Raaamu Posted November 17, 2016 Posted November 17, 2016 Enduko ee madhya mana news chudalantey, tinataniki tindi ledu kaani, meesalaku sampenga nune kavali annadanta enakatikevado. Adi gurthosthundi.
sonykongara Posted November 17, 2016 Author Posted November 17, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/348932-%E0%B0%85%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B0%E0%B1%88%E0%B0%B2%E0%B1%81/
sskmaestro Posted November 17, 2016 Posted November 17, 2016 Hmm..... eh matram positive news ochina bharinchalekunnarugaa ..... swamulu.... edanna project jaragali antey ilanti news thoney start avtayi.... one by one jarugutayi.... pipeline lo undatam lo tappenti??
AnnaGaru Posted November 17, 2016 Posted November 17, 2016 we already have circular railway track vijaywada=>guntur=>tenali=>vijaywada. He is proposing to extend that circle to connect Vijaywada-nagpur track Ofcourse it costs but best plan. Lucky that we have railway connection in 9 directions around Amaravati All CBN asking is connect the SEVEN NINE a CIRCLE Vijaywada-Kazipet Vijaywada-Gudiwada-Bandar ViJayawada-Guntur ViJayawada-Vizag ViJayawada-TEnali=>Chennai Gunt-TEnali=>chennai Guntur-Nadikudi-Hyderabad Guntur-Hubli Guntur-Repalle Isn't it better that for decades eliminates need for METRO in this circle and Circle train itself provides best transportation
swarnandhra Posted November 17, 2016 Posted November 17, 2016 Dantlo tappu emundi we already have circular railway track vijaywada=>guntur=>tenali=>vijaywada. He is proposing to extend that circle to Velagapudi Ofcourse it costs but best plan. Lucky that we have railway connection completely surrounding Amaravati brother, inthaki guntur-tenali double line work complete ayyinda?
AnnaGaru Posted November 17, 2016 Posted November 17, 2016 @swarnandhra, Start ayete chesaru. Mostly ayipoyindi ani anukuntunna.
Anne Posted November 18, 2016 Posted November 18, 2016 Hmm..... eh matram positive news ochina bharinchalekunnarugaa ..... swamulu.... edanna project jaragali antey ilanti news thoney start avtayi.... one by one jarugutayi.... pipeline lo undatam lo tappenti?? niku Ala ardham ayinda sare continue...
Raaz@NBK Posted November 18, 2016 Posted November 18, 2016 Enduko ee madhya mana news chudalantey, tinataniki tindi ledu kaani, meesalaku sampenga nune kavali annadanta enakatikevado. Adi gurthosthundi.
MVS Posted November 18, 2016 Posted November 18, 2016 Enduku dabbulu ekadiki vellakunda akkade tiragatanika circle ga
sonykongara Posted November 18, 2016 Author Posted November 18, 2016 రాజధాని అమరావతికి హై స్పీడ్ రైల్వే లైన్ విజయవాడ-తెనాలి-గుంటూరు మధ్య కనెక్టివిటీ సాధ్యాసాధ్యాలపై త్వరలో రైల్వే శాఖ అధ్యయనం గుంటూరు, తెనాలి : నవ్యాంధ్ర రాజధానికి మరో ప్రాజెక్టు రానుంది. రాజధాని అమరావతి ప్రాంతం మీదుగా సీఆర్‌డీఏ పరిధిలోని మూడు ముఖ్య పట్టణాలను కలుపుతూ హై స్పీడ్ రైల్వే లైన ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో అమరావతి మెట్రో ప్రాజెక్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించనున్నారు. 110 కి.మీ పొడవున ఈ రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు విస్తృత ప్రాతిపదికన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రాజధాని పరిధిలో విజయవాడ-గుంటూరు-తెనాలి పట్టణాలను కలుపుతూ రైల్వే లైన ఉంది. ఇందులో విజయవాడ-గూడూరు రైల్వే లైన తెనాలి మీదుగా వెళుతుండగా, గుంటూరు-విజయవాడ రైల్వే లైన మంగళగిరి మీదుగా ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో డబ్లింగ్ ఉండగా, తెనాలి-గుంటూరు మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పనులు పూర్తయి తెనాలి-విజయవాడ-గుంటూరు మధ్య పూర్తిస్థాయులో డబ్లింగ్ అందుబాటులోకి రానుంది. తద్వారా ఈ మూడు పట్టణాల మధ్య రైళ్ల రాకపోకలు మరింత పెరిగేందుకు ఆస్కారం కలగనుంది. రాజధాని మీదుగా.. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతానికి రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉండటంతో విజయవాడ నుంచి వెలగపూడి, తుళ్లూరు మీదుగా రాజధాని పరిధిలోని గ్రామాలను కలుపుతూ గుంటూరు వరకు హై స్పీడ్ రైల్వే లైన ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నారు. తద్వారా విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య రాజధాని మీదుగా సర్క్యులర్ రైళ్లను నడిపేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్గం ఏర్పాటైతే రాజధాని పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పరిశీలనలో ఉన్న ఈ కొత్త రైల్వే లైన ఏర్పాటుపై త్వరలోనే అధ్యయనం చేసి నివేదిక తయారు చేయనున్నారు. ఇలా చుట్టేస్తూ.. ప్రస్తుతం విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే తెనాలి-గుంటూరు మధ్య డబ్లింగ్ లేకపోవడంతో ఎక్కువ రైళ్లను నడిపేందుకు వీలు లేకుండా పోతోంది. అదీ కాక తెనాలి-విజయవాడ మధ్య ఉన్న హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటం కూడా సర్క్యులర్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు అవరోధంగా మారుతోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి గూడూరు వరకు మూడో రైల్వే లైనను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల తెనాలి-విజయవాడ మధ్య అదనపు లైన అందుబాటులోకి వస్తుందని, ఇదే సమయంలో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త లైను ఏర్పాటు చేస్తే విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
adithya369 Posted November 18, 2016 Posted November 18, 2016 rtc moosukovali..jaraganivvaru manchidega, pollution thagguthundi, public ki time save avuthundi
sonykongara Posted December 14, 2016 Author Posted December 14, 2016 manchidega, pollution thagguthundi, public ki time save avuthundi
surapaneni1 Posted December 14, 2016 Posted December 14, 2016 Enduko ee madhya mana news chudalantey, tinataniki tindi ledu kaani, meesalaku sampenga nune kavali annadanta enakatikevado. Adi gurthosthundi.
koushik_k Posted December 14, 2016 Posted December 14, 2016 mingatanki ginja ledu kani meesalaki sampenga noone
sonykongara Posted December 15, 2016 Author Posted December 15, 2016 AP Govt plans circular train covering Vijayawada-Tenali-Guntur-Amaravati: http://goo.gl/2c6glx AP Govt plans circular train covering Vijayawada-Tenali-Guntur-Amaravati Chief Minister N. Chandrababu Naidu held a meeting with CRDA officials. During the meeting, the Government took a decision for a circular train covering Vijayawada-Tenali-Guntur-Amaravati. The train route is expected to cover 105 kms with an estimated investment of Rs. 10,000 crores. The Chief Minister directed officials to submit a detailed report on the plan. Later in the day, the Chief Minister held a review meeting on the state's municipalities. During the meeting, the Chief Minister sought ideas on branding each municipality based on its uniqueness.
sonykongara Posted December 15, 2016 Author Posted December 15, 2016 అమరావతిలో హై- స్పీడ్ సర్క్యులర్ రైల్వే లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం రాజధాని అమరావతిలో హై స్పీడ్ సర్క్యులర్ రైల్వే లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సచివాలయంలో జరిగిన మున్సిపల్ శాఖ సమీక్షలో సీఎం దీనిపై చర్చించారు. మొత్తం 105 కిలోమీటర్ల పొడవునా విజయవాడ- అమరావతి- గుంటూరు - తెనాలి - కృష్ణా కెనాల్ స్టేషన్ - విజయవాడ మీదుగా ఈ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీని పై ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు సంభందించి త్వరితగతిన అనుమతులు పొందేందుకు, సహాయ సహకారాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో కేంద్రానికి 20 శాతం, ఉడాకు 11 శాతం, ప్రెవేటు సంస్థలకు 60 శాతం, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉండేలా నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
raghu6 Posted December 15, 2016 Posted December 15, 2016 Enduko ee madhya mana news chudalantey, tinataniki tindi ledu kaani, meesalaku sampenga nune kavali annadanta enakatikevado. Adi gurthosthundi.
swarnandhra Posted December 15, 2016 Posted December 15, 2016 @swarnandhra, Start ayete chesaru. Mostly ayipoyindi ani anukuntunna.
sonykongara Posted January 21, 2017 Author Posted January 21, 2017 విజయవాడ-అమరావతి-గుంటూరు హైస్పీడ్ రైలు (ఆంధ్రజ్యోతి, విజయవాడ): అమరావతి రాజధానిని విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీ పీఆర్)ను మరో తొమ్మిది నెలల్లో సమర్పించటానికి అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ (యూఎంటీసీ) సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు బాధ్యతలను కూడా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) తన భుజస్కందాలపై వేసుకుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు యూఎంటీసీ సంస్థకు అప్పగించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. దాదాపుగా పావు వంతు పనిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి అమరావతి రాజధానికి, అక్కడి నుంచి గుంటూరుకు విస్తృతస్థాయి హై స్పీడ్ రైల్‌నెట్‌వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. అమరావతి రాజధానిలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ఇప్పటికిప్పుడు వయబిలిటీ లేదు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) ఛైర్మన గతంలో పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిలో రోడ్ నెట్‌వర్క్ విస్తృతంగా పెరగాలి. నగరాలు, పట్టణ ప్రాంతాలు విస్తరించాలి. జనాభా పెరగాలి. అనేక రంగాల్లో అమరావతి అభివృద్ధి చెంది ఉండాలి. రవాణా వ్యవస్థకు గుండెకాయగా ఉన్నప్పుడే అమరావతిలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనువుగా ఉంటుంది. ఇదంతా జరగటానికి చాలా సమయం పడుతుంది. పైగా మెట్రో ప్రాజెక్టును తలకెత్తుకున్నా బోలెడంత వ్యయం అవుతుంది. ఈ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు చందాన అవుతుంది. మెట్రో ప్రాజెక్టు చేపట్టాలంటే కిలోమీటర్‌కు రూ.250 కోట్ల ఖర్చు అవుతుంది. అంచనాలు పెరిగితే వ్యయం మరింత పెరుగుతుంది. మెట్రోరైల్ లేని లోటును హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌తో భర్తీ చేయటానికి అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తోంది. హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ వల్ల విజయవాడ నుంచి నేరుగా అమరావతి అక్కడి నుంచి గుంటూరుకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు విజయవాడ, అమరావతి, మంగళగిరి, గుంటూరు పట్టణాలను కలుపుతుంది. విజయవాడ నుంచి కేసీ కెనాల్ జంక్షన, అక్కడినుంచి అమరావతి, అక్కడి నుంచి గుంటూరుకు కనెక్టివిటీ ఇవ్వటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. తిరిగి గుంటూరు, అమరావతి, కేసీ కెనాల్ జంక్షన్ తిరిగి విజయవాడకు గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. యుఎంటీఎస్ ఇచ్చే రిపోర్టులో ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? భాగస్వామ్యం ఎలా ఉంటుంది? ఎంత మేర భూములను సేకరించాల్సి ఉంటుంది? ట్రాఫిక్ వయబిలిటీ ఎలా ఉంటుంది? వివిధ సర్వేలు ఏం చెబుతున్నాయి? డిజైన్స ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలను సమగ్రంగా అందిస్తారు
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now