sonykongara Posted October 18, 2017 Author Posted October 18, 2017 అమరావతిలో తానా భవన్! సీఎం చంద్రబాబును కోరిన తానా సభ్యులు చికాగో: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తానా ప్రతినిధులు కలిశారు. ఆ దేశంలోని 20 నగరాల్లో 5కె రన్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో ఏపీలో అభివృద్ధి పనులు చేపడతామని వారు సీఎంకు తెలిపారు. అమరావతిలో 20 మిలియన్ డాలర్లతో తానా భవన్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నామని స్థలం కేటాయించాలని సీఎంను కోరారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
AnnaGaru Posted October 18, 2017 Posted October 18, 2017 పచ్చదనంతో కళకళలాడుతున్న ఏపీ రాజధాని అమరావతి దృశ్యాలు... http://www.andhrajyothy.com/pages/photoalbum?GllryID=190696
JVC Posted October 18, 2017 Posted October 18, 2017 అమరావతిలో తానా భవన్! సీఎం చంద్రబాబును కోరిన తానా సభ్యులు చికాగో: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తానా ప్రతినిధులు కలిశారు. ఆ దేశంలోని 20 నగరాల్లో 5కె రన్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో ఏపీలో అభివృద్ధి పనులు చేపడతామని వారు సీఎంకు తెలిపారు. అమరావతిలో 20 మిలియన్ డాలర్లతో తానా భవన్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నామని స్థలం కేటాయించాలని సీఎంను కోరారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. Babu garu.. ee kampulu kuda akkada enduku andi maaku. AnnaGaru 1
sonykongara Posted October 19, 2017 Author Posted October 19, 2017 అసెంబ్లీ, హైకోర్టు ఆకృతులను ట్విట్టర్‌లో ఉంచిన సీఆర్డీయే సీఎం లండన్ వెళ్లేముందు ప్రజాభిప్రాయం కోరడంపై విస్మయం అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై స్పందించాలని ఏపీ సీఆర్డీయే ప్రజలను కోరింది. ఈమేరకు డిజైన్లను బుధవారంనాడు తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఉంచింది. అయితే ఇవేవీ నూతన డిజైన్లు కావు. కొన్ని నెలల క్రితమే రూపొందించినవి. ఎడతెరిపి లేని మంతనా లు, విస్తృత కసరత్తు తర్వాత మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్‌నర్స్ కొన్ని నెలల క్రితం రూపొందించి, సమర్పించిన ఈ ఆకృతులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డిజైన్లు తన ఆకాంక్షలకు తగినట్లుగా ఐకానిక్‌గా లేవని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియలో భాగంగా దర్శకుడు రాజమౌళి, సీఆర్డీయే మాజీ కమిషనర్ డాక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్‌లను ఫోస్టర్‌తో చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయడం, తాను కూడా స్వయంగా ఈ నెల 24, 25 తేదీల్లో లండన్ వెళ్లనుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు డిజైన్లపై ప్రజాప్రాయం కోరామని అనిపించుకునేందుకే సీఆర్డీయే ఆదరాబాదరాగా వాటిని సోషల్ మీడియా అకౌంట్లలో ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అమరావతికి సంబంధించిన కీలకాంశా లు, డిజైన్లపై ప్రజాభిప్రాయాన్ని తీసుకుని, తదనుగుణంగా ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను నెరవేర్చుతున్నామని చెప్పుకునేందుకే వారు ఈ చర్యకు పాల్పడ్డారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఒకవేళ సీఎం ఈ డిజైన్లను ప్రజలకు చూపించి, వాటిపై అభిప్రాయాలను తెలుసుకున్నారా అని తన లండన్ పర్యటన సందర్భంగా ప్రశ్నిస్తే అవునని చెప్పేందుకే... సీఎం పర్యటనకు కేవలం ఆరు రోజుల ముందుగా ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పెట్టి ఉంటారని అంటున్నారు.
sonykongara Posted October 19, 2017 Author Posted October 19, 2017 సామాజిక మాధ్యమాల్లో శాసనసభ ఆకృతులు ప్రజల అభిప్రాయం కోరిన సీఆర్‌డీఏ ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ భవనానికి సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ రూపొందించిన 13 రకాల ఆకృతులను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) బుధవారం తమ వెబ్‌సైట్‌లోను, సామాజిక మాధ్యమాల్లోను పరిశీలనకు ఉంచింది. వాటిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కోరింది. శాసనసభ భవన తుది ఆకృతుల్ని ఖరారు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు వాటిని పరిశీలన కోసం ఉంచినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. వాటిల్లో గతంలో రూపొందించిన పాత ఆకృతులూ కొన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో లండన్‌లో ఈ సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి పాల్గొంటారు. తెలుగు ప్రజల అభిరుచి, భారతీయ సంస్కృతి, నిర్మాణ రీతుల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ, హైకోర్టు తుది ఆకృతుల్ని ఖరారు చేసే అవకాశం ఉందని సీఆర్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి. మరో పక్క వజ్రాన్ని పోలిన విధంగా శాసనసభభవనం ఆకృతి ఉండాలన్న ఆలోచనను పక్కన పెట్టారని సమాచారం.
sonykongara Posted October 19, 2017 Author Posted October 19, 2017 రాజధానిలో భూములకు లీజుల ఖరారు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్‌కు ఉచితంగా 1000 చ.గ. స్థలం సింధుకు 20 సెంట్లు కేటాయింపు ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖలకు, సంస్థలకు వివిధ అసరాల కోసం కేటాయించిన భూములు, స్థలాలకు లీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 సంస్థలకు కేటాయించిన స్థలాల వార్షిక లీజు ధరలపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 15 సంస్థల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్‌కు 1000 చదరపు గజాలను ఉచితంగా కేటయించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతిభవనం, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరికీ సాధారణ ధరకు(నార్మల్) భూములు కేటాయిస్తూ మంత్రుల బృందం సిఫార్సు చేసింది. మిగతా 12 సంస్థలకు లీజు ధరలను ఖరారు చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ జారీ చేసిన మరో జీవోలో ఇదే ప్రాంతంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన స్థలాల లీజులను కూడా సవరించారు. వీటిలో నేవీ, జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ, కేంద్రీయ విద్యాలయ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, తపాలాశాఖ, జాతీయ బయోడైవర్సిటీ మ్యూజియం, ఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఐఓసీ, నాబార్డు, రాష్ట్ర పురావస్తు మ్యూజియం, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఉన్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఉచితంగా 20సెంట్ల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. సచివాలయంలో దీపావళి వెలగపూడిలో ఏపీ సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంక్‌లో దీపావళి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ డీజీఎం వి.ప్రేమ్‌జీ, ఏజీఎం వి.నాగేంద్రకుమార్, సచివాలయం శాఖ మేనేజర్ ఆదిత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted October 19, 2017 Author Posted October 19, 2017 15 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి: సీఆర్‌డీఏ కమిషనర్తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల సముదాయం పనులు సకాలంలో ప్రారంభించి.. గడువులోగా పూర్తి చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం లింగాయపాలెం, రాయపూడి, కొండంరాజుపాలెం, నేలపాడు గ్రామాల పరిధిలో నిర్మించబోయే భవనాల నిర్మాణ ప్రదేశాలను ఆయన బుధవారం పరిశీలించారు. కేటగిరి-1, 2, 3 నివాస భవనాల నిర్మాణానికి కేటాయించిన భూమిని నిర్మాణ సంస్థలకు అప్పగించారు. లింగాయపాలెం నుంచి నేలపాడు వరకు విస్తరించిన 6 కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పు విస్తీర్ణంలోని భూములను నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. నేల స్వభావాన్ని తెలుసుకొనేందుకు భూమి పరీక్షలు చేపట్టి 15 నెలలలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు.
sonykongara Posted October 19, 2017 Author Posted October 19, 2017 రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక విభాగంఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. తుళ్లూరులో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) యూనిట్ కార్యాలయం ఏర్పాటుకి ఉత్తర్వులు జారీచేసింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్/ తత్సమాన హోదా, అనుభవం కలిగిన అధికారిని ప్రాజెక్టు అధికారిగా నియమిస్తారు. ఈ యూనిట్‌లో ఇంజినీరింగ్, పారిశుద్ధ్య, పరిపాలన విభాగాలు ఉంటాయి. వీటికి కొన్ని పోస్టుల్ని కూడా పురపాలక శాఖ మంజూరు చేసింది. ప్రాజెక్టు అధికారి నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలించి పాలనాపరమైన అనుమతులిచ్చేందుకు సలహా సంఘాన్ని, గ్రామాల అవసరాలను గుర్తించేందుకు, ప్రతిపాదనల అమలు పర్యవేక్షణకు వర్కింగ్ కమిటీలను ఏర్పాటుచేసింది. సలహా సంఘాని(అడ్వైజరీ కమిటీ)కి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు. పంచాయతీరాజ్ కమిషనర్, సీఆర్‌డీఏ కమిషనర్, పురపాలక శాఖ డైరెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. వర్కింగ్ కమిటీకి పురపాలక శాఖ డైరెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్, సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీర్, తుళ్లూరు యూనిట్ ప్రాజెక్టు అధికారి, గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల ఎంపీడీఓలు, ఈ మూడు మండలాల ఎంపీపీలు, 29 గ్రామాల సర్పంచ్‌లు సభ్యులుగా ఉంటారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణకయ్యే మొత్తం ఖర్చు సీఆర్‌డీఏ భరిస్తుంది.
sonykongara Posted October 19, 2017 Author Posted October 19, 2017 అమరావతి పాలన నగర ఆకృతులకు సంబంధించి దర్శకుడు రాజమౌళి సహాయాన్ని ఏపీ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఆ పని మీద లండన్ వెళ్ళి వచ్చారు ఆయన. పాలనా నగరంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ వర్క్ షాప్ను ఆయన ఆసక్తికారంగా తిలకించారు. దూరం నుండి కూడా కనిపించాలంటే భవనాల ఎత్తు ఎంత ఉండాలి. ఎలేవెషన్లు ఎలా ఉండాలి అని ఆయన కొన్ని సలహాలు ఇచ్చినట్టు సమాచారం. వజ్రం ఆకారంలో శాసనసభను నిర్మించాలని ముందు అనుకున్న రాజమౌళి సూచనతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. వీటి ఆధారంగా తొందర్లోనే వాళ్ళు ఫైనల్ ఆకృతులు తయారుచేస్తారు. ఈ .నెల చివరన ముఖ్యమంత్రి లండన్ వెళ్ళి నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ఫైనల్ ఆకృతులు చూసి, ఆయన సంతృప్తి చెందితే అతి త్వరలో భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతారు. 2018 చివరికల్లా పూర్తి చెయ్యాలని లక్ష్యం.
rk09 Posted October 20, 2017 Posted October 20, 2017 Complete article ledu: https://www.wsj.com/articles/new-smart-city-hatches-solutions-to-indias-urban-chaos-1508319004 New ‘Smart City’ Hatches Solutions to India’s Urban Chaos Planners for new state capital envision drones, AI to keep order and head off growth of slums By Daniel Stacey Oct. 18, 2017 5:30 a.m. ET AMARAVATI, India—The government planners now dreaming up India’s first “smart city” realize they have a problem.To solve it they are planning to dispatch a fleet of drones, bury the power grid and link a biometric database to every square foot of land here in India’s newest state capital.
sonykongara Posted October 21, 2017 Author Posted October 21, 2017 వాచ్‌టవర్‌కే ఓటు గూగుల్, ఫేస్‌బుక్, సీఆర్డీయే వెబ్‌సైట్‌లలో ఈ డిజైన్‌కే ప్రథమస్థానం అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని అసెంబ్లీకి మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్‌నర్స్ రూపొందించిన డిజైన్లలో ఎగువ భాగాన సమున్నతమైన వాచ్‌టవర్‌తో ఉన్న మొదటి ఆకృతి నెటిజన్ల మది చూరగొంటోంది. గూగుల్, ఫేస్‌బుక్, ఏపీసీఆర్డీయే వెబ్‌సైట్‌లో ఉంచిన మొత్తం 11 ఆప్షన్లపై తమ అభిప్రాయాలు తెలిపిన వారిలో అత్యధికులు ఈ డిజైన్‌కే ఓటు వేశారు. బుధవారం సామాజిక మాధ్యమాల్లో ఈ డిజైన్లను ఉంచగా, శుక్రవారం సాయంత్రం వరకు అన్నింట్లో కలిపి మొత్తం 3,999 మంది స్పందించారు. వీరిలో 1500 మంది ఆప్షన్ 1 తమకు నచ్చిందనగా, మిగిలిన 2,499 మంది ఇతర 10 ఆప్షన్ల మధ్య చీలిపోయారు. గూగుల్‌లో మొత్తం 1,841 మంది అభిప్రాయాలు తెలుపగా వారిలో 719 మంది, ఫేస్‌బుక్ ద్వారా అభిప్రాయాలు తెలిపిన 1656 మందిలో 572 మంది, సీఆర్డీయే వెబ్‌సైట్ ద్వారా స్పందించిన 502 మందిలో 209 మంది ఆప్షన్ 1 పట్ల మొగ్గు చూపారు. మిగిలిన ఆప్షన్లతో పోల్చితే వినూత్నంగా ఉండడంతోపాటు ప్రధాన భవంతికి మధ్య భాగాన కొన్ని వందల అడుగుల ఎత్తయిన, సూదిమొనను తలపించే వాచ్‌టవర్ కారణంగా ఆప్షన్ 1 అత్యధికులను ఆకట్టుకున్నట్లు భావిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు ఈ డిజైన్లపై నెటిజన్ల అభిప్రాయాలను తెలుసుకుని, తదనుగుణంగా ఫైనల్ డిజైన్ల రూపకల్పనలో ముందుకు వెళ్లాలన్నది సీఆర్డీయే వర్గాల యోచనగా ఉంది.
sonykongara Posted October 21, 2017 Author Posted October 21, 2017 అమరావతి డిజైన్లపై మరొకసారి.. లండన్‌కు నారాయణ అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని ప్రతిష్ఠాత్మక భవనాలైన అసెంబ్లీ, హైకోర్టులతోపాటు సచివాలయ డిజైన్ల రూపకల్పన నిమిత్తం మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు నారాయణ శుక్రవారం లండన్‌కు బయలుదేరారు. అమరావతి డిజైన్లపై మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్‌నర్స్ సంస్థ నిపుణులతో చర్చలు జరిపేందుకు ఇప్పటికి పలు పర్యాయాలు లండన్‌కు వెళ్లిన నారాయణ ఈ నెలలో కూడా ఒకసారి అక్కడికి వెళ్లి వచ్చారు. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల ఖరారు ప్రక్రియను వచ్చే నెల మొదటి వారానికి పూర్తిచేసి, ఆయా ఆకృతులను ప్రజల ముంగిట్లో ఉంచాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనే స్వయంగా ఈ నెల 24, 25 తేదీల్లో లండన్‌కు వెళ్లనున్నారు. సీఎం లండన్‌కు చేరుకునేసరికి ఈ ప్రక్రియను దాదాపుగా ఒక కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో నారాయణ లండన్‌కు మరోసారి పయనమయ్యారు. సీఆర్డీయే కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ కూడా ఆదివారం రాత్రి లండన్‌కు వెళ్తున్నట్లు సమచారం.
sonykongara Posted October 21, 2017 Author Posted October 21, 2017 వాల్ స్ట్రీట్ జర్నల్ లో... మన అమరావతి, మన చంద్రబాబు... అమరావతి - India’s first “smart city”... చంద్రబాబు నాయుడు - The visionary... ఈ వ్యాఖ్యలు అన్నది ఆ రెండు పత్రికలు కాదు... ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్.. ఈ మాటలు చెప్పింది... అక్టోబర్ 18న, తన డైలీ న్యూస్ పేపర్ లో, మన అమవారతి గురించి, మన ముఖ్యమంత్రి గురించి పెద్ద వ్యాసం రాసింది, అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తెలుగు ప్రజలే కాక దేశం మొత్తం గర్వించేలా, 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా, ఓ డైనమిక్ సిటీగా చంద్రబాబు నాయడు నిర్మిస్తున్నారు అని రాసింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు మాటలు నమ్మి రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములు ప్రభుత్వానికి అప్పజెప్పారాని, దానికి ప్రతి ఫలంగా, రైతులకి అభివృద్ధి చేసి, ఫ్లాట్లు ఇవ్వనున్నారని చెప్పింది... ఇది రైతులకి ఎంతో ప్రయోజనం అని, రైతులు కూడా మా జీవతలు బాగుపడతాయి అని సంతోషంగా ఉన్నారని పెర్కుంది... చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణలాను వరల్డ్ క్లాస్ గా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, సింగపూర్, జపాన్, లండన్, చైనా పెట్టుబడులు కూడా ప్రస్తావించింది. హైపర్ లూప్ టెక్నాలజీ కూడా అమరావతి లో వాడుతున్న విషయం ప్రస్తావించింది. చంద్రబాబు బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతిని ఎలా ప్లాన్ చేస్తున్నారో చెప్పింది.. గణనీయమైన ఆర్థికాభివృద్ధి, నివాసయోగ్య నగరం, కనెక్టివిటీ, యాక్టివ్ మొబిలిటీ, సుస్థిరతలను ప్రధానంగా రాజధానిని డిజైన్ చేస్తున్నారు అని చెప్పింది వాల్ స్ట్రీట్ జర్నల్ .... చంద్రబాబు అప్పుడు హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేసి, ప్రపంచానికి గమ్య స్థానం చేశారో, ఇప్పుడు కూడా అమరావతిని అలా చేస్తారు అని రాసింది."The visionary behind this new city is N. Chandrababu Naidu, the state’s chief minister. He helped transform the state’s previous capital, Hyderabad, into a high-tech hub. " నవ్యాంధ్ర రాజధాని అంటే నలుదిక్కులు పిక్కటిల్లాలా…! అని చంద్రబాబు చెబుతుంటే.. కొందరికి ఎలా ఉంటుందోననే ఆశ్చర్యమేసింది. మరికొందరికి అది ఇప్పట్లో సాధ్యమా అని అనే అనుమానం కూడా కలిగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన రాజధానిని గుర్తిస్తుంది... పునాదులలో ఉన్నప్పుడే ఇంత గుర్తింపు వస్తుంది అంటే, పూర్తి స్థాయిలో నిర్మితం అయితే, ఇక అమరావతికి అడ్డే ఉండదు అనటంలో సందేహం లేదు... ఇది మన గొప్పతనం... ఇది మన అమరావతి గొప్పతనం... ఇది మన ఆంధ్రవాడి దమ్ము... ఇప్పటికైనా ఆ కొంత మంది, అమరావతి మీద ఏడుపులు ఆపి, మన రాజధానికి సహకరించిండి... పూర్తి కధనం ఇక్కడ చూడచ్చు: https://www.wsj.com/articles/new-smart-city-hatches-solutions-to-indias-urban-chaos-1508319004
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now