Jump to content

Recommended Posts

Posted
కడప, తిరుపతి వాసులకు శుభవార్త..
 
TIRUPATI_AIRPORT_2866735f.jpg
కడప: వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి గల్ఫ్‌ దేశాలకు తిరుపతి నుంచి విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, ఖత్తర్‌, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలకు జీవన భృతి కోసం లక్షలాది మంది వెళ్లి ఉన్నారు. ప్రతి రోజూ వీరు చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 10 విమానాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్యం దృష్ట్యా ప్రవాస భారతీయుల కోసం గల్ఫ్‌ దేశాలకు జనవరి మొదటివారం నుంచి సర్వీసులు నడపడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఇమిగ్రేషన్ అండ్‌ కస్టమ్స్‌ అధికారులతో చర్చలు పూర్తయ్యాయి. త్వరలో ఏయే దేశాలకు.. ఏయే సమయాల్లో విమాన సర్వీసులను నడిపే విషయాన్ని వెంటనే ప్రకటించనున్నారు. ప్రధానంగా అత్యధికంగా ప్రవాస భారతీయులున్న కువైత్ దేశానికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Posted

International batch direct Tirupathi dhigi swami darasanam tho trip start cheyochu anamata. Good.

Connecting flights tho us/eu/au etc pandaga ... hope it works out.

  • 5 weeks later...
Posted

john bro.

john bro.

sony annai :shakehands:

  • 2 weeks later...
Posted

 జనవరి మొదటి వారం :bigfight:

  • 2 weeks later...
Posted
ఏప్రిల్‌ నుంచి.. తిరుపతికి విదేశీ విమానాలు!
 
  • కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు 
తిరుపతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌ నుంచి తిరుపతికి అంతర్జాతీయ విమానాలను నడపాలని నిర్ణయించినట్లు పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు వెల్లడించారు. దేశంలోని 125 విమానాశ్రయాలను ఏడేళ్లలో ఎలా అభివృద్ధి చేయాలి? ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన, అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాల అభివృద్ధి.. వీటికి ఎన్ని నిధులు అవసరమనే అంశాలపై సోమవారం తిరుపతిలో పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఏపీలోని విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అనంతరం అశోకగజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయానికి 7 విమానాలు వస్తున్నాయని.. ఏప్రిల్‌ తర్వాత ఇక్కడి నుంచి అన్ని దేశాలకు విమాన సర్వీసులు సాగిస్తామని చెప్పారు. ఫలితంగా తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయాల అభివృద్ధికి రూ.17,500 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. విజయవాడలో త్వరలో కొత్త టెర్మినల్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కాగా, గన్నవరం విమానాశ్రయంలో వసతులపై ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గన్నవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానాలను నడపాలని, అక్కడి నుంచీ అంతర్జాతీయ స్థాయి విమానాల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

direct flights to gulf esthunnara or through other destinations?

Posted

vijayawada lo monne ga terminal open chesaru mala inkoti entii ??? 

భవిష్యత్తులో భారీ టెర్మినల్‌

  • 50 లక్షల ప్రయాణికులకు సరిపడా వసతులు
  • దేశంలో ఏ సీఎం ఇలా భూమి ఇవ్వలేదు:అశోక్‌
అమరావతి: విమానయాన ప్రాజెక్టులకు అవసరమైన భూమిని చంద్రబాబులా దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేదని పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు కితాబిచ్చారు. ఏ ప్రాజెక్టు ఉన్నా దానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ఏపీ ముందుకురావడంతో... సొంత రాష్ట్రానికి ఎక్కువ చేస్తున్నానన్న అపవాదు తనపై రాకుండా పోయిందన్నారు. గన్నవరం నూతన టెర్మినల్‌ భవనం 11 నెలల్లో పూర్తయిందని... ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా చరిత్రలోనే ఇది రికార్డు అని చెప్పారు. పాత టెర్మినల్‌లో ఏటా 6 లక్షల మంది ప్రయాణికులకు సరిపడా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయన్నారు. కొత్త టెర్మినల్‌తో ఇది 20 లక్షలకు పెరిగిందని తెలిపారు.
 
మూడు, నాలుగేళ్లలో 50 లక్షల మంది ప్రయాణికులకు వసతులు కల్పించేలా మరో సరికొత్త టెర్మినల్‌ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ప్రారంభించిన టెర్మినల్‌ను కార్గో టెర్మినల్‌గా మారుస్తామన్నారు. ఒకప్పుడు విలాసమైన విమానయానం ఇప్పుడు అవసరంగా మారిందని సుజనా చౌదరి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాఫల్యం చేస్తున్నందుకు చంద్రబాబు, వెంకయ్యలను తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు నేతృత్వంలో పలువురు రైతులు సత్కరించారు. మరోవైపు... తెలంగాణలో కొత్తగూడెం విమానాశ్రయానికి కూడా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అశోక్‌ను కోరారు.
  • 2 weeks later...
  • 4 weeks later...
Posted
గన్నవరం ఎయిర్‌పోర్టుకు 'ఎన్టీఆర్‌ అమరావతి' పేరు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టు'గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు.

  • 2 months later...
Guest Urban Legend
Posted

air.jpg

searching for this news TFS :shakehands:

Posted

తిరుపతిలో అంతర్జాతీయ సేవలు ఇంకా మొదలుకాలేదెందుకు?
కొత్త టెర్మినల్‌ వచ్చాక తిరుపతిలో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. తదుపరి దశలో హాపింగ్‌ ఫ్లైట్స్‌ వస్తాయి. గతంలో బేగంపేటలోనూ తొలుత హాపింగ్‌ ఫ్లైట్స్‌ వచ్చాయి. తర్వాత నేరుగా అంతర్జాతీయ సర్వీసులు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు ఎయిర్‌లైన్స్‌ తిరుపతి నుంచి హాపింగ్‌ ఫ్లైట్స్‌ నడపడానికి ఆసక్తి చూపాయి. హోంశాఖ ఇమ్మిగ్రేషన్‌కు అనుమతి ఇస్తే ఆ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయి.

Brother mee oopika ki hats off...prathi topic prathi topic place lo proper ga with paper clips tho pedtunaru...really nijamina TDP karyakartha or abhimani anali...once again great to see your posts.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...