Jump to content

Recommended Posts

Posted
సంస్థలు... సంగతులు!
22-10-2017 01:55:04
 
మంగళగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాజధాని పరిధిలో రూ.18 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే 11 అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వం 950 ఎకరాలు కేటాయించింది. ఈ సంస్థలు పూర్తస్థాయిలో ఏర్పాటైతే 32 వేల మందికి ఉపాధి లభిస్తుంది. విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలైతే.. 14వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రూ.2200 కోట్ల వ్యయంతో అమృత వర్సిటీని 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రూ.190 కోట్ల వ్యయంతో యాభై ఎకరాల విస్తీర్ణంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సంస్థను, రూ.వెయ్యి కోట్లకు పైగా వ్యయంతో యర్రబాలెం వద్ద ఇండో-యుకె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థను వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. నవులూరులో బీఆర్‌ఎస్‌ మెడిసిటీ హెల్త్‌కేర్‌ రీసెర్చి సంస్థను 200 ఎకరాల్లో రూ.5,450 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.
 
రూ.20కోట్ల ఖర్చుతో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్స్‌ విద్యాసంస్థను ఐదెకరాల్లో, 25ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రజాపన్నుల శాఖ రూ. 1600 కోట్ల వ్యయంతో కార్యకలాపాలను సాగించేందుకు ముందుకురాగా ప్రభుత్వం 28ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. శాఖమూరు వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ స్మృతివనాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. మంగళగిరి వద్ద సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఐటీ పార్కులో పై డేటా, పైకేర్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆరంభించాయి. త్వరలో వీ సాఫ్ట్‌ కంపెనీ కూడా తన సేవలను ఆరంభించనుంది.
Posted
సంకల్పానికి సలాం
22-10-2017 07:26:58
 
636442541304183799.jpg
నవ్యాంధ్ర ప్రగతిలో ఎన్నో చారిత్రక ఘట్టాలు... రాష్ట్ర విభజన తర్వాత సొంతగడ్డ నుంచే పరిపాలన అందించాలన్న సీఎం చంద్రబాబునాయుడి కృత నిశ్చయంతో సాకారం అవుతున్న కలలు.. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు.. వేగంగా పూర్తయిన సచివాలయ నిర్మాణం.. ఊపందుకుంటున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు, అం తర్జాతీయ విద్యా, వైద్య సంస్థల రాక.. ఇవన్నీ కళ్లముందే జరిగిపోయాయి. రాజధానికి శంకుస్థాపన జరిగి రెండేళ్లు పూర్తయింది. చంద్రబాబునాయుడి సంకల్పం సిద్ధిస్తోంది. కలల రాజధాని ఆవిష్కృతం కాబోతోంది.
  • ప్రగతి పథంలో రాజధాని అమరావతి
  • అంతర్జాతీయ స్థాయిలో వేగంగా రూపు
  • తలమానికంగా నిలుస్తున్న తాత్కాలిక సచివాలయం
  • సీడ్‌ రోడ్డు నిర్మాణ పనులు 80 శాతం పూర్తి
  • అభివృద్ధి చూసి రైతుల అచ్చెరువు
  • రాజధాని శంకుస్థాపనకు నేటితో రెండేళ్లు
తుళ్లూరు/ మంగళగిరి: రాష్ట్రం విడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి రూపంలో అభివృద్ధి చెందటానికి ఒక అవకాశం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకల్పంతో ప్రపంచ దేశాలను ఆకర్షించేలా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. చంద్రబాబు పిలుపు మేరకు... ఆయనపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ప్రాణ సమానమైన భూములను త్యాగం చేసి అందించారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ఈ రెండేళ్లలో ఎన్నో మైలురాళ్లు..! తొలుత.. ఏడు నెలలో ఎవరూ ఊహించని విధంగా తాత్కాలిక సచివాలయం భవనాలు నిర్మితమయ్యాయి. వాటి నుంచే పరిపాలన ప్రారంభించటంతో చంద్రబాబు అభివృద్ధి మార్క్‌ కనపడింది. హైద్రాబాద్‌ నుంచి ఏపీ సచివాలయానికి ఉద్యోగులు తరలివచ్చారు. రాజదాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సీఆర్డీయే రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించింది. ఒప్పందంలో భాగంగా లేఅవుట్లలో ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే టెండర్లు దక్కించుకున్న కంపెనీలు శాఖమూరు, నేలపాడు ఐనవోలు, తుళ్లూరు, నెక్కల్లు లేఅవుట్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శాశ్వత ప్రభుత్వ భవనాలకు కూడా త్వరలో శంకుస్థాపన చేసి 2019 లోపు నిర్మాణాలు పూర్తి చేయాలని రప్రభుత్వం సంకల్పించింది. రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణనికి ఆయా కంపెనీలు పనులు వేగవంతం చేశాయి. రైతులు తమకు ఇచ్చిన ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. రాజదాని నిర్మాణం ప్రారంభం కాగానే గ్రామాలకు ఎల్‌ఈడీ వెలుగు తీసుకొచ్చారు. సీఎం రెస్ట్‌ హౌస్‌ నుంచి సచివాలయం వరకు రాత్రివేళ కూడా పట్టపగలు మాదిరిగా ఎల్‌ఈడీ వెలుగు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో రోడ్లను విశాలం చేస్తున్నారు. ఇరువైపుల పచ్చదనం ఉండేలా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సచివాలయం లోపల రోడ్లను చూసి పర్యాటకులు ముచ్చటపడుతున్నారు. ఒకప్పుడు పల్లెలు.. ఇప్పుడు రంగుల అద్దాల మేడలతో మెరిసిపోతున్నాయి. రాజధాని రాకతో ఆర్థికంగా బలపడటంతో కొందరు రైతులు ఉన్న పొలంలో కొంత అమ్మి ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో గ్రామీణ వాతావరణం నుంచి పట్టణ వాతావరణంలోకి మారుతున్నాయి. ఈ ప్రాంతంలోకి అన్నీ వ్యాపారాలు వచ్చేసాయి. బ్యాంకులన్నీ తమ శాఖలను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాయి. విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలు ప్రారంభం మయ్యాయి. బీఆర్‌ శెట్టి మెడీ సిటి రాజధానిలో 12వేల కోట్లు పెట్టుబడితో ముందుకు వచ్చింది. రాజధానికి గుండెకాయ వంటి సీడ్‌నిర్మాణం పనులు దాదాపు 80 శాతం పూర్తయింది. ఈ ఊహించని అభివృద్ధికి రాజధాని రైతులు సైతం అచ్చెరవొందుతున్నారు.
Posted

టవర్‌ ఆకృతికే ఎక్కువ మంది మొగ్గు
శాసనసభ నమూనా ఆకృతులపై 5927 మంది స్పందన
image.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనం నమూనా ఆకృతులపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు ఆదివారం సాయంత్రం వరకు 5927 మంది స్పందించారు. వీరిలో ఎక్కువ మంది భవనంపై పొడవైన టవర్‌తో రూపొందించిన ఆకృతికే ఓటు వేశారు. ఈ ఆకృతి (ఆప్షన్‌ 1) 2617 మందిని ఆకట్టుకుంది. ఆప్షన్‌ 6గా పేర్కొన్న ఆకృతికి ప్రజాభిప్రాయ సేకరణలో రెండో స్థానం లభించింది. 1679 మంది దీనికి ఓటేశారు. ఆప్షన్‌ 2గా పేర్కొన్న ఆకృతికి మూడో ప్రాధాన్యం లభించింది. 1400 మంది దీనికి మొగ్గు చూపారు. సీఆర్‌డీఏ తమ వెబ్‌సైట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. తమ వెబ్‌సైట్‌లో 13 నమూనా ఆకృతులు ఉంచింది. గూగుల్‌లో ఎనిమిది ఆకృతులు ఉంచింది. గూగుల్‌ ద్వారా 3253, సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌ ద్వారా 749 మంది, ఫేస్‌బుక్‌ ద్వారా 1925 మంది స్పందించారు. ఈ ఆకృతులను లండన్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించింది. శాసనసభ, హైకోర్టులతో పాటు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల ఆకృతులపై నార్మన్‌ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించి అవసరమైన మార్పుచేర్పులు సూచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో వారితో లండన్‌లో సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులు ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. తాను లండన్‌కు వెళ్లే ముందుగానే నార్మన్‌ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన నమూనా ఆకృతులపై ప్రజాభిప్రాయం కూడా సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు సీఆర్‌డీఏ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లడానికి ఒక రోజే సమయం ఉండటంతో నమూనా ఆకృతులపై ఎక్కువ మంది అభిప్రాయాలు తెలియజేయాలని సీఆర్‌డీఏ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల స్పందనను ఆశిస్తున్నారు.

image.jpg

image.jpg

Posted
రాజధాని ఆకృతులను పరిశీలించిన చంద్రబాబు

అమరావతి: లండన్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నార్మన్‌ ఫోస్టర్స్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు అమరావతి నిర్మాణ ఆకృతులను చంద్రబాబు బృందానికి వివరించారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ అధికారులను సమన్వయం చేస్తూ చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా పాల్గొన్నారు.

Posted

విలక్షణ ఆకృతులు

భారతీయత మేళవింపు

సహజ వనరుల అందం

శాసనభ, హైకోర్టులకు తాజా ప్రతిపాదన

నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రజెంటేషన్‌

లండన్‌లో పరిశీలించిన ముఖ్యమంత్రి బృందం

పాల్గొన్న రాజమౌళి

నేడు మరోసారి సమావేశం

ఈనాడు - అమరావతి

24ap-main1a.jpg

ప్రజలకు గర్వకారణంగా నిలిచేలా, భారతీయత ఉట్టిపడేలా, నవ్యాంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసేలా, సహజ వనరుల్ని ఉపయోగించుకుని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులను రూపొందిస్తున్నామని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు క్రిస్‌ బాబ్‌, పిడ్రో వివరించారు. ఒక్కో భవనానికి రెండేసి ఆకృతులను ఇస్తున్నామని వెల్లడించారు. మంగళవారం లండన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందానికి తాజాగా రూపొందించిన ఆకృతుల్ని వారు చూపించారు. ముఖ్యమంత్రి వెంట సినీ దర్శకుడు రాజమౌళి, మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, అబుదాబికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్‌ షెట్టి, ఉన్నతాధికారులు ఉన్నారు. మొదట వీరంతా నమూనా ఆకృతులకు సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. అనంతరం వీడియో చిత్రాన్ని తిలకించారు. ఆకృతుల ప్రత్యేకతలను నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు వివరించారు. రాజమౌళి చొరవ తీసుకుని... ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉంటే బాగుంటుందో సూచించారు. శాసనసభ ఆకృతి గురించి ఎక్కువ చర్చ జరిగింది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకిరణాలు శాసనసభ భవనం చుట్టూ ఉన్న నీటిలో ప్రతిబింబించి భవనానికి కొత్త శోభను తీసుకొస్తాయని ఫోస్టర్‌ ప్రతినిధులు వివరించారు. 4 కి.మీ. దూరం నుంచి చూసినా భవనం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి సేకరించిన మట్టిని శాసనసభ నిర్మాణంలో వినియోగించాలని, ఇలా చేస్తే తామంతా ఈ సభ నిర్మాణంలో భాగస్వాములయ్యామని గర్వపడతారని రాజమౌళి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా భవనాన్ని తీర్చిదిద్దాలని, సందర్శకులు వాటి ఫొటో తీసుకున్నప్పుడు వాటి చరిత్ర తెలిసేలా ఒక యాప్‌ను రూపొందించవచ్చని, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీ ద్వారా యానిమేషన్‌ చిత్రాలనూ ఫోన్‌లో తిలకించేలా చేయవచ్చని తెలిపారు. శాసనసభ భవనం చుట్టూ నీటి కొలను ఉండటంవల్ల రాత్రిపూట, పగటిపూట అద్భుతంగా కనిపిస్తుందని ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భవనం ఎత్తు ఎంత ఉండాలన్నది ముఖ్యం కాదని, ఎంత దూరం వరకు స్పష్టంగా కనిపిస్తుందన్నది ముఖ్యమని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

24ap-main1b.jpg

24ap-main1m.jpg

24ap-main1k.jpg

ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ (భారత కాలమానం ప్రకారం) నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కార్యాలయంలోనే గడిపింది. సంస్థ అధినేత లార్డ్‌ నార్మన్‌ ఫోస్టర్‌ మొదటిసారి ముఖ్యమంత్రితో కాసేపు చర్చల్లో పాల్గొన్నారు. ఆకృతులపై మంగళవారం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలకు మరోసారి ముఖ్యమంత్రి సంస్థ కార్యాలయానికి వెళ్లి ఆకృతులపై చర్చిస్తారు.

24ap-main1c.jpg

విలక్షణం... నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ తాజాగా ప్రతిపాదించిన ఆకృతులు విలక్షణంగా ఉన్నాయి. శాసనసభకు సంబంధించిన ఒక ఆకృతిని పై భాగంలో చతురస్రాకారంలో ఉండేలా రూపొందించారు. భవనం నాలుగు వైపులా బౌద్ధచక్రం ఆకృతి కనిపించేలా తీర్చిదిద్దారు. మరో ఆకృతిని స్థూపాకారంలో రూపొందించారు. భవనాల చుట్టూ నీటి కొలను ఉండేలా ఈ ఆకృతుల్ని సిద్ధం చేశారు. భవనాల నీడ చుట్టూ ఉన్న నీటిలో ప్రతిబింబిస్తుంది. రెండు భవనాల్లోనూ మధ్య భాగం నుంచి భవనంపైకి వెళ్లేందుకు వర్తులాకారపు ఏర్పాటు ఉంటుంది. దీన్ని సెంట్రల్‌ అట్రియంగా వ్యవహరిస్తారు. హైకోర్టు ఆకృతుల్ని ఒకటి స్థూపాకారంలోనూ, మరొకటి చతురస్రాకారంలోనూ సిద్ధం చేశారు. స్థూపాకార భవనం పైకప్పునకు సంబంధించి రూపొందించిన 10 రకాల నమూనా ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కార్యాలయంలో ప్రదర్శించారు.

Posted

చిన 10 రకాల నమూనా ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కార్యాలయంలో ప్రదర్శించారు.

24ap-main1d.jpg

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తిలకించిన సలహాదారులు
లండన్‌లోని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కార్యాలయంలో జరుగుతున్న ఆకృతుల పరిశీలన, చర్చల్ని రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులైన ఎంపీ గల్లా జయదేవ్‌, పారిశ్రామికవేత్తలు సంజయ్‌ రెడ్డి, మండవ ప్రభాకరరావు, సీఆర్‌డీఏ అధికారులు వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా తిలకించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ
ప్రతిపాదిత ఆకృతులతో తాజాగా రూపొందించిన వీడియోలోని అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ఆకృతుల నమూనాలివీ..

24ap-main1e.jpg

24ap-main1f.jpg
24ap-main1g.jpg

24ap-main1i.jpg
24ap-main1j.jpg
24ap-main1l.jpg

24ap-main1o.jpg
24ap-main1p.jpg
24ap-main1q.jpg

 

Posted
సుందర వాహినిగా..
25-10-2017 07:48:02
 
636445144832079810.jpg
  •  త్వరలో కొండవీటివాగు సుందరీకరణ
  •  వాగుల అభివృద్ధితో పాటే రిజర్వాయర్‌ల నిర్మాణం
  • రూ.వెయ్యి కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు
  •  ప్రపంచ బ్యాంకు ఆమోదం తర్వాత టెండర్లకు రంగం సిద్ధం
కొండవీటివాగు, దాని అనుబంధ వాగులను అమరావతికి అచ్చొచ్చిన సుందరవాహినిలుగా తీర్చిదిద్దేందుకు అమరావతి డెవలప్‌మెంట్‌
కార్పొరేషన్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీంతోపాటు రాజధాని నగర ప్రజల తాగునీటి అవసరాలకు తోడు ఆహ్లాదాన్ని కల్పించేవిధంగా మరో మూడు ప్రధాన రిజర్వాయర్‌లను కూడ ఏర్పాటు చేయనుంది. వీటిని ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ఏడీసీ భావిస్తోంది. ప్రపంచబ్యాంకు నుంచి నిధులకు గ్రీన్‌ సిగ్నల్‌ అందిన వెంటనే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లను పిలిచేందుకు అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సన్నద్ధమవుతోంది.
 
మంగళగిరి: రాజధాని అమరావతి నగరాన్ని బ్లూగ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు 29 గ్రామాల పరిధిలో వున్న వాగులు వంకలను రాష్ట్ర ప్రభుత్వం చక్కగా వినియోగించుకోవాలని రాజధాని మాస్టర్‌ప్లానులో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల రైతులకు వెన్నులో వణుకు పుట్టించిన కొండవీటివాగును నేడు రాజధానికి ప్రకృతి ప్రసాదించిన సుందరవాహినిగా మలుచుకునేందుకు ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ప్లానులో అద్భుతమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలను అంచెలంచెలుగా కార్యరూపంలోకి తెస్తూ క్రమంగా రాజధాని అభివృద్ధిలో వేగం పెంచింది. ఈ క్రమంలో రాజధానిలో కొన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు స్థిరమైన అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు (ఏఎస్‌సీసీడీపీ)ను చేపట్టింది. సుమారు రూ.ఐదువేల కోట్ల విలువగల అంచనాలతో కూడిన ఈ ప్రాజెక్టులో రోడ్లు, డ్రెయిన్లతో పాటు హరితయుతంగా వాగులు వంకలను అభివృద్ధి చేసే పనులకు స్థానం కల్పించారు. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు, పాలవాగులను మరింత విస్తారంగా కనులకు సొగసైన రీతిలో బ్లూగ్రీన్‌ సిటీ అందాలు పరిఢవిల్లే విధంగా అభివృద్ధి చేయనున్నారు. రూ.ఐదువేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో భాగంగా కొండవీటివాగు అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రారంభించాల్సివుంది. కానీ, రాజకీయ కారణాలతో కొందరు ప్రపంచబ్యాంకుకు రాతపూర్వక ఫిర్యాదులను పంపండంతో ఈ ప్రాజెక్టుకు సకాలంలో నిధులు విడుదల కాలేదు. దీంతో కొండవీటివాగు, పాలవాగులను మాస్టర్‌ప్లానులో పేర్కొన్న విధంగా అభివృద్ధి చేసేందుకు డిజైన్లు, అంచనాలు అన్నీ సిద్ధమైనప్పటికీ ప్రపంచబ్యాంకు నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులు కూడ గత సెస్టెంబరు మాసంలో ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజాభిప్రాయాలను తీసుకున్న మీదట పూర్తిస్థాయిలో సంతృప్తి చెందినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు అమలుకు తొలివిడత నిధులను మంజూరు చేయవచ్చునని భావిస్తున్నారు. ప్రపంచబ్యాంకుతో పాటు ఆసియా మౌలికసదుపాయాల పెట్టుబడుల బ్యాంకు ఏఎస్‌సీసీడీపీకి రుణాలను మంజూరు చేయాల్సివుంది.
 
ముంపు నివారణకు పటిష్ఠ చర్యలు
వాస్తవానికి రాజధాని అమరావతి నగరానికి కొండవీటివాగు వరదల నుంచి ఎలాంటి ముప్పు ఏదశలోనూ రాకుండా నివారించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను చేపట్టింది. రూ 237 కోట్ల వ్యయంతో సీతానగరం వద్ద కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనులను ఇప్పటికే చేపట్టింది. దీనికితోడు కొండవీటివాగు, పాలవాగులను బ్లూగ్రీన్‌ సిటీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికకు త్వరలో కార్యరూపం ఇవ్వనుంది. ఈ వాగుల నుంచి వచ్చే వరద నీటిని రాజధాని నీటి అసవరాలకు వినియోగించుకునే విధంగా అనంతవరం కొండ వెనుకవైపు, నీరుకొండ, శాఖమూరు మధ్య, కృష్ణాయపాలెం వద్ద మూడు రిజర్వాయర్‌లను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రిజర్వాయర్‌లను ప్రస్తుత ప్రకాశం రిజర్వాయర్‌కు భవిష్యత్తులో వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న భారీ రిజర్వాయర్‌తో అసుసంధానం గావిస్తూ అవసరమైన చోట్ల కొత్త కాలువలను నిర్మిస్తారు. వీటినే తిరిగి రాజధానిలో అందమైన జలరవాణా మార్గాలుగా కూడా ఉపయోగిస్తారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 4.99 టీఎంసీల నీటిని, వైకుంఠపురం రిజర్వాయర్‌ నుంచి 6.48 టీఎంసీల నీటికి తోడుగా మూడు రిజర్వాయర్‌ల తాలూకు వరదనీటిని రాజధాని తాగునీటి అవసరాలకు వినియోగించేవిధంగా ఈ ప్రణాళిక రూపుదాల్చనుంది. ఇందులోభాగంగా తొలిదశలో మూడు రిజర్వాయర్‌లు, కొండవీటివాగు, పాలవాగు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
Posted
అమరావతి డిజైన్లపై సీఎం సంతృప్తి
25-10-2017 22:22:36
 
లండన్‌: అమరావతి డిజైన్లపై ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సమర్పించిన నివేదికలపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన మార్పులు చేసి తుదిరూపు ఇవ్వాలని నిర్దేశించారు. ఐదు టవర్లుగా సచివాలయం నిర్మించాలని, సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. హైకోర్టు భవన డిజైన్‌ తుదిరూపానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ డిజైన్‌లో స్వల్పమార్పులు సూచించారు.
మంత్రుల ఆఫీసులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల ఆఫీసులకు 4 భారీ టవర్లు ఏర్పాటుచేయాలని, వీటికి కొంచెం దూరంలో సీఎం కార్యాలయం, సీఎం కార్యదర్శుల ఆఫీసులు ఉండాలని సూచించారు. పరిపాలన శాఖ కార్యాలయం కోసం మరో టవర్‌ను నిర్మిస్తామన్నారు. త్వరలో భవన సముదాయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. పరిపాలన నగర నిర్మాణంలో జాప్యం చేయొద్దని సీఎం భావిస్తున్నారు.
Posted

నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో ప్రభుత్వ భవన సముదాయ ఆకృతులను పరిశీలించాను. సంతృప్తికరంగా ఉన్నాయి. త్వరలో నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించాను

 

Cbn tweet

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...