Jump to content

AP ports


Recommended Posts

@Hello26,

 

Bro, There are different channels of revenue for state. For some ports we have revenue share in the port as per agreement.

For some we have yearly installement charges plus revenue share.

 

On top state jas share in Cargo charges. On some state gets direct revenue(ex:-gold(ofcourse not much through ports) and some special mines pay customs and state gets it direct) 

 

Thank you!

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Replies 153
  • Created
  • Last Reply

Top Posters In This Topic

 

AP ports develop ayete Gujarat ports ki competition so gujju gadu EAST sagarmala ni tokkipedatadu. AP ante vadiki ade main allergy

One side central govt releases reports that "shortage of ports on EAST is causing 30-40K crores/per year loss to country and other side they build infra for WEST ports only"

Link to comment
Share on other sites

AP ports develop ayete Gujarat ports ki competition so gujju gadu EAST sagarmala ni tokkipedatadu. AP ante vadiki ade main allergy

One side central govt releases reports that "shortage of ports on EAST is causing 30-40K crores/per year loss to country and other side they build infra for WEST ports only"

 

Greenpiss, NGT and other environmental warriors tho padaleka states ke vadilestaaru anta kada

 

aakariki ndtv vaadu kooda case vesadu sagarmala meeda

Link to comment
Share on other sites

  • 2 weeks later...

4 అంచెల్లో సాగరమాల

పోర్టుల పరిధిలో విస్తృతంగా అభివృద్ధి పనులు

మారనున్న రాష్ట్ర తీర ప్రాంత రూపురేఖలు

రూ.46 వేల కోట్లతో 38 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు

ఈనాడు - కాకినాడ

6ap-main4a.jpg

సాగరమాల ప్రాజెక్టు ద్వారా ఏపీ తీర ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. దీని కింద నాలుగు అంచెల అభివృద్ధికి సంబంధించి 38 ప్రాజెక్టులతో కూడిన ప్రతిపాదనలు కాకినాడలోని ఏపీ పోర్టు డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఇటీవల ప్రభుత్వానికి వెళ్లాయి. రూ.46,795 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే జాతీయ స్థాయిలో రెండు పర్యాయాలు సాగరమాల అపెక్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపులో కేంద్ర, రాష్ట్రాల వాటాలపై స్పష్టత రాగానే పనులు చేపట్టనున్నారు.ఈ పనులను పర్యవేక్షించేందుకు సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో నాలుగు విభాగాలుగా పనులు చేపట్టనున్నట్లు పోర్టు డైరెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ‘ఈనాడు’కు తెలిపారు. అందులో పోర్టుల ఆధునికీకరణ, అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, తీర ప్రాంత సహజ వనరుల అభివృద్ధి ఉన్నాయి.

1. ఆధునికీకరణలో... కాకినాడ పోర్టులో కోస్టల్‌ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్‌ బెర్త్‌, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌, విశాఖ పోర్టు ట్రస్టు వద్ద అదనపు ఆయిల్‌ జెట్టి నిర్మాణం, జేసీబీ స్టాక్‌ యార్డు నిర్మాణం, మచిలీపట్నం, ఓడరేవు వద్ద కొత్త పోర్టుల నిర్మాణాన్ని ప్రతిపాదించారు.

2. రైల్వే అనుసంధానం కింద... రైల్వేకి సంబంధించి విశాఖ పోర్టు ట్రస్టు వద్ద ఆర్‌వీ లైను కోసం ఐటీ సిగ్నల్‌ వ్యవస్థ, గంగవరం పోర్టు వద్ద రెండో రైల్వే లైను, కృష్ణపట్నం- వెంకటాచలం మధ్య రైల్వే అనుసంధానం, కృష్ణపట్నం-ఓబులవారిపల్లి మధ్య మరో రైల్వే లైను అనుసంధానానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

3. రహదారుల అనుసంధానంలో ..

* కాకినాడ యాంకరేజీ పోర్టులో సిమెంటు రోడ్ల నిర్మాణం, దుమ్ములపేట, పాత పోర్టు ప్రాంతంలో ఆర్‌వోబీ నిర్మాణం, ఎన్‌ఎఫ్‌సీఎల్‌కు పశ్చిమ దిశగా కొత్త ప్రత్యామ్నాయ బైపాస్‌ రహదారి నిర్మాణం. కృష్ణపట్నం పోర్టు నుంచి చిలుకూరి క్రాస్‌ వరకు, కృష్ణపట్నం పోర్టు సమీపంలోని కండలేరు క్రీక్‌ వద్ద ఉన్న పారిశ్రామిక క్లస్టర్‌కు, గ్రీన్‌ఫీల్డ్‌కు మధ్య ఉన్న అయిదు కిలోమీటర్ల రహదారి అభివృద్ధి, నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు వైపు ఉన్న 24 కిలోమీటర్ల రహదారి విస్తరణ, గంగవరం పోర్టుకు ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ బైపాస్‌ రహదారి అభివృద్ధి, గాజువాక నుంచి గంగవరం పోర్టుకు 16వ నంబరు జాతీయ రహదారిని కలిపే నాలుగు లైన్ల రోడ్డు ఆరు లైన్ల రోడ్డుగా విస్తరణ. మచిలీపట్నం పోర్టు నుంచి 65వ నంబరు జాతీయ రహదారికి కలిపే 7.2 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి అభివృద్ధి.

*నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టుకు నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు, మచిలీపట్నం నార్త్‌పోర్టు నుంచి 46వ నంబరు జాతీయ రహదారి, రాష్ట్ర హైవేకి కలుపుతూ నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణం, మచిలీపట్నం దక్షిణ పోర్టు నుంచి 9వ నంబరు జాతీయ రహదారికి నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు, మంగినపూడి బీచ్‌ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడం.

* కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి ఉప్పాడ మీదుగా బీచ్‌ రోడ్డును కలుపుతూ 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, ఓడరేవు వద్ద నుంచి శాంతనగర్‌ పారిశ్రామిక క్లస్టర్‌కు రహదారి, విశాఖ పోర్టు ట్రస్ట్‌ పరిధిలో సీహోర్స్‌ జంక్షన్‌ నుంచి డాక్‌ఏరియా వరకు పైవంతెన నిర్మాణం, రెండో దశ పనుల కింద 5వ నంబరు జాతీయ రహదారికి పోర్టు అనుసంధానం, పోర్టు జంక్షన్‌ నుంచి ఔటర్‌ హార్బర్‌కు రహదారి అనుసంధానాన్ని ప్రతిపాదించారు.

4. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా...

* కాకినాడలో పెట్రో కెమికల్‌ క్లస్టర్‌, పవర్‌ ప్లాంట్‌, మధ్య ఆంధ్రలో సిమెంట్‌ క్లస్టర్‌, ఎగుమతి ఆధారిత అప్పిరల్‌ క్లస్టర్‌, కాకినాడలో పోర్టు ఆధారిత మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు, ఏపీ, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి ఆధారిత ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌

* తీర ప్రాంత మౌలిక వసతుల అభివృద్ధి కింద విశాఖ జిల్లా అప్పికొండ వద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ వద్ద మినీ ఫిష్‌ గ్రోత్‌ సెంటర్‌, కాకినాడలో లాజిస్టిక్‌, మారిటైం విశ్వవిద్యాలయం ఏర్పాటు.

ప్రాధాన్య క్రమంలో పనులు చేపడతాం

6ap-main4b.jpgసాగరమాల డవలప్‌మెంట్‌ కంపెనీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా కమిటీ ఉంటుంది. కేంద్రం నుంచి నిధుల కేటాయింపుపై స్పష్టత వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టే అవకాశం ఉంది. రూ.100 కోట్ల లోపు వినూత్నంగా చేపట్టే ప్రాజెక్టులకు సాగరమాల కింద నిధులు అందే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం వెలువడ్డాక ఎస్పీవీ (స్పెషల్‌ పర్పజ్‌ వెహికల్‌) ఏర్పాటవుతుంది.

- ప్రసన్న వెంకటేష్‌, పోర్టు డైరెక్టర్‌, కాకినాడ
Link to comment
Share on other sites

Manadhe ga least annitlo volume lo :damn:

 

Yes, brother. even some perishable goods like aqua products are exported from out of state ports. it burdens the exporters and puts them at disadvantage in domestic competition. it also has snow ball effect of big wholesale merchants making their bases in other states (more revenue loss). AP ports have been neglected for too long.

Link to comment
Share on other sites

  • 1 month later...

దేశంలో పెద్ద ఓడ రేవులకు మరింత స్వేచ్ఛ!

భారీ ఓడరేవుల పాలక సంస్థల అధికారాల బిల్లుకు కేంద్రం పచ్చజెండా

ఈనాడు, అమరావతి: దేశంలోని భారీ ఓడ రేవుల పాలక మండళ్లకు స్వయంప్రతిపత్తి తరహాలో స్వేచ్ఛ కల్పించే దిశగా కేంద్రం మరో కీలక అడుగు వేసింది. దేశంలో 12 భారీ నౌకాశ్రయాలున్నాయి. వాటి అభివృద్ధికి ఆ ఓడ రేవుల పాలక సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పిస్తూ కేంద్రం ‘భారీ ఓడరేవుల పాలక సంస్థల అధికారాల బిల్లు-2016’ (మేజర్‌ పోర్టు ట్రస్టు అథారిటీ బిల్లు-2016) తీసుకొచ్చింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఈ బిల్లు చట్టరూపం దాల్చితే పెద్ద ఓడ రేవుల దశ మారిపోనుంది. రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవు లాంటి వాటికి ఇది ఎంతో వూతమివ్వనుంది. అనేక సెక్షన్లతో 1963లో రూపొందించిన బిల్లే ఇప్పటి వరకూ అమల్లో ఉంది. దీని ప్రకారం ఓడ రేవుల్లో ఎలాంటి పని చేపట్టాలన్నా పలు ఆటంకాలు, నిబంధనల చిక్కుముళ్లు ఉండటంతో పనులు ఆలస్యమయ్యేవి. ఏ పని చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి అయ్యేది. ఇప్పుడు కేంద్రం వీటిని సరళీకృతం చేస్తూ ఆయా ఓడ రేవుల పాలక మండళ్లకు స్వేచ్ఛ కల్పిస్తూ కొత్త బిల్లు తీసుకొస్తోంది.

పాలక మండళ్ల సభ్యుల సంఖ్య కుదింపు: భారీ ఓడరేవు పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య కూడా 19 నుంచీ 11కు కుదించేసింది. పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ను కేంద్రమే నియమిస్తుంది. ఇక రేవు పరిధిలోపు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలన్నా తుది అధికారం పాలక మండలిదే. గతంలో రూ.200 కోట్లకు మించిన పనికి కేంద్రం అనుమతి తప్పనిసరి అయ్యేది. కొత్త బిల్లు ద్వారా ఎన్ని వందల, వేల కోట్ల రూపాయల పనులైనా పాలక మండలే చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. ఛార్జీలకు సంబంధించి నిర్ణయాధికారం పాలక మండలికి కట్టబెట్టారు. దీనికోసం ‘భారీ ఓడరేవుల ఛార్జీల అధికారం’ (టారిఫ్‌ అథారిటీ ఫర్‌ మేజర్‌ పోర్ట్సు-టీఏఎంపీ)ని కూడా సరళీకరించారు. ఈ ఛార్జీలను స్వతంత్రంగా సమీక్షించుకునే అధికారాన్ని కూడా కల్పించారు. అధికార వికేంద్రీకరణ ద్వారా రేవుల నిర్వహణ మరింత సులభతరం కానుంది.

రేవుల అభివృద్ధికి మేలు చేసేదే కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ కొత్త బిల్లుతో భారీ ఓడ రేవులైన విశాఖపట్నం పోర్టు ట్రస్టు లాంటి వాటికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి వరకూ కొన్ని అనుమతలకు సంబంధించి పలు ప్రతిబంధకాలుండేవి. ఈ బిల్లుతో అవన్నీ సరళీకృతం కానున్నాయి.
- ఎం.టి.కృష్ణబాబు, అధ్యక్షులు, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
సాగరమాల కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ
 
636221754801947687.jpg
అమరావతి: సాగరమాల కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగరమాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన 33 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. పోర్టుల అనుసంధానం-మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సచివాలయంలో సాగరమాల కమిటి తొలి సమావేశం జరిగింది. సాగరమాల ప్రాజెక్ట్ పనులు చురుగ్గా సాగేందుకు పోర్టులు, క్లస్టర్ల వారీగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనుల పురోగతిపై రెండు నెలలకోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
 
 
సాగరమాల ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ, నివేదికల రూపకల్పనకు ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించారు. రోడ్డు, రైలు మార్గాలతో పాటు జల రవాణాకు ప్రోత్సాహం కల్పిస్తామని సీఎం తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్ట్ నోడల్ ఏజెన్సీగా అంతర్గత జల రవాణా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. స్పెషల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్‌గా కృష్ణపట్నంను తీర్చిదిద్దుతామన్నారు. రూ. 1,30,762 కోట్ల విలువైన 90 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి అందజేశామన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...

 

కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు...

 

Super User

 

03 April 2017

 

Hits: 321

 

 

cargo-03042017.jpg

share.png

కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 61.02 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయగలిగింది. అంతకుముందు 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే సరకు రవాణాలో 7 శాతం గ్రోత్ సాధించింది. ఇతర పోర్టుల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ గత ఏడాదితో పోల్చితే 4 మిలియన్ టన్నుల సరకు రవాణా పెరిగింది.

2016-17 సంవత్సరానికి గాను 11.42 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం రవాణా చేయగా, గత ఏడాదితో పోల్చితే 91 శాతం అధికం. 2015-16లో ఇనుప ఖనిజం రవాణా కేవలం 5.98 శాతం మాత్రమే. అలాగే, కంటైనర్ కార్గోలోనూ విశాఖ పోర్టు రికార్డులు తిరగరాసింది. 2016-17లో 6.43 మిలియన్ టన్నుల కంటైనర్ కార్గో సాధించగా, గత ఏడాది 5.15 మిలియన్ టన్నులుతో, ఈ రంగంలో 25 శాతం వృద్ధి సాధించింది.

 

Advertisements

బాక్సైట్ ఖనిజ రవాణా 1.01 మిలియన్ టన్నులవగా, అంతకుముందు సంవత్సరం కేవలం 0.48 మిలియన్ టన్నులు మాత్రమే. పెట్రోలియం కోక్ రవాణా 2.10 మిలియన్ టన్నులు కాగా, నిరుడు 1.67 టన్నులు మాత్రమే. జిప్సమ్ ఖనిజ రవాణాలో కూడా పోర్టు మంచి ఫలితాలు సాధించింది. 10.17 లక్షల టన్నుల జిప్సమ్ రవాణా చేయగా, అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికం. ఇది ఇలా ఉంటే, సుమారు దశాబ్దకాలం అనంతరం విశాఖ పోర్టు రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాల నుంచి 4.17 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టుకు సరకు రవాణా నిమిత్తం 1,944 నౌకలు రాకపోకలు సాగించాయి.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...