Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
బెంజ్‌ ఫ్లై ఓవర్‌... పురోగతి!
21-01-2019 10:07:16
 
636836620364554803.jpg
  • వయాడక్ట్‌ సిద్ధం.. గడ్డర్లు పూర్తి
  • మిగిలింది పది శ్లాబులే.. నెలాఖరుకు రెడీ: ఎన్‌హెచ్‌
  • అప్రోచ్‌లు పూర్తయితే ఫ్లై ఓవర్‌కు రూపు
  • అంగీకార పత్రాలతో అప్రోచ్‌లకు మార్గం సుగమం
ఆంధ్రజ్యోతి, విజయవాడ: బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ వయాడక్ట్‌ నిర్మాణంలో నూరుశాతం గడ్డర్ల ప్రక్రియ పూర్తయింది. ప్రధానమైన బెంజిసర్కిల్‌, నిర్మల కాన్వెంట్‌, మహానాడు, రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్ల వద్ద బ్యాలెన్స్‌ గడ్డర్ల ఏర్పాటు పూర్తి కావటంతో ప్లైఓవర్‌ నిర్మాణంలో కీలకమైన ప్రక్రియ పూర్తయింది. గడ్డర్లతో పాటు సమాంతరంగా శ్లాబ్‌ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కేవలం పది శ్లాబ్‌లు మాత్రమే పూర్తి కావాల్సివుంది. త్వరలో పది శ్లాబుల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు నెలాఖరుకు బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ వయాడక్ట్‌ అందుబాటులోకి వస్తుందని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో ఫ్లై ఓవర్‌ రూపం సంతరించుకోవాలంటే రెండు వైపులా అప్రోచ్‌ పనులు పూర్తి కావాల్సివుంది. అప్రోచ్‌ పనులను మార్చి నాటికి పూర్తి చేయనున్నట్టు జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెబుతున్నారు.
 
ప్రతిష్ఠాత్మకమైన బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ కాంక్రీటు నిర్మాణం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఫ్లై ఓవర్‌ వయాడక్ట్‌లో అత్యంత కీలకమైన గడ్డర్ల ఏర్పాటు పూర్తి కావటంతో పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరుకు వయాడక్ట్‌ అందుబాటులోకి రానుంది. వయాడక్ట్‌ నిర్మాణంలో భాగంగా 240గడ్డర్లను ఏర్పాటు చేయా ల్సివుంది. ఇందులో 220 గడ్డర్లు సాధారణమైనవి కాగా, మరో 20 కాస్త పొడవైనవి ఉన్నా యి. బెంజిసర్కిల్‌, నిర్మలా, మహానాడు రోడ్డు, రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్ల వద్ద 20పొడవాటి గడ్డర్లను ఏర్పాటుచేశారు. జనవరి 8నాటికి మొత్తం 240 గడ్డర్లలో 222 గడ్డర్ల నిర్మాణం పూర్తయ్యాయి.
 
పన్నెండు రోజుల వ్యవధిలో 20 పొడవాటి గడ్డర్లను ఏర్పాటు చేయటం విశే షం! సమాంతరంగా శ్లాబు పనులు కూడా చేపట్టడంతో త్వరగా పనులు పూర్తి కావటానికి మార్గం సుగమమైంది. అనుకున్న సమయానికి 48 శ్లాబులకుగాను 34 శ్లాబుల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం 38 శ్లాబులు పూర్తికాగా మిగిలింది పది శ్లాబులే. వయాడక్ట్‌లో గడ్డర్లతో కూడిన స్పాన్స్‌కు క్రాస్‌ గడ్డర్స్‌ ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. మిగిలిన పది శ్లాబుల నిర్మాణం కూడా చేపట్టడం ద్వారా ఈ నెలాఖరుకు వయాడక్ట్‌ పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ఉంది.
 
వయాడక్ట్‌కు అప్రోచ్‌ పనులు చేపడితే ఫ్లై ఓవర్‌ రెడీ
నెలాఖరుకు అందుబాటులోకి రానున్న వయాడక్ట్‌కు రెండు వైపులా అప్రోచ్‌ రహదారులను నియమిస్తే ఫ్లై ఓవర్‌ పూర్తిగా సిద్ధం అవుతుంది. అప్రోచ్‌లను నిర్మించటానికి రెండువైపులా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా. సర్వీసు రోడ్డును ఆక్రమించాల్సి వస్తోంది. అప్రోచ్‌ వాల్‌ నిర్మించటమే కాకుండా దీనిపక్కనే సర్వీసు రోడ్డుకు ఇబ్బందికరంగా ఉంటోంది. సర్వీసు రోడ్డును విస్తరించాల్సివుంది. దీనికి భూ సేకరణ జరగాల్సి ఉండటంతో పనుల్లో కొంతజాప్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎస్‌వీఎస్‌ జంక్షన్‌వైపు అప్రోచ్‌ పనులను చేపడుతున్నారు. వాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
 
భవన యజమానులతో ఎన్‌హెచ్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి సర్వీసు రోడ్డు, అప్రోచ్‌మార్గాలకు అవసరమైన భూమిని సేకరించటానికి ఎంపిక చేసిన స్థల, భవన యజమానులతో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) సంప్రదింపుల మార్గంలో వెళ్లటంతో సానుకూల ఫలితాలు వచ్చాయి. వీరినుంచి భూములను తీసుకోవటానికి భూ సేకరణ విధానంలో వెళ్ళాలని ఎన్‌హెచ్‌ భావించింది. రాష్ట్రప్రభుత్వం ఇటీవలే నూతన భూ సేకరణ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టానికి సంబంధించి ఇంకా గజిట్‌ నోటిఫికేషన్‌రాలేదు. గజిట్‌ నోటిఫికేషన్‌ రావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది వచే ్చవరకు వేచిచూసి, ఆ తర్వాత భూ సేకరణకు వెళ్లటం ద్వారా సమయాభావం నెలకొనే పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌హెచ్‌ అధికారులు ఇప్పుడు రూటు మార్చారు.
 
54awebr.jpgభవన, స్థల యజమానులందరినీ సమావేశపరిచి వారినుంచి నేరుగా కొనుగోలు చేయటానికి సంప్రదింపులు ప్రారంభించారు. భవన, స్థలయజమానులంతా అంగీకారం తెలపటంతో ఎన్‌హెచ్‌పని సులువు అయింది. మరో వారంలో రెవెన్యూకు ఈ అంశాన్ని బదలాయించి స్థలాల చదునుతోపాటు భవనాల తొలగింపు ప్రక్రియ చేయించాలన్నది ఎన్‌హెచ్‌ ఆలోచనగా ఉంది. మార్చి నాటికి ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

మెరుస్తున్న విజయవాడ వీధులు
31-01-2019 08:07:38
 
636845188589014657.jpg
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 ర్యాంకు సాధనే అందరి లక్ష్యం
  • పరుగులు పెడుతున్న అధికారులు
  • డంపర్‌బిన్లలో చెత్త ఎప్పటికపుడు ఖాళీ
  • అధికారుల చేతికి లక్షల్లో నిధులు
నగరంలో వీధులు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. చెత్తతో నిండి కనిపించే డంపర్‌బిన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిన్నటి వరకూ దుర్గంధాన్ని వెదజల్లిన పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 ర్యాంకు కోసం నగరంలో పారిశుధ్య కార్మికులు మొదలు, అధికారుల వరకు అందరూ పరుగులు పెడుతున్నారు. ముందూ వెనుకా ఆలోచించకుండా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వైద్యాధికారుల దోసిట్లో నిధులు కుమ్మరిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఫలితం కనిపిస్తున్నా, ఇంకా కొన్ని డివిజన్లలో మార్పు కనిపించకపోవడం శోచనీయం.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కేంద్ర ప్రభుత్వ దృష్టి విజయవాడ వైపు మళ్లించాలన్న తపనతో పరుగులు పెడుతోన్న కార్పొరేషన్‌ నగరంలో అడుగడుగునా కాపు కాస్తోంది. చెత్త రహితంగా మారిన నగర వీధులు కళకళ లాడుతున్నాయి. ఖాళీగా దర్శనమిస్తున్న డంపరుబిన్లు దుర్గంధాన్ని దూరం చేస్తున్నాయి. నిన్నటి వరకు చెత్త కుప్పల్లో వీధి కుక్కలు, పందులు తిరుగుతూ దుర్వాసన పరిస్థితి నుంచి స్వచ్ఛతకు మారురూపంగా రహదారులు కనిపిస్తు న్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 పుణ్యమా అని పారిశుధ్య కార్మికులు మొదలు అధికారుల వరకు ఒళ్లొంచి పనిచేస్తున్నారు. శుభ్రతపై అప్రమత్తంగా ఉంటున్నారు. డబ్బును లెక్క చేయక శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు రూ.11.7లక్షలు, అసిస్టెంట్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఆఫీసర్లకు ఒకొక్కరికీ రూ.2లక్షల చొప్పున అందించిన నగర కమిషనర్‌ ప్రణాళిక ఫలించింది. అయితే కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ల కారణంగా కొన్ని డివిజన్లలో నేటికీ పలు సమ స్యలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఆయా డివిజన్లలో పర్యటించే ప్రజాప్రతినిధులపై స్థానికులు తిరగబడేంతగా అక్కడి పారిశుధ్య లోపాలు వీఎంసీని ప్రశ్నిస్తున్నాయి. కఠిన తరంగా మారిన ఆయా డివిజన్లలోనూ మార్పు తేవడానికి నగర కమిషనర్‌ జె.నివాస్‌ విశ్వ ప్రయత్నం చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకు కోసం కృషి చేస్తున్నారు.
 
fmmhstdh.jpgస్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 హడావుడి మొదల వడంతోనే నగరంలో మార్పులు కూడా మొద లయ్యాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న వీఎంసీ ఈసారి ప్రథమ స్థానంపై దృష్టి పెట్టింది. గతంలో ఓడీఎఫ్‌(ఓపెన్‌ డెఫికేషన్‌ ప్రోగ్రామ్‌)ను దక్కించుకున్న కార్పొరేషన్‌ ఓడీఎఫ్‌++ కోసం తపిస్తోంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్లో లభించే అధు నాతన సౌకర్యాలతో మరుగుదొడ్లు(శానిటరీ న్యాప్‌కిన్స్‌), ప్రత్యేక వాష్‌రూమ్స్‌(స్ర్తీ, పురు షులకు విడిగా), బిన్స్‌ ఫ్రీ సిటీగా 34 డివి జన్లలో ఇప్పటికే నగరం వడి వడిగా అడు గులు వేస్తున్న వీఎంసీ డాక్యుమెంటేషన్‌ దశ ను దాటేయగా.. ఓడీఎఫ్‌++, స్టార్‌ రేటింగ్‌ కోసం దరఖాస్తులను ఇటీవలే అందజేసింది. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్‌కు చెందిన మూడు బృందాలు నగరానికి వచ్చి వెళ్లిన నేపథ్యంలో నగరాన్ని కడిగిన ముత్యంలా తీర్చిదిద్దారు. మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సిన సిబ్బంది గతంలో డివిజన్లో కనిపించని పరిస్థితులపై వీంఎసీకి ఎన్నో, ఫిర్యాదులు వచ్చాయి. కానీ నేడు టైమ్‌ టూ టైమ్‌ ఉద్యోగులు విధి నిర్వ హణలో నిమగ్నమవుతున్నారు. ర్యాంకు కోసం పడుతోన్న తపనను చూసి ఆనందపడు తున్నా.. మరో నెలలో ఈ ర్యాంకు హడావుడి తగ్గితే నగర పరిస్థితి యథాస్థితికి చేరుతుందే మోనన్న భయం నగర ప్రజలను తొలుస్తూనే ఉంది.
 
100% సెగ్రిగేషన్‌
నిత్యం నగరం నుంచి ఉత్పత్తయ్యే 550 మెట్రిక్‌ టన్నుల చెత్తలో ప్రస్తుత సెగ్రిగేషన్‌ విధానం ప్రకారం దాదాపు 200 మెట్రిక్‌ టన్నుల చెత్తను డంపింగ్‌ యార్డుకు కాకుండా రీసైక్లింగ్‌కు ఉపయోగించగలుగుతున్న వీఎంసీ వంద శాతం సెగ్రిగేషన్‌(తడి, పొడి చెత్త వేరు చేయడం)కు ప్రయత్నిస్తోంది. 1280కు పైగా ఉన్న మైక్రో ప్యాకెట్లు(చెత్త సేకరణ పాయింట్లు)లో అంతే స్థాయిలో పుష్‌కార్టు ్ల ఉన్నాయి. పది వేల 500 చెత్త, వ్యర్థాలను వర్మీ కంపోస్టు ద్వారా ఎరువులను తయారుచేయగలుగుతున్నారు. అలా వచ్చిన ఎరువులను మొక్కల పెంపకానికి వీఎంసీ వాడుకోగా.. మిగిలింది రైతులకు విక్రయిస్తారు.
 
అధునాతన టాయిలెట్స్‌
సాధారణంగా నగరంలో ఉన్న పలు మరుగుదొడ్లను స్టార్‌ హోటళ్లలోని టాయిలెట్స్‌గా వీఎంసీ గతంలోనే తీర్చిదిద్దింది. ఇపుడు అంతకుమించిన స్థాయిలో ఐదు నక్షత్రాల హోటళ్ల స్థాయిలో డెటాల్‌ లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌, ఉన్నత క్వాలిటీ మగ్గులు, లిక్విడ్‌ సెంటెడ్‌ ఫినాయిల్‌, ప్రతి టాయిలెట్లో ఐదు జతల చెప్పులు, ప్రతి టాయిలెట్‌కు యూజీడీ కనెక్షన్‌, ఫీడ్‌ బ్యాక్‌ మెషీన్‌(ట్యాబ్‌ ద్వారా), గ్రీన్‌ మ్యాట్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి టాయిలెట్లో రెండు వాష్‌రూమ్స్‌(స్ర్తీ, పురుషులకు విడిగా) ఏర్పాటుచేస్తున్నారు. నగరంలో ఉన్న మరుగుదొడ్లలో పది శాతం టాయిలెట్లను ఈ విధంగా సిద్ధం చేయగలిగితే వీఎంసీ ఓడీఎఫ్‌+ కు ఎంపికవుతుంది. 25 శాతం టాయిలెట్లలో ఈ సౌకర్యాలను కల్పించినపుడే వీఎంసీ ఓడీఎఫ్‌++కు ఎంపికవుతుంది. కార్పొరేషన్‌ అనుకున్న విధంగా తొలిస్థానాన్ని దక్కించు కోవా లంటే ఓడీఎఫ్‌++ను కైవసం చేసుకోవాల్సిందే. అందులో భాగంగానే నగరంలోని అతి ఎక్కువ ప్రాంతాల్లో యూరినల్‌ పాయింట్లను ఏర్పాటుచేయాలి.
 
భయపడుతున్న ప్రజాప్రతినిధులు
మధ్య నియోజకవర్గంలోని కొన్ని డివి జన్లలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌ స్పెక్టర్ల కారణంగా ప్రజాప్రతినిధులు పర్యటించా లంటేనే జంకుతున్నారు. ఇటీవల ఓ నాయకుడు 52వ డివిజన్లో పర్యటనకు వెళ్లగా అక్కడి స్థానికులు తిరగబడినంత పనిచేశారు. దీంతో పరిస్థితిపై విశ్లేషణ చేసిన సదరు నాయకుడు స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యమే పరిస్థితికి కారణ మని గుర్తించారు. దీంతో ప్రత్యేక దృష్టి పెట్టిన సదరు నాయకుడు కమిషనర్‌ స్థాయిలో ఫిర్యాదులు పంపి పరిస్థితిని చక్క దిద్దే ప్రయత్నాలను ప్రారంభించారు. కొద్ది రోజులుగా అక్కడ స్థానిక అధికా రులు పరుగులు పెడుతుండగా.. నగర కమిషనర్‌ మంగళవారం ప్రత్యేక పర్యటన కూడా చేపట్టారు. స్థానిక పారిశుధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి పారి శుధ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
Link to comment
Share on other sites

సీఆర్డీయే పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్లు
31-01-2019 08:15:33
 
అమరావతి,(ఆంధ్రజ్యోతి): తన పరిధిలోని వివిధ ప్రదేశాల్లో చేపట్టదలచిన అభివృద్ధి పనుల కోసం సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. విజయవాడ శివార్లలోని నిడమానూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయరహదారి పక్కన ఉన్న భాగాన్ని (షోల్డర్‌ పోర్షన్‌)కు అవసరమైన చోట్ల మరమ్మతులతోపాటు మెరుగు పరచేందుకు రూ.1.73కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్ల సమర్పణకు వచ్చే నెల 7వ తేదీ వరకు గడువునిచ్చింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలోని చెరువును అభివృద్ధి పరిచేందుకు రూ.95లక్షలతో మరొక టెండర్‌ను ఆహ్వానించింది.
 
గట్ల బలోపేతం, ప్రవేశ ద్వారాల ఏర్పాటు, నడకమార్గాల అభివృద్ధి తదితర పనులను చేపట్టడం ద్వారా ఈ చెరువును సుందరంగా మలిచేందుకు ఇంత వ్యయమవుతుందని అంచనా వేసింది. ఆసక్తి ఉన్నవారు తమ బిడ్లను సమర్పించేందుకు వచ్చే నెల 8వ తేదీ వరకు గడువునిచ్చింది. ఇటీవల భారీస్థాయిలో అభివృద్ధి పరిచిన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వావిలాల ఘాట్‌ పార్క్‌లో వ్యూ డెక్‌ ఏరియాను అభివృద్ధి చేయడంతోపాటు కొన్ని ఇతర పనులను చేపట్టేందుకు రూ.43 లక్షలతో సీఆర్డీయే అంచనాలు రూపొందించింది. దీని టెండర్ల దాఖలుకు వచ్చే నెల 7వ తేదీ వరకు గడువునిచ్చింది.
Link to comment
Share on other sites

విజయవాడలో రూ.60 కోట్లతో క్రీడా సముదాయం

 

ఈనాడు, అమరావతి: విజయవాడ విద్యాధరపురంలో 8.90 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి అంతర్జాతీయ క్రీడా సముదాయాన్ని రూ.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.6కోట్లు కేంద్రం ఇప్పటికే ఇవ్వగా, మరో రూ.54కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. విద్యాధరపురంలో ఇన్‌డోర్‌ స్టేడియం నిర్మాణానికి గత ఏడాది జులైలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అక్కడే ఇప్పుడు పూర్తిస్థాయి క్రీడా సముదాయాన్ని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదన, నమూనాను సిద్ధం చేయాలని శాప్‌ ఎండీని ఆదేశిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...