Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
అమరావతి.. పవర్‌
ప్రపంచం దృష్టంతా ఇటువైపే
ఎఫ్‌1హెచ్‌2వో రేసుకు సన్నద్ధం
మంచినీటిలో తొలిసారి ఇక్కడే
నేడు విజయవాడలో పరేడ్‌
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg
అమరావతి పేరు.. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఫార్ములా1 హెచ్‌2వో బోట్‌ రేసింగ్‌ చరిత్రలో విజయవాడ నగరం కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఈనెల 16 నుంచి 18 వరకూ మూడు రోజులు విదేశీ అతిథులు నగరంలో సందడి చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది ఇక్కడ జరిగే పవర్‌ బోట్‌ రేసులను తిలకించనున్నారు. లక్ష మంది దేశవిదేశీ సందర్శకులు స్వయంగా విజయవాడకు విచ్చేసి.. వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  మూడు రోజులు జరిగే ఈ వేడుక కోసం కృష్ణా నది తీరం  సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విజయవాడ నగరంలోని పున్నమి, దుర్గాఘాట్‌, భవానీ ఐల్యాండ్‌, పవిత్ర సంఘమం, బరంపార్కుల్లో ఈ పోటీలను తిలకించేందుకు వచ్చేవారి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ సంస్థ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ మోటోనాటిక్‌(యూఐఎం) ఆధ్వర్యంలో జరిగే ఎఫ్‌1హెచ్‌2వో పవర్‌ బోట్‌ రేసింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలన్నింటితో అనుసంధానమై ఉంటుంది. కేవలం ఒక్క దేశంలో పోటీలు పెట్టి.. ముగించే విధానం ఈ రేసింగ్‌లో ఉండదు. కనీసం నాలుగైదు దేశాలతో అనుసంధానంగా పోటీలు జరుగుతుంటాయి. ఎఫ్‌1హెచ్‌2 2018 రేస్‌.. పోర్చుగల్‌, లండన్‌, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా(విజయవాడ), అబు దాబీ, షార్జాల్లో వరుసగా ఏడు రౌండ్లలో జరుగుతోంది. ఇప్పటికే.. ఈ ఏడాది మే18 నుంచి 20 వరకూ పోర్చుగల్‌లో ఒకటో రౌండ్‌ పోటీలు జరిగాయి. రెండో రౌండ్‌ లండన్‌లో జూన్‌ 15 నుంచి 17, మూడో రౌండ్‌ ఫ్రాన్స్‌లో జూన్‌ 29 నుంచి జులై 01 వరకూ జరిగాయి. నాలుగో రౌండ్‌ ప్రస్తుతం విజయవాడలో నవంబర్‌ 16, 17, 18ల్లో జరగనున్నాయి. దీని తర్వాత ఐదో రౌండ్‌ పోటీలు అబుదాబీలో డిసెంబర్‌ 06 నుంచి 08 వరకూ జరుగుతాయి. అనంతరం.. తుది పోరు షార్జాలో డిసెంబర్‌ 13 నుంచి 15 వరకూ జరగనున్నాయి.

తొలిసారి మంచినీటిలో..
పవర్‌బోట్‌ రేసింగ్‌ అంటే సముద్రంలోనే ఇన్నాళ్లూ చూసిన.. క్రీడాభిమానులు.. స్వచ్ఛమైన మంచినీటి నదిలో జరగడం తొలిసారి చూడనున్నారు. స్వచ్ఛమైన మంచినీటి కృష్ణమ్మ పరవళ్లు మీదుగా గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లే పవర్‌ బోట్ల ఫీట్లను తిలకించనున్నారు. పలువురు సినీతారలు, క్రీడాకారులు, ప్రముఖులు, దేశవిదేశీ అతిథులు తరలిరానున్నారు. అతిథులకు నగరంలోని ప్రధానమైన నక్షత్ర హోటళ్లలో ఏర్పాట్లు చేశారు. పోటీల్లో మొదటి రెండు రోజులు.. రేసర్ల విన్యాసాలను చూడొచ్చు. కీలకమైన పోటీలు చివరి రోజు ఉంటాయి.

బోట్లతో ప్రదర్శన నేడు..
ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధిచెందిన పవర్‌బోట్‌ రేసింగ్‌కు సంబంధించి విజయవాడలో గురువారం మధ్యాహ్నం 3గంటలకు పరేడ్‌ నిర్వహించనున్నారు. నగరంలోని పున్నమిఘాట్‌కు ఇప్పటికే చేరుకున్న బోట్లతో పరేడ్‌ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పున్నమిఘాట్‌లో బోట్లను వాహనాల్లో ఎక్కించి తీసుకొచ్చి.. నగరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా పరేడ్‌ నిర్వహించనున్నారు. పోలీసులు గ్రీన్‌ఛానెల్‌ను ఏర్పాటు చేసి.. బోట్ల ప్రదర్శకు అవకాశం కల్పించనున్నారు. సాయంత్రం 4గంటలకు కలెక్టర్‌ లక్ష్మీకాంతం, నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు కలిసి.. జెండా ఊపి పరేడ్‌ను ఆరంభించనున్నారు. సాయంత్రం 5గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

 
Link to comment
Share on other sites

The Giant 40 Ft Dharmachakra to greet the People Near Vaaradhi Junction, Vijayawada 1f44c.png1f44c.png Almost 70 % of the works Completed, The Project is taken up by Amaravati Development Corporation Limited (ADCL) which is Spending nearly Rs 6 Cr for Beautification 1f44d.png Pic-1 PC : Sk Nayeem

DsH-KSJV4AEE_xr.jpg
DsH-htJUwAABKp0.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...