Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

ఫైవ్‌స్టార్‌ బెజవాడ
10-12-2018 02:55:56
 
636800098202586906.jpg
  • నోవాటెల్‌ హోటల్‌ ప్రారంభం
  • విజయవాడ అవకాశాల గని
  • అమరావతి ది బెస్ట్‌ సిటీ
  • బెంచ్‌ మార్క్‌ కాదు ఆతిథ్య రంగానికి ప్రాధాన్యం
  • ఆరంభోత్సవ సభలో సీఎం
విజయవాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘అభివృద్ధిలో అమరావతి బెంచ్‌మార్క్‌గా ఉండాలని అనుకోవడం లేదు. ప్రపంచంలోనే ది బెస్ట్‌ సిటీల్లో ఒకటిగా ఉండాలి. అదే నా సంకల్పం. అదే సమయంలో భవిష్యత్‌ అవకాశాలకు విజయవాడ కేంద్రంగా ఉంటుంది. దీన్ని కాస్మోపాలిటన్‌ సిటీగా తయారు చేయడానికి ప్రజలూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ రహదారికి చెంతనే కొత్తగా నిర్మించిన వరుణ్‌ గ్రూప్‌ నోవాటెల్‌ అంతర్జాతీయ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను సీఎం ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
 
 
రాష్ట్రంలో పర్యాటకరంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ‘పర్యాటకుల కోసం విజయవాడ, తిరుపతి, వైజాగ్‌, అమరావతి నగరాల్లో లక్షల గదులతో అతిథ్యరంగాన్ని అభివృద్ధి చేస్తాం. విజయవాడ, అమరావతితోపాటు ఇతరనగరాలకు మరిన్ని స్టార్‌ హోటళ్లు రావాల్సిన అవసరం ఉంది. సమైక్య రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌, నోవాటెల్‌ హోటల్‌, ఎగ్జిబిషన్‌ హాలును ఒకే ప్రాంగణంలో నిర్మించాం. అక్కడి నుంచి మెట్రో స్టేషన్‌కు నడచి వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాం. హైదరాబాద్‌కు 64% ఆదాయం సేవా రంగం ద్వారా వస్తుండగా, మిగిలిన 36% ఇతర రంగాల ద్వారా వస్తోంది. మన రాష్ట్రంలో సేవా రంగాల ద్వారా 46% ఆదాయమే వస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగాలి’ అని చంద్రబాబు సూచించారు. మున్ముందు విజయవాడ పూర్తి కాలుష్యరహిత నగరంగా ఉంటుందని ఆయన అన్నారు. ‘పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ఇక్కడ వినియోగంలోకి తీసుకొస్తాం. వరుణ్‌ గ్రూప్‌ అమరావతికి సమీపాన ఉన్న ఉద్దండరాయునిపాలెంలో చేపట్టబోయే కన్వెన్షన్‌ సెంటర్‌, స్టార్‌ హోటల్‌ను రెండేళ్ల పూర్తి చేయాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. కేరళ కంటే తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటకం చాలా బాగుంటుందని చెప్పారు.
 
 
అనంతరం అకార్‌ హోటల్స్‌ గ్రూప్‌ అధినేత జాన్‌ మిసెస్‌ కాసే, వరుణ్‌ గ్రూప్‌ అధినేత ప్రభుకిశోర్‌లు సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఫ్రాన్స్‌ రాయబారి అలెగ్జాండర్‌ జిగ్లర్‌ , మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజతిరాజు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు, సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, డీజీపీ ఠాకూర్‌, విజిలెన్స్‌ డీజీ గౌతమ్‌సవాంగ్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పాల్గొన్నారు.
 
9babu36.jpg
Link to comment
Share on other sites

  • Replies 1k
  • Created
  • Last Reply
సేవారంగానికి అపార అవకాశాలు 
నోవాటెల్‌ 5 నక్షత్రాల హోటల్‌  ప్రారంభోత్సవంలో చంద్రబాబు 
9ap-main9a.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: నవ్యాంధ్రలో సేవారంగం వృద్ధికి అపార అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ముప్పై ఏళ్ల కిందటే విజయవాడ వాసులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించారని చెప్పారు. ప్రస్తుతం వారు ఇక్కడ కూడా ముందుచూపుతో ఆలోచించి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ భారతీనగర్‌లో నూతనంగా నిర్మించిన ఐదు నక్షత్రాల హోటల్‌ నోవాటెల్‌ను ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. మొదటిసారిగా ఐదు నక్షత్రాల హోటల్‌ను ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని, దీనికి కారణమైన వరుణ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రభుకిషోర్‌కు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో సేవారంగం ద్వారా వచ్చే ఆదాయమే 64 శాతం ఉండగా.. మిగతా 36 శాతం పరిశ్రమలు తదితరాల నుంచి వస్తుందని, అదే విజయవాడలో కేవలం 46 శాతం మాత్రమే ఆదాయం వస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. విజయవాడ నగరం అందమైన కాలువలతో ‘సిటీ ఆఫ్‌ కెనాల్స్‌’గా ఉందని, దీనికి తోడు చుట్టుపక్కల అందమైన కొండలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. రూ.150కోట్ల వ్యయంతో కేవలం మూడేళ్లల్లో ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్మించిన వరుణ్‌ గ్రూప్‌ బృందాన్ని అభినందిస్తూ.. అమరావతిలో నిర్మించే ప్రాజెక్టును 24 నెలల్లో,  కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏడాదిలో పూర్తి చేయాలని కోరారు. చాలా మంది పెద్దమొత్తంలో డబ్బు సంపాదించి వ్యాపారాలు చేస్తుంటే.. కొందరు మాత్రమే  సమాజసేవ కూడా చేస్తుంటారని, అలాంటి వారిలో ప్రభుకిషోర్‌ ఒకరని కొనియాడారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అంబాసిడర్‌ అలెగ్జాండ్రి జిగ్లర్‌, ఆ దేశ పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా,  కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజు, డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌, విజిలెన్స్‌ డీజీ గౌతమ్‌సవాంగ్‌, వరుణ్‌ గ్రూపు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

9ap-main9b.jpg
 
Link to comment
Share on other sites

కోటి ఆశలకు కొత్త రెక్కలు
28-12-2018 11:05:04
 
636815919038755009.jpg
  • అభివృద్ధి దారుల్లో 2018 పరుగులు
  • తుది దశలో ఫ్లైఓవర్లు
  • పారిశ్రామికవాడల నిర్మాణాలు
  • బెజవాడ టు సింగపూర్‌.. విదేశానికి తొలి విమానం
  • అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లతో సందడి
  • సైబర్‌వాడగా కేసరపల్లి.. హెచ్‌సీఎల్‌కు శ్రీకారం
  • ‘స్వచ్ఛ’ అవార్డులతో అదరగొట్టిన వీఎంసీ
  • నాలుగు అర్బన్‌ మండలాలతో ప్రజలకు చేరువగా పాలన
  • అభివృద్ధి దారుల్లో 2018 పరుగులు
  • తుది దశలో ఫ్లైఓవర్లు
  • పారిశ్రామికవాడల నిర్మాణాలు
  • బెజవాడ టు సింగపూర్‌.. విదేశానికి తొలి విమానం
  • అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లతో సందడి
  • సైబర్‌వాడగా కేసరపల్లి.. హెచ్‌సీఎల్‌కు శ్రీకారం
  • ‘స్వచ్ఛ’ అవార్డులతో అదరగొట్టిన వీఎంసీ
  • నాలుగు అర్బన్‌ మండలాలతో ప్రజలకు చేరువగా పాలన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆశల ఉషోదయం వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఎన్నేళ్ల నుంచి కన్న కలలో ఒక్కొక్కటిగా వాస్తవంలోకి వస్తున్నాయి. చుట్టూ వేగంగా సాగుతున్న ఫ్లైఓవర్లు, పారిశ్రామికవాడలు, జెట్‌ సిటీ నిర్మాణాలతో ఈ ఏడాది విజయవాడ నగరం, పరిసరాలు ‘అభివృద్ధికి’ వినూత్న రూపాన్నిస్తున్నాయి. విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో అందాలద్దుకుంటోంది. సింగపూర్‌కు నేరుగా విమానం ఎగిరింది. అడుగడుగునా సొబగులద్దుకుని, భవానీ ద్వీపం ఆహ్లాదధామంగా మారగా, పర్యాటకం మెరిసి, పర్యాటకులను మురిపిస్తోంది. అంతర్జాతీయ ఈవెంట్లతో కృష్ణాతీరం సందడిగా మారింది. సైబర్‌వాడగా మారిన ‘మేధ’ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో నిండి, ఐటీ ఉద్యోగులకు స్వాగతం పలుకుతోంది.
 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పార్క్‌కు శంకుస్థాపన చేసుకుని, సువిశాలమైన ప్రాంతంలో నిర్మాణ పనులను ప్రారంభించింది. జాతీయస్థాయి అవార్డులతో విజయవాడ నగరం ‘స్వచ్ఛం’గా మెరిసింది. మొత్తంగా 2018 నిన్నటి కలలకు కొత్త రూపమిచ్చి, కోటి ఆకాంక్షలతో 2019లోకి నడిపిస్తోంది. రాజధాని ప్రాంతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరం 2018లో అభివృద్ధి దిశగా ఎన్నో మెరుపులు మెరిపించింది. పాలనా పరంగానూ జిల్లా వివిధ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. మరోవైపు విజయవాడ నగర శివార్లు కూడా శరవేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళుతున్నాయి.
 
 
బెజవాడకు అవార్డుల పంట
Untitled-40.jpgబెజవాడ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తొలిసారిగా జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించగా.. ఏపీలో నిర్వహించిన స్వచ్ఛతా గ్రీన్‌ అవార్డుల్లో ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018కి దేశవ్యాప్తంగా 500కుపైగా నగరాలతో పోటీపడ్డ వీఎంసీ నాలుగో ర్యాంకును సాధించింది.ఏపీ ప్రభుత్వం 13 జిల్లాల్లో నిర్వహించిన స్వచ్ఛతా గ్రీన్‌ అవార్డుల్లోనూ ప్రతిభ కనబరచి ప్రథమ స్థానంలో నిలిచింది. బయోమైనింగ్‌, బయో మెథనేషన్‌తో పాటు ప్లాస్టిక్‌ నుంచి ఇటుకల తయారీ వంటి ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఘనతను సొంతం చేసుకున్న నగర పాలక సంస్థ.. రూ.31 కోట్లతో 5 ఎంజీడీ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయబోతోంది. పాలనా సౌలభ్యంలో భాగంగా కార్పొరేషన్‌ ఏర్పడ్డ 35 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మూడు కమిషనరేట్లుగా నగరాన్ని విభజించి, ముగ్గురు నూతన జోనల్‌ కమిషనర్ల నియామకం చేపట్టింది.
 
ఫ్లైఓవర్లతో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు
Untitled-35.jpgరాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. దీంతో వాహనదారులకు కష్టాలు మొదలయ్యాయి. అయితే హైదరాబాద్‌ నుంచి నగరానికి ప్రవేశమార్గమైన దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి చందాన సాగుతున్న ఈ నిర్మాణం నూతన సంవత్సరంలో పూర్తికావచ్చని భావిస్తున్నారు. 80 శాతం పనులు పూర్తికాగా ఇంకో 20 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నగరం నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పూర్తయితే చాలా వరకు ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం 90 శాతం పూర్తయింది. నూతన సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి బెంజ్‌సర్కిల్‌, ఏప్రిల్‌ నాటికి దుర్గా ఫ్లై ఓవర్‌లు పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
 
విజయవాడ టు సింగపూర్‌..
నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ యవనికపై తన ముద్ర వేసింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభమైంది. కొత్త ఏడాదిలో దుబాయ్‌కు అంతర్జాతీయ విమానం ఎగరనుంది. సింగపూర్‌కు సర్వీసుతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, ఖమ్మం జిల్లాల ప్రజలకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే పరిస్థితి తప్పింది. రూ.611 కోట్ల వ్యయంతో విజయవాడ ఎయిర్‌పోర్టులో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ఈ ఏడాది భూమి పూజ జరుపుకోవటం విశేషం. అతి త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. భారీ బోయింగ్‌ విమానాలు ల్యాండ్‌ కావటానికి వీలుగా ఎయిర్‌పోర్టులో ప్రస్తుత రన్‌వేను 2286 మీటర్ల నుంచి 3360 మీటర్లకు విస్తరిస్తున్నారు.
 
 
వడివడిగా... ‘జెట్‌సిటీ’
రాజధాని ప్రాంతానికి కొత్త కళ తీసుకొచ్చే జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీ నిర్మాణం వడివడిగా జరుగుతోంది. జెట్‌సిటీలో భాగంగా రూ. 2171 కోట్ల వ్యయంతో 28,152 ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం 50 ఎకరాల్లో 10,624 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జెట్‌సిటీని విస్తరించటానికి వీలుగా ‘టిడ్కో’ అధికారులు మరో 250 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదించారు. మొత్తం 106 ఎకరాలను జక్కంపూడి, వేమవరం, షాబాద గ్రామాల రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఈ పనులూ చురుగ్గా జరుగుతున్నాయి.
 
అదరగొట్టిన ఈవెంట్స్‌
Untitled-32.jpgఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లతో విజయవాడ సందడి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా1 హెచ్‌2ఓ పవర్‌బోట్‌ రేస్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు కృష్ణానదిలో జరిగాయి. ఈ ఈవెంట్‌ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరలివచ్చారు. ఈ పోటీలకు గుర్తుగా దుర్గా ఫ్లై ఓవర్‌ కింద ఎఫ్‌1 హెచ్‌2ఓ పార్కును ఏర్పాటు చేయటం విశేషం. ఎఫ్‌1హెచ్‌2ఓ మెగా ఈవెంట్‌ ముగిసిన వెంటనే కృష్ణానది గగనతంలో ఎయిర్‌షో - 2018ను నిర్వహించారు. గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌ బృందం నాలుగు జెట్‌ విమానాలతో మూడు రోజుల పాటు చేసిన విన్యాసాలు వేలాది మంది నగర ప్రజలను అలరించాయి. వీటి కంటే ముందు నగరంలో సోషల్‌ మీడి యా సమ్మిట్‌ను నిర్వహించారు. ఆ సమ్మిట్‌కు బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ ఏడాది కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ‘మసులా’ బీచ్‌ ఫెస్టివల్‌ను అత్యంత వైభంగా నిర్వహించారు. నాగాయలంకలో నాటు పడవల పోటీలు ఈ ఏడాది గ్రాండ్‌గా జరిగాయి.
 
పర్యాటక ధామం భవానీ ఐల్యాండ్‌
Untitled-31.jpgభవానీ ఐల్యాండ్‌ పర్యాటక స్వర్గధామంగా రూపుదిద్దుకుంది. ఏడాది కాలంలోనే అనూహ్య అభివృద్ధిని సాధించింది. ద్వీపం పర్యాటకులకు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. భవానీ ద్వీపాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. దీనిని దుర్భేద్యంగా తీర్చిదిద్దటానికి ఐరన్‌ ప్లేటింగ్‌ చేశారు. ఆ తర్వాత ద్వీపంలో పాత్‌వేలు, మౌలిక సదుపాయాలు, సెల్ఫీపాయింట్స్‌ , ఫౌంటెయిన్లు వంటివి ఏర్పాటు చేశారు. రూ.16 కోట్ల వ్యయంతో లేజర్‌ షో అండ్‌ మ్యూజికల్‌ డాన్సింగ్‌ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. రోబోటిక్‌ పార్క్‌ పనులు చేపడుతున్నారు. బర్డ్స్‌ అరీనా పూర్తయింది. మేజ్‌ గార్డెన్‌ పూర్తయింది. మిర్రర్‌ మేజ్‌, గేమింగ్‌ జోన్‌, మినీ జంగిల్‌, బ్యాటరీ కార్లు వంటివి ఏర్పాటు చేశారు.
 
సైబర్‌వాడగా.. కేసరపల్లి
Untitled-30.jpgనవ్యాంధ్రప్రదేశ్‌లో కేసరపల్లి సైబర్‌వాడగా రూపాంతరం చెందుతోంది. ‘మేథ’ టవర్‌ అంతా ఐటీ కంపెనీలతో నిండిపోవటంతో రెండో ఐటీ టవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి ముగింపు దశలో ఉన్నాయి. సమీపంలోనే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పార్క్‌కు భూమిపూజ ఈ ఏడాది చివర్లోనే జరిగింది. హెచ్‌సీఎల్‌ సంస్థ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద క్యాంపస్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. మొత్తం ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి.
 
లైట్‌ మెట్రో దిశగా..
Untitled-29.jpgవిజయవాడ నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రిలిమనరీ డీపీఆర్‌ ఈ ఏడాదిలో కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టా అందచేసింది. మరికొద్ది రోజులలో ఫైనల్‌ డీపీఆర్‌ కూడా రాబోతోంది. రూ.20 వేల కోట్ల వ్యయంతో 67 కిలోమీటర్ల నిడివిలో ఎయిర్‌పోర్టు - అమరావతి, పెనమలూరు - బందరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌, పీఎన్‌బీఎస్‌ - జక్కంపూడిలకు మొత్తం మూడు కారిడార్ల ప్రతిపాదనలు వచ్చాయి. ఈ కారిడార్లకు సంబంధించి మొత్తం రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా నిర్ణయించారు. లైట్‌ మెట్రో రైల్‌ నిర్మాణానికి రుణ సహాయం అందించటానికి జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఆసక్తి చూపిస్తోంది.
 
ప్రజలకు చేరువగా పాలన
పన్నెండు లక్షల జనాభా కలిగిన విజయవాడ నగరం గతంలో ఒకే ఒక్క అర్బన్‌ మండలంగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విజయవాడ నగరాన్ని ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం నాలుగు అర్బన్‌ మండలాలుగా విభజించింది. ప్రస్తుత అర్బన్‌ మండల కార్యాలయాన్ని విజయవాడ సెంట్రల్‌ మండలం పరిధిలోకి తీసుకు వచ్చారు. అదనంగా విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు మరింత చేరువగా రెవెన్యూ సేవలను అందించే వెసులుబాటు లభించింది.
 
సుసంపన్న కృష్ణా
జిల్లా ఈ ఏడాది అన్నింటా అగ్రపథంలో నిలిచింది. స్థూల వస్తూత్పత్తి విలువ (జీవీఎ)లో రాష్ట్రంలోనే తిరుగులేని శక్తిగా నిలిచింది. అగ్రికల్చర్‌, ఇండస్ర్టీస్‌, సర్వీసెస్‌ రంగాల్లో 11.39 శాతం వృద్ధిరేటుతో 63,824 కోట్ల జీవీఏను సాధించింది. అగ్రికల్చర్‌లో రూ. 22,630 కోట్లు, ఇండస్ర్టీస్‌లో రూ. 11,500 కోట్లు, సేవల రంగంలో రూ.30,144 కోట్లు చొప్పున ప్రగతి సాధించటం విశేషం. రాష్ట్ర వృద్ధిలో జిల్లా ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో 12.11 శాతం, రెండవ క్వార్టర్‌లో 14.23 శాతం జీవీఏను జోడించటం విశేషం. తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే ముందు వరసలో నిలిచింది. రూ. 1,89,000తో అన్ని జిల్లాల కంటే తలసిరిలో మొదటి స్థానంలో నిలిచింది.
 
భూధార్‌లో టాప్‌ లేపింది
భూధార్‌లో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే అగ్రపథంలో నిలిచింది. జిల్లాలో విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో జగ్గయ్యపేట మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టిన భూధార్‌ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయటానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో భూ వివాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భూ సేవ తో ముందుకు తీసుకు వెళుతోంది. జిల్లావ్యాప్తంగా తాత్కాలిక భూధార్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా 94.64 శాతం భూ విభాగాల సంఖ్య నమోదుతో జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Link to comment
Share on other sites

బౌద్ధ చక్రం
29-12-2018 02:47:08
 
636816484282646990.jpg
బెజవాడలో మరో అందమైన ఆకృతి రూపుదాలుస్తోంది. కనకదుర్గ వారధి చౌరస్తా వద బౌద్ధ చక్రం ఏర్పాటు చేస్తున్న దృశ్యమిది.
Link to comment
Share on other sites

Vijayawada to get a new icon soon

DECCAN CHRONICLE. | K KALYAN KRISHNA KUMAR
Published Jan 5, 2019, 1:42 am IST
Updated Jan 5, 2019, 2:39 am IST
Massive Buddha Chakra may be unveiled by this month-end.
The under-construction Buddha Dharma Chakra.
 The under-construction Buddha Dharma Chakra.

Vijayawada: The massive Buddha Dharma Chakra that is being constructed at Varadhi Junction in Vijayawada is nearing completion. Being built at a cost of around Rs 8 crore, the structure is designed to be an icon of the upcoming capital city Amravati. 

The chakra is massive — 53 feet in height, the base measures 23 feet x 30 feet x 4 feet and weighs 10 tonnes. Being made in pink stone, the chakra, once completed and unveiled, will be a sight to behold. 

 

 

The Dharma chakra is being sculpted as part of the city beautification works. Sculptors from the Silpakala Mandiram in Nandyal, Kurnool districts, are working on the Chakra. 

The dharma Chakra or Damma Chakra is one of the oldest symbols of Amaravati Sthupam. The Dharma Chakra is among the symbols of Buddhism across the globe. Since similar symbols are found in Jainism and Hinduism, historians say that it is likely that the Dharma Chakra as a symbol of Buddhism evolved from Hinduism. 

The special pink coloured stone is being imported from Bansipahad in Rajasthan by the Amaravati Development Corporation. 

The ADC plans to beautify the area around the Chakra in an attempt to symbolise the olden days. The ADC is developing four islands of around 1,000 sq. mt.; work on three has been completed and on the fourth island, where the Buddha Chakra is coming up, it is in the final stage. 

The state government has been consciously attempting to give Amaravati a distinct Buddhist look, and most of the major structures are based on Buddhist constructions. 

Speaking to this newspaper, ADC CMD D. Lakshmi Pardhasaradi, said “The work will be completed in about a month. We are reviewing the work with the contractor and plan to complete the entire project as early as possible.”

Link to comment
Share on other sites

విజయవాడకి మరో ఐకానిక్ స్ట్రక్చర్... జోరుగా సాగుతున్న పనులు...

   

buddha-09012019-1.jpg
share.png

విజయవాడకి మరో ఐకానిక్ స్ట్రక్చర్ రాబోతుంది. చెన్నై-కోల్కతా మహానగరాలను కలిపే జాతీయ రహదారి పై పై జంట నగరాలను కలిపే కూడలి వారధి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అత్యంత సుందరంగా రూపుదిద్దుకోనుంది. వేలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ కూడలిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతోపాటు ఆకర్షణీయమైన పచ్చదనంతో నేత్రపర్వం చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్టనుంది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు ఆ దిశగా కసరత్తు సాగిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు రెండు డిజైన్లను సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి అమరావతి చారిత్రక వారసత్వానికి దర్పణం పట్టనుండగా, మరొకటి సుందర ఉద్యాన వనాన్ని తలపించేలా ఉంది.

 

buddha 09012019 1

రాజధానికి దారి తీసే అన్ని ముఖద్వారాలనూ అత్యంత ఆకర్షణీయంగా రూపొందించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. స్పందించిన ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారథి విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి జంక్షనను ముందుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఏడీసీ రూపొందించిన రెండు డిజైన్లూ వారధి జంక్షన వద్ద ఉన్న ట్రాఫిక్‌ ఐల్యాండ్లను హరిత శోభితంగా మార్చేవే. ఒకటి గతంలో బౌద్ధానికి సూచికగా భారీ ధర్మచక్రం, ఇతర ఆకర్షణలతో కూడి ఉంది. ఈ నమూనాలో వలయాకారంలో ఉన్న స్థూపంపై పురాతన శిల్పకళను ప్రతిబింబించే మందిరాల మధ్య ధర్మచక్రాన్ని ఏర్పాటు చేస్తారు.

buddha 09012019 1

ఈ స్థూపం చుట్టూ ఆకట్టుకునే పలు రకాల క్రోటన్లు, పూలమొక్కలతోపాటు అక్కడక్కడ పెద్ద చెట్లను సైతం పెంచుతారు. సందర్శకులు నడిచేందుకు వీలుగా వాకింగ్‌ టైల్స్‌తో కూడిన బాటలను ఏర్పాటు చేస్తారు. చక్కటి పచ్చిక బయళ్లూ, వాటి మధ్యన చెట్ల వరుసలూ మాత్రమే ఉంటాయి. ఈ లాన్లను కూడా ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా వివిధ వర్ణాల్లో ఉండే క్రోటన్లు, ఇతర మొక్కలతో రంగురంగుల్లో ఉండేలా చూస్తారు. ట్రాఫిక్‌ ఐల్యాండ్ల స్వరూపానికి అనుగుణంగా పచ్చిక బయళ్లను చక్కటి ఆకృతుల్లో అభివృద్ధి పరుస్తారు. ఇప్పటికే దీనికి సంబందించిన పనులు పరుగులు పెడుతున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...