Jump to content

Recommended Posts

  • Replies 472
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Election time ki avadu ga

EAC grants environmental clearance for Bhogapuram International Airport in Andhra Pradesh     సముద్రం మీదగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి భీమినిపట్నం  గోస్తనీ నది ఒడ్డున INS VIRAAT చూసి రుషికొండ లో Acquariu

కదిలేదెలా ఊళ్లు- ఏర్పాట్లకే ఏళ్లు
 భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి మరోసారి టెండరుకి సన్నాహాలు
 నేటికీ నిర్వాసితుల కోసం సిద్ధం కాని కాలనీలు
 పోలిపల్లి రెవెన్యూలో ప్రారంభం కాని  రహదారి, తాగునీరు, విద్యుత్తు పనులు
 ఇలాగే జాప్యమైతే సౌకర్యాలు లేకుండానే వెళ్లాల్సి వస్తుందేమోనన్న ఆందోళన
viz-top1a.jpg
ఊరు మారాలి. పునరావాసం కావాలి.
పిల్లజెల్లా అంతా తరలిపోవాలి.
కొత్త చోటులో గూడు కట్టుకోవాలి.
అలా వెళ్లాలంటే ముందు అక్కడ తాగడానికి నీరుండాలి.

నడవడానికి దారి, ఇళ్లకు విద్యుత్తు, పిల్లలు చదువుకోవడానికో పాఠశాల, జ్వరమొస్తే మందుబిళ్లలిచ్చే ఆసుపత్రి వంటి కనీస ఏర్పాట్లుండాలి. కాని భోగాపురం విమానాశ్రయ నిర్వాసితుల కోసం పునరావాస    కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసితులకు ఎదురైన దుస్థితే తమకూ వస్తుందేమోనన్న దిగులు వారి మదిని తొలిచేస్తోంది.

ఈనాడు-విజయనగరం

భోగాపురంలో 2,726 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో మరడపాలెం, ముడసర్లపేట, రెల్లిపేట, బొల్లింకలపాలెంల్ని నిర్వాసిత గ్రామాలుగా గుర్తించారు. అక్కడ మొత్తంగా 207 కుటుంబాల్లోని 376 మంది నిర్వాసితులు కానున్నారు. వారికి పునరావాసం కోసం ఒక్కో కుటుంబానికి ఒకేసారి రూ.5 లక్షలతో పాటు రవాణా ఛార్జీల నిమిత్తం రూ.50,000, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అలవెన్స్‌ కింద రూ.50,000 ఇవ్వడానికి నిర్ణయించారు. అలాగే పశువుల షెడ్డు, ఏదైనా దుకాణం ఉంటే రూ.25,000, చేతివృత్తులవారికి రూ.25,000 ఇవ్వనున్నారు. వీటితో పాటు నెలకు రూ.3,000 చొప్పున ఏడాదిపాటు అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే గృహనిర్మాణ పథకంలో ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. పునరావాస కాలనీల ఏర్పాటుకి గూడెపువలసలో ఒకచోట, పోలిపల్లి రెవెన్యూలోని రెండు ప్రాంతాల్లో కలిపి 50.36 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కాని నిర్వాసిత గ్రామాలు అక్కడకు కదలాలంటే ముందుగా అక్కడ కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. కాని వివిధ శాఖల నిర్లక్ష్యంతో పనులేవీ ముందుకు  కదలకపోవడమే ఆందోళనకు గురిచేస్తుంది.

టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు
గూడెపువలస పునరావాస కాలనీలో పనుల్ని ఆర్‌అండ్‌బీకి రూ.3.43 కోట్లకు టెండరు అప్పగించి దాదాపుగా ఆరునెలలు గడిచిపోయింది. ఇప్పటికీ అక్కడి స్థలాన్ని చదును చేయడం, మురుగుకాలువల పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారితో పాటు సిమెంటు రహదారులు సైతం ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. నేటికీ గ్రామీణ నీటిసరఫరా విభాగం చేపట్టాల్సిన తాగునీటి ట్యాంకు నిర్మాణం తదితర పనులేవీ ప్రారంభం కాకపోవడమే కాదు టెండర్లే కాలేదు. అలాగే కాలనీల్లో విద్యుదీకరణ, పాఠశాల నిర్మాణం, ఆసుపత్రి ఏర్పాటు తదితరాలేవీ కనుచూపుమేరలో కనిపించట్లేదు. ఇటీవల సంయుక్త కలెక్టరు వెంకటరమణారెడ్డి, విజయనగరం ఆర్డీవో మురళీలు అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి వివిధ శాఖల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా హడ్కో బృందం సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పోలిపల్లి రెవెన్యూలోనైతే రెండు చోట్ల కనీసం చదును చేసే పనులే కాలేదు. ఇంకా చెప్పాలంటే పునరావాస కాలనీల టెండర్ల ప్రక్రియే పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. ఇవన్నీ పూర్తయితే తప్ప ఇళ్లు కట్టుకోలేరు. కాని పూర్తిస్థాయిలో సదుపాయాల కల్పనకే మరో ఏడాదికి పైగా సమయం పట్టేలా కనిపిస్తుంది. మరోవైపు విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట అథారిటీ కాకుండా మరోసారి టెండరు పిలిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. టెండరు ఖరారై ఒకసారి అక్కడ పనులు ప్రారంభమైతే సౌకర్యాలు లేకపోయినా తాము వెళ్లిపోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన నిర్వాసిత గ్రామాల ప్రజల్లో నెలకొంది.

జాప్యమైతే కొంప మునుగుతుంది
గతంలో తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసితులకు ఇదే రీతిలో మౌలిక సదుపాయాల కల్పన జాప్యం చేయడంతో ఇంటి నిర్మాణానికి ఇచ్చే వ్యయం పెరిగిపోయింది. తోటపల్లి భూసేకరణ 2004లో ప్రారంభించగా ముందులో ఇంటి నిర్మాణానికి రూ.64,000 ఇచ్చేవారు. తరువాత దాన్ని ఐఏవై నిధులతో కలిపి రూ.1.84 లక్షల వరకు చేశారు. 2014 నుంచి ఐఏవై నిధులకు అవకాశం లేకుండా పోయింది. అక్కడితో ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. కాని చాలా పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్తు, రహదారులు లాంటి సౌకర్యాల కల్పన జాప్యం కావడంతో ఇంటి నిర్మాణానికి ఇచ్చే సొమ్ము సరిపోదంటూ 2,714 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకోకుండా ఉండిపోయాయి. అలాగే 2006 ప్రారంభించిన పెద్దగెడ్డ ప్రాజెక్టు కారణంగా తురాయిపాడు, కొటికపెంట, కేసలి, మడవలస, కోడికాళ్లవలస గ్రామాలు నిర్వాసితులయ్యారు. వాటిలో కొటికపెంట, కేసలి గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పన జాప్యమైపోయింది. దీంతో ఇంటి నిర్మాణానికి వ్యయం పెరిగిపోయిందని, ప్యాకేజీ పెంచమంటూ నేటికీ

550 కుటుంబాలు పాతగ్రామాల్ని ఖాళీచేయలేదు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తమకు అదే జరుగుతుందేమోనన్న ఆందోళన భోగాపురం విమానాశ్రయ నిర్వాసితుల్ని వెంటాడుతుంది. పైగా ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అవకాశమిస్తామని అధికారులు చెబుతున్నా ఇప్పటికే ఆ సొమ్ము సరిపోదని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అందుకే పోలవరంలో నిర్వాసితులకు ఇచ్చినట్లుగా ఒక్కో ఇంటికి రూ.2.84 లక్షల ప్యాకేజీని తీసుకొచ్చే ప్రయత్నాల్లో కలెక్టరు హరిజవహర్‌లాల్‌, జిల్లా సంయుక్త కలెక్టరు వెంకటరమణారెడ్డి ఉన్నారు. గతం నేర్పిన పాఠాల్ని దృష్టిలో పెట్టుకునైనా పునరావాస కాలనీ పనులు అప్పుడొకటి అప్పుడొకటి కాకుండా వేగవంతమయ్యేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

వీలైనంత వేగంగా జరిగేలా చూస్తాం
భోగాపురం పునరావాస కాలనీల్లో పనులు జాప్యమైన మాట వాస్తవమే. నేను విధుల్లో చేరగానే గూడెపువలస, పోలిపల్లిల్లో పనుల్ని పరిశీలించి ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌శాఖ అధికారులందరితో సమీక్షించాను. వీలైనంత వేగంగా పనులు పూర్తిచేయిస్తాం. అలాగే పోలవరం నిర్వాసితులకు ఇచ్చినట్లుగానే ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.2.84 లక్షలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.

- కె.వెంకటరమణారెడ్డి, సంయుక్త కలెక్టరు
 
 
 

 

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...