Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
పీఎన్‌బీఎస్‌కు స్వచ్ఛ బస్‌స్టేషన్‌ అవార్డు
01-10-2018 08:02:17
 
636739777360723846.jpg
  • రాష్ట్రస్థాయిలో వరుసగా మూడోసారి
  • పరిశుభ్రతలో మేటి.. సదుపాయాల్లో లేదు సాటి
 
విజయవాడ: రాజధానిలో రవాణా రంగానికి గుండెకాయ వంటిది విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌. నాడు ఎన్‌టీఆర్‌ ముందుచూపుతో విస్తరణకు నోచుకున్న పీఎన్‌బీఎస్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, పరిపాలనా భవనాలను ఏర్పాటు చేసుకునేంతగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కార్పొరేషన్లు, డైరెక్టరేట్ల కార్యాలయాల కోసం మరో ఆరు అంతస్తులు ఇక్కడ నిర్మించారు. రోజూ రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఇదే కేంద్రం.
 
 
ప్రయాణికుల సదుపాయాలకు పెద్దపీట
ప్రయాణికుల మౌలిక సదుపాయాల విషయానికొస్తే.. వినోదానికి పెద్దపీట వేశారు. సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఆధునిక సోఫాచైర్లను అదనంగా ఏర్పాటుచేశారు. వేసవిలో భారీ కూలర్లు సిద్ధం చేశారు. పసిపిల్లలకు తల్లులు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా గదిని ఏర్పాటుచేశారు. స్టాల్స్‌లో అధిక ధరల దందాను నియంత్రించేందుకు ధరల పట్టికలను ఏర్పాటు చేయించారు. అయినా మోసానికి పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయటానికి వారి నెంబర్లతో కూడిన బోర్డులు పెట్టారు. అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఏటీఎం) చాంబర్‌లో ఫిర్యాదుల పుస్తకం ఏర్పాటుచేశారు.
 
నెలలో ఒకే స్టాల్‌పై మూడు ఫిర్యాదులు వస్తే ఆ కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను రద్దు చేస్తారు. ఏ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కడ ఉంటాయి ? బస్సులు బయల్దేరే వేళలు.. వంటి ప్రయాణికులకు ఉపయోగపడే వివరాలతో కూడిన బోర్డులను అడుగడుగునా ఏర్పాటుచేశారు. భద్రత దృష్ట్యా బ్యారికేడ్ల వ్యవస్థను ఏర్పాటుచేశారు. సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించారు. వినోదం కోసం నాలుగు భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటుచేసి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక సమాచార కియోస్క్‌లు అదనపు ఆకర్షణ. ఈ బస్‌స్టేషన్‌ను కేంద్ర స్వచ్ఛ బృందాలు కూడా పరిశీలించాయి. దీంతో పీఎన్‌బీఎస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
 
 
పరిసరాలు పరిశుభ్రం
బస్‌స్టేషన్‌లో పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో రెండుసార్లు రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ బస్‌స్టేషన్‌ అవార్డు అందుకున్నారు. ఆ స్ఫూర్తితో ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు మరింత దృష్టిపెట్టారు. ఇక్కడ 24 గంటలూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారు. యంత్రాలతోనే కాకుండా మాన్యువల్‌ క్లీనింగ్‌కు ప్రాధాన్యమిస్తారు. అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్‌ ఆవరణలతో పాటు అన్ని ప్లాట్‌ఫాంలు, బయట ఓపెన్‌ గ్రౌండ్‌ వంటి చోట్ల ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. తడి, పొడిచెత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 
బస్‌స్టేషన్‌ లోని కమర్షియల్‌ స్టాళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు ఉన్న ప్రాంతాల్లో తడి, పొడిచెత్త డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయించారు. బస్‌స్టేషన్‌లో మరుగుదొడ్ల నిర్వహణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. మరుగుదొడ్లను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దారు. రెస్ట్‌రూమ్‌ల్లో 24 గంటలూ పరిశుభ్రత కనిపించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఓపెన్‌ ఔట్‌ఫాల్‌ డ్రెయిన్‌ను తరచూ పూడిక తీయిస్తున్నారు.
Link to comment
Share on other sites

స్మార్ట్‌సిటీగా బెజవాడ
03-10-2018 07:58:12
 
636741502916946336.jpg
  • ‘స్వచ్ఛతే సేవ’లో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ప్రజల్లోనూ చైతన్యం పెరగాలి
  • చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసిన సీఎం
విజయవాడ: విజయవాడను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని అంబేద్కర్‌ కాలనీలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిఖామణి సెంటర్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం చీపురు పట్టి అంబేద్కర్‌ కాలనీలో పరిసరాలను శుభ్రం చేశారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. వారంతా ముఖ్యమంత్రితో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించారు. ‘ఒకప్పుడు విజయవాడలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా ఉండేవి కాదు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఇక్కడకు వచ్చినప్పుడు కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితుల్లో నేను బస్సులో ఉంటూ పరిపాలనకు శ్రీకారం చుట్టాను.
 
అప్పుడే విజయవాడను ఆకర్షణీయమైన నగరం (స్మార్ట్‌ సిటీ)గా తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ నాలుగేళ్లలో విజయవాడ రూపురేఖలే మారిపోయి దేశంలో పది లక్షలకు పైబడి జనాభా ఉన్న నగరాల్లో క్లీన్‌సిటీగా విజయవాడ మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్‌ సర్వేలో ఐదో స్థానంలో నిలిచి పురస్కారం కూడా దక్కించుకుంది. అత్యంత నివాసయోగ్య నగరంగా విజయవాడకు అవార్డు వచ్చింది. ఇంకా అనేక విషయాల్లో విజయవాడకు అవార్డులు లభించాయి. ఈ ఘనత సాధించడంలో అధికారుల కృషి చాలా ఉంది.’ అని వివరించారు. రోడ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించాలని కోరారు.
 
రూ. 75 కోట్లు మంజూరు చేశా
రూ.75 కోట్లు మంజూరు చేసి నగరం అభివృద్ధికి బాటలు వేశామని సీఎం చెప్పారు. సింగ్‌నగర్‌ ప్రాంతంలో 40 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలుగా చెత్త పేరుకుపోయి, ఆ ప్రాంతమంతా కలుషితమయిందని, రూ. 25 కోట్లతో అక్కడ బయోమైనింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చామని చెప్పారు. నగరంలో మురుగునీరు, దుమ్ము, ధూళి నిర్మూలనకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ, భవనాల కూల్చివేత సందర్భంగా వచ్చే వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేసి ఇసుక, సిమెంటు, కంకరగా వాడే నూతన సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
 
గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మిస్తాం
అంబేద్కర్‌నగర్‌లో స్థానికులు ముందుకు వస్తే గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మిస్తామని, పైన లబ్ధిదారులు నివాసం ఉంటూ, కింద షాపులు నిర్మించుకుని అద్దెకు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్య్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్‌, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌రావు, బొండా ఉమామహేశ్వరరావు, నగర మేయరు కోనేరు శ్రీధర్‌, కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, నగర కమిషనర్‌ జె.నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

బెంజి ఫ్లైఓవర్‌.. పొడిగింపు
15-10-2018 10:18:18
 
636751954989841609.jpg
  • నిర్ణీత సమయం లోపు దుర్గా ఫ్లై ఓవర్‌
  • దుర్గా ఫ్లై ఓవర్‌ నుంచి దుర్గగుడికి వే
  • ఫ్లై ఓవర్‌ పూర్తయితే దుర్గగుడికి మరింత అందమొస్తుందన్న సీఎం
విజయవాడ(ఆంధ్రజ్యోతి): బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను నిడమానూరు వరకు పొడిగించటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ వరకు మాత్రమే నిర్మాణం జరుగుతున్న బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను నిడమానూరు వరకు పొడిగించటానికి చర్యలు తీసుకుంటామని స్పష్టత ఇచ్చారు. ఇంతకు ముందే బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్‌ బీ లక్ష్మీకాంతంతో మాట్లాడిన సంగతి తెలిసిందే. పొడిగింపుకు సంబఽంధించి తగిన ప్రతిపాదనలను కోరిన నేపథ్యంలో ప్రాథమికంగా రూ.500 కోట్లు అవుతుందని అంచనా వేసి తగిన ప్రతిపాదనలు పంపారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా ఈ ప్రతిపాదనకు సంబంధించి జిల్లా యంత్రాంగంతో పర్యవేక్షిస్తున్నారు. మరికొద్ది రోజులలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ అధికారులతో పాటు, కలెక్టర్‌, నేషనల్‌ హైవే అధికారులతో సమీక్షించబోతున్నారు. ఈ క్రమంలోనే దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పొడిగింపుపై పూర్తి స్థాయిలో స్పష్టత నిచ్చారు. పొడిగింపుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్‌హెచ్‌ ఎంత వరకు భరించగలదో తెలుసుకుంటే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం భరించగలదని ఇంతకు ముందు సీఎం ప్రకటించారు. సీఎం ప్రకటన నేపథ్యంలో, ఎన్‌హెచ్‌ వర్గాలు పొడిగింపుకు సంబంధించి తామెలాంటి ఖర్చు భరించలేమని చెప్పాయి.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు అయ్యే వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. ఆదివారం ఇంద్రకీలాద్రిపై ముఖమంత్రి స్పష్టతనిచ్చిన నేపథ్యంలో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఎప్పటి నుంచి దీనికి కార్యాచరణ ఇస్తారన్న దానిపై మరింత వస్తుంది.
 
దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులకు సంబందించి జరుగుతున్న జాప్యంపైనా సీఎం స్పందించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ జాప్యం జరగకుండా ఉండటానికి ప్రతి నెలా సమీక్షలు చేస్తున్నామని, కాంట్రాక్టర్‌కు రూ.10 కోట్ల ఆర్థిక సహాయం కూడా అందించామని చెప్పారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను ఇచ్చిన టార్గెట్‌లోపే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నుంచి ఒక వే దుర్గగుడికి వస్తుందని దీని వల్ల దుర్గగుడికి మరింత అందం వస్తుందని చెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...