Jump to content

Recommended Posts

 • Replies 472
 • Created
 • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Election time ki avadu ga

EAC grants environmental clearance for Bhogapuram International Airport in Andhra Pradesh     సముద్రం మీదగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి భీమినిపట్నం  గోస్తనీ నది ఒడ్డున INS VIRAAT చూసి రుషికొండ లో Acquariu

One good thing is Bhogapuram is located in between Vijayanagaram & Vizag. Good for UA people.

 

Staring lo konchem problem ayina for Vizag city people in future Vizag-Vijayanagaram madyalo development baaga jaruguthundi.

Link to post
Share on other sites
 • 1 month later...
 • 3 weeks later...
బాడంగిలో మినీ ఎయిర్‌పోర్టు


బాడంగి: విజయనగరం జిల్లా బాడంగిలో మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడున్న రన్‌వేను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగానే మంగళవారం నాడు భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సిఇఒ వీరేంద్రసింగ్‌, ఆర్‌డిఒ, జిల్లా సర్వే ఎడి గౌరీశంకర్‌తో కలసి ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. గతంలో ఇక్కడ నేవల్‌ బేస్‌ కోసం 2300 ఎకరాల్లో సర్వే చేశారు. దీనిపై పలు గ్రామాల ప్రజలు అభ్యంతరం తెలిపారు. తమ గ్రామాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలు మరుగునపడ్డాయి. ఆ భూములను విమానాశ్రయం కోసం వినియోగించాలని భావించారు. ఇందులో భాగంగానే ఉన్నతాధికారులు ఇక్కడి భూములను పరిశీలించారు.

Link to post
Share on other sites
 • 1 month later...
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఈ-వీసాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ 
15-12-2017 16:43:25
 
636489530107137744.jpg
అమరావతి: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఈ-వీసాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నుంచి విశాఖ‌లో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవ‌ల్ ప్రారంభం కానుంది. ఈ-టూరిస్ట్ వీసాతో ఏపీలో ప‌ర్యాట‌కానికి కొత్త ఊపు వస్తుందని మంత్రి భూమా అఖిలప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వీసాతో విదేశీ ప‌ర్యాట‌కులు నేరుగా విశాఖ చేరుకోవ‌చ్చని, దేశంలోని 16 ఎయిర్‌పోర్ట్‌ల‌కు మాత్రమే ఈ-వీసా స‌దుపాయం ఉందని అఖిలప్రియ తెలిపారు.
Link to post
Share on other sites
జాగ్‌ రియల్టీ కొత్త గమ్యం భోగాపురం
16-12-2017 02:01:23
 
636489864884719867.jpg
 • అంతర్జాతీయ విమానాశ్రయంతో పెరుగుతున్న డిమాండ్‌
 • చౌక రేట్లే ప్రధాన ఆకర్షణ
 • భారీ స్థాయిలో వెంచర్లు.. ఆసక్తి చూపిస్తున్న డెవలపర్లు
వైజాగ్‌ రియల్టీలో ఇప్పుడు కొత్త డెస్టినేషన్‌ భోగాపురం. భారీగా పెరిగిన రేట్లు, ప్రస్తుత రేట్లలో వైజాగ్‌లోని కీలక ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో వీటిని విక్రయిస్తే ఆకర్షణీయమైన రాబడులు రాకపోవచ్చన్న సంశయంతో ఇన్వెస్టర్లు తమ చూపును భోగాపురం వైపు మళ్లించారు.
 
 
ఏమిటీ స్పెషల్‌....
విజయనగరం జిల్లాలోని గ్రామమైనా మూడు జిల్లాల కేంద్రాలకు అందుబాటులో జాతీయ రహదారిపై ఉండటం భోగాపురం ప్రత్యేకత. పైగా సముద్రతీరం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇక్కడ అధునాతన అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 2,500 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నారు. విమానాలకు ఓవర్‌ హాలింగ్‌ కేంద్రం కూడా ఏర్పాటవుతోంది. విమాన రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణ కేంద్రం కూడా వస్తుంది.
 
 
ఇంకా చెప్పాలంటే... ఏవియేషన్‌ సిటీగా భోగాపురం అభివృద్ధి చెందనుంది. ఇది పూర్తయితే విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం కార్గో కేంద్రంగా మారిపోతుంది. అంటే విశాఖ ప్రయాణికులు కూడా అక్కడి నుంచే రాకపోకలు చేయాలి. 2020 నాటికి దీనిని పూర్తిచేయాలనేది లక్ష్యం. ఈ నేపథ్యంలో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం ‘మూడు ఎకరాలు...ఆరు లేఅవుట్లు’గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉన్నందున ఈ రేట్లలో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి రాబడులను కళ్ల జూడవచ్చన్న ఆశతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాల వారు కూడా భోగాపురంపై ఆసక్తి చూపిస్తున్నారు.
 
 
రాజుకుంటున్న డిమాండ్‌
నిజానికి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటన రాకముందే భోగాపురం భూములకు డిమాండ్‌ ఏర్పడింది. దీనికి అనేక కారణాలున్నాయి. విశాఖ నగరంలో భూముల ధరలు ఎప్పుడో ఆకాశాన్ని అంటేశాయి. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ వంటి ప్రాంతాల్లో గజం లక్ష రూపాయలకు చేరింది.
 
ఈ దెబ్బతో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు తమ దృష్టిని శివారు ప్రాంతాలకు మళ్లించారు. మధురవాడ, భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో కొన్నాళ్లు భారీ వ్యాపారం జరిగింది. ఈ మూడు ప్రాంతాల్లోను ఇటీవల భూ కుంభకోణాలు వెలుగుచూడడంతో ఇక్కడ స్థలాలు కొనడానికి చాలా మంది భయపడుతున్నారు. దాంతో ఏ వివాదాలు లేని విజయనగరం, భోగాపురం వంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అధికులు ఆసక్తి చూపుతున్నారు.
 
 
దూరం తరిగిపోతోంది
విశాఖపట్నం-విజయనగరం మధ్య దూరం కేవలం 50 కిలో మీటర్లు. విశాఖపట్నం నుంచి భోగాపురం కూడా అంతే దూరం. ఇది శ్రీకాకుళం వెళ్లే జాతీయ రహదారిని ఆనుకునే ఉంది. విజయనగరం శివార్లలో మొదలైన లేఅవుట్లు ఇప్పుడు దాకమర్రిని దాటి తగరపువలస వరకు వచ్చేశాయి.
 
అంటే దాదాపుగా విశాఖ జిల్లాలోకి వచ్చేసినట్టే. ఇక భోగాపురంలో గత నాలుగేళ్ల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేస్తున్నారు. ఇక్కడ రైతుల దగ్గర భూములు అందుబాటు ధరల్లో ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలన్నీ ఇక్కడ ఏదో ఒక వెంచర్‌ వేయాలనే ఉద్దేశంతో వస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఇంటి స్థలానికి పెట్టే ధరలో సగానికే ఇక్కడ మంచి భూమి వస్తుండడంతో అంతా ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. చేతిలో రూ.5 లక్షలు ఉంటే 100 గజాల ఇంటి స్థలం భోగాపురం పరిసరాల్లో లభిస్తోంది. ఈ ధరలు, అభివృద్ధికి గల అనుకూలతలే ఇక్కడ వ్యాపారాభివృద్ధి దోహదం చేస్తున్నాయి.
 
 
సాగరమాల మరో ఆశ
సాగరమాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంతాలను కలుపుతూ రహదారులు అభివృద్ధి చేస్తామని చేసిన ప్రకటన కూడా ఇక్కడ పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా మారింది. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి, భోగాపురం, కళింగపట్నం, భావనపాడులను కలుపుతూ తీర ప్రాంతంలో నాలుగు లేన్ల రహదారి వేయాలనే ప్రణాళికలు వున్నాయి.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం విశాఖపట్నం-భీమిలి మధ్య వేసిన బీచ్‌ కారిడార్‌ను భోగాపురం వరకు పొడిగించాలని ఏడాది క్రితమే అధికారులకు సూచించారు. ఈ మార్గంలో విమాన ప్రయాణికులు త్వరగా విశాఖ చేరుకోవచ్చునని, ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. దీంతో భోగాపురంలో ఇళ్ల స్థలాలంటే... మంచి పెట్టుబడి అనే భావన అందరిలోను వుంది.
 
 
ఇవిగో లెక్కలు
ఉత్తరాంధ్రాలో ఏ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ లేఅవుట్‌ వేసినా విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా) నుంచే అనుమతి తీసుకోవాలి. ఇక్కడ మాస్టర్‌ ప్లాన్‌లు రూపొందించి, లేఅవుట్లకు ప్రాథమిక అనుమతులు ఇచ్చే చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ భవానీశంకర్‌ను భోగాపురం గురించి ప్రశ్నిస్తే... ఈ ఏడాది లెక్కలు చూసుకుంటే విశాఖపట్నం కంటే విజయనగరం జిల్లాలోనే ఎక్కువ లేఅవుట్లు వచ్చాయని, అందులో అధికం భోగాపురం ప్రాంతంలోనే ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది విశాఖలో 45, విజయనగరంలో 55 లేఅవుట్లు వేశారు. 
 
 
దూసుకుపోతున్న ఇళ్ల ధరలు
దేశవ్యాప్తంగా 50 నగరాల్లో అత్యధిక స్థాయిలో ఇళ్లధరలు పెరిగాయి. ఈ విషయం నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బి) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో 50 నగరాలకు గానూ 36 నగరాల్లో ఇళ్ల ధరల్లో పెరుగదల ఉంది. వైజాగ్‌లో గరిష్ఠంగా ధరలు 16 శాతం పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన వివిధ నగరాల్లో ఇళ్ల ధరలను ఎన్‌హెచ్‌బి హౌజింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ వెల్లడిస్తోంది. దేశవ్యాప్తంగా 36 నగరాల్లో ఇళ్ల ధరలు దూసుకుపోగా వైజాగ్‌లో అత్యధికంగా 15.7 శాతం పెరగగా తర్వాతి స్థానంలో 12.8 శాతంతో కోచి ఉంది.
 
- విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి)
Link to post
Share on other sites
 • 2 weeks later...
 • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.


×
×
 • Create New...