sonykongara Posted April 6, 2017 Author Posted April 6, 2017 సీట్ల పెంపు ఖాయం కసరత్తు జరుగుతోంది: రాజ్‌నాథ్ నేడు హోంమంత్రిని కలవనున్న సుజనా న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలుగు రాష్ర్టాల్లో సీట్ల పెంపుపై కేంద్రం గత కొంత కాలంగా కసరత్తు చేస్తోందన్నారు. అయితే కసరత్తు ప్రక్రియ ముగియడానికి మాత్రం కాలపరిమితిని విధించలేమన్నారు. ఈ నెల 12 వరకూ జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే అసెంబ్లీ సీట్ల పెంపు నియోజకవర్గాల బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని, వీలుకాకపోతే వచ్చే వర్షాకాల సమావేశాల్లో తప్పకుండా బిల్లు పార్లమెంటుకు ముందుకు వస్తుందని గతంలో ఆయన చెప్పిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, తెలుగు రాష్ర్టాల్లో సీట్లు పెరగడం మాత్రం ఖాయం అన్నారు. కాగా గురువారం రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర మంత్రి, టీడీపీపీ నేత సుజనాచౌదరి సీట్ల పెంపుపై కలవనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో బిల్లు స్వరూపంపై చర్చించడమే కాకుండా బిల్లును ఎప్పుడు పార్లమెంటు ముందుకు తీసుకురావాలన్నదానిపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 సవరణకే మొగ్గు చూపుతున్నారని ఆ మేరకే సీట్ల పెంపు బిల్లు తయారవుతుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు ఒకరు తెలిపారు. బుధవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా సీట్ల పెంపునకు సంబంధించిన ప్రస్తావన రాలేదని తెలిసింది. ప్రతి బుధవారం మాత్రమే కేంద్ర క్యాబినెట్ భేటీ జరుగుతున్నందున ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలంటే ఈ బిల్లు కోసం ప్రత్యేకంగా మరోసారి క్యాబినెట్ సమావేశం జరగాల్సి ఉంటుంది. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు రావాల్సిన అవసరం లేదని జూలైలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టినా పెద్దగా తేడా ఉండదని టీడీపీ నేతలు కొందరు అభిప్రాయ పడుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా కేవలం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26ను మాత్రమే సవరించాలనుకొంటే పార్లమెంటు సమావేశాల తర్వాతనైనా ఆర్డినెన్స్ తీసుకురావచ్చని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. గతంలో పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడానికి కూడా ఆర్డినెన్స్ మార్గాన్నే మోదీ ఎంచుకున్నారని, బిల్లులో మార్పులకు ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టడం సబబేనన్నది వారి వాదన. ఏది ఏమైనా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టేలా తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎంపీలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.
sonykongara Posted April 6, 2017 Author Posted April 6, 2017 మరోసారి హీటెక్కనున్న ఏపీ హైదరాబాద్: ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యస్థీకరణ వేడి చల్లారక ముందే నియోజకవర్గాల హీట్ రాజుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన సందడి మొదలైంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 పెరగాలి. తెలంగాణలో 119 నుంచి 153కు పెరుగుతాయి. అయితే రాజ్యాంగ సవరణ చేయాలా? లేక పునర్వభజన చట్టంలో మార్పులు చేయాలా? కేంద్రంలో ఇప్పటివరకు తర్జనభర్జనలు జరిగాయి. రాజ్యాంగంలోని 170వ అధికరణలో 15 సెక్షన్‌కు సవరణ చేయడం లేదా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు సవకణ చేయడం ద్వారా పునర్విభజన చేపట్టవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. 2026 వరకు దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదని, 2002లో 84వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. 175వ అధికరణలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ 175వ అధికరణలో ఒక అంశాన్ని చేర్చాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టికల్ 3 ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు ఈ సవరణ వర్తించదనే క్లాజ్ చేర్చితే సరిపోతుందని న్యాయనిపుణులు అంటున్నారు. సవరణ కోసం కేంద్రం ఇప్పటికే అడుగులు వేస్తోంది. రాజ్యాంగ సవరణ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఛీప్ కన్వీనర్‌గా, రెండు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఏర్పడే కమిటీ 6 నెలల్లో పునర్విభజన పూర్తి చేయాల్సి ఉంది. హోం మంత్రి రాజ్‌నాథ్‌తో ప్రత్యేకంగా సమావేశమై వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి ఇదే విధివిదానాలపై చర్చించనున్నారు. ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి, పునర్విభజనపై ఎప్పటికి స్పష్టత వస్తుందనేది ఈ సమావేశం తర్వాత తేలిపోతుంది. ప్రస్తుతం ఏపీలో 175 నియోజకవర్గాల్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా పునర్వభజనతో మరో 9 పెరుగుతాయి. దీంతో 38కి కానున్నాయి. ఎస్టీలకు 7 నియోజకవర్గాలు ఉండగా 5 పెరిగి 12 కానున్నాయి. ఇక తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎస్సీలకు 19 ఉండగా 5 పెరిగి 24 కానున్నాయి. ఎస్టీలకు 12 ఉండగా రెండు పెరిగి 14 కానున్నాయి. పెరిగే 34 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు దక్కనున్నాయి. పునర్విభజన చట్టంలో సెక్షన్ 26 (1) సి కింద పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దులు, ప్రాంతాలు మార్పు చేసుకోవచ్చని సూచించారు. ఏపీలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగనున్నాయి. తెలంగాణలో పెరిగిన జిల్లాల ప్రకారం పునర్విభజన చేస్తారా? లేక పాత జిల్లాలా ఆధారంగా జరుగుతుందా? అనేతి ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. మొత్తానికి పునర్వభజన చట్టంలో సెక్షన్ 26 ప్రకారం కేంద్రం రంగంలోకి దిగుతోంది. ఆరు నెలల్లో ఈ పక్రియ పూర్తవుతుందని అంటున్నారు. రెండు పక్కల రాజకీయ అలజడి రేగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గాల్లో మండలాలు, అసెంబ్లీ సెగ్మెంట్లలోని పరిస్థితులను తెలుసుకుని వ్యూహరచన చేసేందుకు అధికార పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. అంటే రెండేళ్ల ముందే తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడి హడావుడి కనిపించబోతోంది.
sonykongara Posted April 23, 2017 Author Posted April 23, 2017 (edited) v Edited May 21 by sonykongara
swarnandhra Posted April 23, 2017 Posted April 23, 2017 this article is misleading almost like fineprint in adverstisements. Rajnath Singh did not sign the note, he signed a document ordering the official to "prepare" a note. and worse of all there is no clarity on what type of note should it be. Even Eenadu is stooping so low. 95% matter in this article is masala repeated 10 times already in the last month.
fan no 1 Posted June 26, 2017 Posted June 26, 2017 If reorg happens this year or next , 2026 lo malli reorg jarugutunda?
RKumar Posted June 27, 2017 Posted June 27, 2017 President elections lo BJP ki support cheyyadaaniki YSRCP Delimitation ee saariki aapamani korindi. I doubt if it will be taken up. Delimitation jaragakapothe TRS & TDP rendintiki kontha loss vuntundi as many leaders joined both parties. Vaallalo konthmandi malli congress & YSRCP ki potharu.
Saichandra Posted June 27, 2017 Posted June 27, 2017 Abn lo rasadu eroju paper lo cabinet note ready ayyindi ani,
fan no 1 Posted June 27, 2017 Posted June 27, 2017 President elections lo BJP ki support cheyyadaaniki YSRCP Delimitation ee saariki aapamani korindi. I doubt if it will be taken up. Delimitation jaragakapothe TRS & BJP rendintiki kontha loss vuntundi as many leaders joined both parties. Vaallalo konthmandi malli congress & YSRCP ki potharu. Exactly, delimitation cheste BJP ki seats kooda ekkuva istaru TDP vallu, so cheyochu...
sonykongara Posted June 27, 2017 Author Posted June 27, 2017 వర్షాకాల భేటీలో బిల్లు పెట్టిద్దాం తగినట్లుగా పావులు కదుపుదాం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేసీఆర్, చంద్రబాబు మంతనాలు! ఇప్పటికే సిద్ధమైన కేబినెట్ నోట్ న్యూఢిల్లీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. జూలై 17వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టేందుకు పావులు కదపాలని, లేకపోతే నియోజకవర్గాల పునర్విభజనకు సమయం సరిపోదని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు సీఎంలు ఈ అంశంపై చర్చించుకున్నారు. నియోజకవర్గాల పెంపు బిల్లుకు సంబంధించి కేబినెట్ నోట్‌ను న్యాయవిభాగం ఇప్పటికే సిద్ధం చేసినట్లు, పీఎంవో ఆదేశాల కోసం కేంద్ర హోంశాఖ ఎదురుచూస్తున్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రస్తావించారు. దీంతో సీట్ల పెంపుపై కేంద్రానికి ప్రతిసారీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఏదో ఒక సాంకేతిక కారణం చూపి వాయిదా వేస్తున్నారని, వర్షాకాల సమావేశాల్లో వచ్చేందుకు తమ తరఫు నుంచి ప్రయత్నిస్తామని చంద్రబాబు.. కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. ప్రధాని మోదీని కలిసినప్పుడు సీట్ల పెంపు అంశాన్ని మరోసారి ప్రస్తావించాలని కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం. ఈ నెల 23న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్లమెంట్ లైబ్రరీ ప్రాంగణంలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని మోదీ రావడానికి ముందు ఇద్దరు సీఎంలు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అయితే ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ఎన్డీఏకు చెందిన ఇతర నేతలు వీరి వద్దకు రావడంతో చర్చను అంతటితో ముగించారు. అయితే ఆ తరువాత తన నివాసానికి వెళ్లిన కేసీఆర్.. టీఆర్‌ఎస్ ఎంపీల ద్వారా సీట్ల పెంపు బిల్లు గురించి వాకబు చేసినట్లు, హోంమంత్రి రాజ్‌నాథ్‌తో ఈ అంశాన్ని ప్రస్తావించాలని చెప్పినట్లు తెలిసింది. వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోద ముద్ర పడకపోతే 2019 ఎన్నికలలోపు పునర్విభజన ప్రక్రియ ముగియడం కష్టమేనని ఎన్నికల కమిషన్ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. 2019 ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు సీట్ల పునర్విభజన ప్రక్రియ ముగియాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలోనే వస్తుందని, అంతకంటే ముందుగా.. అంటే సెప్టెంబరు నాటికి పునర్విభజనను కమిషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. పునర్విభజన ప్రక్రియకు కనీసం 9 నెలలైనా సమయం పడుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే వర్షాకాల సమావేశాల్లోనే సీట్ల పెంపు బిల్లుకు మోక్షం లభిస్తే బావుంటుందని ఎన్నికల కమిషన్ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి ఎన్నికల కమిషన్ తీసుకెళ్లినప్పుడు పీఎంవో ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. ఆర్టికల్ 170 సవరణ కోసం ముసాయిదా బిల్లు సిద్ధం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా సీట్ల పెంపుపై బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుగా కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంది. సీట్ల పెంపుపై గతంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తెలుసుకున్న కేంద్రం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకే ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని కూడా న్యాయశాఖకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముసాయిదా బిల్లుతోపాటు కేబినెట్ నోట్‌ను కూడా న్యాయశాఖ సిద్ధం చేసింది. నిజానికి గత శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ ముసాయిదా బిల్లు సిద్ధం కాకపోవడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత వరుసగా ట్రిపుల్ తలాక్, జీఎస్టీ బిల్లులపై కేంద్రం బిజీ అయింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు మరోసారి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోతే బిల్లుకు మోక్షం లభించదని ఎన్నికల కమిషన్ అధికారులు భావిస్తున్నారు. బేషరతు మద్దతు అందుకే? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి భేషరతుగా మద్దతు తెలిపిన వైసీపీ నేతలు మాత్రం సీట్ల పెంపు జరగదని ధీమాగా ఉన్నారు. సీట్ల పెంపును వాయిదా వేయాల్సిందిగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారని, ప్రధాని హామీ మేరకే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీఏకు బేషరతు మద్దతు ప్రకటించిందని చెబుతున్నారు. అయితే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు సందర్భంగా టీఆర్‌ఎస్ కూడా సీట్ల పెంపు వెంటనే చేపట్టాలన్న డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచిందని గులాబీ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించడం తథ్యమని వారు గట్టిగా నమ్ముతున్నారు.
mahesh1987 Posted July 6, 2017 Posted July 6, 2017 idanna tondaraga chesi chaste baagundu ee BJP vallu, asale time chala takkuva vundi
Saichandra Posted July 6, 2017 Posted July 6, 2017 idanna tondaraga chesi chaste baagundu ee BJP vallu, asale time chala takkuva vundi
Jaitra Posted July 6, 2017 Posted July 6, 2017 Gudivada ni reserve chesi,aa kodali gaadiki check pettandi
sonykongara Posted July 6, 2017 Author Posted July 6, 2017 అసెంబ్లీ సీట్ల పెంపుపై మరో అడుగు ఆర్టికల్ 170(3)కి సవరణే చాలు! న్యాయశాఖ అభిప్రాయం కేంద్ర హోంశాఖకు దస్త్రం తదుపరి కార్యాచరణకు సిద్ధం ఈనాడు - దిల్లీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా మరో ముందడుగు పడింది. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కేంద్ర న్యాయశాఖ పచ్చజెండా వూపినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దస్త్రానికి న్యాయశాఖ ఆమోదముద్ర వేసి హోంశాఖకు పంపినట్లు సమాచారం. ఇప్పటివరకూ అసెంబ్లీ సీట్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 170(3)కి చిన్న సవరణ చేస్తే సరిపోతుందని న్యాయశాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆ ఆర్టికల్ కింద పొందుపరిచిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వర్తించవని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుందని సూచించినట్లు తెలిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెంచాలంటే ఆర్టికల్170(3)కి సవరణ చేయాల్సిందేనని గత అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ చెప్పారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగానే ఇప్పుడు న్యాయశాఖ సవరణలు సూచించినట్లు సమాచారం. బాధ్యత హోంశాఖదే విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు బాధ్యత హోంశాఖపై ఉన్నందున కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై దాదాపు రెండు నెలల క్రితం న్యాయశాఖ సలహా కోరారు. వారు అన్ని కోణాల్లో పరిశీలించి గత అటార్నీ జనరల్ ఇచ్చిన సూచనను సమర్థిస్తూనే, రాజ్యాంగ సవరణ ఎలా చేయాలో సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ రాజ్యాంగ సవరణకు మళ్లీ 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని, కేవలం పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తే సరిపోతుందని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంశాఖ తదుపరి అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ సవరణవల్ల ఇతరత్రా ప్రభావాలేమైనా ఉంటాయా? అని నిర్ధారించుకున్న తర్వాత కేబినెట్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తర్వాత దీన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలో పెట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటుకు బిల్లు రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ మొత్తం ప్రక్రియ వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి కావాలని ఇటు తెలుగుదేశం, అటు తెరాస పార్టీలు ఆకాంక్షిస్తున్నాయి. పూర్తి చేయాల్సిన అంశాలు ఇంకా ఎన్నో? అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నా ఆ అంశం సాఫీగా పూర్తి కావాలంటే చేయాల్సిన తతంగాలు చాలా ఉన్నాయి. ముందస్తుగానే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రక్రియ సాఫీగా జరిగే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. * విభజన చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్వి్యభజన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘమే పూర్తి చేయాలి. అంటే ప్రధాన ఎన్నికల కమిషనరుతోపాటు, మరో ఇద్దరు కమిషనర్లకు ఇందులో పాత్ర ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు ఇందులో స్థానం కల్పిస్తేనే ప్రక్రియ సాఫీగా సాగడానికి వీలవుతుంది. విభజన అన్నది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి 2003 నియోజకవర్గాల పునర్వి్యభజన చట్టంలోని సెక్షన్-3 ప్రకారం ఇరు రాష్ట్రాల ఎన్నికల సంఘం కమిషనర్లనూ ఇందులో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నియమించారు. ఇప్పుడూ అదే నిబంధన ఇక్కడా వర్తింపజేయాల్సి ఉంటుంది. * పునర్వి్యభజన చట్టం ప్రకారం 1975, 2008లో జిల్లాలను యూనిట్‌గా తీసుకుని అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించారు. అయితే 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఏ ప్రాతిపదికన విభజించాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. విభజన చట్టంలోని సెక్షన్ 1(సి)లో పార్లమెంటు నియోజకవర్గ సరిహద్దులను మార్చవచ్చని స్పష్టంగా చెప్పారు. ఆర్టికల్ 81(ఎ), క్లాజ్-2 ప్రకారం రాష్ట్ర జనాభా అన్ని అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సమానంగా ఉండాలి. ఈ నిబంధనను నెరవేర్చాలంటే అసెంబ్లీ స్థానాల విభజనకు జిల్లాను యూనిట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా చేసుకుంటే రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనను అమలు చేయడం కష్టమవుతుంది. * నియోజకవర్గాల పునర్వి్యభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గం ఒక జిల్లా పరిధిలోనే ఉండాలి. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచకూడదు తప్పితే వాటి సరిహద్దులు మార్చడానికి ఎక్కడా అడ్డంకులు లేవు. ఈ నిబంధన ఆధారంగా పశ్చిమబంగలో 2016లో మూడు లోక్‌సభ స్థానాల సరిహద్దుల్లో మార్పులు చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయ రాష్ట్రాల్లో జిల్లాను యూనిట్‌గా చేసుకుని విభజన ప్రక్రియ చేపట్టాలి. * అసెంబ్లీ స్థానాల విభజన ప్రక్రియ మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగేలా చూసుకోవాలి. అలాగే మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా కేంద్ర హోంశాఖ గడువు విధిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
sonykongara Posted July 10, 2017 Author Posted July 10, 2017 6 నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి: చంద్రబాబు10-07-2017 18:23:12 అమరావతి: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వస్తోందని ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. ఆరు నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. పునర్విభజన బిల్లుపై హోంశాఖలో కదలిక ఉందని కేంద్రమంత్రులు ధృవీకరించారు.
krishna_Bidda Posted July 10, 2017 Posted July 10, 2017 Gudivada ni reserve chesi,aa kodali gaadiki check pettandi gdv ni reserve cheyyatam ante ika mana party valu nani ki pikaleru ane news veltundi....we should have it genral and win it in 2019.....Now we are strong in gdv Saichandra 1
krishna_Bidda Posted July 10, 2017 Posted July 10, 2017 Anni party lu ekabiprayam to ok ane ekika vishayam seat la penchudu ...lol.....political ga employment create cheyyali kada...
krishna_Bidda Posted July 10, 2017 Posted July 10, 2017 Raavi ki ivvakapote eppudu strong ee ...vadsoka useless fellow..more over Yalavarthy coming to TDP has made TDP more strong .....re organise chesinappudu 2004 mandals unna gdv constituency unte chalu ...Nani done inka
harshachunduri Posted July 11, 2017 Posted July 11, 2017 Raavi ki ivvakapote eppudu strong ee ...vadsoka useless fellow..more over Yalavarthy coming to TDP has made TDP more strong .....re organise chesinappudu 2004 mandals unna gdv constituency unte chalu ...Nani done inka Reorganization Jarigite ide jarugutundi confirm ga ...
Saichandra Posted July 11, 2017 Posted July 11, 2017 పునర్విభజన రెడీ11-07-2017 03:31:42 కేంద్రం నిర్ణయం తీసుకుంది: బాబు అసెంబ్లీ సీట్లు 225 అవుతాయి అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే వారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. తనకున్న సమాచారం ప్రకారం పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని చెప్పారు. దీంతో రాష్ట్రశాసనసభ స్థానాలు 225కి పెరుగుతాయని తెలిపారు. గతంలో అనుకున్నట్లుగా దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటు అనుమతితో ఒక ఉత్తర్వు తీసుకొస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. జిల్లాను కాకుండా లోక్‌సభ నియోజకవర్గం యూనిట్‌గా పునర్విభజన చేయాలని కేంద్రం అనుకుంటోందని, ఈ లెక్కన ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి 9 అసెంబ్లీ సీట్లు వస్తాయని వివరించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేస్తే మంచిదని, దీనివల్ల కొన్ని అయోమయాలు తొలగిపోతాయని కొందరు ఎంపీలు అన్నారు. ఈఏపీ కింద సాధిస్తే రూ.13 వేల కోట్లు లాభం విదేశీ రుణ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద ఎక్కువ సాయం కేంద్రం నుంచి సాధించగలిగితే ఐదేళ్లలో రూ. 13 వేల కోట్ల మేర లాభం కలుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా ఎంపీలకు చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర ఈ సమావేశంలో కేంద్రం నుంచి సాధించాల్సిన నిధులపై ప్రజంటేషన్ ఇచ్చారు. ‘కేంద్ర ప్రాయోజిత పఽథకాలను మనం తీసుకొంటే నలభై శాతం రాష్ట్రం భరించాలి. విదేశీ ప్రాజెక్టుల కింద అయితే కేవలం పది శాతం భరిస్తే సరిపోతుంది. మొత్తం అవే తెచ్చుకోగలిగితే ఏడాదికి రూ.2600 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్లలో ఈ తేడా రూ.13 వేల కోట్లు ఉంటుంది’ అని తెలిపారు. ప్రతి శాఖకు ఎంపీలు వ్యక్తిగతంగా వెళ్లి విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆమోదింపచేయాలని, వాటంతటవే అవుతాయని ఊరుకోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరంలో భూ సేకరణ, పునరావాస కల్పనకు రూ.32 వేల కోట్లు అవసరమని, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 16 వేల కోట్లు కావాలని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేసిన ఖర్చులో కేంద్రం ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రాజధాని పేరిట విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ ఇతరాలకు ఈ మూడేళ్లలో ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ. వెయ్యి కోట్లు రావలసి ఉందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కూడా ఇంకా రూ. వెయ్యి కోట్లు రావాలని చెప్పారు. కేంద్రం నుంచి రావల్సినంతగా సాయం రావడం లేదని, ఈ దిశగా ఎంపీలు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. విశాఖ రైల్వే జోన్ ప్రజల్లో భావోద్వేగ అంశంగా ఉందని, దాని సాధనకు గట్టి ప్రయత్నం చేయాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కోరారు. తమ ప్రాంతానికి సాగునీటి వసతికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా బీరు పోకుండా జాగ్రత్తగా పోలింగ్ చేయించాలని, ఎంపీలందరూ ఒక రోజు ముందే ఢిల్లీ చేరాలని చంద్రబాబు ఆదేశించారు
NatuGadu Posted July 11, 2017 Posted July 11, 2017 Golden chance... Mahaametha enno darunalu cheesadu poyinasaari... Time for revenge ... Motive kukkala tokalu cut cheyyali like cleaner, Loja, chevireddy etc...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now