Jump to content

Recommended Posts

Posted

అన్ని వర్ణాల పేదలకు సాయం

అన్ని వర్ణాల పేదలకు సాయం

అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) ఆర్థిక సాయం అందించాలని పొలిట్‌ బ్యూరోలో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇందుకు 2017-18 బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనున్నట్టు సీఎం చెప్పారు. ఈ అంశం పొలిట్‌బ్యూరోలో చర్చకు వచ్చినప్పుడు... ఇకపై కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయరాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు.. ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నాయని సభ్యులు ప్రశంసించారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో... కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామని సీఎం చెప్పారు. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 30వేలు డిపాజిట్‌ చేసి, యుక్త వయసు వచ్చాక రెండు లక్షల రూపాయలను డ్రా చేసి ఇవ్వాలన్న ఎన్నికల హామీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. విధి విధానాలను ఖరారు చేశాక దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ)ను ప్రోత్సహించడం కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో త్వరలో ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టాన్ని తేనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇక... చంద్రన్న బీమా పథకాన్ని పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రశంసించారు. 2.5 కోట్ల మంది పేదల జీవితాలకు ఈ పథకం భరోసా కల్పిస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో ఉన్నవి, కొత్తగా మంజూరు చేయబోయేవి కలిపి మొత్తం 10 లక్షల గృహాలను 2018లోగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలకే గృహ అవసరం ఉందని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో 50 లక్షల కుటుంబాలకు ఉన్నట్టు చూపించారని, ఇది వాస్తవాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. ఈ ప్రమాణాలను మార్చాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని, మోదీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు.
 
Posted

income takkuvaga vunde OC laki 0 intrest loans ichi. OC lo Higher education chesevaldaki andariki full fee pay cheyyali...not only in AP all-over india lo ee collage lo chadivina. Ex:(IITS,IIMS,NITS).

Posted

:super:

SUPER and best thought from CBN

Also a Kapu reservations should be EBC based for non-gazetted jobs for all Open castes people.

That way no one can crib against other as only poor will go for those jobs and not already rich.

Andhra has highest Open Caste percentage in India and oc-poor deserve justice.

  • 2 weeks later...
  • 1 month later...
Posted

Cbn 2004 elections mundhu gemini tv lo "Dial ur CM" programme ki vachinappudu..oka female caller matladuthu ila upper sections lo kuda financial ga weak vunna vaallu chaala mandhi vunnaru,upliftnent ki emanna cheste baguntundhi sir ani anindhi.Appudu Cbn edhokati cheyyalane alochana vundhi,definite ga chestanamma ani annadu.Bad luck manam power loki raaledhu.Ippudu manam power loki vachaka e promise ni fulfill cheyyatam cbn commitment ki nidarsam.Health n education lo mananeppudu mundhundali..

2004 lo oka female caller baganae gurthu etukunav...

lokam lo enni lingalunnai enti gurthu pettukoleka potaniki..aa arava santha tho serithe neelekke vintha vintha ga matladatar

aravam :no1:
  • 3 weeks later...
Posted
నవ్యాంధ్రను నంబర్‌1 చేస్తా
 
636308454778651435.jpg
  • మీరు అండగా ఉండండి.. ఆశీర్వదించండి
  • అగ్రవర్ణ పేద విద్యార్థులకు 700 కోట్లు: సీఎం
తిరుపతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘మీకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ఎంతో శ్రమిస్తున్నా. నాకు అండగా ఉంటానని మాట ఇవ్వండి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌ చేస్తా. ప్రపంచంలోనే ద బెస్ట్‌ స్టేట్‌గా నిలుపుతా’ అని సీఎం చంద్రబాబు యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తిరుపతి సమీపంలోని పుత్తూరు సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ వార్షికోత్సవ సభ గురువారం జరిగింది. ఈ సభకు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం ఉద్వేగభరితంగా మాట్లాడారు. ‘నేను మహా అయితే 20..30 ఏళ్లు బతుకుతాను. నా కుటుంబానికి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పనిలేదు. నా కష్టం.. ఆలోచన అంతా మీ గురించే. రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి. అదే నా తపన’ అని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలోని విజ్ఞానాన్ని అంతా మన రాష్ట్రానికి తీసుకొస్తానని, ప్రపంచంలోనే తిరుగులేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతానని సీఎం యువతకు హామీ ఇచ్చారు.
 
‘మూడేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయింది. అప్పుల మూట నెత్తినపెట్టుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చాం. అందరిలో అపనమ్మకం. ఈ రాష్ట్రం ఏమవుతుందోనన్న భయం. అతి తక్కువ కాలంలో భయాన్ని పోగొట్టా.’ అని సీఎం వ్యాఖ్యానించారు. అప్పులున్నా.. ఆర్థిక సమస్యలున్నా.. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేం తనకు రెండు కళ్లు అన్నారు.
 
అగ్ర వర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు సాయం చేయాల్సిన అవసరం ఉందని, అలాంటి వారి కోసం రూ.700 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు సైతం విదేశాల్లో చదువుకొనేందుకు సాయం అందించనున్నట్లు చెప్పారు. చదువు తరగతి గదులకే పరిమితమైతే ఉపయోగంలేదని ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లేనిదే వృత్తిలో రాణించలేరని చంద్రబాబు అన్నారు. సాధారణంగా ఆలోచిస్తే ఉద్యోగం వస్తుందని, వినూత్నంగా ఆలోచిస్తే పరిశ్రమ స్థాపించే శక్తి వస్తుందన్నారు. సరికొత్త ప్రయోగాల గురించి వివరించే క్రమంలో సీఎం తాజాగా పిడుగులు పడే ప్రాంతాల గురించి ముందస్తు సమాచారాన్ని అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు ‘పిడుగు పడడానికి గంట ముందే ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో ఆ ప్రాంతంలో సెల్‌ టవర్‌ ద్వారా అందరి మొబైళ్లకు మెసెజ్‌ అందేలా చేశాను.
 
ఇది సాంకేతిక విప్లవం కాదా..’ అని సీఎం అన్నప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాల్లో తాను ఎక్కువ గడపనని, కానీ ఇక్కడ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను చైతన్యపరచడం కోసం ఎక్కువ సేపు గడుపుతున్నానని సీఎం పేర్కొన్నారు. ‘ఇక్కడ 4500 మంది ఉన్నారు. నా ప్రసంగంతో 450 మంది చైతన్యమై వినూత్నంగా ఆలోచించి పారిశ్రామికవేత్తలుగా మారినా చాలు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఇంత సేపు గడిపా’ అని సీఎం తెలిపారు.
 
Last lines super..

Guest Urban Legend

\\

:terrific: :terrific:

speech

i.e cbn

plz give the link for the article brother

Posted

CBN used to go to all universities & colleges before 2014 elections to know students views. He/Lokesh/Ministers should do same next 1 year to know student views.

Posted

income takkuvaga vunde OC laki 0 intrest loans ichi. OC lo Higher education chesevaldaki andariki full fee pay cheyyali...not only in AP all-over india lo ee collage lo chadivina. Ex:(IITS,IIMS,NITS).

asalu regardless caste and creed, quality education completely free ivvali.....and jobs merit meeda ivvali....
  • 2 weeks later...
Posted
చంద్రబాబు మరో చారిత్రాత్మిక నిర్ణయం.... అగ్రవర్ణ పేదలకూ ఆర్ధిక సాయం... Super User 29 May 2017 Hits: 3210  
cbn-reservation-29052017.jpg
share.png

సమాజం లోని అన్ని వర్గాల ఆర్ధిక అభివృద్దికి కృషి చేయాలని, అందుకోసం అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో S.C , S.T. , B.C. , మైనారిటీ వర్గాలకు అనేక ప్రభుత్వ పధకాలు ఆయా కార్పొరేషన్ ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. శతాబ్దాలు గా అభివృద్దికి నోచుకోని వర్గాలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనే నిర్ణయంతో, గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు, వీటిని అమలుపరిచి, ఆ వర్గాలకు అండగా నిలిచాయి.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కాపులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి రుణాలు మంజూరు చేస్తున్నారు. విదేశీ విద్యా పధకం ద్వారా అనేక మందిని విదేశాలకు పంపిస్తున్నారు. కాపుల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వాలు చేయని ఎన్నో పనులు ఇప్పుడు చేస్తున్నారు. కాపుల రిజర్వేషన్ అంశం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, బ్రాహ్మణులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు, ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని, కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మిగతా కులాలలో ( రెడ్డి , కమ్మ , వైశ్య , వెలమ , క్షత్రియ ) కూడా పేదలు ఉన్నారు. ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకోవటం లేదన్న భావన వీరిలో రోజు రోజుకీ బలపడుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ తరుణంలో, బలహీన వర్గాల తరహా లోనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకూ కార్పొరేషన్ అమలు చేసి అగ్రవర్ణ పేదలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 2017-18 నుండే ఈబీసీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ అంశం పై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం విస్త్రుతంగా చర్చించారు. త్వరలోనే విధివిధానాలు ఖరారు చెయ్యనున్నారు.

ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని చుస్తే, ఈబీసీ కార్పొరేషన్ కు, రూ.700 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.. అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు సైతం విదేశాల్లో చదువుకొనేందుకు సాయం అందిచటం, వీరికి కూడా బ్యాంకుల ద్వారా విద్యా , వ్యాపారాభివృద్ధికి రుణాలు , అగ్రవర్ణ పేద విద్యార్ధులకు ఫీజు రీఎంబెర్సుమెంట్, చిన్న , మధ్య తరహా వ్యాపారస్తులకు రుణాలు ఇప్పించే కార్యక్రమాలు లాంటివి ఈ కార్పొరేషన్ చెయ్యనుంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...