Jump to content

Recommended Posts

  • Replies 1.3k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

పట్టిసీమ ఫలం... దివిసీమ ఇప్పుడు సిరులసీమ...     దివి సీమ... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరి

బ్యారేజీకి సాగర్‌ జలాలు 
నీటి మట్టాన్ని కొనసాగించేందుకు నిర్ణయం 
రెండు జిల్లాల్లో పెరుగుతున్న సాగు విస్తీర్ణం 
అరకొర వానలతో పెరిగిన డిమాండ్‌ 
భారీ వర్షాలపైనే డెల్టా రైతుల ఆశలు 
ఈనాడు - అమరావతి 

 

ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు ఆశించిన మేరకు కురుస్తాయన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. దీంతో ప్రభుత్వం కృష్ణా డెల్టాకు గతంలో ఎన్నడూ లేనంతగా చాలా ముందుగానే సాగు నీటిని విడుదల చేసింది. కృష్ణాలో నీరు లేకపోయినా పట్టిసీమ జలాలకు తోడు వరుణుడు కరుణిస్తాడన్న ఆశతో ప్రభుత్వం ధైర్యం చేసింది. దీనికి తగ్గట్లుగానే రైతులు కూడా తుపాన్ల లోగానే దిగుబడిని తెచ్చుకునేందుకు ముందస్తుగా వరి నాట్లు వేశారు. అరకొర వర్షాలు తప్పితే పదునైన వాన పడలేదు. ఎగువ నుంచి నీటి జాడ లేకపోవడంతో కేవలం పట్టిసీమ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. సీజన్‌ వూపందుకునే కొద్దీ సాగు శాతం పెరుగుతోంది. నీటి అవసరాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు ఇబ్బందిగా లేకుండా నిర్విరామంగా నీటిని అందించేందుకు జలవనరుల శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే పులిచింతల నుంచి కొంత నీటిని బ్యారేజికి తరలించారు. పడిపోతున్న నీటి మట్టాన్ని నిలబెట్టేందుకు మలి ప్రయత్నంగా నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకొస్తున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అధికారులను ఆదేశించారు. దీనివల్ల కొన్ని రోజుల పాటు సాగు నీటికి ఢోకా లేనట్లే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో సాగు అవసరాలు తీరాలంటే ప్రస్తుతం వరుణుడిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

అరకొర వర్షాలే.. 
ఈ వ్యవసాయ సీజన్‌లో సాధారణ వర్షాలే నమోదవుతున్నాయి. జులైలో రికార్డు స్థాయిలో వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనాలు నిజం కాలేదు. అల్పపీడనాలు ఏర్పడుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడట్లేదు. రాజధానిలోని గుంటూరు జిల్లాలో జూన్‌లో సాధారణం 86.3 సెం.మీ కాగా 148.1 సెం.మీ కురిసింది. జులైలో 142.1 సె.మీ గాను కేవలం 126.6 సె.మీ మాత్రమే పడింది. ఆగస్టులో ఇప్పటి వరకు 68.3 సె.మీ గాను 70 సె.మీ కురిసింది. కృష్ణాలో పరిశీలిస్తే.. జూన్‌లో 97.8 సె.మీ సాధారణం కాగా 167.7 సె.మీ కురిసింది. జులైలో 210.6 సె.మీ గాను 206.2 మాత్రమే పడింది. ఆగస్టులో ఇప్పటివరకు 95.4 సె.మీ కురవాల్సింది.. 52.3 సె.మీ మాత్రమే నమోదైంది. డెల్టాలో ఎక్కువగా వేసేది వరి పంట. దీనికి నాట్లు మొదలు అధికంగా నీరు అవసరం. పట్టిసీమ నీరు వస్తుండటంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. దీంతో క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాగు నీటికి డిమాండ్‌ ఎక్కువైంది. గోదావరి జలాలతో పాటు వర్షాలు సమృద్ధిగా పడితేనే కొంత ఒత్తిడి తగ్గుతుంది. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల్లో ఆనందాన్ని నింపాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. కృష్ణాలో చిరుజల్లులు తప్ప ఇంకా ఆశించిన విధంగా లేవు.

నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ 
కృష్ణా డెల్టాలోని తూర్పు ప్రధాన కాలువకు జూన్‌ 26న సాగునీటిని విడుదల చేశారు. దీని పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు ఉంది. అనంతరం రెండు రోజులకే పశ్చిమ కాలువకు కూడా నీటిని వదిలారు. దీని కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆయకట్టు ఉంది. ఇప్పటికే దాదాపు 50 రోజులుగా పట్టిసీమ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి బ్యారేజికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 29.11 టీఎంసీల మేర గోదావరి జలాలను బ్యారేజికి పంపించారు. ఇక్కడి నుంచి డెల్టాకు మొత్తం 35.46 టీఎంసీల వరకు సాగునీటి అవసరాలకు వదిలారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి రాక లేదు. దీంతో కేవలం పట్టిసీమపైనే ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక వాగుల నుంచి ఇప్పటి వరకు 5.58 టీఎంసీలు మాత్రమే వచ్చింది. బ్యారేజి నుంచి అవుట్‌ఫ్లో 8200 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు కాలువకు 4,400 క్యూ., పశ్చిమ కాలువకు 3,800 క్యూ. వరకు ఉంటోంది. డెల్టాలోని కృష్ణా జిల్లా పరిధిలో 5.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటివరకు 3.73 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయడం పూర్తయ్యింది. గుంటూరు జిల్లాలో 4.9లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఇప్పటివరకు లక్ష ఎకరాలకు పైగా సాగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే గుంటూరు జిల్లాలో వరినాట్లు ముమ్మరం అవుతున్నాయి. దీంతో సాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. చివరి ఆయకట్టుకు కూడా అందాలంటే భారీగా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

టెయిల్‌పాండ్‌ నుంచి 1 టీఎంసీ 
ఇప్పటివరకు కేఈ కాలువకు 24.39 టీఎంసీలు, కేడబ్ల్యూ కాలువకు 10.75 టీఎంసీలు, గుంటూరు ఛానల్‌కు 0.33 టీఎంసీల మేర నీటిని వదిలారు. బ్యారేజి పూర్తి స్థాయి నీటిమట్టం 12 అడుగులు. ప్రస్తుతం ఇది 9.9 అడుగులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో కనీస నీటిమట్టం ఉండేలా చూసేందుకు అదనపు నీటిని తరలించాల్సిన పరిస్థితి. పది రోజుల క్రితం ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు పులిచింతల నుంచి ఒక టీఎంసీ నీటిని బ్యారేజీకి తరలించారు. ఇంకా ఈ ప్రాజెక్టులో 2టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. దీన్ని భవిష్యత్తు అవసరాల కోసం ఉంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌లో ఉన్న నీటిని బ్యారేజికి తీసుకురానున్నారు. అక్కడి నుంచి ఒక టీఎంసీ నీరు బ్యారేజికి రావడం వల్ల ఇందులో నీటి మట్టం పెరగనుంది. దీనివల్ల అదనంగా కొంత నీరు అందుబాటులోకి వచ్చినట్లు అయింది. వరినాట్లు ముమ్మరం కావడంతో సాగునీటి అవసరాలకు ఇది అక్కరకు రానుంది.

Link to post
Share on other sites

Problem ekkuvaga Nagarjuna sagar right canal kinda vaallaki mainly Guntur & prakasam lo kontha parts ki problem vundi.

 

Prakasam barriage canals kinda Krishna, West Godavari, Guntur-Tenali belt, Praksam ki sufficient water vunnattu vunnayi.

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...