sonykongara Posted October 14, 2017 Author Posted October 14, 2017 మంగళగిరిలో వాతావరణ కేంద్రం! భూకేటాయింపునకు ఐఎండీ లేఖ ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి వాతావరణ కేంద్రం రాబోతోంది. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు సమాచారం ఇచ్చింది. కేంద్రం నిర్మాణానికి మంగళగిరిలో కనీసం 5 ఎకరాలు కేటాయించాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు లేఖ కూడా రాశారు. అమరావతిలో శాశ్వత కేంద్రం అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సీఆర్‌డీఏ తగిన కార్యాలయాన్ని చూపిస్తే వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో వాతావరణంపై హెచ్చరికలు, సూచనలు ఇచ్చేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. విశాఖలో ఉన్నది తుపాను హెచ్చరికల కేంద్రమేనని, ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలంటే ఐఎండీ కేంద్రం తప్పనిసరి అని వెల్లడించారు. రాష్ట్ర వాతావరణానికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రం నుంచే అందుతోంది.
sonykongara Posted October 14, 2017 Author Posted October 14, 2017 భూకంపాలను తట్టుకొనేలా నిర్మించాలి’ సెల్ బ్రాడ్ కాస్టింగ్‌పై ఒప్పందం ఈనాడు, అమరావతి: భూకంపాలకు సంబంధించిన మూడో జోన్‌లో రాజధాని ప్రాంతం అమరావతి ఉన్నందున విపత్తులను తట్టుకొనే నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి భవన నిర్మాణ సూత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సెల్ బ్రాడ్ కాస్టింగ్ అంశంపై బీఎస్‌ఎన్‌ఎల్‌తో విపత్తుల నిర్వహణశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు మాట్లాడుతూ ఏ ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించబోతుందో ముందస్తు సమాచారం అందగానే సంబంధిత ప్రాంతంలో ఉన్న సెల్‌ఫోన్ వినియోగదారులందరికీ సందేశాలు చేరేలా బీఎస్‌ఎన్‌ఎల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరుస్తుందన్నారు. హెచ్చరిక సందేశం మొబైల్ తెరపై కనిపిస్తుందనీ, చూసే వరకూ బీప్ శబ్దం వస్తూనే ఉంటుందన్నారు.
sonykongara Posted October 14, 2017 Author Posted October 14, 2017 విజయవాడ వారధి కూడలిలో బౌద్ధ చక్రం రూ.5.26 కోట్లతో టెండర్లు ఈనాడు అమరావతి: విజయవాడలోని వారధి కూడలి సుందరీకరణలో భాగంగా ల్యాండ్‌స్కేపింగ్ పనులకు, బౌద్ధ చక్రాన్ని ఏర్పాటుచేసేందుకు రాజధాని అభివృద్ధి సంస్థ(ఏడీసీ) టెండరు ప్రకటన జారీ చేసింది. ఏడీసీ ఇచ్చిన ఆకృతులకు అనుగుణంగా బౌద్ధచక్రాన్ని తయారుచేసి వారధి జంక్షన్ వద్ద నిర్దేశించిన ప్రదేశంలో అమర్చేందుకు రూ.5.26 కోట్లతో టెండర్లు పిలిచింది. వారధి కూడలిలో ల్యాండ్‌స్కేపింగ్ పనులకు, రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన అనుసంధాన రహదారి, మొదటి దశలో చేపట్టిన రహదారులకు ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే నిర్వహించి సరిహద్దు రాళ్లు ఏర్పాటుచేసేందుకు రూ.84.68 లక్షలతో టెండర్లు పిలిచింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాఖమూరు పార్కులో గులాబీల వనం, హస్తకళల బజారు ఏర్పాటుచేసే చోట వివిధ స్థాయుల్లో నేల ఎత్తు పెంచేందుకు రూ.6.37కోట్లతో టెండర్లు పిలిచింది. వారధి కూడలిలో ఏర్పాటుచేసే బౌద్ధ చక్రం ఆకృతిని కళా దర్శకుడు ఆనంద్‌సాయి రూపొందించారు.
TDP888 Posted October 14, 2017 Posted October 14, 2017 మంగళగిరిలో వాతావరణ కేంద్రం! భూకేటాయింపునకు ఐఎండీ లేఖ ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి వాతావరణ కేంద్రం రాబోతోంది. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు సమాచారం ఇచ్చింది. కేంద్రం నిర్మాణానికి మంగళగిరిలో కనీసం 5 ఎకరాలు కేటాయించాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు లేఖ కూడా రాశారు. అమరావతిలో శాశ్వత కేంద్రం అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సీఆర్‌డీఏ తగిన కార్యాలయాన్ని చూపిస్తే వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో వాతావరణంపై హెచ్చరికలు, సూచనలు ఇచ్చేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. విశాఖలో ఉన్నది తుపాను హెచ్చరికల కేంద్రమేనని, ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలంటే ఐఎండీ కేంద్రం తప్పనిసరి అని వెల్లడించారు. రాష్ట్ర వాతావరణానికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రం నుంచే అందుతోంది. Mangalagiri lanti centre lo 5,acres yenduku jaaga bokka.. Amaravati side oo moolana padeyyandi.. Aada untey thelavada vathavaranam
sonykongara Posted October 14, 2017 Author Posted October 14, 2017 అమరావతి డిజైన్లపై పలు సూచలనలు చేసిన రాజమౌళి అమరావతి: లండన్‌లో నార్మన్‌పోస్టర్ సంస్థ ప్రతినిధులతో డైరెక్టర్ రాజమౌళి, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఎంపీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. అమరావతి పరిపాలన భవనాల డిజైన్ల పరిశీలించారు. పలు మార్పులు రాజమౌళి బృందం సూచించింది. ఈనెల 23 నుంచి లండన్‌లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పరిపాలన భవనాల డిజైన్లను చంద్రబాబు ఫైనల్ చేయనున్నారు. అమరావతి నిర్మాణాల డిజైన్లపై చంద్రబాబుతో రాజమౌళి ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై చర్చించారు. అమరావతి డిజైన్లపై లండన్‌లో అక్టోబర్ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు.
sonykongara Posted October 15, 2017 Author Posted October 15, 2017 శాసనసభ, హైకోర్టు ఆకృతులపై ఫోస్టర్, సీఆర్‌డీఏ ప్రతినిధుల చర్చలు ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులకు తుది రూపం ఇచ్చేందుకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో సీఆర్‌డీఏ అధికారులు, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి చర్చిస్తున్నారు. వీరంతా పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ సారథ్యంలో ఈ నెల 11న లండన్ బయల్దేరి వెళ్లారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన పలు నమూనా ఆకృతుల్ని ఈ బృందం పరిశీలించింది. అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చింది. ఆ చర్చలు ముగించుకుని మంత్రి నారాయణ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇతర అధికారులు, రాజమౌళి సోమవారం వరకు లండన్‌లోనే ఉంటారు. ఈ బృందం తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలను ముఖ్యమంత్రికి వివరించనుంది. ఆయనేమైనా సూచనలు చేస్తే వాటిని నార్మన్ ఫోస్టర్ సంస్థకు తెలియజేస్తుంది. ఈ ఆకృతుల పరిశీలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల చివరి వారంలో లండన్‌కు వెళుతున్నారు. ఆ సమయానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ తుది ఆకృతుల్ని సిద్ధం చేయనుంది.
sonykongara Posted October 15, 2017 Author Posted October 15, 2017 ‘డిజైన్ల’పై లండన్‌లో చర్చలు నార్మన్ ఫోస్టర్‌తో మంత్రి నారాయణ బృందం భేటీ సీఎం లండన్ పర్యటన నాటికి ముసాయిదా డిజైన్లు అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని పరిపాలనా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలకు సంబంధించిన డిజైన్లపై మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ప్రతినిధులతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి బృందం లండన్‌లో చర్చలు జరిపింది. రాజధానిలో ప్రధాన కట్టడాల డిజైన్లపై నెలల తరబడి కసరత్తు చేసినా... ఇటీవల నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు సమర్పించిన డిజైన్లు సీఎం చంద్రబాబును ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో నారాయణ బృందం మరొకమారు లండన్‌కు పయనమైన సంగతి విదితమే. ఎలాగైనా సరే ఈ డిజైన్ల ప్రక్రియను కొద్ది వారాల్లోనే ఒక కొలిక్కి తెచ్చే కృతనిశ్చయంతో ఉన్న సీఎం... ఈ ప్రక్రియలో ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు ఎస్.ఎ్‌స.రాజమౌళిని కూడా భాగస్వామిని చేశారు. సీఎం ఆలోచనలను తెలుసుకునేందుకు ఇప్పటికే ఆయనతో సమావేశమైన రాజమౌళి... గత బుధవారం నారాయణ బృందంతోపాటు లండన్‌కు వెళ్లారు. సీఆర్డీయే మాజీ కమిషనర్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌కు సైతం ఈ టీంలో ప్రభుత్వం స్థానం కల్పించిన విషయం తెలిసిందే. సీఎం సూచనల మేరకు ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన రివైజ్డ్ డిజైన్లను నారాయణ, రాజమౌళి తదితరులు నిశితంగా పరిశీలించారు. అవసరమైన మార్పుచేర్పులను సూచించారు. అనంతరం నారాయణ, రాజమౌళి శనివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకోగా, మరింత లోతైన చర్చల కోసం సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్, మాజీ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు లండన్‌లోనే ఉండిపోయారు. సీఎం చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో లండన్‌లో ఫోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను పరిశీలించనున్నారు. అప్పటికల్లా డిజైన్లు ఒక కొలిక్కి తెచ్చేందుకు నారాయణ బృందం ప్రయత్నిస్తోంది.
sonykongara Posted October 15, 2017 Author Posted October 15, 2017 http://www.andhrajyothy.com/artical?SID=476976
sonykongara Posted October 17, 2017 Author Posted October 17, 2017 ప్రభుత్వ భూముల అప్పగింతకు ఆమోదం!17-10-2017 08:44:04 రాజధానిలో ప్రభుత్వ భూములు సీఆర్డీయేకు బదలియించేందుకు లైన్ క్లియర్ సీసీఎల్‌ఏ సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమోదం? ఊపందుకోనున్న అమరావతి నిర్మాణ ప్రక్రియ ఆంధ్రజ్యోతి, అమరావతి: అమరావతి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసే కీలక నిర్ణయం సోమవారంనాడు వెలువడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజధాని గ్రామాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 3,800 ఎకరాలను ఏపీసీఆర్డీయేకు దఖలు పరిచేందుకు రాష్ట్ర భూపరిపాలనాధికారి సమక్షంలో గొల్లపూడిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీఎల్‌ఎంఏ) ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజధానిలోని 29 గ్రామాల్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన చెరువులు, కుంటలు, పోరంబోకులు ఇత్యాదివి విస్తరించి ఉన్న సుమారు 12,000 ఎకరాలపై యాజమాన్య హక్కులను సీఆర్డీయేకు అప్పగించేందుకు గత కొన్నినెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ గ్రామాల్లో సీఆర్డీయే, ఏడీసీ చేపట్టిన పలు అభివృద్ధి పనులు నిరాటంకంగా, వేగంగా సాగాలంటే ఈ భూములన్నీ సీఆర్డీయేకు దఖలు పడడం అత్యవసరం. అమరావతిలో రోడ్లు, నిర్మాణ ప్రాజెక్టులు రోజురోజుకూ ఊపందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆవశ్యకత మరింతగా హెచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం సీసీఎల్‌ఏ (భూ పరిపాలనాధికారి) అనిల్‌చంద్ర పునేటా ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఆర్డీయే కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు జేసీ కృతికా శుక్లా, పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో పైన ఉదహరించిన రమారమి 12,000 ఎకరాల్లో 3,800 ఎకరాలపై యాజమాన్య హక్కులను సీఆర్డీయేకు బదలాయించేందుకు పునేటా అంగీకరించారు. కాగా.. మిగిలిన భూములను సైతం సీఆర్డీయేకు అప్పగించేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం చురుగ్గా చర్యలు చేపడుతోంది.
sonykongara Posted October 17, 2017 Author Posted October 17, 2017 20 అంతస్తుల్లో సచివాలయ భవనం వారంలో శాసనసభ, హైకోర్టు తుది ఆకృతులు మంత్రి నారాయణ వెల్లడి ఈనాడు అమరావతి: అమరావతిలోని పరిపాలన నగరంలో సచివాలయ భవనాన్ని 20 అంతస్తులతో నిర్మించేలా నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ ఆకృతులు రూపొందించింది. శాసనసభ, హైకోర్టులకు సంబంధించి ఒక్కో భవనానికి నాలుగైదు ఆకృతులు సిద్ధం చేస్తోంది. శాసనసభ భవనాన్ని వజ్రాకృతిలో నిర్మించాలని మొదట అనుకున్నా, అది అంత ఆకర్షణీయంగా రాని నేపథ్యంలో కొత్త ఆకృతులు సిద్ధం చేస్తోంది. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి ఆ ఆకృతుల్ని పరిశీలించి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులకు కొన్ని సూచనలు ఇచ్చారు. శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులకు ఇంకా తుది రూపం ఇవ్వాల్సి ఉందని, మరో వారం రోజుల సమయం పడుతుందని చెప్పారని పురపాలక మంత్రి పి.నారాయణ ‘ఈనాడు’కు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 24న లండన్ వెళ్లే సమయానికి ఆకృతులు సిద్ధంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. దూరం నుంచి కూడా కన్పించాలంటే భవనం ఎత్తు ఎంత ఉండాలి? ఎలివేషన్లు ఎలా ఉండాలన్న విషయంలో రాజమౌళి కొన్ని సూచనలు చేసినట్టు చెప్పారు. శాసనసభ భవనం ఎత్తు 50 మీటర్లు ఉంటుందన్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు సంబంధించి కూడా నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రాథమిక ఆకృతులు సిద్ధం చేసినట్టు చెప్పారు. మొత్తం మంత్రులు, ఆయా విభాగాల కార్యదర్శులు, ఉద్యోగులంతా ఒకే చోట ఉండేలా 20 అంతస్తుల్లో సచివాలయ భవనం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు వేరుగా ఉండేలా ఆకృతులు రూపొందించినట్టు మంత్రి తెలిపారు.
sonykongara Posted October 17, 2017 Author Posted October 17, 2017 అమరావతిలో ఐఏసీఎఫ్ అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):సీఎం చంద్రబాబునాయుడును గ్రామీ అవార్డు గ్రహీత పల్లికొండ అదృష్ట దీపక్ సోమవారం వెలగపూడి సచివాలయంలో కలిశారు. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ కంపిలియేషన్ సౌండ్ విజువల్ మీడియా విభాగంలో ఆయన పురస్కారం పొందారు. ఈ సందర్భంగా దీపక్ మాట్లాడుతూ అమెరికా సహకారంతో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడియో, సీజీఐ, యానిమేషన్ ఫిల్మ్‌గ్రేడింగ్(ఐఏసీఎఫ్) నెలకొల్పాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ, యానిమేషన్ ఫిల్మ్ గ్రేడింగ్‌ను అమరావతిలో స్థాపించాలని సూచించారు.
sonykongara Posted October 17, 2017 Author Posted October 17, 2017 లండన్‌లో రాజమౌలి ‘విజువలైజేషన్’! డిజైన్లపై సీఎం అభిప్రాయాలు, ఆకాంక్షలను నార్మన్ ఫోస్టర్‌కు వివరించిన దర్శకుడు అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించదలచిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లపై గతవారం లండన్‌లో మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్‌తో మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని బృందం జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చే దిశగా సాగినట్లు తెలిసింది. ఈ బృందంలో సినీ దర్శకుడు ఎస్.ఎ్‌స.రాజమౌళి కూడా ఉన్న విషయం విదితమే. రెండు రోజులపాటు నార్మన్ ఫోస్టర్‌తో జరిపిన భేటీలో... ఆ సంస్థ ఇప్పటికే రూపొందించిన డిజైన్లలోని లోటుపాట్లను రాజమౌళి సునిశితంగా విశ్లేషించారని సమాచారం. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన ఆలోచనలు వివరించినట్లు తెలిసింది.
sonykongara Posted October 18, 2017 Author Posted October 18, 2017 కొత్త రాజధానిలో కొత్త నిర్మాణాలు అమరావతి: ప్రభుత్వ వసతి గృహాల ప్రక్రియను సీఆర్డీఏ వేగవంతం చేసింది. లింగాయంపాలెం నుంచి నేలపాడు వరకు వసతి గృహాల నిర్మాణం జరగనుంది. కేటగిరీ-1లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీసెస్ అధికారులు, కేటగిరీ-2లో నాన్ గెజిటెడ్ అధికారులు, కేటగిరీ-3లో గెజిటెడ్, 4వ తరగతి ఉద్యోగుల వసతి గృహాల నిర్మాణం ఉంటుంది. ఎల్‌అండ్‌టీ, షాపుర్ జీ పల్లోంజీ, నాగార్జున కన్‌స్ట్రక్షన్‌కు నిర్మాణ పనులు అప్పగించారు. పనులు ప్రారంభించిన 15 నెలల్లో పూర్తి అవుతాయని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now