swarnandhra Posted May 19, 2017 Posted May 19, 2017 What does hopping flight mean? connecting flights to nearest international airport (fully functional customs and immigration). probably save some money on ticket (single ticket)??? also allow international luggage weights on domestic connection flight.
Guest Urban Legend Posted June 22, 2017 Posted June 22, 2017 @ncbn 1m1 minute ago Hoisted the 100 feet high Monumental National Flag at Tirupati Airport during my visit to Chittoor.
Seniorfan Posted June 22, 2017 Posted June 22, 2017 Pi photo lo Lokesh cheyi kanapadatledu...etthade leda ? ethhalsina avasaram leda?
sonykongara Posted June 22, 2017 Author Posted June 22, 2017 ఢిల్లీ: తిరుపతి, విజయవాడ ఎయిర్‌పోర్టులకు అంతర్జాతీయ హోదా, ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ప్రణబ్, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
narens Posted June 22, 2017 Posted June 22, 2017 ఢిల్లీ: తిరుపతి, విజయవాడ ఎయిర్‌పోర్టులకు అంతర్జాతీయ హోదా, ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ప్రణబ్, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం Flight eppudu start avuthay masteruuu any idea...
sonykongara Posted June 23, 2017 Author Posted June 23, 2017 తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలకు మహర్దశ అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం రాజపత్రం జారీ న్యూఢిల్లీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ(గన్నవరం) విమానశ్రయాలకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజపత్రం జారీ చేసింది. కేంద్ర విమానాయన శాఖ జూన్ 12న ఈ మేరకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేయగా వాటిని ధ్రువపరుస్తూ ఇప్పుడు గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం తిరుపతి విమానాశ ్రయానికి వెంటనే అంతర్జాతీయ హోదా వర్తించనుంది. విజయవాడ విమానాశ్రయానికి మాత్రం ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ హోదా అమలులోకి వస్తుందని రాజపత్రంలో పేర్కొన్నారు. దీనిపై గతంలోనే కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోగా తాజాగా అధికారికంగా రెండు విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా దక్కింది. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల నుంచి విదేశాలకు నేరుగా ప్రయాణం చేసే అవకాశం కలిగింది. తెలుగుదేశానికి చెందిన అశోకగజపతి రాజు ఎన్డీయే సర్కారులో విమానాయాన మంత్రిగా కొనసాగడం, చంద్రబాబు దూరదృషితో కేంద్రాన్ని కోరడంతో ఇది సాధ్యమైంది.
sonykongara Posted June 23, 2017 Author Posted June 23, 2017 Flight eppudu start avuthay masteruuu any idea... emo bro
sonykongara Posted July 7, 2017 Author Posted July 7, 2017 మంత్రి లోకేష్‌తో కార్బన్ మొబైల్స్ చైర్మన్ భేటీ అమరావతి: లోకేష్‌తో కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ భేటీ అయ్యారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో కార్బన్ మొబైల్స్ ఫ్యాక్టరీని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని తెలిపారు. విడిభాగాల దిగుమతుల కస్టమ్స్ అనుమతులకు చెన్నై వెళ్లాల్సివస్తోందన్నారు. తిరుపతిలో కస్టమ్స్ అనుమతులు ఇస్తే మరికొన్ని కంపెనీలు వస్తాయని లోకేష్‌కు సుధీర్ వివరించారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో కార్గో సర్వీస్, ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వంతో చర్చిస్తామని సుధీర్‌కు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
sonykongara Posted July 7, 2017 Author Posted July 7, 2017 మంత్రి లోకేష్‌తో కార్బన్ మొబైల్స్ చైర్మన్ భేటీ అమరావతి: లోకేష్‌తో కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ భేటీ అయ్యారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో కార్బన్ మొబైల్స్ ఫ్యాక్టరీని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని తెలిపారు. విడిభాగాల దిగుమతుల కస్టమ్స్ అనుమతులకు చెన్నై వెళ్లాల్సివస్తోందన్నారు. తిరుపతిలో కస్టమ్స్ అనుమతులు ఇస్తే మరికొన్ని కంపెనీలు వస్తాయని లోకేష్‌కు సుధీర్ వివరించారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో కార్గో సర్వీస్, ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వంతో చర్చిస్తామని సుధీర్‌కు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. dini valla ayina jaragali
narens Posted August 26, 2017 Posted August 26, 2017 International flights from maa Airport Ee year lo kooda doubt gaane vundi ga
katti Posted August 26, 2017 Posted August 26, 2017 International flights from maa Airport Ee year lo kooda doubt gaane vundi ga immigration/customs vallu ravali.. these are not under Aviation ministry TGR 1
John Posted August 26, 2017 Posted August 26, 2017 immigration/customs vallu ravali.. these are not under Aviation ministry then who ?
swarnandhra Posted August 26, 2017 Posted August 26, 2017 immigration/customs vallu ravali.. these are not under Aviation ministry then who ? Immigration - Home Ministry customs - finance ministry TGR 1
narens Posted August 26, 2017 Posted August 26, 2017 immigration/customs vallu ravali.. these are not under Aviation ministryMaster customs ms clearance vachindi Ani April lo confirm cheaaaru
John Posted August 27, 2017 Posted August 27, 2017 Master customs ms clearance vachindi Ani April lo confirm cheaaaru also heard staff ki oorike koochopetti salaries istunnaru panem leka ani..
narens Posted September 7, 2017 Posted September 7, 2017 So maa tpt ki international flights ippatlo chance ledanna maata..inko 24 months ante marchipovachemo
AnnaGaru Posted October 6, 2017 Posted October 6, 2017 ninna Sakshit lo as usual comedy piece dini meeda kooda Jaffa MP's demand tho Ashok garu international facilities try chesaru anta
narens Posted November 28, 2017 Posted November 28, 2017 Shhh ..4yrs nunchi same music ..so next year kooda marchipovachu
sonykongara Posted December 8, 2017 Author Posted December 8, 2017 తిరుపతిపై దయ చూపని ఎయిర్ ఇండియా08-12-2017 01:09:40 ప్రారంభంకాని అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరుపతి (ఆంధ్రజ్యోతి): సదుపాయాలు, ప్రయాణికుల పరంగా అన్ని హంగులున్న తిరుపతి విమానాశ్రయం నుంచి ఇంకా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కాలేదు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా భారత విమానాశ్రయాల సంస్థ (ఎఎఐ) ఈ ఎయిర్‌పోర్టులో రూ.120 కోట్లతో కొత్త టెర్మినల్ భవనంతో పాటు, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఈ టెర్మినల్‌ను జాతికి అంకితం చేసి కూడా చాలా కాలమైంది. అయినా ఇప్పటి వరకు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కాలేదు. అవకాశాలు చిత్తూరు, కడప జిల్లాల నుంచి అనేక ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిరపడిన వారు ఈ రెండు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారు. తిరుమల యాత్ర కోసం నేరుగా తిరుపతికి వచ్చే ప్రవాస భారతీయులూ ఎక్కువే. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపితే వీరందరికీ సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం వీరంతా చెన్నై విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతి- సింగపూర్, తిరుపతి నుంచి పశ్చిమాసియా దేశాలకు విమాన సర్వీసులు నడపాలనే ప్రతిపాదన ఎంతో కాలంగా ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికే ఎన్నోసార్లు ఎయిర్ ఇండియాను సంప్రదించాయి. అయితే విమానాల కొరత పేరుతో ఎయిర్ ఇండియా తిరుపతి మీదుగా ఇంటర్నేషనల్ సర్వీసులు నడపడం లేదని సమాచారం. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రయత్నాలు కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. వందల కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని నిర్మించుకొని మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు విదేశీ సర్వీసులు అందుబాటులోకి రాకపోవడం బాధాకరం. చిత్తూరు, కడప జిల్లాల ఎంపీలు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే ఇదేమి పెద్ద సమస్య కాదు. కార్గో సర్వీసులకూ అవకాశం తిరుపతి విమానాశ్రయం కేంద్రంగా సరుకు రవాణాకూ అవకాశం ఉంది. కొత్త టెర్మినల్ భవనం ప్రారంభమైన నేపథ్యంలో పాత టెర్మినల్ భవనాన్ని ఇందుకోసం ఉపయోగించుకోవచ్చు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు తిరుపతి విమానాశ్రయమే కేంద్రం అవుతుంది. పారిశ్రామికంగా కూడా ఈ జిల్లాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో కార్గో సర్వీసుల వల్ల రైతులతో పాటు పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now