Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply

 

 
 

ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నం లో విజయవాడ కనకదుర్గమ్మ గుడి వద్ద నిర్మిస్తున్న వారిది నిదర్శనంగా నిలవబోతోంది. అందమైన కలంకారీ రంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే రంగురంగుల పూల మొక్కలతో, మిరుమిట్లు గొలిపే కాంతులతో అతి సుందరంగా ముస్తాబవుతుంది.

Dr8-_ZzU4AA78Qk.jpg
Dr8-_fuV4AAACQ0.jpg
Dr8_ILoU0AAuOAj.jpg
Dr8_MpeVYAAeDI5.jpg
Link to comment
Share on other sites

పోటీలు జోరుగా విన్యాసాలు హుషారుగా 
24ap-state5a.jpg

భవానీపురం (విజయవాడ), న్యూస్‌టుడే: విజయవాడ కృష్ణా నదిలో నిర్వహించిన నాటు పడవల పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పున్నమి ఘాట్‌ వేదికగా నిర్వహిస్తున్న ఎయిర్‌షోను పురస్కరించుకుని శనివారం పర్యాటక శాఖ పడవ పోటీలను ఏర్పాటు చేసింది. మత్స్యకారులకు ప్రోత్సాహకంగా వీటిని నిర్వహించారు. మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. ఒక్కో పడవపై ముగ్గురు చొప్పున ఉన్న మత్స్యకారులు భవానీ ఘాట్‌ వద్ద నుంచి పున్నమి ఘాట్‌ వరకు నాటు పడవను నడిపి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకున్నారు. పోటీలో పదో నంబరు పడవ సభ్యులు ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎన్‌.లక్ష్మయ్య, ఎన్‌.మహేష్‌ మొదటి స్థానంలో, రెండో నంబరు పడవ సభ్యులు బి.ధర్మరాజు, ఎన్‌.కోటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు ద్వితీయ, నాలుగో నంబరు పడవ సభ్యులు జి.శ్రీనివాసరావు, కన్నా నాగరాజు, ఎం.నాగమునేంద్ర తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు జ్ఞాపికలతో పాటు రూ.15 వేలు(ప్రథమ), రూ.10 వేలు (ద్వితీయ), రూ.5 వేలు (తృతీయ) చొప్పున ఇస్తారు. బహుమతులను ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. కృష్ణా నది జలాలపై గాలిలో లోహ విహంగాలు చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎయిర్‌షోని చూసేందుకు శనివారం భారీగా ప్రజలు తరలివచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కూడా విన్యాసాలు ఉంటాయి. నేటి ఉదయం 10.40 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

24ap-state5b.jpg

24ap-story1c.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...