ramntr Posted May 31, 2017 Posted May 31, 2017 Hats off u Cbn, education varaku ebc youth ki kuda full support vunte chalu..
sonykongara Posted May 31, 2017 Author Posted May 31, 2017 ఈ పథకం కింద ఉచిత కోచింగ్‌తో పాటు, నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 3850 మందిని ఎంపిక చేసి దేశవ్యాప్తంగా నిర్దేశించిన 15 కోచింగ్ సెంటర్లలో 9 నెలల పాటుశిక్షణ ఇస్తారు. సీట్ల సంఖ్యఎస్సీ – 700ఎస్టీ – 300బీసీ – 1000కాపు – 750మైనారీటీ – 300బ్రాహ్మణ – 50ఈబీసీ – 750మొత్తం – 3850
Guest Urban Legend Posted May 31, 2017 Posted May 31, 2017 na media kodakallara ....ivi veyyandi ra tv lo
sonykongara Posted October 6, 2017 Author Posted October 6, 2017 8న సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష పార్డ్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మయ్య వెల్లడి వినుకొండ, న్యూస్‌టుడే: గత రెండేళ్లలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో సివిల్స్‌కు శిక్షణ తీసుకొని ఎంపికకాని వారిలో 300 మందిని ఎంపికచేసి ఉచిత శిక్షణ ఇవ్వాలని ‘పారా అసోసియేషన్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్’ (పార్డ్) నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 8న ఆదివారం నాగార్జున విశ్వవిద్యాలయంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు పార్డ్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పీవీ లక్ష్మయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపిక పరీక్షలో ప్రతిభ చూపే మొదటి వంద మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించడానికి గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అంగీకరించారని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులుwww.drlakshmaiah.comలో శనివారం సాయంత్రం వరకు పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు. నమోదు ధ్రువపత్రాన్ని తీసుకొని పరీక్షకు హాజరవ్వాలని పేర్కొన్నారు.
sonykongara Posted October 19, 2017 Author Posted October 19, 2017 అగ్రవర్ణ పేదకూ అండ యువతను ఆదుకునేలా పథకాలు.. 695 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు 500 మందికి విదేశీ విద్య పోటీ పరీక్షలకు ఉత్తమ శిక్షణ చిన్న పరిశ్రమలకు రాయితీలు నైపుణ్యాభివృద్ధికి సహకారం ఈ ఏడాది నుంచే అమలు సీఎం రాగానే గ్రీన్ సిగ్నల్ అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు బ్రాహ్మణులు, కాపుల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.... ఇతర అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ) యువతకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈబీసీ యువత కోసం రూ.695 కోట్లతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనుంది. ఈ ఏడాదే అమలు చేసేలా దీనిపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధం చేసి... సీఎం ముందుంచారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ పథకంపై ఆమోద ముద్ర పడనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల పరిధిలోకిరాని... ఇతర వర్గాల్లోని పేదల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఈ బడ్జెట్‌లోనే ప్రభుత్వం ఈబీసీలకు రూ.263 కోట్లు కేటాయించింది. 500 మందికి విదేశీ విద్య ప్రతిభావంతులై, మెరిట్ సాధించినప్పటికీ... కేవలం ఆర్థిక పరిస్థితులవల్ల విదేశీ చదువులకు దూరమైన వారిని ‘ఈబీసీ పథకం’ ద్వారా ఆదుకుంటారు. రూ.50 కోట్లతో 500 మందిని విదేశీ విద్యకు ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున... 250 మంది యువకులు, 250 మంది యువతులకు సహాయం అందిస్తారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసి... పీజీ, పీహెచ్‌డీ, సీపీఏ కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ పథకం ద్వారా సాయమందిస్తారు. ఇతర కార్పొరేషన్లలాగానే రూ.6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండి... 35 ఏళ్ల లోపు యువతీ, యువకులు ఈ పథకానికి అర్హులు. ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, చైనా తదితర దేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు మొదట రూ.5 లక్షలు అందిస్తారు. ఇమిగ్రేషన్ కార్డు పొందిన తర్వాత మరో రూ.5 లక్షలు అందచేస్తారు. ఉన్నత విద్యకు తోడ్పాటు.... ‘ఉన్నత విద్యాదరణ’ పథకం ద్వారా ఈబీసీ విద్యార్థులకు ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తారు. సివిల్స్, ఏపీపీఎస్సీతోపాటు బ్యాంకు, ఇతర పోటీ పరీక్షలు రాసేందుకు అవసరమైన కోచింగ్ ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనికోసం ఈ ఏడాది రూ.30 కోట్ల నిధులను వెచ్చించనుంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ చదువుతున్న యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రాడ్యుయేట్, పోస్టు గాడ్యుయేట్‌లో చివరి ఏడాది చదువుతున్న వివిధ సంస్థలు, పరిశ్రమల్లో శిక్షణ ఇప్పిస్తారు. తద్వారా వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలను మెరుగుపరుస్తారు. ఆర్థిక స్వావలంబన కోసం.... ఈబీసీ యువతకు పలు ఆర్థిక స్వావలంబన కార్యక్రమాల అమలు కోసం మరో రూ.83 కోట్లు కేటాయించనున్నారు. కొత్తగా స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించే యువతకు, ఇప్పటికే ప్రారంభించిన వారిని ప్రోత్సహించేందుకు ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు ఆర్థిక సహకారమందిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, సేవారంగం, రవాణా విభాగంలో ఉండి... 21 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఇందుకు అర్హులు. లబ్ధిదారుల్లో మూడో వంతు మహిళలు ఉంటారు. యూనిట్ విలువలో 50 శాతం... గరిష్ఠంగా రూ.లక్షకు మించకుండా సబ్సిడీ ఇస్తారు. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తారు. రేషన్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆర్థికసాయం అందిస్తారు. ఈబీసీలకు అందించే 207 రకాల యూనిట్లన్నింటినీ జియో ట్యాగింగ్ చేస్తారు.
sonykongara Posted December 8, 2017 Author Posted December 8, 2017 ఈబీసీ పథకాలకు నిధులు ఈనాడు, అమరావతి: ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన వారికి వివిధ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు రూ.100 కోట్లు కేటాయించారు. బ్యాంకులతో అనుసంధానించిన పథకాలకు రూ.83కోట్లు, విదేశీ విద్యకు రూ.50కోట్లు, సివిల్ సర్వీసుల శిక్షణ, ఇతర పోటీపరీక్షలకు హాజరయ్యే వారికి రూ.30కోట్లు చొప్పున మంజూరు చేశారు.ట్రిమ్‌కో విభజనకు ఆమోదం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్(ఏపీ ట్రిమ్‌కో) సంస్థ విభజనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
sonykongara Posted December 8, 2017 Author Posted December 8, 2017 ఈబీసీ పథకాలకు రూ.263 కోట్లు08-12-2017 02:43:05 రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) కోసం రూ.263కోట్ల నిధుల వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో తొలిసారిగా ఈబీసీలకు రూ.263కోట్ల నిధులు ప్రతిపాదించారు. ఇందులో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పఽథకానికి రూ.100కోట్లు, బ్యాంక్ లింక్డ్ సహకార కార్యక్రమాలకు రూ.83కోట్లు, ప్రతిభగల విద్యార్థులకు ఆర్థిక సహకారానికి రూ.50 కోట్లు, సివిల్స్ శిక్షణ పథకానికి 30కోట్లు ప్రతిపాదించారు.
lovemystate Posted January 20, 2018 Posted January 20, 2018 This is totally meaningless and destroys society if taken too much. If a father remains poor because he doesnt workhard for his family despite suffering no social discrimination - is it right for govt using hardworking fathers tax amount to support his daughter or son ? ila chesthe pillalu kosam, dabbulu kosam kasthapadi udyogalu icche manishi ki encoragement yedhi ?
sonykongara Posted January 20, 2018 Author Posted January 20, 2018 అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం సహాయం... 2 లక్షల వరకు సహాయం... ఇలా అప్లై చేసుకోండి... సమాజం లోని అన్ని వర్గాల ఆర్ధిక అభివృద్దికి కృషి చేయాలని, అందుకోసం అగ్రవర్ణ పేదలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో S.C , S.T. , B.C. , మైనారిటీ వర్గాలకు అనేక ప్రభుత్వ పధకాలు ఆయా కార్పొరేషన్ ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. శతాబ్దాలు గా అభివృద్దికి నోచుకోని వర్గాలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనే నిర్ణయంతో, గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు, వీటిని అమలుపరిచి, ఆ వర్గాలకు అండగా నిలిచాయి. చంద్రబాబు ప్రభుత్వం కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ లు కూడా ఏర్పాటు చేసారు... మిగతా కులాలలో ( రెడ్డి , కమ్మ , వైశ్య , వెలమ , క్షత్రియ ) కూడా పేదలు ఉన్నారు. ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకోవటం లేదన్న భావన వీరిలో రోజు రోజుకీ బలపడుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ తరుణంలో, బలహీన వర్గాల తరహా లోనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకూ కార్పొరేషన్ అమలు చేసి అగ్రవర్ణ పేదలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు... పోయిన ఏడాది ఈబీసీ కార్పొరేషన్ ద్వారా వారిని ఆడుకున్నారు... ఈ సంవత్సరం కూడా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల్లో పేదలకు స్వయం ఉపాధి రుణాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సంక ల్పించింది. ఒక్కో యూనిట్ కు రూ.2 లక్షలు ఇవ్వనుండగా, అందులో రూ. లక్ష రాయితీ, రూ. లక్ష బ్యాంకు రుణం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఎం. బి.సి, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ కులాలకు చెందిన వారు మినహా, ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకడిన వారు ఈ నెల 31వ తేదీ లోపు http://apobmms.cgg.gov.in అనే వెబ్సైటులో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు, మీ సేవా కేంద్రం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది... ఈ పథకానికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు వీటికి అర్హులు... రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫొటోతో మీ-సేవా, ఇంటర్నెట్, ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో, లేకపోతే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి... http://apobmms.cgg.gov.in... ravindras 1
Saichandra Posted January 22, 2018 Posted January 22, 2018 బిసి కార్పొరేషన్ ద్వారా అగ్రకుల పేదలకు వ్యాపార ప్రోత్సాహం కింద 2 లక్షల లోన్ (అందులో ఒక లక్ష సబ్సిడీ-ఆ లక్షకట్టనవసరం లేదు) ఇది కదా సమానత్వంకి సరైన అర్ధం ఇది.. రాజ్యాంగం కూడా న్యాయం చేయలేని వర్గాలకు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరిగేలా... బ్రాహ్మణ,కాపులకు కార్పొరేషన్లు... ఇప్పుడు అగ్రకుల పేదలకు వ్యాపార ప్రోత్సాహకం.. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు ఈ పథకానికి అర్హులు. మీ జిల్లాలో కాని ఆన్లైన్ లో కాని అప్లై చేసుకోని రాయితీ పొందగలరు.. cannot upload the GO image
Saichandra Posted January 22, 2018 Posted January 22, 2018 https://googleweblight.com/i?u=https%3A%2F%2Fapobmms.cgg.gov.in%2FtargetsEntryAbstractReport.do%3Fkey%3DgetdistrictReport%26corp%3D19&hl=en-IN&tg=559&tk=10212772217219173733
sonykongara Posted March 25, 2018 Author Posted March 25, 2018 అగ్రవర్ణ పేద విద్యార్థులకూ ఉపకార వేతనాలు, విదేశీ విద్యరూ.200కోట్లతో అమలు చేస్తాం ఈనాడు, అమరావతి: అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు రూ.200కోట్లు కేటాయించి ఉపకార వేతనాలు, విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించబోతున్నట్లు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలోకి రాని రాజు, రెడ్డి, కమ్మ తదితర సామాజిక వర్గాల విద్యార్థులకూ లబ్ధి చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచబోతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి త్వరలోనే దీనిపై నిర్ణయం వెల్లడిస్తారన్నారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, అల్ప సంఖ్యాక వర్గాలు, మహిళా శిశు సంక్షేమం’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.30కోట్లతో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారికీ ఆర్థిక సాయం చేయబోతున్నామన్నారు. 50ఏళ్లు దాటిన మత్స్యకారులకు పింఛను అందించనున్నట్లు చెప్పారు. చీర, ధోవతి పథకాన్ని మళ్లీ అమలు చేస్తున్నామన్నారు. మన నేత కార్మికులు తయారు చేసిన వాటినే అందిస్తామన్నారు.
sonykongara Posted March 25, 2018 Author Posted March 25, 2018 రాష్ట్రంలో 49.84 శాతం బీసీలురాష్ట్ర సాధికార సర్వేలో 2.16కోట్ల మంది బలహీనవర్గాల వారున్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. మొత్తం జనాభాలో బీసీలు 49.84శాతం ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకే ఉప ప్రణాళిక ద్వారా నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పెళ్లికానుక ఎలా ఉపయోగించుకోవాలి?చంద్రన్న పెళ్లికానుకను ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ పాతవాళ్లకే మరోసారి అవకాశం ఇస్తారా? అంటూ ప్రశ్నించడంతో సభ్యులంతా నవ్వులతో ముంచెత్తారు. ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఎక్కువమందితో దరఖాస్తు చేయించి పథకం వినియోగించుకునేలా చూడాలనేది ఉద్దేశమని మంత్రి వివరణ ఇచ్చారు. అగ్రవర్ణ పేదలకు రూ.200కోట్లతో ఉపకార వేతనాలు, విదేశీ విద్య అవకాశం కల్పించడంపై విష్ణుకుమార్‌రాజు ధన్యవాదాలు తెలిపారు.
surendra.g Posted May 28, 2018 Posted May 28, 2018 On 1/20/2018 at 8:10 PM, lovemystate said: This is totally meaningless and destroys society if taken too much. If a father remains poor because he doesnt workhard for his family despite suffering no social discrimination - is it right for govt using hardworking fathers tax amount to support his daughter or son ? ila chesthe pillalu kosam, dabbulu kosam kasthapadi udyogalu icche manishi ki encoragement yedhi ? Same will apply to other casts other than OC also, either that should be corrected or these should also be supported. What's say?
sonykongara Posted June 4, 2018 Author Posted June 4, 2018 స్వయం ఉపాధికి దరఖాస్తు గడువు పెంపు04-06-2018 01:41:12 ఈనెల 10 వరకు ఆన్‌లైన్‌లో అవకాశం అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ, ఈబీసీ, ఎంబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల్లో లబ్ధి పొందేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ బి.రామారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు, కాపులతో పాటు బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలు, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి నుంచి దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. వైశ్యులకు ఇంకా కార్పొరేషన్ ఏర్పాటు చేయనందున వారు కూడా ఈబీసీ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందగోరు వారు కూడా ఈ నెల 10 వరకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
sonykongara Posted July 20, 2018 Author Posted July 20, 2018 ఈబీసీలకూ కార్పొరేషన్20-07-2018 03:27:31 కంపెనీల చట్టం కింద రిజిస్ట్రేషన్ అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య, కాపు కార్పొరేషన్లను ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, గ్రామాల్లో ఏడాదికి రూ.60 వేల లోపు, పట్టణాల్లో రూ.75 వేలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీల చట్టం కింద కార్పొరేషన్‌ను రిజిస్టర్ చేయటానికి ప్రభుత్వం అనుమతించింది. ఈబీసీలకు వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు చైర్మన్, నలుగురు మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులతో పాటు ఏడుగురు అధికారులను పాలకవర్గ సభ్యులుగా నియమించాలని సూచించింది.
sonykongara Posted July 20, 2018 Author Posted July 20, 2018 ఈబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ 14 మందితో కమిటీ ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి(ఈబీసీల)కి వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, క్రైస్తవ, బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటైన నేపథ్యంలో వీరు మినహా మిగతా వర్గాల్లోని వారికి వర్తించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి సంస్థకు రూపమిచ్చింది. ఈ కార్పొరేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.60వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75వేల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి ఆర్థిక భరోసా కల్పించనుంది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రాథమిక, మాధ్యమిక విద్యలో బీసీ గురుకులాల్లో 2, బీసీ వసతిగృహాల్లో 6శాతం సీట్లు కేటాయిస్తున్నారు. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు. వీరికి నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు బ్యాంకు అనుసంధాన పథకాలు, విదేశీ విద్య, సివిల్ సర్వీస్ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షలకు ఆర్థిక సాయం అందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఇపుడు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసింది. ఆయా పథకాల నిర్వహణకు, పర్యవేక్షణకు 14 మంది సభ్యులతో కమిటీ నియమించింది. వీరిలో ఛైర్మన్, మరో నలుగురు అనధికార సభ్యులు కాగా మరో 9 మంది అధికార సభ్యులు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now