Jump to content

Recommended Posts

 • Replies 472
 • Created
 • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Election time ki avadu ga

EAC grants environmental clearance for Bhogapuram International Airport in Andhra Pradesh     సముద్రం మీదగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి భీమినిపట్నం  గోస్తనీ నది ఒడ్డున INS VIRAAT చూసి రుషికొండ లో Acquariu

 • 1 month later...
భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
 
636104947225788291.jpg
న్యూఢిల్లీ : విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి సోమవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర విమానయాన శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో విమానాశ్రయాలకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి బిడ్డింగ్ దాఖలు చేయడానికి మార్గం సుగమం అయింది.
Link to post
Share on other sites

ee govt plans workout ayithe india lo kuda US laga domestic flights baaga perugutai.. already AP registered high growth of passenger traffic.. i dont know the number.. but top in the country... ee airports anni oka kolikki vasthey traffic peruguddi.. taxes perugutai.. ade chetto kashta tirupati airport kuda develop chesthey chudali..

Link to post
Share on other sites

ee govt plans workout ayithe india lo kuda US laga domestic flights baaga perugutai.. already AP registered high growth of passenger traffic.. i dont know the number.. but top in the country... ee airports anni oka kolikki vasthey traffic peruguddi.. taxes perugutai.. ade chetto kashta tirupati airport kuda develop chesthey chudali..

tirupati work ayyindiga

Link to post
Share on other sites

ee govt plans workout ayithe india lo kuda US laga domestic flights baaga perugutai.. already AP registered high growth of passenger traffic.. i dont know the number.. but top in the country... ee airports anni oka kolikki vasthey traffic peruguddi.. taxes perugutai.. ade chetto kashta tirupati airport kuda develop chesthey chudali..

tpt.jpg

Link to post
Share on other sites

airvtravels association president Jaffa okadu 15 days ki okasari media mundukochi not viable ee airport, scrap the idea anevadu.mamolu edupu kadule jaffa

 

 

Ee night nidra podemo kikiki

bemmi.lol1.gif

 

Raaz bro, Vadu ni drustilo kuda paddada.Vadni nenu kuda 2014 nunchi chustunna. Vadu CBN emi chesina tappu ani edusta untadu.

Vadu Navy fleet time lo kuda chala illogical ga edchadu.

 

Atlane Farmers leader oka donga Jaffa unnadu. Vadu kuda pattiseema meda tega chinchukunnadu.

Farmers ni court ki case help chestha ani tirigadu. dobbamannaru farmers.

Link to post
Share on other sites

bemmi.lol1.gif

 

Raaz bro, Vadu ni drustilo kuda paddada.Vadni nenu kuda 2014 nunchi chustunna. Vadu CBN emi chesina tappu ani edusta untadu.

Vadu Navy fleet time lo kuda chala illogical ga edchadu.

 

Atlane Farmers leader oka donga Jaffa unnadu. Vadu kuda pattiseema meda tega chinchukunnadu.

Farmers ni court ki case help chestha ani tirigadu. dobbamannaru farmers.

Adi statement English dailies every month padevi, chusi titukunevani.adiki pagaltam kayam ani telsu.good it happened in quick time bro.happy.BTW I m not raaz.dp same :)

Link to post
Share on other sites

bemmi.lol1.gif

 

Raaz bro, Vadu ni drustilo kuda paddada.Vadni nenu kuda 2014 nunchi chustunna. Vadu CBN emi chesina tappu ani edusta untadu.

Vadu Navy fleet time lo kuda chala illogical ga edchadu.

 

Atlane Farmers leader oka donga Jaffa unnadu. Vadu kuda pattiseema meda tega chinchukunnadu.

Farmers ni court ki case help chestha ani tirigadu. dobbamannaru farmers.

Who is that bro ?

Link to post
Share on other sites
 • 2 weeks later...

నెలాఖరునాటికి విమానాశ్రయ భూసేకరణ పూర్తి

నిర్వాసితులకు అనుకూల స్థలాలు: కలెక్టర్‌

viz-gen6a.jpg

భోగాపురం, న్యూస్‌టుడే: భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను నెలాఖరు నాటికి పూర్తిచేస్తామని కలెక్టరు వివేక్‌యాదవ్‌ స్పష్టంచేశారు. శుక్రవారం మండలకేంద్రంలో నూతనం ఏర్పాటు చేసిన విమానాశ్రయ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. భూసేకరణపై అధికారులతో, నిర్వాసిత రైతులతో మాట్లాడారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్న రైతుల నుంచి పూర్తివివరాలు తీసుకుని వారి ఖాతాల్లో నేరుగా పరిహారం పడేలా చూడాలని సూచించారు. గూడెపువలస ప్రాంతంలో భూసేకరణ పనులు చూస్తున్న ఉపతహసీల్దారు రామారావును ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికీ ఆ గ్రామ రైతులకు సంబంధించిన భూముల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయడం సబబు కాదన్నారు. ఏదైనా సమస్యలను సత్వరం పరిష్కరించాలని, అవసరమైతే తెలియజేస్తే ఏంచేయాలన్నది చెప్తామంటూ కొంత అసహనం వ్యక్తంచేశారు. కవులవాడ, కంచేరు పంచాయతీల పరిధిలో రైతులు ఎన్ని ఎకరాల భూములు ఇచ్చేందుకు అంగీకరించారు, ఇంకా ఎన్ని ఎకరాలు సేకరించాల్సి ఉందన్న వివరాలను ఉపకలెక్టర్లు కె.బి.టి.సుందరి, అనితలను అడిగి తెలుసుకున్నారు. ఒక పని తలపెడితే పూర్తయ్యేవరకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా గూడెపువలస మాజీ సర్పంచి దారపులక్ష్మారెడ్డి కలెక్టరును కలసి సమస్యలను విన్నవించారు. ఇప్పటివరకు నిర్ణయించిన భూములకంటే అధికంగా తీసుకుంటారని రైతులు భయపడుతున్నారని చెప్పారు. విమానాశ్రయ భూసేకరణకు అవసరమైన భూములను వదిలి మిగిలిన ప్రాంతాల్లో రిజిష్ట్రేషన్లు కొనసాగిస్తే రైతులు తమ అవసరాలకు క్రయవిక్రయాలు సాగించేందుకు వీలు ఉంటుందని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం భైరెడ్డిపాలేనికి చెందినఎర్రఅప్పలనారాయణ, లక్ష్మణరెడ్డి తదితర రైతులతో ఆయన సమావేశమయ్యారు. కోర్టు తీర్పు ప్రకారం ముందడుగు వేస్తామని వారు చెప్పారు. భూసేకరణలో ప్రస్తుతం ఇస్తున్న ధర కంటే మరింత పెంచితే బాగుంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ లఠ్కర్‌, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, విమానాశ్రయ ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు, తహసీల్దారు లక్ష్మారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Link to post
Share on other sites
 • 1 month later...

అంతర్జాతీయ స్థాయిలో భోగాపురం

10 అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండాలి

విశాఖ, విజయవాడ నుంచి విదేశాలకు విమానాలు

అధికారులకు సీఎం ఆదేశం

మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమీక్ష

ఈనాడు - అమరావతి

016ap-main5a.jpg

 భోగాపురంలో నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో అనుభవం ఉన్న స్వదేశీ-విదేశీ సంస్థల భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులవారీగా స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించారు. భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెల మొదటి వారానికి పర్యావరణ 016ap-main5b.jpgఅనుమతులు పొందాలని, 2017 జనవరికి ప్రజాభిప్రాయసేకరణ పూర్తి చేయాలని స్పష్టంచేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి 2,646 ఎకరాలు అవసరం కాగా, ఇంత వరకు 2,172 ఎకరాల సేకరణ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్‌, దగదర్తి విమానాశ్రయాల ప్రతిపాదనల పురోగతినీ ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

సంక్రాంతికి విజయవాడ టెర్మినల్‌ సిద్ధం కావాలి

విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ నిర్మాణాన్ని సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ నుంచి నేరుగా దుబాయికి, విశాఖ నుంచి బ్యాంకాక్‌, లండన్‌, హాంకాంగ్‌లకు విమాన సర్వీసులు నడిపేలా చూడాలని సూచించారు. విజయవాడ-ముంబయి మధ్య తక్షణం విమాన సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణకు 698 ఎకరాలు అవసరం కాగా, ఇంత వరకు 610 ఎకరాల్ని భారత విమనాశ్రయాల ప్రాథికార సంస్థకు అప్పగించినట్టు అధికారులు పేర్కొన్నారు.

వచ్చే నెల నుంచి ఇంటింటికీ గ్యాస్‌ పైప్‌లైన్‌

ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించాలని గెయిల్‌ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కొవ్వూరు, రాజమహేంద్రవరంలలో వచ్చే నెలలోను, జూన్‌ నాటికి భీమవరం, ఏలూరుల్లోను ఇంటింటికీ పైప్‌లైన్ల ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్టీసీ బస్సులకు సీఎన్‌జీ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి జిల్లాల్లో సీఎన్‌జీ స్టేషన్లు నెలకొల్పాలన్నారు.

సౌర ప్రాజెక్టుల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు

అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో నిర్మిస్తున్న సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా 2018-19 నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 1250 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కృష్ణపట్నం, విజయవాడల్లో థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఏపీ జెన్‌కో చేపట్టందని చెప్పారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే 4 వేల మెగావాట్ల అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ పనులు బొగ్గు సమకూరిన వెంటనే ప్రారంభమవుతాయన్నారు. చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ 10 జిల్లాల్లో కొనసాగుతోందని, వచ్చే సంవత్సరం అక్టోబరు నాటికి ఏడు ప్లాంట్లు, 2018 మార్చి నాటికి మరో మూడు ప్లాంట్లు పూర్తవుతాయని వివరించారు.

ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు త్వరలో సిద్ధం

నెలకు రూ.149కే టీవీ ప్రసారాలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సౌకర్యం కల్పించే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులు ముగింపు దశకు వచ్చాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. టీవీ చానళ్ల ప్రసారాలపై పే చానళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, పలు టెలికాం సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. ఇప్పటికే లక్ష సీపీఈ బాక్సులు కొనుగోలు చేశామని, మరో 9 లక్షల బాక్సులు త్వరలోనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారం కేబుల్‌ లైన్లు వేయకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫైబర్‌ గ్రిడ్‌ లైన్‌ నుంచే కనెక్షన్లు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం- భీమిలి బీచ్‌ రోడ్డు

విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డుకి కొనసాగింపుగా భీమిలి-భోగాపురం మధ్య బీచ్‌ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. 20 కి.మీ. మేర, నాలుగు వరుసలుగా నిర్మించే ఈ రహదారి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని, ప్రపంచంలోనే అత్యంత సుందరమైన రహదారిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ రహదారి ఎక్కడా మలుపులు, వంపులు లేకుండా తిన్నగా ఉండాలని స్పష్టంచేశారు. విశాఖలో ఏర్పాటు చేసే కన్వెన్షన్‌ సెంటర్‌ సముద్రానికి అభిముఖంగా, ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు.

వేగంగా భావనపాడు పోర్టు భూసేకరణ

భావనపాడు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే భూసేకరణ నిబంధనల్ని సరళీకృతం చేసైనా ఈ ప్రక్రియను త్వరగా కొలిక్కి తేవాలన్నారు. రాష్ట్రంలోని పోర్టుల వాణిజ్యంలో వృద్ధి జాతీయ సగటుకన్నా తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. గడచిన ఏడు నెలల్లో కేవలం 4.1 శాతం వృద్ధి నమోదు చేయడంపై ఆయన పెదవి విరిచారు. పోర్టుల వాణిజ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌, రాష్ట్ర ఫైబర్‌గ్రిడ్‌ లిమిటెడ్‌ ఎండీ సాంబశివరావు, ఇతర అధికారులు, గెయిల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Link to post
Share on other sites
భోగాపురం ఎయిర్‌పోర్టుకు రాజభోగం
 
636149482625648423.jpg
 •  అత్యుత్తమంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్దేశం 
 •  రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమీక్ష 
 •  ఇకపై ఆనలైనలో పనుల పురోగతి వివరాలు 

అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీనఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే టాప్‌-10 ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో అనుభవమున్న విదేశీ-స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాలని ఆయన సూచించారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. ఈ ఎయిర్‌పోర్టుకు డిసెంబరు మొదటివారానికల్లా పర్యావరణ అనుమతులు పొందాలని, 2017 జనవరి నాటికి పబ్లిక్‌ హియరింగ్‌ను పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్‌, దగదర్తి 2airport.jpgవిమానాశ్రయాల ఏర్పాటు ఎంతవరకూ వచ్చిందో సీఎం అడిగి తెలుసుకున్నారు. కాగా.. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన 2,646 ఎకరాలకుగాను 2172 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకూ రాష్ట్రంలోని విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగిందని.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 44ు పురోగతి నమోదైందని వివరించారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. తిరుపతి, విజయవాడ విమనాశ్రయాలకు అంతర్జాతీయ విమానసర్వీసులు, విశాఖపట్నం విమానాశ్రయానికి దుబాయ్‌, లండన, హాంగ్‌కాంగ్‌ నుంచి సర్వీసులు నడిచేలా ప్రయత్నించాలని సీఎం సూచించారు. అలాగే విజయవాడ-ముంబై మధ్య తక్షణం విమాన సర్వీసుల అవసరం ఉందన్నారు.


 
భోగాపురం-భీమిలీ బీచ్ రోడ్‌...

విశాఖ-భీమిలీ బీచ రోడ్డును నిర్మిస్తున్నట్టే దానికి కొనసాగింపుగా భీమిలీ-భోగాపురం మధ్య బీచరోడ్డుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. మొత్తం 20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నారు. విశాఖలో ఏర్పాటుచేసే కన్వెన్షన సెంటర్‌ సముద్రానికి అభిముఖంగా, ఆకర్షణీయంగా ఉండాలన్నారు. అనంతపురంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయదలిచిన ఎనర్జీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కాకినాడలో 90 ఎకరాల్లో నెలకొల్పే లాజిస్టిక్‌ యూనివర్సిటీ పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని పోర్టుల వాణిజ్యంలో వృద్ధి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. వాణిజ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని మౌలిక వసతుల ప్రాజెక్టు పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు ఆనలైనలో నమోదుచేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన, ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ ఎండీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.


×
×
 • Create New...