Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

  • Replies 309
  • Created
  • Last Reply
3 నుంచి మలేషియా, చైనాల్లో మంత్రి నారాయణ పర్యటన

ఈనాడు అమరావతి: పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ జులై 3 నుంచి 5 వరకు మలేషియా, చైనాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో మెట్రో రైలుకు బదులు ప్రతామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం నిర్ణయించడం, రాజధాని అమరావతిలోనూ అత్యాధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మలేషియా, చైనాల్లో అత్యాధునిక ఎలక్ట్రికల్‌ బస్సులు, వర్చువల్‌ ట్రాక్‌లపై నడిచే రైళ్లు, ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్‌ వ్యవస్థలు వంటివాటిపై అధ్యయనానికి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు వెళ్లనున్నారు.

Link to comment
Share on other sites

ఎలివేటెడ్‌ విద్యుత్తు ప్రజారవాణాపై అధ్యయనం

మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కౌలాలంపూర్‌ వెళ్లిన అధికారుల బృందం

4ap-sttae38a.jpg

ఈనాడు, అమరావతి: అమరావతితోపాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనానికి పురపాలకశాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక బృందం మలేషియాలో పర్యటిస్తోంది. కౌలాలంపూర్‌లో మంగళవారం ఈ బృందం సభ్యులు పర్యటించారు. మంత్రి నారాయణతోపాటు పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌, అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వీరు మలేషియా, సింగపూర్‌, చైనా దేశాల్లో ఐదు రోజులపాటు పర్యటించనున్నారు. ఆయా దేశాల్లో మెట్రో రైలు, విద్యుత్తు బస్సుల రవాణా తీరుపై అధ్యయనం చేస్తారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అనుమానాలను వ్యక్తం కావడంతో దాని స్థానంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ విద్యుత్తు బస్సులు నడపాలనేది ప్రతిపాదన. మంగళవారం కౌలాలంపూర్‌లో విద్యుత్తు బస్సులు నడిచే విధానాన్ని వారు పరిశీలించారు. కౌలాలంపూర్‌లో ప్రసరణ్‌ గ్రూపు సంస్థ నిర్మించిన విద్యుత్తు బస్సు కారిడార్‌ స్టేషన్లను పరిశీలించారు.

8 నుంచి శ్రీలంక పర్యటనకు మంత్రి అయ్యన్న: రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ఈనెల 8 నుంచి నాలుగు రోజులపాటు శ్రీలంకలో పర్యటించనున్నారు. వ్యక్తిగత కారణాలతో వెళుతున్న ఆయన పర్యటనకు ప్రభుత్వం నుంచి మంగళవారం అనుమతి లభించింది.

Link to comment
Share on other sites

విశాఖ, విజయవాడలో ‘స్పీడ్‌ మాగ్లేవ్‌ రైలు’!

పీపీపీ పద్ధతిలో ఏర్పాటు యోచన: మంత్రి నారాయణ

6ap-state3a.jpg

ఈనాడు, అమరావతి: విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్పీడ్‌ మాగ్లేవ్‌ రైలు రవాణా వ్యవస్థను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధానిలో వినూత్న ప్రజారవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనలో భాగంగా మంత్రి నేతృత్వంలో ఒక బృందం విదేశాల్లో పర్యటిస్తోంది. గత మూడు రోజులుగా చైనాలో ఈ బృందం పర్యటిస్తోంది. అంతకుముందు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో పర్యటించింది. గురువారం పర్యటన వివరాలను మంత్రి పి.నారాయణ ప్రకటన ద్వారా వెల్లడించారు. గురువారం చైనాలోని చాంగ్ఝా, జోజో నగరాల్లో పర్యటించింది. అక్కడ ఏర్పాటు చేసిన స్పీడ్‌ మాగ్లేవ్‌ రైలును పరిశీలించింది. అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘ఈ రైలు ఎలక్ట్రో మాగ్నటిజం ఫోర్సు ద్వారా పనిచేస్తుంది. పట్టాలపై కాకుండా పట్టాలకు 8 మిల్లీమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. మూడు బోగీలు ఉంటాయి. దీనివల్ల శబ్దం రాదు. రణగొణధ్వనులు, కుదుపులు ఉండవు. విశాఖ, విజయవాడలో మెట్రోకు భిన్నమైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నందున ఇలాంటి స్పీడ్‌ మాగ్లేవ్‌ రైలు ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని’ మంత్రి తెలిపారు. అక్కడే ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ బస్సులను శుక్రవారం పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి కరికాలవలవేన్‌, అమరావతి మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

విజయవాడ మెట్రోకు మార్గం సుగమం

మెట్రోరైల్వే చట్టం పరిధిలోకి చేర్చిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: విజయవాడ మెట్రో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మార్గం సుగమం చేసింది. విజయవాడ మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని మెట్రో రైల్వేస్‌(ఆపరేషన్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌) చట్టం-2002 పరిధిలోకి చేరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మెట్రోరైల్వే నిర్మాణ పనులు చేపట్టాలంటే సదరు నగర ప్రాంతాన్ని ఈ చట్టం పరిధిలోకి చేర్చాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...