Jump to content

Recommended Posts

Posted
ఆకర్షణీయ అమరావతికి ప్రత్యేక వాహక సంస్థ

ఈనాడు అమరావతి: అమరావతిని ఆకర్షణీయ నగరంగా (స్మార్ట్‌ సిటీ) అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక వాహక సంస్థను (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తూ పురపాలకశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేసింది. ఈ పథకం కింద అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.500 కోట్లు ఇస్తుంది. ఈ నిధులివ్వాలంటే ఒక ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. దీని ప్రకారం ‘అమరావతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌సీసీఓఎల్‌)’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. దీనికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌, అదనపు కమిషనర్‌, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్లు, ప్రజారోగ్య విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, సీఆర్‌డీఏ చీఫ్‌ ఇంజినీర్‌ డైరెక్టర్లుగా ఉంటారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సంచాలకుడు రమేష్‌చంద్‌ డైరెక్టర్‌గా ఉంటారు. ఎస్‌పీవీలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ చెరి సగం వాటా కలిగి ఉంటాయి. ప్రాథమికంగా రూ.20 లక్షల అధీకృత షేర్‌ కేపిటల్‌, రూ.5 లక్షల పెయిడప్‌ కేపిటల్‌తో ఏర్పాటు చేస్తారు. పెయిడప్‌ కేపిటల్‌ను ఒక్కొక్కటి రూ.10 విలువ కలిగిన 50 వేల ఈక్విటీ షేర్లుగా విభజించారు. వీటిలో గవర్నర్‌ తరపున ప్రతినిధిగా వ్యవహరించే పురపాలక శాఖ అదనపు కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి లేదా డిప్యూటీ కార్యదర్శి 24,996 షేర్లు, సీఆర్‌డీఏ కమిషనర్‌ 24,997 షేర్లు కలిగి ఉంటారు.

Posted
శాఖమూరు పార్క్‌లో రోజ్ గార్డెన్
 
 
636429623883187937.jpg
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధాని వాసులు, అమరావతి సందర్శకులు ప్రకృతి సౌందర్యం మధ్య సేద తీరేందుకు, ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా శాఖమూరు వద్ద సుమారు 250 ఎకరాల్లో ఏడీసీ (అమరావతి అభివృద్ధి సంస్థ) ఏర్పాటు చేయనున్న సువిశాల ఉద్యానవనంలో 15 ఎకరాల్లో రోజ్‌ గార్డెన్‌ను అభివృద్ధి పరచనున్నారు. శాఖమూరు రీజియనల్‌ పార్కులో పలు జాతీయ, అంతర్జాతీయ రకాల పూలు, అలంకరణ మొక్కలతోపాటు వృక్షాలను వేల సంఖ్యలో పెంచేందుకు, ల్యాండ్‌ స్కేపింగ్‌కు ఏడీసీ ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వందలాది రకాల గులాబీ మొక్కలతో రోజ్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నెన్నో రకాలు, రంగులతో అలరారే రోజ్‌ వెరైటీలతో చూపరులను ఆకట్టుకునే విధంగా దీనిని అభివృద్ధి పరచనున్నారు. దీనితోపాటు మరొక 3 పనులను మొత్తం రూ.3.87 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ఏడీసీ బిడ్లను ఆహ్వా నించింది. శాఖమూరు పార్కుతోపాటు రాజధానిలోని వేర్వేరు ప్రదేశాల్లో ప్లుమేరియా (టెంపుల్‌ ట్రీస్‌) నాటేం దుకు అవసరమైన ఏర్పాట్లు, వెంకట పాలెంలోని సెంట్రల్‌ నర్సరీలో పలు అభివృద్ధి పనులు, కృష్ణా జిల్లా ఇబ్ర హీంపట్నంలోని రోటరీ కూడలి సుందరీకరణ, నిర్వహణ తదితర పనులకు ఈ టెండర్లు పిలిచింది. వీటి సమర్పణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువునిచ్చింది. కాగా.. విజయవాడ భవానీపురంలోని వెంకటేశ్వర ఫౌండ్రీ నుంచి ఇబ్రహీంపట్నం కూడలి వరకు ఉన్న 10.30 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి సెంట్రల్‌ డివైడర్‌పై గ్రీనరీ అభివృద్ధితోపాటు ఇబ్రహీంపట్నం కూడలి నుంచి ఫెర్రీ వరకు ఉన్న రోడ్డు వెంబడి పచ్చదనం పెంచేందుకు ఏపీసీఆర్డీయే మొత్తం రూ.1.95 కోట్లతో టెండర్లు పిలిచింది. వీటి దాఖలుకు ఈ నెల 13 వరకూ గడువునిచ్చింది.
Posted

వెంకటాయపాలెం వద్ద పోలీస్‌ అకాడెమీ

గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ప్రధాన కేంద్రాలూ...

ఈనాడు - అమరావతి

గుంటూరు జిల్లా అచ్చంపేట సమీప వెంకటాయపాలెం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు రక్షణ, భద్రతా విభాగాలకు కేంద్రస్థానం కాబోతోంది. చుట్టూ కొండలు, దట్టమైన అటవీప్రాంతం ఉండడంతో వ్యూహాత్మకంగా ఈ ప్రదేశం ఎంతో అనుకూలమని దీన్ని ఎంపిక చేశారు. ఏపీ పోలీస్‌ అకాడెమీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల ప్రధాన కేంద్రాల వంటివన్నీ అక్కడే రాబోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన భద్రత, శిక్షణ సంస్థలకు ప్రధాన కేంద్రాలను ఏర్పాటుచేసుకోవలసి ఉంది. వెంకటాయపాలెం ప్రాంతం అనుకూలమైనదిగా చాన్నాళ్ల క్రితమే గుర్తించారు. కానీ అదంతా అటవీ ప్రాంతం కావడంతో డీనోటిఫై చేసేందుకు కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. రాజధాని అవసరాల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోని రెండు బ్లాకుల్లో 2,089.09 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇటీవలే అంగీకరించింది. వీటిలో ఒక బ్లాకు రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి వద్ద, మరోటి వెంకటాయపాలెం వద్ద ఉంది. ఉండవల్లిలో 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెం వద్ద 1,835.32 హెకార్ట అటవీభూమిని కేంద్రప్రభుత్వం డీ నోటిఫై చేయనుంది. డీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడే.. ఆయా ప్రాంతాల్లో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు అందజేసింది.

వెంకటాయపాలెంలో వచ్చేవి..

వెంకటాయపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడెమీ, ఏపీ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌, షూటింగ్‌ రేంజ్‌, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ హెడ్‌క్వార్టర్లు, మిలిటరీ స్టేషన్‌, రైల్వే భద్రతాదళం అకాడెమీ, సీఆర్‌పీఎఫ్‌ కాంప్లెక్స్‌, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం వంటివి ఏర్పాటుచేయనున్నట్టు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. అక్కడ రూ.3,470కోట్ల పెట్టుబడులు వస్తాయని, 15వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. మొత్తంగా ఈ ప్రాజెక్టుల వల్ల 15లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొంది.

ఉండవల్లిలో..

తాడేపల్లి మండలం ఉండవల్లిలో 421.77హెక్టార్ల అటవీ భూములున్నాయి. వీటిలోనే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఉండవల్లి గుహలూ ఉన్నాయి. గుహలున్న ప్రాంతంతో కలిపి సుమారు 170 హెక్టార్ల భూమి పురావస్తుశాఖ అధీనంలో ఉంది. అది పోగా.. మిగతా 251.77 ఎకరాల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా డీనోటిఫై చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ ప్రాంతాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా తీర్చిదిద్దుతామని, బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పాటుచేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, టయర్‌-4 డేటా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మిస్తామని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తామంది. ఇక్కడ రూ.593.43కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఈ ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది.

అడిగింది 25 బ్లాకులు..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 25 బ్లాకుల్లోని 12,444.89 హెకార్టఅటవీభూమిని రాజధాని అవసరాల కోసం డీనోటిఫై చేయాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ తొలి దశలో రెండు బ్లాకులకే కేంద్రం అనుమతినిచ్చింది. మిగతా వాటికి.. అవసరమైనప్పుడు విడివిడిగా ప్రతిపాదనలతో రావాలని సూచించింది. అన్నింటికీ ఒకేసారి అనుమతులివ్వలేమంది. కేంద్రం డీనోటిఫై చేసిన అటవీ భూముల్లో.. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను ఐదేళ్లలోగా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. పనులు జరుగుతున్నాయో లేదో కేంద్ర అటవీశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. రాష్ట్రప్రభుత్వం కోరినట్టుగా 25బ్లాకుల్ని ఒకేసారి డీనోటిఫై చేసినా ఐదేళ్లలో అవన్నీ పూర్తిచేయడం కష్టమని, ఆయా బ్లాకులవారీగా ప్రతిపాదనలతో రావాలని కేంద్రం సూచించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అటవీ భూమినిస్తే, అంతే భూమిని ప్రత్యామ్నాయ వనీకరణ కోసం రాష్ట్రప్రభుత్వం వేరేచోట చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు డీనోటిఫై చేస్తున్న 2,089.09 హెక్టార్లకు సంబంధించి కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యామ్నాయ భూముల్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇవ్వనుంది. అక్కడ అడవుల అభివృద్ధికి రూ.210కోట్లు కూడా రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

Posted
రాజధానిలో గ్రీనరీకి 16న..శ్రీకారం?
 
 
636430482564478007.jpg
(ఆంధ్రజ్యోతి, అమరావతి): ‘నీలి- హరితమయం (బ్లూ- గ్రీన్‌ కాన్సెప్ట్‌)’గా అమరావతిని రూపుదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా రాజధానిలో వేలసంఖ్యలో నాటనున్న మొక్కల కార్యక్రమానికి ఈ నెల 16వ తేదీన శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజధానిలోని మందడం గ్రామ పరిధిలో, సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్కన నిర్వహించనున్న ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితర ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.
 
17వ తేదీ నుంచి సుమారు 10 రోజులపాటు అమెరికా, దుబాయ్‌, ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం చేతులమీదుగా అంతకంటే ముందే రాజధానిలో గ్రీనరీ కార్యక్రమ ప్రారంభోత్సవం జరిపించాలని ఆశిస్తున్న అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అందుకోసం అవసరమైన ఏర్పాట్లను చేయడంలో నిమగ్నమై ఉంది. వివిధ విద్యాసంస్థలకు చెందిన వందలాదిమంది విద్యార్థినీ విద్యార్థులతో కలసి 16వ తేదీన చంద్రబాబు, ఇతరులు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన మొత్తం సుమారు 4 వేల నుంచి 5 వేల వరకూ మొక్కలను నాటతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజధాని రైతులతోపాటు ఇతర వర్గాలకు చెందిన వేలాదిమందితో బహిరంగ సభను కూడా నిర్వహిస్తారని సమాచారం.
 
అమరావతికి ‘పచ్చల హారం’ వేసేందుకు అందులోని అన్ని రహదారుల పక్కన, శాఖమూరు రీజియనల్‌ పార్కు వంటి ఉద్యానవనాల్లో, నదీతీరాన, సరస్సులు, వాగుల ఒడ్డున.. తదితర ప్రదేశాల్లో దేశ విదేశాలకు చెందిన ఎన్నెన్నో రకాల ఫల, పుష్ప, అలంకరణ మొక్కలతోపాటు కాలుష్యాన్ని అరికట్టే, చక్కటి నీడనిచ్చే వృక్షాలను నాటేందుకు ఏడీసీ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ సంస్థ వెంకటపాలెంలోని తన కేంద్రీయ నర్సరీతోపాటు రాజధానిలోని ఇతర ప్రదేశాల్లో ఉన్న నర్సరీల్లో వేలాది రకాల మొక్కలను సిద్ధం చేసింది కూడా. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు ఒక వైపున సుమారు 50 అడుగుల వెడల్పున, 3 వరుసల్లో పలు రకాలకు చెందిన దాదాపు 4 వేల నుంచి 5 వేల మొక్కలను నాటడం ద్వారా రాజధానిని హరితంతో నింపే కార్యక్రమానికి శుభారంభం పలకాలన్నది ఏడీసీ ఉద్దేశ్యం. వర్షాకాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ వెంటనే రాజధానిలోని ఇతర ప్రదేశాల్లోనూ మొక్కలను నాటాలని భావిస్తోంది.
 
వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని గత నెలలోనే జరపాలని ఉన్నతాధికారులు అనుకున్నారు. ఇందుకు కొన్ని తేదీలను కూడా ప్రతిపాదించారు. మొక్కలు నాటేందుకు గోతులను తవ్వడంతోసహా సీఎం సభ కోసం ఏర్పాట్లనూ చేశారు. అయితే చంద్రబాబు విధులతో తీరిక లేకుండా ఉండడం వంటి కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. వర్షాకాలం ముగింపునకు వచ్చిన ప్రస్తుత తరుణంలోనైనా దీనిని జరిపితే బాగుంటుందని భావిస్తున్న అధికారులు ముఖ్యమంత్రి 17న విదేశీ పర్యటనకు వెళ్లేలోపునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్లు భోగట్టా.
Posted
అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ ప్రకటన
 
 
636431729799526335.jpg
అమరావతి: అమరావతికి రుణం మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని ప్రపంచబ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కొంతమంది రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్‌స్పెక్షన్ ప్యానల్ నివేదిక పరిశీలించాల్సి ఉందని, నివేదికకు రుణం మంజూరుకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. రుణం ఇచ్చే సమయంలో వచ్చే ఫిర్యాదుల పరిశీలన సర్వసాధారమని, అంతర్గత పరిశీలనకే నివేదికలు ఇస్తామని తెలిపింది. రుణం మంజూరుపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది.
Posted

 

అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ ప్రకటన

 

 

636431729799526335.jpg

 

అమరావతి: అమరావతికి రుణం మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని ప్రపంచబ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కొంతమంది రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్‌స్పెక్షన్ ప్యానల్ నివేదిక పరిశీలించాల్సి ఉందని, నివేదికకు రుణం మంజూరుకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. రుణం ఇచ్చే సమయంలో వచ్చే ఫిర్యాదుల పరిశీలన సర్వసాధారమని, అంతర్గత పరిశీలనకే నివేదికలు ఇస్తామని తెలిపింది. రుణం మంజూరుపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది.

Super

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...