Jump to content

Vizag Airport


Recommended Posts

vadu self declared travel association adyakshudu...mamulu comedy artist kadu le...Jaffa

CBN meda edusta untadu.....mana db lone intaka mundu vesanu e jaffa gurinchi...

 

edanna manchi jarugutunte orchukoleni batch...

Link to comment
Share on other sites

vadu self declared travel association adyakshudu...mamulu comedy artist kadu le...Jaffa

CBN meda edusta untadu.....mana db lone intaka mundu vesanu e jaffa gurinchi...

 

edanna manchi jarugutunte orchukoleni batch...

miru cheppinade vinna gurthundi kani peru thliyadu, e news chadutunte videna A jaffa ani doubt vacchindi.

Link to comment
Share on other sites

భోగాపురానికి పచ్చజెండా

లభించిన పర్యావరణ అనుమతులు కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు వెల్లడి

ఈనాడు, దిల్లీ: భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు లభించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు చెప్పారు. ఇప్పటికే 90% భూసేకరణ పూర్తయిందన్నారు. రాష్ట్రప్రభుత్వం సంయుక్త వ్యాపార భాగస్వామిని ఖరారుచేస్తే విమానాశ్రయ నిర్మాణం ఆరంభించవచ్చన్నారు. అది పూర్తికావడానికి మూడు నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు. మంత్రి శుక్రవారం తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పూర్తికావడానికి ఏడాది పడుతుందన్నారు. అదయ్యాకే భారీ విమానాల రాకపోకలు సాధ్యమవుతాయని చెప్పారు. అప్పటివరకూ చిన్నస్థాయి అంతర్జాతీయ విమానాలు రాకపోకలకు వీలవుతుందన్నారు. విజయవాడ నుంచి ప్రయాణికుల రద్దీకి ఢోకా ఉండదన్నారు. ఇప్పటికే ఎంతోమంది విజయవాడ నుంచి దిల్లీ, బెంగళూరు, ముంబయికి..అక్కడినుంచి విదేశాలకు వెళ్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. వ్యవసాయపరంగా సంపన్న ప్రాంతమైన విజయవాడ నుంచి మత్స్య, వ్యవసాయ ఉత్పత్తులు పెద్దఎత్తున ఎగుమతి కావాలన్నది తన స్వప్నమని మంత్రి పేర్కొన్నారు. అప్పుడే గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని ఇటీవల ప్రారంభించిన ఉడాన్‌ పథకానికి స్పందన బాగుందన్నారు. కడప నుంచి బెంగళూరు, ముంబాయికి ఉడాన్‌ విమానాలు నడిపే అవకాశం ఉందన్నారు. తాడేపల్లిగూడెంలోని చిన్నపాటి విమానాశ్రయంలో ఇప్పుడున్న రన్‌వే రక్షణశాఖ పరిధిలోకి వస్తుందని, అక్కడి నుంచి పెద్ద విమానాలు నడపడం కుదరదని ఆయన వివరించారు.

Link to comment
Share on other sites

Imo antha profitable kakapovachu as it is far from east krishna gnt Prakasam, jus with West Vizag n srikakulam vijaya nagaram valla occupancy raadu, gannavaram NE baga develop chesina inka better occupancy vuntadi..

Link to comment
Share on other sites

భోగాపురం’ పనులు ఇక టేకాఫ్‌..

విమానాశ్రయ నిర్మాణానికి జులైలో వ్యాపార భాగస్వామి ఖరారు

తొలిదశలో రూ.2,300 కోట్లతో నిర్మాణం

600 ఎకరాల్లో విమానయాన ఆధారిత పరిశ్రమలు

ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగం వృద్ధికి కీలక అడుగుగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు త్వరలో వూపందుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు మంజూరు కావడం, భూసేకరణ దాదాపుగా పూర్తి కావడంతో ఇక సంయుక్త వ్యాపార భాగస్వామి ఎంపిక చేసి, ఆ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీప విజయనగరం జిల్లా పరిధిలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (బీఐఏసీఎల్‌)ను ఏర్పాటు చేసింది. ‘నమూనా తయారీ- నిర్మాణం- పెట్టుబడి- నిర్వహణ- బదిలీ’ (డీబీఎఫ్‌ఓటీ) విధానంలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సంయుక్త వ్యాపార భాగస్వామి నియామకానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. టెండరు దాఖలుకు జూన్‌ 15 వరకు గడువు ఉంది. జులైలో టెండరు ఖరారు చేసి సంయుక్త వ్యాపార భాగస్వామిని ఎంపిక చేయనున్నారు.

2,600 ఎకరాలు.. రూ.5,500 కోట్ల పెట్టుబడి!

* 2,600 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,300 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తారు.

* ఇందులో ప్రత్యేకంగా 600 ఎకరాల్లో పౌరవిమానయాన ఆధారిత పరిశ్రమల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. పరిశోధన-అభివృద్ధి కేంద్రం, ప్రయోగశాలలు, మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ ఎగ్జిబిషన్‌, సమావేశ కేంద్రం, విమానయాన విద్యా సంస్థ, శిక్షణ కేంద్రం, ప్రయాణికుల కోసం వినోద కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

* ఏ380 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించేలా 3.8 కిలోమీటర్ల పొడవైన అతిపెద్ద రన్‌వే నిర్మిస్తారు.

* తొలిదశలో ఏటా 60.60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా అధునాతన టెర్మినల్‌ నిర్మిస్తారు.

* రెండో దశలో మరో రూ.1798 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా టెర్మినల్‌ సామర్థ్యాన్ని పెంచుతారు.

* మొత్తంమీద ఈ ప్రాజెక్టుపై రూ.5,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Imo antha profitable kakapovachu as it is far from east krishna gnt Prakasam, jus with West Vizag n srikakulam vijaya nagaram valla occupancy raadu, gannavaram NE baga develop chesina inka better occupancy vuntadi..

 

It will definitely for sure be on the profit. This is going to help the development of Vizag and its surrounding districts.

Link to comment
Share on other sites

Imo antha profitable kakapovachu as it is far from east krishna gnt Prakasam, jus with West Vizag n srikakulam vijaya nagaram valla occupancy raadu, gannavaram NE baga develop chesina inka better occupancy vuntadi..

Vizag airport traffic telsu ga, plan iz to restrict vizag airport to navy n others to BIACL.

Link to comment
Share on other sites

రైతుల త్యాగం అభినందనీయం

మరో 150 ఎకరాలు సేకరించాల్సి ఉంది

విమానాశ్రయానికి జూన్‌లో టెంటర్లు ఖరారు

జూలైలో పనులకు శ్రీకారంపూసపాటిరేగ

viz-gen1a.jpg

భోగాపురం(పూసపాటిరేగ), న్యూస్‌టుడే: భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి రైతులు చేసిన భూముల త్యాగం అభినందనీయమని ఆర్డీఓ ఆర్‌.శ్రీనివాసమూర్తి అన్నారు. విమానాశ్రయం కోసం రైతుల నుంచి సేకరించిన భూసమస్యల రైతు ప్రతినిధులతో భోగాపురం తహసీల్దారు కార్యాలయంలో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ విషయంలో రైతులు ఎంతో సహకరించారని వారి కృషి మరువలేనిదన్నారు. ప్రభుత్వ భూములను పేదరైతులు గత కొన్నేళ్లుగా సాగు చేసుకున్నారని, వారందరికీ పరిహారం అందించాలని గతంలోనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని పలువురు రైతు ప్రతినిధులు ఆయనను కోరారు. 420 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్‌ ఉంటేనే పరిహారం అందుతుందని చెప్పిన విషయాన్ని ఆర్డీఓ వద్ద రైతులు గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వ భూములను స్టాంపుడ్యూటీ ద్వారా రిజిస్ట్రేషన్‌ కూడా చేశామని, వాటికి పరిహారం చెల్లించాలని ఆర్డీఓను రైతులు కోరారు. ప్రభుత్వభూములకు రిజిష్ట్రేషన్‌ ఎలా అవుతుందని ఈ విషయంలో తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు.

మరో 150 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. జూలై నుంచి విమానాశ్రయం పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. జూన్‌లో పనుల నిర్వణకు టెండర్లు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని, తర్వాత పనులు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కర్రోతు బంగార్రాజు, తహసీల్దారు లక్ష్మారెడ్డి, వైకాపా మండల కన్వీనర్‌ లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

ఆకాశమే హద్దుగా.. విశాఖ విమానయానం

ఐదేళ్లలో రెట్టింపైన ప్రయాణికులు

ప్రధాన విమానాశ్రయాల జాబితాలో చోటు

35 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో టెర్మినల్‌ నిర్మాణం

జ్ఞఈనాడు - విశాఖపట్నం

13business-news2a.jpg

ఘోర విపత్తు హుద్‌హుద్‌ తుపాను ధాటికి విశాఖ విమానాశ్రయం ఛిన్నాభిన్నమైంది. టెర్మినల్‌, విమాన సౌకర్యాలు, కీలకమైన సాంకేతిక వ్యవస్థ.. ఇలా అన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పట్లో ఈ విమానాశ్రయం కోలుకోలేదన్న మాటలు వినిపిస్తున్న సమయంలోనే.. పడిలేచిన కెరటంలా అభివృద్ధి బాట పట్టింది. సుమారు రూ.100 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సరికొత్త రూపును తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో దేశంలోని పెద్ద విమానాశ్రయాల సరసన చేరింది.

గణనీయంగా పెరిగిన ప్రయాణికులు

రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణాకు వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయి విమానాశ్రయం లేదన్న కొరతను విశాఖ తీరుస్తోంది. గత రెండేళ్లగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఐదేళ్లలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. ప్రస్తుతం రోజుకు 68 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

మేజర్‌ స్థాయికి..: దేశంలోని ప్రధానమైన 30 విమానాశ్రయాల జాబితాలోకి విశాఖ పేరు చేరింది. ఏటా 20 లక్షల నుంచి 50 లక్షల ప్రయాణికులకు సేవలందించే వాటిని పెద్ద విమానాశ్రయంగా పరిగణిస్తారు. తాజాగా జీఎం స్థాయి అధికారిని డైరెక్టర్‌గా నియమించారు. ఇకపై ఈ ఎయిర్‌పోర్టులో విమానాల టారిఫ్‌, ప్రయాణికుల వినియోగపు ఛార్జీలులాంటివన్నీ నిర్ణయించే అధికారం ది ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎరా) చేతికి వచ్చింది. దేశంలోని కీలక ఎయిర్‌పోర్టులన్నింటినీ ఈ సంస్థే నియంత్రిస్తోంది.

సరిహద్దులు దాటుతున్న సేవలు..

విశాఖ నుంచి దుబాయ్‌, సింగపూర్‌, కౌలాలంపూర్‌కి విమాన సేవలు నడుస్తున్నాయి. జులై 8 నుంచి కొలంబోకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. విదేశీ సర్వీసులు పెంచుకునేలా ఆయా విమానసంస్థల విమానాలకు విశాఖలోనే రాత్రిబస ఏర్పాటు చేసేలా చర్యలు వూపందుకున్నాయి. ఇందుకోసం ట్రూజెట్‌, ఇండిగో, ఎయిర్‌కోస్టా తమ ప్రతిపాదనలను సమర్పించాయి. దీనికి ధీటుగా కార్గో సేవల్ని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఈ వెసులుబాటును ఇప్పుడు అంతర్జాతీయంగా తీసుకెళ్లేందుకు ఏపీ స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌టీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. నెలరోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ కార్గో కోసం 557.64 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు.

రోజూ 100 విమానాలు తిరిగేలా..: విమానాశ్రయంలోపల విమానాల్ని ఉంచేందుకు 8 పార్కింగ్‌బేలు మాత్రమే ఉన్నాయి. వీటిని 14కు పెంచుతూ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రోజుకు 100 విమానాల రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. ఇప్పుడున్న టెర్మినల్‌ భవన సామర్థ్యం ఏటా 12 లక్షలమంది ప్రయాణించేందుకే సరిపోతుంది. ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు దాటడంతో టెర్మినల్‌ సామర్థ్యాన్ని 35 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

అదనపు స్థలం కేటాయిస్తేనే..

ప్రస్తుతం విమానాశ్రయం స్థలం మొత్తం తూర్పు నౌకాదళానిదే. దీంతో అభివృద్ధికి దీని అనుమతి తప్పనిసరి. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 200 మందికి పైగా ప్రయాణికుల్ని తీసుకెళ్లే సామర్థ్యమున్న విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ రన్‌వే పొడవు లేదు. ప్రస్తుతమున్న 10 వేల అడుగుల రన్‌వే..13,500 అడుగులకు విస్తరించాల్సి ఉంటుంది. ఇందుకోసం 350 ఎకరాలు అదనంగా కావాలి. పార్కింగ్‌బేల సామర్థ్యాన్ని 25కు పెంచుకోవాల్సి ఉంది. టెర్మినల్‌ భవనానికి ఎదురుగా ఉన్న నౌకాదళ భూములున్నాయి. వారి అనుమతి లభిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.

13business-news2b.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

భోగాపురం విమానాశ్రయానికి తొలగిన అడ్డంకులు

అతుకుబరి భూముల స్వాధీనానికి ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణలో అతుకుబరి భూముల(అసైన్డ్‌ భూముల)కు సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. ఇక్కడ 213 ఎకరాల అతుకుబరి భూములు, మరో 140 ఎకరాల ప్రైవేటు భూముల సేకరణకు కొన్ని సమస్యలున్నాయి. ఆ ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అతుకుబరి భూములను దాన్ని అనుభవిస్తున్న వారు ఇతరులకు విక్రయిస్తే.. కొన్న వారి నుంచీ ప్రభుత్వం సేకరించి అతుకుబరి భూ యజమానులకు కేటాయించాలి. అనంతరం వారి నుంచి భూములను సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘అతుకుబరి భూముల బదిలీ నిషేధ చట్టం’ ప్రకారం ఈ భూములను అతుకుబరి యజమానులకు మళ్లీ అప్పగించాల్సిన అవసరం లేకుండా నేరుగా సేకరించేలా అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. దాంతో భోగాపురం మండలంలోని గూడెపువసల, రవడ, కవులవాడ, కంచెరువు గ్రామాల్లోని 213 ఎకరాల అతుకుబరి భూములను నేరుగా స్వాధీనం చేసుకోవడానికి అనుమతినిచ్చింది.

Link to comment
Share on other sites

మౌలిక వసతులపై సమీక్ష

విద్యుత్తు, ఆర్‌డబ్ల్యూఎస్‌, ర.భ.శాఖల అధికారులతో సమావేశం

viz-gen7a.jpg

భోగాపురం, న్యూస్‌టుడే: భోగాపురంలో నిర్మించదలచిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలికవసతులు ఏవిధంగా కల్పించాలో, అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశాలపై వివిధ శాఖాధికారులతో విమానాశ్రయ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జనరల్‌ ప్రబంధకుడు వంశీమురళి సమీక్షను నిర్వహించారు. శుక్రవారం భోగాపురం తహసీల్దారు కార్యాలయంలో విద్యుత్తు, ఆర్‌డబ్ల్యూఎస్‌, ర.భ.శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడారు.

జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్న అప్రోచ్‌రోడ్డు నుంచి విమానాశ్రయానికి అవసరమైన ప్రదేశంలో ఉన్న మంచినీటి వనరులకు సంబంధించి పైపులైన్లు, విద్యుత్తు తీగల అమరిక, ప్రస్తుత రహదార్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుతులైనుకు సంబంధించి విషయమై దృఢమైన స్తంభాలతో పాటు వైరింగ్‌ ప్రక్రియ ఎలా ఉండాలో తెలియజేయారు. కిలోమీటరుకు ఎన్ని స్తంభాలు పడనున్నాయి, వాటికి ఎంత ఖర్చవుతుందనే అంశాలపై విద్యుతుశాఖ ఏఈ పీఏఎస్‌.నాయుడును అడిగి తెలుసుకున్నారు. ఆర్‌డబ్యూఎస్‌కు సంబంధించిన పథకాలు లింకేజీ పైపులైన్లు ఎన్ని ఉంటాయి, వీటి ద్వారా ఏఏ గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు, వీటిని తొలగించి పైపులైన్ల మార్పు ఎలా చేయవచ్చనే అంశాలపై ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శివానందకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎన్ని సంవత్సరాల కిందట రహదారులు వేశారు, ప్రస్తుతం వాటి పరిస్థితి, విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండే రహదారులు తదితర అంశాలపై ఆ శాఖ అధికారులతో మాట్లాడారు. మరో నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, ఏదిఏమైనా మరో రెండు మూడు నెలల్లో విమానాశ్రయానికి సంబంధించి పనులు ప్రారంభించే అవకాశం ఉందని విమానాశ్రయం ప్రాజెక్టు ప్రబంధకుడు సీహెచ్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే ఉప్పాడపేట జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి అనుసంధానం అయ్యే రహదారి నిర్మాణాలను పరిశీలించామని, వలయాకారంలో వచ్చే ఈ వంతెన రహదారి నిర్మాణం అత్యంత ఆధునిక ప్రమాణాలతో రూపొందుతుందన్నారు. వీటితో పాటు విమానాశ్రయానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో వచ్చే ప్రతీ మౌలిక అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత పనులను ప్రారంభిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్లారు డి.లక్ష్మారెడ్డి, సర్వేయర్‌ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...