్య ఉండదు.

20604726_1770095176337399_62118198170107
Link to comment
Share on other sites

అమరావతిలో బిజినెస్‌ స్కూల్‌!

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం తరహా సంస్థ కూడా ఏర్పాటు

200 ఎకరాల్లో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మాణం

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ను తలదన్నేలా ప్రపంచశ్రేణి ప్రమాణాలతో అమరావతిలో ఒక బిజినెస్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) తరహాలో ఇక్కడ కూడా ఒక అత్యున్నత వేదికను నిర్మించనున్నారు. 200 ఎకరాల్లో వీటిని నెలకొల్పనున్నారు. భారత వాణిజ్య మండలి(సీఐఐ) సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటుచేస్తుంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆయన అమరావతిలో కూడా అంతకంటే మించి ఉత్తమంగా ఉండేలా, దానికంటే పెద్ద స్థాయిలో ఐఎస్‌బీని ఏర్పాటుచేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇందులో మామూలుగా అందించే ఎంబీఏ కోర్సులతో పాటు కార్పొరేట్‌, పొలిటికల్‌, ఉన్నతాధికారుల పాలన (బ్యూరోక్రటిక్‌ గవర్నెన్స్‌) లాంటి వాటిలో ప్రత్యేక కోర్సులు అందిస్తారు. 300 నుంచి 500 మందికి ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు. అలాగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం తరహాలో ఇక్కడ ప్రత్యేక ఫోరాన్ని ఏర్పాటుచేసి దానికి గుర్తింపు తీసుకురావాలనే తలంపుతో ఉన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిధుల కోసం ఇబ్బందులు లేకుండా కార్పొరేట్‌ సంస్థల సహకారంతో సీఐఐ భాగస్వామ్యంతో నిర్మించాలనేది ప్రతిపాదన. పంజాబ్‌లోని మొహాలీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను నాలుగు కార్పొరేట్‌ సంస్థల విరాళాలతో నిర్మించారు. ఒక్కో సంస్థ రూ.50 కోట్లు ఇచ్చింది. ఇదే తరహాలో అమరావతిలో నిర్మించబోయే బిజినెస్‌ స్కూలుకు పది కార్పొరేట్‌ సంస్థల నుంచి విరాళాలు సేకరించనున్నారు. రూ.400 కోట్లు సేకరించడంతో పాటు రూ.వంద కోట్ల కార్పస్‌ఫండ్‌తో దీన్ని నిర్వహించనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో బిజినెస్‌ స్కూలు నిర్మిస్తారు. పది ఎకరాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు. మిగిలిన 90 ఎకరాల్లో జర్మనీలోని హానోవర్‌లో ఉన్నట్లు భారీ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని సీఐఐ భరిస్తుంది. 2018-19కల్లా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలనేది లక్ష్యం.

వచ్చే నెల నుంచి చర్చలు: అమరావతిలో బిజినెస్‌ స్కూలుకు సంబంధించి సీఐఐ ప్రతినిధులతో వచ్చే నెల నుంచి ప్రభుత్వం చర్చించనుంది. ఆర్థికాభివృద్ధి మండలి సీఐఐ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాక బిజినెస్‌ స్కూల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనుంది. బిజినెస్‌ స్కూలును ఎలా చేపట్టాలి? నిర్మాణం తదితర అనేక అంశాలను ఈ సందర్భంగా సీఐఐతో చర్చించి ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం ముందుకెళ్లనున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి సహకరించడానికి ప్రమోద్‌ సింగ్‌ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. హైదరాబాద్‌లో ఐఎస్‌బీని తీసుకురావడంలో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఎంతో సహకరించారు. ఇప్పుడు కూడా అమరావతిలో ఆయన సేవలు వినియోగించుకుంటే ప్రయోజనకరమని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...